
సాక్షి,హైదరాబాద్ : మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 14న మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో హోలీ పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో 14వ తేదీ ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి.
ఈ సందర్భంగా పోలీసులు పలు కీలక సూచలను జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా హోలీ షాపులు మూసివేయాలని వైన్స్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని, బహింగంగా ప్రదేశాల్లో వాహనదారులపై కలర్స్ వేసి ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment