supporters
-
నిర్బంధాలు.. బహిష్కరణలు!
న్యూయార్క్: అమెరికా యూనివర్సిటీల్లో చదువుకొనసాగిస్తూ పాలస్తీనా అనుకూల నిరసనలకు మద్దతు పలుకుతున్న వారిపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. వీరు పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్‌తోపాటు అధికారులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, గాజాలో ని హమాస్‌పై ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా మాత్రమే తాము మాట్లాడుతున్నామన్నది నిరసనల్లో పాల్గొంటున్న వారి వాదనగా ఉంది. ఇటీవలి కాలంలో యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏడెనిమిది మంది పాలస్తీనా అనుకూల విద్యార్థి నేతలను నిర్బంధంలోకి తీసుకోవడమో లేదా బలవంతంగా సొంతదేశాలకు పంపించడమో చేశారు. వీరిలో కొందరిని గురించి పరిశీలిద్దాం.. రుమేసా ఒజ్టుర్క్ తుర్కియేకు చెందిన 30 ఏళ్ల రుమేసా ఒజ్టుర్క్ మంగళవారం బోస్టన్లోని ఓ వీధిలో నడిచి వెళ్తుండగా ఫెడరల్ అధికారులు అడ్డుకుని నిర్బంధించారు. టఫ్టŠస్ వర్సిటీలో డాక్టరేట్ చేస్తున్న ఈమె హమాస్‌కు మద్దతుగా జరిగే కార్యకలాపాల్లో పాల్గొంటోందని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి ఒకరు తెలిపారు. ఆధారాలను మాత్రం చూపలేదు. అయితే, ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేసే వర్సిటీ వార్తాపత్రికకు రమేసా వ్యాసాలు రాస్తుంటారని స్నేహితులు తెలిపారు. ప్రస్తుతం లూసియానాలో డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. రుమేసా నిర్బంధానికి తగు కారణాలు తెలపాలని జిల్లా జడ్జి ఒకరు అధికారులను ఆదేశించారు. మహ్మూద్ ఖలీల్ అమెరికాలో నివాసానికి అర్హత పొందిన పాలస్తీనా అనుకూల ఉద్యమకారుడు మహ్మూద్ ఖలీల్‌ను మార్చిలో ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేసి, నిర్బంధంలో ఉంచారు. కొలంబియా వర్సిటీలో గతేడాది జరిగిన ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలను నడిపిన వారిలో ఇతడూ ఉన్నాడు. అనంతరం వర్సిటీ అధికారులు, ఆందోళనకారులకు మధ్యవర్తిగా ఉండి ఆందోళనలను విరమింపజేశాడు. అయితే, ఇతడు హమాస్‌కు మద్దతు తెలుపుతున్నాడనే ఆరోపణలపై ఖలీల్కున్న గ్రీన్‌కార్డును యంత్రాంగం రద్దు చేసింది. బలవంతంగా సొంతదేశం సిరియాకు పంపించేందుకు జరిగే ప్రయత్నాలను ఇతడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఇతడు అమెరికా పౌరురాలిని వివాహం చేసుకున్నాడు. యున్సియో చుంగ్ దక్షిణ కొరియా నుంచి చిన్నతనంలోనే అమెరికాకు వచ్చిన యున్సియో చుంగ్ నివాసార్హత పొందింది. ఈమె కొలంబియా వర్సిటీ విద్యార్థి. పాలస్తీనా అనుకూల విద్యార్థులపై ప్రభుత్వం బహిష్కరాస్త్రాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ ఇటీవల బర్నార్డ్ కాలేజీలో జరిగిన నిరసనల్లో పాల్గొనడమే ఈమె చేసిన నేరం. ఈమెను సొంతదేశం కొరియాకు పంపించాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై ఈమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు వచ్చే వరకు యున్సియోను నిర్బంధించవద్దని జడ్జి ఒకరు ఆదేశించారు. బాదర్ ఖాన్ సురి భారత్‌కు చెందిన బాదర్ ఖాన్ సురి జార్జిటౌన్ వర్సిటీ విద్యార్థి. వర్జీనియాలోని తన నివాసం వద్ద ముసుగు ధరించిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. హ మాస్ సిద్ధాంతాలను ఇతడు ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. సురి సోషల్ మీడియా పోస్టులు, ఇతడి భార్య పాలస్తీనా వాసి కావడమే ఇందుకు కారణమని ఇతడి లాయర్ కోర్టుకు తెలిపారు. విజిటింగ్ స్కాలర్‌గా అమెరికాలో ఉండేందుకు సురికి అనుమతి ఉందని, ఇత డి భార్య అమెరికా పౌరు రాలని అ న్నారు. లూసియానాలోని డి టెన్షన్ సెంటర్లో సురిని ఉంచారు. సురి ని వెంటనే విడుదల చేయాలని, భారత్‌కు బలవంతంగా పంపించరాదని వాదిస్తున్నారు. లెకా కొర్డియా వెస్ట్ బ్యాంకుకు చెందిన పాలస్తీనా వాసి లెకా కొర్డియా. ప్రస్తుతం న్యూయార్క్‌లోని నెవార్క్లో ఉంటోంది. విద్యార్థి వీసా పరిమితి ముగిసిన తర్వాత కూడా అమెరికాను వీడి వెళ్లలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. కొర్డియా తమ విద్యార్థి కానేకాదని కొలంబియా యూనివర్సిటీ అంటోంది. టెక్సాస్‌లోని అల్వరాడో డిటెన్షన్ సెంటర్లో ఈమెను ఉంచారు. రంజనీ శ్రీనివాసన్ భారత పౌరురాలైన రంజనీ శ్రీనివాసన్ కొలంబియా వర్సిటీలో డాక్టరేట్ చేస్తోంది. యూనివర్సిటీ హాస్టల్లో ఉండగా ఇమిగ్రేషన్ అధికారులు ఈమెను సోదా చేయడంతో ఈమె భారత్‌కు తిరిగి వచ్చింది. హింసను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందున ఈమె వీసాను రద్దు చేసినట్లు యంత్రాంగం తెలిపింది. ఇందుకు గల ఆధారాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఆరోపణలను ఈమె ఖండించింది. నిరసనల్లో తనకెలాంటి పాత్ర లేదని తెలిపింది. ‘సెల్ఫ్ డిపోర్ట్’ఆప్షన్‌ను ఎన్నుకుని, స్వదేశానికి చేరుకున్నట్లు తెలిపింది. అలిరెజా డొరౌడి అలబామా యూనివర్సిటీ డాక్టొరల్ విద్యార్థి అలిరెజా డొరౌడి సొంత దేశం ఇరాన్. మంగళవారం ఇతడిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకుని, లూసియానాలోని జెనా ఇమిగ్రేషన్ ఫెసిలిటీకి తరలించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఇతడి వీసాను అధికారులు 2023లోనే రద్దు చేశారని లాయర్ డేవిడ్ రొజాస్ తెలిపారు. అయితే, విద్యార్థి హోదాలో ఉన్నంత కాలం ఇతడు అమెరికాలో ఉండేందుకు అర్హత ఉంటుందన్నారు. జాతీయ భద్రతకు ప్రమాదమనే ఆరోపణలపై ఇతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు అంటున్నారు. అయితే, ఇతడికి ఎలాంటి రాజకీయ కార్యకలాపాలతో సంబంధం లేదని లాయర్ డేవిడ్ తెలిపారు. డాక్టర్ రషా అలావీహ్ లెబనాన్‌కు చెందిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ రషా అలావీహ్(34). రోడ్ ఐల్యాండ్‌లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉన్న ఈమెను ఇటీవలే సొంత దేశానికి బలవంతంగా పంపించివేశారు. ఈమె పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు నిర్బంధించరాదన్న జడ్జి ఆదేశాలను సైతం ఇమిగ్రేషన్ అధికారులు పక్కనబెట్టడం గమనార్హం. లెబనాన్‌లోని హెజ్బొల్లా సాయుధ సంస్థకు ఈమె బహిరంగంగా మద్దతు పలికారని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే, హెజ్»ొల్లా నేత హసన్ నస్రుల్లా మత, ఆధ్యాతి్మక బోధనలకే తప్ప రాజకీయ సిద్ధాంతాలకు మద్దతు తెలపలేదని రషా అంటున్నారు.మొమొడౌ తాల్ కార్నెల్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్న మొ మొడౌ తాల్(31) వీసాను ఇటీవలే అధికారులు రద్దు చేశారు. క్యాంపస్‌లో జరిగిన పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొనడమే ఇతడి తప్పు. యూకే, గాంబియా పౌరసత్వాలున్న మొమొడౌ తనను అక్రమంగా నిర్బంధించారంటూ కోర్టులో సవాల్ చేశాడు. ప్రభుత్వ చర్యలు చట్టబద్ధమేనని కోర్టు ప్రకటిస్తే ఇమిగ్రేషన్ అధికారుల ఎదుట లొంగిపోతానని ఇతడు అంటున్నాడు. -
తాడిపత్రిలో ఆగని జేసీ కుటుంబ అరాచకాలు
-
కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదార్లున్నారు
ఒట్టావా: కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఉన్నారని ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అంగీకరించారు. అయితే, వారు మొత్తంగా సిక్కు సమాజానికి ప్రాతినిధ్యం వహించడం లేదని చెప్పారు. కెనడాలో ఓట్టావాలోని పార్లమెంట్ హాల్లో తాజాగా దీపావళి వేడుకల్లో ట్రూడో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ దేశంలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుదారులు, అభిమానులు సైతం ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారని, అయితే వారంతా హిందూ కెనడా పౌరులకు ప్రాతినిధ్యం వహించడం లేదని తెలిపారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్, కెనడా మధ్య సంబంధాలు బలహీనపడిన సంగతి తెలిసిందే. ఖలిస్తాన్ ఉగ్రవాదులకు కెనడా అడ్డాగా మారిందని, అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారత్ పలుమార్లు ఆరోపించింది. అయినా కెనడా ప్రభుత్వం పెద్దగా స్పందించని సంగతి తెలిసిందే. -
హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి
బ్రాంప్టన్: కెనడా ప్రభుత్వం భారత్‌పై విషం చిమ్మిన అనంతరం అక్కడి ఖలిస్తానీ మద్దతుదారుల మనోబలం మరింతగా పెరిగినట్టు కనిపిస్తోంది. తాజాగా ఆదివారం కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తానీ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. ఒక హిందూ దేవాలయం వెలుపల విధ్వంసం సృష్టించారు.బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఒక ప్రకటనలో తన స్పందన తెలియజేశారు. బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై జరిగిన హింసాత్మక సంఘటనలు ఆమోదయోగ్యం కాదు. ప్రతి కెనడియన్‌కు తన ఇష్టం మేరకు మతాభిమానాలకు కొనసాగించే హక్కు ఉంది. అయితే ఒక వర్గపు సమాజాన్ని రక్షించడానికి, ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి తక్షణమే స్పందించాలని ఆయన ప్రాంతీయ పోలీసులను ఆదేశించారు.BREAKING: The RCMP start attacking Hindu worshippers on their own temple grounds in Surrey BC.Watch as an RCMP officer goes into the crowd to go after Hindu devotees after pushing them back to protect the Khalistanis who came to harass the temple goers on Diwali. Punching Hindus… pic.twitter.com/uugAJun59q— Daniel Bordman (@DanielBordmanOG) November 4, 2024బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ఈ ఘటనపై మాట్లాడుతూ బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల గురించి విని ఆందోళన చెందాను. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక హక్కు. ప్రతి వ్యక్తి తమ ప్రార్థనా స్థలంలో సురక్షితంగా ఉండాలి. ప్రార్థనా స్థలం వెలుపల జరిగిన హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. శాంతిభద్రతల పరిరక్షణకు, హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టేందుకు పోలీసులు ఉపక్రమిస్తున్నారు. దోషులుగా తేలిన వారిని చట్టం ప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు.కాగా కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదులు పరిధులు దాటిపోయారని కెనడా పార్లమెంటులో భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆచార్య అన్నారు. హిందూ దేవాలయంపై జరిగిన దాడి.. కెనడాలో ఖలిస్తానీ హింసాత్మక తీవ్రవాదం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుందని, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాదులకు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని చంద్ర ఆరోపించారు.ఇది కూడా చదవండి: 2025.. ప్రపంచం అంతానికి ఆరంభం: బాబా వంగా కాలజ్ఞానం -
జైలు నుంచి విడుదలైన కాసేపటికే మళ్లీ అరెస్టైన గ్యాంగ్‌స్టర్.. ఎందుకంటే!
ఓ గ్యాంగ్‌స్టర్ అత్యుత్సాహంతో లేనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నాడు. ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆనందంలో జైలు నుంచి అతని అనుచరులు భారీ ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై కార్లలో ఊరేగించారు. దీంతో పోలీసులు మళ్లీ గ్యాంగ్‌స్టర్‌పై చర్యలు చేపట్టారు. అతడిపై కేసు నమోదు చేసి మళ్లీ జైలుకు తరలించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ హర్షద్ పాటంకర్ హత్యాయత్నం, దొంగతనాలు, డ్రగ్స్ వంటి కేసుల్లో గతంలో అరెస్టయ్యాడు. జులై 23న అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి మద్దతుదారులు భారీ ర్యాలీ చేపట్టారు. బేతేల్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకూ ‘కమ్ బ్యాక్’ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హర్షద్ సన్‌రూఫ్ కారులో వెళ్తుండగా.. పలు కార్లు, సుమారు 15 ద్విచక్ర వాహనాలు అతడిని అనుసరించాయి. ఈ సందర్భంగా కారు రూఫ్ నుంచి హర్షద్ తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.ఇందుకు సంబంధించిన వీడియోని అతడి మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్‌గామారి పోలీసుల దృష్టికి చేరింది. దీంతో పోలీసులు హర్షద్‌పై చర్యలు చేపట్టారు. అనధికారిక ర్యాలీని నిర్వహించి రోడ్డుపై గందరగోళం సృష్టించినందుకు గానూ హర్షద్‌తోపాటు ఆరుగురు మద్దతుదారులపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. -
న్యూయార్క్‌లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన
అమెరికాలోని న్యూయార్క్లోగల బ్రూక్లిన్ మ్యూజియంపై వందలాది మంది పాలస్తీనా అనుకూల నిరసనకారులు హఠాత్తుగా దాడికి దిగారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.అయితే పోలీసుల రాకకుముందే నిరసనకారులు బ్రూక్లిన్ మ్యూజియం వద్దకు చేరుకుని, ఆ ప్రాంగణంలో టెంట్లు వేసి, భవనంపై ‘ఫ్రీ పాలస్తీనా’ పేరుతో గల బ్యానర్లను ఎగురవేశారు. మ్యూజియం వద్దకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో న్యూయార్క్ నగర పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో కొంతమంది నిరసనకారులు పోలీసు అధికారులపై ప్లాస్టిక్ బాటిళ్లను విసిరారు.ఘటనా స్థలంలో పోలీసులకు, ఆందోళనకారులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారుల సంఖ్య అధికంగా ఉండటంతో న్యూయార్క్ పోలీసులు వారిని అదుపు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. దీనికిముందు పాలస్తీనా మద్దతుదారులు బార్క్లేస్ సెంటర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్నవారు డప్పులు కొడుతూ, పలు నినాదాలు చేస్తూ మ్యూజియం వైపు తరలివచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Australia : యాత్ర 2 కార్ ర్యాలీ.. YSRCP సిద్ధం
‘‘యాత్ర 2” సినిమా విజయవంతమైన సందర్భంగా వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి నేతృత్వంలో “టీమ్ మెల్బోర్న్ - వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా’’ ఆధ్వర్యంలో కార్ ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని కీలక ఘటనలను, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి, YSRCP అధ్యక్షడు వైఎస్ జగన్ రాజకీయ ప్రారంభ దశలోని ముఖ్యమైన అంశాలను ఆధారంగా సినిమాని తెరకెక్కించడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. ఈ ర్యాలీని మెల్బోర్న్ టీమ్ సభ్యులు కృష్ణారెడ్డి, భరత్, రామాంజి, నాగార్జున, మణిదీప్, సతీష్‌లు చక్కగా సమన్వయం చేశారు. సిద్ధం పోస్టర్‌ను ఆవిష్కరించడంతో పాటు, వైఎస్సార్సీపీ పోరాటానికి తిరుగులేని మద్దతునిస్తూ “జై జగన్”, “జోహార్ వైఎస్ఆర్”, “ఎన్నికల సమరానికి మేము సిద్ధం” నినాదాలతో.. వేదిక వద్ద వాతావరణం మారుమోగింది. ఉత్సాహభరితమైన ర్యాలీ తరువాత, వైఎస్సార్సీపీ మద్దతుదారులు "యాత్ర 2" చిత్రం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. 2024లో జరగబోయే ఏపీ 175 అసెంబ్లీ ఎన్నికలకు, అలాగే లోక్‌సభ 25 స్థానాల ఎన్నికలకు YSRCP సిద్ధంగా ఉందని, సీఎం జగన్ నినాదం వైనాట్ 175ని నిజం చేసేందుకు ప్రతీ ఒక్క ప్రవాసాంధ్రుడు కృషి చేస్తారని తెలిపారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన ప్రయోజనలు, విద్యా, వైద్య, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రతీ ఒక్క ఎన్నారై స్టార్ క్యాంపెయినర్‌గా మారి ప్రచారం చేస్తారని తెలిపారు. -
వైఎస్సార్సీపీకి మద్దతుగా మెల్బోర్న్లో భారీ కార్ ర్యాలీ
-
భారత రాయబారిపై ఖలిస్తానీ వాదుల దూషణలు
న్యూయార్క్: గురుపూరబ్ పర్వదినం సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరన్జీత్ సింగ్ సంధుపై ఖలిస్తానీ వాదులు నోరుపారేసుకున్నారు. లాంగ్ ఐలాండ్‌లో హిక్స్‌విల్లే గురుద్వారాకు వెళ్లిన సంధుకు ఘన స్వాగతం లభించింది. ఇది జీర్ణించుకోలేని ఖలిస్తానీ వాదులు ఆయన్ను దూషించారు. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనపై ఆయనపై పలు ప్రశ్నలు సంధిస్తూ పెద్దగా కేకలు వేశారు. స్థానిక సిక్కు సమాజ సభ్యులు సంధుకు రక్షణగా నిలిచి, ఖలిస్తానీ వాదులను బయటకు పంపించారు. -
అమెరికాలో భారీ కారు ర్యాలీ!
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు మద్దతుగా అమెరికాలో భారీ కారు ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నారై వింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు, ప్రవాసులు భారీగా తరలివచ్చారు. డల్లాస్‌లో అభిషేక్ కొత్తూరు సారథ్యంలో జరిగిన ర్యాలీకి అనుహ్య స్పందన వచ్చింది. ‘గులాబీ జెండలే రామక్క’ పాటలు, 'అపుడు ఎట్ల ఉండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్ల ఉండే తెలంగాణ' అంటూ తీన్మార్ డబ్బులతో సందడి చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు మద్దతుగా ఈ భారీ కారు ర్యాలీ నిర్వహించినట్లు అభిషేక్ పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. ఎన్నారైలంతా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్‌కు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. (చదవండి: అగ్రరాజ్యంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు!) -
భారత హైకమిషన్‌కు ఖలిస్తాన్ నిరసన సెగ
లండన్: బ్రిటన్‌లో ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారులు మరోసారి పేట్రేగిపోయారు. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇటీవల బ్రిటన్‌లోని గ్లాస్గో పట్టణంలో గురుద్వారాలోకి భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి వెళ్లకుండా ఖలిస్తానీవాదులు అడ్డుకున్న ఘటనను మరవకముందే మళ్లీ అలాంటి నిరసన కార్యక్రమానికి బ్రిటన్ వేదికగా మారింది. సోమవారం లండన్‌లో ఈ ఘటన జరిగింది. హై కమిషన్ కార్యాలయం ముందే ఆందోళన చేశారు. దీంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి వారిని నియంత్రించారు. మరోవైపు, దొరైస్వామిని అడ్డుకోవడాన్ని ఖండిస్తూ సదరు గురుద్వారా ప్రకటన విడుదల చేసింది. -
పొంగులేటి అనుచరులకు షాక్.. పాత కేసులపై పోలీసుల నోటీసులు!
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఇక, ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే, పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులను అధికార బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా పొంగులేటి అనుచరులపై పాత కేసులు తిరగదోడుతున్నారు. అందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాస్ ప్రధాన అనుచరులు తుళ్లూరి బ్రహ్మయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబుపై పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఏడాది క్రితం ఓ ఘటన ఆధారంగా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక, డీసీసీబీ మాజీ ఛైర్మన్ విజయ్ బాబు బ్యాంకు కేసును సీఐడీకి అప్పగించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పొంగులేటి మద్దతుదారులు స్పందించారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కక్షపూరితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసినట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పొంగులేటి నేడు(ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీలో చేరికపై రాహుల్ గాంధీతో వీరు చర్చించనున్నారు. ఈ క్రమంలో ఖమ్మంపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీంతో, అధికార బీఆర్ఎస్ పార్టీ అలర్డ్ అయ్యింది. సీఎం కేసీఆర్ కూడా ఖమ్మంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌తో మాట్లాడుతూ అక్కడి పొలిటికల్ సమీకరణాలను తెలుసుకుంటున్నారు. అటు, బీజేపీ కూడా ఖమ్మం రాజకీయాలను పరిశీలిస్తోంది. దీంతో, ఖమ్మంలో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్.. ఆ 70 మంది పరిస్థితేంటి? -
ముఖేష్ ఉపాధ్యాయ కు పాలతో స్నానం
-
మళ్లీ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
లండన్: ఖలిస్తానీ మద్దతుదారుల దాడితో ఘటనకు కేంద్ర బిందువుగా మారిన లండన్‌లోని భారతీయ హైకమిషన్ వద్ద మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం భారతీయ హైకమిషన్‌పై దాడికి తెగబడిన ఘటన మరువకముందే మళ్లీ దాదాపు 2,000 మందితో కూడిన ఆ వేర్పాటువాద మూక అదే భవంతి సమీపానికి చేరుకుంది. ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు చేసిన వేర్పాటువాదులు వెంట తెచ్చుకున్న రంగులు వెదజల్లే చిన్న బాణసంచా, నీళ్ల సీసాలు, కొన్ని వస్తువులను హైకమిషన్ భవంతిపైకి విసిరారు. ఆదివారం నాటి దుశ్చర్యతో అప్రమత్తమైన లండన్ పాలనా యంత్రాంగం భారీ సంఖ్యలో పోలీసులను అంతకుముందే అక్కడ మొహరించడంతో వేర్పాటువాదుల భారీ దాడి యత్నాలు ఆచరణలో విఫలమయ్యాయి. అమృత్‌పాల్ అరెస్ట్‌కు కంకణం కట్టుకున్న పంజాబ్ పోలీసుల చర్యను నిరసిస్తూ ఫెడరేషన్ ఆఫ్ సిఖ్ ఆర్గనైజేషన్స్, సిఖ్ యూత్ జతేబందియా వంటి సంస్థలు ఉమ్మడిగా ‘నేషనల్ ప్రొటెస్ట్’ పేరిట బ్యానర్లు సిద్ధంచేసి భారతీయ హైకమిషన్ వద్ద దాడికి కుట్ర పన్నినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. నిరసనకారులను అదుపులోకి తీసుకుని తరలించేందుకు దాదాపు 20 బస్సులను పోలీసులు తెప్పించారు. అప్రమత్తతలో భాగంగా కొందరు పోలీసులను అక్కడి వీధుల్లో కవాతుచేశారు. ఖలిస్తానీవాదులు అక్కడికి రాగానే పంజాబ్‌లో మానవహక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఇంగ్లిష్, పంజాబీ భాషల్లో మైకుల్లో భారత వ్యతిరేక ప్రసంగాలు ఇచ్చారు. నిరసనకారుల్లో చిన్నారులు, మహిళలూ ఉండటం గమనార్హం. భారత్ తమను వేర్పాటువాదులని, పాక్ ఐఎస్ఐతో కుమ్మక్కయ్యారని ప్రకటించడాన్ని తప్పుబడుతున్నారు. భారత్ హైకమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన ఖలిస్తానీ మద్దతుదారులు -
నన్ను చంపేయడమే వారి ముఖ్య ఉద్దేశ్యం: పాక్ మాజీ ప్రధాని
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ని పోలీసులు మంగళవారం అరెస్టు చేసేందుకు యత్నించగా, అతని మద్దతుదారులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులపై ఇమ్రాన్‌ఖాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు తన నివాసం వద్ద అరెస్టు చేయాలనే ప్లాన్ వెనుక ఉన్న ముఖ్యోద్దేశం తనను అపహరించి, చంపయేడమేనని ఆరోపించారు. అంతేగాక తన మద్దతుదారులను అడ్డుకునేలా బలగాలను సైతం రంగంలోకి దింపారని మండిపడ్డారు. అందుకు సంబంధించిన కాల్పుల దృశ్యాలను ఖాన్ ట్వీట్ చేశారు. ఇవి పోలీసుల దుర్మార్గపు ఆలోచనను బయటపెడుతున్నాయని ఆయన అన్నారు. అరెస్టు చేయడం అనేది ఒక నాటకీయంగా జరుగుతుందని. తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘మద్దతుదారులను కట్టడి చేసేందుకు టియర్ గ్యాస్‌తో సహా కాల్పులకు దిగారు పోలీసులు, నేను మంగళవారం బెయిల్‌పై వచ్చేందుకు పూచీకత్తుపై సంతకం చేశాను. దీన్నీ స్వీకరించడానికి డీఐజీ నిరాకరించారు. దీనిని బట్టే వారి అసలు ఉద్దేశ్యం ఏమిటో అర్థమవుతోంది. అదీగాక మద్దతుదారులను ఎదుర్కోవడానికి పారామిలటరీ సిబ్బందిని దింపడంపై ఆంతర్యం ఏంటి’ అని మండిపడ్డారు. ఘర్షణలు తలెత్తకుండా తటస్థ వైఖరినే అవలంభిస్తాం అని చెబుతుండే పాలకులు ఇప్పడూ చేస్తోంది ఏంటి అని నిలదీశారు. ఇప్పటికే అక్రమ వారెంట్‌కి సంబంధించిన కేసును కోర్టులో ఎదుర్కొంటున్నప్పుడూ ఇప్పుడూ ఇలాంటి డ్రామాలకు తెరతీయడం ఏమిటని ప్రశ్నించారు. కాగా, అవినీతి ఆరోపణలు, తోషాఖాన్ కేసులో ఇమ్రాన్ ఖాన్ని అరెస్టు చేసేందుకు గత కొన్నిరోజులుగా ప్రత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లాహోర్‌లోని జమాన్ పార్క్‌లో ఉన్న ఆయన ఇంటి వద్ద గత రెండు వారాలుగా హైడ్రామా కొనసాగింది. Clearly "arrest" claim was mere drama because real intent is to abduct & assassinate. From tear gas & water cannons, they have now resorted to live firing. I signed a surety bond last evening, but the DIG refused to even entertain it. There is no doubt of their mala fide intent. pic.twitter.com/5LZtZE8Ies — Imran Khan (@ImranKhanPTI) March 15, 2023 (చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు యత్నం.. రాళ్లు రువ్వి అడ్డుకుంటున్న మద్దతుదారులు) -
ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు యత్నం.. ఉద్రిక్తత
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు పోలీసులు ఇవాళ ప్రయత్నించారు. ఆ అరెస్టును అడ్డుకునేందుకు పీటీఐ కార్యకర్తలు తీవ్రంగా యత్నించారు. రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులకు, కవరేజ్ కోసం జర్నలిస్టులకు గాయాలు అయ్యాయి. దీంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు తన అరెస్టును అడ్డుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ కోర్టును ఆశ్రయించారు. అవినీతి ఆరోపణలు.. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు గత కొన్నిరోజులుగా పోలీసులు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో లాహోర్‌లోని జమాన్ పార్క్‌లో ఉన్న ఆయన ఇంటి వద్ద గత రెండు వారాలుగా హైడ్రామా నడుస్తోంది. అరెస్టు కోసం చాలా పకడ్బందీగా ఆపరేషన్ సిద్ధం చేసిన పోలీసులు.. ఇవాళ దానిని అమలు చేయడానికి యత్నించారు. అయితే.. అదే సమయంలో ఆయన మద్దతుదారులు అడ్డుకునేందుకు యత్నించారు. ఇక అరెస్ట్ ప్రక్రియ ఆగిపోయిన వెంటనే ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు. తాను జైలుకు వెళ్లినా.. తనను చంపేసినా.. పాక్ ప్రజలు తమ హక్కుల కోసం షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వంతో పోరాడడం ఆపొద్దని పిలుపు ఇచ్చారు. My message to the nation to stand resolute and fight for Haqeeqi Azadi & rule of law. pic.twitter.com/bgVuOjsmHG — Imran Khan (@ImranKhanPTI) March 14, 2023 ఈ క్రమంలో పోలీసులు, పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒక కార్యకర్త సైతం మరణించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే.. అవిశ్వాస తీర్మానం ద్వారా కిందటి ఏడాది గద్దె దిగిపోయిన ఇమ్రాన్ ఖాన్‌పై ఇప్పటిదాకా 81 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. (చదవండి: యుద్ధంలో రష్యా ఓడితే! జరిగేది ఇదే.. పుతిన్ భవిష్యత్‌పై మాజీ దౌత్యవేత్త) -
ఫుల్ జోష్‌లో జోడో యాత్ర..చొక్కా లేకుండా మద్దతుదారులు డ్యాన్సులు
ఉత్తర భారతదేశంలో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి ఇళ్లకే పరిమితమయ్యేలా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయినా ఇవేమి లెక్కచేయకుండా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జోడోయాత్ర జయపద్రంగా సాగిపోతోంది. అదీగాకా రాహుల్ ఈ చలిలో కేవలం టీ షర్టు ధరించి చేయడం ఒక హాట్ టాపిక్‌గా కూడా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడూ ఈ గడ్డ గట్టే పొగమంచు చలిలో కాంగ్రెస్ కార్యక్తరలు బస్టాప్పై నుంచుని ప్రజలకు అభివాదం చేయగా..మరికొందరూ కాంగ్రెస్ మద్దతుదారులు బస్ టాప్‌పై నుంచోని డ్యాన్స్‌లు చేస్తూ ఆకర్షణగా కనిపించారు. ఈ ఘటన హర్యానాలోని కర్నాల్‌లో సాగుతున్న జోడో యాత్రలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా, భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తిరిగి హర్యానాలోకి ప్రవేశించింది. జనవరి 10 కల్లా నాలుగు జిల్లాలను కవర్ చేయనుందని అధికారిక వర్గాల సమాచారం. అయినా డిసెంబర్ 21 నుంచి 23 వరకు మొదటి దశలో హర్యానాలోని నుహ్, గురుగ్రామ్, ఫరీదాబాద్ తదితర జిల్లాను చుట్టి.. సుమారు 130 కిలో మీటర్లు పర్యటించినట్లు తెలిపారు. #WATCH | Congress supporters dance shirtless amid dense fog during Bharat Jodo Yatra in Haryana's Karnal pic.twitter.com/0kmHmkL1nK — ANI (@ANI) January 8, 2023 (చదవండి: ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ) -
జేసీ వర్గీయుల బరితెగింపు.. వైఎస్సార్సీపీ నేతలపై దాడి
సాక్షి, అనంతపురం జిల్లా: జూటూరులో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేతలపై కత్తులు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం పొలం పనులకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి బంధువులు, ఆయన వర్గీయులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. -
పరువు తీసుకున్న పాకిస్తాన్ నేతలు.. ట్రెండింగ్‌లో వీడియో
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో గత కొద్ది రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇమ్రాన్‌ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో పాక్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం మాజీ ప్రధాని ఇమ్రాన్.. అటు పాకిస్తాన్ నేతలపై, ఇటు భారత్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. పాక్‌లో ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, నేతలు ఓ స్టార్ హోటల్లో రచ్చరచ్చ చేశారు. ఇఫ్తార్ విందులో ఇరు వర్గాల మద్దతుదారులు, నేతలు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు డ్రింక్స్ , ఫుడ్ విసురుకున్నారు. బూతులు తిట్టుకుంటూ నానా హంగామా చేశారు. ఓ బాడీ బిల్డర్.. వృద్ధుడిపై దాడికి దిగి భారీ పంచ్‌లు విసిరాడు. దీంతో కిందపడిపోయిన అతడిని లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. افطاری کرتے ہوئے آوازیں کسنے اور بدتمیزی کرنے پر مصطفی نواز کھوکھر اور نور عالم غصے میں آگئے،، یہ ہم لوگوں کو کیا سکھا رہے ہیں؟؟ pic.twitter.com/W9SrPbYG6A — Waseem Abbasi (@Wabbasi007) April 12, 2022 మరోవైపు.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాను మరింత ప్రమాదకరంగా మారుతానని గురువారం హెచ్చరించారు. నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రమాదకారి కాదు. కానీ ఇప్పుడు నేను మరింత ప్రమాదకారిగా మారుతానని పేర్కొన్నారు. అయితే అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి నుంచి దిగిపోయి వారం కూడా గడవకముందే ఇమ్రాన్ ఖాన్ ఇలా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక పాకిస్థాన్ న్యాయవ్యవస్థపై కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం అర్ధరాత్రి దాకా న్యాయస్థానం తలుపులు తెరవడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలపాలని డిమాండ్ చేశారు. నేను న్యాయవ్యవస్థను అడుగుతున్నాని.. మీరు అర్ధరాత్రి వరకు కోర్టును ఎందుకు తెరిచి ఉంచారని ప్రశ్నించారు. Welcome to purana Pakistan#امپورٹڈ_حکومت_نامنظور pic.twitter.com/7XgB0dYUm9 — Chaudhry Ataur Rehman (@AtaurRehmanCh81) April 12, 2022 ఇది చదవండి: నార్త్ కొరియా కిమ్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాలో వైరల్ -
Anantapur: ఆగని టీడీపీ అరాచకం
నల్లమాడ(అనంతపురం జిల్లా): బొగ్గలపల్లిలో వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దమనకాండ సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఒక ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు, బాధితుల సమాచారం మేరకు... బుధవారం ఉదయం టీడీపీకి చెందిన ఒక మహిళ వైఎస్సార్సీపీకి చెందిన వారి పొలంలోకి వెళ్లి పరక పుల్లలు కోస్తోంది. గమనించిన పొలం యజమాని అభ్యంతరం తెలిపాడు. ఇది మనసులో పెట్టుకున్న టీడీపీ వర్గీయులు అదే రోజు సాయంత్రం 6.30 గంటల సమయంలో కొడవలి, గొడ్డలి, చాకు, కర్రలు చేతబూని వైఎస్సార్సీపీ వర్గీయుల ఇళ్లలోకి చొరబడి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వైఎస్సార్సీపీ వర్గీయులు ఆదెప్ప, ఈశ్వరమ్మ, బాలాజీ, శాంతమ్మ, పెద్ద వెంకట్రామన్న, శ్రీనివాసులు, శ్యామసుందర్, అరుణమ్మ తీవ్రంగా గాయపడ్డారు. చదవండి: చావు బతుకుల్లో పావని.. రెండు కిడ్నీలకు ఇన్ఫెక్షన్ వీరందరూ కదిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టీడీపీకి చెందిన శ్రీకాంత్, క్రిష్ణమూర్తి, వంశీ, సునందమ్మ, విజయమ్మ, పార్వతి, జయప్ప, చంద్రశేఖర్ తమపై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. రెండు నెలల క్రితం కూడా ఉపాధి పనుల విషయంలో టీడీపీ వారు దాడులు చేసినట్లు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు బొగ్గలపల్లిలో నిఘా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ వర్గీయులను ఆ పార్టీ మండల కన్వీనర్ పొరకల రామాంజనేయులు, కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ రసూల్, నాయకులు ఆంజనేయులు నాయక్, నాగరాజునాయుడు, బాలాజీనాయుడు, కమలాకర్‌నాయుడు, రమణ తదితరులు పరామర్శించారు. -
బాబ్బాబూ.. పోటీలో ఉండండి చాలు..
డబ్బులిస్తామంటే..వద్దంటున్నారు. బెదిరిస్తుంటే.. ఎదురు తిరుగుతున్నారు.. బుజ్జగిస్తుంటే..కసిరి కొడుతున్నారు. పార్టీ గుర్తులతో పనిలేని పంచాయతీ ఎన్నికల్లో ఉనికి నిలుపుకోవడానికి టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. సాధారణంగా ఎన్నికల ముందు జనాలను ఓట్లు అభ్యర్థించడం కామనే.. కానీ ప్రతిపక్ష పార్టీ పరిస్థితి వేరు. జనాలను కాకుండా నాయకులను ఆ పార్టీ అభ్యర్థిస్తోంది. తమ మద్దతుతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని బతిమాలుతోంది. తొలి దశ పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న దశలో కూడా లీడర్ల కోసం వెతుకులాడుతోంది. కానీ ఏం లాభం.. మా కేండిడేటే అనుకున్న వారంతా డౌట్లు పెట్టి ముఖం చాటేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పంచాయతీ ఎన్నికల కోసం నానా యాగీ చేసిన టీడీపీకి ఇప్పుడు తత్వం బోధ పడుతోంది. ఏకగ్రీవాలు కాకుండా పంచాయతీల్లో అభ్యర్థులను నిలబెట్టాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ పిలుపునకు స్పందించే వారే కరువైపోయారు. ఓ వైపు ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంటే.. టీడీపీ మాత్రం పోటీకే మొండిగా దిగుతోంది. కానీ బరిలో దిగే వారు లేక ఆ పార్టీ నాయకులు డీలా పడిపోతున్నారు. (చదవండి: టీడీపీలో ‘గంటా’ టెన్షన్) జిల్లాలో మొత్తం 1166 పంచాయతీల్లో నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తొలి రెండు దశల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నా మినేషన్లు కూడా ఖరారయ్యాయి. అయితే ఈ రెండు దశల్లోనూ దాదాపుగా అన్ని పంచాయతీల్లోనూ అభ్యర్థులను నిలబెట్టడానికి టీడీపీ ఆపసోపాలు పడింది. ‘బాబ్బాబూ..ఏకగ్రీవాలకు ఛాన్స్ ఇవ్వకండి....డబ్బులిస్తాం...పోటీలో ఉండండి చాలు’ అంటూ కింది స్థాయి నాయకులను బతిమలాడే స్థితికి చేరుకుంది. ఇక జిల్లాలో అప్పట్లో చక్రం తిప్పిన ప్ర స్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు కూ డా పల్లె నాయకులను వెతకలేక చతికిలపడ్డారు.(చదవండి: పిచ్చి పీక్స్‌కు.. తుగ్లక్‌ను మరిపిస్తున్న నిమ్మగడ్డ) టెక్కలి నియోజకవర్గంలో సుమారు 12 చోట్ల సర్పంచ్‌లు ఏకగ్రీవం కావడం అచ్చెన్నకు మింగుడు పడడం లేదు. గత సాధారణ ఎన్నికల్లో స్వగ్రామమైన నిమ్మాడలో తన భార్యను ఏకగ్రీవ సర్పంచ్‌గా చేసుకున్న అచ్చెన్నకు ఈసారి ఆ పప్పులుడకలేదు. అయితే ఎన్నికల బరిలో వ్యతిరేకంగా నిలబడిన కింజరాపు అప్ప న్నపై దౌర్జన్యానికి దిగి బెదిరింపులకు సైతం దిగిన సంగతి విదితమే. వీటిపై ఆధారాలుండడంతో ఎన్నికల కమిషన్ చర్యల్లో భాగంగా అచ్చెన్నను అరెస్ట్ చేసింది. దీంతో మిగిలిన ప్రాంతాల్లో కూడా అభ్యర్థుల కోసం ఆయా ప్రాంత నేతలు వెంపర్లాడుతున్నారు. రాజకీయాలకు అతీతమని తెలిసినా.. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పార్టీల జోక్యం ఉండదని తెలిసినప్పటికీ... ముందు నుంచి ఈ ఎన్నికలకు పచ్చ రంగును పులిమేందుకు టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపించారు. మేకపోతు గాంభీర్యంతో ఎన్నికలకు సై అన్నా.. అభ్యర్థులు దొరక్క బొక్కబోర్లా పడ్డారు. అప్పుడు పట్టించుకోకుండా.. గ్రామ స్థాయిలో ఎన్నికలకు టీడీపీ శ్రేణులు దూరంగా ఉంటున్నాయన్నది సత్యం. అగ్రశ్రేణి నేతల ఒత్తిళ్లు ఏమాత్రం పట్టించుకోకుండా బాహాటంగానే ఎన్నికల్లో పోటీ చేయలేమ ని తేల్చి చెప్పేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. జిల్లా లో గత ప్రభుత్వ హయాంలో క్యాడర్‌ను ఏ మా త్రం పట్టించుకోని అగ్రనేతలు ఇప్పుడు తాయిలాలు ఇస్తామని ప్రలోభ పెడుతుండడంతో ద్వితీయ నాయక శ్రేణి అవమానంగా భావిస్తోంది. ఖర్చులన్నీ భరిస్తామని హామీ ఇచ్చినా ఆ పల్లకీ మోసే బోయీలు మాత్రం దొరకడం లేదు. -
వాషింగ్టన్లో 15 రోజులు ఎమర్జెన్సీ
అగ్రరాజ్యం వణికిపోయింది. ప్రజాస్వామ్యం చిన్నబోయింది. ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్ తన అనుచరుల్ని రెచ్చగొట్టారు. అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను అడ్డుకోవాలంటూ ఉసిగొల్పారు. ఫలితంగా అమెరికాకి గుండెకాయ వంటి చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్‌పై దాడి జరిగింది. కనీవినీ ఎరుగని హింసాకాండ చెలరేగింది. అమెరికా చరిత్రలో చీకటి రోజుగా మిగిలింది. అదే రోజు రాత్రి ప్రజాస్వామ్యానికి కొత్త వెలుగులు ప్రసరించేలా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను కాంగ్రెస్ ధ్రువీకరించింది. ఉపాధ్యక్షుడిని ప్రలోభపెట్టాలని చూసిన ట్రంప్ ఎత్తుగడలు ఫలించలేదు. చేసేదేమీలేక ట్రంప్ ఓటమిని అంగీకరించారు. ఈ మొత్తం ఘటనలో ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించిన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హీరోగా నిలిస్తే, ట్రంప్ అవమానభారంతో జీరోగా మిగిలి అందరి ముందు తలవంచుకోవాల్సి వచ్చింది. వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే కనీవినీ ఎరుగని అసాధారణ ఘటన ఇది. ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా మిగిలిపోయిన దుశ్చర్య ఇది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండదండలతో ఆయన అనుచరులు అమెరికా చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్‌పై బుధవారం దాడి చేశారు. ఆగ్రహావేశాలతో రెచ్చిపోయి హింసాకాండకు దిగారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడానికి కాంగ్రెస్ ఉభయసభలు సమావేశమైన సమయంలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు అమెరికా జెండాలు చేతబూని వచ్చి ఆ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకారుల్ని నిలువరించడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగం, కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ హింసాకాండ దాదాపు నాలుగు గంటల సేపు సాగింది. పోలీసుల కాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు మరణించారు. డజనుకి పైగా పోలీసులు గాయపడ్డారు. పదుల సంఖ్యలో ఆందోళనకారుల్ని వాషింగ్టన్ మెట్రోపాలిటన్ చీఫ్ పోలీసు రాబర్ట్ జే కాంటీ వెల్లడించారు. జాతీయ భద్రతా బలగాలు రంగంలోకి దిగాక పరిస్థితులు అదుపులోనికి వచ్చాయి. వాషింగ్టన్ మేయర్ మురీల్ బౌజర్ తొలుత రాత్రి పూట కర్ఫ్యూ ప్రకటించారు. ఆ తర్వాత 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితుల్ని విధించారు. ప్రజాస్వామ్యంపై దాడి : బైడెన్ ట్రంప్ అనుచరుల దాడి ఘటనపై కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలో ఇదో చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. ‘‘మన ప్రజాస్వామ్యంపై అసాధారణ స్థాయిలో దాడి జరిగింది. ఈ ఆధునిక కాలంలో ఎప్పుడూ ఇలాంటి దాడిని మనం చూడలేదు. మన స్వేచ్ఛపైనా, మన ప్రజాప్రతినిధులపైనా, మనకి రక్షణ కల్పించే పోలీసులపైనా, ప్రభుత్వ ఉద్యోగులపైనా దాడి జరిగింది’ అని బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అసలు సిసలు అమెరికా ఇది కాదని బైడెన్ అన్నారు. ‘‘క్యాపిటల్ భవనం దగ్గర జరిగిన భయానక దృశ్యాలు చూసి ఇదే అసలైన అమెరికా అనుకుంటే పొరపాటు. తీవ్రవాద భావాలు కలిగిన కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. వారి సంఖ్య చాలా తక్కువ. ఇలాంటి ఘటనలకు ఇంక తెరపడాలి’’ అని అన్నారు. శాంతియుతంగా ప్రవర్తించాలంటూ ట్రంప్ వీడియో డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారుల్ని ప్రోత్సహిస్తూ క్యాపిటల్ భవనం దగ్గరకు వెళ్లండంటూ ట్వీట్లు పెట్టారు. ‘‘మీరు నింగీనేల ఏకమయ్యేలా పోరాడాలి. లేకపోతే మీకు మన దేశం దక్కదు’’, ‘‘బలహీనులెవరైనా ఉంటే బయటకు వచ్చేయండి బలవంతులకే ఇది సమయం’’ అని ట్వీట్లు చేశారు. ఎప్పుడైతే వారి దాడి హింసకు దారితీసిందో వెనక్కి తగ్గిన ఆయన శాంతి మంత్రం జపిస్తూ ఒక వీడియోని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ‘‘ఈ ఎన్నికల ప్రక్రియ అంతా తప్పులతడకే. కానీ మనమేమీ చెయ్యలేం. అందరం శాంతియుతంగా వ్యవహరిద్దాం. అందరూ ఇళ్లకు వెళ్లపోండి’’ అంటూ తన అనుచరగణానికి ఆ వీడియోలో విజ్ఞప్తి చేశారు.అయితే ట్విట్టర్ ట్రంప్ ప్రోత్సహిస్తూ పెట్టిన ట్వీట్లను ఆయన ఖాతానుంచి తొలగించింది. 12 గంటల సేపు ట్రంప్ ఖాతాని లాక్ చేసింది. ఫేస్బుక్ కూడా ట్రంప్ అకౌంట్‌ని 24 గంటలు పాటు బ్లాక్ చేసింది. 4 గంటలు ఏం జరిగిందంటే... క్యాపిటల్ భవనాన్ని ముట్టడించడానికి అనూహ్యంగా, ఒక వెల్లువలా వచ్చిన నిరసనకారుల్ని చూసి పోలీసులు తేరుకునే లోపు వారంతా బ్యారికేడ్లు దూకి క్యాపిటల్ భవనం లోపలికి దూసుకుపోయారు. ట్రంప్ పేరున్న జెండాలు పట్టుకొని ఆయనకి అనుకూల నినాదాలు చేస్తూ సెనేట్ చాంబర్ అంతా కలియ తిరిగారు. కాంగ్రెస్ సభ్యుల్ని ఉద్దేశించి ‘‘వాళ్లంతా ఎక్కడ’’ అని ట్రంప్ మద్దతుదారుడు ఒకరు తలుపులు దబదబా బాదుతూ హాలంతా తిరిగాడు. కొందరు కిటికీలు బద్దలు కొట్టారు. మరికొందరు రూఫ్లపైకి ఎక్కారు. నానా బీభత్సం సృష్టించారు. దీంతో ప్రజాప్రతినిధులు, క్యాపిటల్ సిబ్బంది భయంతో వణికిపోయారు. కొందరు టేబుల్స్ కింద దాక్కున్నారు. మరికొందరు మోకాళ్లలో తలదూర్చి ప్రార్థనలు చేశారు. ఇంతలో మరికొందరు ఆందోళనకారులు ప్రిసైడింగ్ ఆఫీసర్ చైర్‌ని ఆక్రమించారు. సెనేట్‌లో వేదిక ఎక్కి గోల గోల చేశారు. ‘ట్రంప్ ఎన్నికల్లో గెలిచారు’ అంటూ గట్టిగా కేకలు వేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు ఆగలేదు. ముందుకు దూసుకువెళ్లారు. అప్పటికే కాంగ్రెస్ ఉభయసభల సమావేశానికి ఆధ్వర్యం వహిస్తున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కుర్చీలోంచి లేచి వెళ్లిపోయారు. మైక్ పెన్స్, ఇతర ప్రజాప్రతినిధుల్ని పోలీసులు రహస్య సొరంగ మార్గం ద్వారా అదే భవనంలోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. క్యాపిటిల్ భవనానికి తాళాలు వేసి బాష్పవాయువును ప్రయోగించారు. క్యాపిటల్ భవనంలో కాల్పులు : మహిళ మృతి ట్రంప్ మద్దతుదారులు వెనక్కి తగ్గకపోవడంతో కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. పోలీసులు, కేంద్ర బలగాలు క్యాపిటల్ భవనాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో తొలుత అశిల్ బబ్బిత్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. తుపాకీ గుండు ఆమె ఛాతీలోకి దూసుకువెళ్లడంతో మరణించింది. అశిల్ అమెరికా వైమానిక దళంలో 14 ఏళ్లపాటు సేవలు అందించారు. ట్రంప్‌కి వీరాభిమాని అని ఆమె భర్త వెల్లడించారు. దాడి జరగడానికి ముందు రోజు ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో ‘‘మమ్మల్ని ఎవరూ ఆపలేరు. వాళ్లు ప్రయత్నిస్తారేమో కానీ తుఫాన్ మొదలైంది. 24 గంటల్లోనే వాషింగ్టన్‌ను చుట్టుముట్టేస్తుంది’’ అని ట్వీట్ చేశారు. అశిల్తో పాటు పోలీసు కాల్పుల్లో మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. కావాలనే ఆందోళనకారుల్ని వదిలేశారా? కాంగ్రెస్ ఉభయ సభలు సమావేశమైన క్యాపిటల్ భవనం దగ్గర భద్రతా సిబ్బంది చూసీ చూడనట్టుగా ఆందోళనకారుల్ని వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ హింసాకాండకి సంబంధించిన వీడియోలో ట్రంప్ మద్దతుదారులు హాయిగా నడుచుకుంటూ లోపలికి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. అప్పుడు వారిని అడ్డుకునే నాథుడే కనిపించలేదని సీఎన్ఎన్ చానల్ కథనాన్ని ప్రసారం చేసింది. బారికేడ్లు దాటుకుంటూ, కిటికీల్లోంచి దూరుతూ, గోడలు ఎక్కి ట్రంప్ మద్దతుదారులు నానా రచ్చ చేశారు. ‘‘ట్రంప్ మద్దతుదారులు దాడి చేస్తారని పోలీసులకి తెలుసు. హింసాకాండ జరుగుతుందని వారి కి ముందే తెలుసు. అయినప్పటికీ భద్రతా ఏర్పాట్లు సరిగా చెయ్యలేదు. క్యాపిటల్ భవనం దగ్గర భద్రతా ఏర్పాట్లలో డొల్లతనం బయటపడింది’’ అని అమెరికా పోలీసు శాఖకి చెందిన మాజీ అధికారి తిమోతి డిమాఫ్ అన్నారు. నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగిన తర్వాతే పరిస్థితులు అదుపులోనికి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. క్యాపిటల్ భవనం గోడ ఎక్కుతున్న ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై నుంచి ఆందోళనకారులపైకి తుపాకులు గురిపెట్టిన పోలీసులు -
వివాదంలో ట్రంప్ విహారం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన చర్యతో వివాదంలో ఇరుక్కున్నారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకి, ప్రస్తుతం వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్ ఆసుపత్రి వెలుపలకు వచ్చి మరీ తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ విమర్శల పాలయ్యారు. వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే, నిబంధనలు ఉల్లంఘించి బయటతిరగడాన్ని వైద్య నిపుణులు సైతం తప్పుబడుతున్నారు. అధ్యక్షుడు ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం, ఆందోళనల నేపథ్యంలో ట్రంప్ వైద్య బృందంలోని కీలక సభ్యుడు, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం పల్మనరీ నిపుణుడు బ్రియాన్ గారిబాల్డి ప్రకారం సోమవారం ఆయన ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఈ అంచనాల మధ్య ట్రంప్ సర్ప్రైజ్ ఔటింగ్ విమర్శలకు తావిచ్చింది. కోవిడ్-19 ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘించిన ట్రంప్ బులెట్ ప్రూఫ్ కారులో రోడ్డుపై కలియ దిరుగుతూ, అభివాదం చేస్తూ తన అభిమానులను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. అనంతరం కొద్దిసేపటికి ఆసుపత్రికి తిరిగి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన మాస్క్ ధరించి ఉన్నప్పటికీ ఐసోలేషన్ నిబంధనలను ఉల్లంఘించ బయటికి రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు కరోనా గురించి చాలా తెలుసుకున్నాను. నిజంగా స్కూలుకు వెళ్లినట్టుగా ఉందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. తన అభిమానులకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించడానికే బయటికి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య సిబ్బందికి, నర్సులకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. అటు ట్రంప్ కాన్వాయ్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ 14 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ కు పంపనున్నామని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ చీఫ్ జేమ్స్ ఫిలిప్స్ వ్యాఖ్యానించారు. వారు వైరస్ బారిన పడే అవకాశం ఉంది. చనిపోవచ్చు కూడా అంటూ ట్రంప్ వైఖరిపై మండిపడ్డారు. వైట్ హౌస్ అధికార ప్రతినిధి జూడ్ డీర్ మాత్రం ఈ విమర్శలను ఖండించారు. ట్రంప్ తో పాటు ఉన్న వారంతా ప్రొటెక్టివ్ గేర్ ను ధరించే ఉన్నారని, మెడికల్ టీమ్ ఈ పర్యటన సురక్షితమని చెప్పిన తరువాతనే ఆయన బయటకు వచ్చారని ప్రకటించడం విశేషం. pic.twitter.com/0Bm9W2u1x7 — Donald J. Trump (@realDonaldTrump) October 4, 2020 Every single person in the vehicle during that completely unnecessary Presidential “drive-by” just now has to be quarantined for 14 days. They might get sick. They may die. For political theater. Commanded by Trump to put their lives at risk for theater. This is insanity. — Dr. James P. Phillips, MD (@DrPhillipsMD) October 4, 2020 -
బెదిరింపు.. బరితెగింపు..
టెక్కలి: కోటబొమ్మాళి మండలంలోని అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడ ఎంపీటీసీ ప్రాదేశికానికి వైఎస్సార్సీపీ తరపున బల్లి కామరాజు నామినేషన్ వేశారు. ఆయనను అదే గ్రామానికి చెందిన బమ్మిడి లక్ష్మి అనే మహిళ బలపరిచారు. ఆ స్థానంలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ భార్య లలితకుమారి పోటీ చేస్తున్నారు. నియంత పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నిమ్మాడలో ఓ సాధారణ మహిళ తనకు ఎదురు తిరగడం ఏమిటని కింజరాపు కుటుంబ సభ్యులు తమ అనుచరుడు కింజరాపు కృష్ణతోపాటు మరికొంత మంది కార్యకర్తలతో బెదిరింపులకు దిగారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థికి మద్దతుగా బలపరుస్తూ వేసిన నామినేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోకపోతే పరిస్థితులు మరో విధంగా ఉంటాయని బమ్మిడి లక్ష్మి ఇంటికి వెళ్లి బెదిరించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు ఎస్పీని ఆశ్రయించడంతో, కోటబొమ్మాళి ఎస్ఐ లక్ష్మణరావు నిమ్మాడ గ్రామానికి చేరుకుని బమ్మిడి లక్ష్మి నుంచి వివరాలు సేకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిమ్మాడ గ్రామంలో టీడీపీ నాయకులను నిలువరించకపోతే పెద్ద ఎత్తున రిగ్గింగ్‌లు జరిగే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నియంత పాలనకు అడ్డా.. నిమ్మాడ పేరు చెప్పగానే అది కింజరాపు కుటుంబ సభ్యుల నియంత పాలనకు అడ్డా అంటూ ప్రజలంతా భయాందోళన చెందుతుంటారు. ఇక్కడ కింజరాపు కుటుంబ సభ్యులు చెప్పిందే వేదం... చేసిందే న్యాయం... అటువంటి నిమ్మాడ గ్రామంలో టీడీపీ జెండా తప్ప మరో జెండా ఎగరకూడదన్నది వారి అభిమతం. అటువంటి ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక విప్లవానికి ఓ సాధారణ మహిళ నాంది పలికింది. వైఎస్సార్ సీపీ తరపున ఎంపీటీసీ బరిలోకి దిగిన వ్యక్తికి మద్దతుగా నామి నేషన్‌ను బలపరించింది. ఇదే కింజరాపు అనుచరుల అక్కసుకు కారణమైంది. దీంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి మద్దతు పలికిన బమ్మిడి లక్ష్మి పై బెదిరింపులకు పాల్పడ్డారు...తమకు తెలియకుండా వైఎస్సార్ అభ్యర్థికి మద్దతు పలుకుతావా...మమ్మల్ని ఎదురిస్తే పరిస్థితు లు మరోలా ఉంటాయ్ అంటూ కింజరాపు హరిప్రసాద్, వారి అనుచరులు కింజరాపు కృష్ణ, అచ్చెన్నాయుడు, అన్నెపు రాధాకృష్ణ తదితరులు బెదిరించినట్లు బాధితురాలు లక్ష్మి వైఎస్సార్ సీపీకి చెందిన కోటబొమ్మాళి నాయకుల వద్దవాపోయింది. తమకు ఆసరాగా ఉ న్న జీడిచెట్లను సైతం ధ్వంసం చేస్తామంటూ బెదిరించినట్లు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కోట»ొమ్మాళి వైఎస్సార్ సీపీ నాయకులంతా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాలతో కోట»ొమ్మాళి ఎస్ఐ లక్ష్మణరావు నిమ్మాడ గ్రామానికి చేరు కుని బాధితురాలు లక్ష్మి నుంచి వివరాలు సేకరించారు. ప్రతి ఎన్నికల్లో నిమ్మాడ గ్రామంలో విచ్చలవిడిగా రిగ్గింగ్‌లు జరుగుతాయనడానికి గతంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. ఈ సారి పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, గత సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. కురుగుంట గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని పేదల నుంచి పరిటాల వర్గీయులు డబ్బులు వసూలు చేశారు. తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని కోరిన వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో బాధితులు అనంతపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులను పరామర్శించిన తోపుదుర్తి చందు.. కురుగుంట గ్రామస్తులను ఆదివారం వైఎస్సార్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు చందు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల ఆగడాలు అధికమయ్యాయని మండిపడ్డారు. కౌంటర్ కేసులతో బాధితులను భయపెడుతున్నారన్నారు. పరిటాల వర్గీయులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. -
మన్యంలో యాక్షన్ టీం?
సాక్షి, మహబూబాబాద్: కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో చాలా రోజుల తరువాత మావోలు వచ్చారనే చర్చ సాగుతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం విస్తరించి ఉండటం, చత్తీస్ఘడ్ అటవీ ప్రాంతం నుంచి నేరుగా జిల్లాలోకి వచ్చే అవకాశాలు ఉండటంతో మావోయిస్టు యాక్షన్ టీం వచ్చినట్లు చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే యాక్షన్ టీం సభ్యులు మండలాల్లో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మండలంతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఇక్కడి ఆర్ఎంపీ డాక్టర్ వద్ద చికిత్స చేయించుకున్నారని సమాచారం. యాక్షన్ టీంలు వస్తే ఎందుకు వచ్చారు? ఇన్ఫార్మర్లుగా పనిచేసే వారిని గాని, అధికార పార్టీ నాయకులను గానీ టార్గెట్ చేసేందుకు వచ్చారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. టార్గెట్‌గా ఉన్న రాజకీయ నాయకులను, ఇన్ఫార్మర్లను కొద్ది రోజుల పాటు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌ఘడ్ నుంచి మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, భద్రన్న, ధర్నన్న తదితరులతో కూడిన యాక్షన్ టీం కొత్తగూడ, గంగారం మండలాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దశలో రెండు రోజులుగా పోలీసులు మావోయిస్టు సానుభూతి పరులు, మద్దతు దారులను, అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు విచారించి, వివరాలు సేకరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో మావోల కదలికలతో కలకలం కొనసాగుతోంది. హరిభూషణ్ వచ్చాడా.. గంగారం మండలంలోని మడగూడ గ్రామానికి చెందిన మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ ఆలియాస్ హరిభూషణ్, భద్ర న్న, ధర్మన్నలు వారి యాక్షన్ టీంతో జిల్లాలోకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. గంగారం మండలంలోని మడగూడెం గ్రామానికి చెందిన మావోయిస్ట్ అగ్ర నాయకుడు యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 40మంది మావోలతో కలసి కోమట్లగూడెం, జంగాలపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతానికి వచ్చినట్లు చర్చ సాగుతోంది. ఈ ప్రాంతంలో స్వగ్రామమైన మడగూడెం వస్తున్నాడని, వచ్చి వెళ్లారని రక రకాల వాదనలు వినిపిస్తున్నాయి.10సంవత్సరాల క్రితం గ ట్టి నిర్భందం సమయంలో పెద్దఎల్లాపూర్ గ్రామంలో ఒక భూ వివాదాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర కార్యదర్శి హోదాలో 200మంది మావోలతో గ్రా మాన్ని చుట్టుముట్టి హరిభూషణ్ సమస్యపై ప్రజా దర్భార్ నిర్వహించి సంచలనం సృష్టించారు. కేంద్ర కమిటీ నాయకుడిగా ఎదిగిన హరిభూషణ్ కొత్తగూడకు వచ్చే అవకాశాలు తక్కువనే మరో చర్చ కొనసాగుతోంది. ఈ చర్చ ఎంత వరకు వాస్తవం అనేది తేలాల్సి ఉంది. ఒక వేళ హరిభూషణ్ వస్తే ఎందుకు, ఏ విషయంపై వచ్చాడని, సాధారణంగా అతడు ఈ ప్రాంతానికి రాడు అని సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. కొత్త రిక్రూమెంట్ కోసమేనా..? తెలుగు రాష్ట్రాలలో గతంలో జరిగిన వరుస ఎన్కౌంటర్లు, వరుస లొంగుబాట్లు మావోయిస్టు పార్టీకి నష్టం చేకూర్చాయి. ప్రపంచీకరణంతో పాటు, పోలీసుల నిఘా పెరగటం, తదితర కారణాలతో గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు రిక్రూమెంట్ ఆగిపోయింది. దీంతో పార్టీ బలహీనంగా మారి, మావోయిస్టు ప్రభావం తగ్గిపోయింది. ఈ దశలో తిరిగి నూతన రిక్రూట్మెంట్ కోసం మావోయిస్టు యాక్షన్ టీం తిరిగి జిల్లాలోకి ప్రవేశించిందా..? లేకపోతే గత కొద్ది రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పోడు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఖరీఫ్ సాగు ప్రారంభం కావటం, పోడు సాగు చేయకుండా అధికారులు అడ్డుకుంటున్నా రు. ఈ దశలో ఏజెన్సీ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా మావోలు మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించుకునేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫారెస్ట్ దాడుల్లో భూములు కోల్పోయిన వారిని దళంలో చేర్చుకుని బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో మావోలు ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. ఇదే రిక్రూట్మెంట్కు మంచి సమయం అని మావోయిస్టు యాక్షన్ టీం ఏజెన్సీ గ్రామాల్లోకి ప్రవేశించిందని పోలీసులు భావిస్తున్నారు. డేగ కన్నులతో.. యాక్షన్ టీం జిల్లాలో ప్రవేశించిందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రెండు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. గతంలో పార్టీలో పనిచేసిన వారు, సానూభూతి పరులను విచారిస్తున్నారు. వారి పై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఈ దశలో ఏ క్షణంలో ఏమి జరుగునోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సాధారణ తనిఖీలు చేస్తున్నాం ఏజెన్సీ మండలాల్లో మావోయిస్టు యాక్షన్ టీం ప్రవేశించినట్లు ఎటువంటి సమాచారం లేదు. అలాంటివి అన్ని ఊహాగానాలే. నెల రోజులుగా ఏజెన్సీలో సాధారణ తనిఖీలు చేపడుతున్నాం. అనుమానాస్పద వ్యక్తుల సంచారం ఉంటే మీ దగ్గరిలోని పోలీసులకు సమాచారం అందించండి. –నంద్యాల కోటిరెడ్డి, ఎస్పీ -
దేశవ్యాప్తంగా భాజపా శ్రేణుల సంబరాలు
-
కుమ్మక్కు ‘పోటీ’కి తొలగిన ముసుగు
సాక్షి, అనంతపురం: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్ రఘవీరా, మాజీ మంత్రి శైలజానాథ్ పోటీ చేస్తున్నారు. వీరు మినహా ఏ రాజకీయ పార్టీలో కూడా చెప్పుకోదగ్గ నేతలు పోటీలో లేరు. రఘువీరా పోటీలో ఉన్న కళ్యాణదుర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరిని తప్పించింది. మరోనేత అమిలినేని సురేంద్రకు టిక్కెట్ ఇవ్వకుండా నామమాత్రపు పోటీగా ఉమామహేశ్వరరావును నిలిపింది. దీనికి కారణం రఘువీరాను గెలిపించడమే. కళ్యాణదుర్గంలో కాంగ్రెస్‌కు టీడీపీ సహకరించాలి, తక్కిన 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీకి సహకరిస్తారు. టీడీపీ సర్వేలో 1.2శాతం కాంగ్రెస్‌కు ఓట్లు ఉన్నాయని తేలింది. నియోజకవర్గంలో 2లక్షల ఓట్లు పోలైతే 2,400 ఓట్లు కాంగ్రెస్‌కు పోలవుతాయనేది వారి లెక్క. దీంతో రఘువీరాకు సహకరిస్తే తక్కిన నియోజకవర్గాల్లో కనీసం 1500 ఓట్లు టీడీపీకి పోలవుతాయని, అవి గెలుపోటములును ప్రభావితం చేస్తాయనేది చంద్రబాబు ఆశ. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, ఎలాగూ యూపీఏలో చేరేందుకు టీడీపీ సిద్ధమైందని, తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకున్నామని, ఏపీలో కూడా పెట్టుకుందామని రఘువీరా చంద్రబాబును మొదట్లో సంప్రదించారని తెలుస్తోంది. కాంగ్రెస్, టీడీపీ పొత్తును ఏపీ ప్రజలు హర్షించరని, ఇదే జరిగితే చాలా దారుణ ఫలితాలు ఉంటాయని చంద్రబాబు అభిప్రాయపడినట్లు సమాచారం. అందుకే లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘కొన్ని స్థానాల్లో మీకు సహకరిస్తాం.. తక్కిన స్థానాల్లో తమకు సహకరించాలని’’ చంద్రబాబు సూచించినట్లు చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ‘అనంత’లో రఘువీరాకు టీడీపీ మద్దతిస్తోంది. అంతటితో టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు ఆగలేదు. చంద్రబాబు అస్త్రమే ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ వెనుక చంద్రబాబు ఉన్నారనేది స్పష్టమవుతోంది. ‘అనంత’లో వైఎస్సార్సీపీ నామినేషన్లు వేసిన 8 నియోజకవర్గాల్లో అచ్చం అవే పేర్లున్న వారితో కేఏ పాల్ నామినేషన్లు వేయించారు. వీరంతా ఎవరని ఆరా తీస్తే అంతా టీడీపీ వర్గీయులే. ఆ పార్టీలో సభ్యత్వం ఉన్నవాళ్లే. టీడీపీ నేతలు చెప్పిన వారికే కేఏ పాల్ బీఫారం ఇచ్చారంటే వైఎస్సార్సీపీని దెబ్బతీసే కుట్రతోనే ప్రజాశాంతి పార్టీని స్థాపించారని తెలుస్తోంది. వైఎస్సార్సీపీని పోలిన కండువా, ఫ్యాన్‌ను పోలిన హెలికాప్టర్ గుర్తులతో ఓటర్లను తికమక పెట్టి వైఎస్సార్సీపీ ఓట్లు చీల్చేలా టీడీపీ, ప్రజాశాంతి మధ్య ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. అనంతపురం అభ్యర్థిగా నామినేషన్ వేసిన పగడి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరికి అనుచరుడు. డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు(టీడీపీ కార్పొరేటర్ విజయశ్రీ తండ్రి). ప్రజాశాంతి తరఫున నామినేషన్ వేశారు. రాయదుర్గంలో నామినేషన్ వేసిన ఉండాల రామచంద్రారెడ్డి డి.హీరేహాళ్ టీడీపీ మండల కన్వీనర్ హనమంతరెడ్డి చిన్నాన్న కుమారుడు. నామినేషన్లో ఇతన్ని ప్రతిపాదించింది కూడా హనుమంతరెడ్డి సోదరుడే. కదిరి అభ్యర్థిగా నామినేషన్ వేసిన సన్నక సిద్ధారెడ్డి గాండ్లపెంట మండలం కురమామిడికి చెందిన టీడీపీ నేత. కందికుంట ప్రసాద్ అనుచరుడు. ఇటీవలే టీడీపీలో చేరిన గాజుల ప్రతాప్ బావమరిదే సిద్ధారెడ్డి. ధర్మవరంలో నామినేషన్ వేసిన పెద్దారెడ్డిగారి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరుడు. చిగిచెర్ల గ్రామంలో టీడీపీ నాయకుడు. వీరే కాదు రాప్తాడులో ప్రకాశ్, ఉరవకొండలో విశ్వనాథరెడ్డి, పెనుకొండలో ఎస్. శంకర్‌నారాయణ, కళ్యాణదుర్గంలో నేసే ఉషారాణి పేరుతో ప్రజాశాంతి తరఫున నామినేషన్లు వేసిన వారంతా టీడీపీ నేతలే. ఎమ్మెల్యే అభ్యర్థులతో నడుస్తున్న వారే. జనసేన కూడా అందులో భాగమే.. జనసేన తరఫున కూడా పవన్ కళ్యాణ్ డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపారు. గుంతకల్లు టీడీపీ టిక్కెట్ ఆశించి భంగపడిన మధుసూదన్‌గుప్తా జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గుంతకల్లులో టీడీపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని, అసెంబ్లీ అభ్యర్థి ఓడిపోయినా పర్లేదు.. ఎంపీగా తన కుమారుడి ఫలితాలపై ప్రభావం ఉంటుందని జేసీ అప్రమత్తమయ్యారు. గుప్తా నివాసానికి వెళ్లి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గుప్తా ససేమిరా అనడంతో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేయించి గుప్తాను బరిలో నుంచి తప్పించేలా చూస్తున్నారని సమాచారం. దాదాపుగా గుప్తా నామినేషన్ ఉపసంహకరించుకుంటారని జేసీ వర్గీయులు చెబుతున్నారు. ఇలా కాంగ్రెస్, టీడీపీ, జనసేన, ప్రజాశాంతి పార్టీలు కలిసి కుమ్మక్కు రాజకీయం చేస్తున్న విషయం ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. -
డ్వాక్రా మహిళలపై మంత్రి పరిటాల వర్గీయులు దాడి
-
9 మంది దినకరన్ మద్దతుదారులపై వేటు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో దినకరన్ మద్దతుదారులుగా ఉన్న 9 మంది నేతలపై ఆ పార్టీ వేటువేసింది. అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శులు పి.వెట్రివేల్, ఎన్జీ పార్దిబన్, ఎం.రంగసామి, తంగతమిళ్‌సెల్వన్, వీపీ కలైరాజన్, వి.ముత్తయ్య, పుగళెంది, అధికార ప్రతినిధులు నంచిల్ సంపత్, సీఆర్ సరస్వతీలను పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్కే నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో అన్నాడీఎంకేకు ద్రోహం చేసినందుకే వీరిపై చర్య తీసుకున్నట్లు సీఎం పళనిస్వామి మీడియాకు తెలిపారు. ప్రతిపక్ష డీఎంకేతో కుమ్మక్కవడం వల్లే దినకరన్ గెలిచారని ఆరోపించారు. దినకరన్‌ను రామాయణంలో ‘మాయలేడి’గా ఆయన అభివర్ణించారు. మరోవైపు తన మద్దతుదారుల్ని పార్టీ నుంచి తొలగించే అధికారం పళనిస్వామి, పన్నీర్‌సెల్వంలకు లేదని దినకరన్ స్పష్టం చేశారు. -
ప్రజా సంకల్ప యాత్రకు.. మేము సైతం!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: దుష్టపాలనకు చరమగీతం పాడాలి... సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ స్థాపించుకోవాలి! వంచన నాయకులకు బుద్ధి చెప్పాలి... ప్రజల నాయకుడు జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలి! నీటిమూటల్లాంటి హామీలతో మోసాలకు నూకలు చెల్లాయని చెప్పాలి... అన్ని వర్గాలకు అండగా నిజాయతీతో పనిచేసే జగన్ నాయకత్వం రాష్ట్రానికి కావాలి! చంద్రబాబు పాలనలో ప్రజలు పడుతున్న కష్టనష్టాలు తెలుసుకొనేందుకు జగన్ తలపెట్టిన ‘ప్రజాసంకల్పం’ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించాలి... గత దఫా చంద్రబాబు పాలనలో చీకటిని పారద్రోలేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వహించిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను స్ఫూర్తిని అణుఅణువునా నింపుకొని పనిచేయాలి! ఇలా ఒకటీ రెండు కాదు 30 కిలోమీటర్ల పొడవున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహామండలి సభ్యుడు, నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో సాగిన పాదయాత్రలో జయజయ ధ్వానాలు వినిపించాయి. రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 6వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభించనున్న ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర విజయవంతం కావాలని ఆశిస్తూ ప్రజలు సంఘీభావం ప్రకటించారు. పుణ్యక్షేత్రం తిరుపతి మీదుగా ఇచ్ఛాపురం వరకూ 3 వేల కిలోమీటర్ల పొడవునా కోట్లాది ప్రజలతో మమేకమవుతూ రానున్న జననేతకు జయం కలగాలని శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహించారు. జగన్ ‘ప్రజాసంకల్పం’ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ సంఘీభావంగా ఉదయం నరసన్నపేటలోని శ్రీఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి పాదయాత్ర మొదలైంది. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఈ యాత్రను ప్రారంభించారు. జలుమూరు, బుడితి తదితర గ్రామాల మీదుగా సాయంత్రానికి శ్రీముఖలింగం పుణ్యక్షేత్రానికి ఈ యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి కృష్ణదాస్ ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ, వారి కష్టాలు, కడగండ్లూ తెలుసుకుంటూ జగన్ పాదయాత్ర సాగుతుందని చెప్పారు. రాష్ట్ర విశాల ప్రయోజనాలు, సర్వతోముఖాభివృద్ధి కోసమే ఈ మహాకార్యక్రమం తలపెట్టారని అన్నారు. రాష్ట్ర ప్రతిపక్షనేతగా ఇప్పటికే అనేక ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన తీరు హర్షణీయమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించాలనే సంకల్పంతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మళ్లీ వైఎస్ సంక్షేమ కార్యక్రమాలను నిలబెట్టాలనే జగన్ తపిస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు ఉద్దేశించిన ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావంగా నరసన్నపేట నియోజకవర్గ శ్రేణులన్నీ తరలివచ్చాయన్నారు. జగన్మోహన్రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో, ఎప్పుడు తమ కష్టాలు తొలగుతాయోనని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్యాయ పాలన ఎప్పుడు తొలగుతుందోనని పూజలు చేస్తున్నారన్నారు. అనేక అబద్ధాలతో, మోసాలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కార్పొరేట్ సంస్థలకు మాత్రమే లబ్ధి చేకూర్చుతున్నారని విమర్శించారు. బీసీల సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన ఇతర వర్గాలకూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇలా అన్ని వర్గాలకు రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు. రైతుల శ్రేయస్సు కోసం దీర్ఘకాలంగా పెండింగ్‌లోనున్న సాగునీటి ప్రాజెక్టులకు కార్యరూపం తీసుకొచ్చిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా అరాచక పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ పాలనను తుదముట్టించి వైఎస్ కుమారుడిగా జగన్మోహన్రెడ్డి మళ్లీ ఆనాటి సంక్షేమ పాలనను తీసుకొస్తారని ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే తమకు మేలు జరుగుతుందని రైతులు ఒక్కరే కాదు మహిళలు, యువత, విద్యార్థులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాలవారూ కోరుకుంటున్నారని వెల్లడించారు. ఇంతమంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జగన్‌ను ముఖ్యమంత్రి చేసేవరకూ పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ప్రజాసంకల్పం పాదయాత్ర విజయవంతమవ్వాలని, ఆయన మనస్సులోని భావాలన్నీ కార్యరూపం దాల్చేలా ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. నరసన్నపేట నుంచి శ్రీముఖలింగం వరకూ జరిగిన పాదయాత్రలో నరసన్నపేట పట్టణంతో పాటు నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాల నుంచి భారీఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ సంఘీభావం ప్రకటించారు. పార్టీ నాయకులు ధర్మాన పద్మప్రియ, ధర్మాన రామదాస్, అంధవరపు సూరిబాబు, టి.కామేశ్వరి, శిమ్మ రాజశేఖర్, కొయ్యాన సుశీల, మెండ విజయశాంతి, కొయ్యాన సూర్యారావు, చిన్నాల వెంకట సత్యన్నారాయణ, బుక్కా లక్ష్మణరావు, తంగి మురళీకృష్ణ, వాన గోపి, కనుసు సీతారాము, కోన దామోదరావు, పైడి విఠలరావు, ధర్మాన రామలింగంనాయుడు పాల్గొన్నారు. కృష్ణదాస్ దంపతుల ప్రత్యేక పూజలు జలుమూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, అతని సతీమణి పద్మప్రియలు గురువారం శ్రీముఖలింగంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాత్ర సజావుగా జరిగేందుకు శ్రీముఖలింగేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరారు. పేదల కష్టాలు తొలగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు జగన్మోహన్రెడ్డి గోత్ర నామాలతో ఏకవార అభిషేకాలు నిర్వహించి వారాహి అమ్మవారికి కుంకమ పూజలు చేయించారు. దేవాలయ ఆవరణలోని దేవతా విగ్రహాలకు పూజలు చేశారు. కార్యక్రమంలో ధర్మాన రామదాస్, ఎంపీపీ కె.సుశీల, జెడ్పీటీసీ సభ్యురాలు మెండ విజయశాంతి, ధర్మాన రాగలింగంనాయడు, చిన్నాల వెంకట సత్యనారాయణ,శిమ్మ రాజశేఖర్, వైస్ ఎంపీపీ ప్రతినిధి టి.సతీష్, బుక్కా లక్ష్మణరావు, బసవ రత్నాలు, యోగీశ్వరరావు పాల్గొన్నారు. -
ఎస్పీ, బీఎస్పీ వర్గీయుల మధ్య ఘర్షణ
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మీరట్‌లో సమాజ్‌వాది, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ కర్యకర్తలు బాహాబాహీకి దిగారు. పోలింగ్ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కితార్ గ్రామంలో ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తల మధ్య తలెత్తిన వివాదం కాల్పుల వరకూ వెళ్లింది. ఇక్కడి పోలింగ్ బూత్ వద్ద జరిగిన గొడవలో ఓ వ్యక్తి గాయపడగా.. అనంతరం ఓ వర్గం వారు మరో వర్గంపై కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించినట్లు తెలిపారు. తొలిదశ పోలింగ్ 15 జిల్లాల్లోని 73 సీట్లకు జరుగుతుంది. -
ప్లేటు ఫిరాయించిన త్రిష
నటి త్రిష ప్లేటు పిరాయించారా? ఆమె ప్రవర్తన చూసిన వారి నుంచి ఇందుకు అవుననే సమాధానమే వస్తోంది. ఈ అమ్మడిపై జల్లికట్టు మద్దతుదారులు మండిపడుతున్నారు. మూగజీవుల సంరక్షణ సంస్థ పెటాకు నటి త్రిష ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా జల్లికట్టు క్రీడ నిషేధానికి పెటా నిర్వాహకులే కారణం. వారి పిటిషన్ కారణంగానే సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించింది. దీంతో జల్లికట్టుకు నటి త్రిష వ్యతిరేకం అనే ప్రచారం జనాల్లో బాగా నాటుకుపోయింది. ప్రస్తుతం జల్లికట్టు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పోరాటమే జరుగుతోంది. కోర్టులు, ప్రభుత్వాల నిర్ణయం ఏమైనా తమిళుల సాంప్రదాయ క్రీడ జల్లికట్టును జరిపే తీరుతామని ప్రజలు ధృడ నిశ్చయంతో ఉండటమే గాకుండా మదురై తదితర గ్రామాల్లో జల్లికట్టును నిర్వహించారు. ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించిందన్నది వేరే విషయం. కాగా నటి త్రిష నటిస్తున్న గర్జన చిత్ర షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన జల్లికట్టు మద్దతుదారులు ఆమెపై దాడికి పాల్పడ్డారు కూడా. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అరెస్ట్ చేసి త్రిషను సురక్షితంగా అక్కడి నుంచి పంపివేశారు. కాగా కోవై లాంటి ప్రాంతాల్లో త్రిష నటించిన చిత్రాల విడుదలను అడ్డుకుంటామని జల్లికట్టు మద్దతుదారులు అంటున్నారు. ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో నటి త్రిష మరణించినట్లు పోస్టర్లు ముద్రించడం, ఆమెకు నివాళులర్పించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడం కలకలం రేకెత్తించింది. ఇలాంటి చర్యలకు తన ట్విట్టర్లో స్పంధించిన త్రిష స్త్రీలను గౌరవించే సంస్కారం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో త్రిషకు మద్దతుగా పలువురు నటీనటులు గళం విప్పడం విశేషం. వారిలో నటుడు కమలహాసన్, నటి రాధికాశరత్‌కుమార్ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారన్నది గమనార్హం. కాగా కమలహాసన్ త్రిషను సమర్థించే విధంగా ఆమెకు మనకు ఉన్న వ్యత్యాసాన్ని ఊరు గుర్తెరుగుతుంది. సిద్దాంతం వర్థిల్లేలా. జల్లికట్టు ఎద్దులు వర్థిల్లేలా పాటుపడదాం. ఉద్వేగాలను పక్కన పెట్టి ప్రేమను పంచుకుందాం అని వ్యాఖ్యానించారు. కాగా భయపడిందో ఏమో గానీ త్రిష పలాయనం చిత్తగించారు. ఈ బ్యూటీ తాను జల్లికట్టుకు వ్యతిరేకం కాదని, తానెప్పుడూ జల్లికట్టుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని ప్లేటు ఫిరాయించారు. తన ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్ చేశారని అన్నారు. అయితే ఈ అమ్మడు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా జల్లికట్టు మద్దతుదారులు ఇప్పుడు వినే పరిస్థితిలో లేరు. త్రిష నిజంగా జల్లికట్టుకు వ్యతిరేకం కాకుంటే వెంటనే తను పెటాను వదిలి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా నటి కుష్బూ కూడా పెటాకు వ్యతిరేకంగా స్పందించి ఉండడం గమనార్హం. -
తలనీలాలు సమర్పిస్తున్న జయ అభిమానులు
-
విస్తుపోయిన అభిమానులు
-
విస్తుపోయిన అభిమానులు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి చేసిన ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అనారోగ్యం విషమించడంతో ‘అమ్మ’ కన్నుమూసిందని స్థానిక తమిళ చానళ్లు ప్రచారం చేయడంతో అభిమానులు, మద్దతుదారులు ఒక్కసారి విస్తుపోయారు. నిజంగానే ‘అమ్మ’ లేదనుకుని కన్నీరుమున్నీరయ్యారు. గుండెలు బాదుకుంటూ శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే అవన్నీ వదంతులనీ అపోలో ఆస్పత్రి ప్రకటించాయి. జయలలితకు చికిత్స కొనసాగుతోందని వెల్లడించాయి. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ‘అమ్మ’ ప్రాణాలతోనే ఉందన్న ప్రకటనతో అభిమానులు తేరుకున్నారు. తమ నాయకురాలు కోలుకోవాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. జయ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. -
మళ్లీ అఖిలేశ్ వర్గం రచ్చ షురూ
-
మళ్లీ అఖిలేశ్ వర్గం రచ్చ షురూ
లక్నో: సమాజ్‌వాది పార్టీలో అసంతృప్తి మరోసారి పెల్లుబుకుతోంది. ఓపక్క తమలో ఎలాంటి విభేదాలు లేవని, తామంతా ఒకటే అని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటన చేయగా వెంటనే శివపాల్ యాదవ్‌ను పార్టీ పగ్గాల నుంచి తప్పించి వాటిని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కే అప్పగించాలని పలువురు అఖిలేశ్ మద్దతుదారులు, యువకులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఏకంగా పార్టీ కార్యాలయాన్ని చుట్టుముట్టి గట్టిగా నినాదాలు చేశారు. ఎర్రటి టోపీలు, అఖిలేశ్ ముఖచిత్రంతో ముద్రించిన టీ షర్ట్లు ధరించి పార్టీ కార్యాలయం గోడలు, అక్కడి చెట్లపైకి ఎక్కి అఖిలేశ్ మద్దతుగా అరిచారు. పార్టీ భవిష్యత్ అంతా ములాయం సింగ్ 43 ఏళ్ల కుమారుడి చేతిలోనే ఉంటుందని వారన్నారు. అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసినప్పటికీ వారిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. వీఐపీల వాహనాలు పార్క్ చేసే స్థలం వరకు దూసుకెళ్లారు. -
'అఖిలేశన్నే నడిపిస్తాడు.. ఆయనకే ఇవ్వాలి'
లక్నో: సమస్య మొత్తం సర్దుమణిగిందని, పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు రాబోయే ఎన్నికల్లో పార్టీకి సంపూర్ణ విజయానికి కృషిచేయాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆదేశించగా శనివారం మళ్లీ సమస్య మొదటికొచ్చింది. రాష్ట్ర పార్టీ పగ్గాలు ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు లక్నోలోని పార్టీ కార్యాలయం ముందుకు వచ్చి నినాదాలు చేశారు. నెత్తిన ఎర్ర టోపీలు ధరించి చేతిలో అఖిలేశ్, ఆయన భార్య డింపుల్ ఉన్న పోస్టర్లను పట్టుకొని నినాదాలు చేస్తూ బారులు తీరారు. 'అఖిలేశ్ ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేయాలి, అఖిలేశన్న పార్టీని నడిపించగల సమర్థుడు' అంటూ గట్టిగా అరుస్తూ పార్టీ కార్యాలయం వద్ద సందడి చేశారు. సమాజ్‌వాది పార్టీకి చెందిన నాలుగు ఇతర సంస్థలు ఈ డిమాండ్ తో పార్టీ అధినేత ములాయం సింగ్ కు లేఖ కూడా రాశారు. అందులో తాము అఖిలేశ్ నాయకత్వాన్ని తప్ప ఏ ఒక్కరి నాయకత్వాన్ని అంగీకరించబోమని కుండబద్ధలు కొట్టారు. అఖిలేశ్ ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడం యువత జీర్ణించుకోలేకపోతుందని, అవసరం అయితే, ఆయన కోసం తమను తాము దహించుకొని ప్రాణత్యాగం చేసేందుకు యువత సిద్ధంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాఉండగా, ఉత్తరప్రదేశ్ సమాజ్ వాది పార్టీ పగ్గాలు శివ్ పాల్ యాదవ్ చేతుల్లోనే ఉంటాయని స్పష్టం చేస్తూ ఆ పార్టీ తరుపున ప్రకటన వెలువడింది. -
కరెంట్ షాక్ తగిలి టీడీపీ కార్యకర్త మృతి
-
వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా ఎన్ఆర్ఐల ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా అమెరికాలోని ఎన్ఆర్ఐలు శాంతిర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని పలు నగరాల్లో నివసిస్తున్న తెలుగువారు శాంతిర్యాలీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ నగరంలో నిర్వహించిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ సెంట్రల్ రీజనల్ కొ- ఆర్డినేటర్ సురేంద్రతోపాటు రమేష్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. డల్లాస్‌లోని థామస్ జఫర్సన్ పార్కులో నిర్వహించిన ప్రదర్శనలో పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతోపాటు వివిధ విశ్వవిధ్యాలయాల విద్యార్థులూ పాల్గొని జగన్‌కు మద్దతు ప్రకటించారు. యూఎస్ వైసీపీ విభాగం కో-కన్వినర్ గురువారెడ్డి ర్యాలీలకు మద్దతు తెలిపారు. -
వైఎస్ జగన్‌కి మద్దతుగా ఏపీలో రిలే దీక్షలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరింది. వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం గుంటూరు బయలుదేరి.. దీక్షా ప్రాంగణం చేరుకున్నారు. దీంతో గుంటూరు నగర శివారులోని నల్లపాడు రోడ్డు వద్ద వైఎస్ జగన్ చేపట్టిన దీక్షా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. అలాగే వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు రెండో రోజు రిలే దీక్షలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా : అనంతపురం : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో గుత్తి, గుంతకల్లు, పామిడిలో మూడో రోజు రిలే దీక్షలు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాయదుర్గం, కనేకల్, బొమ్మనహళ్, హీరేహళ్ మండలాల్లొ కనసాగుతున్న రిలే దీక్షలు. అనంతపురం : వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆధ్వర్యంలో పెనుకొండ, సోమందేవపల్లి, రొద్దం, గోరంట్ల మండలాల్లో రెండో రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు. రాయదుర్గంలో పార్టీ నేత కె.భారతి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. ఎస్వీయూలో సీఎం చంద్రబాబుకు వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నేతలు శవయాత్ర నిర్వహించారు. కదిరిలో స్థానిక ఎమ్మెల్యే చాంద్‌బాషా ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా. మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి... పోస్టాఫీస్ వద్ద బైఠాయింపు. గుంతకల్లు: స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నిరసన. గుత్తి : ఎమ్మార్వో కార్యాలయం ఎదుటు వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా. వైఎస్ఆర్ జిల్లా : ప్రొద్దుటూరు : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో మూడో రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు, పాల్గొన్న సర్పంచ్‌లు, కౌన్సిలర్లు. కడప : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ. ఈ ర్యాలీలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పాల్గొన్నారు. కమలాపురం : స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. సికేదిన్నె, వీఎన్ పల్లి, పెండ్లిమర్రి మండలాల్లో నిరసనలు. కడప : ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రిలే దీక్షలు. కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కడప :గుండుపల్లి, వీరబల్లి మండల కేంద్రాల్లో రెండో రోజుకు చేరిన రిలే దీక్షలు కడప : రామాపురం మండలం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే జి.మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. కాశినాయన మండలం నరసాపురంలో మండల కన్వీనర్ విశ్వనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కర్నూలు జిల్లా : డోన్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బుగ్గన రాజారెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు చిత్తూరు జిల్లా : చంద్రగిరి నియోజకవర్గ మండలం కన్వీనర్ల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను వైఎస్ఆర్ సీపీ నేతలు ముట్టడి నెల్లూరు జిల్లా : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా రెండో రోజు రిలే దీక్షలు ప్రారంభమైనాయి. కోవూరు : వైఎస్ఆర్ సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. కావలి: స్థానిక ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. గూడూరు : స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్, మరో నేత గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పవర్ గ్యాస్ సెంటర్ వద్ద నిరసన దీక్షలు... భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి సంఘం దీక్ష చేపట్టింది. ఈ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించారు. దీంతో విద్యార్థి సంఘం నాయకులు ఆ యత్నాన్ని అడ్డుకున్నారు. విద్యార్థి సంఘం నాయకులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చేటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా : కనిగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కనిగిరి, పామూరు, హెచ్‌ఎంపాడు, పీసీ పల్లి, సీఎస్ పురం మండలాల్లో రెండో రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు. కందుకూరు : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే పోతుల రామారావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. గిద్దలూరులో ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎం. అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చీరాల :జగన్ దీక్షకు మద్దతుగా చీరాల నుంచి భారీ సంఖ్యలో గుంటూరు తరలివెళ్లిన వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరు జిల్లా : తెనాలి : మార్కెట్ సెంటర్లో నియోజకవర్గ కన్వీనర్ అన్నాబత్తుల శివకుమార్ ఆధ్వర్యంలో రాస్తారోకో. కృష్ణాజిల్లా : జగ్గయ్యపేట : జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. హనుమాన్‌జంక్షన్: గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యలో కార్యకర్తల రిలే దీక్షలు. నందిగామ : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో 1100 మంది కార్యకర్తలు...నల్లపాడు తరలివెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా : పాలకొల్లు : పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యలో రిలే దీక్షలు. ఉండి : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా ఉండి నియోజకవర్గం నుంచి గుంటూరుకు భారీగా తరలి వెళ్లిన నేతలు, కార్యకర్తలు. యలమంచిలి : మండలం చించినాడలో పొత్తూరి బుచ్చిరాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. భీమవరం : వైఎస్ఆర్ సీపీ నేత గ్రంధీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీగా గుంటూరు తరలివెళ్లిన నేతలు, కార్యకర్తలు. పిఠాపురం : పెండెం దొరబాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు పశ్చిమగోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో గుంటూరు తరలి వెళ్లిన జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు. ఏలూరు బైపాస్ వద్ద ర్యాలీని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా : కాకినాడ : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా భానుగుడి సెంటర్లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. అలాగే జగన్ చేపట్టిన దీక్ష విజయవంతం కావాలని కోరుతూ కాకినాడ నియోజకవర్గ కన్వీనర్ బి.వేణుగోపాలకృష్ణ స్థానిక శ్రీపీఠంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టారు. అన్నవరంలో వైఎస్ఆర్ సీపీ నేత రాయవరపు భాస్కరరావు ఆధ్వర్యంలో శంఖవరం గ్రామ నేతలు, కార్యకర్తలు రిలే దీక్షలు విశాఖపట్నం జిల్లా : సీతమ్మధార ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉత్తర నియోజకవర్గ ఇంఛార్జ్ విజయకుమార్ ఆధ్వరంలో రిలే దీక్షలు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలా గురువులు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు, పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర కార్యదర్శి గొల్ల బాబూరావు. విశాఖపట్నం నగర పశ్చిమ నియోజకవర్గం ఇంఛార్జ్ మళ్ల విజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు పాయకరావుపేట : నియోజకవర్గ ఇంఛార్జ్ చెంగల వెంకట్రావు ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షలు శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో వైఎస్ఆర్ సీపీ నేత తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి. -
గిలానీ మద్దతుదారుల ఆందోళన..ఉద్రిక్తం
జమ్ము కశ్మీర్: జమ్ము కశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేర్పాటు వాద హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీషా గిలానీని గృహనిర్భంధం చేయడంపై ఆయన ఆనుచరులు ఆందోళన చేపట్టారు. గిలానీ ఇంటి ఎదుట ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ క్రమంలో మద్దతుదారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వాటర్‌కెనాన్, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. భారత్, పాకిస్థాన్ మధ్య చర్చల ప్రతిష్టంభన నేపథ్యంలో శనివారం సయ్యద్ అలీషా గిలానీనీ గృహనిర్బంధం చేశారు. ఇరుదేశాల మధ్య చర్చలకంటే ముందు దేశంలోని తీవ్ర వాదనేతలతో పాక్ సంప్రదింపులకు దిగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా సలహాదారుల స్థాయి సమావేశానికి అంగీకరించి మళ్లీ హురియత్ నేతల్ని విందుకు ఆహ్వానించడంలో పాక్ ఆంతర్యాన్ని భారత్ ప్రశ్నించింది. కాగా జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొనాలంటూ కశ్మీర్ వేర్పాటువాదులకు పాక్ జాతీయ భద్రతా సలహాదారుడు సర్తాజ్ అజీజ్ పిలపునిచ్చారు. ఇరుదేశాల భేటీకంటే ముందు ఆయనతో సమావేశమయ్యేందుకు హురియత్ నేతలు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం గ్రహించిన భద్రతా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా గురువారం హౌస్ అరెస్ట్ చేసి, వెంటనే ఎందుకు విడుదల చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ద్వారా ఈ చర్యను తప్పుబట్టారు. ఇలాంటి విమర్శల నేపథ్యంలో భద్రతా సిబ్బంది వెనక్కి తగ్గారు. హురియత్ నేతలను గృహ నిర్బంధం నుంచి విడుదల చేశారు. అయితే వారి కదలికలపై కన్నేసిన పోలీసులు శ్రీనగర్‌ను విడిచి వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీకి బయలుదేరిన వైఎస్ఆర్ సీపీ శ్రేణులు
కర్నూలు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యూఢిల్లీలో చేపట్టనున్న దీక్షకు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు శనివారం భారీగా తరలివెళ్లాయి. దీక్షలో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైన్‌ను కర్నూలు రైల్వే స్టేషన్లో స్థానిక లోక్‌సభ సభ్యురాలు బుట్టా రేణుక, స్థానిక శాసనసభ్యుడు ఎస్వీ మోహన్ రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మణిగాంధీలు జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. అందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసింది. -
దేవుడి ఊరేగింపులో పచ్చతమ్ముళ్ల దౌర్జన్యం
ప్రకాశం: జిల్లాలో ఓ ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. యద్దనపూడి మండలం చిమటవారిపాలెంలో శనివారం ఉదయం దేవుడి ఉత్సవాలలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సంప్రదాయంగా జరుగుతున్న ఉత్సవాలలో శ్రీరాముడి ఊరేగింపు వాహనాన్ని స్థానికులు చుక్కా రాంబాబు కుటుంబం ఏర్పాటు చేస్తున్నారు. అయితే సంప్రదాయాన్ని తుంగలో తొక్కుతూ టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఊరేగింపు ను అడ్డుకుని స్థానికులపై గొడవకు దిగారు. దేవుడిపై పెత్తనం చేసేందుకు కార్యకర్తల యత్నంచండంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
.... మాకేది సం'క్రాంతి'
అంతా భ్రాంతియేనా జీవితాన సం'క్రాంతి' ఇంతేనా అని తెలుగు తమ్ముళ్లు తెగ ఇదయి పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సంక్రాంతి పండుగ సందర్బంగా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులను పట్టించుకున్నట్లుగా కూడా తమను పట్టించుకోవడం లేదని 'పచ్చ కార్డుదారులు' (పచ్చ తమ్ముళ్లు) పడుతున్న ఆవేదన అంతా ఇంతాకాదు. నేడో రేపో నామినేటేడ్ పోస్టులు భర్తీ చేస్తారని ఆశపెట్టుకున్న తమ్ముళ్ల ఆశలు ఇప్పడే తీరేలా కనిపించడం లేదు. ఎందుకంటే చిత్తూరు జిల్లా తిరుపతి ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దాంతో ఎన్నికల కోడ్ కూసేసింది. దాంతో దసరా, దీపావళి, క్రిస్మస్ పండగలు ఒకదాని వెంట ఒకటి వరుసగా వెళ్లినా తమకు మాత్రం చంద్రన్న కానుక ఇప్పుడు అప్పుడే తమకు దక్కేలా లేదని తమ్ముళ్లు భావిస్తున్నారు. ఒకటా రెండో... ఏకంగా 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే అధినేత చంద్రన్న నామినేటేడ్ పోస్టులు భర్తీ చేస్తారని తమ్ముళ్ల ఆశలు పెట్టుకున్నారు. పరిస్థితి చూస్తుంటే తమ్ముళ్ల ఆశలు రోజురోజుకు ఆవిరి అవుతున్నాయి. రాష్ట్ర విభజన దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్‌పై హుదూద్ తుపాన్ బీభత్సం సృష్టించడం... ఆ వెంటనే బాబు రాజధాని నిర్మాణం అంటూ బాబుగారు దృష్టి కేంద్రీకరించడంతోపాటు సింగపూర్, జపాన్ ప్రయాణాలు... ఆ వెంటనే శూన్యమాసం తరుముకు వచ్చాయి. సమస్యల సుడిగుండం నుంచి తేరుకున్న బాబు నామినేటేడ్ పోస్టుల భర్తీకి జాబితా సిద్దం చేయాలంటూ పార్టీ సీనియర్ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకే కొత్త సంవత్సరం.. సంక్రాంతి పండగకు తమ పంట పండి చంద్రన్న కానుక ఇంటి వచ్చేస్తుందని తమ్ముళ్లు గంపెడాశతో ఎదురు చూశారు. చంద్రన్న కానుక తెల్లరేషన్ కార్డు దారుల ఇళ్లుకే చేరింది కానీ... తమ ఇంటికి రాలేదని తమ్ముళ్లు ఫీలైపోతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కాలం నేల మీద గోళీకాయి దొరినట్లు దొర్లిపోయాయి.. నామినేటేడ్ పోస్టులు ఇప్పుడే తమను వరించేలా లేవని పాపం తమ్ముళ్లు వాళ్లలో వాళ్లు సర్థి చెప్పుకుంటున్నారు. -
దళితులపై ఎమ్మెల్యే పయ్యావుల అనుచరుల దాడి
-
దళితులపై పయ్యావుల అనుచరుల దాడి
-
దళితులపై ఎమ్మెల్యే పయ్యావుల అనుచరుల దాడి
అనంతపురం: మంచి నీటి సమస్య ఎందుకు తీర్చలేదంటూ గ్రామస్థులు ప్రశ్నించిన పాపానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు దళితులపై దాడికి పాల్పడ్డారు. మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గం శూలసముద్రం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. శూలసముద్రం గ్రామానికి కేశవ్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. ఆ సమయంలో మంచి నీటి సమస్య గురించి ప్రశ్నించడంతో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. కేశవ్ సమక్షంలోనే దళితులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
టిక్కెట్ కోసం టీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ
వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం లభించడంతో ఇరు ప్రాంతాల్లోనూ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కొన్ని పార్టీలు ఖాలీ అవుతుండగా.. మరికొన్ని పార్టీల్లో టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో టిక్కెట్ల గోల మొదలైంది. టీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, రాజయ్య వర్గీయులు మంగళవారం ఘర్షణ పడ్డారు. ఎమ్మెల్యే టిక్కెట్ తమ లీడర్‌కే కేటాయించాలంటూ ఇరు వర్గాలు బాహాబాహీకి తలపడ్డాయి. జాఫర్‌గఢ్ మండలం చీగారం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
జగన్‌ను ఎవరూ అడ్డుకోలేరు:కారంపూడి ప్రజలు
-
కన్నాకు ఫ్లెక్సీ కష్టాలు
-
సిఎం సమక్షంలో కేంద్రమంత్రిని నిలదీసిన సమైక్యవాదులు
-
జన నేత ఆరోగ్య పరిస్తితిపై అభిమానుల ఆందోళన