scs
-
ఒకసారి రిజర్వేషన్లు పొందిన వారికి...ఆ సౌకర్యం నిలిపేయాలి
న్యూఢిల్లీ: రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఆ ఫలాలు పొంది, ఆ కారణంగా ఇతరులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరినవారికి రిజర్వేషన్లను తొలగించవచ్చని అభిప్రాయపడింది. అయితే ఇది శాసన, కార్యనిర్వహక వ్యవస్థలు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేసింది. ఎస్సీల్లో క్రీమీ లేయర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీల ధర్మాసనం గురువారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీల్లో క్రీమీ లేయర్ ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్ట్‌లో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పును జస్టిస్ గవాయ్ ఈ సందర్భంగా ఉటంకించారు. ఎస్సీల్లోని వెనకబడ్డ కులాలకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా వారికి ఉద్దేశించిన రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ చేయొచ్చని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఆ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా సభ్యుడే. మెజారిటీ నిర్ణయంతో సమ్మతిస్తూనే నాడు ఆయన విడిగా తీర్పు వెలువరించారు. ఎస్సీలతో పాటు ఎస్టీల్లో కూడా క్రీమీ లేయర్‌కు రిజర్వేషన్లను నిలిపేయాలని అందులో స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రాలు విధిగా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని కూడా ఆదేశించారు. ఆ తీర్పును తాజా కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ప్రస్తావించారు. ‘ఒకసారి లబ్ధి పొందినవారికి రిజర్వేషన్లను తొలగించాలి. గత 75 ఏళ్ల పరిణామాలను బేరీజు వేసిన మీదట ఈ అభిప్రాయం వెలువరిస్తున్నాం‘ అని పేర్కొన్నారు. రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించి ఆరు నెలలు గడిచినా ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీ లేయర్ గుర్తింపునకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వాలు ఆ పని చేయవు. చివరికి అత్యున్నత న్యాయస్థానమే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది‘ అన్నారు. ఆ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘ఆ పని చేసేందుకు శాసన, కార్యనిర్వాహక విభాగాలు ఉన్నాయి. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అమలయ్యేలా వాళ్లు చట్టం చేయాలి‘ అని పునరుద్ఘాటించింది. అయితే సంబంధిత వర్గాలనే ఆశ్రయిస్తామని పిటిషనర్ తెలపడంతో కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. -
ఎస్సీలకు సాయంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 53,85,270 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించగా.. ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 96.39% అంటే 51,91,091 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. మరే రాష్ట్రం కనీసం లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం అందించలేదు. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేసింది. 2022–23 ఆర్థిక ఏడాదిలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు పురోగతిపై విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. లక్ష్యాల కన్నా 90% పైగా అమలు చేసిన రాష్ట్రాల పనితీరు చాలా బాగుందని, లక్ష్యాలలో 80% నుంచి 90% మధ్య సాధిస్తే మంచి పనితీరు చూపిందని.. 80% లోపు ఉంటే ఆ రాష్ట్రాల పనితీరు పేలవంగా ఉందని నివేదిక విశ్లే షించింది. గతంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు విడుదల చేసిన నివేదికలో రాష్ట్రంలో 33.57 లక్షల ఎస్సీ కుటుంబాలకు సాయం అందించిందని, అనంతరం జనవరి నుంచి మార్చి వరకు అదనంగా మరో 18.34 లక్షల కుటుంబాలకు సాయం చేసిందని నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధికంగా కర్ణాటకలో 59,345 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందింది. పట్టణ పేదలకూ చేయూత గత ఆర్థిక ఏడాది పట్టణ పేదలకు సాయం చేయడంలో కూడా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలో కలిపి మొత్తం 8.49 లక్షల మంది పట్టణ పేదలకు సాయం అందగా, అందులో 7,24,776 మంది ఏపీ వారేనని నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఆదాయం గల కుటుంబాలకు 2.67 లక్షల ఎల్ఐజీ గృహాలను రాష్ట్రంలో నిర్మించగా, ఇతరత్రా దేశ వ్యాప్తంగా 9.15 లక్షల గృహాలు నిర్మించారని తెలిపింది. 2022–23 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని నూటికి నూరు శాతం అమలు చేశారని ప్రశంసించింది. 18.47 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేశారని తెలిపింది. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద లక్ష్యానికి మించి కొత్తగా 33,122 స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించారని స్పష్టం చేసింది. గత ఆర్థిక ఏడాదిలో ఏపీలో 24,852 వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, 1,24,311 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇది లక్ష్యానికి 500 శాతం మేర అధికం అని తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 99.98 శాతం డెలివరీలు (ప్రసవాలు) ఇన్‌స్టిట్యూషన్లలోనే జరిగాయని నివేదిక పేర్కొంది. ఇలా రాష్ట్రంలో 7,61,629 డెలివరీలు జరిగాయని తెలిపింది. ఏపీలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం చాలా మంచి పనితీరు కనపరిచాయని, 257 ఐసీడీఎస్ బ్లాక్‌లు (సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రాలు) చక్కగా పని చేశాయని ప్రశంసించింది. -
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ మద్దతు: మధు యాష్కీ గౌడ్
ఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగలతో పాటు సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ఢిల్లీలోని కల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన స్టూడెంట్ మాదిగ పెడరేషన్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మందకృష్ణ మాదిగ సహాయాన్ని తీసుకుని.. అధికారంలోకి వచ్చాక ఆయనను జైల్లో పెట్టిన చరిత్ర కేసీఆర్‌దని మధు యాష్కీ మండిపడ్డారు. చదవండి: తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ఎస్సీల్లో మాదిగలు వెనుకబడ్డారన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎస్సీలకు అన్యాయం జరిగిందని.. ప్రత్యేక రాష్ట్రంలో అయినా వారికి న్యాయం జరుగుతుందన్న లక్ష్యంతోనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. అయితే కేసీఆర్ పాలనలో దళితులకు న్యాయం జరగడం లేదన్నారు. దళితుల్లో మాదిగలు కిందిస్థాయిలో ఉన్నారు.. వారిని కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలని మధు యాష్కీ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ కూడా మాదిగలను మోసం చేసింది. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ వారి మద్దతు తీసుకుని.. అధికారంలోకి వచ్చాక వారిని మోదీ మోసం చేశాడు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవాలి. దేశ సంపదలో దళితులు కూడా భాగమే. అట్టుడుగు వర్గాలకు అందాల్సిన సంపదను కూడా మోదీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నాడు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను పెద్ద ఎత్తున అమ్మేశాడు. దీనితో పాటు విద్యాసంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసి.. దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లను మోదీ దూరం చేస్తున్నాడు. తద్వారా దళితులకు విద్య అందకుండా చేస్తున్నాడని మధు యాష్కీ ఆరోపించారు. దళిత విద్యార్థులకు ఫెలోషిప్స్, స్కాలర్ షిప్స్ అందించాలని మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. -
ఎస్సీల సమగ్రాభివృద్ధిలో రాష్ట్రానికి రెండు అవార్డులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాల సమగ్రాభివృద్ధి పథకం అమలుకు సంబంధించి కేంద్రం ప్రకటించిన మూడు అవార్డుల్లో రెండింటిని ఆంధ్రప్రదేశ్ గెలుచుకుంది. ఈ పథకం అమలులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన దేశంలోని మూడు జిల్లాలకు ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీవై) అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. వీటికి ఎంపికైన మూడింటిలో రెండు జిల్లాలు మన రాష్ట్రానివే కావడం విశేషం. ఇందులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెండో స్థానం, తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానం దక్కించుకున్నాయి. దేశంలోనే అత్యున్నత పనితీరు షెడ్యూల్డ్ కులాల ప్రజలు ఎక్కువ మంది నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన.. సామాజిక, ఆర్థికాభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంలో మన రాష్ట్రం దేశంలోనే అత్యున్నతంగా పని చేస్తోందని కేంద్రం ప్రశంసించింది. ఆ ప్రాంతాల్లో బడికి దూరంగా ఉండే పిల్లలను బడులలో చేర్పించడం, అక్కడి పిల్లలు, మహిళలకు పౌష్టికాహారం అందజేయడం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ల మంజూరు, వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవనోపాధిని పెంచడంతో పాటు ఆ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం, రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పన వంటి మౌలిక వసతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. ఎక్కువగా ఎస్సీ జనాభా ఉండే గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని 530 జిల్లాల పరిధిలో 19,172 గ్రామాల్లో ఈ పథకం అమలవుతోంది. మన రాష్ట్రంలో విజయనగరం, విశాఖ జిల్లాలు మినహా 11 జిల్లాల పరిధిలోని 501 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఆయా గ్రామాల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు గ్యాప్ ఫండింగ్ రూపంలో ప్రత్యేకించి రూ.20 లక్షల చొప్పున అదనంగా ఒక్కొక్క గ్రామానికి ప్రభుత్వం నిధులిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచే ఈ పథకం అమల్లోకి తెచ్చినప్పటికీ.. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచే మన రాష్ట్రంలోఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. పథకం అమలు తీరు ఆధారంగా 2020–21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ విభాగం జిల్లాల వారీగా అవార్డులను ప్రకటించింది. సీఎస్‌కు లేఖ రాసిన కేంద్ర కార్యదర్శి మొత్తం మూడు అవార్డులకు గాను రెండు అవార్డులు ఏపీకే దక్కినట్టు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు బుధవారం లేఖ రాశారు. ప్రభుత్వానికి, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల అధికారులకు ఆ లేఖలో అభినందనలు తెలియజేశారు. -
బీసీలు,మైనార్టీల అభివృద్ధిపై మాట్లాడే అర్హత బాబుకు లేదు
-
ఎస్సీలుగా గుర్తించాలి
గెహ్లాట్‌కు మదాసి, మదారి కురువ సంక్షేమ సంఘం వినతి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లాలోని మదాసి కురువ, మదారి కురువ కులస్తులకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని ఆ కులాల సంక్షేమ సంఘ నాయకులు.. కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌కు విన్నవించారు. ఎంపీ రేణుకాచౌదరి ఆధ్వర్యంలో ఇక్కడ మంత్రిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణలో 1976 నుంచి మదాసి కురువ, మదారి కురువ కులస్తులకు కురువ పేరుతో బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని వివరించారు. మంత్రి తక్షణం స్పందించి ఈ దిశగా విచారణ జరిపించేందుకు ఆదేశాలు జారీ చేశారని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.రంగన్న, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రంజిత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
పార్టీ జెండా పేరుతో పోలీసుల అరాచకం
చుండూరు సీఐపై చర్యలకు దళిత, ప్రజాసంఘాల డిమాండ్ తెనాలి: వేమూరు నియోజకవర్గం చుండూరులో చలిమంటలో తెలుగుదేశం పార్టీ జెండాను వేశారనే ఆరోపణతో పోలీసులు దళిత యువకులను పోలీస్‌స్టేషనులో నిర్బంధించి, కొట్టిన దారుణంపై విచారణ జరిపించాలని వివిధ దళిత, ప్రజాసంఘాలు డిమాండ్ చేశారు. మైనారిటీ తీరని బాలలను సైతం హింసించి, కులం పేరుతో దూషించిన చుండూరు సీఐను విధుల నుంచి తప్పించాలని, ఆమెపై ఎట్రాసిటీ కేసు నమోదుచేయాలని లేకుంటే దళిత సంఘాలతో కలిసి రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న చుండూరు దళిత యువకులను కులవివక్ష పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, జిల్లా కార్యదర్శి టి.కృష్ణమోహన్, డివిజన్ కార్యదర్శి బి.అగస్టీన్, 'సాధన' రాష్ట్ర కన్వీనర్ మాతంగి దిలీప్‌కుమార్, బహుజన రక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్ కొక్కిలిగడ్డ, సీపీఎం డివిజన్ కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి, చుండూరు దళిత బాధితుల పోరాట కమిటీ అధ్యక్షుడు జాలాది మోజెస్ ఆదివారం సాయంత్రం పరామర్శించారు. ఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. వైద్యశాల ఆవరణలో వారు విలేకర్లతో మాట్లాడారు. 30న చుండూరులో జరిగిన ఘటన కేవలం సీఐ, ఎస్ఐలు అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరించిన కారణంగానే జరిగిందని ఆరోపించారు. పార్టీ జెండాను తగులబెట్టారో? లేదో? గాని రెండురోజులపాటు ఇంకో కులంవారినైతే పోలీస్‌స్టేషనులో నిర్బంధించగలిగేవారా? అని మాల్యాద్రి ప్రశ్నించారు. పైగా సీఐ సుభాషిణి కులంపేరుతో దూషించి, మోటారుబైకులు కావాలా? అంటూ కించపరచేలా మాట్లాడటం సహించరాని విషయంగా ఆరోపించారు. పోలీసు దెబ్బలకు చలిమంట వేశామని అంగీకరించిన యువకులను వదిలేసి, ఒప్పుకోనివారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయటం మరో దుర్గార్మంగా వ్యాఖ్యానించారు. దళిత యువకుల నిర్బంధం, హింసలో అధికార అహంకారం స్పష్టంగా కనిపిస్తోందనీ, అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం చుదువుకునే యువకులను కూడా బలిచేశారని ఆరోపించారు. -
ఎస్సీల్లో చేర్చకుంటే వృత్తి పని బంద్
కర్నూలు (టౌన్) : ఎన్నికల సమయంలో హామీలివ్వడం.. అధికారం చేపట్టిన తర్వాత మరిచిపోవడం రాజకీయపార్టీలకు రివాజుగా మారిందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మూడేళ్లు ముగుస్తున్నా సీఎం చంద్రబాబు రజకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ రజక మిత్ర బృందం సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్. చంద్ర శేఖర్‌రావు అన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చకుంటే రాష్ట్రవ్యాప్తంగా కులవృత్తిగా ఉన్న బట్టలుతికే పనిని బంద్ చేస్తామని హెచ్చరించారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒక కులం తమ హక్కుల సాధనకు హింసాత్మక చర్యలకు పాల్పడితే ప్రభుత్వం రూ. 1000 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ సాధనకు రజకులు శాంతియుతంగా పోరాడుతుంటే చేతకానితనంగా భావిస్తుండడం దురదృష్టకరమన్నారు. పల్లె ప్రాంతాల్లోని రజకుల కుటుంబాలకు ఐదెకరాల పొలం, ఐదున్నర సెంట్ల ఇంటిస్థలం ఇవ్వాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి నెలవారీ పింఛన్ కింద రూ.1500 ఇవ్వాలన్నారు. బ్యాంకు లింకేజితో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలన్నారు. అనంతరం కర్నూలు నగర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శ్రీనివాసులు, కార్యదర్శిగా హరిక్రిష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులుగా వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, కార్యదర్శి నాగరాజు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
‘ఈసార్’ అయినా ఇస్తారా?
సబ్సిడీ రుణాలకోసం బీసీ, ఎస్సీల నిరీక్షణ అటు జన్మభూమి కమిటీలు – ఇటు బ్యాంకర్ల కరుణ కరువు అందని రుణాలతో దరఖాస్తుదారుల ఆవేదన కొత్త రుణాలపై నిరుద్యోగులు, చిరువ్యాపారుల కోటి ఆశలు విజయనగరం కంటోన్మెంట్: ప్రభుత్వం బీసీ, ఎస్సీలకు రుణాలిస్తాం... అనగానే నిరుద్యోగుల్లో ఎక్కడ లేని ఆశలు మొదలవుతాయి. తీరా అవి పొందాలనుకునేసరికి అసలైన అవరోధాలు ఎదురవుతాయి. బ్యాంకర్లు సహకరించక... జన్మభూమి కమిటీలు కనికరించక... అర్హత ఉన్నా.... ఏ రుణం పొందలేకపోతున్నారు. గత ఏడాది లక్ష్యాలు ఇదే విధంగా నీరుగారిపోగా... ఈ ఏడాది కొత్త ప్రకటన వచ్చినా... అభ్యర్థుల్లో నిరాశా మేఘాలు కమ్ముకుంటున్నాయి. జిల్లాలో బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఏటా కోట్లాది రూపాయల రుణాలు సబ్సిడీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించడమే తప్ప ఎటువంటి రుణాలూ ఇవ్వడం లేదని జిల్లాలోని దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. రుణాల మంజూరుకు అర్హత ఉండాలి కానీ... జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్ల పెత్తనమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. రుణాలన్నీ పార్టీ కార్యకర్తలకే అందుతున్నాయి తప్ప మిగిలినవారికి రావట్లేదని వాపోతున్నారు. మళ్లీ ఆశలు రేపుతున్న ప్రకటనలు ఈ ఏడాది అన్ని కార్పొరేషన్లు, పది ఫెడరేషన్లకు రూ.84.18 కోట్లతో 4,685 మంది లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రకటించడంతో కొత్త ఆశలు పెంచుకుంటున్నారు. ఇందుకోసం సోమవారం నుంచి వెబ్సైట్ ప్రారంభం కానుందనీ, కేవలం 15 రోజులే గడువుందనీ చెప్పడంతో నిరుద్యోగులు, ఆయా సంఘాలు, చిరు వ్యాపారుల్లో మళ్లీ హడావుడి మొదలైంది. కొత్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అయినా స్పందించి రుణాలు ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏటా పది వేల నుంచి 20వేల మంది దాకా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నా రుణం మాత్రం వందల్లో కూడా అందడం లేదని ఇందుకు జన్మభూమి కమిటీలు, బ్యాంకర్లే కారణమని వాపోతున్నారు. చాలా రోజులుగా నాన్ ఆపరేటివ్ అకౌంట్ సిస్టం పెట్టి సంబంధిత అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంకర్లు తిప్పుతుండటంతో వేలాది మందికి రుణాలు అందడం లేదు. పైపెచ్చు ఏటా పథకంలోని నిబంధనలు మార్చడంతో బ్యాంకుల ద్వారా డాక్యుమెంటేషన్లు మార్చేందుకు తడిసిమోపెడవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్లలో ఏటా పద్ధతి అవలంబించడంతో పరిస్థితి ఇలా తయారయింది. గతేడాది లక్ష్యం రూ. 10.08 కోట్లు చేరింది రూ. 7 లక్షలు బీసీ కార్పొరేషన్ గతేడాది రూ. 10.08 కోట్ల బడ్జెట్‌తో 3,144 యూనిట్లను స్థాపించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 1669 యూనిట్లకు రూ.5.37 కోట్లు మంజూరయ్యాయి. వీటికి సబ్సిడీ ఇవ్వాలంటే ఇక్కడి నుంచి నాన్ ఆపరేటివ్ అకౌంట్లను పంపించాల్సి ఉంది. ఇందుకోసం 1402 యూనిట్ల అకౌంట్లను పంపించారు. ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నా నేటికి కేవలం రూ. 7.25లక్షలతో 21 యూనిట్లు మాత్రమే గ్రౌండయ్యాయి. మిగతావి ఇప్పటికీ పత్తా లేదు. దీనికి కారణం కేవలం బ్యాంకర్లేనని అటు అధికారులు, ఇటు దరఖాస్తుదారులు, లబ్ధిదారులు కూడా ఆరోపిస్తున్నారు. నిధులు కేటాయిస్తున్నప్పటికీ జిల్లాలో నిరుద్యోగ నిర్మూలన, స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారని ఆయా వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా నిబంధనలు సడలించి ఫలితం ఏముంటుందని పెదవి విరుస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్లో మరీ ఘోరం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరానికి రూ.12 కోట్లతో 1020 యూనిట్లు కేటాయించారు. మరింత మందికి లబ్ధి చేకూర్చే విధంగా 1190 యూనిట్లను మంజూరు చేశారు. వీటిని ఉన్నతాధికారులు పరిశీలించి 984 యూనిట్ల వరకూ సబ్సిడీ విడుదల చేశారు. అయితే ఇందులో కేవలం వంద మాత్రమే గ్రౌండయ్యాయి. మిగతావి ఇప్పటికీ గ్రౌండ్ కాలేదు. దీనికి బ్యాక్ టు సబ్సిడీ విధానమే కారణమని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాదయినా సక్రమంగా రుణాలు అందించి వెంటనే గ్రౌండయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. -
వర్గీకరణ వద్దు కలిసుందాం
మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పాన్‌గల్ : ఎస్సీ వర్గీకరణ వద్దు కలిసి ఉందామని మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి ఆయన ఫోన్లో మాట్లాడారు. మాదిగలు ఎస్సీ వర్గీకరణను పదేపదే ముందుకు తీసుకవస్తూ ఎస్సీల మధ్య చిచ్చు పెట్టొద్దన్నారు. వర్గీకరణ అనేది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. పార్లమెంట్లో వర్గీకరణ బిల్లును అడ్డుకునేందుకే జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టామన్నారు. జిల్లా నుంచి పలువురు మాలమహనాడు నాయకులు ఢిల్లీ ధర్నాకు తరలివచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు
ఒంగోలు : ఎస్సీలను కించపరుస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలువురు దళితులు మంగళవారం ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ విధంగా తన అగ్రకుల అహంకారాన్ని వెళ్లగక్కారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా దళితలు అవమాన పడేలా మాట్లాడడం విచారకరమన్నారు. -
' మాదిగలను విస్మరించడం దారుణం'
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ అస్పష్ట వైఖరితోనే విద్యారంగంలో అయోమయ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాఠ్యాంశాల మార్పు, ఫాస్ట్ పథకం, ఎంసెట్ నిర్వహణ, పోటీ పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ఏర్పడిన గందరగోళాన్ని తొలగించేందుకు ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్నిపొంగులేటి డిమాండ్ చేశారు. కేవలం తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాల మార్పు పేరుతో తెలుగు నేతల చరిత్రను, తెలుగుజాతికోసం కృషి చేసిన మాదిగల చరిత్రను తొలగించాలనుకోవడం దారుణమైన విషయమన్నారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం ఎంతోమంది నిరుద్యగులు ఎదురుచూస్తున్నారని, నోటిఫికేషన్లు పెండింగులో పెట్టడం దారుణమని పొంగులేటి పేర్కొన్నారు. -
దళితులపై పయ్యావుల అనుచరుల దాడి
-
దళితులపై ఎమ్మెల్యే పయ్యావుల అనుచరుల దాడి
అనంతపురం: మంచి నీటి సమస్య ఎందుకు తీర్చలేదంటూ గ్రామస్థులు ప్రశ్నించిన పాపానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు దళితులపై దాడికి పాల్పడ్డారు. మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గం శూలసముద్రం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. శూలసముద్రం గ్రామానికి కేశవ్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. ఆ సమయంలో మంచి నీటి సమస్య గురించి ప్రశ్నించడంతో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. కేశవ్ సమక్షంలోనే దళితులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
‘ఉచితం’ ఉత్తిదేనా!
యాచారం, న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీలు 50 యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగిస్తే ఉచితం అనే మాట ఉత్తుత్తి ప్రచారంగానే మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ ప్రచారార్భాటమే తప్ప ఆచరణలో అమలుకు నోచుకోకపోవడంతో పేదలకు ఏ మాత్రం ప్రయోజన కలగడం లేదు. దీంతో పేదలు 50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తున్నా.. బిల్లులు మాత్రం నెలవారీగా చెల్లిస్తూనే ఉన్నారు. అసలు 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తే బిల్లులు ఉండవని కూడా లబ్ధిదారులకు అవగాహన లేకుండాపోయింది. ప్రభుత్వం గొప్పలకు ప్రచారం చేసుకుంటూ అమలులో మాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతో ఎస్సీ, ఎస్టీలకు శాపంగా మారింది. ఇందిరమ్మ కలల పథకం, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బడ్జెట్ కింద ఎస్సీ, ఎస్టీల గృహ వినియోగానికి సంబంధించి పాత బకాయిలు మాఫీ చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది మార్చి నుంచి పేదలు 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తే ఉప ప్రణాళిక ద్వారా బకాయిలు చెల్లించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మండలంలో ఏడు వేలకుపైగా అర్హులైన ఎస్సీ, ఎస్టీలు ఉండగా.. గత నెల క్రితం నిర్వహించిన రచ్చబండ-3లో మాత్రం కేవలం 1,047 మందికే ఉచిత విద్యుత్ వర్తించేలా ఎంపిక చేశారు. ఇక నుంచి ఎస్సీ, ఎస్టీలు 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తే మాత్రం బిల్లులు చెల్లించనవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. అర్హులైనవారు కేవలం కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తే సరిపోతుందని తెలియజేశారు. చిత్తశుద్ధిలో లోపం.. అమలులో జాప్యం 50 యూనిట్లలోపు విద్యుత్ వాడితే బిల్లులుండవని అధికారులు రచ్చ బండ-3లో చెప్పిన మాటలతో ఎస్సీ, ఎస్టీలు ఎంతగానో సంతోషపడ్డారు. కానీ అధికారుల్లో చిత్తశుద్ధి లోపం కారణంగా అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. మండలంలోని 20 గ్రామాల్లో నెలకు 50 యూనిట్ల విద్యుత్ వినియోగించే ఏడు వేలకుపైగా కుటుంబాలున్నాయి. మంతన్‌గౌరెల్లి, నందివనపర్తి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నల్లవెల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎస్టీ కుటుంబాలున్నాయి. చింతపట్ల, నక్కర్తమేడిపల్లి, యాచారం, చౌదర్పల్లి, మొండిగౌరెల్లి, చింతుల్ల, గునుగల్ తదితర గ్రామాల్లో వందలాది మంది ఎస్సీలు ఉన్నారు. కొన్ని గ్రామాల్లో పేదలు నెలనెలా బిల్లులు చెల్లిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో అధిక బిల్లులు రావడంతో చాలామంది ఎస్సీ, ఎస్టీల బకాయి బిల్లులు రూ. 50 లక్షలకు చేరాయి. అంధకారంలో ఉండలేక కొంతమంది పేదలు మాత్రం నెలవారీగా బిల్లులు చెల్లిస్తున్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితుల కారణంగా పలువురు బిల్లులు చెల్లించడంలో జాప్యంతో వేలాది రూపాయల బకాయిలు అలాగే ఉండిపోతున్నాయి. విద్యుత్ అధికారులు సైతం అర్హులైన పేదలను ఎంపిక చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రచ్చబండ-3 తర్వాత మండలంలో పలు గ్రామాల్లో బిల్లులు తీసే సమయంలో విద్యుత్ సిబ్బంది 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారు కుల ధ్రువీకరణపత్రాలు ఇస్తే సరిపోతుంది. ఇక నుంచి బిల్లులు చెల్లించేది ఉండదు. కానీ 50 యూనిట్ల లోపు మాత్రమే విద్యుత్ వాడుకోవాలి అని అధికారులు గతంలో సూచించారు. అమలులో మాత్రం విఫలమతున్నారు. దీంతో అర్హులైన పేదలు బిల్లులు చెల్లిస్తూనే ఉన్నారు. కొన్నిచోట్ల బకాయిలు అలాగే ఉంటున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలి.