refused
-
బిల్కిస్ బానో దోషులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో రేప్ కేసులో ఇద్దరు దోషులకు శుక్రవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. శిక్ష తగ్గింపును కొట్టివేస్తూ ఈ ఏడాది జనవరి 8న సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును సవాల్ చేస్తూ దోషులు రాధేశ్యామ్ భగవాన్‌దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోనిలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సమాన సంఖ్యలో జడ్జీలు ఉన్న ధర్మాసనం ఇచి్చన తీర్పుపై తామెలా విచారణ చేపట్టగలమని (రెండు ధర్మాసనాల్లోనూ సమంగా ఇద్దరేసి జడ్జీలు ఉన్నందువల్ల) ప్రశ్నించింది. 2002లో గోద్రా అలర్ల అనంతర ఘటనల్లో గర్భవతి బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురు హత్యకు గురుయ్యారు. ఈ కేసులో మొత్తం 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. భగవాన్‌దాస్ షా పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2022 మే 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్ష విధానానికి అనుగుణంగా షాను విడుదల చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో గుజరాత్ ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టు 15వ తేదీన బిల్కిస్ బానో కేసుల యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న 11 మందిని స్రత్పవర్తన కలిగి ఉన్నారనే కారణంతో క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు తలెత్తాయి. వివిధ రంగాలు చెందిన మేధావులు, ప్రముఖులు ఆరు వేల మంది దోషులకు శిక్ష మినహాయింపును రద్దు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఒక లేఖలో కోరారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 8న వారికి శిక్ష మినహాయింపు సరికాదని తీర్పునిచి్చంది. రెండు వారాల్లోగా దోషులందరూ జైలులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. విచక్షణాధికారాలను తప్పుగా వాడారని, అనైతిక పద్దతుల ద్వారా దోషులకు అనుకూలంగా వ్యవహరించారని గుజరాత్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసింది. కేసు విచారణ మహారాష్ట్రలో జరిగింది కాబట్టి క్షమాభిక్షను ప్రసాదించే అధికార పరిధి కూడా ఆ రాష్ట్రానిదేనని, గుజరాత్ ప్రభుత్వం మహారాష్ట్ర అధికారాన్ని చట్టవిరుద్ధంగా లాక్కుందని పేర్కొంది. సమానబలం కలిగిన సుప్రీంకోర్టు ధర్మాసనాలు (రెండూ ద్విసభ్య ధర్మాసనాలే) శిక్ష మినహాయింపుపై పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చాయని, విస్తృత ధర్మాసనానికి ఈ కేసును రిఫర్ చేయాలని పిటిషనర్లు కోరారు. ‘ఇదేం పిటిషన్. ఇది ఎలా విచారణార్హం అవుతుంది? ఇది పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని వేసిన పిటిషన్. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎలా వేస్తారు? సమాన సంఖ్య ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పును మేము సమీక్షించలేం’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లు శుక్రవారం స్పష్టం చేశారు. దీంతో పిటిషన్ల తరఫున న్యాయవాది రిషి మల్హోత్రా తమ వ్యాజ్యాన్ని ఉపసహరించుకోవడానికి అనుమతి కోరారు. ధర్మాసనం దీనికి సమ్మతించింది. భగవాన్‌దాస్ షా మధ్యంతర బెయిల్‌ను కూడా కోరారు. -
లోకేశ్‌ను కలిసేందుకు రైతులు ససేమిరా
జంగారెడ్డిగూడెం రూరల్/కామవరపుకోట: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో బుధవారం నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వెలవెలబోయింది. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి నుంచి పుట్లగట్లగూడెం మీదుగా గురవాయిగూడెం వరకు యాత్ర సాగింది. పాదయాత్ర షెడ్యూల్లో పుట్లగట్లగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే రైతులతో లోకేశ్ ముఖాముఖి ఏర్పాటు చేశారు. అయితే.. రైతుల వద్దకు లోకేశ్ రారని.. రైతులనే లోకేశ్ వద్దకు తీసుకు రావాలని చెప్పడంతో నాయకులు హైరానా పడ్డారు. లోకేశ్ వద్దకు రావాలని రైతులను బతిమాలుకోగా.. తాము రాబోమని రైతులు తెగేసి చెప్పారు. దీంతో టీడీపీ నేతలు తమ బంధువులను, పరిచయం ఉన్న వారిని తీసుకెళ్లి వాళ్లే రైతులని లోకేశ్‌కు చెప్పారు. వారితో ముక్తసరిగా మాట్లాడిన లోకేశ్ యాత్రను ముందుకు సాగించారు. చదవండి: 15 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం -
‘ఇక చూసింది చాలు పడుకో’ అని తల్లి అనడంతో..
ఆ 16 ఏళ్ల కుర్రాడు పొద్దస్తమానం పోన్ చూస్తుండాన్ని గమనించిన తల్లి అతనిని మందలించింది. దానిని తట్టుకోలేకపోయిన ఆ కుర్రాడు అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన యూపీలోని ఇటావా పరిధిలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల రాజు(మార్చిన పేరు) రాత్రంతా మేలుకుని ఫోను చూస్తుండటంతో అతని తల్లి మందలించింది. ‘ఇక చూసింది చాలు పడుకో’ అంటూ అతని నుంచి ఫోను లాక్కొన్ని, స్విచ్ ఆఫ్ చేసింది. అయితే రాజు తన మొండి పట్టుదల వీడక పోను ఇంకా చూస్తానని మొండికేశాడు. అమ్మ లాగిపెట్టి కొట్టిందని.. కుమారుని మొండితనాన్ని చూసిన తల్లి ఆగ్రహంతో అతని చెంప చెళ్లుమనిపించింది. దీంతో రాజు ఆ ఫోనును నేలకేసి పగులగొట్టి, గది తలుపులు వేసుకున్నాడు. కొద్దిసేపటి తరువాత రాజు చెల్లెలు.. గదిలో నుంచి బయటకు రమ్మని అతనిని కోరింది. అరగంట గడిచినా గదిలో నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో రాజు తల్లి అనుమానంతో కిటికీలో నుంచి గదిలోకి తొంగి చూసింది. లోపల రాజు ఫ్యానుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే తల్లి గట్టిగా కేకలు వేసింది. కిందకు దింపి ఆసుపత్రికి తరలించగా.. కుమారుడు ఉన్న స్థితిని చూసిన తల్లి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వారి ఇంటికి చేరుకున్నారు. వారు గది తలుపులు బద్దలుకొట్టి, రాజును కిందకుదించి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, రాజు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ వార్త వినగానే రాజు తల్లి పెద్దపెట్టున రోదించసాగింది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని,మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఏది ఇంపు?.. ఏది కంపు?.. సీక్రెట్ వెనుక సింపుల్ లాజిక్! -
ఈ సీటు నాదంటూ డ్రైవరుతో గొడవ.. చివరికి
ఒక బస్సులో జరిగిన హైడ్రామా చూస్తే ఎవ్వరికైనా పొట్ట చెక్కలైపోవాల్సిందే. ఒక బస్సులో కూర్చోవడానికి ఎక్కడా సీటులేక ఏకంగా డ్రైవర్ సీటులోనే కూర్చుంది ఒక మహిళ. కొద్దిసేపటికి డ్రైవర్ వచ్చి లేవమన్నా లేవలేదు సరికదా కావాలంటే నువ్వే వెళ్లి ఎక్కడైనా కూర్చోమంటూ ఉచిత సలహా కూడా ఇచ్చింది. ఆ మహిళతో పాటు ఆమె అత్తగారు కూడా వాదులాడటంతో వారిని ఒప్పించడం ఆ డ్రైవర్ వల్ల కాలేదు. చివరికి దౌర్జన్యం చేస్తే తప్ప డ్రైవరుకు తన సీటు దక్కలేదు. ఇంకెక్కడైనా కూర్చో.. అర్జెంటు పనిమీద ఎదో ఊరికి ప్రయాణం కట్టిన అత్తాకోడళ్లు బస్ స్టాండ్‌లో ఉన్న ఒక బస్సు ఎక్కారు. అత్తాకోడళ్లలో అత్తకు వెనక ఎక్కడో ఒక సీటు దొరకడంతో వెళ్లి కూర్చుంది. కానీ కోడలు మాత్రం బస్సులో ఎక్కడా సీటు లేక ఖాళీగా ఉందని నేరుగా వెళ్లి డ్రైవర్ సీటులో కూర్చుంది. తీరా బసు డ్రైవర్ వచ్చి అది నా సీటు నేను బసు డ్రైవింగ్ చేయాలి.. వెళ్లి వేరే చోట కూర్చోమని అడిగితే.. ఆ మహిళ ఇది నీ సీటు కాదు నాది, కావాలంటే నువ్వే వెళ్లి వేరెక్కడైనా కూర్చుని బస్సు నడపమని సలహా ఇచ్చింది. కోడలికి అత్త వత్తాసు.. కొద్దిసేపటికి వెనక ఉన్న అత్త కూడా కోడలితో కలిసి డ్రైవరుని దుర్భాషలాడారు. పాపం డ్రైవరుని ఒక్కడిని చేసి అత్తాకోడళ్లు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. చుట్టూ చేరిన జనం కూడా డ్రైవరుకు ఎటువంటి సాయం చేయకపోవడం విదూరం. చివరికి సహనం నశించిన డ్రైవరు ఆమెని బలవంతంగా కిందకు లాగితే గాని తన సీటు తనకు దక్కలేదు. ఎక్కడ జరిగిందో తెలియదు గాని, ఉత్తర భారతదేశంలోనే ఎక్కడో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియోని ఎవరో ఫోన్లో తీసి సోషల మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ సంఘటన జరిగి రెండు నెలలైనా ఇప్పుడు వైరల్ కావడం విశేషం. మొదట ఇదేదో ప్రాంక్ వీడియో అనుకున్న చాలామందికి కొద్దిసేపు అత్తాకోడళ్ల మాటతీరు చూశాక గాని అర్ధం కాదు ఇది సీరియస్ మ్యాటరేనని.. వారికి బస్సు ఎలా నడుస్తుందన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదని. టెక్నాలజీ సాయంతో రాకెట్ వేగంతో కాలం దూసుకుపోతున్న రోజుల్లో ఇలాంటి అమాయకులు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. Indian travel diaries 😂😂😂 Lady and her bahu board a bus and bahu sits in the driver's seat. When the driver asks her to vacate the seat both ladies refuse and ask him to drive the bus from any other seat 😂😂😂 Only in India ! pic.twitter.com/NXScZnUlBG — Shirish Thorat (@shirishthorat) March 12, 2023 ఇది కూడా చదవండి: భర్తను చంపి విలాసవంతమైన జైళ్ల కోసం గూగుల్‌లో వెతికిన భార్య -
జైలు నుంచి రాను..ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధించండి
గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ గుజరాత్ జైలులో ఉన్నాడు. అతన్ని విచారణ నిమిత్తం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కోర్టుకు తరలించాల్సి ఉంది. తన ప్రాణాలకు హాని అంటూ బయటకు వచ్చేందుకు నిరాకరిస్తున్నాడు. గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న తనను ప్రయాగ్‌రాజ్‌కు తీసుకువెళ్తుండగా..ఎన్‌కౌంట్‌లో చంపేస్తారని భయపడుతున్నట్లు అధికారిక వర్గాలు తెలపాయి. అతిక్‌పై కిడ్నాప్, హత్య కేసులు ఉన్నాయి. ఈ కేసు విషయమై విచారణ నిమిత్తం కోర్టుకి హాజరు కావల్సి ఉండగా..అతిక్ మాత్రం ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫర్సెన్స్ ద్వారా ఖరారు చేయండి అని వేడుకుంటున్నాడు. వాస్తవానికి ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్‌కు మార్చి 28న కోర్టులో శిక్ష ఖరారు కానుంది. ఐతే ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న మరో వ్యక్తి ఈ నెల ప్రారంభంలోనే ఎన్కౌంటర్ కాల్పుల్లో చనిపోయాడు. దీంతో అతిక్‌లో భయాలు మొదలయ్యాయి. అతన్ని ఈ రోజు తెల్లవారుజామున కస్టడీలోకి తీసుకోవడానికి ఉత్తర పోలీసులు బృందం సబర్మతి జైలుకి చేరుకోగా..అతిక్ వచ్చేందుకు నిరాకరించాడు. అతడిని కస్టడీకి తీసుకోవడానికి జైలు అధికారులతో అధికారుల బృందం సుదీర్ఘంగా చర్చించింది. అయితే దీనికి సుప్రీం కోర్టు క్లియరెన్స్ అవసరమని జైలు అధికారులు చెప్పినట్లు సమాచారం. కాగా, ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ అన్నారు. అయినా కోర్టు ఆదేశాల మేరకు తాము నడుచుకుంటున్నామని, కోర్టు ఏది చెబితే అదే చేస్తాం అని బ్రజేష్ అన్నారు. ఇదిలా ఉండగా, 2005లో బీఎస్పీ శాసనసభ్యుడు రాజుపాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్ ప్రధాన నిందితుడు. హత్యలో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్‌ను హత్య చేసినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొటున్నారు. ఐతే సాక్షి ఉమేష్‌పాల్ అపహరణకు గురై కిడ్నాప్ కేసు విచారణ రోజే పట్టపగలే హత్యకు గురయ్యాడు. ఈ ఉమేష్‌పాల్‌ని చంపిన వ్యక్తి విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దీంతో అతిక్‌లో భయాలు మొదలయ్యాయి. తనను కూడా విచారణ పేరిట ప్రయాగ్‌రాజ్‌కి తరలిస్తుండగా..ఎన్కౌంటర్లో చంపేస్తారేమోనని భయపడుతున్నాడు అతిక్. అతను తరుఫున న్యాయవాది కూడా విచారణ మాదిరిగానే కోర్టు నిర్ణయాన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారే శిక్ష విధించాలని అలహాబాద్ హైకోర్టులో దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతిక్ అహ్మద్ 100కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. (చదవండి: అపూర్వమైన ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికింది: శశి థరూర్) -
పులి వద్దు.. గోమాత ముద్దు! సుప్రీం ఏమందంటే..
న్యూఢిల్లీ: జాతీయ జంతువుగా రాయల్ బెంగాల్ టైగర్ స్థానే ఆవును ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం.. సోమవారం పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అసలు ఎలాంటి ప్రాథమిక హక్కులు ప్రభావితం అవుతాయి. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడం కోర్టు పనా?.. మేము ఖర్చులు విధించవలసి వచ్చినప్పుడు మీరు అలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తారు?.. అసలు ఇప్పుడు ఏ ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడింది? మీరు కోర్టుకు వచ్చినందునా మేము చట్టాన్ని గాలికి విసిరేస్తామా?’’ పిటిషనర్ తరపు న్యాయవాదిని మందలించింది బెంచ్. పిటిషన్ దాఖలు చేసినందుకుగానూ ఖర్చులు విధించాల్సి వస్తుందని పిటిషనర్ తరపున న్యాయవాదిని బెంచ్ హెచ్చరించింది. దీంతో సదరు న్యాయవాది అభ్యర్థన పిటిషన్‌ను ఉపసంహరించుకోగా, పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఎన్జీవో గోవాన్ష్ సేవా సదన్, ఇతరులు కలిసి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్(పిల్)ను దాఖలు చేసింది. ఇదీ చదవండి: ‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు! కానీ..’ -
కసాయి కొడుకు... కన్న తల్లిదండ్రులనే చంపేందుకు యత్నం
న్యూఢిల్లీ: 34 ఏళ్ల వ్యక్తి కనిపెంచిన తల్లిదండ్రులనే హతమార్చేందుకు యత్నించాడు. ఈఘటన ఢిల్లీలోని ఫతే నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారని కన్నతల్లిందండ్రులనే కడతేర్చేందుకు యత్నించాడు వారి సుపుత్రుడు. ఈ ఘటనలో నిందితుడి తండ్రి స్వర్నజిత్సింగ్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు. తల్లి అజిందర్ కౌర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, కానీ ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని డిప్యూటీ కమిషనర్ ఘనాశ్యామ్ బన్సాల్ తెలిపారు. గాయపడిన బాధితులను హుటాహుటినా దీన్దయాళ్ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఐతే నిందుతుడు దాదాపు రూ. 7 లక్షలు వరకు స్టాక్ మార్కెట్లో పోగొట్టుకున్నట్లు చెప్పారు. దీంతో తన తల్లిదండ్రులు డబ్బులు అడిగాడని, ఐతే వారు ఇచ్చేందుకు నిరాకరించడంతో కోపంతో హతమార్చేందుకు యత్నించాడని వెల్లడించారు. (చదవండి: కొడుకుతో విడాకులకు కోడలు ప్లాన్? వెంటపడి మరీ ప్రాణాలు తీసిన మామ) -
బహుళ అంతస్తుల భవనం... ఏకంగా 127 ఫ్లాట్లు...ఉండేది ఒకే ఒక్కడు!
కాల పరిమితి దాటిని బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చడం సహజం. నివాసితులను అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పి సదరు బిల్డర్లు ఎంతో కొంత డబ్బులు చెల్లించడం వంటివి జరుగుతుంది. అలానే ఇక్కడొక భవనాన్ని కూల్చేయలనుకున్నారు. అందుకోసం నివాసితులను ఖాళీ చేయించారు కూడా. కానీ ఒకే ఒక్కడు మాత్రం ఆ భవనాన్ని ఖాళీ చేసి వెళ్లటం లేదు. ఒంటరిగా అక్కడే ఉంటున్నాడు. వివారల్లోకెళ్తే....బ్రిటన్‌లోని స్కాట్లాండ్లో నార్త్ లానార్క్‌షైర్ కౌన్సిల్లో ఒక బహుళ అంతస్తుల భవనం ఉంది. అందులో ఏకంగా 127 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే నగరానికి దూరంగా ఉండటం పెద్ద పెద్ద గాలులకు అద్దలు పగిలిపోవడం, దొంగలు పడటం తరుచుగా జరుగుతోందని ఫిర్యాదలు రావడంతో ఆ భవనాన్ని కూల్చివేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో ఆ భవనంలోని నివాసితులందర్నీ ఖాళీ చేయించారు. ఐతే ఒకే ఒక్క వ్యక్తి నిక్ విస్నీవ్సీక్ అనే వ్యక్తి మాత్రం ససేమిరా ఖాళీ చేయనని చెప్పేశాడు. పైగా అతనోక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ఆఖరికి కౌన్సిల్ అతనకి సుమారు రూ. 34 లక్షలు తోపాటు మరోచోట అద్దెకున్నందుకు అక్కడ అద్దెను కూడా రెండేళ్ల వరకు చెల్లిస్తామని మంచి ఆఫర్ కూడా ఇచ్చింది. అయినా కుదరదని నిక్ తెగేసి చెప్పేశాడు. దీంతో కౌన్సిల్ అతను వెళ్లిపోవాలని ఆ భవనం శుభ్రం చేయకుండా, సెక్యూరిటీని తీసేసి, పట్టించుకోకుండా వదిలేసింది. అయినా అతను తన ప్లాట్‌ని వదిలి వెళ్లనని, వాళ్లు ఇచ్చే డబ్బులుతో మరో ఫ్లాట్ కొనేందుకు సరిపోవని అన్నాడు. నిక్ రైట్ టు బై స్కీమ్ కింద ఆ ఫ్లాట్‌ని 2017లో కొనుక్కున్నాడు. తాను ఒంటరిగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉంటాననే చెబుతున్నాడు. కౌన్సిల్ మాత్రం ఇది సున్నితమైన సమస్య అతన్ని ఎలాగైన ఖాళీ చేయిస్తానని చెబుతోంది. (చదవండి: Viral Video: ఎంత పెద్ద మనసు ఆ చిన్నారులది!) -
‘కాళ్లు మొక్కుతా సారు.. నాకు వద్దంటే వద్దు’
సాక్షి,జోగిపేట(హైదరాబాద్): కాళ్లు మొక్కుతా నాకు సూది(వ్యాక్సిన్) వద్దు అంటూ ఒక వైపు బతిమిలాడుతూనే మరొక వైపు వైద్య సిబ్బందిని దగ్గరకు రానీయకుండా మొండికేయడంతో అధికారులు నచ్చజెప్పి ఎట్టకేలకు ఆ వృద్ధురాలికి వ్యాక్సిన్ ఇప్పించగలిగారు. ఆదివారం అందోలు మండలంలోని కొడెకల్, డాకూరు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ తీసుకోని వారికి ఇప్పించారు. డాకూరు గ్రామంలో మైదాకుచెట్టు షరీఫాబీ(70) ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి వ్యాక్సిన్ వేసుకోమని కోరగా అందుకు నిరాకరించింది. కాళ్లు మొక్కుతానని, నాకు సూది ఇవ్వొదని మొరపెట్టుకుంది. అక్కడే ఉన్న జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని నచ్చజెప్పారు. ఇంట్లోకి వెళ్లి దాని వల్ల ఏమి భయంలేదని, కరోనా వచ్చినా తట్టుకుంటారని చెప్పి ఎట్టకేలకు వ్యాక్సిన్ వేయించారు. అరగంట సేపు సిబ్బందిని ఇబ్బంది పెట్టిన మహిళ వ్యాక్సిన్ వేసుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని డీపీఓ సూచించారు. చదవండి: వంద కోసం అటెండర్ కక్కుర్తి.. పసి ప్రాణం బలైపోయింది -
షూటింగ్‌కు రాలేనని తేల్చి చెప్పిన జగపతి బాబు!
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత రోజురోజుకూ విజృంభిస్తుంది. ప్రతిరోజూ లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా, విడుదల కావాల్సిన పలు సినిమాలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత దృష్ట్యా షూటింగ్లో పాల్గొనేందుకు సైతం సినీ నటులు ఇష్టపడటం లేదు. తాజాగా ప్రముఖ నటుడు జగపతి బాబు సైతం తాను షూటింగ్‌కి రాలేనని చెప్పేశాడట. ప్రస్తుతం ఆయన అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమాలో నటిస్తున్నారు. శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. అయితే వైజాగ్ షెడ్యూల్లో జగపతిబాబు పాల్గొనాల్సి ఉండగా, ఆయన నో చెప్పినట్లు సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాను షూటింగ్‌కు రాలేనని తేల్చి చెప్పారట జగపతిబాబు. చదవండి : కరోనా వల్ల మేకప్‌మెన్‌గా మారిన ప్రముఖ నటుడు పరిస్థితి విషమిస్తోంది, నా వల్ల కాదు, వదిలేస్తున్నా.. -
సుప్రీంలో ‘ట్రాక్టర్ ర్యాలీ’ పిటిషన్లు తిరస్కరణ
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన గణతంత్ర రైతు పరేడ్ (ట్రాక్టర్ ర్యాలీ)లో చెలరేగిన హింసపై దాఖలైన పిటిషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ట్రాక్టర్ ర్యాలీలో హింసపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్లు తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. పిటిషన్లను తిరస్కరించిన సీజేఐ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనంసున్నితమైన అంశంలో కేంద్రం చట్టపరంగా స్పందిస్తుందని తెలిపింది. దీంతో ఈ పిటిషన్లను ఉపసంహరించుకోవాలని పిటిషనర్లకు సీజేఐ సూచించారు. జనవరి 26వ తేదీన రైతుల గణతంత్ర పరేడ్ (ట్రాక్టర్ ర్యాలీ) హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రైతులు బారికేడ్లు తెంచుకుని.. పోలీసుల అడ్డంకులను దాటి ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. ఈ హింసాత్మకంగా మారిన ఘటనలపై న్యాయవాదులు విశాల్ తివారీ, మనోహర్ లాల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలవడంతో బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ పిటిషన్లన్నింటిని తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ఇది సున్నితమైన అంశమని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా స్పందిస్తుందని ధర్మాసనం తెలిపింది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాలని పిటిషన్లకు న్యాయస్థానం సూచించింది. -
కరోనా అనుమానం.. పేగుబంధానికి దూరం
కరీంనగర్ టౌన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని సైతం దూరం చేసుకునే పరిస్థితిని కల్పించింది. కరోనా అనుమానంతో కన్న తల్లిని కూడా ఇంట్లోకి రావొద్దని కొడుకు అడ్డుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని కిసాన్ నగర్లో నివాసముండే కట్ట శ్యామల (80)కు నర్సింహాచారి, ఈశ్వరాచారి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈశ్వరాచారి మరోచోట అద్దెకు ఉంటుండగా, పెద్ద కొడుకు నర్సింహాచారితో కలసి శ్యామల జీవిస్తోంది. మార్చిలో లాక్‌డౌన్‌కు ముందు సమీప బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో శ్యామల మహారాష్ట్రలోని షోలాపూర్‌కు వెళ్లింది. తర్వాత లాక్డౌన్ విధించడంతో అక్కడే చిక్కుకుపోయింది. ఇటీవల లాక్డౌన్ సడలింపులు, రవాణా వ్యవస్థ పునరుద్ధరణతో బంధువులు ఆమెను రైలులో పంపించారు. గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న శ్యామల.. శుక్రవారం తెల్లవారు జామున కరీంనగర్‌లోని తన ఇంటికి చేరింది. తల్లి రాకను గమనించిన కుమారుడు, అతని భార్య అడ్డుకున్నారు. ‘నీకు కరోనా వచ్చిందనే అనుమానం ఉంది. ఇంట్లోకి రావొద్దు’అని వారించారు. ఇంట్లో పిల్లలు ఉన్నారని వారికీ కరోనా సోకే ప్రమాదం ఉందని గేటు మూసేశారు. దీంతో ఆ వృద్ధురాలికి ఏం చేయాలో తోచక గేటు ఎదుటే గంటల తరబడి కూర్చుండి పోయింది. చిన్న కొడుకుకు విషయం తెలిపినా అతను సైతం తల్లిని తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. స్థానిక కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ వృద్ధురాలికి అల్పాహారం అందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వృద్ధురాలికి స్క్రీనింగ్ నిర్వహించి కరోనా లక్షణాలు లేవని తేల్చారు. పోలీసులు వృద్ధురాలి కుమారుడికి కౌన్సెలింగ్ నిర్వహించారు. కొన్ని షరతులతో కుమారుడు అంగీకరించడంతో ఇంట్లోని ఒక గదిలో శ్యామలను ఉంచారు. కరోనా అనుమానంతో వృద్ధురాలిని ఇంట్లోకి రానివ్వని సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. ఇంటి గేటు ఎదుట కూర్చున్న వృద్ధురాలు శ్యామలకు టిఫిన్ అందజేస్తున్న మున్సిపల్ సిబ్బంది -
నిండు గర్భిణి పురిటి కష్టాలు
కొందుర్గు: కరోనా వైరస్ విజృంభణతో ఓ వైపు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న పరిస్థితుల్లో బాధ్యతతో ఓ వైపు ప్రాణాలొడ్డి సేవలందిస్తున్న వైద్య సిబ్బంది...మరోవైపు నిండు గర్భిణికి పురిటినొప్పులొస్తే రిపోర్టులు లేవన్న సాకుతో వైద్య సిబ్బంది వైద్యం చేసేందుకు నిరాకరించి ఆమెను రాత్రంతా ఆరుబయటే జాగారం చేయించింది. కొందుర్గు మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్న వడ్డె స్వప్న ఉగాది పండుగ కోసం జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని ఎదిర గ్రామంలోని తన పుట్టింటికి వచ్చింది. నిండు గర్భిణి అయిన ఆమెకు శనివారం రాత్రి 12 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబీకులు తరలించారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఏఎన్సీ రిపోర్టులు చూపించాలని స్వప్నను అడుగగా తమ వద్ద లేవని చెప్పింది. రిపోర్టులు తన అత్తగారింట్లో ఉన్నాయని చెప్పినా ఆస్పత్రి సిబ్బంది కనికరించలేదు. రిపోర్టులు లేకుంటే వైద్యం చేయమని చెప్పి కనీసం ఆస్పత్రిలోనికి కూడా అనుమతించకపోవటంతో చేసేదేమీలేక స్వప్న తన మూడేళ్ల కుమారుడు, తల్లి యాదమ్మతో కలిసి పీహెచ్సీ వద్ద ఉన్న ఓ దుకాణం ఎదుట రాత్రంతా జాగరణ చేసింది. ఆదివారం ఈ విషయమై స్థానికులు ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించగా..స్వప్న ప్రసవానికి ఇంకా సమయం ఉందని, పీహెచ్సీలో పేషెంట్‌తోపాటు మరొకరు మాత్రమే ఉండాలని సూచించగా గర్భిణితోపాటు కుటుంబీకులు బయటకు వెళ్లారని స్టాఫ్‌నర్స్ సలోమి తెలిపారు. అనంతరం కుటుంబీకులు స్వప్నను షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. -
రంజీలు కాదు.. దేశమే ముందు
కోల్‌కతా: భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో రంజీ ఫైనల్ ఆడించాలనుకున్న సౌరాష్ట్ర క్రికెట్ సంఘా నికి (ఎస్సీఏ) నిరాశ ఎదురైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... జడేజా రంజీ ఫైనల్ ఆడేందుకు అనుమతి నిరాకరించాడు. దేశమే ముందని, ఆ తర్వాతే ఏదైనా టోర్నీలని గంగూలీ తెగేసి చేప్పేశాడు. టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. ఈ నెల 12న ధర్మశాలలో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది. మరోవైపు సోమవారం నుంచి రాజ్‌కోట్‌లో సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ జరుగనుంది. కీలకమైన ఫైనల్స్‌లో జడేజాను ఆడించేందుకు ఎస్సీఏ అధ్యక్షుడు జయదేవ్ షా బీసీసీఐ చీఫ్ గంగూలీని కోరాడు. కానీ తన అభ్యర్థనను గంగూలీ తిరస్కరించాడని షా చెప్పాడు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జయదేవ్ రంజీ ఫైనల్ ఉన్నప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించరాదన్నాడు. ‘ఐపీఎల్ ఉన్నపుడు బోర్డు అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించదు. ఎందుకంటే లీగ్ ద్వారా బాగా డబ్బు వస్తుంది. రంజీ ట్రోఫీకి ఆదరణ దక్కాలంటే స్టార్ ఆటగాళ్లను ఆడించాల్సిందే. ఆ దిశగా బోర్డు ఆలోచించాలి. రంజీ ఫైనల్ జరిగే రోజుల్లో అంతర్జాతీయ మ్యాచ్ లేకపోతే స్టార్ ఆటగాళ్లందరూ అందుబాటులో ఉంటారు. మ్యాచ్ రసవత్తరంగా జరిగేందుకు అవకాశముంటుంది. ఆదరణ కూడా పెరుగుతుందని జయదేవ్ షా తెలిపాడు. -
మసీదుల్లోకి మహిళల వ్యాజ్యం కొట్టివేత
న్యూఢిల్లీ: మసీదుల్లోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. పబ్లిసిటీ కోసమే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్న కేరళ హైకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. ‘ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి అసలు మీరెవరు? ఇది మీపై ఎలా ప్రభావం చూపుతుంది? బాధిత వ్యక్తులను మా ముందుకు తీసుకురండి’అని పిటిషన్‌దారుడితో వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ మేరకు వెల్లడించింది. మరోవైపు, ఆర్టికల్ 15 చిత్రంలో కుల విద్వేషాలు, పుకార్లను పెంచే అభ్యంతరకరమైన డైలాగులు ఉన్నందున సీబీఎఫ్సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) జారీ చేసిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. -
బాత్రూమ్లో జననం.. కొద్దిసేపటికే మరణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఘోరం జరిగింది. నిండు గర్భిణిని హాస్పిటల్లో చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరించడంతో బాత్రూమ్లో బిడ్డకు జన్మినిచ్చింది. రైల్వే స్టేషన్ బాత్రూమ్లో జన్మించిన శిశువు సరైన వైద్యం అందక కొద్దిసేపటికి మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఈత్ రైల్యే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్యే అధికారుల సమాచారం ప్రకారం.. ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతు రైల్యే స్టేషన్‌కి వచ్చిందని, నొప్పులు ఎక్కువ్వడంతో స్టేషన్‌లోని బాత్రూమ్లో శిశువుకు జన్మనిచ్చిందని తెలిపారు. తమకు విషయం తెలిసిన వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చామని, కానీ అంబులెన్స్ వచ్చేలోపే శిశువు మరణించిందని రైల్యే అధికారులు తెలిపారు. గర్భిణిని హాస్పిటల్ సిబ్బంది ఎందుకు తిరస్కరించారో కారణం మాత్రం తెలియలేదు. -
కాపాడండయ్యా!.. కనికరం చూపని ఖాకీలు
సహరన్పూర్ : రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రెండు ప్రాణాలు.. తమను కాపాడాలంటూ వేడుకోలు... స్థానికులు కూడా బతిమిలాడారు. అయినా కనికారం చూపని ఖాకీలు. సాయం కోరితే దారుణమైన సమాధానాలు ఇచ్చారు. వెరసి వారి ఉదాసీనత మూలంగా కళ్ల ముందే ఆ యువకులు ప్రాణాలు కోల్పోయారు. యూపీలో ఈ హేయనీయమైన ఘటన చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి సహరన్‌పూర్‌లో అర్పిత్ ఖాన్, సన్నీ అనే ఇద్దరు యువకులు మోటర్ బైక్‌పై వెళ్తుండగా యాక్సిడెంట్‌కి గురయ్యారు. అర్ధరాత్రి కావటంతో జన సందోహం పెద్దగా లేదు. అటుగా వెళ్తున్న కొందరు యువకులు అది గమనించి 100 కి డయల్ చేశారు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ వాహనం అక్కడికి వచ్చింది. కానీ, వారిని వాహనంలోకి ఎక్కించుకునేందుకు అందులో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు నిరాకరించారు. ‘‘వారిని వాహనంలోకి ఎక్కిస్తే సీట్లకు రక్తపు మరకలు అంటుకుంటాయి’’ ... ఇది ఆ కానిస్టేబుళ్లు ఇచ్చిన సమాధానం. దీంతో కంగుతిన్న స్థానికులు అటుగా వెళ్తున మరికొన్ని వాహనాలను ఆపేందుకు యత్నించారు. అయితే ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో ఓ వ్యక్తి ‘‘ ఏ తల్లి కన్న పిల్లలో... కాపాడండి. అవసరమైతే ఆ రక్తపు మరకలను నేను శుభ్రచేస్తా.. సాయం పట్టండి అని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కారు కడిగితే.. రాత్రంతా తాము ఎక్కడ పడుకోవాలని? వారు సమాధానం ఇవ్వటంతో మళ్లీ అవాక్కవ్వటం ప్రజల వంతు అయ్యింది. కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కూడా ఆ ఇద్దరు యువకులు తమను కాపాడంటూ అక్కడున్నవారిని వేడుకోవటం కదిలించి వేసింది. ఇంతలో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి మరో వాహనం అక్కడికి చేరుకుంది. కానీ, అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. యువకులను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. తీవ్ర రక్తస్రావంతో అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్పందించిన ఉన్నతాధికారులు... పోలీసులు సాయానికి నిరాకరించిన ఎపిసోడ్ అంతా ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వదలటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం అన్ని మీడియా ఛానెళ్లలో ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో సహరన్పూర్ పోలీస్ ఉన్నతాధికారి ప్రబల్ ప్రతాప్ సింగ్ ఘటనపై స్పందించారు. ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌చేసినట్లు ఆయన వెల్లడించారు. ఘటనపై పూర్తి దర్యాప్తు తర్వాత వారిపై మరిన్ని చర్యలు ఉంటాయని ప్రకటించారు. "Don't want blood stains in car": 2 teens die as UP cops refuse help Read more here: https://t.co/qkcaRJtwkj pic.twitter.com/M3LuZnYnqd — NDTV (@ndtv) 20 January 2018 -
భూ సర్వేను అడ్డుకున్న రైతులు
పరిహారంపై స్పష్టత ఇవ్వాల్సిందేనని డిమాండ్ పుట్లూరు : అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం తమ భూములకు అందించే పరిహారంపై స్పష్టత ఇవ్వాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత నెల రోజులుగా ఎక్స్‌ప్రెస్ హైవే కోసం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసిన అధికారులు మండలంలోని దోశలేడు, కడవకల్లు, కందికాపుల, గాండ్లపాడు రెవిన్యూ గ్రామాల్లో రోడ్డు మార్గం వెళ్లే సర్వే నంబర్లను గుర్తించారు. రోడ్డు కోసం 150 మీటర్ల వెడల్పుతో భూములను సేకరించడం కోసం హద్దులను ఏర్పాటు చేయడానికి మండలానికి నలుగురు సర్వేయర్లను కూడా నియమించారు. అయితే మంగళవారం ఓబుళాపురం, కడవకల్లు గ్రామాలకు వెళ్లిన సర్వేయర్లను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. తాము అరటి పంట సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని భూములను కోల్పోతే జీవనాధారం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే చేయడానికి ముందు అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం సేకరించే భూములకు ఎంత పరిహారం ఇస్తారన్న విషయంపై తమకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము సర్వే చేస్తున్నామని వారు రైతులకు తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్న రైతులు భూములకు అందించే పరిహారంపై స్పష్టత ఇవ్వాలని వినతి పత్రం అందించారు. స్థానిక భూ విలువను బట్టి పరిహారం అందించాలన్నారు. -
అమ్మకు అవమానం
- కన్నకొడుకులే కర్కశులుగా మారిన వైనం - పోషణకు వాటాలు వేసుకున్న కఠినాత్ములు - చనిపోయినా అంత్యక్రియలకు ముందుకు రాని కొడుకులు పార్వతీపురం(విజయనగరం జిల్లా): 'నపుత్రస్య గతిర్నాస్తి' అన్నది ఆర్యోక్తి. తలకొరివి పెట్టేందుకు కొడుకులు కావాలన్నది దాని అంతరార్థం. కానీ, తల్లి రుణం తీర్చుకోవడానికి వంతులు వేసుకున్నారు ఈ కుమారులు. అంతేకాదు... ఆమె మరణిస్తే కనీసం అంత్యక్రియలు చేసేందుకు సైతం ముందుకు రాకుండా అనాథలా శవాన్ని శ్మశాన వాటికలో వదిలేసిన సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో చోటు చేసుకుంది. పార్వతీపురం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి స్వర్గీయ వారణాసి బాలకృష్ణ మరణానంతరం అతని భార్య వారణాసి కమలమ్మ(70)ను, ఆమె ముగ్గురు కొడుకులు వారణాసి మోహనరావు(మందులషాపు నడుపుతున్నారు), వారణాసి శ్రీహరి(ఏజన్సీలు నడుపుతున్నారు), వారణాసి శ్రీనివాసరావు(విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు) తలో నాలుగు నెలలు పోషించేందుకు వాటాలు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని మూడో కొడుకు వద్ద ఉన్న కమలమ్మను నాలుగు నెలలు పూర్తికావడంతో శనివారం కారులో పార్వతీపురంలో ఉన్న మరో కొడుకు వద్దకు తీసుకువస్తున్నారు. కారు బొబ్బిలి సమీపానికి చేరుకోగానే ఆమె మృతి చెందింది. వైజాగ్ నుండి తీసుకువస్తున్న కొడుకు చనిపోయిన తన తల్లి మృతదేహాన్ని విశాఖపట్టణానికి తీసుకువెళ్లలేక, పార్వతీపురం, మక్కువలో ఉన్న తన సోదరుల ఇళ్లకు తీసుకెళ్లేందుకు యత్నించగా వారు నిరాకరించారు. దీంతో చేసేది లేక పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ మధ్యాహ్నం వరకు ఉంచి చివరకు రాయగడ రోడ్డులోని శ్మశాన వాటికకు చేర్చాడు. అక్కడ అంత్యక్రియలు పూర్తచేసేందుకు కూడా మిగిలిన ఇద్దరు కుమారులు రాలేదు. విషయం తెలుసుకున్న కమలమ్మ బంధువులు శ్మశాన వాటికకు చేరుకున్నారు. కుమారులు అనుసరిస్తున వైఖరిపై పట్టణ పెద్దలకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ బెలగాం జయప్రకాష్‌నారాయణ, గుంట్రెడ్డి రవి, వారణాశి విస్సు, పట్నాన కిరణ్ తదితరులు శ్మశాన వాటికకు చేరుకొని ఆ ముగ్గురు కొడుకులకు చీవాట్లు పెట్టి ఆ మాతృమూర్తికి దహన సంస్కారాలు జరిగేలా చూశారు. -
బంగారం వద్దు.. మొక్కలే ముద్దు...!
ఆ సందర్భం దంపతుల పర్యావరణ స్పృహకు మారుపేరుగా... ప్రకృతి ప్రేమికులకు ప్రేరణగా మారింది. పెళ్ళిలో సంప్రదాయానుసారం అందించే బంగారం, డైమండ్స్ కు బదులుగా అత్తమామలను వధువు... బహుమతిగా మొక్కలు కావాలని కోరడం... మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ కు 80 కిలోమీటర్ల దూరంలోని భిండ్ జిల్లా కిసిపురా గ్రామమంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమం ప్రకృతి ప్రేమకు మారుపేరుగా నిలిచింది. 22 ఏళ్ళ సైన్స్ గ్రాడ్యుయేట్, వధువు ప్రియాంక తన అత్తవారు బహుమతిగా ఇచ్చే బంగారు నగలకు బదులు పచ్చని మొక్కలు కావాలని కోరడం ప్రత్యేకతగా నిలిచింది. ముందుగా అత్తమామలను ఆమె అభ్యర్థన ఆశ్చర్య పరచినా... చివరికి ఆమెలోని ప్రకృతి ప్రేమను అర్థం చేసుకున్నారు. ఆధునిక కాలంలోనూ పర్యావరణంపై శ్రద్ధ చూపిస్తున్న వ్యక్తి కోడలుగా రావడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు. తనకు కాబోయే భార్య సంపద కంటే పర్యావరణంపై అధిక శ్రద్ధ చూపిస్తున్నతీరు ఎంతో ఆనందం కలిగించిందని వరుడు రవిచౌహాన్ ఓ పత్రికకు తెలిపారు. ఆభరణాల స్థానంలో ఆమె 10,000 మొక్కలను కోరడం నిజంగా అభినందించాల్సిన విషయమన్నారు. అడవులను నరికేస్తున్న నేపథ్యంలో పచ్చదనం క్షీణించి పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని, ముఖ్యంగా మధ్య ప్రదేశ్ లో ఈ కారణంగా భూమిలో నీరు ఎండిపోయి తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని వధువు ప్రియాంక తెలిపారు. . పంట నష్టాలతో తీవ్ర నిరాశ చెందిన తన తండ్రే ఇందుకు సాక్ష్యమని, పరావరణాన్ని రక్షించాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు. గ్లోబల్ వార్మింగ్ నుంచి బయటపడాలంటే పచ్చదనాన్ని పెంచాలన్న విషయాన్ని చిన్నతనంలోనే గుర్తించిన ప్రియాంక పెళ్ళి సందర్భాన్ని అందుకు అనువుగా మలచుకున్నారు. తాను కోరిన పదివేల మొక్కల్లో ఐదు వేలు తన తండ్రి ఇంట్లో, మరో ఐదు వేలు అత్తమామల ఇంట్లో పాతాలన్న యోచనతోనే మొక్కలను బహుమతిగా కోరానన్నారు. చిన్నతనంనుంచే పర్యావరణంతో అనుబంధాన్ని పెంచుకున్నానని, రైతులకు, కార్యకర్తలకు మొక్కలను పంచి పచ్చదనాన్ని మరింత పెంచాలన్నదే తన ఆశయమని ప్రియాంక చెప్తున్నారు. ఏప్రిల్ 22 న జరిగిన వివాహం అనంతరం దంపతులిద్దరూ గ్రామంలో రెండు మామిడి మొక్కలు పాతామని, అవి వాతావరణాన్ని రక్షిస్తాయన్న నమ్మకం ఉందని ఆమె చెప్తున్నారు. ఇకనుంచి ప్రతి పెళ్ళి రోజునాడు క్రమం తప్పకుండా మొక్కలు పాతే కార్యక్రమం చేపడతామని ప్రియాంక వెల్లడించారు. -
వైద్యం చేయనందుకు డాక్టర్ని కాల్చిచంపాడు
డెహ్రాడూన్: అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడికి చికిత్స చేయడానికి నిరాకరించిన డాక్టర్ ను ఓ వ్యక్తి కాల్చిచంపిన ఘటన ఉత్తరాఖండ్ లోని ఉద్ధవ్ సింగ్ నగర్ లో చోటు చేసుకుంది. సీనియర్ ఎస్పీ అనంత్ శంకర్ తక్ వాలే కథనం ప్రకారం.. నగరానికి చెందిన మానిక్ రాఠీ కుమారుడు (ఏడాదిన్నర వయసు) అతిసార వ్యాధితో బాధపడుతున్నాడు. మానిక్ రాఠీ తన కుమారుడిని తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వైద్యునిగా పని చేస్తున్న ఎస్ కే సింగ్ ఇంటికి వెళ్లాడు. తన కొడుకు పరిస్థితి విషమంగా ఉందని వైద్యం చేయమని కోరాడు. ఆ డాక్టర్ వైద్యం చేయడానికి నిరాకరించడంతో ఇతర వైద్యులను సంప్రదించాడు. అప్పటికే కొడుకు మృతిచెందడంతో మానిక్ రాఠీ ఆగ్రహించాడు. ఎస్ కే సింగ్ ను తుపాకీతో కాల్చి చంపాడు. గతంలో రాఠీపై ఆర డజను కేసులున్నాయని, అతనిపై రౌడీ షీట్ కూడా ఉందని అనంత్ శంకర్ తెలిపారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
మెదక్: బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్న ఘటన మెదక్ మండలం గాజిరెడ్డిపల్లిలో గురువారం చోటు చేసుకుంది. సీడీపీఓ విజయలక్ష్మి కథనం ప్రకారం...గాజిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉప్పలం బొందయ్య-బాలమ్మ దంపతుల కుమారుడైన కుమార్(18)కు అదే మండలం హవేళి ఘణాపూర్‌లోని ఓ 18 యేళ్ల బాలికను ఇచ్చి వివాహం చేసేందుకు ఇరువురు తల్లిదండ్రులు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న సీడీపీఓ విజయలక్ష్మి తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఇరువర్గాల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వయస్సు నిండకుండా పెళ్లి చేస్తే శారీరకంగా, మానసికంగా అనేక అనర్థాలు ఏర్పడి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులతోపాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
వేధింపులు తట్టుకోలేక.. బస్సులోంచి దూకేసింది
జంషెడ్పూర్: ఒక ప్రైవేటు బస్సులో ఇద్దరు దుర్మార్గులు వేధింపులకు పాల్పడడంతో ఓ మైనర్ బాలిక బస్సులోంచి దూకేసిన ఘటన జార్ఖండ్ లో కలకలం రేపింది. స్కూలునుంచి ఇంటికి తిరిగివస్తున్న బాలిక పై దుండగులు వేధింపులకు తెగబడ్డారు. ఆమె సహాయం కోసం అర్ధించినా ఫలితం లేకపోయింది. దీంతో తనను తాను రక్షించుకునే క్రమంలో బస్సులోంచి అమాంతం దూకేసింది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న అమ్మాయిపై ఇద్దరు దుర్మార్గులు శనివారం సాయంత్రం జంషెడ్ పూర్ లో వేధింపులకు పాల్పడ్డారు. తనకు సాయం చేయాల్సిందిగా అరిచి గోలపెట్టినా పట్టించుకోలేదు. ఆ సమయంలో సుమారు ఇరవై మంది దాకా ప్రయాణికులున్నా ఎవరూ స్పందించలేదు. దీంతో ఆ నీచులు మరింత రెచ్చిపోయారు. ఇక గత్యంతరం లేని స్థితిలో ఆ బాలిక కదులుతున్న బస్సులోంచే దూకేసింది. దీంతో కాళ్లు విరిగిపోయాయి. తలకు, ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరు నిందితులు బస్సు ,డ్రైవర్, కండక్టర్ స్నేహితులను సీనియర్ పోలీసు అధికారి అనూప్ మాథ్యూ తెలిపారు. బస్సు డ్రైవరును, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, బస్సు కండక్టర్ పరారీలో వున్నాడన్నారు. కేసు నమోదు చేశామని దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. -
భారత జవాన్ల 'ఈద్' మిఠాయిలను తిరస్కరించిన పాక్
వాఘా: ఇప్పుడప్పుడే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితులు తలెత్తకముందే.. 'పొరుగు దేశం మిఠాయిలు చేదు' అన్నట్లుగా వ్యవహరించింది దాయాది పాకిస్థాన్. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పండుగల సందర్భంలో పరస్పరం పలకరించుకొని, మిఠాయిలు తినిపించుకునే సంప్రదాయానికి తెరదించింది. సరిహద్దుల్లో దశాబ్దాలుగా సాగుతోన్న పండుగ చెలిమికి మంగళం పాడింది. శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకుని సరిహద్దు రక్షక దళం (బీఎస్ఎఫ్) ఇవ్వజూపిన మిఠాయిలు స్వీకరించేందుకు పాక్ సైనికులు నిరాకరించారు. ఈ ఉదయం వాఘా సరిహద్దు వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశమైంది. వాఘానే కాకుండా భారత్- పాక్ సరిహద్దుల్లోని ముఖ్యమైన స్థావరాన్నింటివద్దా ఇలాంటి పరిస్థితే నెలకొంది. 'పండుగ సందర్భంగా పొరుగు దేశం సైనికులకు స్వీట్లు ఇవ్వడం ఆనవాయితి. అయితే ఈ సారి మాత్రం వారు స్వీట్లు తీసుకునేందుకు నిరాకరించారు. ఏది ఏమైనా మేం కోరుకునేది శాంతినే' అని బీఎస్ఎఫ్ డీఐజీ ఎంఎఫ్ ఫారూఖ్ చెప్పారు. పాక్ తీరుకు భిన్నంగా అసోం, మేఘాలయాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద భారత్, బంగ్లాల సైనికులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని, స్వీట్లు తినిపించుకోవడం గమనార్హం. కశ్మీర్ అంశం ప్రస్తావన లేకుండా భారత్- పాక్‌ల మధ్య చర్చలు అసాధ్యమని పాక్ రక్షణ సలహాదారు అజీజ్ ప్రకటించినప్పటినుంచి సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం రెట్టింపయింది. గడిచిన పక్షంరోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరి పాక్ సేనలు భాతర జవాన్లు, సాధారణ పౌరులపై తుపాకి గుండ్ల వర్షం కురిపించాయి. రంజాన్ పండుగ నాడు కూడా భారత సైన్యం స్థావరాలపై పాక్ రేజర్లు పలు మార్లు కాల్పులు జరిపారు. -
ప్రేమ వివాహాన్ని అడ్డుకున్న పెద్దలు
-
ఆరునెలలకే రోడ్డుపాలైన పసికందు
-
మూడేళ్లలో 30 సినిమాలకు తిరస్కారం!
శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షీ సిన్హా, అనిల్‌కపూర్ కుమార్తె సోనమ్‌కపూర్, మహేష్‌భట్ తనయ ఆలియా భట్ల రంగప్రవేశం తర్వాత బాలీవుడ్లో అందరి కళ్లూ నటుడు గోవిందా కూతురు నర్మద రంగప్రవేశంపైనే ఉన్నాయి. ఇదిగో... అదిగో అంటూ గత మూడేళ్లుగా నర్మద అరంగేట్రం గురించి చాలా వార్తలు వచ్చాయి. కానీ, ఇంకా నర్మద తెరపై కనిపించనేలేదు. తను చేసే సినిమాలన్నీ ఓ స్థాయిలో ఉండాలని అనుకుంటోందట నర్మద. అందుకే కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటోందట. ఈ మూడేళ్లల్లో దాదాపు ముప్ఫయ్ సినిమాలు తిరస్కరించిందని నర్మద తల్లి సునీత ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. దీన్నిబట్టి నర్మద ఎంత శ్రద్ధ వహిస్తోందో ఊహించవచ్చు. తన తండ్రిలానే వినోద ప్రధానంగా సాగే సినిమాల్లో నటించాలనుకుంటోందట నర్మద. పాల మీగడలా తెల్లని తెలుపు రంగులో, మంచి శరీరాకృతితో ఉన్న నర్మద అభినయపరంగా కూడా భేష్ అనిపించుకుంటుందని హిందీ చిత్రసీమవారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి.. 30 సినిమాలు తిరస్కరించిన నర్మదకు నచ్చే కథ దొరికేదెప్పుడో? తెరపై కనిపించేదెప్పుడో కాలమే చెప్పాలి.