tourcher
-
దళితులను నిర్బంధించి చిత్రహింసలు.. మహిళకు గర్భస్రావం!
చిక్కమగళూరు: కర్ణాటకలోని చిక్కమగళూరులో ఓ వ్యక్తి తన ప్లాంటేషన్‌లో దళితులను నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన ఘటన సంచలనం రేపుతోంది. జగదీశగౌడకు జెనుగడ్డె గ్రామం వద్ద కాఫీ ప్లాంటేషన్ ఉంది. ఇతడి నుంచి రోజువారీ కూలీలైన బాధితులు రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ సొమ్మును తిరిగి చెల్లించలేకపోవడంతో మొత్తం 16 మందిని జగదీశ తన ప్లాంటేషన్‌లో నిర్బంధించాడు. జగదీశ గౌడ దెబ్బలతో ఒక మహిళకు గర్భస్రావం అయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులు జగదీశ గౌడ, అతడి కుమారుడు తిలక్ కోసం గాలింపు చేపట్టారు. తమ బంధువులను జగదీశ గౌడ చిత్రహింసలు పెడుతున్నారంటూ కొందరు వ్యక్తులు ఈనెల 8వ తేదీన ఫిర్యాదు చేశారు. మరుసటి రోజే ఆ ఫిర్యాదును వారు వెనక్కి తీసుకున్నారని బలెహొన్నూర్ పోలీసులు చెప్పారు. ఆ మరునాడు బాధితురాలైన గర్భవతిని ఆస్పత్రిలో చేర్పించి, చిక్కమగళూరులో మరోసారి వీరు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో తాము వెళ్లి బందీలుగా ఉన్న నాలుగు కుటుంబాలకు చెందిన మొత్తం 16 మందిని విడిపించామన్నారు. వీరిని 15 రోజులుగా నిర్బంధంలోనే ఉంచినట్లు తేలిందన్నారు. వీరిలో రెండు నెలల గర్భవతి అయిన అర్పిత కూడా ఉంది. జగదీశ గౌడ ఈమె ఫోన్ లాగేసుకుని ఒక రోజు నిర్బంధించాడని, కొట్టడంతో గర్భస్రావం అయిందని ఆమె తల్లి ఆరోపించింది. జగదీశ గౌడ నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకున్న వారు ఎటో వెళ్లిపోవడంతో అతడు తమను నిర్బంధించినట్లు బాధితులు తెలిపారని చిక్కమగళూరు ఎస్పీ ఉమా ప్రశాంత్ చెప్పారు. కాగా, జగదీశ గౌడ బీజేపీ నేత అంటూ వచ్చిన వార్తలను బీజేపీ ఖండించింది. జగదీశ గౌడతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ జిల్లా ప్రతినిధి వరసిద్ధి వేణుగోపాల్ తెలిపారు. ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. నిర్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం -
‘మోదీ కోసం పెళ్లి చేసుకున్నా.. నరకం అనుభవించా’
అహ్మాదాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ మీద ఉన్న అభిమానంతో జయదవేను పెళ్లి చేసుకున్నాను. కానీ మానసికంగా, శారీరకంగా అతను నన్ను హింసిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు అల్పికా పాండే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారేవరైనా అల్పికను త్వరగానే గుర్తు పడతారు. ఎందుకంటే నరేంద్ర మోదీ మీద ఉన్న అభిమానంతో.. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది అల్పిక. వివరాలు.. గుజరాత్‌కు చెందిన జయదవే అనే వ్యక్తి గత ఏడాది కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను అల్పికా పాండే లైక్ చేసింది. అప్పటి నుంచి వీరద్దరి మధ్య ఫేస్బుక్ స్నేహం ప్రారంభమైంది. మోదీ అంటే ఇద్దరికి విపరీతమైన అభిమానం. ఆలోచనలు కలిశాయి కాబట్టి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ జంట. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 31న జయదవే.. ‘మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాం. మేం ఇద్దరం మోదీకి మద్దతు తెలుపుతున్నాం. మేమిద్దరం దేశం కోసం జీవించాలనుకుంటున్నాం.. అందుకే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు. అప్పట్లో ఈ ట్వీట్ తెగ వైరల్ అయ్యింది కూడా. ఆ తరువాత 2019, జనవరిలో వీరిద్దరు వివాహం చేసుకున్నారని సమాచారం. కానీ పెళ్లైన నెల రోజులకే వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తాను పడుతున్న బాధల గురించి ట్వీట్ చేశారు అల్పిక. ‘నరేంద్ర మోదీ మీద ఉన్న అభిమానంతో ఫేస్బుక్లో పరిచయం అయిన జయదవేను వివాహం చేసుకున్న అమ్మాయిని నేనే. అయితే ఈ బంధంలోని మరో కోణం గురించి కూడా మీకు తెలియాలి. నా భర్త నన్ను శారీరకంగా, మానసికంగా చాలా హింసిస్తున్నాడు. ఈ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను’ అంటూ వాపోయింది అల్పిక. అంతేకాక ‘జయదవేకి నా మీద చాలా అనుమానం. ప్రతీక్షణం నేను ఏం చేస్తున్నానే విషయం అతనికి తెలియాలి. నాకు తెలియకుండా నా ఫోన్‌ని చెక్ చేసేవాడు. నా వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఇవ్వడు. నేను ఒంటరిగా బయటకు వెళ్లడానికి కూడా వీల్లేదు. గౌరవం పేరుతో ఎవర్నో ఒకర్ని నాకు తోడుగా పంపిస్తాడు. నన్ను బాధ పెట్టే విషయంలో అతని కుటుంబ సభ్యులు కూడా అతనికే మద్దతు ఇస్తారు’ అంటూ ట్వీట్ చేసింది. ఈ టార్చర్ తట్టుకోలేక జయదవే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని.. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది అల్పిక. అంతేకాక పెళ్లి చేసుకోవాల్సిందిగా జయదవేనే తనను బలవంత పెట్టాడని ఆరోపించింది. He tortured me both mentally and physically till the extent that I tried committing suicide. His family supported him in doing so. I didn't have the freedom to even step out of their house without a member accompanying me in the name of honour. @ndtv @GujaratPolice @MinistryWCD — Alpika Pandey (@AlpikaPandey) February 2, 2019 -
ఇస్త్రీ పెట్టెతో కాల్చి..
బెంగళూరు(కృష్ణరాజపురం): అదనపు కట్నం తేలేదని భార్యను చిత్రహింసలకు గురిచేసిన సంఘటన బాణసవాడిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాణసవాడికి చెందిన దిలీప్ కుమార్ ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థల్లో హెల్పర్‌గా పని చేస్తున్నాడు. కొద్ది కాలం క్రితం అదే ప్రాంతానికి చెందిన మహిళతో దిలీప్ కుమార్ వివాహం కాగా బాణసవాడిలోని కాపురం ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చే దిలీప్ అదనపు కట్నం కావాలంటూ భార్యను వేధించేవాడు. అందుకు భార్య అంగీకరించకపోవడంతో సిగరెట్లతో ఆమె ఒంటిపై గాయాలు చేయడం, ఇస్త్రీ పెట్టెతో ఆమె సున్నిత ప్రాంతాల్లో కాల్చి చిత్రహింసలకు గురిచేశాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. -
ఆస్తి కోసం తల్లితండ్రులను గెంటేశారు
♦ ఐదంతస్తుల భవనంపై కుమారుల కళ్లు ♦ అనాథాశ్రమానికి వెళ్లాలంటూ వేధింపులు ♦ వృద్ధ తల్లిదండ్రులకు నరకయాతన బంజారాహిల్స్: పైసా..పైసా కూడబెట్టి తినీ.. తినక ఐదంతస్తుల భవనం కట్టించారు..తన కొడుకులతో సుఖంగా ఉండొచ్చని అనుకున్నారు.. అయితే ఆ కుమారులు తల్లిదండ్రులు అని కూడా చూడకుండా మొత్తం మాకే కావాలంటూ రోడ్డున పడేశారు. అనాథాశ్రమానికి పొండి అని కొడుతున్నారని ఆ తల్లితండ్రులు వాపోతున్నారు. మెదక్ జిల్లా పుల్లూరు గ్రామానికి చెందిన గాందారి బాలాచారి(72), మణెమ్మ(68) దంపతులు పొట్ట కూటి కోసం నగరానికి వచ్చి కార్మికనగర్‌లో ఇల్లు కట్టుకున్నారు. 2016 వరకు ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉన్నారు. ముగ్గురు కొడుకులుండగా 2012లో పెద్ద కొడుకు మృతి చెందాడు. ఇటీవల ముగ్గురు కొడుకులకు సమానంగా ఇంటిని పంచివ్వాలని ప్రయత్నించగా ఇద్దరు కొడుకులు అందుకు నిరాకరిస్తున్నారు. ఎనిమిది నెలల నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నాలుగు సార్లు ఫిర్యాదు చేశారు. మూడు భాగాలు చేసి ముగ్గురికి పంచివ్వాలంటుంటే.. మీరే అక్కర్లేదంటూ వృద్ధులని కూడా చూడకుండా రోడ్డున పడేశారని ఎనిమిది నెలలుగా బయటే ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదులు అక్కడి పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికి రెండుసార్లు బంజారాహిల్స్ ఏసీపీని కలవడానికి వచ్చామని తెలిపారు. శనివారం ఈ మేరకు ఏసీపీ నోముల మురళికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఇదే విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. తమను సొంతిట్లో కాకుండా అనాథ ఆశ్రమానికి వెళ్లాలని కుటుంబ సభ్యులు కొట్టడమే కాకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. రూ. కోటిన్నర విలువ చేసే ఇంట్లో ప్రస్తుతం 40 కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయని ఈ ఇల్లు కట్టిచ్చింది తామే అయినా ఇప్పుడు కొడుకుల దౌర్జన్యానికి నిలువ నీడ లేకుండా రోడ్డున పడాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమను అనాథ ఆశ్రమానికి వెళ్లాలంటూ కొడుతున్న కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకో వాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారా హిల్స్ ఏసీపీ ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తునకు ఆదేశించారు. -
విదేశాల్లో ఉద్యోగం పేరిట చిత్రహింసలు
చమదురై: ఒమన్ దేశంలో ఇంటి పనుల కోసం వెళ్లిన మదురైకి చెందిన మేఘల(30) అక్కడ చిత్రహింసలకు గురైంది. ఆమెను విడిపించాలని ఆమె తల్లి కళావతి, మేఘల కుమార్తె అభినయ, కుమారుడు రాహుల్ కొన్ని రోజుల క్రితం మదురై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ క్రమంలో ఓమన్‌లో గత రెండు నెలలుగా వేధింపులకు గురైన ఆమె శుక్రవారం విమానంలో మదురై చేరింది. మదురై జైహిందుపురం లారీ డ్రైవర్ శివకుమార్, మేఘల భార్యభర్తలు. అయితే శివకుమార్‌కు ప్రమాదంలో కాలు పోయింది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆమె ఏజెంట్ అబ్దుల్లా ద్వారా గత ఏప్రిల్‌లో ఓమన్ దేశంలో ఇంటి పనులు చేయడానికి పని మనిషిగా వెళ్లింది. అయితే అక్కడ వెట్టి చాకిరి చేయించుకుని ఆహారం లేకుండా చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఆమె తల్లికి ఫోన్లో చెప్పింది. దీంతో ఆమె తల్లి కోర్టులో కేసు వేయడంతో విషయం తెలుసుకున్న ఓమన్‌లోని ఏజెంట్ భయపడిపోయి విమానం ద్వారా ఆమెను మదురై పంపాడు. శుక్రవారం అనారోగ్యంతో మదురైకు చేరిన ఆమెను వారి కుటుంబీకులు ఇంటికి పిలుచుకుని వెళ్లారు. అక్కడ ఏం జరిగిందనే విషయంపై ఆమెను ప్రశ్నించగా ఓమన్ దేశానికి ఇంటి పనుల కోసం నెలకు రూ.28 వేల జీతానికి తనను తంజావూరు ఆడుదురై అలందినా ట్రావెల్స్ అబ్దుల్లా పంపాడని అక్కడ నుంచి టూరిస్టు వీసాలో దుబాయ్‌కు పిలుచుకుని వెళ్లారని చెప్పింది. అక్కడ తనతో వెట్టి చాకిరి చేయించుకుని ఒక గదిలో బంధించి శరీరంపై వాతలు పెట్టడం, దుడ్డుకర్రతో కొట్టి హింసించారని కన్నీళ్ల పర్యంతమైంది. అధిక వేతనానికి ఆశపడి కుటుంబాన్ని, పిల్లల్ని వదిలి సముద్రాలు దాటి వెళ్లి తన లాగా హింసలకు గురి కావద్దని ఆమె గోడు వెళ్లబోసుకుంది.