' మాదిగలను విస్మరించడం దారుణం'
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ అస్పష్ట వైఖరితోనే విద్యారంగంలో అయోమయ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాఠ్యాంశాల మార్పు, ఫాస్ట్ పథకం, ఎంసెట్ నిర్వహణ, పోటీ పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ఏర్పడిన గందరగోళాన్ని తొలగించేందుకు ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్నిపొంగులేటి డిమాండ్ చేశారు.
కేవలం తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాల మార్పు పేరుతో తెలుగు నేతల చరిత్రను, తెలుగుజాతికోసం కృషి చేసిన మాదిగల చరిత్రను తొలగించాలనుకోవడం దారుణమైన విషయమన్నారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం ఎంతోమంది నిరుద్యగులు ఎదురుచూస్తున్నారని, నోటిఫికేషన్లు పెండింగులో పెట్టడం దారుణమని పొంగులేటి పేర్కొన్నారు.