Mosques
-
మస్కట్ పిలుస్తోంది!
సెప్టెంబర్ నెలలో రాజధాని నగరం మస్కట్ నగరంలో విహరించమని పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది ఒమన్ దేశం. చల్లటి వాతావరణంలో టూరిస్టుల తాకిడి తక్కువగా ఉన్న సమయం షాపింగ్‌కి అనువైన కాలం అంటూ ఈ వీసా సౌకర్యం కల్పిస్తోంది ఒమన్ టూరిజం. ఇక్కడ ఏమేమి చూడవచ్చు, ఏమేమి కొనవచ్చు! ఓ లుక్ వేద్దాం.మస్కట్ నగరంలో పురాతన కోటలున్నాయి, అద్భుతంగా నిర్మించిన మసీదులున్నాయి, కనువిందు చేసే ΄ార్కులు, సంస్కృతి సంప్రదాయాలు చరిత్రకు ఆలవాలంగా భారీ మ్యూజియాలున్నాయి. అల్ జలాయ్ ఫోర్ట్‌ను చూడాలి. 16వ శతాబ్దంలో ΄ోర్చుగీసు స్వాధీనంలోకి వెళ్లిన అరబ్బుల కోట ఒమన్ చరిత్రకు ప్రతిబింబం. ఇక ప్రార్థన మందిరాలను చూడాలంటే సుల్తాన్ ఖాబూస్ గ్రాండ్ మాస్క్. ఇది ఎంత పెద్దదంటే ఒకేసారి ఇరవై వేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చన్నమాట. ఇక షాపింగ్ చేయాలంటే ముత్రాహ్ సౌక్‌ను తప్పకుండా చూడాలి. అరబిక్ సంప్రదాయం కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లు ఉంటుంది. ముండూస్ (ఆభరణాల పెట్టె), టర్కీ కార్పెట్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, పోస్ట్ కార్డ్, పెర్ఫ్యూమ్, కర్జూరాలను కొనుక్కోవచ్చు. కశ్మీర్ కార్పెట్లు ఈ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణ.మ్యూజియం చేసే మ్యాజిక్: నేషనల్ మ్యూజియంలోకి వెళ్లిన తర్వాత మనకు తెలియకుండానే టైమ్ మెషీన్‌లోకి వెళ్లి΄ోతాం. ఎన్ని గంటలకు బయటకు వస్తామో చెప్పలేం. ఇక ముఖ్యంగా చెప్పుకోవలసింది బైట్ అల్ జుబైర్ గురించి. ఇది ఓమన్ సంప్రదాయ వాస్తుశైలి నిర్మాణం. ఫర్నిచర్, హస్తకళాకృతులు, స్టాంపులు, నాణేల సుమహారం. ఇదీ సింపుల్‌గా మస్కట్ నగరం. ముంబయి నుంచి డైరెక్ట్ ఫ్లయిట్ ఉంది. రెండున్నర గంటల ప్రయాణం. -
India Mosques: రంజాన్ స్పెషల్ దేశంలో ప్రముఖ మసీదుల ఫొటోలు
-
అల్‌ఖైదా కంటే ప్రమాదకరం
వాషింగ్టన్: పాత మసీదులు, యూదుల పురాతన ఆలయాల ఆనవాళ్లు ఉన్న పవిత్ర ప్రాంతాలపై పట్టు కోసం మొదలైన పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధం పలు మలుపులు తీసుకుంటున్న వేళ హమాస్ సాయుధసంస్థపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. అమెరికాలోని ఫిలడెలి్ఫయాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బైడెన్ మాట్లాడారు. 2001 సంవత్సరంలో 9/11 సెపె్టంబర్ దాడులకు తెగబడిన అల్‌ఖైదా ఉగ్రసంస్థ కంటే హమాస్ ప్రమాదకరమైనదని అభివరి్ణంచారు. హమాస్ దాడులకు గురైన ఇజ్రాయెల్‌కు అమెరికా ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ‘ ఇజ్రాయెల్‌పై దాడి చేసి హమాస్ ఏకంగా వేయి మందికిపైగా అమాయకులను పొట్టనబెట్టుకుంది. అల్‌ఖైదా సృష్టించిన 9/11 దాడులకంటే ఈ దాడి అత్యంత దారుణం. అల్‌ఖైదా కంటే హమాస్ ప్రమాదకరం. అల్‌ఖైదాను మించిన దుషు్టలు వీరు. మొదట్నుంచీ చెబుతున్నట్లే మేం ఇజ్రాయెల్‌కు బాసటగా నిలబడతాం. ఆత్మరక్షణ కోసం, ప్రతిదాడుల కోసం ఇజ్రాయెల్ తీసుకునే ప్రతి నిర్ణయానికి, ప్రతీ చర్యకూ అమెరికా అండగా ఉంటుంది. గాజాలో నెలకొన్న మానవీయ సంక్షోభానికి తక్షణం ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఇందుకోసమే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్పటికే ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు’ అని బైడెన్ చెప్పారు. ఐరాసతోనూ చర్చిస్తున్నాం ‘ఇజ్రాయెల్ ప్రభుత్వంతోనేకాదు దాని పొరుగున ఉన్న జోర్డాన్, ఈజిప్ట్ ఇతర అరబ్ దేశాలతో మంతనాలు జరుపుతున్నాం. ఇరువైపులా దాడులు, ప్రతిదాడులతో పాలస్తీనా, ఇజ్రాయెల్‌లలో నెలకొన్న మానవీయ సంక్షోభం పోగొట్టేందుకు ఐక్యరాజ్యసమితితోనూ సమష్టిగా కృషిచేస్తున్నాం. చర్చిస్తున్నాం’ అని అన్నారు. -
పాక్‌లో ఆత్మాహుతి దాడులు.. 58 మంది మృతి
కరాచీ: మసీదుల్లో మిలాదునబి వేడుకలే లక్ష్యంగా పాకిస్తాన్లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఆత్మాహుతి దాడుల్లో 58 మంది మృత్యువాతపడగా మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లా కేంద్రంలోని ఓ మసీదులో ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు దాడిలో 54 మంది చనిపోయారు. మరో 100 మంది గాయపడ్డారు. మృతుల్లో డీఎస్పీ నవాజ్ గషో్కరి కూడా ఉన్నారు. గుర్తు తెలియని దుండగుడు డీఎస్పీ నవాజ్ కారు పక్కనే నిలబడి తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అదేవిధంగా, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ హంగు నగరంలోని దవోబా పోలీస్ ఠాణాలోకి అయిదుగురు ఉగ్రవాదులు ప్రవేశించారు. భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా మరో నలుగురు పారిపోయారు. వారిలో ఒకరు పక్కనే ఉన్న మసీదులోకి చేరుకుని తనను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో మసీదులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గాయపడ్డారు. మిగతా ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట సాగుతోందని పోలీసులు చెప్పారు. ఈ దాడులకు తాము కారణం కాదంటూ తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ తెలిపింది. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు చెందిన కీలక కమాండర్‌ను భద్రతా బలగాలు కాల్చి చంపిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఐఎస్ పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. -
లౌడ్ స్పీకర్లపై పోరాటం ఆగదు: రాజ్ ఠాక్రే హెచ్చరికలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించే వరకూ.. హనుమాన్ చాలీసా పఠిస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే మరోసారి హెచ్చరించారు. భారీ సౌండ్ వచ్చే లౌడ్స్పీకర్లు తొలగించే వరకూ తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. 45 నుంచి 55 డెసిబుల్స్ వరకూ సుప్రీంకోర్టు అనుమతించిందని, అయితే.. ముంబైలోని 135 మసీదులు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించాయని ఆరోపించారు. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని రాజ్‌ఠాక్రే ప్రశ్నించారు. కాగా హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని రాజ్ ఠాక్రే హెచ్చరించిన నేపథ్యంలో బుధవారం ముంబైతోపాటు దాని పరిసర ప్రాంతాల్లోని చాలా మసీదులు ఆజాన్ సమయంలో లౌడ్స్పీకర్లను బంద్ చేశాయి. మహారాష్ట్రలోని పర్భాని, ఉస్మానాబాద్, హింగోలి, జల్నాలోని కొన్ని ప్రాంతాలు, నాందేడ్, నందుర్బార్, షిర్డీ, శ్రీరాంపూర్‌తో సహా పలు ప్రాంతాల్లో ఆజాన్ సమయంలో లౌడ్స్పీకర్లు స్వచ్ఛందంగా తొలగించగా. మరి కొన్ని చోట్ల తక్కువ వాల్యూమ్‌తో ఉపయోగించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 నుంచి 260 మంది ఎమ్ఎన్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ ఠాక్రే నివాసం ముందు గుమిగూడిన పలువురు కార్యకర్తలలతోపాటు పుణెలో ఎనిమిందిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కార్యకర్తల అరెస్ట్‌పై రాజ్ ఠాక్రే స్పందించారు. చట్టాన్ని అనుసరించే తమ పార్టీ కార్యకర్తలను నిర్బంధించి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. చదవండి: లౌడ్‌స్పీకర్ల వ్యవహారంలో ముగిసిన డెడ్‌లైన్.. ముంబైలో హైఅలర్ట్ ఈ సమస్య కేవలం మసీదులకు సంబంధించినది మాత్రమే కాదని, అక్రమ లౌడ్‌స్పీకర్లతో అనేక దేవాలయాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ అంశం మతపరమైంది కాదని, సామాజిక సమస్య అని అన్నారు. అలాగే ఈ సమస్య ఒక రోజుది కాదని.. లౌడ్ స్పీకర్ల కారణంగా విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముంబైలోని 1,140 మసీదుల్లో 135 మసీదులు బుధవారం ఉదయం 6 గంటల కంటే ముందే లౌడ్ స్పీకర్లను ఉపయోగించాయని మహారాష్ట్ర హోంశాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యహరించిన సదరు 135 మసీదులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
లౌడ్‌స్పీకర్ల వివాదంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. రాజ్ ఠాక్రేపై కేసు
ముంబై: ఔరంగాబాద్‌లో ఆదివారం ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్‌ఠాక్రే నిర్వహించిన బహిరంగ సభలో పోలీసులు విధించిన షరతుల్లో కొన్ని ఉల్లంఘించారనే అభియోగంపై మంగళవారం చీఫ్ రాజ్ ఠాక్రేపై కేసు నమోదైంది. రాజ్ ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఔరంగాబాద్ పోలీసులు నియమాల ఉల్లంఘన జరిగినట్లు నివేదిక రూపొందించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి, హోంమంత్రి, సంబంధత అధికారులతో జరిగిన సమావేశంలో ఆ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై ఆరా తీసిన తరువాత ఔరంగాబాద్‌లోని సిటీ చౌక్ పోలీసు స్టేషన్లో రాజ్‌పై కేసు నమోదు చేశారు. సభకు అనుమతిచ్చే ముందు పోలీసులు విధించిన మొత్తం 16 షరతుల్లో 12 షరతుల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాజ్‌తోపాటు సభకు అనుమతివ్వాలని దరఖాస్తు చేసుకున్న రాజీవ్ జవళేకర్పై కూడా కేసు నమోదు చేశారు. ఔరంగాబాద్‌లో కేసు నమోదైన విషయంపై రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే ఫోన్‌చేసి స్ధానిక ఎమ్మెన్నెస్ పదాధికారి రజీవ్ జవళేకర్తో చర్చించారు. చట్టం అందరి సమానంగా ఉండాలని, పోలీసులు సభకు అనుమతిచ్చే ముందు కేవలం 15 వేల మంది హాజరుకావాలని షరతులు విధించారని, అయితే రాజ్ ఠాక్రే రోడ్డుపై నడుస్తూ వెళుతుంటేనే 15 వేలకుపైగా జనాలు అనుసరిస్తారని, ఇలాంటి సందర్భంలో షరతులు ఉల్లంఘించారని కేసు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మరోనేత సందీప్ దేశ్‌పాండే మాట్లాడుతూ తొలుత సభకు అనుమతివ్వకపోవడం, ఆ తరువాత సమయం దగ్గరపడగానే షరతులతో కూడిన అనుమతివ్వడం లాంటి సందర్భాలు గతంలో ఎదురు కాలేదన్నారు. పోలీసులపై ప్రభుత్వం కచ్చితంగా ఒత్తిడి తెచ్చిందని దీన్ని బట్టి స్పష్టమవుతోందన్నారు. కార్యకర్తలను భయపట్టేందుకే కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసు నమోదు చేసిన నిందితుల జాబితాలో రాజ్ ఠాక్రే పేరు మొదటి స్ధానంలో ఉంది. ఆ తరువాత రాజీవ్ జావళేకర్, నిర్వాహకులు, ఇతర పదాధికారుల పేర్లున్నాయి. స్ధానిక సిటీ చౌక్ పోలీసు ఇన్స్పెక్టర్ అశోక్ గిరీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: డెన్మార్క్ ప్రధాని నివాసంలో మోదీ చర్చలు.. వీడియో వైరల్ నాన్ బెయిలబుల్ వారెంట్ మరోవైపు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరేపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 14 ఏళ్ల కిందటి కేసులో మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా రాజ్ ఠాక్రే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై 2008లో ఆయనపై ఐపీసీ సెక్షన్ 109,117 కింది కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో రాజ్ ఠాక్రే కోర్టుకు హాజరు కాకపోవడంతో జూన్ 8లోపు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని సాంగ్లి జిల్లా షిరాలా ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పేర్కొంది. అయితే 2012 కంటే ముందు నమోదైన రాజకీయ పరమైన కేసులన్నిటినీ ప్రభుత్వం రద్దు చేసిందని ఎంఎన్ఎస్ నేత ఒకరు గుర్తు చేశారు. -
మసీదు కిందుగా పైప్‌లైన్, భారీ పేలుడు
ఢాకా: మసీదు కిందుగా వెళ్తున్న గ్యాస్ పైప్‌లైన్ పేలిపోవడంతో బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్నవారిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. బైటుస్ సలాట్ జేమ్ మసీదులో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రార్థనలు ముగించుకుని ఇంటికి బయల్దేరుతున్న క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. మసీదులోని 6 ఏసీలు కూడా మంటల తీవ్రతకు పేలిపోయాయి. తీవ్రంగా గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ ఉన్నతాధికారి జయేదుల్ ఆలాం చెప్పారు. ప్రమాద తీవ్రతలో చాలా మందికి 90 శాతానికి పైగా గాయాలయ్యాయని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని ఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపారు. (చదవండి: నువ్వు నిజంగా దేవుడివి సామి) -
అక్కడ తొలిసారిగా త్రివర్ణ పతాక రెపరెపలు
తిరువనంతపురం: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేరళలలో సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలోని అన్ని మసీదుల్లో కేరళ ముస్లిం వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇలా కేరళలోని అన్ని మసీదుల్లో అధికారికంగా జాతీయ పండగ జరుపుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో మసీదులన్ని మూడు రంగుల జెండా అలంకరణతో కొత్త శోభను సంతరించుకున్నాయి. జెండా ఆవిష్కరణ అనంతరం మసీదుల్లో భారత రాజ్యాంగా పీఠికను చదివారు. ముస్లింలు తమ మసీదుల్లో జాతీయా జెండాను ఎగురవేసి.. జాతీయా సమైక్యతను ప్రోత్సహించాలనే సందేశాన్ని ఇచ్చారు. జాతీయ జెండాను గౌరవిస్తూ.. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ముస్లింలు ప్రతిజ్ఞ చేశారు. దేశవ్యాప్తంగా ముస్లింలు సీఏఏకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న ఈ తరుణంతో కేరళలోని మసీదుల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించడం విశేషం. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళ ప్రభుత్వం వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని కేరళ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. -
మసీదుల్లోకి మహిళల వ్యాజ్యం కొట్టివేత
న్యూఢిల్లీ: మసీదుల్లోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. పబ్లిసిటీ కోసమే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్న కేరళ హైకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. ‘ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి అసలు మీరెవరు? ఇది మీపై ఎలా ప్రభావం చూపుతుంది? బాధిత వ్యక్తులను మా ముందుకు తీసుకురండి’అని పిటిషన్‌దారుడితో వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ మేరకు వెల్లడించింది. మరోవైపు, ఆర్టికల్ 15 చిత్రంలో కుల విద్వేషాలు, పుకార్లను పెంచే అభ్యంతరకరమైన డైలాగులు ఉన్నందున సీబీఎఫ్సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) జారీ చేసిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. -
పట్టరాని కోపం
చాలా రోజుల తర్వాత కొత్త బట్టలు ధరించే అవకాశం ఇచ్చిన అల్లాహ్ కు కృతజ్ఞతలు చెప్పుకొని నమాజ్ కోసం మసీదుకు వెళుతున్నాడు ఒక వ్యక్తి. అసలే తెల్లని బట్టలు. ఎక్కడ మట్టి అంటుకుంటుందోనని చాలా జాగ్రత్తగా నడుస్తున్నాడు.దారిలో ఆడుకుంటున్న పిల్లాడు రాయి విసిరాడు. అది కాస్తా పక్కనే ఉన్న బురదలో పడి దాని చిందులు అటుగా వెళ్తున్న ఆ వ్యక్తి తెల్లని దుస్తులపై పడ్డాయి. ఆ వ్యక్తికి కోపం నషాళానికి ఎక్కింది. పట్టరాని ఆగ్రహంతో ఆ కుర్రాడి మీదకు పరిగెత్తాడు.అంతలో ‘‘కోపం సైతాన్ ప్రేరణతో వస్తుంది. నిలబడి ఉండగా కోపం వస్తే వెంటనే కూర్చోండి. కూర్చోని ఉండగా కోపం వస్తే వెంటనే పడుకోండి’’ అన్న ప్రవక్త ముహమ్మద్ గారి ప్రవచనం గుర్తుకు వచ్చింది. ఆ వ్యక్తి వెంటనే ఆ బురదలో కూర్చున్నాడు. కోపం తగ్గలేదు. వెంటనే బురదలో పడుకున్నాడు.బట్టలు పాడైతే మళ్లీ కొనుక్కోవచ్చు. కాని సైతాన్ కోపంలో ఏదైనా చెయ్యరాని పని చెయిస్తే. శాశ్వతమైన స్వర్గానికి దూరం కావాల్సి ఉంటుంది.కుస్తీ పట్టి ఇతరుల్ని చిత్తు చేసేవాడు అసలైన శూరుడు కాడు. తనకు ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపే వాడే వాస్తవానికి ధీరుడు. అన్నారు ప్రవక్త (స).ఉపవాసాల అసలు ఉద్దేశం దైవభీతి జనింపజేయడం. సహన గుణం అలవర్చకోవడం.ఈ నెల రోజుల ఉపవాస దీక్షలు మనలో కోపాన్ని అదుపు చేసే గుణం అలవర్చకోగలిగే వారు నిజంగా అదృష్టవంతులు. – షేక్ అబ్దుల్ బాసిత్ -
మజ్లిస్ వల్లే అంబర్‌పేటలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ దుందుడుకు వైఖరితో అంబర్‌పేటలోని ఓ స్థలం విషయంలో ఉద్రిక్తత ఏర్పడిందని బీజేపీ సీనియర్ నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ హయాంలో అంబర్‌పేట్‌లో జరిగిన రోడ్డు వెడల్పులో పోయిన ఓ స్థలంలో ప్రార్థనా మందిరం ఉందంటూ ఎంఐఎం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చే నంబర్ చౌరస్తా నుంచి శ్రీరమణ థియేటర్ చౌరస్తా వరకు ఉన్న ముస్లిం శ్మశాన వాటికకు ఇబ్బం ది కావద్దనే ఫ్లైఓవర్ తీసుకొచ్చామని తెలిపారు. మిగతా రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ప్రాపర్టీ కలిగిన 281 మందితో మాట్లాడి నష్టపరిహారంగా గజా నికి రూ.80 వేలు ఇప్పించినట్లు చెప్పారు. 2–2–468 నంబర్ ఇంటిలోని ముగ్గురు అన్నదమ్ములకు ఒక్కొక్కరికి రూ.84 లక్షల చొప్పు న.. రూ.2.5 కోట్ల పరిహారం చెల్లించి గత ఏప్రిల్‌లో ఆ ఇంటిని అధికారులు తొలగించా రన్నారు. మసీదు ఉంటే పరిహారం ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ ఇల్లు ప్రైవేటు ఆస్తి అయినప్పటికీ ఎంఐఎం నేత ఖాద్రీ పోలీసులను అడ్డుపెట్టుకొని అక్కడ మసీదు కట్టారని అన్నారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని, టీఆర్ఎస్ కూడా తమ వైఖరేంటో చెప్పాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని స్థానిక కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై విచారణ కమిటీ వేసి నివేదిక తెప్పించుకుంటామని సీఎస్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. -
చెవికీ... కంటికీ ఉపవాసం
ఒక రోజు కొందరు యువకులు నమాజ్ కోసం మసీదుకు వెళుతున్నారు. ఆ దారిలో ఒక మూలన ఒక ముసలివాడు చాటుగా కూర్చుని అన్నం తింటూ కనిపించాడు.అందులో ఒక యువకుడు, ‘‘ఏయ్ తాత! ఈ రోజు ఉపవాసం లేవా?’’ అని అడిగాడు.‘‘ఎందుకు లేను? ఉన్నాను. నేను ఉపవాసం ఉండి అన్నం తింటాను, నీళ్ళు కూడా తాగుతా’’ అని సమాధానం ఇచ్చాడు తాత. ‘‘భలే చెబుతున్నావు తాతా నువ్వు. ఇది కొత్త రకం రోజానా?‘ఎగతాళి చేస్తూ ఆ యువకులు.‘‘అవును నాయనా!. నేను నా కళ్ళతో చెడు చూడను. నాలుకతో చెడు మాట్లాడను. ఎవరినీ నిందించను. ఎవరి మీదా చాడీలు చెప్పను. చెడ్డ పనులు చేయను. అశ్లీల పలుకులు అసలే పలకను. ఎవరినీ మోసం చేయను. అబద్ధాలు ఆడను. అధర్మ పనులు అసలే చేయను. ఈరా‡్ష్య ద్వేషాల దరిదాపుల్లోకి కూడా వెళ్లను. ఎవరిపైనా దౌర్జన్యం చేయను. ఇలా నా శరీరంలోని అవయవాలు అన్నీ ఉపవాసం ఉంటున్నాయి. కాకపోతే అనారోగ్యం కారణంగా అన్న పానీయాలు మాత్రం తీసుకుంటాను. మరి మీరంతా ఇలా ఉపవాసం ఉన్నారా?’’ అని అడిగాడు తాత. అందులో ఒక యువకుడు,‘‘క్షమించాలి తాత! అన్న పానీయాలు తీసుకోకుండా ఉపవాసమైతే ఉన్నాం, కాని నీలా పరిపూర్ణ ఉపవాసం మాత్రం లేము‘’ అని అన్నాడు సిగ్గుతో తల దించుకుని.నిజమే. ఉపవాసం అంటే ఆకలితో కడుపు మాడ్చుకోవడం కాదు. అల్లాహ్ ఇచ్చిన శరీరంలోని సకల అంగాలను ఆ దైవం, ప్రవక్త ముహమ్మద్( స) చెప్పినట్లు జీవింప చేయడం, అల్లాహ్ ఆదేశాలను తు.చతప్పకుండా పాటించడం. మనిషిని సంస్కరించి, నైతికోన్నతుడిగా మార్చడం కోసమే రంజాన్ ఉపవాసాలు. –షేక్ అబ్దుల్ బాసిత్ -
మసీదుల్లో మహిళల ప్రవేశం : కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
మసీదుల్లో మహిళల ప్రవేశం.. సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : మసీదుల్లో ప్రార్ధనలు చేసుకునేందుకు ముస్లిం మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు సర్వోన్నత న్యాయస్ధానం అంగీకరించింది. పుణేకు చెందిన దంపతులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై బదులివ్వాలని జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని సుప్రీం బెంచ్ కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది. శబరిమల ఆలయంలో మహిళల అనుమతికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తాజా పిటిషన్‌పై విచారణ చేపడతామని సుప్రీం బెంచ్ పిటిషనర్ల తరపు న్యాయవాదికి తెలిపింది. కాగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 28న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజ్యాంగ నిబంధనల ప్రకారం దేశ పౌరులెవరినీ వారి మతం, జాతి, కులం, జెండర్, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివక్షకు గురిచేయరాదని, ముస్లిం మహిళలను మసీదుల్లోకి అనుమతించకపోవడం లింగవివక్ష, సమానత్వ హక్కులకు తూట్లు పొడవడమేనని పిటిషనర్లు పేర్కొన్నారు. విదేశాల్లో మసీదుల్లోకి మహిళలను అనుమతిస్తున్నారా అని పిటిషనర్లను కోర్టు ప్రశ్నించింది. -
సాయి చెప్పిన స్వీయకథ
బంగారపు నగని ఎలా సరైన పెట్టెలోనే భద్రపరుస్తారో గొప్పవిలువైన మంత్రాన్ని ఎలా శక్తి సంపూర్ణంగా నిండిన రోజున మాత్రమే ఎలా ఉపదేశిస్తారో అలా ఈ పాదుకాప్రతిష్ఠని ఎప్పుడు చేయవలసిందిగా సెలవునిస్తావో చెప్పవలసిందని సాయిని అడగ్గానే ఆయన – ‘శ్రావణపూర్ణిమనాడు సరిగ్గా 11 గంటలకు’ అని ఆజ్ఞాపించారు.సరిగ్గా 11 గంటలకి ప్రతిష్ఠ చేసేందుకు వీలుగా దీక్షిత్ తన శిరసు మీద ఆ పవిత్రపాదుకలని పెట్టుకుని పవిత్రమైన ఖండోబా మందిరం నుండి బయలుదేరగానే భక్తుల సాయినామస్మరణతో దిక్కులు మార్మోగిపోసాగాయి.శివుడు పరశురామునికి యుద్ధవిద్యని నేర్పుతూ ఉన్న కాలంలో శంకరుని చేతిలో ఉన్న గొడ్డలికి సంబంధించిన ఓ ఇనుపముక్క నేలనపడింది. దాన్ని శివుడు ఓ అయఃఖండాన్ని (ఇనుపముక్కని) పరశురామునికే ఇచ్చేశాడు ఈ సంఘటనకి గుర్తుగా.అలాఇనుపముక్క తెగిపడ్డ గొడ్డలి కల ఆ శంకరుణ్ణి ‘ఖండపరశుడు’ అని అప్పటినుండే పిలిచారు. ఆ ఖండపరశుణ్ణే మరాఠీ భాషలో ’ఖండోబా’ అని పిలుస్తారు. అంతటి శివశక్తి నిండిన గ్రామదేవతాశక్తికూడా నిండిన (శంకరుడు అర్థనారీశ్వరుడు కదా!) ఆ ఆలయం నుండి పాదుకలని ద్వారకామాయికి తెచ్చారు ఊరేగింపుగా.సాయి వద్దకి ఆ పాదుకలు రాగానే ఆయన తన చేతితో వాటిని స్పృశించి (తన తపశ్శక్తిని ఆ పాదుకలలోనికి ప్రవహింపజేయడానికి సంకేతం అది) ఇవి శ్రీహరి పాదాలు. దైవచరణాలు.. అన్నాడు.మేళతాళాలతో భజన కీర్తనలతో బాజా భజంత్రీలతో అగరు «ధూపాలతో చందనపు నీటి చల్లులతో కర్పూరపు హారతులతో ఆ ప్రదేశం వర్ణించడానికి వీల్లేనంత గొప్పదిగా అనిపించింది అందరికీ.(శాలివాహన శకం 1834 – క్రీ.శ 1912)ఇప్పటికీ గురుశుక్రవారాల్లో విశేషార్చనలు సాగుతూంటాయి పాదుకలకి. ప్రతి రోజూ అర్చన – ఊదీ వితరణ (భస్మప్రసాదం) ఉంటూనే ఉంటుంది. పాదుకల్లో ఉన్న శక్తి అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి తప్ప చెప్తే అర్థమయ్యేది కానే కాదు. ‘ఏదైనా తినడానికి పెట్టనామ్మా?’ అని సంతానం గనుక అడిగితే – ‘అయ్యో! వాళ్లు అడిగే దాకా వాళ్ల ఆకలిని చూడలేకపోయా’ అనే ఒకింత బాధతోనూ, ఇంకా నయం! నేను ఇంట్లో ఉండగానే అడిగారు’ అనే మరింత ఆనందంతోనూ ప్రతి తల్లీ ఎలా వాళ్లకిష్టమైన తినుబండారాన్ని చేసి కడుపునింపుతుందో, అలా సాయికి కూడా మసీదు నిండుగా భక్తులుండి – ఏదైనా చెప్పవూ సాయీ! అనడిగితే చెప్పలేని ఆనందం ఆయనకి. ఇదీ అదీ చెప్పచ్చూ చెప్పకూడదూ ఇది సమ్మానం, అది అవమానకర సంఘటన అనుకోకుండా తట్టిన విశేషాలని యథార్థంగా జరిగిన వాటిని కళ్లకి కట్టినట్టుగా చెప్పేస్తాడాయన. అందరికీ సాయంటే ఇష్టం ఇందుకే. సాయికి కూడా వాళ్లంటే వాత్సల్యం, అభిమానం అందుకే! అలా సాయే చెప్పిన తన కథని అనుకుందాం! నాలుగే మార్గాలు ఓ సారి మేం ఓ నలుగురం మాత్రం– అసలు ఈ సృష్టేమిటి? బ్రహ్మపదార్థమేమిటి? బ్రహ్మజ్ఞానమేమిటి? ఈ రహస్యాన్ని స్వయంగా సాధించేసి – దీని గురించిన ఏ అవగాహన లేని ఎందరికో చాలా తేలికగా అర్థమయ్యేలా వాళ్ల వాళ్ల అనుభవానికి వచ్చేసేలా చేసేద్దాం! మనుకుంటూ బయల్దేరి ఓ నిర్జన (ఏ జనమూ ఉండని) వనానికి వెళ్లిపోయాం.ఈ తోవలో నలుగురం నాలుగు మార్గాలని – ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం ఎన్నుకున్నాం! మొదటివాడు – ఎవరో మనని ఉద్ధరిస్తారనుకోవడం శుద్ధభ్రమ. కాలయాపన(కాలక్షేపం) మాత్రమే. మోక్షం కోసం ఎవరినో ఆశ్రయించడం కంటే మనని మనమే ఉద్ధరించుకోగల ప్రయత్నాన్ని ప్రారంభిస్తే చాలు మనం ఉద్ధరింపబడతాం! ఇదే నిజమైన మార్గమంటూ కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు కదా!(ఉద్ధరే దాత్మనాత్మానమ్) అన్నాడు.వెంటనే రెండవవాడు – అసలు అన్నింటికీ కారణం మననందరినీ మంచివైపుకీ చెడువైపుకీ నడిపిస్తూ ఏ మాత్రమూ కనిపించని మనసు మాత్రమే. కాబట్టి మంచిపనికీ (సంకల్పానికీ) ద్రోహం, వంచన, అసత్యం, దర్పం... (వికల్పానికీ) లాంటి వాటిని చేయడానికీ మూలం మనసు మాత్రమే కదా! మూలం అవుతోంది. దాన్ని కాస్తా స్వాధీనం చేసుకోగలిగితే – పులిని బంధించేసిన పక్షంలో అడవి కూడా మన సొంతిల్లులాగా ఎలా తిరగడానికి సాధ్యమైపోతుందో ఆ కారణంగా మనఃస్వాధీనం సరైనదన్నాడు. ఈ ఇద్దరిదీ విన్న మూడవవాడు – ఈ కనిపించే చెట్టూ పుట్టా పదార్థం కాస్తా ప్రళయం వచ్చినప్పుడు మొత్తం ప్ర+లయం(ఒకదానిలో లీనం) అయిపోతుందో ఆ కారణంగా ఇదంతా అనిత్యం. ముగ్గులేసేవాడు ఓ మంచి బొమ్మనిగీస్తాడు. పెద్ద గాలొచ్చినా వానొచ్చినా లేక వానికి వాడే చెరిపేసినా అంత రాజుగారూ కోటా ఏనుగులూ రాజధాని.. అంతా హుష్కాకీయే కదా! అందుచేత ఈ ప్రపంచాన్ని నిత్యంగా భావించకుండా ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లమే– అనే నిర్వేదంతో వైరాగ్యంతో ఉంటే చాలు మోక్షం బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుందన్నాడు.నాల్గవవాడు – పుస్తకాలని చదివీ లోకజ్ఞానాన్ని దానికి మేళవించీ కాలాన్ని వెచ్చిస్తూ అనుభవాన్ని గడిస్తూ నిత్యం దైవాన్ని గూర్చిన అనుష్ఠానాన్ని (జపం ధ్యానం ఉపాసన తపస్సు అర్చన అభిషేకం...) గనుక చేస్తూ ఉంటే బ్రహ్మజ్ఞానం మోక్షం మనకి తప్పక లభిస్తుంది. ఎలా ఒక సుందరభవనంలోనికి ప్రవేశించాలంటే ఆ భవనానికి సంబంధించిన తాళపు చెవి అవసరమో, అలాంటివాడవుతూ ఉపాయాలని బోధించగల గురువుని ఎన్నుకోవడం అతిముఖ్యం. ఆయనంటూ మనకి దొరికాక ఈ శరీరాన్ని మనసునీ దాన్ని అదుపు చేయగల బుద్ధినీ ఆ గురువుకి ‘శరణాగతి’ విధానంతో సమర్పించేసుకుని – ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తూ వెళ్లే చాలు – మోక్షం దానంతటదే సిద్ధిస్తుందన్నాడు. ఇలా గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రం ఆయన మీద స్థిరమైన విశ్వాసం, దానికి తోడుగా ఓపిక (సహనం) అనేవి అవసరమని కూడా చెప్పాడు. అయితే ‘ఆ గురువు వివాదరహితుడూ ధనాభిలాషీమాయావీ... వంటివాడనే విమర్శలకి గురైనవాడేమో గమనించుకుని అలా కానివాడైన పక్షంలోనే అతడ్ని ఆశ్రయించాలని కూడా చెప్పాడు. ఇలానే తర్కవితర్కాలు చేసుకుంటూ మొత్తానికి ఆ వనంలో తిరగడం ప్రారంభించాం బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే అన్వేషణలో మహానుభావులకీ కనిపించిన ఏదైనా దివ్యమార్గం మహాపురుషదర్శనం ఆత్మజ్ఞానం కలుగుతుందేమోనని అడుగు మీద అడుగేసుకుంటూ ఆగకుండా తిరుగుతూనే ఉంటే క్రమంగా మేం వనం నుండి కీకారణ్యంలోకి వెళ్లిపోయాం. ‘ఇలాంటి ప్రదేశాల్లోనే దివ్యపురుషుల దర్శనమవుతుందనుకుంటూ నలుగురం వెళ్తున్నామన్నమాటే గాని ఆకలీ దప్పికా కారణంగానూ శారీరకశ్రమ కారణంగానూ ఓపిక పూర్తిగా నశించింది. నిర్వేదస్థితిలో ఉన్నా బలాన్ని కూడగట్టుకుని వెళ్తున్నాం.‘ఎవరు మీరు? ఎక్కడి కెళ్తున్నారు? ఏం కావాలని వెదుకుతున్నారు? తోవ తప్పారా? తోవ చెప్పనా?’ అంటూ ఓ వంజరి (అడవిలో తిరుగుతూ పక్షుల్ని కొట్టి జీవిస్తూ ఉండే వ్యక్తి) అడిగాడు నలుగుర్నీ. మా అంతటి జ్ఞానం లేని అతనికి మా ధ్యేయం చెప్పడమెందుకని భావించి మళ్లీ ముందుకే ఆశానిరాశలతో సాగిపోబోతుంటే – ‘దట్టమైన అడవి ఇది. ఇక్కడైతే నేనున్నా గాని ఆ మీదట మీకు దారీ తెన్నూ చెప్పేవాడు కూడా ఉండడు. పైగా ఎండ మండిపోతోంది. శోషవచ్చి పడిపోతే... ఆలోచించుకోండి! కొంతసేపు కనీసం విశ్రాంతైనా తీసుకోండి. నీళ్లుతాగి మీకు కావలసిందేమిటో వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి’ అంటూ తాను చెప్పవలసింది చెప్పాడు. మా నలుగురికీ మాకు మేమే సాధించుకోగలమనే అహంకారముంది కదా! మీరు సమాధానం కూడా చెప్పకుండా మరింతగా ఓపిక కూడగట్టుకుని తిరుగుతూ తిరుగుతూ మళ్లీ అతని కంటనే పడ్డాం! అతను ఈసారి ఓ నవ్వు నవ్వి– ‘భగవంతుని సంకల్పం లేనిదే దేనికోసం వెతకాలో తెలియదు. ఎక్కడ వెతకాలో కూడా తెలియదు. తిండిలేని ఈ నీరసశరీరంతో దాహంలో నాలుక పిడచగడుతున్న నోటితో ఇంకా ఇంకా తీవ్రత పెరుగుతున్న ఎండలో ఏం తిరుగుతారు? పైగా తెలిసి ఉన్న చోటుకి కాదుగా మీరు వెళ్తున్నది! అంటూ అందరికీ సరిపడిన అన్నాన్ని తినండన్నాడు. మిగిలిన ముగ్గురూ మాత్రం దాని వైపుకి చూడను కూడా చూడకుండా వెళ్లిపోయారు. నాకు మాత్రం ఆలోచనలు రాసాగాయి. అన్నం పరబ్రహ్మస్వరూపం కదా! అదీ కాక విష్ణువుకున్న పేర్లలో అన్నమే అనేది ఒకపేరు ఆయనకి. అంతేకాక ‘అన్నాద’ (అన్నాన్ని తింటూండేవాడు) అని కూడా ఆయన పేరే కదా! (అన్నమన్నాద పవ చ. సాయికి గీత శ్రీవిష్ణు సహస్రనామాలూ వచ్చుననే విషయం నాలుగైదు సంఘటనల్లో స్పష్టంగా తెలుస్తుంది. వాటిలో ఇదొకటి) స్వార్థం లేకుండా , మా ఆకలిదప్పికలని గమనించి ఓ తల్లిలా పిలిచి అన్నాన్ని పెడుతూ ఉంటే ఇటు ఆధ్యాత్మికంగానైతే హరిని తిరస్కరించినట్లూ అటు లౌకికంగానైతే ఆతిథేయుడ్ని (ఆతిథ్యం ఇచ్చేవాడు) అవమానించినట్లూను అని భావించి అతనిచ్చిన నీరు తాగి ఆహారాన్నితిన్నాను. అది శిక్ష అనిపించలేదు అలా ఆకలి దప్పికలని అతను తీర్చాడో లేదో వెంటనే ఇద్దరు కనిపించారు హఠాత్తుగా నన్ను ఎక్కడికో తీసుకెడతామన్నట్టుగా చేతిని పట్టుకుని వెళ్తూ అప్పటికప్పుడు ప్రత్యక్షమైన గురుమహారాజ్కి అప్పగించారు. గురుమహారాజ్ అంటే అన్ని సందేహాలనీ తీర్చేయగల శక్తిమంతుడని అర్థం. గంభీరకంఠస్వరంతో.. ‘ఎందుకొచ్చారు మీ నలుగురూ? ఏం కావాలనుకున్నారు? వెదుకులాటæ ఎంత వరకొచ్చింది?’ అని అడిగాడు. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. ఆయనకాయనే అన్ని విషయాలనీ దాదాపుగా చెప్పేసేస్తూంటే! నేను మొత్తం చరిత్రని వివరించాను. అంతా తనకి తెలుసున్నట్లుగా విన్నాడాయన. అందుకే ఆశ్చర్యపడలేదు. మమ్మల్ని గురించి వ్యతిరేకధోరణితో మాట్లాడలేదు.‘సరే! నా మాటని తు. చ. తప్పకుండా పాటిస్తావా? నీ వెతుకులాట ముగిసేలా చేసి నీ ప్రయత్నాన్ని సఫలం చేస్తాను. ఇది నీ అంగీకారమైతే నాతోరా!’ అంటూ తన వెంట నన్ను తీసుకువెళ్లిపోయాడు కొంతదూరానికి. అక్కడ నా చేతులూ కాళ్లూ కట్టేసి పెద్దలోతైన బావి నాకు కిందుగా ఉండేలా చేస్తూ నన్ను నూతి గిలక (కప్పీ – నిలువుగా ఉంటూ గుండ్రంగా తిరిగే చక్రం) మీదుగా నన్ను కట్టిన తాడుని ఓ చెట్టు కొమ్మకి తాను కాస్తా నాకు అతని ముఖం కనిపించకుండా ఉండేలా అటు తిరిగి కూర్చున్నాడు.కాసేపయ్యాక అతనంతట అతనే తిరిగొచ్చి! ఎలా ఉన్నావు? ఏమనిపిస్తోంది? అంటూ నా శరీరాన్ని కన్నతల్లిలా ప్రేమ అనురాగ వాత్సల్యాలతో నిమిరి ఒడ్డుకి తెచ్చి కట్లు విప్పాడు.నిజానికి నాకు మాత్రం అదొక శిక్షలా అనిపించలేదు. అలా వేలాడుతున్నంత సేపు ఆ గురుమహారాజ్ మీద మాత్రమే దృష్టి అంతా. అతని రాకమీదనే మనసంతా. అలా కట్టువిప్పాక ఆయన పాదాలమీద పడుతూ ఉంటే నాకు అనిపించింది. తల్లిపక్షి ఎలా తన పిల్లని లోకం కనిపించకుండా రెక్కల్లో దాచి పక్షిబాల్యంలో రక్షిస్తుందో, కోతి ఎలా తన పిల్లని పడకుండా చూసుకుంటూ చెట్లూ గోడలూ ఇంటి మీది నుండి మరో ఇల్లూ దూక్కుంటూ వెళ్తుందో ఆవు ఎలా అప్పుడే పుట్టిన దూడని తన నాలుగుకాళ్ల మధ్యా నిలచెట్టుకుని గర్భవతి అయిన తనకి ఓపిక లేకున్నా ఎలా రక్షించుకుంటుందో... అలాగ. శరీరమంతా పులకలెత్తింది. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఏం కావాలి? అప్పుడు గురుమహారాజ్ నా ఒళ్లంతా నిమురుతూ... ‘నాన్నా! (ప్రేమపూర్వకమైన పిలుపు) నీకేం కావాలని ఆ సమయంలో అనిపించింది? ఆ కాలంలో దేని మీద నీ బుద్ధి నిలిచిపోయింది? ఏం చేస్తూ ఉండిపోయావు?’ అని అడిగాడు. ఆనందాశ్రువులు అలా రాలుతూ ఉండగా చెప్పాను – ‘గురూత్తమా! నాకెవరూ మరొకరు దిక్కులేరు. ఈ గురుమహారాజ్ మాత్రమే నాకు దిక్కు. ఆయనొచ్చి కట్లువిప్పితే చాలు. ప్రాణం నిలుస్తుంది. బతికి బట్టకడతాను. అయినా నా శరీరం మొత్తం ఆయనదే! అనుకుంటూ నిన్నే ధ్యానిస్తూ ఉండిపోయాను’ అన్నాను. అవి హృదయంలో నుండి వచ్చిన మాటలు కాబట్టి గురుమహారాజ్ కూడా ఆ మాటల్ని నమ్మాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరు మాట్లాడినా అవి నాలుక చివరి నుండి వచ్చిన మాటలా? కాదా? అనే విషయం స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. ఆ స్థాయిలో కూడా అబద్ధాన్నే మాట్లాడుతూ ఉంటే ముఖం అంటే కళ్లు మాత్రం నిజాన్ని కక్కేస్తాయి చూపుల ద్వారా. అంతే! గురువు వెంట మూగవాడిగా నడుస్తూ కదిలిపోయాను ఆయన అడుగులో అడుగువేసుకుంటూ. గురువుల్ని గుర్తించండి! భక్తులారా! నన్ను ఆ గురుమహారాజ్ గారి వద్దకి తీసుకెళ్లిన ఇద్దరూ నా తల్లిదండ్రులకి సంకేతమన్నమాట. తల్లీ తండ్రీ అనే వాళ్ల కర్తవ్యమేమంటే తమ సంతానాన్ని సరైన గురువు వద్దకి చేర్చడమే. ఇక ఆ గురువు కర్తవ్యమేమంటే ఈ శిష్యుడ్ని తన పుత్రునితో సమానంగా చూసుకుంటూ ఉండటమే. బంగారాన్నైనా సరే మంటలో వేసి కొద్దిపాటి రాగిని కలపకుండా సుత్తితో కొట్టకుండా ఉన్న పక్షంలో అలాగే గరుకుగా ఉండే ఆకురాతితో గీరకుండా అవసరమైతే సానపట్టకుండా అనుకున్న నగగా మారగలుగుతోందా? మదించిన ఏనుగునైనా సరే తోవలో గోతిలో పడేలా చేయకుండా, ఓ వారం రోజుల పాటు తిండి పెట్టకుండా ఉంటే అది మావటివాని మాట వింటుందా? అలాగే గురువు కూడా కొన్ని పరీక్షలకి గురి చేస్తాడు శిష్యుడ్ని. కేవలం అతడ్ని ఓ ప్రయోజకుడిగా చేయాలనేదే అతని లోనిభావం. పండితులుంటారు లోకంలో. వాళ్లది విజ్ఞాన గర్వం. అంత చదువుకున్నాను. ఇంత చదువుకున్నాననే అహంకార భావం. అంతే కాక ఒకరు చెప్పిందాన్ని ఎలా ఖండించి అవతలివాడ్ని ఓడిద్దామా? అనే కండవాతి తప్పు. ఈ తీరు గురుత్వం వాళ్లలో ఉండదు. వాళ్లకి నచ్చదు. అవసరం కూడా లేదు వాళ్లకి. ఇక మరికొందరుంటారు గురువులు. ఎంతమటుక్కు మహిమల్ని ప్రదర్శించి బేలతనపు భక్తుల్ని నమ్మించడం సొమ్ము కాజేయడం శరీరం నిండుగా బంగారాన్ని ధరించి ఆకర్షించడం... వంటివి వారి లక్షణాలు. పొద్దుటి నుండి రాత్రి నిద్రించబోయే వరకూ ధనసంపాదనకి సంబంధించిన మార్గాలనీ ఉపాయాలనీ దైవం వంకతో చేస్తూ శిష్యవిత్తాలని (శిష్యులసొమ్ముని) అపహరించడమే వాళ్ల లక్ష్యం. ఇలాంటి వారిని సేవిస్తే పవిత్రమైన విలువైన సమయమంతా గడిచిపోయి ఏ తీరు సాధనా లేకుండా శరీరం కాస్తా మరణిస్తుంది. అప్పుడు చింతించే వీలు కూడా ఉండదు. ‘కాబట్టి గురువు మందలించినా అరిచినా తిట్టినా రౌద్రంతో కనిపించినా అదంతా శిష్యుడ్ని తోవలోనికి తేవడానికి మాత్రమే అనే దృష్టితోనే సుమా!’ అని ఓ క్షణం ఆలోచనా దృష్టిని మరల్చిగాని చూసుకుంటే నిజగురువులెవరో.. అధర్మ, అసత్య, వంచన గురువులెవరో..ఇట్టే బోధపడిపోతుంది. కోయిలా కాకీ గుడ్డు దశలో ఒకలానే ఉంటాయి. గుడ్డు పగిలి పిల్ల బయటికొచ్చాక గొంతు విప్పితే చాలు ఆ కంఠస్వరంతో కాకీ కోకిలల తేడా మనకి ఎవరూ చెప్పనక్కర్లేకుండా అర్థమైపోతుంది.గురువుకి శిష్యుల మనసునీ బుద్ధినీ ఆకర్షించగల సత్యధర్మప్రవర్తన ఉండాలి తప్ప వస్త్రాలంకారాలు కాదు ప్రధానం. ఆ అరణ్యంలో అన్నాన్ని ఆ ‘వంజరి’ పెట్టినట్టుగా మీ శిష్యులు అన్నాన్ని (వరి, గోధుమలు, జొన్నలు, రాగులు..) పెడితే చాలు అదే గురువుకి పంచభక్ష్యపరమాన్నాలు కాగలగాలి. గురువుకి శిష్యులే నిజమైన సంతానం కాబట్టి వాళ్లలో ఎవరికి రోగం వచ్చినా గురువే వైద్యుడు కావాలి. వాళ్లలో ఎవరికి సంసారంలో సమస్య వచ్చినా గురువే దాన్ని పరిష్కరించే న్యాయాధిపతి కావాలి. వాళ్లలో ఎవరికి ఆకలి దప్పిక పేదతనం, దారిద్య్రం, ఆత్మహత్యా ఆలోచనం... వంటివొచ్చినా కచ్చితంగా వాటికి నివారణని చేయవలసిన బాధ్యత గురువుదే. అలా చేయగల ఉండగల శక్తీ ఇష్టం తగిన సమయం ఉన్నప్పుడు మాత్రమే ‘గురువు’గా తనకి తాను ఉండగలనని అనుకోవాలి. భక్తులు కూడా అలాంటి వాడ్నే గురువుగా (ఎంతో పరీక్ష చేశాక) ఎన్నుకోవాలి.ఎలా ఆవుదూడని ఓ వంద ఆవుల మందలోకి పంపినా అన్ని ఆవుల్నీ దాటుకుంటూ తన తల్లి పొదుగులో మాత్రమే తలని పెట్టి కుడుచుకుంటుందో అదే మరి గేదె, మేక.. వంటివాటికి ఈ నిర్ణయశక్తి లేదో అలా గురువుగా ఒకరినంటూ ఎంచుకున్నాక అలాగే వారివద్దనే కొనసాగిపోవాలి తప్ప– వస్త్రాలని మార్చినట్లు గురువుల్ని కూడా మార్చుకుంటూపోతే చివరికి ఎవరి మీదా గురి కుదరక చుక్కాని లేని నావలా జీవితం మొత్తం ఎటుకో ఎటుకో వెళ్లిపోతుంది. ఒక జీవితం మొత్తం శూన్యం అయిపోతుంది. – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
శ్రీవిష్ణు సహస్రనామం దాచుకో!
ఎవరైనా ఒక స్వాములవారి దగ్గరికెళ్లి ‘ఈ గ్రంథాన్ని నిత్యం పారాయణ చేయదలచాన’ని చూపించి చెప్తే– ‘మంచిదే గాని దీనితో పాటు దాన్ని కూడా కలిపి పారాయణం చేస్తే విశేషఫల’మంటూ చెప్తారు. లేదా– ‘దీనికంటే ఫలానా గ్రంథమైతే నీకొచ్చిన కష్టానికి ఆ గ్రంథం నప్పుతుంద’ని అనొచ్చు. లేదా– ‘ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను, స్వీకరించి మననం చేసుకుంటూ ఉండు’ అని చెప్పొచ్చు. ఇలాగని స్వాముల వారిని తక్కువ చేస్తూ చెప్పడం దీని అభిప్రాయం కాదు గాని, లోకంలో జరిగే సాధారణ విధానాన్ని చెప్పడానికి మాత్రమే. ఈ నేపథ్యంతో చూస్తే– సాయి దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక గ్రంథాన్ని ఆయన చేతికిస్తూ పరిశీలించవలసిందనే ఆలోచనతో నమస్కరిస్తే– కొందరిచ్చిన పుస్తకాన్ని అలా స్పృశించి వెంటనే భక్తులకు ఇచ్చేస్తూండేవారు. మరికొందరిచ్చిన పుస్తకాన్ని తెరిచి, రెండుమూడు పుటలు తిరగేసి వెంటనే ఇచ్చేస్తూ ఉండేవారు. మరికొందరిచ్చిన పుస్తకాల్ని అలా చూస్తూనే శ్యామాని పిలిచి– ఈ పుస్తకాన్ని భద్రంగా దాచు అంటూ అతనికిస్తూ ఉండేవారు. అందుకని ఎక్కువమంది భక్తులు సాయికి గ్రంథాలను ఇవ్వదలిస్తే– రెండు ప్రతుల్ని తీసుకెళుతుండేవారు. సాయి ఒక ప్రతిని తీసేసుకున్నా, శ్యామాకో మరెవరికో దాచవలసిందని ఇచ్చేసినా తమ పారాయణానికి అడ్డు రానే రాదనే అభిప్రాయంతో. ఎందుకలా సాయి ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క తీరులో ప్రతిస్పందిస్తూ ఉండేవారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. అయితే సాయి చేతి నుంచి ఆ పారాయణం చేద్దామనుకున్న గ్రంథాన్ని తీసుకున్న వాళ్లు మాత్రం దాదాపుగా మోక్షాన్ని పొందినంత ఆనందాన్ని అనుభవిస్తుండేవారు. ఇంతేకాదు, మంచిగ్రంథం అనుకున్న పుస్తకాన్ని కూడా భక్తులు సాయి చేతికిస్తూండేవారు. ‘కాకా’కి భాగవతమంటే ఇష్టం. దాన్ని సాయి చేతికీయగానే రెండు పుటలు తిరగేసి–‘శ్యామా! ఇది నీకు చాలా బాగా ముందు ముందు పనిచేస్తుంది. దాచుకో!’ అని శ్యామాకిచ్చేశారు. ‘బాబా! ఇది మీరు నాకు ఇచ్చేస్తున్నారేమిటి? ఈ పుస్తకం కాకాది’ అన్నాడు శ్యామా. ‘నాకు తెలియదా? అందుకే నీకిచ్చాను. నీకు పనిచేస్తుందని. దీన్ని బట్టలో కట్టి దాచిపెట్టుకో!’ అన్నాడు సాయి.అలాగే ఏకనాథ భాగవతం, పంచరత్న గీతాలు, వివేకసింధు, భక్తి లీలామృత్ వంటి అనేక గ్రంథాలను ఎవరెవరో ఇస్తూ ఉంటే, వాటిని శ్యామాకిచ్చి ‘భద్రంగా దాచు’ అని ఇచ్చేస్తుండేవాడు సాయి. గమనించాల్సిన విషయమేమిటంటే– ఏనాడూ ఆ పుస్తకాన్ని చూస్తూ గాని, చూశాక గాని– ఇది హిందూ ధర్మానికి సంబంధించినది అనే తీరు దృష్టి ఆయన ముఖంలో కనిపించేది కాదు. తానొక మహమ్మదీయుడనే భావాన్ని ఏనాడూ కనపరచేవారు కాదు. ఇప్పటికీ మన హిందూ ధర్మంలో కొందరు ‘ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాం. ఈ మీదట లలితా సహస్రనామాలను చదవద్దు. శివాలయాలకి వెళ్లద్దు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తీర్థాన్ని నంది వెనుక పారబోసెయ్యండి’ అని చెప్పేవాళ్లను చూస్తుంటాం. ఇలా హిందూ ధర్మాన్ని రెండు ముక్కలుగా చేసేవాళ్లని అక్కడక్కడా చూస్తుంటే, రెండు మతాలూ ఒక్కటిగా చూస్తూ, ఆ మత భేద దృష్టి ఉండరాదని చెప్పే సాయి ఎంత ఉన్నతుడు! ఇలా రోజులు జరుగుతూ ఉంటే ఒకసారి ఓ విచిత్రం జరిగింది. మసీదులో విష్ణుసహస్రనామాలు రామదాసు బువా అనే భక్తుడు ఉండేవాడు. ఆయన పరమ నిష్టాపరుడు. ఎప్పుడూ తన అనుష్ఠానాన్ని సక్రమంగా చేస్తుండేవాడు. ఓసారి ఆయన మసీదులో తన అనుష్ఠానాన్ని ప్రారంభించి, సంధ్యావందనం ముగించుకుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రారంభించాడు. నుదుట విభూది రేఖలతో శరీరం నిండుగా శివనామాలతో కాషాయ వస్త్రాలను ధరించి శ్రావ్యంగా ఆ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే ఆయనకి సమయమే తెలియలేదు. ఇవికాక ఆధ్యాత్మ రామాయణాన్నీ, ఇంకా కొన్ని పారాయణలనీ చేస్తూనే ఉన్నాడు. కాసేపటికి పారాయణలన్నీ ముగిశాయి. అంతలో సాయి రామదాసుని పిలిచి– ‘దాసూ! నా కడుపులో పోటుగా ఉంది. నొప్పి తగ్గేలా అనిపించడం లేదు. అంగడికి పోయి సునాముఖీ ఆకును తీసుకురావూ! అన్నాడు. కల్లాకపటం తెలియని వాడూ, అమాయకుడూ సాయి పట్ల చెప్పలేని భక్తిభావం ఉన్నవాడూ అయిన రామదాసు మరుక్షణం పరుగులాంటి నడకతో మందుల వీధి వైపు బయల్దేరాడు. రామదాసు అలా వెళ్లగానే సాయి ఆ పారాయణ పుస్తకాల వద్దకు వెళ్లాడు. ఇంకా మరొకటి పారాయణ చేయవలసి ఉందన్న గుర్తుగా పుస్తకం పుటల మధ్య బయటకి తొడిమ కనిపించేలా పెట్టిన మామిడాకును చూస్తూ రామదాసుకున్న ప్రాచీన ధోరణిని ప్రశంసించుకున్నాడు లోలోపల. అక్కడే విష్ణు సహస్రనామం పుస్తకం కనిపించింది. వెంటనే శ్యామాని పిలిచి– ‘శ్యామా! ఈ పుస్తకం ఏమిటో నీకు తెలుసా? ఒకప్పుడు నాకు గుండె దడదడలాడటం మొదలైంది. కంగారు పడిపోయాను. ఏమవుతుందో తెలియని స్థితికి వెళ్లిపోయాను. ఏమీ తోచక అక్కడే కనిపించిన ఈ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని గుండెల మీద పెట్టుకున్నాను. కొంతసేపటికి నా గుండె చేసిన హడావుడి మొత్తం పోయింది. ప్రశాంతపడ్డాను. ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితాన్ని రక్షించింది ఈ పుస్తకమే’ అంటూ ‘శ్యామా! ఈ పవిత్రగ్రంథాన్ని నువ్వు తీసుకెళ్లు’ అన్నాడు. వెంటనే శ్యామా ‘బాబా! ఈ పుస్తకం నాకొద్దు. అది రామదాసుది. ఆయనెంత అనుష్ఠానపరుడో అంత అనుమానమ్మనిషి. ఈ పుస్తకాన్ని నేను దొంగతనం చేశాననుకుంటూ ఇంకా ఏమైనా పుస్తకాలనీ వస్తువుల్నీ కూడా తానే ఎక్కడో దాచుకుని, అవిగాని పొరపాటున కనిపించకపోతే నన్ను దొంగగా ప్రచారం చేస్తూ పదిమందిలో నా పరువు తీసేస్తాడు. పైగా ఆయనకి కోపం వస్తే వీర చిందులు తొక్కేస్తాడు.నన్నెందుకు అతనికి బలి చేస్తావు? మన్నించు. నాకొద్దు!’ అన్నాడు శ్యామా.మళ్లీ సాయి శ్యామాని చూస్తూ ‘నా ప్రాణాల్నే రక్షించిన గ్రంథమంటూ చెప్పినా, నేనే తీసుకోవలసిందని చెప్తున్నా అలా అంటావేమిటి? నీ దగ్గరుంచుకో! దీనివల్ల ఎంత మంచి జరుగుతుందో నీకు తెలియదు. దాచుకో!’ అన్నాడు. బిక్కముఖం వేస్తూ ‘సాయీ! నాకీ శ్లోకాలను చదవడం రాదు. నా నాలుక బండబారిపోయింది. నోరు తిరగదు కూడా. దాంట్లో ఏవో సంధులూ సమాసాలూ పదాలను విరగ్గొట్టి అర్థం చేసుకోడాలూ నాకు రావు. పైగా తప్పులు చదివితే ఏమవుతుందో? ఎందుకు నన్నిలా ఇబ్బందిపెడతావు? అన్నింటికీ మించి రామదాసుతో గొడవ మామూలుగా ఉండదు. దయచేసి..’ అంటుండగానే, శ్యామా వాక్యం పూర్తి కాకుండానే సాయి ‘శ్యామా! మారు మాటాడకు. ఈ పుస్తకాన్ని నీ వద్దే భద్రం చెయ్యి’ అన్నాడు. శ్యామాకి సాయి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలున్నా కూడా లోలోపల అనుకున్నాడు– ‘ఎందుకింత పట్టుపడుతున్నాడు సాయి? నాకూ రామదాసుకీ కలహం కలిగితే వినోదిద్దామనుకుంటున్నాడా? అయినా ‘వద్దు మొర్రో’ అనుకునే వాడికి అంటగడితే సన్యాసికి పెళ్లి చేసిన చందమే కదా!’ అని. అదే సమయంలో శ్యామా పట్ల ఎంతో వాత్సల్యం అనురాగం ఉన్న సాయి కూడా లోలోపల అనుకున్నాడు. ‘ఎందుకింతగా శ్యామా విరోధిస్తున్నాడు? వైద్యుడు రోగిని గమనించి తీపిమందునే ఇస్తాడా? ఔషధం చేదుగా ఉంటుందని రోగి తీసుకోనంటే వైద్యుడు ‘అలాగే’ అంటాడా? కొండలంతటి పరిమాణంలో పాపాలు ఉన్నా తెగ్గొట్టి వ్యక్తిని ఉద్ధరించేది విష్ణు సహస్రనామం కాదూ! వ్యక్తిగా వందమంది మధ్యలో ఉన్న భీష్ముణ్ణి అలా శ్రీహరిలోనికి అందరూ చూస్తుండగా లీనం అయ్యేలా చేసింది ఈ గ్రంథం కాదూ? సరే! ఈ గ్రంథంలో భక్తినీ శ్రద్ధనీ శ్యామాకి పుట్టించాల్సిందే! నమ్మినవాడికి తోవ చూపించని పక్షంలో గురువుండీ ప్రయోజనమేమిటి?’ అని. ఇలా ఇద్దరూ అనుకుంటూ ఉంటే సాయే స్వయంగా శ్యామా దగ్గరకొచ్చి ఆ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని శ్యామా జేబులోకి నెట్టేసి– ‘శ్యామా! ఇతర కర్మకలాపాలన్నింటికీ నిష్టా నియమం, ఉపవాస విధి, మంచిరోజు, ఉపదేశం పొంది ఉండటం వంటి ఎన్నో విధానాలుంటాయి. ఉన్నాయి. దీనికి అక్కర్లేదు. భీష్ముడు శవాల గుట్టలున్న ప్రదేశంలో కదా దీన్ని చెప్పాడు. పరమ పవిత్రుడైన శ్రీహరి పరస్పర క్రోధావేశాలతో ఒకరినొకరు చంపుకున్న కురుక్షేత్ర ప్రదేశానిక్కదా వచ్చాడు! ఇంతకంటే నీక్కావలసిన సాక్ష్యం ఏమిటి? ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడే చదువుకోగలిగిన పుస్తకం ఇది! నీకు తెలుసో తెలియదో! ఏకనాథ్ మహారాజు కూడా ఈ పుస్తకాన్నే పొరుగింట్లో ఉన్న బ్రాహ్మణుడికి అంటగట్టాడు బలవంతానా. ఆ పొరుగింటి బ్రాహ్మణుడు కులానికి మాత్రమే బ్రాహ్మణుడు తప్ప ఏకోశానా అతనిలో బ్రాహ్మణ ధోరణే కనిపించేది కాదు. ఒక నియమం నిష్ట, పూజ ధ్యానం ఆచారం.. ఇలా ఏదీ అతనిలో కనిపించకపోతుంటే నీలాగే ఆయనా ఎందుకిలా అంటగడతాడు? అనుకుంటేనే ఈ పుస్తకాన్నే బలవంతానా అతనికిచ్చాడు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుని ఇంటికి ప్రతిరోజూ తానే వెళ్తూ శరీరంలోని రోగాలను నిరోధించడానికి పోట్లాడే తెల్ల కణాల్లాంటి జాతి అయిన బ్రాహ్మణులు ఇలా ఆచారం సంప్రదాయం లేకుండా ఉంటే అది సరికాదని భావించి, బ్రాహ్మణుడు చేసే పూజలు వ్రతాలు ధ్యానాల వల్ల లోకం రక్షింపబడుతుందని భావించి ఆ బ్రాహ్మణుని చేత రోజుకి ఒక శ్లోకాన్ని కంఠస్థం చేయించాడు. అర్థాన్నీ భావాన్నీ లో అర్థాన్నీ వివరించాడు. అలా చేయగానే ఆ బ్రాహ్మణుడు వత్తిని పైకి జరిపితే వెలిగే దీపంలా ఆచార సంప్రదాయ ధోరణిలోకి మారిపోయాడు’ అంటూ శ్యామాకి చెప్పాడు. ఏదో విషసర్పాన్ని రాత్రివేళ ఎవరైనా పడుకున్న గదిలోకి విడిచిపెడుతూ– దీనివల్ల మీ దగ్గరకు ఏ దొంగలూ రాలేరన్నట్టనిపించింది శ్యామాకి. అయిష్టంగానే ఆ పుస్తకంతో అలా తన గదికి వెళ్లిపోయాడు శ్యామా. ‘పుండుకి పుడక గుచ్చుకుంద‘న్న సామెతలా ఈ సంఘటన అంతటినీ చూస్తున్న అణ్ణా (చించణకర్) విషయాన్నంతటినీ ముందుకు ముందే అంగడి నుంచి వస్తున్న రామదాసుకి చేరవేశాడు. అణ్ణాది ఎవరైనా కలహించుకుంటే వినోదించే స్వభావం. అందుకే అక్కడిది ఇక్కడికీ, ఇక్కడిది అక్కడికీ చేరవేస్తూ తనదైన కలహభోజనాన్ని సకాలంలో ముగిస్తుండేవాడు.ఇంతలో రామదాసు వచ్చాడు. సునాముఖీ ఆకుని సాయికి ఇవ్వాలనే మాట మర్చిపోయి, శ్యామా గదికి వెళ్లి, ‘శ్యామా! నువ్వే సాయిని మోసం చేస్తూ ఆయనకి కడుపునొప్పి వచ్చిందని చెప్పించి నా పుస్తకాన్ని కాజేశావు! నేనెవరికీ భయపడేవాణ్ణి కాదు.బాబా దొంగతనం చేయవలసిందని ప్రోత్సహించేవాడు కానే కాదు. నువ్వే నీ దొంగబుద్ధికి బాబాని బలిచేస్తూ ఇలా చేశావు. నా పుస్తకాన్ని నాకివ్వకపోయావో ఇక్కడే నా తలని గోడకి కొట్టుకుంటాను– అంటూ శ్యామాని తెగ నిందించసాగాడు. శ్యామా ఏమి చెప్పబోయినా వినిపించుకునే స్థితిలో లేనేలేడు రామదాసు. పెద్ద తుఫానొచ్చాక కొంతసేపటికి ప్రశాంతత వచ్చేటట్టు రామదాసు కోపంతో ఊగిపోవడం తిట్టిపోయడం– అంతా ముగిశాక శ్యామా అతనితో ‘రామదాసూ! ఒకే ప్రశ్న అడుగుతాను. సమాధానం చెప్పు. ఈ పుస్తకాన్ని వజ్రాలతో పొదిగావా? రత్నాలతో అక్షరాలని చెక్కించావా? ఇదేమైనా ప్రపంచంలోనే లభ్యంకాని పుస్తకమా? ఏ అంగడిలో చూసినా వంద ప్రతులు ఉండే పుస్తకం కదా! నేనెందుకు దొంగతనం చేశాననుకుంటున్నావు? పోనీ! నేను పిసినారినా? డబ్బుల్లేనివాడినా? ఎందుకలా నోరు పారేసుకుంటావు? కాలు జారితే వెనక్కి తీసుకోగలం గాని నోరుజారితే వెనక్కి తీసుకోలేం! ఆలోచించు! నీలా వెర్రికోపంతో చిందులు తొక్కే స్వభావం కాదు నాది. ఇక ఆపై నీ ఇష్టం. శాంతిస్తావో– ఇంకాసేపు తిట్టుకుంటావో’ అన్నాడు. శ్యామా పలికిన ఈ మాటలు రామదాసులో ఆలోచన రేకెత్తించాయి. నిజమే కదా! అనిపించేలా అనిపించాయి ఆ మాటలు. రామదాసు కొద్దిగా మెత్తబడినట్లు అనిపించగానే– అంటే ఆలోచనలో పడి తాను చేసింది తప్పే అనే భావంతో ఉన్నాడనిపించగానే శ్యామా మళ్లీ అదే నిదానమైన కంఠస్వరంతో ‘రామదాసూ! నేను మోసగాణ్ణీ, అసత్యాలు పలికేవాణ్ణీ– దొంగతనాలు చేసేవాణ్ణీ అన్నావే! దానికి నేను ఏమాత్రమూ బాధపడను గాని, నువ్వే బాబాతో నాటకమాడించానన్నావే! అది మాత్రం వాడి బాణాన్ని గుండెలో గుచ్చినట్టుగా నన్ను బాధిస్తోంది. ఎందుకంటావా? బాబా ఎప్పుడూ నాటకాలాడేవాడు కాడు. పైగా ఎవరు నాటకాలాడిస్తారా అని చూసేవాడూ కాడు. ఎవరైనా నాటకాలాడుతుంటే సరిదిద్దేవాడు ఆయన! ఇంతకాలం బాబా దగ్గర ఉండి బాబా గురించి ఇలా మాట్లాడటమనేది ఔషధం దొరకని వ్యాధితో బాధపడుతున్న రోగిలా నన్ను కలచివేస్తోంది’ అని ముగించాడు. రామదాసు మరింత ఆలోచనలో పడిపోయి మౌనంగా నిలబడిపోయాడు. అందరికీ తంపులు పెట్టే లక్షణమున్న అణ్ణా చల్లగా జారుకున్నాడు తాను రగిల్చిన నిప్పు అంటుకోలేకపోయిందే అనుకుంటూ. ఇంతలో సాయి ఆ మందిరంలోకొచ్చాడు. నిదానమైన కంఠస్వరంతో రామదాసుని తన దగ్గరికి రమ్మని పిలుస్తూ అతను దగ్గరకొచ్చాక ‘రామదాసూ! ఎందుకు అనవసరంగా అలా ఉద్రేకపడిపోతావు? శ్యామా ఎవరు? మన పిల్లాడులాంటివాడు కదా! అతణ్ణి అలా మసీదు మొత్తం దద్దరిల్లిపోయేలా అరిచెయ్యడం నీలాంటి నిష్టాపరునికీ సంప్రదాయపరునికీ తగునా? ప్రతి పవిత్రగ్రంథాన్నీ నువ్వలా నిష్టగా పారాయణం చేస్తుంటే నేనెంత ఆనందపడతానో తెలుసా? అయినా ప్రతి మంత్రం చివరా ‘ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః’ అంటుంటావే? అది నీలో ఎంత ఉందో ఎప్పుడైనా గమనించుకున్నావా? ఆధ్యాత్మ రామాయణాన్ని పారాయణం చేస్తావుగా రోజూ! మనసుకొచ్చే వికారాలని పోగొట్టుకోవాలని కదా దాంట్లో కనిపిస్తుంది. విష్ణు సహస్రనామాలని చదువుతావు కదా శ్రావ్యంగా. చెవులకింపైన కంఠస్వరంతో పారాయణకాలంలో మమ్మల్ని కూడా కట్టిపడేస్తావుగా!అనేక యుద్ధాలను ధర్మబద్ధంగా మాత్రమే చేశాడు కాబట్టే భీష్ముడు ప్రశాంత స్థితిని పొందగలిగాడు. శ్రీహరిలో లీనం కాగలిగాడు. అహంకారాన్నీ మమకారాన్నీ విడిచిపెట్టాలని చెప్పే ఈ పారాయణాల్ని కేవలం చదివేసి పూజ అయిపోయిందనుకోవడం కాదుగా! ఆచరణలో కొద్దిగానైనా చూపించగలగాలిగా! ఒక చిన్న పుస్తకానికి– ఎక్కడైనా దొరికేదానికి ఇంత రాద్ధాంతం అవసరమా? ఏ చెట్టు తొర్రలో ఉన్న అగ్ని ఆ చెట్టునే దహించివేసేటట్లు నీలోని కోపం నిన్నే...’ అంటూ మౌనంగా ఉండిపోయాడు. రామదాసు తనది తప్పేనని మనఃపూర్వకంగా అంగీకరిస్తున్నట్లు తలాడించి మెల్లగా తలెత్తి నీరునిండిన కళ్లతో సాయికి నమస్కరించాడు. సాయి అన్నాడు– ‘నా కడుపునొప్పి అంతా నాటకమే. నేనే శ్యామాకి ఆ పుస్తకాన్ని ఇవ్వదలచి ఇచ్చాను.’ కొసమెరుపు: ఏ విషయాన్నైనా ఆవేశంతో కేకలతో అరిచేవాళ్లు ప్రశాంతతకి లొంగిపోతారు. శ్యామా అలాగే బాబా మాట్లాడిన సమయంలో రామదాసు ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? లోకంలో అందరూ గమనించుకోగలగాలి. స్వభావమనేది ఒక్కసారిగా పోయేది కాదు. మెల్లగా మెల్లగా కదా పోతుంది. ఇంతా అయ్యాక రామదాసు శ్యామాని చూస్తూ ‘నా పుస్తకానికి బదులు పంచరత్నగీత పుస్తకాన్ని ఇవ్వు’ అని తీసుకున్నాడు. అనుకున్నాం కదా రామదాసు పిసినారి అని. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే– ఇంత గొడవకి కారణభూతమైనది విష్ణుసహస్రనామం కారణంగా కదా! కాబట్టి ఎంతో గొప్పదై ఉంటుందనే భావనతో పట్టుబట్టి శ్యామా విష్ణుసహస్రనామాల్ని చదివి కంఠస్థం చేయడమే కాకుండా, పూర్తి వ్యాఖ్యానాన్ని కూడా ఒక పండితుని ద్వారా తెలుసుకున్నాడు తర్వాతి కాలంలో. (సశేషం) - డా. మైలవరపు శ్రీనివాసరావు -
త్యాగం, సహకారంతో ప్రశాంత జీవనం
కడప కల్చరల్ : ముస్లింలకు ఆరాధనీయమైన పండుగ బక్రీద్‌ను బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు 12 గంటల వరకు కొనసాగాయి. కడపలోని బిల్టప్ వద్దగల ఈద్గాలో నగర వాసులతోపాటు సమీప గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత గురువు ముఫ్తీ మహమ్మద్ న్యామతుల్లా సందేశమిస్తూ మనుషుల్లో త్యాగ గుణం పెరగాలని, సాటి మనుషులతో పరస్పరం సహకరించుకుంటూ ఉన్నప్పుడే ప్రశాంత జీవనం, ప్రపంచ శాంతి సాధ్యమవుతాయన్నారు. ప్రజలంతా తా ము శుభ్రంగా ఉండటమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దైవం సూచించారన్నారు. కేరళలో జల విలయం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బా«ధ్యత సాటి మనుషులుగా మనపై ఉందని పేర్కొన్నారు. అనంతరం పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుసేని సాహెబ్ భక్తులతో సామూహిక ప్రార్థనలు చేయించారు. భక్తులు ఒకరినొకరు హత్తుకుని ‘ఈద్ ముబారక్ హో’అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆరీఫుల్లా, డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వాసు, హరిప్రసాద్, నగర ముస్లిం ప్రముఖులు అమీర్‌బాబు, సుభాన్‌బాష, నాసర్ అలీ, పెద్దదర్గా ప్రతినిధి నయీంతోపాటు నగర వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రార్థనలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఓఎస్డీ అద్నాన్ నయీమ్ అస్మీ పర్యవేక్షణలో పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు రక్షణ చర్యలు చేపట్టారు. -
ఆ కనులు ఆకర్షణ గనులు
ఎంతటివారైనా ఏదో కొంత సమయాన్ని తమతో తాము కాలక్షేపం చేసుకుంటూ గడిపినా, ఆ తర్వాత కొంత సమయాన్నైనా ఎవరితోనైనా గడపాలని అనుకుంటారు. అలా మరొకరితో సమయాన్ని గడపడం కోసం వాళ్లు మరో వ్యక్తి దగ్గరికి పోవడమో లేక ఆ పరిచితుడైన వ్యక్తికి కబురుచేసి రప్పించుకోవడమో చేస్తారు. ఇది లోక సహజమైన విషయం. అయితే సాయి మాత్రం ఎవరి సాంగత్యమూ తనకి అక్కర్లేదన్నట్లుగానే ఉండేవాడు. ఒంటరితనంలోనే – ఎందరితోనో తానున్నట్లుగా అనుకుంటూ ఉండేవాడేమో అనిపించేవాడు. సూర్యుడు అస్తమించాడనగానే మసీదులోకి వెళ్లేవాడు. పడుకోబోయేప్పుడు తన వస్తువులైన చిలుం – పొగాకు – రేకుడబ్బా – సటకాలని తృప్తిగా చూసుకుంటూండేవాడు. తన మోకాళ్ల వరకూ కప్పేస్తూ ఉండే పొడవైన చొక్కా(కఫనీ)ని ధరించి ఆ లోపల ఒక గోచీని ధరించేవాడు. తెల్లని శుభ్రమైన గుడ్డని తలచుట్టూ బిగించి గట్టిగా కట్టుకోవడమే కాక, ఆ మిగిలిన గుడ్డని బాగా మెలితిప్పి ఎడమచెవి వద్ద ముడివేసి ఉంచేవాడు. తన కఫనీకి అక్కడక్కడా చిరుగులున్నా ఎంతో సంతృప్తితో ఉండేవాడు. ఎవరైనా ఆయన్ని చూడ్డానికొచ్చినప్పుడు – తాను చిరిగిన దుస్తులతో ఉన్నాననే తక్కువదనం, బిడియం ఆయనలో ఏమాత్రమూ ఉండేది కాదు. వెనక్కి వేలాడుతూంటే ఆ ముడివేసిన వస్త్రం మిగిలిన భాగం ఓ జడలాగా అనిపిస్తూ ఉండేది, దూరంగా నిలబడి చూస్తుంటే. ఒక్కోసారి ఆ ఎడమచెవి వద్ద వస్త్రాన్ని ముడివేయగా మిగిలిన వస్త్రం అక్కడి నుండి ఎడమభుజం మీదుగా వక్షస్థలమ్మీదికి వేలాడుతూ కనిపిస్తూండేది. ఒక్కోసారి వారం, మళ్లీ మాట్లాడితే పదిరోజులైనా స్నానమే చేయకుండా ఉంటూండేవాడు. పాదాలకెప్పుడూ చెప్పులు ధరించేవాడు కాదు. ఇటు తోటకి వెళ్లినా అటు చావడి వైపుకి వెళ్లినా ఒట్టి పాదాలతో వెళ్లడమే ఆయనకు అలవాటు. తిరిగి తిరిగి వచ్చాక కూచోవాల్సి వస్తే పాతబడి చిరుగులతో కనిపించే ఆ గోనెపట్టాయే అతనికి గొప్ప ఆసనంగా ఉండేది. దాన్నేదో రాజులు వేసుకునే మెత్తని పట్టువస్త్రం తొడిగిన మెత్తని దిండుగా భావించేవాడు. రాత్రింబవళ్లూ ఆ గోనెసంచి అక్కడే ఉండేది. చలి నుండి తనని తప్పించుకోవడానికి అక్కడ ‘ధుని’ (నిరంతరం నిప్పుతో వెలుగుతూండే స్థలం) ఉండేది. మసీదులో దక్షిణానికి ముఖాన్ని పెట్టుకుని, తన ఎడమచేతిని ఆ చిన్న గోడలా ఉండే కట్టడం మీద పెట్టుకుని కూర్చుని కనిపిస్తూండేవాడు. వ్యక్తిలోని అహంకారం, అజ్ఞానం, అవమానభారం, తిరస్కారం, ప్రాపంచికమైన ప్రలోభాలూ... ఇలాంటి వాటన్నింటినీ అగ్నిలో ఆహుతి చేయాలనే దానికి సంకేతంగా ధుని వెలుగుతున్నట్లుగా భావిస్తూ నిరంతరం ఆ ధునినే శ్రద్ధతో, ఏకాగ్రతతో చూస్తూ కాలాన్ని గడుపుతూ, ఎప్పుడూ ‘అల్లా హో మాలిక్!’ అని పైకి అంటూండేవాడు. అహంకారం, అభిమానం అనే రెంటికీ సాక్ష్యంగా ప్రతీకగా రెండే రెండు కర్రలని ఎప్పటికప్పుడు ధునిలో వేస్తూ ఆ అగ్ని ఆరిపోకుండా ప్రజ్వరిల్లుతూ ఉండేలా చూసుకుంటూండేవాడు. ‘అల్లాహ్ హో మాలిక్!’ అంటూ జెండాని ఎగరేస్తూండేవాడు. ఆ మసీదు చాలా ఇరుకుగా ఉండేది. అయినా సరే అదే మసీదులో తిరుగుతూండేవాడు, నిద్రించేవాడు. తనని కలవడానికి వచ్చిన భక్తుల్ని కూడా అక్కడికే రమ్మనేవాడు. మరో విచిత్రమేమంటే బాబాని కలవాలంటే ఆ మసీదులోకి పోవాలి కదా! అది చదును చేయబడిన నేల కాదు. మోకాళ్ల లోతు గుంటలు. చిన్న చిన్న గోతులు. ఎత్తు పల్లాలతో నేల ఉండేది. తన మీద గనక నిజమైన భక్తి, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం ఉంటే ఈ అసౌకర్యాలని లెక్కించరుగదా! అనేది ఆయన దృఢ విశ్వాసం. శారీరక వ్యాధుల్ని నివారించుకోదల్చిన వారూ, మనో వ్యాధుల్ని పోగొట్టుకోదల్చినవారూ, ఆయనని గురించి అనేక విధాలుగా విని ప్రసిద్ధుడైన ఆయన ఎందుకంతటి ప్రసిద్ధిని సంపాదించగలిగారో చూసి పోదామని వచ్చిన వారూ, వారి వెంట వచ్చినవారూ... ఇలా అందరూ ఆ ఇరుకు మసీదులోనే ఆ గుంతలు గోతుల్లోనే వస్తూ అసౌకర్యమనే భావనకి ఏ కోశానా గురయ్యేవారు కాదు. ఆ కారణంగానే రోజురోజుకీ వచ్చేవారి సంఖ్య పెరిగిపోతూనే వచ్చింది గాని తరగనే తరగలేదు. అదే తీరుగా ఇందరు తండోపతండాలుగా తన దగ్గరికొస్తున్నారు గదా! అని ఏనాడూ సాయి తన ఆసనమైన పాతబడిన గోనె సంచినీ, ఇరుకు మసీదునీ, కుట్లూడిన చిరుగులతో కనిపిస్తున్న కఫనీని మార్చుకుందామనే ఆలోచనకీ రాలేదు. ఇదీ నిజమైన ఫకీరు లక్షణమంటే. ఇందరు ఇన్నిమార్లు వస్తూ మరికొందరిని కూడా ఎందుకు తీసుకొస్తున్నారు? రావడంలో, వస్తూ ఉండటంలో రహస్యమేంటీ? కారణమేమిటీ? దయనిండినవీ, దర్శించేవారికి వాళ్ల తప్పుల్ని వారికి అర్థమయ్యేలా వివరించగలిగినవీ, ఓదార్పునిచ్చేవీ, బాధలు తీరిపోతాయనే తీరు ఉపదేశాన్ని మౌనంగా ఇవ్వగలిగినవీ ఆకర్షణకి గనులలాగా ఉన్నవీ అయిన ఆయన ఆ కళ్లే. ఆ రోజున తన గుర్రమే ప్రాణంగా ఉన్న చాంద్‌పాటిల్ అంత ఎండలో అంతటి ఆందోళనలోనూ ఆకర్షించినవి సాయి కళ్లే. ఆయన్ని తన ఇంట్లో అలా ఉంచుకుని నిరంతరం సేవిస్తూ ఉండటానిక్కూడా కారణం ఆ కళ్లే. ప్రతిదానికీ తగిన కారణం కావాలంటూ ఆలోచించేవాడూ, దొరికిన కారణం నచ్చని పక్షంలో, ఏమాత్రమూ నమ్మనివాడూ అయిన అన్నాసాహెబు సాయిని దర్శించిన మరుక్షణంలో ఆయన జీవితాన్ని గ్రంథరూపంలో సాయిచరిత్రగా రాయాలనే ఆలోచనకి శ్రీకారాన్ని చుట్టించినవి కూడా ఆ కళ్లే. పరమ భయంకరుడూ, తన అరుపులతో షిరిడీ గ్రామ ప్రజలకి నిద్రాభంగాన్ని కలిగించేవాడూ, ఎందరు నచ్చజెప్ప ప్రయత్నించినా దగ్గరక్కూడా రానివ్వనివాడూ అయిన రోహిల్లా సాయిని దర్శించడానికి వచ్చి, దర్శించి అక్కడే ఉండిపోయేలా చేసినవి ఆ కళ్లే. ఖండోబా దేవాలయ అర్చకుడూ, సంప్రదాయపరుడూ, బ్రాహ్మణుడూ అయిన మహల్సాపతి ‘యా! సాయీ!’ అని సాదరంగా ఆహ్వానించడానికి కారణం ఆ కళ్లే. దాసగణుకి గంగాయమునలని సాయి చూపించగలడనీ ఆ తీరు దృఢ విశ్వాసాన్ని కలిగించినది ఆ కళ్లే. అందుకే సాయిని దర్శించదలిచి వెళ్లిన అందరూ కూడా దర్శించవలసింది ఆ సాయి నేత్రాలనే. బాధలతో ఉన్నవారికి బాధ నివారిణులూ – మనోవ్యాధితో ఉన్నవారికి ఉన్న మనోధైర్య కారిణులూ – కష్టాలలో మునిగి తేలుతున్న వారికి చేతి ఊతనిస్తాననే విశ్వాసదాయినులూ – సాయికి మరింత దగ్గర కాగలుగుతామన్న ఆనంద విధాయినులూ ఆ కళ్లు. ఆ కళ్లు. ఆ కళ్లే. చూసి తీరాలనే ఆర్తితో... లోకంలో కనిపించే ఎన్నో పక్షుల్ని, పశువుల్ని, మృగాల్ని, సర్పాలని, వాహనాలని, వ్యక్తుల్ని అలా చూసేస్తుంటాం. అన్నింటినీ మన మనసు ఇష్టంతో చూడదు. అలా చూడని పక్షంలో ఆ దృశ్యాన్ని బుద్ధికి పంపించదు. అలా బుద్ధికి చేరని దేన్నీ, ఆ బుద్ధి తనలో దాచదు. ఆ కారణంగా వేటిని మన మనసు గ్రహిస్తుందో, తాను ఆనందించి బుద్ధికి అందజేస్తుందో ఆ దృశ్యాలు మాత్రమే మనకి అనుక్షణం కళ్లముందు కనిపిస్తూ ఉంటాయి. అందుకే శాస్త్రం అంది – ఏదో యథాలాపంగా చూడటాన్ని కేవలం చూడటమనీ, అదే మరి రెండవతీరుగా బుద్ధిలో దాచేంత విధంగా చూడటాన్ని దర్శనమనీ. అందుకే దైవ దర్శనం అంటూంటాం. ఈ నేపథ్యంతో పరిశీలిస్తే సాయిని చూసినవారు కొందరున్నారు. దర్శించినవారు ఎందరో ఉన్నారు. మనం ఎదుటివారిని ఎలా చూస్తామో ఆ చూపుకి ఉన్న లోతుతనాన్ని బట్టే కదా ఎదుటివారు కూడా మనని చూసేది! ఆ కారణంగా కేవలం చూడటమనే పనిని చేసిన ఎందర్నో సాయి ‘రమ్మనలేదు – ఇంకా రావేమిటి? అనలేదు – ఎందుకు రావో చూస్తాననలేదు. నేను రానే రానని చెప్పిన నానా వంటి వారికి మళ్లీ కబురు చేసి మరీ రప్పించుకోకుండానూ ఉండలేదు! ఈ దృష్టిభేదాన్ని మనం గమనించాలి. ‘గౌలిబువా’ అనే తొంభై ఐదు సంవత్సరాల భక్తుడొకాయన ఉండేవాడు. ఆయనకి సాయి మీద కాదు భక్తి. పండరీపురంలో ఉండే విఠ్ఠలపాండురంగని మీదే దృష్టంతా. సంవత్సరంలో ఉండే 12 నెలల కాలంలో 8 నెలలపాటు పాండురంగని (విఠ్ఠలుడు) మీదే బుద్ధిని నిలిపి ఆ పండరీపురంలోనే ధ్యానంలోనే కాలాన్ని గడిపి, ఆ మిగిలిన 4 నెలల కాలాన్నీ గోదావరీ నదీ తీరాన తపస్సు చేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తూండేవాడు. ఆ నెలల కాలమూ కూడా శ్రీహరి యోగనిద్రకి ఉపక్రమించే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ ఉండే కాలంలోనే. అంటే శయన ఏకాదశి (శ్రీహరి యోగనిద్రని ముగించి నిద్రనుండి లేచే రోజు) వరకు మాత్రమేనన్నమాట. ఈ మధ్యలో ఒకసారి గోదావరి ఒడ్డునే ఉంటాడు కాబట్టి షిరిడీకొచ్చి సాయిని కలిసి వెళ్తూండేవాడు. ఇలా చాలాకాలం పాటు జరుగుతూ వచ్చింది. పైన అనుకున్నట్టుగా సాయిని ఆయన చూసి వెళ్తూండేవాడే తప్ప దర్శించి వెళ్లేవాడు కాదు. ఆ కారణంగా సాయి గొప్పదనం సర్వదేవతా సమూహం సాయి అనే భావం ఏనాడూ కలగలేదు ఆ వృద్ధ భక్తునికి. తన సామాను మోసేందుకోసం ఓ గాడిదని వెంటబెట్టుకుని దానికి తగిన ఆహారం మొదలైనవి సమకూర్చేందుకై ఓ వ్యక్తిని తోడు తీసుకుని ఈ 4 నెలలపాటూ గోదావరి ఒడ్డున ఉంటూండేవాడు. అలా ఒకసారి సాయివద్దకొచ్చి సాయిని అనుకోకుండా దర్శనదృష్టితో చూశాడు. అంతే! గౌలిబువా దృష్టి మొత్తం మారిపోయింది. దాంతో పైకి అననే అన్నాడు – సాయి నవరత్నాల్లో వజ్రంలాంటి వాడు. ఏ విధంగానూ ముక్కలు కానిదీ, నాశనం కానిదీ, కోయడానికి అవకాశమీయనిదీ అయిన వజ్రం ఎలా ఆకర్షణీయమైనదో, దృఢమైనదో అలా సాయి కూడా ఎవరికీ వశుడు కానివాడు – అహంకారం లేనివాడు – తన స్థాయిని గమనించి అందరినీ రానీయకుండా ఉంచాలనీ, కొందరినీ రప్పించుకోవాలనీ భావించేవాడు కాడు. ఇదంతా నా పూర్వ ఆలోచన. ఇప్పుడు మాత్రం సాయిని ఆర్తితో భక్తితో దర్శించాక నా ఆలోచనే మారిపోయింది. సాయి నన్ను చూసిన ఆ చూపులకున్న లోతుతనంతో నాకు అర్థమయింది – సాయి నాకిష్టమైన పండరీనాథుడు పాండురంగడే – అని అనేశాడు. మనం కూడా గమనించాలి. దైవాన్ని చూడరాదనీ, దర్శించాలనీ, అలా దర్శించగలిగినప్పుడూ, దర్శించినప్పుడూ మాత్రమే భవదవతార తత్త్వం మనకి గోచరిస్తుందనీ – అలా కాక ఏదో దేవాలయానికి వెళ్లాల్సిన అవసరం అలవాటూ ఉన్నాయనే భావంతోగాని వెళ్తే దేవుణ్ని చూడటమే జరుగుతుందనీ – దర్శించడం వీలు కాదనీ, ఇలా చూసిరావడం వల్ల సమయనష్టం తప్ప ప్రయోజనం ఏ మాత్రమూ ఉండదనీను. అలాంటి ఆర్తితో చూసినప్పుడే అది దర్శనం అనిపించుకుంటుందన్నమాట. కాబట్టి సాయిని దర్శించాలని అర్థం చేసుకుందాం! అహంకారులకి మార్గదర్శనం సాయికి ఇప్పుడు బాబాసాహెబ్ అనే అతనుండేవాడు. అతనింటికే వెళ్లి దాదాపు రోజురోజంతా అక్కడే గడిపేవాడు. అంతటి ఉత్తముడు బాబాసాహెబ్. అతనికో తమ్ముడున్నాడు. పేరు నానాసాహెబ్. అతనికి సంతానం ఎంతకాలానికీ కలగలేదు. ఎదురుచూసి ఎదురుచూసి తన భార్య అనుమతిస్తే రెండో పెళ్లిని కూడా చేసుకున్నాడు. అయినా అతనికి సంతానం కలగలేదు. నానా సాహెబ్ (నానా) తహశీల్దార్ ఉద్యోగాన్ని చేస్తుండేవాడు. ప్రభుత్వోద్యోగి అయిన కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువమందితో పరిచయాలున్నాయి అతనికి. అలాంటి నానాకి సాయి ఓసారి ‘అప్పాకులకర్ణి’ అనే అతనితో కబురు చేశాడు – ఓసారి నానాని చూడాలనుంది. తనవద్దకి రావలసిందని. ఆ మాటల్ని లెక్కచేయకుండా నానా కాలాన్ని గడిపేస్తూ వచ్చాడు. మళ్లీ మళ్లీ కబురుపంపాడు సాయి. దాంతో తనకి కబురు తెచ్చిన కులకర్ణిని నిందిస్తూ – ‘నేనేమీ ఖాళీగా ఫకీరులా లేను. ప్రభుత్వోద్యోగిని. పని ఒత్తిడిలో ఉన్నా’ అంటూ నిష్టూరంగా దెప్పిపొడుపుగాను కూడా మాట్లాడాడు. కులకర్ణి వెళ్లిపోయాక తనలో తాను నవ్వుకుంటూ – ఈ ముస్లిం ఫకీరు దగ్గరికి నేను పోవడమా? మాయా శక్తులూ, మాటల గారడీలూ ఉన్న సాయి దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుంది? పైగా రెవెన్యూ ఉద్యోగం చేస్తున్న నా స్థాయి ఎక్కడ? చెట్టు కింద చెప్పుల్లేకుండా కూచునే సాయి స్థాయి ఎక్కడ? చేతులు కట్టుకుని ఆ ఫకీరు ఎదురుగా నిలబడితే నన్ను గౌరవించే అందరూ నన్ను చూసి నవ్వరూ?’ అని ఆలోచించి రానేరానంటూ సాయికి వర్తమానాన్ని పంపించాడు నానా. అయితే ఆశ్చర్యకరమైన అంశమేమంటే ఎందుకో తెలియదుగానీ నానా సాయిని దర్శించాల్సిన పరిస్థితొచ్చింది. నానా సాయిని చూస్తూనే ‘సాయీ! నన్నెందుకు పిలిపించారు?’‡అని అడుగుతూ ఆయన కళ్లలో కళ్లు పెట్టి చూశాడు. అయస్కాంతం దగ్గరగా ఇనుపవస్తువుని పెడితే ఎలా ఆ వస్తువు కాస్తా ఆ అయస్కాంతపు ఆకర్షణకి గురై అయస్కాంతానికి హత్తుకుపోతుందో, బలవంతాన లాగితే తప్ప ఇవతలికి రాదో అలా నానా కళ్లు సాయి కనుల ఆర్ద్రతనుండి బయటికి రాలేకపోయాయి. అంతటితో ఆగక, ‘నానా! లోకంలో ఎందరు లేరు? అయినా నిన్నే ఎందుకు పిలిపించానంటావు? నువ్వు నీ నోటికొచ్చిన తీరులో మాట్లాడినా మళ్లీ ఎందుకని ఆహ్వానించానంటావు? బాగా ఆలోచించుకో! నీకూ నాకూ మూడు జన్మలనుండీ బంధం ఉందయ్యా! అది నీకు తెలియదు. నాకే తెలుసు. అందుకే ఓసారి చూద్దామని కబురంపాను. నాకో నమ్మకం ఉంది నీ మీద – నువ్వు ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా వస్తావని. వచ్చావుగా!’ అంటూ సాయి మాట్లాడుతూ ఉంటే ఆయన దయార్ద్రమయమైన కళ్లలో తన కళ్లని తిప్పలేక ఉంచిన నానా వెక్కి వెక్కి ఏడుస్తూ, ‘సాయీ! అపరాధం. మహాపరాధం. అపచారం. మహాపచారం అయిపోయింది’ అంటూ ఉండగానే సాయి తన ఎడమచేతిని నానా తలమీద పెట్టాడు. అంతే! సాయి కనిపించలేదు. ఒక క్షణం నానాకి సాయిలో ధర్మమయమైన వింటిని ధరించిన శ్రీరామచంద్రుడు కనిపించాడు. మళ్లీ అంతలోనే జటాజూటాన్ని ధరించి పరమానందంతో ఆశీర్వదిస్తున్న శివుడు దర్శనమిచ్చాడు. మళ్లీ క్షణంలోనే మహా బలిష్ఠుడూ, నవవ్యాకరణ పండితుడూ, అమోఘకంఠస్వరం కలవాడూ అయిన ఆంజనేయుడు కనిపించాడు. నానా తనని తాను నమ్మలేక కలా? నిజమా? అనుకుని నిజమే అని అనిపించాక ‘సాయిదేవా!’ అన్నాడు హృదయపూర్వకంగా. అక్కడి నుండి దైవంతో సమానంగా కొలుస్తూంటే సాయి దర్శనం కారణంగా నానాకి సంతానం కలిగింది. సాయిని చూస్తే సంతానం కలగడమా? అది సాధ్యమేనా? సాధ్యమే! ఎలాగో చూద్దాం! (సశేషం) -
చైనాలో మసీదులపై జాతీయ జెండా
బీజింగ్: దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు అన్ని మసీదుల్లో నిత్యం చైనా జాతీయ జెండాను ఎగురవేయాలని చైనా ఇస్లామిక్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో పాటు చైనా రాజ్యాంగాన్ని, సోషలిస్టు విలువలను తప్పనిసరిగా అభ్యసించాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ఆధీనంలో నడిచే గ్లోబల్ టైమ్స్ ఓ లేఖను ప్రచురించింది. పలువురు చైనా నిపుణులు దీనిని స్వాగతించారు. సోషలిస్టు సమాజాన్ని చదవటం వల్ల మతపరమైన అభివృద్ధి కూడా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం చైనాలో 20 లక్షల మంది ముస్లింలున్నారు. -
నమాజ్ : మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
హర్యానా: మసీదులు, ఈద్గాలు, ఇతర గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే నమాజ్ చేయాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీఎం ఇలా వ్యాఖ్యలు చేసి ఒక్క రోజు కూడా గడవకముందే ఆయన కేబినెట్లోని మరో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖాళీ ప్రదేశాలను ఆక్రమించే పేరుతో నమాజ్ చేయడం సరికాదని, ఆ ఉద్దేశంతో నమాజ్ చేస్తే అనుమతించేదిలేదని మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. గత రెండు వారాలుగా గుర్గావ్లో ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడంపట్ల హిందూ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడం నిషేధించాలని ఆర్ఎస్ఎస్, భజరంగ్‌దళ్ లాంటి పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ తన్వార్ స్పందించారు. మతపరమైన, సాంఘిక కార్యక్రమాలు అనేక ప్రదేశాల్లో జరుగుతాయని, దానికి సరిపడ స్థలం లేని సందర్భంలో బహిరంగ ప్రదేశాలను ఉపయోగించుకోవడంలో తప్పులేదని అన్నారు. ముఖ్యమంత్రి అన్నివర్గాల ప్రజలను సమానంగా చూడట్లేదని, కుల, మత ప్రతిపాదికన విభజించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతపరమైన భావాలతో కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టి, మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. -
‘మసీదుల్లో లౌడ్స్పీకర్లు ఉపయోగించకూడదు’
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది కిందట ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ మసీదుల్లో, ఇతర ఆధ్మాత్మిక ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసి.. దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ రచయిత, కవి జావేద్ అఖ్తర్ కూడా సోనూ నిగమ్‌కు మద్దతు పలికారు. నివాసప్రాంతాల్లోని మసీదుల్లో, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల్లో లౌడ్ స్పీకర్లు వాడరాదని ఆయన తేల్చిచెప్పారు. ‘ఆన్ రికార్డు చెప్తున్నా.. సోనూ నిగమ్‌తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నివాస ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లో, ఆధ్యాత్మిక కేంద్రాల్లో లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు’ అని జావేద్ అఖ్తర్ ట్వీట్ చేశారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సోనూ నిగమ్‌కు సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందంటూ తాజాగా ముంబై పోలీసులు సోనూ నిగమ్‌కు భద్రత పెంచారు. ఈ నేపథ్యంలో జావేద్ అఖ్తర్ ఈ ట్వీట్ చేశారు. -
లౌడ్ స్పీకర్లను కట్టడి చేయండి
సాక్షి, న్యూఢిల్లీ : ఆజా సమయాల్లో మసీదుల్లోని మైకుల నుంచి వచ్చే ధ్వని తీవ్రత స్థాయిలను గుర్తించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బుధవారం ఆదేశించింది. మసీదుల్లోని లౌడ్ స్పీకర్ల నుంచి పరిమితికి మించి శబ్దాలు వస్తుంటే.. తగిన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఛైర్పర్సన్ జస్టిస్ ఎస్.కుమార్ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఢిల్లీ పొల్యూషనల్ కంట్రోల్ బోర్డును ఆదేశించారు. పరిమితులకు లోబడి మాత్రమే లౌడ్ స్పీకర్లు వాడుతున్నట్లు 10 మసీదులు మాత్రమే స్పష్టం చేశాయని చెప్పారు. ధ్వనికి సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చిన మసీదులు మినహా మిగిలిన అన్ని మసీదులను తనిఖీ చేయాలని డీపీసీసీని ఆయన ఆదేశించారు. ఎక్కడైనా అధికంగా ధ్వని వస్తున్నట్లు తేలితే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు
–జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మస్తాన్‌వలీ గూడూరు: మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మస్తాన్‌వలీ తెలిపారు. మంగళవారం ఆయన గూడూరులో మసీదులను పరిశీలించారు. గూడూరులో 6, చనుగొండ్లలో 2, పెంచికలపాడు, బూడిదపాడులలో 1 చొప్పున మసీదుల మరమ్మతులకు నిధులు అవసరమని గుర్తించామని చెప్పారు. ఆయన వెంట స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ పీఎన్ అస్లామ్, మైనార్టీ సంఘం నేతలు ఉన్నారు. -
’ట్రంప్ వచ్చాడు.. ఇక బ్యాగులు సర్దుకోండి’
న్యూయార్క్: ‘ట్రంప్ వచ్చాడు. ఇక మీరు గడియలు లెక్కించుకునే రోజొచ్చింది. యూదుల విషయంలో హిట్లర్ ఎలా చేశాడో.. ముస్లింల విషయంలో ట్రంప్ కూడా అలాగే చేస్తాడు’ అని అమెరికాలోని ముస్లింలను బెదిరిస్తూ కొన్ని లేఖలు అక్కడి మసీదులకు వెళ్లాయి. అమెరికన్స్ ఫర్ ఏ బెటర్ వే పేరిట చేతి వ్రాతతో రాసిన ఈ లేఖలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాలిఫోర్నియాలోని శాన్ జోస్, లాంగ్ పనోమాలో గల మసీదులకు పంపించారు. ఈ లేఖల్లో ఉపయోగించిన భాష, ఉపయోగించిన పదాలు బయటకు చెప్పలేనంత దారుణంగా ఉన్నాయి. ముస్లింలపై తీవ్రమైన విద్వేషం పెంచుకున్నవారే స్వయంగా ఈ పనిచేసి ఉంటారని అనిపించేంతగా ఈ లేఖను రాశాను. ముస్లింలను దుష్టులు, సతాను వారసులు అని అందులో పేర్కొన్నారు. వారు దుష్టశక్తిని పూజిస్తారని.. ఇక వారు గడియలు లెక్కించుకునే రోజు వచ్చిందని, నాడు హిట్లర్ యూదులను ఏం చేశారో ఇప్పుడు ట్రంప్ కూడా ముస్లింల విషయంలో అదే చేస్తారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. తమ దేశంలోని ముస్లింలను ట్రంప్ ఊడ్చిపారేస్తారని, తిరిగి అమెరికాను వెలుగొందేలా చేస్తారంటూ ఆ లేఖలో చెప్పారు. ట్రంప్ తమ కొత్త రక్షకుడని, ఆయన నిండు జీవితం బతకాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలివైన వాళ్లయితే ఇప్పుడే బ్యాగులు సర్దుకుని పారిపోవాలని కూడా హెచ్చరించారు. ట్రంప్ వచ్చిన తర్వాత ముస్లింలకు వ్యతిరేకంగా ఇప్పటికే పలు సంఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. -
ముస్లిం పర్సనల్ లాలో ప్రభుత్వ జోక్యం తగదు
విజయవాడ(లబ్బీపేట) : ముస్లిం పర్సనల్ లా విషయంలో ప్రభుత్వం జోక్యం తగదని, ముస్లిం పర్సనల్ లా(షరియత్)లో ఎలాంటి మార్పు చేర్పులకు అవకాశం లేదని ఖాజి ఎ షరియత్ ముఫ్తీ సయ్యద్ అబ్దుల్ రహీం అన్నారు. ముస్లిం పర్సనల్ లాపై కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ ఆలిండియా పర్సనల్ లా పెద్దల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మసీదుల వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం నగరంలోని ముస్లిం పర్సనల్ లా కార్యాలయంలో పలువురు మత పెద్దలు సమావేశమయ్యారు. యూత్ వెల్పేర్ అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లీ మాట్లాడుతూ భారతదేశం విభిన్న కులాలు, మతాలు, సాంప్రదాయాల సమూహమని, అలాంటి మన దేశంలో అందరికీ ఒకే పద్ధతి, ఒకే సంప్రదాయాల్లో కట్టడి చేయాలన్న ఆలోచన చేయడం శోచనీయమన్నారు. ఇమారత్ ఎ షరియా అధ్యక్షుడు ముఫ్తీ సయ్యద్ మొహసీన్ మాట్లాడుతూ ముస్లిం లా బోర్డు పెద్దల ఆదేశాలను శిరసావహిస్తూ సంతకాల సేకరణలో పాలుపంచుకోనున్నట్లు తెలిపారు. ఈనెల 23న వన్‌టౌన్ పంజా సెంటర్, సనత్‌నగర్ రేకుల మసీదు సెంటర్లలో సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో ముఫ్తి మహమ్మద్ అజహార్, ముఫ్తి మహమ్మద్ అన్సార్, ముఫ్తి మహమ్మద్ రియాజుద్దీన్, వాహిదుల్లా, మఖ్బూల్, సయ్యద్ వలిబాషా తదితరులు పాల్గొన్నారు.