ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్‌ మూవీ.. ఈ నెలలోనే స్ట్రీమింగ్‌ | The First Omen Movie OTT Release Date Out | Sakshi
Sakshi News home page

భయపెట్టేందుకు రెడీ అయిన సూపర్‌ హిట్‌ హారర్‌ మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?

Published Sun, May 19 2024 11:02 AM | Last Updated on Sun, May 19 2024 12:01 PM

The First Omen Movie OTT Release Date Out

హారర్‌ సినిమాలకు ఓటీటీలో మినిమమ్‌ గ్యారెంటీ ఉంటుంది. ఇలాంటి చిత్రాలు ఎప్పుడెప్పుడు రిలీజవుతాయా? అని ఓటీటీ ప్రియులు ఎదురుచూస్తుంటారు. వీరికోసమే ఈ గుడ్‌న్యూస్‌. 'ది ఫస్ట్‌ ఒమెన్‌' అనే అమెరికన్‌ సూపర్‌ నేచురల్‌ హారర్‌‌ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.

ఒమెన్‌ ఫ్రాంచైజీలో ఆరో సినిమా
ఒమెన్‌ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు ఐదు సినిమాలు వచ్చాయి. ది ఒమెన్‌(1976), డామెయిన్‌- ఒమెన్‌ 2 (1978), ద ఫైనల్‌ కాన్‌ఫ్లిక్ట్‌(1981), ఒమెన్‌ 4- ద అవేక్‌నింగ్‌(1991), ది ఒమెన్‌(2006) కాగా ఇప్పుడు వచ్చిన ది ఫస్ట్‌ ఒమెన్‌(2024) ఆరవది! ఇది 2006లో వచ్చిన ది ఒమెన్‌ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. 

ఈ నెలలోనే స్ట్రీమింగ్‌
ఆర్కష స్టీవెన్‌సన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాఫీక్‌ బర్హోమ్‌, సోనియా బ్రాగ, నెల్‌ టైగర్‌ ఫ్రీ, బిల్‌ నైయ్‌, రాల్ఫ్‌ ఇనెసన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నెలన్నర లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 30 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్‌ అధికారికంగా ప్రకటించింది.

 చదవండి: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోవాలి.. నటుడి సలహా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement