వైఎస్ జగన్కి మద్దతుగా ఏపీలో రిలే దీక్షలు | YSRCP Leaders and supporters statewide supports to ys Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్కి మద్దతుగా ఏపీలో రిలే దీక్షలు

Published Fri, Oct 9 2015 12:17 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

YSRCP Leaders and supporters statewide supports to ys Jagan mohan reddy

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరింది. వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం గుంటూరు బయలుదేరి.. దీక్షా ప్రాంగణం చేరుకున్నారు.

దీంతో గుంటూరు నగర శివారులోని నల్లపాడు రోడ్డు వద్ద వైఎస్ జగన్ చేపట్టిన దీక్షా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. అలాగే వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు రెండో రోజు రిలే దీక్షలు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా :
అనంతపురం : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో గుత్తి, గుంతకల్లు, పామిడిలో
మూడో రోజు రిలే దీక్షలు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాయదుర్గం, కనేకల్, బొమ్మనహళ్, హీరేహళ్ మండలాల్లొ కనసాగుతున్న రిలే దీక్షలు.
అనంతపురం : వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆధ్వర్యంలో పెనుకొండ, సోమందేవపల్లి, రొద్దం, గోరంట్ల మండలాల్లో రెండో రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు.
రాయదుర్గంలో పార్టీ నేత కె.భారతి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు.
ఎస్వీయూలో సీఎం చంద్రబాబుకు వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నేతలు శవయాత్ర నిర్వహించారు.
కదిరిలో స్థానిక ఎమ్మెల్యే చాంద్బాషా ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా.
మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి... పోస్టాఫీస్ వద్ద బైఠాయింపు.
గుంతకల్లు: స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నిరసన.
గుత్తి : ఎమ్మార్వో కార్యాలయం ఎదుటు వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా.

వైఎస్ఆర్ జిల్లా :
ప్రొద్దుటూరు : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో మూడో రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు, పాల్గొన్న సర్పంచ్లు, కౌన్సిలర్లు.
కడప : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ. ఈ ర్యాలీలో ఎంపీ
వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పాల్గొన్నారు.
కమలాపురం : స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. సికేదిన్నె, వీఎన్ పల్లి, పెండ్లిమర్రి
మండలాల్లో నిరసనలు.
కడప : ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రిలే దీక్షలు. కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కడప :గుండుపల్లి, వీరబల్లి మండల కేంద్రాల్లో రెండో రోజుకు చేరిన రిలే దీక్షలు
కడప : రామాపురం మండలం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే జి.మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
కాశినాయన మండలం నరసాపురంలో మండల కన్వీనర్ విశ్వనాథ్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు

కర్నూలు జిల్లా :
డోన్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బుగ్గన రాజారెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు

చిత్తూరు జిల్లా :
చంద్రగిరి నియోజకవర్గ మండలం కన్వీనర్ల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను వైఎస్ఆర్ సీపీ నేతలు ముట్టడి

నెల్లూరు జిల్లా :
వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా రెండో రోజు రిలే దీక్షలు ప్రారంభమైనాయి.  
కోవూరు : వైఎస్ఆర్ సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా అధ్యక్షుడు కాకాని
గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
కావలి: స్థానిక ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు.
గూడూరు : స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్, మరో నేత గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పవర్ గ్యాస్ సెంటర్ వద్ద నిరసన దీక్షలు... భారీగా
కార్యకర్తలు పాల్గొన్నారు.
నెల్లూరు : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి సంఘం దీక్ష చేపట్టింది. ఈ దీక్షను భగ్నం చేసేందుకు
పోలీసులు యత్నించారు. దీంతో విద్యార్థి సంఘం నాయకులు ఆ యత్నాన్ని అడ్డుకున్నారు. విద్యార్థి సంఘం నాయకులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చేటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

ప్రకాశం జిల్లా :
కనిగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కనిగిరి, పామూరు, హెచ్ఎంపాడు, పీసీ పల్లి, సీఎస్ పురం మండలాల్లో రెండో రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు.
కందుకూరు : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే పోతుల రామారావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
గిద్దలూరులో ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎం. అశోక్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా
చీరాల :జగన్ దీక్షకు మద్దతుగా చీరాల నుంచి భారీ సంఖ్యలో గుంటూరు తరలివెళ్లిన వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు

గుంటూరు జిల్లా :
తెనాలి : మార్కెట్ సెంటర్లో నియోజకవర్గ కన్వీనర్ అన్నాబత్తుల శివకుమార్ ఆధ్వర్యంలో రాస్తారోకో.

కృష్ణాజిల్లా :
జగ్గయ్యపేట : జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ.
హనుమాన్జంక్షన్: గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యలో కార్యకర్తల రిలే దీక్షలు.
నందిగామ : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అరుణ్కుమార్ ఆధ్వర్యంలో 1100 మంది కార్యకర్తలు...నల్లపాడు తరలివెళ్లారు.

పశ్చిమగోదావరి జిల్లా :
పాలకొల్లు : పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యలో రిలే దీక్షలు.
ఉండి : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా ఉండి నియోజకవర్గం నుంచి గుంటూరుకు భారీగా తరలి వెళ్లిన నేతలు, కార్యకర్తలు.
యలమంచిలి : మండలం చించినాడలో పొత్తూరి బుచ్చిరాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
భీమవరం : వైఎస్ఆర్ సీపీ నేత గ్రంధీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీగా గుంటూరు తరలివెళ్లిన నేతలు, కార్యకర్తలు.
పిఠాపురం : పెండెం దొరబాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు
పశ్చిమగోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో గుంటూరు తరలి వెళ్లిన జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు. ఏలూరు బైపాస్ వద్ద ర్యాలీని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రారంభించారు.

తూర్పుగోదావరి జిల్లా :
కాకినాడ : వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా భానుగుడి సెంటర్లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
అలాగే జగన్ చేపట్టిన దీక్ష విజయవంతం కావాలని కోరుతూ కాకినాడ నియోజకవర్గ కన్వీనర్ బి.వేణుగోపాలకృష్ణ స్థానిక శ్రీపీఠంలో
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టారు.
అన్నవరంలో వైఎస్ఆర్ సీపీ నేత రాయవరపు భాస్కరరావు ఆధ్వర్యంలో శంఖవరం గ్రామ నేతలు, కార్యకర్తలు రిలే దీక్షలు

విశాఖపట్నం జిల్లా :
సీతమ్మధార ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉత్తర నియోజకవర్గ ఇంఛార్జ్ విజయకుమార్ ఆధ్వరంలో రిలే దీక్షలు.
విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలా గురువులు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా.
విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు, పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు
గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర కార్యదర్శి గొల్ల బాబూరావు.
విశాఖపట్నం నగర పశ్చిమ నియోజకవర్గం ఇంఛార్జ్ మళ్ల విజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు
పాయకరావుపేట : నియోజకవర్గ ఇంఛార్జ్ చెంగల వెంకట్రావు ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షలు

శ్రీకాకుళం జిల్లా :
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో వైఎస్ఆర్ సీపీ నేత తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement