
దళితులపై ఎమ్మెల్యే పయ్యావుల అనుచరుల దాడి
అనంతపురం: మంచి నీటి సమస్య ఎందుకు తీర్చలేదంటూ గ్రామస్థులు ప్రశ్నించిన పాపానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు దళితులపై దాడికి పాల్పడ్డారు. మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గం శూలసముద్రం గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
శూలసముద్రం గ్రామానికి కేశవ్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. ఆ సమయంలో మంచి నీటి సమస్య గురించి ప్రశ్నించడంతో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. కేశవ్ సమక్షంలోనే దళితులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.