రజనీ ‘కబాలి’ పోస్టర్‌పై కలకలం! | Rajinikanth film stole Madaari poster, but no big deal, says Irrfan Khan | Sakshi
Sakshi News home page

రజనీ ‘కబాలి’ పోస్టర్‌పై కలకలం!

Published Tue, Jun 28 2016 4:13 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

రజనీ ‘కబాలి’ పోస్టర్‌పై కలకలం!

రజనీ ‘కబాలి’ పోస్టర్‌పై కలకలం!

రజినీకాంత్‌ అభిమానులను ఇప్పుడు ‘కబాలి’  జ్వరం ఊపేస్తోంది. భారీ అంచనాలు ఏర్పడిన ‘కబాలి’ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆన్‌లైన్‌లో విడుదలైన ‘కబాలి’ పోస్టర్ ఒకటి వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ఈ పోస్టర్ అచ్చుగుద్దినట్టు ఇర్ఫాన్ ఖాన్  నటించిన ‘మదారి’  చిత్రం పోస్టర్‌లాగా ఉండటమే. ఈ విషయమై బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ స్పందిస్తూ తమది చిన్న సినిమా అయినా, తమ సినిమా పోస్టర్‌ను దొంగలించి కబాలి కోసం వాడుకున్నారని అన్నారు. అయితే దీని పెద్ద విషయంగా పరిగణించవద్దని, అభిమానులు రజనీ సినిమాతోపాటు తమ సినిమాను కూడా చూడాలని ఆయన సూచించారు.

రెండు పోస్టర్లలోనూ ప్రధాన నటుల ముఖాలతోపాటు అడ్డు వరుసలో ఉన్న భవనాలను చూపించారు. అయితే ఈ వివాదంపై రజనీకాంత్‌ అభిమానులు స్పందించారు. ఇది సినిమా అధికారిక పోస్టర్ కాదని, దీనిని అభిమానులు రూపొందించి ఆన్‌లైన్‌ లో విడుదల చేసి ఉంటారని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు రజనీ అభిమానులు పెద్ద ఎత్తున ‘కబాలి’ పోస్టర్లు, ఫొటోలు ఆన్‌లైన్‌లో పోస్టు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement