ఎస్సీలుగా గుర్తించాలి
గెహ్లాట్‌కు మదాసి, మదారి కురువ సంక్షేమ సంఘం వినతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లాలోని మదాసి కురువ, మదారి కురువ కులస్తులకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని ఆ కులాల సంక్షేమ సంఘ నాయకులు.. కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌కు విన్నవించారు. ఎంపీ రేణుకాచౌదరి ఆధ్వర్యంలో ఇక్కడ మంత్రిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం ఇచ్చారు.
తెలంగాణలో 1976 నుంచి మదాసి కురువ, మదారి కురువ కులస్తులకు కురువ పేరుతో బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని వివరించారు. మంత్రి తక్షణం స్పందించి ఈ దిశగా విచారణ జరిపించేందుకు ఆదేశాలు జారీ చేశారని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.రంగన్న, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రంజిత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.