ఆమె హీరోగా నటిస్తే.. నేను హీరోయిన్..! | I will play heroine in a film where Kangana Ranaut is hero, says Irrfan Khan | Sakshi
Sakshi News home page

ఆమె హీరోగా నటిస్తే.. నేను హీరోయిన్..!

Published Thu, May 12 2016 10:45 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఆమె హీరోగా నటిస్తే.. నేను హీరోయిన్..! - Sakshi

ఆమె హీరోగా నటిస్తే.. నేను హీరోయిన్..!

ముంబై: జాతీయ అవార్డులు కొల్లగొడుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ తనతో నటించేందుకు ఒకవేళ అంగీకరించకపోయినా ఆ విషయాన్ని తాను లైట్ గా తీసుకుంటానని ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ చెప్పాడు. కంగనా రనౌత్ మూవీలో హీరోగా నటిస్తే తాను హీరోయిన్ గా కనిపించడానికి కూడా సిద్ధమన్నాడు ఇర్ఫాన్. దర్శకుడు సాయి కబీర్ తీయనున్న తర్వాతి చిత్రంలో ఇర్ఫాన్, కంగనా కలిసి నటిస్తారని వార్తలు వచ్చాయి. కొన్ని నెలల నుంచి ఈ మూవీ ప్రాజెక్టులో పెద్దగా కదలిక లేదు.

తనకు డేట్స్ కుదరడం లేదంటూ కంగనా ప్రాజెక్టు నుంచి బయటపడుతుందని సమాచారం. ప్రస్తుతం కంగనా స్థానంలో బొద్దుగుమ్మ జరైన్ ఖాన్ ను తీసుకున్నారు. తన లేటెస్ట్ మూవీ 'మాడారి' అఫీషియల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా కంగనాతో మూవీ గురించి మీడియా అడగగా ఇర్ఫాన్ ఈ విషయాలను ప్రస్తావించాడు. డివైన్ లవర్స్ కథ మధ్య తరగతి కుటుంబాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని, ఇది కామెడీ మూవీ సెప్టెంబర్ నెలలో షూటింగ్ మొదలుపెడతామని చెప్పుకొచ్చాడు. ఇన్ని విషయాలపై మాట్లాడిన ఇర్ఫాన్ కంగనా, హృతిక్ ల మధ్య తాజా వివాదంపై కామెంట్ చేయకపోవడం విశేషం. నిశికాంత్ కామత్ దర్శకత్వం వహించిన మాడారి మూవీ జూన్ 10న విడుదలకు సిద్ధంగా ఉంటుందని యూనిట్ గతంలోనే డిసైడ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement