న్యూఢిల్లీ: మసీదుల్లోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. పబ్లిసిటీ కోసమే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్న కేరళ హైకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. ‘ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి అసలు మీరెవరు? ఇది మీపై ఎలా ప్రభావం చూపుతుంది? బాధిత వ్యక్తులను మా ముందుకు తీసుకురండి’అని పిటిషన్‌దారుడితో వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ మేరకు వెల్లడించింది. మరోవైపు, ఆర్టికల్ 15 చిత్రంలో కుల విద్వేషాలు, పుకార్లను పెంచే అభ్యంతరకరమైన డైలాగులు ఉన్నందున సీబీఎఫ్‌సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) జారీ చేసిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment