బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెటింటా తెగ హల్‌చల్ చేస్తోంది. కేవలం ‘ఎమ్(M)’ లేటర్‌ను మాత్రమే షేర్ చేసి.. నెటిజన్లను అయోమయంలో పాడేశారు జావేద్. నెటిజన్లు దానికి అర్థం ఏంటో తెలిక తల బాదుకుంటున్నారు. ఇందులో ఎమైనా పజిల్ దాగుందేమోనని వారంతా మెదడుకు పదును పెడుతుంటే.. మరి కొంతరూ అదేంటో తెలుసుకొవడాని ఉత్సుకత చూపుతున్నారు. ('అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?')
M
— Javed Akhtar (@Javedakhtarjadu) April 21, 2020
‘దీనికి అర్థం ఏంటీ అక్తర్ సార్’ అంటూ ఆయనకే ఎదురు ప్రశ్నలు వెస్తుంటే.. మరికొందరు ‘ఎమ్(M) తర్వాత వచ్చే ఆల్ఫాబేట్స్ను రీట్వీట్ చేస్తున్నారు. ఇక ఒకే సింగిల్ లేటర్‌ను షేర్ చేసిన ఆయన తీరు చూస్తుంటే లాక్‌డౌన్‌లో ఇంట్లో ఖాళీగా ఉన్న వారికి కాస్తా కాలక్షేపం ఇచ్చేందుకు ఇలా ట్వీట్ చేసుంటారని అభిప్రాయ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment