వర్గీకరణ వద్దు కలిసుందాం | dont divide scs | Sakshi
Sakshi News home page

వర్గీకరణ వద్దు కలిసుందాం

Published Sun, Jul 31 2016 10:08 PM | Last Updated on Mon, Oct 8 2018 8:45 PM

dont divide scs

 మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
పాన్‌గల్‌ : ఎస్సీ వర్గీకరణ వద్దు కలిసి ఉందామని మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద జరుగుతున్న ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి ఆయన ఫోన్‌లో మాట్లాడారు. మాదిగలు ఎస్సీ వర్గీకరణను పదేపదే ముందుకు తీసుకవస్తూ ఎస్సీల మధ్య చిచ్చు పెట్టొద్దన్నారు. వర్గీకరణ అనేది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. పార్లమెంట్‌లో వర్గీకరణ బిల్లును అడ్డుకునేందుకే జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేపట్టామన్నారు. జిల్లా నుంచి పలువురు మాలమహనాడు నాయకులు ఢిల్లీ ధర్నాకు తరలివచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement