కర్నూలు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి న్యూఢిల్లీలో చేపట్టనున్న దీక్షకు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు శనివారం భారీగా తరలివెళ్లాయి. దీక్షలో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైన్ను కర్నూలు రైల్వే స్టేషన్లో స్థానిక లోక్సభ సభ్యురాలు బుట్టా రేణుక, స్థానిక శాసనసభ్యుడు ఎస్వీ మోహన్ రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్రెడ్డి, మణిగాంధీలు జెండా ఊపి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. అందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసింది.