ఎస్పీ, బీఎస్పీ వర్గీయుల మధ్య ఘర్షణ
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మీరట్లో సమాజ్వాది, బహుజన్ సమాజ్వాదీ పార్టీ కర్యకర్తలు బాహాబాహీకి దిగారు. పోలింగ్ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
కితార్ గ్రామంలో ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తల మధ్య తలెత్తిన వివాదం కాల్పుల వరకూ వెళ్లింది. ఇక్కడి పోలింగ్ బూత్ వద్ద జరిగిన గొడవలో ఓ వ్యక్తి గాయపడగా.. అనంతరం ఓ వర్గం వారు మరో వర్గంపై కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించినట్లు తెలిపారు. తొలిదశ పోలింగ్ 15 జిల్లాల్లోని 73 సీట్లకు జరుగుతుంది.