బెంగళూరు(కృష్ణరాజపురం):
అదనపు కట్నం తేలేదని భార్యను చిత్రహింసలకు గురిచేసిన సంఘటన బాణసవాడిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాణసవాడికి చెందిన దిలీప్ కుమార్ ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థల్లో హెల్పర్‌గా పని చేస్తున్నాడు. కొద్ది కాలం క్రితం అదే ప్రాంతానికి చెందిన మహిళతో దిలీప్ కుమార్ వివాహం కాగా బాణసవాడిలోని కాపురం ఉంటున్నారు.
అయితే కొద్ది రోజులుగా రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చే దిలీప్ అదనపు కట్నం కావాలంటూ భార్యను వేధించేవాడు. అందుకు భార్య అంగీకరించకపోవడంతో సిగరెట్లతో ఆమె ఒంటిపై గాయాలు చేయడం, ఇస్త్రీ పెట్టెతో ఆమె సున్నిత ప్రాంతాల్లో కాల్చి చిత్రహింసలకు గురిచేశాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.