చమదురై:
ఒమన్ దేశంలో ఇంటి పనుల కోసం వెళ్లిన మదురైకి చెందిన మేఘల(30) అక్కడ చిత్రహింసలకు గురైంది. ఆమెను విడిపించాలని ఆమె తల్లి కళావతి, మేఘల కుమార్తె అభినయ, కుమారుడు రాహుల్ కొన్ని రోజుల క్రితం మదురై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ క్రమంలో ఓమన్‌లో గత రెండు నెలలుగా వేధింపులకు గురైన ఆమె శుక్రవారం విమానంలో మదురై చేరింది. మదురై జైహిందుపురం లారీ డ్రైవర్ శివకుమార్, మేఘల భార్యభర్తలు. అయితే శివకుమార్‌కు ప్రమాదంలో కాలు పోయింది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆమె ఏజెంట్ అబ్దుల్లా ద్వారా గత ఏప్రిల్‌లో ఓమన్ దేశంలో ఇంటి పనులు చేయడానికి పని మనిషిగా వెళ్లింది.
అయితే అక్కడ వెట్టి చాకిరి చేయించుకుని ఆహారం లేకుండా చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఆమె తల్లికి ఫోన్‌లో చెప్పింది. దీంతో ఆమె తల్లి కోర్టులో కేసు వేయడంతో విషయం తెలుసుకున్న ఓమన్‌లోని ఏజెంట్ భయపడిపోయి విమానం ద్వారా ఆమెను మదురై పంపాడు. శుక్రవారం అనారోగ్యంతో మదురైకు చేరిన ఆమెను వారి కుటుంబీకులు ఇంటికి పిలుచుకుని వెళ్లారు. అక్కడ ఏం జరిగిందనే విషయంపై ఆమెను ప్రశ్నించగా ఓమన్ దేశానికి ఇంటి పనుల కోసం నెలకు రూ.28 వేల జీతానికి తనను తంజావూరు ఆడుదురై అలందినా ట్రావెల్స్ అబ్దుల్లా పంపాడని అక్కడ నుంచి టూరిస్టు వీసాలో దుబాయ్‌కు పిలుచుకుని వెళ్లారని చెప్పింది. అక్కడ తనతో వెట్టి చాకిరి చేయించుకుని ఒక గదిలో బంధించి శరీరంపై వాతలు పెట్టడం, దుడ్డుకర్రతో కొట్టి హింసించారని కన్నీళ్ల పర్యంతమైంది. అధిక వేతనానికి ఆశపడి కుటుంబాన్ని, పిల్లల్ని వదిలి సముద్రాలు దాటి వెళ్లి తన లాగా హింసలకు గురి కావద్దని ఆమె గోడు వెళ్లబోసుకుంది.
విదేశాల్లో ఉద్యోగం పేరిట చిత్రహింసలు
Published Sun, Jul 3 2016 4:39 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM
Advertisement
Advertisement