బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. సుశాంత్ మరణంతో బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వినియోగం తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ఇప్పటికే దీపికా పదుకోనె, రకుల్ ప్రీత్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్‌లకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారు కూడా విచారణ కూడా హాజరవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం టీవీ చానెళ్లల్లో ఓ వీడియో తెగ ప్రసారం అవుతుంది. గత సంవత్సరం కరణ్ జోహార్ నిర్వహించిన హౌస్ పార్టీని హైలైట్ చేస్తున్న ఈ వీడియోపై మీడియాలో వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రసిద్ధ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ శుక్రవారం స్పందించారు. మీడియా పార్లమెంటు ఇటీవల ఆమోదించిన వివాదాస్పద వ్యవసాయ బిల్లుల గురించి మాట్లాడటానికి బదులు గత సంవత్సరం కరణ్ జోహార్ ఇంట్లో నిర్వహించిన పార్టీ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. (చదవండి: కరణ్ జోహార్ డ్రగ్ పార్టీపై ఎన్‌సీబీ కన్ను)
If Karan johar had invited some farmers too for his party life would have been easier for our TV channels.They would not have had to choose between farmers protest and Karan’s party!. it seems that Karan’s do is the second most favourite PARTY of our channels
— Javed Akhtar (@Javedakhtarjadu) September 25, 2020
‘కరణ్ జోహార్ తన పార్టీ కోసం కొంతమంది రైతులను కూడా ఆహ్వానించినట్లయితే, మన టీవీ చానెళ్ల పని సులభం అయ్యేది. అలా జరిగి ఉంటే ప్రస్తుతం వారు రైతుల నిరసన, కరణ్ పార్టీల మధ్య దేన్నో ఒక దాన్ని ఎన్నుకోవలసిన అవసరం ఉండేది కాదు! కరణ్ తన రెండో పార్టీని మన చానెళ్లతో చేయాల్సి ఉన్నట్లు అనిపిస్తుంది’ అంటూ అక్తర్ ట్వీట్ చేశారు. ఇక ఈ వీడియోలో కనిపించే ప్రముఖులలో, బాలీవుడ్ తారలు దీపికా పదుకోనె, రణబీర్ కపూర్, విక్కీ కౌషల్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, మలైకా అరోరా, అర్జున్ కపూర్‌లతో పాటు చిత్ర నిర్మాతలు జోయా అక్తర్, అయాన్ ముఖర్జీ ఉన్నారు. దీనిలో కనిపించే సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నారనే వార్తలు తెగ ప్రచారం అయ్యాయి
Comments
Please login to add a commentAdd a comment