![loudspeakers should not be used by mosques, tweets Javed Akhtar - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/8/javed-akhtar.jpg.webp?itok=HfRRG9v1)
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది కిందట ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ మసీదుల్లో, ఇతర ఆధ్మాత్మిక ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసి.. దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ రచయిత, కవి జావేద్ అఖ్తర్ కూడా సోనూ నిగమ్‌కు మద్దతు పలికారు. నివాసప్రాంతాల్లోని మసీదుల్లో, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల్లో లౌడ్ స్పీకర్లు వాడరాదని ఆయన తేల్చిచెప్పారు.
‘ఆన్ రికార్డు చెప్తున్నా.. సోనూ నిగమ్‌తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నివాస ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లో, ఆధ్యాత్మిక కేంద్రాల్లో లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు’ అని జావేద్ అఖ్తర్ ట్వీట్ చేశారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సోనూ నిగమ్‌కు సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందంటూ తాజాగా ముంబై పోలీసులు సోనూ నిగమ్‌కు భద్రత పెంచారు. ఈ నేపథ్యంలో జావేద్ అఖ్తర్ ఈ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment