
విస్తుపోయిన అభిమానులు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి చేసిన ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అనారోగ్యం విషమించడంతో ‘అమ్మ’ కన్నుమూసిందని స్థానిక తమిళ చానళ్లు ప్రచారం చేయడంతో అభిమానులు, మద్దతుదారులు ఒక్కసారి విస్తుపోయారు. నిజంగానే ‘అమ్మ’ లేదనుకుని కన్నీరుమున్నీరయ్యారు. గుండెలు బాదుకుంటూ శోకసముద్రంలో మునిగిపోయారు.
అయితే అవన్నీ వదంతులనీ అపోలో ఆస్పత్రి ప్రకటించాయి. జయలలితకు చికిత్స కొనసాగుతోందని వెల్లడించాయి. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ‘అమ్మ’ ప్రాణాలతోనే ఉందన్న ప్రకటనతో అభిమానులు తేరుకున్నారు. తమ నాయకురాలు కోలుకోవాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు.
మరోవైపు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. జయ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.