గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ గుజరాత్ జైలులో ఉన్నాడు. అతన్ని విచారణ నిమిత్తం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కోర్టుకు తరలించాల్సి ఉంది. తన ప్రాణాలకు హాని అంటూ బయటకు వచ్చేందుకు నిరాకరిస్తున్నాడు. గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న తనను ప్రయాగ్‌రాజ్‌కు తీసుకువెళ్తుండగా..ఎన్‌కౌంట్‌లో చంపేస్తారని భయపడుతున్నట్లు అధికారిక వర్గాలు తెలపాయి. అతిక్‌పై కిడ్నాప్, హత్య కేసులు ఉన్నాయి. ఈ కేసు విషయమై విచారణ నిమిత్తం కోర్టుకి హాజరు కావల్సి ఉండగా..అతిక్ మాత్రం ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫర్సెన్స్ ద్వారా ఖరారు చేయండి అని వేడుకుంటున్నాడు.
వాస్తవానికి ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్‌కు మార్చి 28న కోర్టులో శిక్ష ఖరారు కానుంది. ఐతే ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న మరో వ్యక్తి ఈ నెల ప్రారంభంలోనే ఎన్‌కౌంటర్ కాల్పుల్లో చనిపోయాడు. దీంతో అతిక్‌లో భయాలు మొదలయ్యాయి. అతన్ని ఈ రోజు తెల్లవారుజామున కస్టడీలోకి తీసుకోవడానికి ఉత్తర పోలీసులు బృందం సబర్మతి జైలుకి చేరుకోగా..అతిక్ వచ్చేందుకు నిరాకరించాడు. అతడిని కస్టడీకి తీసుకోవడానికి జైలు అధికారులతో అధికారుల బృందం సుదీర్ఘంగా చర్చించింది. అయితే దీనికి సుప్రీం కోర్టు క్లియరెన్స్ అవసరమని జైలు అధికారులు చెప్పినట్లు సమాచారం.
కాగా, ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ అన్నారు. అయినా కోర్టు ఆదేశాల మేరకు తాము నడుచుకుంటున్నామని, కోర్టు ఏది చెబితే అదే చేస్తాం అని బ్రజేష్ అన్నారు. ఇదిలా ఉండగా, 2005లో బీఎస్పీ శాసనసభ్యుడు రాజుపాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్ ప్రధాన నిందితుడు. హత్యలో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్‌ను హత్య చేసినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొటున్నారు. ఐతే సాక్షి ఉమేష్‌పాల్ అపహరణకు గురై కిడ్నాప్ కేసు విచారణ రోజే పట్టపగలే హత్యకు గురయ్యాడు. ఈ ఉమేష్‌పాల్‌ని చంపిన వ్యక్తి విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
దీంతో అతిక్‌లో భయాలు మొదలయ్యాయి. తనను కూడా విచారణ పేరిట ప్రయాగ్‌రాజ్‌కి తరలిస్తుండగా..ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారేమోనని భయపడుతున్నాడు అతిక్. అతను తరుఫున న్యాయవాది కూడా విచారణ మాదిరిగానే కోర్టు నిర్ణయాన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారే శిక్ష విధించాలని అలహాబాద్ హైకోర్టులో దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతిక్ అహ్మద్ 100కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.
(చదవండి: అపూర్వమైన ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికింది: శశి థరూర్)
Comments
Please login to add a commentAdd a comment