ఓ గ్యాంగ్‌స్టర్ అత్యుత్సాహంతో లేనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నాడు. ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆనందంలో జైలు నుంచి అతని అనుచరులు భారీ ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై కార్లలో ఊరేగించారు. దీంతో పోలీసులు మళ్లీ గ్యాంగ్‌స్టర్‌పై చర్యలు చేపట్టారు. అతడిపై కేసు నమోదు చేసి మళ్లీ జైలుకు తరలించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ హర్షద్ పాటంకర్ హత్యాయత్నం, దొంగతనాలు, డ్రగ్స్ వంటి కేసుల్లో గతంలో అరెస్టయ్యాడు. జులై 23న అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి మద్దతుదారులు భారీ ర్యాలీ చేపట్టారు. బేతేల్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకూ ‘కమ్ బ్యాక్’ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో హర్షద్ సన్‌రూఫ్ కారులో వెళ్తుండగా.. పలు కార్లు, సుమారు 15 ద్విచక్ర వాహనాలు అతడిని అనుసరించాయి. ఈ సందర్భంగా కారు రూఫ్ నుంచి హర్షద్ తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఇందుకు సంబంధించిన వీడియోని అతడి మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్‌గామారి పోలీసుల దృష్టికి చేరింది. దీంతో పోలీసులు హర్షద్‌పై చర్యలు చేపట్టారు. అనధికారిక ర్యాలీని నిర్వహించి రోడ్డుపై గందరగోళం సృష్టించినందుకు గానూ హర్షద్‌తోపాటు ఆరుగురు మద్దతుదారులపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment