omen
-
ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ.. ఈ నెలలోనే స్ట్రీమింగ్
హారర్ సినిమాలకు ఓటీటీలో మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఇలాంటి చిత్రాలు ఎప్పుడెప్పుడు రిలీజవుతాయా? అని ఓటీటీ ప్రియులు ఎదురుచూస్తుంటారు. వీరికోసమే ఈ గుడ్‌న్యూస్. 'ది ఫస్ట్ ఒమెన్' అనే అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.ఒమెన్ ఫ్రాంచైజీలో ఆరో సినిమాఒమెన్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు ఐదు సినిమాలు వచ్చాయి. ది ఒమెన్(1976), డామెయిన్- ఒమెన్ 2 (1978), ద ఫైనల్ కాన్ఫ్లిక్ట్(1981), ఒమెన్ 4- ద అవేక్నింగ్(1991), ది ఒమెన్(2006) కాగా ఇప్పుడు వచ్చిన ది ఫస్ట్ ఒమెన్(2024) ఆరవది! ఇది 2006లో వచ్చిన ది ఒమెన్ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ నెలలోనే స్ట్రీమింగ్ఆర్కష స్టీవెన్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాఫీక్ బర్హోమ్, సోనియా బ్రాగ, నెల్ టైగర్ ఫ్రీ, బిల్ నైయ్, రాల్ఫ్ ఇనెసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నెలన్నర లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 30 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది.From service to survival. Brace yourself for a chilling mystery.#TheFirstOmen streaming 30th May on #DisneyPlusHotstar pic.twitter.com/0GTsn66z9O— Disney+ Hotstar (@DisneyPlusHS) May 18, 2024 చదవండి: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోవాలి.. నటుడి సలహా -
ఏజెంట్ చేతిలో మోసపోయిన వలసకార్మికులు.. ఏపీ ప్రభుత్వ సహకారంతో స్వదేశానికి రాక!
ఒమాన్ లో ఏజెంట్ చేతిలో మోసపోయిన 08 మంది వలసకార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS సహకారంతో స్వదేశానికి రప్పించారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లాలనుకునే వారు రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా సక్రమ పద్ధతిలో వెళ్లాలని ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 08 మంది వలసదారులు అక్రమ ఏజెంట్ మాయమాటలు నమ్మి ఒమాన్ కు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వీరిని రాష్ట్రానికి తీసుకురావడానికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున APNRTS ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయంతో ఇమెయిల్ ద్వారా పలుమార్లు సంప్రదించింది. వసతి, ఆహార సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న వారిని భారతదేశం పంపాలని, అక్రమ ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని APNRTS కోరింది. ఎట్టకేలకు ఏపీఎన్ఆర్టీసీ ప్రయత్నాలు ఫలించడంతో ఈ నెల 27న వాళ్లు విజయవాడకు చేరుకున్నారు. అనంతరం ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రవాసాంధ్రుల అభివృద్ధి, భద్రత, సంక్షేమమే ధ్యేయంగా ఏపీఎన్ఆర్టీఎస్ నిరంతరం పనిచేస్తోందన్నారు. స్వదేశానికి చేరుకున్న తర్వాత బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి ఏజెంట్ గా వ్యవహరిస్తూ ఒమాన్ లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఈ 08 మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వీసాలు ఏర్పాటు చేసి ఒమాన్ దేశం తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఏజెంట్ చెప్పిన ఉద్యోగాలు కల్పించకపోగా, సరైన వసతి, భోజనం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయంపై వారు సదరు ఏజెంట్ ని నిలదీయగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఉద్యోగాలు లేవు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని హెచ్చరించి, మమ్మల్ని రోడ్డున పడేశారని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో భారతదేశానికి రావడానికి సహాయం కొరకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ, APNRTS ను సంప్రదించారు. ఈ క్రమంలోనే పశుసంవర్ధక, మత్య్సశాఖాభివృద్ది మంత్రి డా. సీదిరి అప్పలరాజు వలసకార్మికుల క్షేమసమాచారాలు తెలుసుకోవాలని, త్వరితగతిన వారిని స్వదేశానికి రప్పించాలని APNRTS ను కోరారు. తక్షణమే స్పందించిన APNRTS బాధితుల నుంచి మరిన్ని వివరాలను సేకరించి, ఒమాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీకి వారి పరిస్థితిని వివరించారు. సదరు ఏజెంట్ పై చర్య తీసుకోవడంతో పాటు వారిని భారతదేశానికి తిరిగి రావడానికి సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరింది. ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు ఈ విషయమై.. విదేశాలకు వెళ్లే వారు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికోసం APNRTS సక్రమ వలసల పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఎవరూ అక్రమ ఏజెంట్ల చేతిలో మోసపోవద్దని, విదేశాంగ వ్యవహారాల శాఖ (MEA) ద్వారా ఆమోదింపబడిన రిక్రూట్మెంట్ ఏజెంట్ల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్ళాలని సూచించారు. అలాగే విదేశాలకు వెళ్ళే వారు, విదేశాల్లో ఉన్నవారు ఎవరైనా సరే మీకున్న సందేహాలు, సమస్యలు ఉంటే APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లను 0863 2340678, +91 8500027678 (వాట్సాప్) సంప్రదించగలరని తెలిపారు. -
క్రేన్ చివర భారీ సముద్రపు జీవి.. చెడుకి సంకేతమా?
వైరల్: మనిషి నమ్మకం ఒక బలం. మూఢనమ్మకం మనిషిలోని బలహీనత. అయితే.. కొన్ని విషయాలను నమ్మితీరాలని వాదిస్తుంటారు పెద్దలు. అందుకు గతంలోని కొన్ని విషయాలను తెరపైకి తెస్తుంటారు. ఓ భారీ సముద్ర జీవి విషయంలోనూ ఇప్పుడు ఇలాంటి ప్రచారమే నడుస్తోంది. భారీ చేపను కొందరు ముచ్చటగా ఫోన్లలో చిత్రీకరిస్తుంటే.. చాలామంది మాత్రం అటువైపు చూడకుండానే వెళ్లిపోతున్నారు. చిలీలో స్థానికులు ఈ మధ్యే పదహారు అడుగుల పొడవున మాన్స్టర్ చేపను పట్టుకున్నారు. అరికా నగరంలో.. ఈ కోలోసాల్ ఓర్ఫిష్(రోయింగ్ ఫిష్) దర్శనమిచ్చింది. సాధారణంగా అవి సముద్రపు లోతుల్లో ఉంటాయి. కానీ, ఇలా పైకి రావడం మంచిది కాదని నమ్ముతున్నారు అక్కడి జనాలు. ఈ మేరకు క్రేన్‌కు వేలాడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చెడుకి సంకేతమని, సునామీ, భూకంపాలు వస్తాయని భయంతో వణికిపోతున్నారు. డిజాస్టర్ ఫిష్.. ఈ తెడ్డు చేపకు విపత్తుల చేప అని పేరు ఒకటి ముద్ర పడింది. ఎక్కడో సముద్ర గర్భంలో ఉండే ఈ రాకాసి చేప.. నీటిలోని భూగర్భ కదలికల తర్వాతే పైకి వస్తాయట. ఆ తర్వాత భారీ భూకంపం, సునామీ ముంచుకొస్తుందని నమ్ముతున్నారు వాళ్లు. అంతేకాదు పట్టుకున్న వాళ్లకు శాపం తగులుతుందనే నమ్మకం ఉంది. చిలీలోనే కాదు.. జపాన్, సముద్రపు తీరం ఉన్న దేశాల్లోనూ ఇలాంటి కథలు జోరుగానే ప్రచారం అయ్యాయి. అంతెందుకు అలా కనిపించిన తర్వాతే.. ఫుకుషిమాలో భూకంపం సంభవించిందని, 20 వేల మందిని బలి తీసుకుందని నమ్ముతున్నారు. పాపం.. చేప వీటిని సముద్రపు భారీ పాములు, సముద్ర రాక్షసి చేప అనే కథలు ఈ ఓర్ఫిష్ మీద ప్రచారం అవుతుంటాయి. కానీ, సైంటిఫిక్ కోణంలో పాపం అవి ప్రమాదకరమైనవి అసలే కావు. ఏనాడూ అవి మనుషులపైగానీ, పడవలపైగానీ దాడి చేసిన దాఖలాలు లేవు. జబ్బు పడినప్పుడు, చనిపోయినప్పుడు, పిల్లలను కనేటప్పుడు మాత్రమే నీటి అడుగు నుంచి పైకి వస్తాయి. ఒక్కోసారి తుఫానులు, బలమైన అలల ధాటికి కూడా కొట్టుకు వస్తాయి. ఓర్ఫిష్ చేపలు నాచు, పాచిని తింటాయి. అంతెందుకు వాటికి నిజమైన దంతాలు కూడా లేవు. బదులుగా.. చిన్న చిన్న చేపలను మింగడానికి గిల్ రేకర్స్ అని పిలువబడే వ్యవస్థ ఉంటుంది. వాటి జీర్ణవ్యవస్థకు చిన్న ద్వారం మాత్రమే ఉంటుంది. పైకి నీటిని చిమ్ముతుంటే.. చూడడానికి మాత్రమే అదొక భయంకరమైన జీవిగా కనిపిస్తుంది అంతే. -
విదేశాల్లో ఉద్యోగం పేరిట చిత్రహింసలు
చమదురై: ఒమన్ దేశంలో ఇంటి పనుల కోసం వెళ్లిన మదురైకి చెందిన మేఘల(30) అక్కడ చిత్రహింసలకు గురైంది. ఆమెను విడిపించాలని ఆమె తల్లి కళావతి, మేఘల కుమార్తె అభినయ, కుమారుడు రాహుల్ కొన్ని రోజుల క్రితం మదురై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ క్రమంలో ఓమన్‌లో గత రెండు నెలలుగా వేధింపులకు గురైన ఆమె శుక్రవారం విమానంలో మదురై చేరింది. మదురై జైహిందుపురం లారీ డ్రైవర్ శివకుమార్, మేఘల భార్యభర్తలు. అయితే శివకుమార్‌కు ప్రమాదంలో కాలు పోయింది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆమె ఏజెంట్ అబ్దుల్లా ద్వారా గత ఏప్రిల్‌లో ఓమన్ దేశంలో ఇంటి పనులు చేయడానికి పని మనిషిగా వెళ్లింది. అయితే అక్కడ వెట్టి చాకిరి చేయించుకుని ఆహారం లేకుండా చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఆమె తల్లికి ఫోన్లో చెప్పింది. దీంతో ఆమె తల్లి కోర్టులో కేసు వేయడంతో విషయం తెలుసుకున్న ఓమన్‌లోని ఏజెంట్ భయపడిపోయి విమానం ద్వారా ఆమెను మదురై పంపాడు. శుక్రవారం అనారోగ్యంతో మదురైకు చేరిన ఆమెను వారి కుటుంబీకులు ఇంటికి పిలుచుకుని వెళ్లారు. అక్కడ ఏం జరిగిందనే విషయంపై ఆమెను ప్రశ్నించగా ఓమన్ దేశానికి ఇంటి పనుల కోసం నెలకు రూ.28 వేల జీతానికి తనను తంజావూరు ఆడుదురై అలందినా ట్రావెల్స్ అబ్దుల్లా పంపాడని అక్కడ నుంచి టూరిస్టు వీసాలో దుబాయ్‌కు పిలుచుకుని వెళ్లారని చెప్పింది. అక్కడ తనతో వెట్టి చాకిరి చేయించుకుని ఒక గదిలో బంధించి శరీరంపై వాతలు పెట్టడం, దుడ్డుకర్రతో కొట్టి హింసించారని కన్నీళ్ల పర్యంతమైంది. అధిక వేతనానికి ఆశపడి కుటుంబాన్ని, పిల్లల్ని వదిలి సముద్రాలు దాటి వెళ్లి తన లాగా హింసలకు గురి కావద్దని ఆమె గోడు వెళ్లబోసుకుంది. -
ఐదేళ్ల నుంచి జైలులో ఉన్నా....