madaari
-
ఎస్సీలుగా గుర్తించాలి
గెహ్లాట్‌కు మదాసి, మదారి కురువ సంక్షేమ సంఘం వినతి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లాలోని మదాసి కురువ, మదారి కురువ కులస్తులకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని ఆ కులాల సంక్షేమ సంఘ నాయకులు.. కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌కు విన్నవించారు. ఎంపీ రేణుకాచౌదరి ఆధ్వర్యంలో ఇక్కడ మంత్రిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణలో 1976 నుంచి మదాసి కురువ, మదారి కురువ కులస్తులకు కురువ పేరుతో బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని వివరించారు. మంత్రి తక్షణం స్పందించి ఈ దిశగా విచారణ జరిపించేందుకు ఆదేశాలు జారీ చేశారని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.రంగన్న, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రంజిత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రజనీ సినిమాపై జస్ట్ జోక్ చేశాను!
‘కబాలి’ సినిమా పోస్టర్‌పై తాను చేసిన ఆరోపణలపై తాజాగా బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ వివరణ ఇచ్చాడు. ‘కబాలి’ పోస్టర్, తన కొత్త సినిమా ‘మదారి’ పోస్టర్ ఒకే తరహాలో ఉండటంతో తాను సరదా జోక్ మాత్రమే వేశానని, అంతేకానీ రజనీకాంత్ తానేమీ అనలేదని ఆయన అన్నారు. ఆన్లైన్లో రజనీకాంత్ అభిమానులు విడుదల చేసిన ‘కబాలి’ పోస్టర్.. అచ్చుగుద్దినట్టు ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘మదారి’ చిత్రం పోస్టర్‌లాగా ఉండటంపై ఇర్ఫాన్ ఖాన్ స్పందించిన సంగతి తెలిసిందే. తమది చిన్న సినిమా అయినా, తమ సినిమా పోస్టర్‌ను దొంగలించి కబాలి కోసం వాడుకున్నారని ఆయన మంగళవారం విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా వివరణ ఇస్తూ ‘రజనీకాంత్‌ను ఒక నటుడిగా, వ్యక్తిగా గౌరవిస్తాను. పోస్టర్ గురించి నేను చేసిన వ్యాఖ్యలు జోక్ మాత్రమే. ఆ పోస్టర్ రజనీ అభిమానులు రూపొందించేదేనని నేను కూడా చెప్పాను’అని ఇర్ఫాన్ అన్నారు. రెండు పోస్టర్లలోనూ ప్రధాన నటుల ముఖాలతోపాటు అడ్డు వరుసలో ఉన్న భవనాలను చూపించారు. అయితే ఈ వివాదంపై రజనీకాంత్ అభిమానులు స్పందించారు. ఇది సినిమా అధికారిక పోస్టర్ కాదని, దీనిని అభిమానులు రూపొందించి ఆన్లైన్ లో విడుదల చేసి ఉంటారని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు రజనీ అభిమానులు పెద్ద ఎత్తున ‘కబాలి’ పోస్టర్లు, ఫొటోలు ఆన్లైన్లో పోస్టు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. -
రజనీ ‘కబాలి’ పోస్టర్‌పై కలకలం!
రజినీకాంత్ అభిమానులను ఇప్పుడు ‘కబాలి’ జ్వరం ఊపేస్తోంది. భారీ అంచనాలు ఏర్పడిన ‘కబాలి’ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆన్లైన్లో విడుదలైన ‘కబాలి’ పోస్టర్ ఒకటి వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ఈ పోస్టర్ అచ్చుగుద్దినట్టు ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘మదారి’ చిత్రం పోస్టర్‌లాగా ఉండటమే. ఈ విషయమై బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ స్పందిస్తూ తమది చిన్న సినిమా అయినా, తమ సినిమా పోస్టర్‌ను దొంగలించి కబాలి కోసం వాడుకున్నారని అన్నారు. అయితే దీని పెద్ద విషయంగా పరిగణించవద్దని, అభిమానులు రజనీ సినిమాతోపాటు తమ సినిమాను కూడా చూడాలని ఆయన సూచించారు. రెండు పోస్టర్లలోనూ ప్రధాన నటుల ముఖాలతోపాటు అడ్డు వరుసలో ఉన్న భవనాలను చూపించారు. అయితే ఈ వివాదంపై రజనీకాంత్ అభిమానులు స్పందించారు. ఇది సినిమా అధికారిక పోస్టర్ కాదని, దీనిని అభిమానులు రూపొందించి ఆన్లైన్ లో విడుదల చేసి ఉంటారని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు రజనీ అభిమానులు పెద్ద ఎత్తున ‘కబాలి’ పోస్టర్లు, ఫొటోలు ఆన్లైన్లో పోస్టు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. -
సామాన్యుడు తిరగబడితే..!
ఇన్నాళ్లు రొటీన్ మాస్ సినిమాలతో బోర్ కొట్టించిన బాలీవుడ్, ఇప్పుడు ఇంట్రస్టింగ్ కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఎక్కువగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో అలరిస్తున్నాయి. నటీనటులు కూడా తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ఈ తరహా సినిమాలే కరెక్ట్ అని భావిస్తున్నారు. ఛాలెంజింగ్ రోల్స్‌లో ఆకట్టుకుంటున్నారు. అదే బాటలో రిలీజ్‌కు రెడీ అవుతున్న బాలీవుడ్ డ్రామా ఫిలిం మదారి. ప్రస్తుత రాజకీయ శక్తుల కారణంగా తన కొడుకును కోల్పోయిన ఓ సామాన్యుడు వ్యవస్థ మీద ఎలా పగతీర్చుకున్నాడన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తనదైన నటనతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. నిశికాంత్ కామత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. థ్రిల్లింగ్‌గా రూపొందిన ఈ ట్రైలర్, సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆకట్టుకుంటోంది. -
ఆమె హీరోగా నటిస్తే.. నేను హీరోయిన్..!
ముంబై: జాతీయ అవార్డులు కొల్లగొడుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ తనతో నటించేందుకు ఒకవేళ అంగీకరించకపోయినా ఆ విషయాన్ని తాను లైట్ గా తీసుకుంటానని ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ చెప్పాడు. కంగనా రనౌత్ మూవీలో హీరోగా నటిస్తే తాను హీరోయిన్ గా కనిపించడానికి కూడా సిద్ధమన్నాడు ఇర్ఫాన్. దర్శకుడు సాయి కబీర్ తీయనున్న తర్వాతి చిత్రంలో ఇర్ఫాన్, కంగనా కలిసి నటిస్తారని వార్తలు వచ్చాయి. కొన్ని నెలల నుంచి ఈ మూవీ ప్రాజెక్టులో పెద్దగా కదలిక లేదు. తనకు డేట్స్ కుదరడం లేదంటూ కంగనా ప్రాజెక్టు నుంచి బయటపడుతుందని సమాచారం. ప్రస్తుతం కంగనా స్థానంలో బొద్దుగుమ్మ జరైన్ ఖాన్ ను తీసుకున్నారు. తన లేటెస్ట్ మూవీ 'మాడారి' అఫీషియల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా కంగనాతో మూవీ గురించి మీడియా అడగగా ఇర్ఫాన్ ఈ విషయాలను ప్రస్తావించాడు. డివైన్ లవర్స్ కథ మధ్య తరగతి కుటుంబాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని, ఇది కామెడీ మూవీ సెప్టెంబర్ నెలలో షూటింగ్ మొదలుపెడతామని చెప్పుకొచ్చాడు. ఇన్ని విషయాలపై మాట్లాడిన ఇర్ఫాన్ కంగనా, హృతిక్ ల మధ్య తాజా వివాదంపై కామెంట్ చేయకపోవడం విశేషం. నిశికాంత్ కామత్ దర్శకత్వం వహించిన మాడారి మూవీ జూన్ 10న విడుదలకు సిద్ధంగా ఉంటుందని యూనిట్ గతంలోనే డిసైడ్ చేసింది.