ఎస్సీలుగా గుర్తించాలి | castes organization demands to add few more caste to SC's | Sakshi
Sakshi News home page

ఎస్సీలుగా గుర్తించాలి

Published Sat, Apr 8 2017 1:06 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

castes organization demands to add few more caste to SC's

గెహ్లాట్‌కు మదాసి, మదారి కురువ సంక్షేమ సంఘం వినతి  
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మదాసి కురువ, మదారి కురువ కులస్తులకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని ఆ కులాల సంక్షేమ సంఘ నాయకులు.. కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్‌ చంద్‌ గెహ్లాట్‌కు విన్నవించారు. ఎంపీ రేణుకాచౌదరి ఆధ్వర్యంలో ఇక్కడ మంత్రిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం ఇచ్చారు.

తెలంగాణలో 1976 నుంచి మదాసి కురువ, మదారి కురువ కులస్తులకు కురువ పేరుతో బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని వివరించారు. మంత్రి తక్షణం స్పందించి ఈ దిశగా విచారణ జరిపించేందుకు ఆదేశాలు జారీ చేశారని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.రంగన్న, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రంజిత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement