సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ దుందుడుకు వైఖరితో అంబర్‌పేటలోని ఓ స్థలం విషయంలో ఉద్రిక్తత ఏర్పడిందని బీజేపీ సీనియర్ నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ హయాంలో అంబర్‌పేట్‌లో జరిగిన రోడ్డు వెడల్పులో పోయిన ఓ స్థలంలో ప్రార్థనా మందిరం ఉందంటూ ఎంఐఎం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చే నంబర్ చౌరస్తా నుంచి శ్రీరమణ థియేటర్ చౌరస్తా వరకు ఉన్న ముస్లిం శ్మశాన వాటికకు ఇబ్బం ది కావద్దనే ఫ్లైఓవర్ తీసుకొచ్చామని తెలిపారు. మిగతా రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ప్రాపర్టీ కలిగిన 281 మందితో మాట్లాడి నష్టపరిహారంగా గజా నికి రూ.80 వేలు ఇప్పించినట్లు చెప్పారు.
2–2–468 నంబర్ ఇంటిలోని ముగ్గురు అన్నదమ్ములకు ఒక్కొక్కరికి రూ.84 లక్షల చొప్పు న.. రూ.2.5 కోట్ల పరిహారం చెల్లించి గత ఏప్రిల్‌లో ఆ ఇంటిని అధికారులు తొలగించా రన్నారు. మసీదు ఉంటే పరిహారం ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ ఇల్లు ప్రైవేటు ఆస్తి అయినప్పటికీ ఎంఐఎం నేత ఖాద్రీ పోలీసులను అడ్డుపెట్టుకొని అక్కడ మసీదు కట్టారని అన్నారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని, టీఆర్‌ఎస్ కూడా తమ వైఖరేంటో చెప్పాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని స్థానిక కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలతో కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై విచారణ కమిటీ వేసి నివేదిక తెప్పించుకుంటామని సీఎస్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment