జిల్లాలో ఓ ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.
ప్రకాశం: జిల్లాలో ఓ ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. యద్దనపూడి మండలం చిమటవారిపాలెంలో శనివారం ఉదయం దేవుడి ఉత్సవాలలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సంప్రదాయంగా జరుగుతున్న ఉత్సవాలలో శ్రీరాముడి ఊరేగింపు వాహనాన్ని స్థానికులు చుక్కా రాంబాబు కుటుంబం ఏర్పాటు చేస్తున్నారు. అయితే సంప్రదాయాన్ని తుంగలో తొక్కుతూ టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఊరేగింపు ను అడ్డుకుని స్థానికులపై గొడవకు దిగారు. దేవుడిపై పెత్తనం చేసేందుకు కార్యకర్తల యత్నంచండంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.