payyavula keshav
-
అప్పులపై బాబు పిచ్చి కూతలు గుట్టు రట్టు చేసిన పయ్యావుల కేశవ్
-
అప్పులపై కట్టుకథలు.. అసెంబ్లీలో బట్టబయలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ హయాంలో అప్పులపై ఎన్నికల ముందు పచ్చి అబద్ధాలే చెప్పామని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం శుక్రవారం అంగీకరించింది. ఒకసారి రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారని, మరోసారి రూ.10 లక్షల కోట్లంటూ ఎన్నికల ముందు కూటమి నేతలు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ అసెంబ్లీలో, బయట నిస్సిగ్గుగా అవాస్తవాలు చెబుతున్నారు. అయితే శుక్రవారం అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మత్స్యరాస విశ్వేశ్వర రాజు రాష్ట్ర అప్పులపై అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ లిఖిత పూర్వకంగా సమాధానం చెబుతూ 2023–24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు, గ్యారెంటీ అప్పులు కలిపి మొత్తం రూ.6.46 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించారు. ఇదే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ సీఎం చంద్రబాబు రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారంటూ అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్ర అప్పులు 2023–24 మార్చి నాటికి బడ్జెట్లో రూ.4.91 లక్షల కోట్లు, గ్యారెంటీ అప్పులు రూ.1.54 లక్షల కోట్లు.. మొత్తంగా రూ.6.46 లక్షల కోట్లేనని స్పష్టం చేశారు. తద్వారా సీఎం చంద్రబాబు ఇంకా రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారంటూ చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనని అర్థమైందని ఆర్థిక శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. దుష్ప్రచారమే లక్ష్యం కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్లో 2024 డిసెంబర్ నాటికే ఏకంగా రూ.71 వేల కోట్లకు పైగా అప్పు చేసినట్లు ఆర్థిక మంత్రి కేశవ్ వెల్లడించారు. 2023–24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు రూ.4,91,734.11 కోట్లు ఉండగా, ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి బడ్జెట్ అప్పులు రూ.5,63,376.96 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి 2024 డిసెంబర్ 31 నాటికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వని ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అప్పులు రూ.91,252.58 కోట్లు ఉన్నాయన్నారు. అన్నీ కలుపుకుంటే కూడా మొత్తం అప్పులు రూ.10 లక్షల కోట్లు లేవని తేలింది. అయినా సరే సీఎం చంద్రబాబు పదే పదే రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని చెబుతుండటం వెనుక గత దుష్ప్రచారమే కారణం. అప్పుడు అలా చెప్పినందున, ఇప్పుడు మరో రకంగా చెబితే బాగోదనే ఇలా మాట్లాడుతున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్ర అప్పులు రూ.6.46 కోట్లేనని అప్పటి సీఎం వైఎస్ జగన్‌తోపాటు, కాగ్, ఆర్బీఐ నివేదికలు వెల్లడించాయి. ఇప్పుడు మంత్రి కేశవ్ కూడా ఇదే చెప్పారు. ఇదంతా ప్రజలను నమ్మించాలనే మోసపూరిత వ్యవహారం తప్ప మరొకటి కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
అసెంబ్లీ సాక్షిగా అప్పు లపై టీడీపీ అబద్ధాలు బట్టబయలు
-
అఫీషియల్: జగన్ హయాంలో అప్పు రూ.3 లక్షల కోట్లే!
అమరావతి, సాక్షి: వైఎస్ జగన్ హయాంలో అప్పులపై చేస్తున్న అసత్య ప్రచారం, చంద్రబాబు కుట్ర.. అసెంబ్లీ సాక్షిగా బద్ధలైంది. ఏకంగా రూ.14 లక్షల కోట్లంటూ ప్రచారం మొదలుపెట్టి.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ. 5,19,192 కోట్లు మాత్రమేనని ప్రకటించింది. గత రెండు ప్రభుత్వాల అప్పులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు.. ఇవాళ ఆర్థిక మంత్రి పయ్యావుల లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు.2014 జూన్ 2 వ తేదీ నుంచి.. అంటే 2014-15 నుంచి 2023-24.. జూన్ 12వ తేదీ దాకా.. అలాగే 2024 డిసెంబర్ 31వ తేదీ దాకా ప్రభుత్వం, ప్రభుత్వ రంగల సంస్థల రుణాల వివరాలు తెలియజేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్, మత్స్యరస విశ్వేశ్వరరాజులు ఆర్థిక మంత్రి పయ్యావులను కోరారు.వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పుల లెక్క ఇదిపబ్లిక్ అప్పులు రూ.2,34,225 కోట్లు. కార్పొరేషన్లు ద్వారా చేసిన అప్పులు రూ. 1,05, 355 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ తెలిపింది.మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమే.అలాగే గత ప్రభుత్వం(వైఎస్సార్సీపీ) దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.5,19,192 కోట్లు అని పేర్కొంది.అప్పులపై బాబు అబద్ధాలుచంద్రబాబు ఏపీ ఎన్నికల ప్రచారంలో.. 14 లక్షల కోట్లప్పులు చేశారంటూ ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక.. కిందటి ఏడాది గవర్నర్ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లుగా వినిపించారు. ఆ వెంట శ్వేత పత్రం పేరిట హడావిడి చేసి రిలీజ్ చేసి రూ.12.93 లక్షల కోట్లు అని ప్రచారం చేశారు. చివరికి బడ్జెట్‌కి వచ్చేసరికి ఆ అప్పులు మొత్తం రూ.6,46,531 కోట్లకు చేరింది. అయితే తాజా ప్రకటనతో ఆ దారుణమైన ప్రచారాలు ఎంత అబద్ధామో తేలిపోయింది. -
YS Jagan: ఉద్యోగులకు రావాల్సిన వేల కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టారు
-
పయ్యావుల కేశవ్ కు జగన్ కౌంటర్..
-
మా దగ్గర మంత్రదండం లేదు
సాక్షి, అమరావతి: ‘నేనేమి ఆర్థిక శాస్త్రవేత్తను కాను. నా దగ్గర మంత్ర దండం ఏమీ లేదు. రాత్రికి రాత్రే ఏవో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పడం లేదు. మా కాళ్లకు సంకెళ్లు వేశారు. మా చేతులు కట్టేశారు. అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్‌తో సహా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నాం. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతోనే మెరుగైన కేటాయింపులతో బడ్జెట్‌ను రూపొందించాం. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబును బ్లైండ్(గుడ్డిగా)గా నమ్మితే చాలు.. రాష్ట్రం రూపు రేఖలే మార్చేస్తారు’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆయన బదులిస్తూ.. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బ్రాండ్ చంద్రబాబు ఒక్కరు చాలన్నారు. తెలంగాణలో 2023–24లో రూ.1,73,389 కోట్ల ఆదాయం వస్తే, ఏపీలో రూ.1,01,985 కోట్ల ఆదాయం వచ్చిందని, జీతాల కోసం తెలంగాణ కేవలం రూ.51,682 కోట్లు (ఆదాయంలో 30 శాతం) ఖర్చు చేస్తుంటే, మనం రూ.89,008 కోట్లు (90శాతం) ఖర్చు చేస్తున్నామన్నారు. అప్పులకుతెలంగాణ ఏటా వడ్డీల రూపంలో రూ.52,080 కోట్లు చెల్లిస్తుంటే, ఏపీలో రూ.65,962 కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఈ ఏడాది కేంద్ర పన్నుల వాటాతో కలిపి రాష్ట్రానికి రూ.1.54,065 కోట్ల ఆదాయం వస్తే.. జీత భత్యాలు, వడ్డీల రూపంలో చెల్లించాల్సిన మొత్తం రూ.1,54,971 కోట్లుందన్నారు. 2014–19లో వ్యవసాయంలో 16 శాతం, సేవల రంగంలో 11.9శాతం వృద్ధి రేటు నమోదైతే, 2019–24 మధ్య 10.3 శాతం, 9.9 శాతంగా నమోదైనట్లు తెలిపారు. అంటే 2014–19తో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో వృద్ధి రేటు 3 శాతం పడిపోయిందన్నారు. ఫలితంగా రూ.76,195 కోట్లు అదనంగా అప్పు చేసే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. జీఎస్డీపీ, జీడీపీ పెరిగితేనే అప్పులు పుడతాయని, అందుకోసమే నిత్యం తపన పడుతున్నామని తెలిపారు. ఆర్థిక పరిస్థితి తెలిసే హామీలిచ్చాం..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా తాము సూపర్ సిక్స్ హామీలిచ్చామని, సంపద సృష్టి ద్వారా వాటిని అమలు చేసి తీరతామని మంత్రి కేశవ్ తెలిపారు. ఇప్పటికే పెన్షన్ల పెంపు కోసం ఏటా రూ.32,520 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం ద్వారా 72 లక్షల మంది పిల్లలకు రూ.15 వేల చొప్పున జమ చేసేందుకు రూ.9,407 కోట్లు, అన్నదాత సుఖీభవ కోసం ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు రూ.6,300 కోట్లు కేటాయించామన్నారు. ధరల స్థిరీకరణ నిధి కింద వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా రూ.500 కోట్లు కేటాయిస్తే, తాము రూ.300 కోట్లు మాత్రమే కేటాయించినట్లు ఒప్పుకున్నారు. -
అరరే కేశవా.. ఎన్టీఆర్, బాబులను బద్నాం చేస్తే ఎలా?
గాలి కబుర్లు...సోది లెక్కలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూడండి! ముఖ్యమంత్రి చంద్రబాబును పొగిడేందుకు.. షాడో సీఎం లోకేష్‌ను సంతోషపెట్టేందుకు మంత్రిగారు రాష్ట్ర ఇమేజీని దెబ్బతీసేందుకూ వెనుకాడలేదు.. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడలేదు! బడ్జెట్ ప్రసంగం మొత్తం మ్మీద వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, గత ప్రభుత్వం అంటూ పదే పదే ప్రస్తావించి కేశవ్ తన లోపలి భయాన్ని బయటపెట్టేసుకున్నట్లు అనిపించింది. కాకపోతే ఈ క్రమంలో ఆయన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పాలనను కూడా విధ్వంసంతో పోల్చేశారు. ఒకపక్క రాష్ట్రానికి రుణాలు వచ్చే అవకాశం సున్నా అంటూనే.. ఇంకోపక్క లక్ష కోట్ల రూపాయల రుణం తీసుకోబోతున్నామని చెప్పడం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికే చెల్లింది. రాజధాని అమరావతి కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి అవసరం లేదంటూనే బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు వ్యయం చేయబోతున్నామని అంటారు. అంతేకాదు.. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకువస్తూ ఆ మాటను ధైర్యంగా చెప్పలేని దుస్థితి కేశవ్‌ది. 👉సాధారణంగా ఎవరైనా తమ రాష్ట్రం అభివృద్ది పథంలో ఉంది. గొప్పగా పని చేస్తున్నామని చెప్పుకుంటారు. కూటమి ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో నడుస్తోంది. రాష్ట్రం నాశనమైపోయిందని, విధ్వంసమైందని.. రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబు దాడికి బుగ్గయిన హిరోషిమాతో పోల్చడం ఎంత దుర్మార్గం!. ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమాభిమానాలు ఉన్నవారు ఎవరైనా ఇలాంటి దిక్కుమాలిన పోలికలు చేస్తారా?. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం కాదా! ఈ మాటలను సీరియస్‌గా తీసుకుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా?. అంతేకాదు.. 👉ఏకంగా ఏపీకి రుణం తీసుకునే సామర్ధ్యం సున్నా అని రాశారంటే ఏమనుకోవాలి? అది నిజమే అయితే కొత్త బడ్జెట్లో రూ.1.03 లక్షల కోట్ల రుణం తెచ్చుకుంటామని ఎలా చెప్పారు? ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1.31 లక్షల కోట్ల రుణం ఎలా తీసుకువచ్చారు? ఎవరినో మాయ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరికి ప్రయోజనం. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన వీరు.. YSRCP ప్రభుత్వ హయాంలో వచ్చినదానికంటే తక్కువ ఆదాయం వచ్చిన దానిపై మాత్రం కిమ్మనరు! రుణాలే సంపద అనుకోవాలనా?. ప్రతి వైఫల్యాన్ని గత జగన్ ప్రభుత్వంపై నెట్టేస్తే.. ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? ఇప్పుడు చేస్తున్న విమర్శలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినవే కదా! అయినా జగన్ కంటే మూడు రెట్లు అధికంగా హామీలు ఎలా ఇచ్చారంటే జవాబు చెప్పరు. ఇప్పుడు ఆ సూపర్ సిక్స్, తదితర హామీలన్నీ ఎగవేయడానికి వైఎస్సార్సీపీ ఆరోపణలు చేసి ప్రజలను పిచ్చోళ్లను చేస్తారా?. ఇదేమైనా ధర్మమేనా!. అదే సమయంలో చంద్రబాబును పొగడడం కోసం ఎన్టీఆర్‌ను సైతం భ్రష్టు పట్టించేశారు. 1995లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదట. దానికి కారణం ఒక్క ఎన్టీఆరేనా? ఆయన తీసుకొచ్చిన పథకాలేనా? అలాంటప్పుడు అదే ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా ఉన్నదెవరు? చంద్రబాబే కదా?. పయ్యావుల కేశవ్‌కు ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవం ఏమిటో ఈ బడ్జెట్ ప్రసంగంతో తేలిపోయింది. గత ఏడాది బడ్జెట్ లో ఏమి చెప్పాం..ఏమి చేశాం..అన్నదానితో నిమిత్తం లేకుండా ఒక ఉపన్యాసం తయారు చేసుకుని శాసనసభలో చదివితే సరిపోతుందా?. విచిత్రం ఏమిటంటే.. 2024-25 బడ్జెట్‌ను రూ.2.94 లక్షల కోట్లతో ప్రవేశపెట్టినా అందులో ఎంత శాతం అమలైందన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనాతో వేసిన బడ్జెట్ అది. అయితే జనవరి నాటికి వచ్ని ఆదాయం కేవలం ఒక లక్ష ఒక వెయ్యి కోట్లు మాత్రమే. అంటే సగం ఆదాయం కూడా లేకుండా పోయిందన్నమాట. పరిస్థితి ఇలా ఉంటే.. తాజా బడ్జెట్ కేటాయింపులు ఎకాఎకిన రూ.3.22 లక్షల కోట్లు అని ఎలా చెప్పారో అర్థం కాదు. కేవలం కాకి లెక్కలతో పుస్తకాలు నింపేసి ప్రజలను మభ్యపెట్టడం కాకపోతే? ఒకవైపు రాష్ట్రం ఆర్ధికంగా విధ్వంసమైందంటూనే.. మరోపక్క ఆదాయం పెరుగుతుందని ఎలా అంటారు?. సూపర్ సిక్స్ వంటి ఆచరణ కాని హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ఎలా అనేదానిపైనే అధికంగా దృష్టి పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ధైర్యం ఉంటే టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన హామీలు ఏమిటి? వాటి అమలుకు బడ్జెట్లో జరిపిన కేటాయింపులు ఎంత? కేటాయించకపోతే ఎందుకు చేయలేకపోయారు అన్నవి మాటమాత్రం మాట్లడకుండా ఊకదంపుడు కబుర్లు చెబితే ఏమి ఉపయోగం?. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం పథకం కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి వ్యయం చేయలేదు. అలాగే.. అన్నదాత సుఖీభవ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయించి రైతుకు నయాపైసా ఇవ్వలేదు. అంటే..పేరుకు కేటాయింపులు జరపడం.. ఆ తర్వాత గాలికి వదలి వేయడం అనేకదా! ఆడపడుచుకుల నెలకు రూ.1,500 ఆడబిడ్డ నిధి పేరిట సాయంమహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం బీసీలకు యాభై ఏళ్లకే ఫించన్.. వీటి ఊసే లేదు. అలాగే వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడేశారు. 👉అమరావతి కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించారు కానీ.. అంతా ఖర్చు చేస్తే చేయవచ్చు. ఎందుకంటే రాష్ట్రం ఏమైపోయినా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే చాలన్నట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న భావన నెలకొంది. అంతేకాదు. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకు వస్తున్న విషయాన్నీ నిజాయితీగా ఒప్పుకోకపోవడం గమనార్హం. అదేదో కేంద్రం ఊరికే ఇస్తున్న డబ్బు అన్నట్లు పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇదంతా ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజలపై పడే భారమే అవుతుంది.వారు చెల్లించే పన్నులనే వాడుకోవాలి. ఇక్కడ మరో మాట చెప్పాలి. జగన్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి స్కూళ్లు బాగు చేసి అనేక సంస్కరణలు తీసుకువస్తే కేశవ్ తన ప్రసంగంలో గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని దుర్మార్గంగా వ్యాఖ్యానించారు. లోకేష్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఇంతలా దిగజారవలసిన అవసరం లేదు. చంద్రబాబు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోతుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. కాని తీరా చూస్తే జగన్ టైమ్‌లో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సుమారు రూ.13 వేల కోట్ల ఆదాయం వస్తే, చంద్రబాబు సర్కార్ పది నెలల పాలనలో అది రూ. తొమ్మిది వేల కోట్లకు కూడా చేరలేదు!. కేటాయింపుల గురించి చూస్తే ఫించన్లకు రూ.33 వేల కోట్లు అవసరమని గవర్నర్ ప్రసంగంలో చెబుతారు. బడ్జెట్లో మాత్రం రూ.27 వేల కోట్లే చూపుతారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామన్న ఎన్నికల హామీపై మాటమార్చిన చంద్రబాబు ఒక ఏడాది ఎగ్గొటడమే కాకుండా.. తాజా బడ్జెట్లో సరిపడా కేటాయింపులూ చేయలేదు. తల్లికి వందనం కింద విద్యార్ధులు ఒకొక్కరికి రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు రూ.12 వేల కోట్లు అవసరం కాగా.. కేటాయించింది రూ. ఎనిమిది వేల కోట్లే. పైగా స్పీచ్ లో ఎక్కడా ప్రతి విద్యార్థికీ అని చెప్పకుండా ప్రతి తల్లికీ అని తెలివిగా చెప్పారు. దీనిపై వివరణ ఇస్తారేమో చూడాలి. కేశవ్ బడ్జెట్ ప్రసంగం మొత్తమ్మీద 22 సార్లు విమర్శలు చేయడం ద్వారా జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి కూటమి సర్కారు ఎంత భయపడుతున్నది బయటపెట్టుకున్నారు. మొత్తం మీద బడ్జెట్ ద్వారా ప్రజలను మళ్లీ మభ్య పెట్టే యత్నం చేసే క్రమంలో వారి డొల్లతనాన్ని వారే బయట పెట్టుకున్నారు. కాకపోతే ఈనాడు ,ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు మాత్రం ఇది బాహుబలిగా.. పండంటి ప్రగతికి పది సూత్రాలుగా కనిపించవచ్చు. ఎందుకంటే ప్రజలకంటే ఈ ఎల్లో మీడియా వారికే వారికే ఈ ప్రభుత్వం వల్ల అధిక గిట్టుబాటు కనుక.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విద్యుత్ వెలుగులు లేవు!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగానికి ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించకుండా చంద్రబాబు ప్రభుత్వం మరోసారి చేతులెత్తేసింది. ఓటాన్ బడ్జెట్లోనే ఇంధన శాఖకు అరకొరగా కేటాయింపులు చేసి చేతులు దులుపుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. వార్షిక బడ్జెట్లోనూ మొండి చేయి చూపించింది. రాష్ట్ర ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీల భారం వేసి బిల్లులు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. ఇంధన రంగానికి, రాయితీలు, సబ్సిడీల కోసం బడ్జెట్లో కేవలం రూ.13,600 కోట్లే కేటాయించింది. కనీసం చార్జీల రూపంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నంత కూడా ఇవ్వలేకపోయింది. విద్యుత్ రంగం రూ.1.29 లక్షల కోట్లకు పైగా నష్టాల్లో ఉందన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఆ అప్పులను తీర్చేందుకు ఒక్క రూపాయి కూడా సాయంగా ప్రకటించలేదు. పైగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిoదని.. అందుకే ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. నిజానికి గత టీడీపీ హయాంలో జరిగిన అనవసర అధిక ధరల విద్యుత్ కొనుగోళ్ల వల్లే.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయనే వాస్తవాన్ని మంత్రి ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు. నూతన సమగ్ర ఆంధ్రప్రదేశ్ సమీకృత క్లీన్ ఎనర్జీ విధానం–2024 ద్వారా పునరుత్పాదక ఇంధన తయారీ జోన్లను ఏర్పాటు చేసి, పెట్టుబడులను ఆకర్షించి 7.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. అయితే ఇప్పటివరకూ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో, ఈ రంగంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో మంత్రి చెప్పలేకపోయారు. కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ఇంధన రంగానికి సంబంధించి ఇచ్చిన హామీలకు బడ్జెట్లో అస్సలు స్థానమే లభించలేదు. రైతులకు సబ్సిడీపై పంపుసెట్లు మంజూరు చేస్తామనే హామీ అమలు గురించి ఎక్కడా కనిపించలేదు. భవిష్యత్‌లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను అందుకోవడం కోసం ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ప్రకటించలేదు. ఇక ఇంధన పొదుపు, సంరక్షణ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కేవలం కేంద్ర పథకాలైన పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలకు వచ్చే సబ్సిడీలతోనే సోలార్ రూఫ్ టాప్, సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని చెబుతోంది. -
పన్ను పోటు!
సాక్షి, అమరావతి: భారీగా మార్కెట్ అప్పులు, కేంద్రం నుంచి రుణాలతో ప్రజలపై పెనుభారం మోపడమే లక్ష్యంగా 2025–26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం శాసనసభకు సమర్పించారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేది బడ్జెట్లో ఎక్కడా ప్రతిబింబించకపోగా భారీగా అప్పులు, పన్నులు, పన్నేతర వాతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపించాయి. ప్రజారుణం కింద ఏకంగా రూ.1.03 లక్షల కోట్లు అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేశారు. పన్నుల ఆదాయం రూపంలో వచ్చే ఆర్థిక ఏడాది అదనంగా రూ.15 వేల కోట్లు వస్తాయని, పన్నేతర ఆదాయం ద్వారా అదనంగా రూ.12 వేల కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. 2024–25 రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.94,966 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనగా 2025–26లో సొంత పన్నుల ఆదాయం రూ.1,09,006 కోట్లుగా అంచనా వేశారు. పన్నేతర ఆదాయం 2024–25లో రూ.7,018 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనగా 2025–26లో ఏకంగా రూ.19,119 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అంటే పన్నులు, పన్నేతర రూపంలో ప్రజల జేబులను ఖాళీ చేయడమే లక్ష్యంగా బడ్జెట్ అంచనాలున్నట్లు వెల్లడవుతోంది.రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణం కింద రూ.81,956.50 కోట్ల అప్పులు, కేంద్రం నుంచి రూ.21,700 కోట్ల అప్పు చేయనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేశారు. అంటే మొత్తం ప్రజా రుణం కింద 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,03,656.50 కోట్లు అప్పు చేయనున్నట్లు పేర్కొన్నారు. సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు నమ్మబలికిన సీఎం చంద్రబాబు బడ్జెట్లో ఆ ఊసే లేకుండా చేశారు.ప్రభుత్వ రంగంలో పోర్టులు, వైద్య కళాశాలల నిర్మాణం గురించి అసలు ప్రస్తావనే చేయలేదు. పైగా భారీ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు బడా సంస్థలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కోసం బడ్జెట్లో ఏకంగా రూ.2000 కోట్లు కేటాయించడం గమనార్హం. మొత్తం మీద పన్నుల రూపంలో ఇటు భారీ ఆదాయం, అటు భారీ అప్పులతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.3.22 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.51 లక్షల కోట్లు, మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 1.82 శాతమని వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 4.38 శాతమని చెప్పారు. మద్యం ద్వారా 2025–26లో రూ.27,097 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.13,150 కోట్లు ఆదాయం రానుందని అంచనా వేశారు. -
హామీలు రద్దు.. మోసాల పద్దు!
సాక్షి, అమరావతి: ‘‘బాబు ష్యూరిటీ అంటే... చరిత్ర చూడని మోసాలు గ్యారెంటీ!’’ అని బడ్జెట్ పుటల సాక్షిగా మరోసారి రుజువయ్యాయి! ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా ఎగ్గొడుతూ.. ఇస్తున్న ఒకటో రెండో పథకాలకు కూడా కోతలు, కత్తిరింపులు విధిస్తూ... లక్షల మంది లబ్ధిదారులను తగ్గిస్తూ.. పిల్లల నుంచి అవ్వల దాకా అన్ని వర్గాలను మోసం చేస్తూ.. సూపర్ సిక్స్‌కు ఎగనామం పెడుతూ సీఎం చంద్రబాబు సర్కారు శుక్రవారం అసెంబ్లీకి బడ్జెట్‌ను సమర్పించింది. సూపర్ సిక్స్ సహా హామీలన్నీ విస్మరించి పిల్లలు, మహిళలు, నిరుద్యోగులు, యువత, రైతన్నలు.. ఇలా అన్ని వర్గాలను దగా చేసింది. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని హామీ ఇచ్చి ఆ ఊసే లేకుండా చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో ఏడాదిగా యువత నెలకు రూ.3 వేల చొప్పున నష్టపోతోంది. 1.60 కోట్ల మందికి ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేల ఆర్థిక సాయాన్ని మరోసారి ఎగ్గొట్టడంతో మహిళలు ఏడాదికి సుమారు రూ.28,800 కోట్లు కోల్పోతున్నారు! ఇక ‘తల్లికి వందనం’ అంటూనే బడ్జెట్లో రూ.3 వేల కోట్లకుపైగా కోత పెట్టారు! అన్నదాతా సుఖీభవ అమలుకు కావాల్సింది రూ.10,717 కోట్లైతే బడ్జెట్లో ఇచ్చింది కేవలం రూ.6,300 కోట్లే! ఈ లెక్కన 22 లక్షల మందికిపైగా రైతులు రూ.4,417 కోట్ల పెట్టుబడి సాయానికి దూరం కానున్నారు. గతేడాది మొండి చెయ్యి చూపడంతో రైతన్నలు ఇప్పటికే రూ.పది వేల కోట్లకుపైగా నష్టపోయారు. ఇక ఇప్పటికే దాదాపు రెండు లక్షల పెన్షన్లను తగ్గించగా తాజా బడ్జెట్ కేటాయింపుల్లో రూ.5 వేల కోట్లకుపైగా కోత విధించటాన్ని బట్టి మరిన్ని పింఛన్లను ఎగరగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వెరసి.. ప్రణాళిక – ఆలోచనల సమ్మిళతంగా ఉండాల్సిన రాష్ట్ర బడ్జెట్.. అంతులేని మోసాలు.. గాడి తప్పిన అంకెల సమాహారంగా మిగిలిపోయింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో మంత్రులు అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి పి.నారాయణ ప్రవేశపెట్టారు.అంకెల్లో ఆడంబరంగా..అప్పులతో ముంచెత్తుతూ.. అంకెల్లో అత్యంత భారీతనంతో ఆడంబరంగా కనిపించిన ఈ బడ్జెట్ పరిమాణం రూ.3.22 లక్షల కోట్లు! కానీ ఇంత భారీ బడ్జెట్లోనూ హామీలకు కేటాయింపులు చేయకుండా సీఎం చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు. గత ప్రభుత్వం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఏకంగా రూ.4.57 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూరిస్తే ఇప్పుడు చంద్రబాబు ఏడాదిలోనే రూ.లక్ష కోట్లకుపైగా అప్పులతో ముంచెత్తి చరిత్ర సృష్టించారు. ఆకారం పెంచినా.. నేల విడిచి సాము చేసినా.. ఈ బడ్జెట్ చంద్రబాబు సర్కారు మోసాలను మాత్రం దాచిపెట్టలేకపోయింది! ఎన్నికల హామీల సంగతి అటుంచితే.. సీఎం చంద్రబాబు రోజూ జబ్బలు చరుచుకునే ‘సంపద సృష్టి’ ఆనవాళ్లు బూతద్దంతో గాలించినా బడ్జెట్లో కానరాలేదు. వైఎస్సార్ సీపీ హయాంలో విలువైన సంపద సృష్టిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పోర్టులు, కొత్త మెడికల్ కాలేజీల గురించి ఈ బడ్జెట్లో కనీసం ప్రస్తావించలేదు. ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ ఇంటి ముంగిటికే గత ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక వ్యవస్థలు, సంక్షేమ పథకాలను కూటమి సర్కారు నిర్వీర్యం చేయడంతో ఇవాళ పల్లెలు కళ తప్పి కనిపిస్తున్నాయి. వలంటీర్ల వేతనాలు రూ.ఐదు వేలు కాదు.. ఏకంగా రూ.పది వేలకు పెంచుతామంటూ నమ్మబలికి ఏకంగా వ్యవస్థకే మంగళం పాడేశారు!హామీలు గాలికి..సూపర్ సిక్స్‌లో తొలి హామీగా పేర్కొన్న నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భృతి గురించి బడ్జెట్లో అసలు ప్రస్తావనే లేకుండా చేశారు. ఆడబిడ్డ నిధికి పైసా కూడా కేటాయించలేదు. మహిళల ఉచిత బస్సు ఊసే లేదు. అన్నదాతా సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు కోతలు విధించి అరకొర కేటాయింపులను చూపించినా ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. కాగితాల్లో కేటాయింపులు చేయడం.. అమలు చేయకపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే! గత బడ్జెట్లోనూ అన్నదాతా సుఖీభవకు రూ.వెయ్యి కోట్లు కేటాయింపులు చేసినట్లు చూపించి చివరకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టడం తెలిసిందే. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం కింద ఇచ్చేందుకు రూ.9,407 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పకుండా తప్పించుకునే యత్నం చేశారు.పేదల ఇళ్లకు పాతర..పేదల ఇళ్ల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం పాతరేసింది. వైఎస్సార్సీపీ హయాంలో 2023–24లో ఏకంగా రూ.6,866 కోట్లు కేటాయించి వ్యయం చేయగా.. కూటమి సర్కారు 2024–25 పేదల రూ.4,012 కోట్లు కేటాయించి కేవలం రూ.1,611 కోట్లే వ్యయం చేసినట్లు సవరించిన అంచనాల్లో పేర్కొంది. ఇక 2025–26లో పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.6,317 కోట్లు ప్రతిపాదించింది. -
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్డేట్స్భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వంపబ్లిక్ డెట్ 79,227 కోట్లు అంచనా గా చూపించిన ప్రభుత్వంరెవెన్యూ వ్యయం 2,51, 162 కోట్లుపెట్టుబడి వ్యయం 40,636 కోట్లు అంచనాతో బడ్జెట్‘తల్లికి వందనం’కి నిధులు కోతబడ్జెట్ లో 8,276 కోట్లు మాత్రమే తల్లికి వందనం కి కేటాయింపు12 వేల కోట్లకు పైగా తల్లికి వందనం కి అవసరంగత ఏడాది ‘తల్లికి వందనం’ పథకానికి నిధులు కేటాయించి ఎగనామం పెట్టిన ప్రభుత్వందీపం పథకానికి భారీగా కోతకోటి 55 లక్షల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదింపుబడ్జెట్ లో 4 వేల కోట్లకు గాను 2601 కోట్లు మాత్రమే కేటాయింపుఅన్నదాత సుఖీభవకు భారీ కోతఅన్నదాత సుఖీభవ కి కేవలం 6300 కోట్లు కేటాయింపురైతుకు 20 వేలు చొప్పున ఇస్తామని హామీ10 వేల 400 కోట్లకు 6300 కోట్లే కేటాయింపు👉 మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రసంగంరూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లుబీసీ క్షేమానికి రూ.23, 260 కోట్లుపాఠశాల విద్యకు 31, 806 కోట్లుఎస్సీల సంక్షేమానికి రూ. 20,281 కోట్లువైద్య ఆరోగ్య శాఖకు రూ. 19,265 కోట్లుపంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 18,848 కోట్లుపురపాలక శాఖకు రూ. 13,862 కోట్లు కేటాయింపుసాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లుజలవనరుల శాఖకు రూ.18,020 కోట్లుఇంధన శాఖకు రూ.13,600 కోట్లుపౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు రాష్ట్ర పునర్మిర్మాణం సవాలుతో కూడుకుంది1995నాటి పరిస్థితులే నేడు నెలకొన్నాయికూటమి అధికారంలోకి వచ్చాక 74 పథకాలను ప్రారంభించాంరాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందిఅప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలింది 2025-26కుగానూ రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ అంచనామూలధన వ్యయం రూ.40, 635 కోట్లుమూలధన వ్యయం అంచనా రూ.40, 635 కోట్లురెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుద్రవ్యలోటు రూ.79,926 కోట్లురెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర 👉రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ 2025-26👉కూటమి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి తొలి బడ్జెట్👉శాసనసభలో ఏపీ బడ్జెట్ 2025 ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్👉 ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం👉 ఏపీ బడ్జెట్ 2025కు కేబినెట్ ఆమోదం👉అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు చాంబర్లో మంత్రివర్గం సమావేశం👉 హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్, మంత్రులు👉 సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు మరోమారు ఎలా మోసగించబోతున్నారనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. బడ్జెట్.. ఎక్కడ.. ఎవరు?👉10 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్👉శాసనసభలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు👉 శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 👉శాసన మండలిలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.వాట్ ఎబౌట్ సూపర్ సిక్స్?👉ఈ బడ్జెట్ లోనేనా సూపర్ సిక్స్ కి నిధులు కేటాయిస్తారా లేదా అనే సందిగ్ధత..👉ఇప్పటివరకు సూపర్ సిక్స్ ని అమలు చేయని కూటమి ప్రభుత్వం👉తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు, మహాలక్ష్మి వంటి పథకాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలు👉మొదటి ఏడాది సూపర్ సిక్స్ కి మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.కేటాయింపులైతే చేసేద్దాం!👉కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. 👉ఏడాదిగా హామీల ఊసెత్తని బాబు ఈ బడ్జెట్లో పథకాలకు కేటాయింపుల గారడీ చేయనున్నట్లు సమాచారం. 👉 కేటాయింపులు చేసేద్దాం.. ఎటూ నిధులు ఇచ్చేది లేదుగా అని చంద్రబాబు తలపోస్తున్నట్లు సమాచారం. 👉2014–19లో కూడా ఆయన చాలా హామీలన్నీ బుట్టదాఖలా చేశారు. రుణమాఫీకి కొన్ని నిధులు కేటాయించినా పూర్తిగా చేసేసినట్లు భ్రమ కల్పించారు. రకరకాల షరతులు, మాయోపాయాలతో రుణమాఫీ లబ్దిదారులను కుదించేసిన చంద్రబాబు నిరుద్యోగ భృతిని పూర్తిగా మాయం చేశారు. -
AP Budget 2025: నేడు ఏపీ బడ్జెట్..
సాక్షి, అమరావతి: హామీలపై చంద్రబాబు మరోమారు ఎలా మోసగించబోతున్నారు అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఉదయం 10గంటలకు అసెంబ్లీలో రాష్ట్ర 2025–26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయానికి శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. అంతకుముందు ఉదయం 9గంటలకు అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు చాంబర్లో మంత్రివర్గం సమావేశమై 2025–26 బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. ఏడాదిగా హామీల ఊసెత్తని బాబు ఈ బడ్జెట్లో పథకాలకు కేటాయింపుల గారడీ చేయనున్నట్లు సమాచారం. ఎందుకంటే కేటాయింపులు చేసేద్దాం.. ఎటూ నిధులు ఇచ్చేది లేదుగా అని చంద్రబాబు తలపోస్తున్నట్లు సమాచారం. 2014–19లో కూడా ఆయన చాలా హామీలన్నీ బుట్టదాఖలా చేశారు. రుణమాఫీకి కొన్ని నిధులు కేటాయించినా పూర్తిగా చేసేసినట్లు భ్రమ కల్పించారు. రకరకాల షరతులు, మాయోపాయాలతో రుణమాఫీ లబ్దిదారులను కుదించేసిన చంద్రబాబు నిరుద్యోగ భృతిని పూర్తిగా మాయం చేశారు. హామీలను ఎగ్గొట్టడం, అసలు మేనిఫెస్టోనే మాయం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తులు. కొన్ని హామీలకు సంబంధించి బడ్జెట్లో అరకొర కేటాయింపులు జరిపినా ఆనక మమ అనిపించడం ఆయనకు మామూలే. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని, గౌరవవేతనాన్ని రూ.10వేలు చేస్తానని ఈ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన బాబు చివరకు ఆ వ్యవస్థనే లేకుండా వారి పొట్టకొట్టడం తెలిసిందే. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. మూడో హామీ కింద ఏటా ప్రతి రైతుకు రూ.20వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రతి మహిళకు (19 నుంచి 59 ఏళ్ల మధ్య) నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇలాంటి పథకాలలో కొన్నింటికి ఈ బడ్జెట్లో కంటితుడుపుగా కేటాయింపులు జరిపి మమ అనిపించేద్దామని చంద్రబాబు చూస్తున్నట్లు సమాచారం. -
అప్పులు తీసుకునే శక్తి ఏపీకి లేదు: మంత్రి పయ్యావుల
ఉరవకొండ: ‘నీతిఆయోగ్(NITI Aayog) దేశంలోని 18 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో మన రాష్ట్రం 17వ స్థానంలో ఉంది. ఏపీకి అప్పు తీసుకునే శక్తితోపాటు తీర్చే శక్తి కూడా లేదని తేల్చి సున్నా మార్కులు వేసింది’ అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) అన్నారు. గురువారం అనంతపురం జిల్లా ఉరవకొండ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తమ్మీద అప్పు తీసుకునే అర్హత లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాత్రమేనని నీతిఆయోగ్ తేలి్చందన్నారు. అయితే తాము అప్పులు ఉన్నాయని సాకు చూపి తప్పించుకోలేమని, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలను అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్థిక భారం ఉన్నా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి చూపుతామన్నారు. రాయలసీమ బాగుపడాలంటే నీళ్లు రావాలని, నీళ్లు రావాలంటే పోలవరం పూర్తి కావాలన్నారు. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కాగానే జిల్లాల మధ్య నీటి యుద్ధాలు ఆగిపోయాయన్నారు. రాయలసీమలో లక్ష ఎకరాలకు నీళ్లిచ్చే ప్రణాళికతో చంద్రబాబు ముందుకు వెళుతున్నారన్నారు. కేంద్రం అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు రైల్వే ప్రాజెక్టులపై రూ.90 వేల కోట్లు, జాతీయ రహదారులకు రూ.60 వేల కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. ఇవన్నీ పూర్తయితే సంపద సృష్టి జరిగి రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు. సంపద సృష్టి అంటే ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ మరోవైపు పథకాలు ముందుకు తీసుకుపోవడమేనని చెప్పారు. -
కాకినాడ పోర్టులో ‘పట్టాభి’ బియ్యం లారీలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ పోర్టులో పర్యటన సందర్భంగా స్టెల్లా–ఎల్ నౌకను తనిఖీ చేసి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందంటూ హడావుడి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడే సముద్ర జలాల్లో ఉన్న కెన్‌స్టార్ నౌకను కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. కెన్‌స్టార్ నౌకలో బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న కంపెనీ స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిది కావడమే దీనికి కారణం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పట్టాభి ఆగ్రో ఫుడ్స్ అధినేత కేవీ కృష్ణారావు బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఆర్థిక మంత్రి పయ్యావుల తన వియ్యంకుడు కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే ఎగుమతి చేస్తున్నాడని, ముడి బియ్యం ఎగుమతి చేయడంలేదని మంగళవారం చెప్పారు. మూడు తరాలుగా ఈ వ్యాపారంలో ఉన్న తన వియ్యంకుడు అసలు ఇప్పుడు ఇక్కడ వ్యాపారం చేయడం లేదన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. అయితే తన వియ్యంకుడి సంస్థ గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన మాటలన్నీ ‘పచి్చ’ అబద్ధాలని తాజాగా తేలిపోయింది. పోర్టులో పట్టాభి బియ్యం లారీలు.. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి కార్యకలాపాలను బుధవారం పరిశీలించగా మంత్రి పయ్యావుల మాటలు పచ్చి బూటకమని తేలిపోయింది. పట్టాభి ఆగ్రోఫుడ్స్ లిమిటెడ్ పేరుతోనే ఆ లారీలు రా రైస్‌ను పోర్టులో దిగుమతి చేస్తున్నాయి. ఓమ్ సాయి–2 ఏపీ ఏవీ కే 0024 బార్జ్‌లో పట్టాభి ఆగ్రోఫుడ్స్ పచ్చి బియ్యాన్ని ‘బిరస్ బుల్లోగ్’ ప్యాకింగ్‌తో పోర్టులో ఉన్న ఎంవీడీడీఎస్ మెరీనా అనే నౌకకు తరలిస్తున్నారు. 12 వేల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యాన్ని ఇండోనేషియాకు ఎగుమతి చేసేందుకు పట్టాభి ఆగ్రోఫుడ్స్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతుల్లో మంత్రి పయ్యావుల వియ్యంకుడి సంస్థ పట్టాభి ఆగ్రో ప్రైవేటు లిమిటెడ్ చురుగ్గా వ్యవహరిస్తోంది. వాస్తవాలు ఇలా ఉండగా మంత్రి పయ్యావుల తన వియ్యంకుడికి వత్తాసు పలుకుతూ పచ్చి అబద్ధాలు వల్లించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పచ్చ మీడియాకే అనుమతి.. కాకినాడ యాంకరేజ్ పోర్టులో నిలిపివేసిన స్టెల్లా–ఎల్ నౌకలో పీడీఎస్ బియ్యం తనిఖీల కోసం నియమించిన అధికారుల కమిటీ బుధవారం నౌకను పరిశీలించింది. టీవీ–5, ఈటీవీ, ఈనాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని మాత్రమే తనిఖీల సందర్భంగా కమిటీ తమ వెంట తీసుకెళ్లడం గమనార్హం. నౌకలో తనిఖీకి వెళుతున్నట్లు ఎల్లో మీడియాకు మాత్రమే సమాచారం ఇచ్చి గుట్టుగా వ్యవహరించారు. -
మంత్రి పయ్యావుల కేశవ్ కి కన్నబాబు అదిరిపోయే కౌంటర్
-
వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను సమర్పించిన రూ. 2.94 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ప్రజల్లో నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఈ బడ్జెట్ లాంఛన ప్రాయంగా మాత్రమే కనిపిస్తోంది. ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ‘సూపర్ సిక్స్’తో సహా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించలేదు. యువత నైపుణ్యాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి రంగాలపై గుర్తించదగిన శ్రద్ధను కనబరచలేదు. స్థిరమైన ఉపాధిని పెంపొందించడానికి ఎంఎస్ఎంఈ లకు అదనపు మద్దతు ఇవ్వాలి. అదెక్కడా బడ్జెట్లో కని పించడంలేదు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించే బదులు, స్పష్టమైన ఫలితా లను సాధించడానికి రాష్ట్రం ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వాలి. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు కూటమి సర్కారు మోకాలడ్డుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, మెయింటెనెన్స్ ఛార్జీల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. ఫలితంగా సుమారు 12 లక్షల ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనారిటీలకు చెందిన విద్యార్థుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపుల్లో కోత స్పష్టంగా కనిపిస్తోంది. ‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీలను పునరావృతం చేయడం మినహా ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంగా చెప్పలేదు. రూ. 43,402 కోట్లతో అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌దీ అదే దారి. మొత్తంగా, ఆదివాసీలు, దళితులు, మహిళలు, మైనారిటీల సంక్షేమానికి నామమాత్రంగానే ప్రభుత్వం నిధులు విదిల్చింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో సరిపెట్టారు. మిగతా హామీల అమ లుపై నిర్దిష్టత లేదు. 20 లక్షల మంది యువతకు ఉపాధి అవ కాశాలు, రూ. 3,000 నిరుద్యోగ భృతిని దాటవేశారు. 16,347 పోస్టుల భర్తీకి జారీ చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రస్తావించిన ఆర్థిక మంత్రి... ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీ, జీఓ నెంబరు 3 పునరుద్ధరణ గురించి నోరు మెదపలేదు. ప్రతి రైతుకూ ఏటా రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న ‘అన్నదాత సుఖీ భవ’కు 10 వేల 716 కోట్లు అవసరం కాగా 1000 కోట్లే కేటాయించారు. దాదాపు 25 లక్షలుగా ఉన్న కౌలు రైతులను ఆదుకోవడం కనీస ధర్మం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధా న్యత అని చెప్పినా, నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పోలేదు.ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా ఉండాల్సిన మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడంపై చూపే ఆత్రం పథకాల అమలులో కానరావడం లేదు. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున అంది స్తామన్న ‘మహాశక్తి’ జాడే లేదు. ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థికి రూ. 15 వేలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 84 లక్షల మంది విద్యార్థుల తల్లులకు చెల్లించేందుకు రూ. 12,600 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, విదిల్చింది రూ. 5,387 కోట్లే! బాలబాలికలకు, బాలింతలకు సేవలందిస్తున్న అంగన్వాడీ వర్క ర్లకు, హెల్పర్లకు పెండింగ్‌లో ఉన్న వేతన పెంపు గురించి ఎక్కడా ప్రస్తావించ లేదు. కార్మికులు, స్కీమ్ వర్కర్ల వేతన పెంపు, సామా జిక భద్రత ఊసే లేదు. మాటిచ్చినట్టుగా విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా వేల కోట్ల రూపాయల అప్పు భారం మోపుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల నుంచి కేంద్రం ఇప్పిస్తా మన్న రూ. 15 వేల కోట్లు గ్రాంటో, రుణమో తేల్చలేదు. మొత్తంగా చూసినప్పుడు బడ్జెట్ కేటాయింపులను బట్టి ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసినట్లు స్పష్టమవుతోంది.– డా‘‘ ముచ్చుకోట సురేష్ బాబుమొబైల్: 99899 88912 -
ఉరవకొండలో పచ్చమూకల ఉరుములు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండలో అరాచకాలకు హద్దులేకుండా పోతోంది. కాంట్రాక్టర్లు మొదలుకుని అధికారుల వరకూ అందరినీ టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. తమకు తలవంచకపోతే ఇక్కడ పనిచేసుకోలేరని నేరుగా హెచ్చరిస్తున్నారు. ఇలా కూటమి సర్కారు కొలువుదీరిన నాటినుంచి ఉరవకొండలో చోటామోటా నాయకులు, మండల స్థాయి లీడర్లు చెలరేగిపోతున్నారు. మాట వినకపోతే దౌర్జన్యాలకూ తెగబడుతున్నారు. తాజాగా.. ఓ సెక్యూరిటీ ఏజెన్సీకి వస్తున్న బెదిరింపులు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. సెక్యూరిటీ ఏజెన్సీకి బెదిరింపులు గతంలో ఉరవకొండ నియోజకవర్గంలో అత్యధికంగా గాలిమరలు (విండ్‌మిల్స్) ఏర్పాటుచేశారు. వీటి భద్రతను ఎస్ఐఎస్ సెక్యూరిటీ ఏజెన్సీ 100 మంది సిబ్బందితో పర్యవేక్షిస్తోంది. కానీ, ఈ సెక్యూరిటీ సిబ్బందిని తొలగించి తమ మనుషులను పెట్టుకోవాలని.. మాట వినకపోతే ఇక్కడ ఉండలేరంటూ ఉరవకొండకే చెందిన మంత్రి పయ్యావుల కేశవ్ మనుషులు ఏజెన్సీని బెదిరిస్తున్నారు. కొన్నిచోట్ల వీరు బరితెగించి సెక్యూరిటీ సిబ్బందిని బలవంతంగా బయటకు లాగి యూనిఫాం వేసుకుని విధుల్లో చేరారు. వీరి ఆగడాలు చూసి ఏమీచేయలేక అక్కడున్న కంపెనీ ఇంజనీర్లు నోరెత్తడంలేదు. ఈ క్రమంలోనే తాజాగా కొందరు టీడీపీ నేతలు ఉరవకొండకు సమీపంలోని నింబగల్లు విండ్మిల్ సబ్‌స్టేషన్‌లో గొడవకు దిగి కార్యాలయానికి తాళాలు వేసినట్లు తెలిసింది. ఆ తర్వాత వివాదం సద్దుమణగడంతో మళ్లీ తెరిచారు. ప్రస్తుతానికి అక్కడున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను తొలగించి కొత్తవారిని పెట్టారు. మరోవైపు.. ఎస్ఐఎస్ సంస్థకు 2026 వరకూ కాంట్రాక్టు ఉంది. కానీ, తక్షణమే కాంట్రాక్టు వదిలివెళ్లాలని పచ్చమూకలు బెదిరిస్తున్నాయి. ముఖ్యమంత్రికి ఫిర్యాదు.. ఈ దౌర్జన్యాలు, బెదిరింపులపై సెక్యూరిటీ సంస్థ యాజమాన్యం ముఖ్యమంత్రి కార్యాలయానికి, విద్యాశాఖా మంత్రి లోకేశ్‌కూ ఫిర్యాదు చేసింది. తమ విధులకు ఆటంకాలు కల్పిస్తూ స్థానిక నాయకులు బెదిరిస్తున్నారని.. నిజానికి.. తాము స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించామని, అయినా సరే వెళ్లిపోవాలని తమను ఒత్తిడి చేస్తున్నట్లు అందులో పేర్కొంది. కానీ, వీరి నుంచి ఎలాంటి స్పందన లేకపోగా టీడీపీ నేతల బెదిరింపులూ కొనసాగుతున్నాయి. మంత్రి ఇలాకాలో తమ్ముళ్ల ఆగడాలు..» విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో నాగరాజు అనే వ్యక్తి ఎనిమిదెకరాలు మొక్కజొన్న పంట వేయగా టీడీపీ నేతలు ఆ భూమి మాదంటూ పంటను ధ్వంసం చేశారు.» ఇదే మండలం చీకలగురికి గ్రామంలో ఓబులేసు, చౌడమ్మ దంపతులు రెండున్నర ఎకరాల్లో కందిపంట వేశారు. ఈ భూమి కూడా తమదేనంటూ పంటను ధ్వంసం చేసి భూమిని ఆక్రమించుకున్నారు.»మంత్రి పయ్యావుల కేశవ్ స్వగ్రామం కౌకుంట్లకు సమీపంలో టీడీపీ మండల స్థాయి లీడర్ జూదం నిర్వహిస్తున్నా పోలీసులు చూసీచూడకుండా వదిలేశారు.» ఉరవకొండలో చౌకబియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. డీలర్ల సహకారంతో టీడీపీ లీడర్లు దందా సాగిస్తున్నారు. -
విపక్షంలో పెద్ద పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమానించిందే జరుగుతోంది! శాసనసభలో ప్రజల గొంతుకను వినిపించనివ్వకుండా, రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ప్రభుత్వ కుట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలతో బయటపడింది. పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందని మంత్రి పయ్యావుల బుధవారం వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశమే లేదని, ఆయన వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష నేతగా ఉంటారని పేర్కొన్నారు. మంత్రి పయ్యావుల వ్యాఖ్యలను రాజ్యాంగ నిపుణులు తప్పుబడుతున్నారు. పది శాతం సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలన్న నిబంధన దేశంలో ఏ చట్టంలోనూ లేదని పేర్కొంటున్నారు. లోక్‌సభకు 1984లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకోగా సభలో 10 శాతం సీట్లు సాధించనప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించటాన్ని ఉదహరిస్తున్నారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగానూ కాంగ్రెస్ 26 మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు దక్కనప్పటికీ పి.జనార్థనరెడ్డిని నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగానూ బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు. కేంద్ర, రాష్ట్ర చట్టాలు ఏం చెబుతున్నాయంటే..విపక్షంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఉంటే ఆ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి.. ఆ పార్టీకి చెందిన లోక్‌సభ / రాజ్యసభ / శాసనసభ / శాసనమండలి పక్ష నేతను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్–1977లో సెక్షన్–1 స్పష్టంగా చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్, డిస్క్వాలిఫికేషన్ యాక్ట్–1953 సెక్షన్–12బీ కూడా అదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. రాజ్యాంగంలోని 208వ అధికరణ కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో ఫలానా సంఖ్యలో సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే నిబంధనను ఎక్కడా పొందుపరచలేదు. ఏ పార్టీకైనా పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్షంగా గుర్తించాలనే నిబంధన దేశంలో ఏ చట్టంలోనూ లేదని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా సుదీర్ఘ కాలం సేవలు అందించిన పీడీటీ ఆచారి తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర శాసనసభలో ఉన్న ఒకే ఒక విపక్షం వైఎస్సార్సీపీ మాత్రమే. ఈ నేపథ్యంలోచట్ట ప్రకారం ఆ పార్టీ పక్ష నేత వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సభాపతి స్పందించక ముందే..‘‘శాసనసభలో ఈనెల 21న జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా నాకు ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంటులోగానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నా పట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. నన్ను ఉద్దేశించి.. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో మేం గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా గుర్తింపుతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. తగినంత సమయం లభిస్తుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి’ అని కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్ జగన్ మంగళవారం లేఖ రాయడం తెలిసిందే. ఈ లేఖపై స్పీకర్ ఇంకా స్పందించలేదు. స్పీకర్ పరిధిలోని ఈ అంశంపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల తక్షణమే స్పందించడం.. జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశమే లేదంటూ తేల్చేయడాన్ని రాజ్యాంగ నిపుణులు తప్పుబడుతున్నారు. -
పయ్యావుల వ్యాఖ్యలతో కుట్ర బట్టబయలు
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమానించిందే జరుగుతోంది. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ అణగదొక్కాలని, రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ప్రభుత్వ కుట్ర.. సాక్షాత్తూ మంత్రి పయ్యావుల వ్యాఖ్యలతో బయటపడింది. వైఎస్సార్సీపీ ప్రతిపక్ష హోదా అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మంగళవారం వైఎస్ జగన్ సుదీర్ఘమైన లేఖ రాశారు. అందులో ఎన్నో కీలకాంశాలను ప్రస్తావించారాయన. అంతేకాదు.. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా గళం వినిపించేందుకు అవకాశం ఉంటుందని, గతంలో ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు పలు పార్టీలకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాల్ని సైతం ఆయన ఉటంకించారు. అయినప్పటికీ.. ప్రతిపక్ష హోదాను వైఎస్సార్సీపీకి దక్కనివ్వకుండా ప్రభుత్వం బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.ఈ లేఖపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మీడియా స్పందించాలని కోరింది. దానికి పయ్యావుల వివరణ ఇస్తూ.. "అసెంబ్లీలో జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కే అవకాశమే లేదని" అన్నారు. అంతేకాదు ఆయన ఫ్లోర్ లీడర్‌గా మాత్రమే ఉంటారని చెబుతున్నారు. పైగా "స్పీకర్ కి లేఖ రాసినంత మాత్రాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని, కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కేందుకు పదేళ్లు పట్టిందంటూ" వెటకారంగా మాట్లాడారు.దేశ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంశాన్ని గనుక పరిశీలిస్తే.. ఏదైనా చట్ట సభలో అధికార పార్టీ/ అధికారంలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి. కానీ, ఏపీ అసెంబ్లీలో ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. శాసనసభలో మేం గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదని, ప్రతిపక్ష హోదా ఉంటేనే అది సాధ్యమవుతుందని స్పీకర్‌కు రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టం 12-బీ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించిందని లేఖలోనే స్పష్టం చేశారు.ఇక.. ప్రతిపక్ష హోదా ఇవ్వడం స్పీకర్ పరిధిలోని అంశం. జగన్ రాసిన లేఖపై ఇంకా స్పీకర్ నుంచి బదులు రాలేదు. ఈలోపే పయ్యావుల, వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా రాదని చెప్పడం దేనికి సంకేతం? అనే చర్చ మొదలైంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వీలు లేకుండా.. అసలు వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదానే లేకుండా చేయాలన్నది కూటమి ప్రభుత్వ కుట్రగా ఇప్పుడు తేటతెల్లమయ్యింది. -
‘అనంత’ అమాత్యులకు కీలక శాఖలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కీలక శాఖలు దక్కాయి. మొత్తం ముగ్గురికి మంత్రి పదవులు కేటాయించగా.. అందులో ఇద్దరికి ప్రధాన మైన శాఖలు వచ్చాయి. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉరవకొండ నుంచి గెలుపొందిన పయ్యావుల కేశవ్‌కు ఆర్థిక శాఖ ఇచ్చారు. ధర్మవరం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి గెలుపొందిన సత్యకుమార్‌కు ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ కేటాయించారు. ఇక పెనుకొండ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సవితకు బీసీ సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ, చేనేత, జౌళిశాఖల బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న ముగ్గురూ మంత్రి పదవులకు కొత్త కావడం విశేషం. ఐదు దఫాలు ఎమ్మెల్యేగా గొలుపొందిన పయ్యావుల కేశవ్ ఎప్పటినుంచో మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన కల నేటికి ఫలించినట్టయింది.మళ్లీ బీజేపీకే దక్కిన ఆరోగ్యశాఖఆరోగ్యశాఖ మళ్లీ బీజేపీకే దక్కింది. 2014–19 మధ్య కాలంలో కై కలూరు నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన కామినేని శ్రీనివాస్‌కు ఈ శాఖ కేటాయించారు. తిరిగి ఈ దఫా ధర్మవరం నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన సత్యకుమార్‌కు ఇచ్చారు. ప్రస్తుతం కేటాయించిన శాఖలన్నీ కీలకమైనవేనని నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీసీ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండటంతో బీసీ సంక్షేమశాఖను పెనుకొండ శాసనసభ్యురాలు సవితకు ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరికి, అనంతపురం జిల్లాకు చెందిన ఒకరికి మంత్రి పదవులు దక్కాయి. ఇదిలా ఉండగా ఆరోగ్యశాఖ దక్కించుకున్న సత్యకుమార్ జిల్లాలోనే పెను కొండ వైద్యకళాశాల నిర్మాణం జరుగుతోంది. వీలైనంత త్వరగా మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేస్తారన్న ఆశతో జిల్లా వాసులు ఉన్నారు. -
అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర
-
ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
సాక్షి, అమరావతి: ప్రతి విషయంలోనూ రెండు నాలుకల ధోరణిని పాటించే ప్రతిపక్ష నేత చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ చట్టంపైనా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ చట్టానికి అసెంబ్లీలో ఆమోదం తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు బురద చల్లుతుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైట్లింగ్బిల్లును ప్రవేశపెట్టింది. అదే ఏడాది జూలై 29న దీనిపై సభలో జరిగిన చర్చలో టీడీపీ తరఫున పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఈ బిల్లుకు మద్దతు తెలిపి పలు సూచనలు కూడా చేశారు. నాడు పయ్యావుల ఏమన్నారంటే..బిల్లు అవసరాన్ని కేంద్రం కూడా గుర్తించిందిఈ బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్లే బిల్లు. బిల్లుని మేం ఆమోదిస్తున్నాం. మంత్రిగారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ భూములు కొనాలంటే భయపడే పరిస్థితులున్నాయి. అది నిజమైన టైటిలా? డిస్ప్యూటెడ్ (వివాదాస్పద) టైటిలా? అనేది తెలియడంలేదు. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ల్యాండ్ టైటిల్ క్లియర్‌గా లేకుంటే సమస్య అవుతుందనే ఉద్దేశంతో నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ స్కీమ్ ప్రారంభించి రాష్ట్రాలన్నీ అమలు చేయాలని కోరింది. కర్నాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్టు అమల్లో ఉంది.ఈ ప్రాజెక్టు మన దేశానికి కొత్త కావచ్చు కానీ 1858లోనే ఆస్ట్రేలియాలో ఉంది. టోరెన్స్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైట్లింగ్ అనే విధానం.. అంటే టైటిల్‌కి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఆ తర్వాత చాలా దేశాలు దీన్ని అమలు చేశాయి. రాజస్థాన్–2016లోనే దాదాపు ఇలాంటి చట్టాన్నే పాస్ చేసింది. కానీ ప్రాక్టికల్‌గా అమల్లోకి వెళ్లినట్లు కనపడలేదు. ఆశయాలు మాత్రం చాలా గొప్పవి. ఆచరణలో ఈ ప్రభుత్వమే కాదు.. ఎవరు చేపట్టినా చాలా సమస్యలతో కూడుకున్నది ఇది. చిక్కులను తొలగించేందుకు ఈ ప్రభుత్వానికి చాలా టైమ్ పడుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇది రెండేళ్లలో అవుతుందా? నాలుగేళ్లు పడుతుందా? ఐదేళ్లు పడుతుందా? అనేది పక్కన పెడితే తప్పకుండా ఇదొక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్లే బిల్లు అవుతుంది.రీ సర్వే సాహసోపేతం ల్యాండ్ టైట్లింగ్కంటే ముందు సర్వే చేయాలి. సర్వే కూడా ప్రభుత్వం పెద్దఎత్తున చేసే ఆలోచనలో ఉందని తెలిసింది. చాలా బృహత్తర కసరత్తు. 1900 సంవత్సరంలో ల్యాండ్ సర్వే డిపార్టుమెంట్ ఏర్పడితే 1970కి గానీ మనకి అప్డేటెడ్ రికార్డులు రాలేదు. మనం రెండేళ్లలో చేస్తామంటున్నాం. టెక్నాలజీ, మ్యాన్ పవర్ ఉన్నా ఇదొక సాహసోపేతమైన చర్య. సరిగ్గా చేయకపోతే ఇదొక దుస్సాహసం అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రజలకు భూమి మీద ఉన్న మమకారం చాలా గొప్పది. కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నాకు తెలిసి రూ.1500 కోట్లు అవసరమయ్యే ప్రాజెక్టు ఇది. ప్రభుత్వంలో ఎవరున్నా రీ సర్వే 40 ఏళ్లకు ఒకసారి నిర్వహించాలి. ఇది కచ్చితంగా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే చర్య. -
మీరు ప్రచారానికి రావొద్దు!
రాయదుర్గం/ఉరవకొండ: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ప్రస్తుత ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. మూడు పార్టీల శ్రేణులు కలసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తాయని ఆ పార్టీల అధినేతలు తరచూ ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. బీజేపీ నాయకులు, కార్యకర్తలను టీడీపీ అభ్యర్థులు పూర్తిగా విస్మరిస్తున్నారు. ‘పొత్తు ఉంటే ఉండనీ..మీరు మాత్రం మా వెంట రావొద్దు. మీరొస్తే వచ్చే ఓట్లు కూడా పోతాయి. ముఖ్యంగా మైనార్టీ ఓట్లు దూరమవుతాయి’ అంటూ తెగేసి చెబుతున్నారు. ఈ విషయంలో కొందరు బీజేపీ నేతలు సర్దుకుపోతున్నప్పటికీ..కేడర్ మాత్రం టీడీపీ అభ్యర్థుల తీరుపై మండిపోతోంది. ఇదేనా పొత్తు ధర్మం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాయదుర్గంలో పొత్తు ‘జిత్తులు’ రాయదుర్గం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రభుత్వ విప్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇక్కడ టీడీపీ ఇన్చార్జ్గా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఉండేవారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. నిత్యం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునేవారు. కానీ ఈసారి కాపు రామచంద్రారెడ్డికి వైఎస్సార్సీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీలో చేరిపోయారు. పొత్తులో భాగంగా ఆయన టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తరఫున ప్రచారం చేయాల్సి ఉంది. అయితే.. నిన్న మొన్నటి వరకు తీవ్రస్థాయిలో దూషించుకున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు కలసి తిరిగితే ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళతాయనే భావనకు వచ్చారు. దీనికితోడు మైనార్టీల ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో కాపుతో పాటు ఇతర బీజేపీ నేతలను కూడా ప్రచారానికి దూరం పెడుతున్నారు. ఉమ్మడిగా తిరిగితే తలెత్తే పరిణామాలపై ఇటీవల బళ్లారిలో కాలవ, కాపు కలసి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాలవ ప్రచారానికి కాపు రావడం లేదన్న చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతోంది. ఉరవకొండలోనూ అదే తీరు బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు అష్టకష్టాలు పడితే ఉరవకొండ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ నేతలు కమలం పార్టీని పూచిక పుల్లలా చూస్తున్నారు. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఎక్కడా తన వెంట ప్రచారానికి బీజేపీ నాయకులను తీసుకెళ్లడం లేదు. మైనార్టీలు దూరమవుతారన్న భయంతో ప్రచారానికి రావొద్దని బీజేపీ నాయకులకు కరాఖండీగా చెప్పినట్లు సమాచారం. కేవలం నలుగురైదుగురు జనసేన నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్న కేశవ్‌కు.. తమ సేవలు అవసరం లేదా అంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన తీరుపై బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేనలకు ఓటు వేసే ముందు ముస్లింలు జాగ్రత్తగా ఆలోచించాలని, టీడీపీకి ఓటు వేస్తే మతతత్వ బీజేపీకి వేసినట్లేనని ఏపీ ముస్లిం మేధావుల సంఘం కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తోంది. -
చీరలు తీసుకోండి.. ఓటేయండి.. అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు
-
‘అలా చేస్తే పయ్యావుల కూడా టీడీపీలో మిగలడు’
అనంతపురం, సాక్షి: ఎన్నికలొచ్చినప్పుడే పయ్యావుల కేశవ్‌కు ఉరవకొండ గుర్తొస్తుందని.. ఈ ఐదేళ్లలో నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం సీఎం జగన్మోహన్రెడ్డి హాజరైన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన విశ్వేశ్వరరెడ్డి.. పయ్యావులపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ గొప్ప ప్రజాస్వామిక వాది. కులాలు మతాలకు అతీతంగానే కాదు.. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. పార్టీ కండువా కప్పుకుంటేనే లబ్ధి చేకూరుస్తామని చెప్పేవాళ్లు. మీలా వైఎస్సార్ సీపీ కండువా వేసుకున్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తామంటే ఒక్కరైనా ఉండేవారా?.. ఆఖరికి పయ్యావుల కేశవ్ కూడా పార్టీలో మిగలడు. మేం ప్రజాస్వామ్య వాదులం కాబట్టే అలా చేయం. నూటికి 90 శాతం మందికి పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే. ..ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అమరావతిలో భూములు కొనుగోలు చేశారు. వేలాది మంది పేదలకు ఇంటి పట్టాలు రాకుండా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అడ్డుకున్నారు అని విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ పరిపాలనలో అనేక సంస్కరణలు జరిగాయి. జగన్ ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి - సంక్షేమం టీడీపీ నేతలకు కనిపించదు. సీఎం జగన్ రాష్ట్ర ఆదాయం పెంచేలా నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల్లో చిరునవ్వులు చిందేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారు. మహిళలకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. సీఎం జగన్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించారు.. అందుకు కృతజ్ఞతలు. ఉరవకొండకు మరిన్ని సమస్యలు ఉన్నాయ్.. అవి తీర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా. నాడు వైఎస్సార్ హయాంలో ఇచ్చిన మాట నెరవేర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా అని విశ్వేశ్వర్‌రెడ్డి తన ప్రసంగం ముగించారు. -
టీడీపీలో అంతా ఎవరికి వారే...
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. నాయకుల మధ్య సఖ్యత చెడి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. ఏ నాయకుడికీ మరొక నియోజకవర్గ నాయకుడితో సరైన సంబంధాలు లేవు. ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు టీడీపీ అధ్యక్షులను నియమించింది. కానీ ఇక్కడ జిల్లా అధ్యక్షుల మాట కిందిస్థాయి నాయకులు వినే పరిస్థితి లేదు. పరిటాల వర్గమంటేనే భగ్గుమంటున్నారు పరిటాల రవి బతికున్నపుడు టీడీపీలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేవారు. ఆయన మరణానంతరం పరిటాల కుటుంబమంటేనే కత్తులు దూస్తున్న పరిస్థితి. రాప్తాడు పక్కనే ఉన్న ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు పరిటాల కుటుంబానికి సత్సంబంధాలు లేవు. పార్టీ కార్యక్రమాల్లోనూ కలిసి పాల్గొనే పరిస్థితులు చాలా తక్కువ. ఇక ధర్మవరం నుంచి 2014లో టీడీపీ తరఫున గెలుపొందిన వరదాపురం సూరి.. 2019లో ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు పరిటాల శ్రీరామ్‌తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. ఇద్దరూ ఒకే ఊర్లో ఉంటే రోజూ ఉద్రిక్త పరిస్థితులే. జేసీ అనుచరులతో ఎవరికీ సంబంధాలు లేవు పరిటాల తర్వాత జిల్లాలో ప్రధాన గ్రూపు జేసీ బ్రదర్స్‌ది. ఈడీ కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఇప్పుడు జిల్లాలో పలకరించే దిక్కులేదు. పార్టీపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎవరూ ఆయన దగ్గరకు రాని పరిస్థితి. జిల్లాలో ఏ నాయకుడితోనూ సత్సంబంధాలు లేవు. విధిలేని పరిస్థితుల్లోనే ఆయన కుమారుడికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇస్తున్నట్లు తెలిసింది. కాలవ మాటకు విలువేది? టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాలవ శ్రీనివాసులు మాటకు విలువ ఇచ్చే నాయకులు వెతికినా కనిపించరు. పైగా ఆయనంటే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రధాన నాయకులు కత్తులు దూస్తున్నారు. అంతటా ప్రత్యేక గ్రూపులు పెట్టి పార్టీని అధమ స్థాయికి తీసుకెళ్లారని కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు తదితర నియోజకవర్గాల నాయకులు వాపోతున్నారు. అందుకే కాలవ శ్రీనివాసులుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపీగా దించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. బీకే వేదన అరణ్య రోదన టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీకే పార్థసారథి వేదన అరణ్య రోదనగానే ఉంది. తనకు టికెట్ లేదన్న లీకులు ఆయన్ను కలవరపెడుతున్నాయి. సవితమ్మకూ ఈయనకూ గత కొన్నేళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉంది. ఈసారి సవితమ్మకు టికెట్ ఇస్తూ తనను ఎంపీగా పంపిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేగానే పోటీచేస్తా అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా బీకేను పార్టీ లెక్కలోకి తీసుకోవడం లేదు. దీంతో పార్టీ అధ్యక్షుడిగా తన మాట ఎవరూ వినడం లేదని ఆయన లోలోపల కుమిలిపోతున్నారు. వర్ధంతి..జయంతులకు కొట్లాటే ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గంలోనూ కొట్లాటలే. పూలదండలు వేసే కార్యక్రమం చిల్లర కొట్లాటలను తలపించాయి. కళ్యాణదుర్గం నుంచి కదిరి వరకూ వర్గాలు బాహాబాహీగా పోరులో పాల్గొన్నవే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిస్థితి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వర్గపోరును నియంత్రించలేకపోతున్నారు. అందుకే టికెట్ల ప్రకటనలో తీవ్ర జాప్యం చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. -
ఆమెకు టికెట్ ఇవ్వవద్దు అంటున్న సొంత పార్టీ నాయకులు..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పైన పటారం, లోన భయం భయంగా ఉందనేది కొంతమంది ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. 2019 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఉమ్మడి అనంతపురం జిల్లాలో గెలిచారు. మిగతా 12 చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ తరఫున గెలిచిన బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరన్నది ప్రధాన విమర్శ. మిగతా ఇన్చార్జ్లున్న చోట గడిచిన నాలుగున్నరేళ్లలో ప్రజల పక్షాన నిలబడి ఏ కార్యక్రమమూ చేయలేదు. దీనికి తోడు నియోజకవర్గాల్లో ఉన్న తగాదాలు ఇప్పుడా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. నేను గెలవలేక పోవచ్చు.. కానీ నిన్ను ఓడించగలను అంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అప్పుడు చేసింది లేదు.. ఇప్పుడు చేయాల్సిందీ లేదు టీడీపీ అధికారంలో ఉండగా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా ఒక్క అభివృద్ధి పనీ చెయ్యలేదు. అందుకే పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులును ప్రజలు గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. ఈ పరిస్థితుల్లో కనీసం ప్రతిపక్ష పార్టీ పాత్ర అయినా పోషించాల్సింది పోయి బురద రాజకీయం చేస్తుండటంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీని జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా ప్రభుత్వం తరఫున అందాల్సిన సంక్షేమ ఫలాలన్నీ తెలుగుదేశం పార్టీ వర్గాలకు కూడా చేరుతున్నాయి. అందుకే లోకేష్ యువగళానికి, బాబు జైలుకెళ్లినప్పుడు చేసిన నిరసనలకు ఉమ్మడి జిల్లాలో నామమాత్రంగానైనా స్పందన లేదు. దీంతో ఇప్పుడు టీడీపీ నేతల్లో భయం పట్టుకుంది. నువ్వెంతంటే నువ్వెంత.. కళ్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు మధ్య నాలుగేళ్లుగా విభేదాలు కార్చిచ్చులా రగులుతూనే ఉన్నాయి. ఇక్కడ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. పెనుకొండ నియోజకవర్గంలోనూ బీకే పార్థసారఽథి, సవితమ్మ మధ్య కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది. ఇక కదిరిలో వైఎస్సార్సీపీ తరఫున 2014లో గెలిచి టీడీపీలోకి వెళ్లిన అత్తార్ చాంద్‌బాషా, చెక్‌బౌన్స్ కేసుల్లో శిక్షపడిన కందికుంట ప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. శింగనమలలో బండారు శ్రావణిశ్రీకి టికెట్ దక్కకుండా చేసేందుకు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాలవ శ్రీనివాసులు అంటే ఏ నియోజకవర్గ నేతలకూ పడడం లేదు. ఈ దఫా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందో లేదోనన్న అనుమానం ఉంది. అనంతపురం అర్బన్‌లో ప్రభాకర్ చౌదరికి చెక్‌పెట్టేందుకు పలువురు గ్రూపుగా ఏర్పడ్డారు. గుంతకల్లులో టీడీపీ అభ్యర్థి ఊసే లేకపోగా, మడకశిరలో రెండు వర్గాల మధ్య నిరంతరం పోరు కొనసాగుతోంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుతో ప్రజలు విసుగెత్తారు. గతంలో టీడీపీలో ఉండి ఓటమిపాలై బీజేపీలో చేరిన వరదాపురం సూరి.. ధర్మవరం టికెట్ కోసం ఇప్పుడు మళ్లీ టీడీపీ కండువా వేసుకోవాలని చూస్తుండగా.. పరిటాల శ్రీరాం వ్యతిరేకిస్తున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో గ్రూపు తగాదాలతో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. -
దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర పయ్యావుల కేశవ్‌దే: విశ్వేశ్వరరెడ్డి
సాక్షి, అనంతపురం: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదు చేయాలంటూ ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టర్‌ను బెదిరించేలా పయ్యావుల వ్యవహరిస్తున్నారని, అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా పయ్యావుల ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలో 30 వేల దొంగ ఓట్లు పయ్యావుల కేశవ్ నమోదు చేయించారు. దొంగ ఓట్లు తొలగిస్తే తప్పేంటి?. కర్ణాటకలో నివసిస్తున్న వారి ఓట్లు ఉరవకొండ నియోజకవర్గంలో ఎందుకు ఉండాలి?. దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌దేనని విశేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: జనాలు లేరు..‘జెండాలూ’ లేవు.. నీరసంగా లోకేశ్ యువగళం -
రామోజీ.. ఆరోజున జరిగింది మర్చిపోయారా?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం, ఈనాడు మీడియా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నాయి. ముఖ్యంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవమానించారంటూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రకటన చేయడం, దానిని ఈనాడు ప్రచురించడం పెద్ద వివాదమైంది. ఈ అంశంలో తెలుగుదేశం, ఈనాడు ఆత్మరక్షణలో పడ్డాయి. అలాగే విద్యా రంగానికి సంబంధించి వేసిన ప్రశ్నలో టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయులు స్కూళ్ల మూసివేత అంటూ చేసిన ఆరోపణపై బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించడంతో మరోసారి ప్రతిపక్షం ఇరుకున పడింది. ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ప్రతిపక్షం, ఈనాడు తదితర టీడీపీ మీడియా సంస్థలు వాస్తవాలతో నిమిత్తం లేకుండా తప్పుడు ప్రచారం చేయబోయి బొక్క బోర్ల పడుతున్నాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ వచ్చి ప్రసంగం చేయడం సంప్రదాయం. గవర్నర్‌కు ముఖ్యమంత్రి , శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్లు స్వాగతం చెప్పి సభలోకి తీసుకు వస్తారు. ఇది ఎప్పుడూ జరిగే విషయమే. ఈసారి గవర్నర్ కొంత భిన్నంగా స్పీకర్ ఛాంబర్లోకి వెళ్ళి కొద్దిసేపు ఉన్నారు. ఇలాంటి ఘటనలను రిపోర్టు చేయడం తప్పు కాదు. కాని దానిని వక్రీకరించి, జరగని దానిని జరిగినట్లు టీడీపీ సభ్యులు ఆరోపించడం, దానిని ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురించడం చాలా పెద్ద తప్పు అని చెప్పాలి. గవర్నర్ తన వ్యక్తిగత అవసరం రీత్యా స్పీకర్ చాంబర్లోకి వెళ్లారు. ఆ సందర్భంగా వీరంతా కొన్ని నిమిషాలపాటు అక్కడ కూర్చున్నారు. తదుపరి శాసనభలోకి వచ్చి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆ క్రమంలో కూడా ఆయన గొంతు నొప్పితో బాధపడుతూ అప్పుడప్పుడూ మంచినీరు కూడా తీసుకోవడం అంతా చూశారు. ఈ వ్యవహారంపై కేశవ్‌కు ఎవరు బ్రీఫ్ చేశారో తెలియదు కానీ, ఆయన అన్ని విషయాలు తెలుసుకోకుండానే గవర్నర్‌కు అవమానం జరిగినట్లు మీడియా ముందు కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ కోసం గవర్నర్ నజీర్ ఎదురు చూసినట్లు ఆయన ఆరోపించారు. దీనిని ఈనాడు దినపత్రిక ప్రచురించింది. నిజానికి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీడియావారు ఎవరైనా సరే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, బహుశా టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియా తమకు తలనొప్పి వస్తుందేమోనని భయపడి కేశవ్‌కు చెప్పి మాట్లాడించి ఉండవచ్చు. గతంలో కూడా ఇలా అనేకసార్లు మీడియా చెప్పే మాటలు నమ్మి నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టేవారు. అప్పట్లో ఏదైనా తేడా వస్తే తాను అలా అనలేదని బుకాయించడానికి అవకాశం ఉండేది. ఆ రోజుల్లో సోషల్ మీడియా, వీడియో రికార్డింగ్ సదుపాయం ఉండేదికాదు. దానిని అడ్డం పెట్టుకుని నేతలు తప్పించుకునేవారు. కానీ, ఇప్పడు సోషల్ మీడియా, పూర్తి స్థాయిలో వీడియో చిత్రీకరణ జరుగుతోంది. ఏపీ శాసనసభలోకి గవర్నర్ కాన్వాయ్ వస్తున్న సన్నివేశాల మొదలు తిరిగి ఆయన వెళ్లిపోయేంతవరకు అంతా వీడియో రికార్డు అయింది. దాంతో కేశవ్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇది కేశవ్ చెబితే రాశారా?.. లేక ఈనాడు తప్పుడు కథనం రాసిందా? అన్నది తేల్చాలని , వీరిపై సభా హక్కుల ఉల్లంఘన పెట్టాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈనాడు అధినేత రామోజీరావు నిత్యం అసత్యాలు వండి వార్చుతూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. ఈ కేసులో రామోజీని సభకు రప్పించాలని కూడా కొందరు డిమాండ్ చేశారు. కేశవ్ దీనిపై సమాధానం ఇస్తూ తొలుత అటుఇటుగా మాట్లాడినా, ఆయన మీడియాతో చెప్పిన విషయాలను కూడా బుగ్గన ప్రదర్శించడంతో అవాక్కవాల్సి వచ్చింది. దీనిపై ఆయన ఏదో వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా, వైఎస్సార్సీపీ నేరుగా గవర్నర్‌ను కించపరిచారని అన్నారా? లేదా? మీరు అనకపోతే ఈనాడు కావాలని తప్పుడు వార్త రాసిందా? అన్నది చెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో టీడీపీ, ఈనాడు పత్రిక డిఫెన్స్‌లో పడ్డాయి. కేశవ్ చేసింది గవర్నర్‌ను కించపరిచే విధంగా ఉందని, అందువల్ల ఆయనను, ఆ మీడియా సమావేశంలో పాల్గొన్న మరో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని సభ నుంచి ఈ సెషన్ అయ్యేంతవరకు సస్పెండ్ చేయాలని నిర్ణయించగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. వీరి సస్పెన్షన్‌పై ఆందోళనకు దిగిన ఇతర టీడీపీ సభ్యులను కూడా ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. సాధారణంగా ప్రతిపక్షం సభలో ఏదైనా ప్రజా సమస్యలపైన పోరాడినట్లు కనిపించి సస్పెండ్ అవ్వాలని కోరుకుంటుంది. కానీ, ఇలా అబద్దాలు చెప్పి సస్పెండ్ అవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. కేశవ్ ప్రకటనను ప్రచురించిన ఈనాడుపై చర్య తీసుకునే విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని భావించారు. మీడియా రూల్స్ ప్రకారం తప్పుడు సమాచారంతో ప్రకటన చేయడం ఎంత తప్పో, దానిని ప్రచురించి ప్రచారం చేయడం కూడా అంతే తప్పుగా పరిగణించవలసి ఉంటుంది. అందులోనూ సభా వ్యవహారాలలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎవరో చేసిన ప్రకటనను తాము ప్రచారం చేశామని అంటే చెల్లదన్నది సూత్రం. కాకపోతే ఈ రోజుల్లో వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. పట్టించుకుంటే మాత్రం అది సీరియస్ విషయమే అవుతుంది. గతంలో కూడా రామోజీరావుకు ఇలాంటి అనుభవం లేకపోలేదు. అప్పట్లో శాసనమండలిని ఉద్దేశించి ఈనాడులో పెట్టిన ఒక శీర్షిక వివాదాస్పదం అయింది. దాన్ని సభ తీవ్రంగా తీసుకుని రామోజీని సభకు పిలిపించాలని తీర్మానించింది. ఆ తరుణంలో రామోజీ హైకోర్టు నుంచి రక్షణ పొందారు. ఆయనను నిర్భందించి మండలికి తీసుకు వెళ్లాలని వచ్చిన ఆనాటి సిటీ పోలీస్ కమిషనర్ విజయరామరావు ఆ స్టే ఉత్తర్వును అనుసరించి వెనక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా మీడియాపై సభలో చర్చలు జరిగినా, మరీ సీరియస్ అయిన సందర్భాలు తక్కువే. ఈసారి ప్రివిలేజ్ కమిటీ దీనిని ఏ విధంగా టేకప్ చేస్తుందన్నది వేరే విషయం. కానీ, ఈ మొత్తం ఎపిసోడ్లో తప్పుడు ప్రకటన చేశారన్న విమర్శను తెలుగుదేశం పార్టీ, తప్పుడు వార్తను ప్రచురించారన్న విమర్శను ఈనాడు ఎదుర్కొన్నాయి. కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరిని పోలీసులు కొట్టారంటూ పాత ఫోటోలు వేసి ప్రతిష్టను దెబ్బ తీసుకున్న ఈనాడు మరోసారి శాసనసభ విషయంలో అప్రతిష్టపాలైంది. దానిని సహజంగానే వైఎస్సార్సీపీ అడ్వాంటేజ్‌గా తీసుకోగలిగింది. అసలే ఈనాడును దుష్టచతుష్టయంలో ఒక భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపిస్తున్న నేపథ్యంలో వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ, అలాకాకుండా కేవలం అహంతో వ్యవహరిస్తూ ఇలాంటి కథనాలు రాస్తున్నారు. మరో అంశం ఏమిటంటే ఏపీలో ప్రాథమిక స్కూళ్లను మూసివేశారంటూ తెలుగుదేశం ఎమ్మెల్యే వీరాంజనేయులు ఆరోపించారు. దానిపై మంత్రి బొత్స సత్యనారాయణ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. టీడీపీ హయాంలో ఐదువేల స్కూళ్లు మూతపడగా, వాటిలో మూడువేల స్కూళ్లను తాము తెరిచామని చెప్పారు. ఎక్కడ స్కూళ్లు మూతపడ్డాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలా మూతపడినట్లు రుజువు చేస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ప్రత్యేకించి వీరాంజనేయులు నియోజకవర్గంలో ఫలానా గ్రామంలో స్కూల్ మూతపడిందని చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. దానికి టీడీపీ నీళ్లు నమలవలసి వచ్చింది. వైఎస్సార్సీపీపై ఏదో ఒక వ్యతిరేక వార్త రాసే పనిలో భాగంగా ఈనాడు పత్రిక ఆ స్కూల్ మూతపడిందనో లేక ఇంకొకటనో రాసేది. దానిని నమ్మి టీడీపీ ఎమ్మెల్యే సభలో మాట్లాడి పరువు పోగొట్టుకున్నారన్నమాట. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ -
అబద్ధాలు అచ్చేసిన రామోజీని సభకు పిలిచి విచారించాలి
సాక్షి, అమరావతి: చట్ట సభను, రాజ్యాంగ వ్యవస్థను, గవర్నర్‌ను కించపరిచేలా అబద్ధాలను ఈనాడులో అచ్చేసి రామోజీరావు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయన్ను సభకు పిలిచి విచారించి, కఠిన చర్యలు తీసుకోవాలని శాసనసభలో అధికారపక్షం డిమాండ్ చేసింది. సీఎం రాకకోసం గవర్నర్ వేచి ఉండాలా అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నట్టు ప్రస్తావిస్తూ ఈనాడు రాసిన తప్పుడు కథనంపై బుధవారం శాసనసభ అట్టుడికింది. గవర్నర్‌ను కించపరుస్తూ ఈనాడు అచ్చేసిన కథనంపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టి కేశవ్ తప్పు మాట్లాడారా.. రామోజీ తప్పు రాశారా.. అనే విషయం తేల్చాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈనాడు వార్త క్లిప్పింగ్‌లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించిన సభ్యులు.. ఎల్లో మీడియాను ఏకిపారేశారు. అలాంటి వ్యాఖ్యలు తాను చేయలేదని దమ్ముంటే నిరూపించాలని పయ్యావుల కేశవ్ అనడంపై అధికారపక్ష సభ్యులు మండిపడ్డారు. సభకు దమ్ము ధైర్యం అని సవాలు చేయవద్దని, కేశవ్ తప్పు మాట్లాడినా, ఈనాడు తప్పు రాసినా ప్రివిలేజ్ కమిటీ విచారణలో నిర్ధారణ అయితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ చర్చకు అడుగడుగునా టీడీపీ సభ్యులు అడ్డుతగలడంతో సభ దృష్టికి వాస్తవాలు తెచ్చేందుకు తొలిరోజున గవర్నర్‌కు స్వాగతం పలికిన వీడియోను ప్రదర్శించి సభ్యులకు వాస్తవాలు చూపించారు. అయినప్పటికీ పయ్యావుల కేశవ్ పదే పదే వాదనకు దిగడంతో గవర్నర్ విషయంలో ఆయన చేసిన కామెంట్ల వీడియో సైతం సభలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, అధికారపార్టీ నేతలు మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమే: మంత్రి బుగ్గన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు స్వాగతం పలకడంలో ప్రొటోకాల్ పాటించలేదంటూ అబద్ధపు రాతలు రాయడం రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా వెళ్లి గవర్నర్‌కు ఘనస్వాగతం పలికి సభలోకి తీసుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీకి వచ్చారు. 9.53కు గవర్నర్ వచ్చారు. గవర్నర్‌ను రిసీవ్ చేసుకున్న సీఎం 10.02 గంటలకు స్పీకర్ చాంబర్‌కు తీసుకొచ్చారు. గవర్నర్‌కు గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన అభ్యర్థన మేరకు కొంత సేపు ఆగి ఆయన రెడీ అయిన తర్వాత గౌరవ సభలోకి తీసుకొచ్చాం. ప్రభుత్వ పనితీరు, విజన్‌ను గవర్నర్ చదివితే.. ఆ ప్రసంగాన్ని సైతం టీడీపీ సభ్యులు చాలా హేళన చేశారు. తప్పుడు వార్తలతో గౌరవ సభను, గవర్నర్‌ను అవమానిస్తూ కథనాలు రాసిన ఈనాడుపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నా. చంద్రబాబు, ఎల్లో మీడియా తోడుదొంగలు: మాజీ మంత్రి కన్నబాబు టీడీపీకి విషపుత్రికలుగా ఎల్లో మీడియా రోజురోజుకు దిగజారిపోతోంది. చంద్రబాబు, ఎల్లోమీడియా తోడుదొంగలుగా కలిసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రంలో భయానక పరిస్థితులు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారు. ఎల్లో మీడియా వక్రీకరణపై అసెంబ్లీలో చర్చ జరపాలి. టీడీపీ, ఎల్లోమీడియా అబద్ధాలు ప్రచారం చేస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను కించపరిచేలా వ్యవహరిస్తున్నాయి. విలువలులేని టీడీపీ: మంత్రి నాగార్జున ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై గౌరవం ఉంటే గవర్నర్ ప్రసంగం కాగితాలను చించివేసి టీడీపీ సభ్యులు మధ్యలోనే వెళ్లిపోయేవారు కాదు. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయం చేస్తున్న టీడీపీ సభ్యులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. సభా హక్కుల ఉల్లంఘన విషయంలో రామోజీరావుపై చర్యలు తీసుకోవాలి. చర్చ జరగాల్సిందే: మంత్రి అంబటి సభలో చర్చ జరగకపోతే ఈనాడు రాసిందే నిజమని ప్రజలు అనుకుంటారు. ప్రజలకు వాస్తవాలను ఈ సభ ద్వారా తెలియచేయాలి. టీడీపీ సభ్యులు సభా సంప్రదాయాలను మర్చిపోతున్నారు. సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ సభలో దమ్ము ఉందా అంటూ మాట్లాడటం శోచనీయం. మాకు దమ్ముంది కాబట్టే 151 స్థానాలు ఇచ్చారు. మిమ్మల్ని ప్రజలు దుమ్ముదుమ్ముగా ఓడించారు. మళీŠల్ మిమ్మల్ని ఓడించడం ఖాయం. స్పీకర్‌ను దమ్ముందా అంటూ మాట్లాడిన వారికి సభలో ఉండే అర్హత లేదు. దమ్ము లేకనే బాబు పారిపోయాడు: మంత్రి జోగి రమేశ్ చంద్రబాబుకు చాదస్తం పెరిగిపోయింది. ఆ పార్టీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌కు పైత్యం పుట్టుకొచ్చింది. దమ్ములేకనే మీ నాయకుడు చంద్రబాబు సభ నుంచి పారిపోయాడు. బయట చంద్రబాబు, సభలో టీడీపీ సభ్యులు అసత్యాలతో ప్రభుత్వంపైన, సీఎంపైన బురద జల్లుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరిచినట్టు అంగీకరిస్తే కేశవ్‌ను, లేకుంటే ఈనాడులో అసత్యాలు ప్రచురించినందుకు రామోజీరావును సభకు పిలిపించి మోకాళ్లపై నిలబెట్టాలి. రాష్ట్రానికి శని ఎల్లో మీడియా: మంత్రి దాడిశెట్టి రాజా రాష్ట్రానికి ఎల్లో మీడియా శనిలా పట్టుకుంది. పూర్తి అసత్యాలతో కూడిన పేపర్లు నిత్యం ప్రభుత్వంపై విషం చిమ్ముతూనే ఉన్నాయి. అటువంటి సంస్థలను కచ్చితంగా శిక్షించాలి. రాజ్యాంగ వ్యవస్థను అవమానించేలా ఈనాడులో రాతలు రాసిన రామోజీరావును తీసుకొచ్చి సభలో నిలబెట్టాలి. బీసీలంటే బాబుకు అలుసు: మంత్రి అప్పలరాజు ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్‌గా అవకాశం కల్పిస్తే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు సభలో ఉండి కూడా మిమ్మల్ని(స్పీకర్) చైర్లో కూర్చోబెట్టడానికి రాలేదు. ఇప్పుడు ఆ పార్టీ సభ్యుడు దమ్ముందా అంటూ చైర్ పట్ల దురుసు ప్రవర్తన కూడా బీసీలను కించపరిచేలా ఉంది. రాజ్యాంగ వ్యవస్థలు, ప్రభుత్వం, సీఎంను అవమానించేలా మాట్లాడిన కేశవ్‌ను ప్రివిలేజ్ కమిటీ ద్వారా విచారించి కఠినంగా శిక్షించాలి. కేశవ్ ప్రవర్తనను సభ ఖండిస్తోంది: మంత్రి చెల్లుబోయిన వేణు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దురుసు ప్రవర్తనను సభ మొత్తం ఖండిస్తోంది. సభా వ్యవహారాల్లో అధికార పక్షం సమన్వయం పాటిస్తూ, ప్రజలకు మేలు చేసే అంశాలను ప్రస్తావిస్తుంటే ప్రతిపక్షం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. సభా మర్యాదకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిందే: మంత్రి బొత్స రాజ్యాంగ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించడం దారుణం. ఇటువంటి తప్పు కేశవ్ చేసినా, ఈనాడు పేపర్ చేసినా చర్యలు తీసుకోవాల్సిందే. -
‘స్కిల్’ గోల్మాల్ మీ ప్రభుత్వ హయాంలోదే.. కేశవ్ వినబడుతోందా?
ఆంధ్రప్రదేశ్‌లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను పసికట్టడానికిగాని, వాటిపై కేసులు పెట్టడానికి గాని చాలా కష్టపడవలసి వస్తోంది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం లోని కొందరు ఆ స్కామ్ లను చేయడం లో అంత స్కిల్ ప్రదర్శించినట్లుగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందినవారిపై ఏదైనా ఆరోపణ వస్తే భూతద్దంలో చూపించే టీడీపీ మద్దతు మీడియా ఈ స్కామ్‌ల విషయంలో నోరు ఎత్తడం లేదు. ఎలాంటి సొంత పరిశోధనలు చేయడం లేదు. పైగా స్కామ్ ఆరోపణల ఉన్నవారికి మద్దతుగా ప్రముఖంగా వార్తలు ఇస్తున్నాయి. దీనిని అంతా గమనిస్తూనే ఉన్నారు. ఈ సంగతి పక్కనపెడితే టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈ స్కామ్ పై ఇచ్చిన వివరణలో కొన్ని ఆసక్తికర పాయింట్లు ఉన్నాయి. ఆయన అడిగిన ప్రశ్నలకు సీఐడీ ఎలాంటి జవాబు ఇస్తుందన్నది చూడాల్సి ఉంది. అదే టైమ్‌లో సీఐడీ తన పరిశోధనలో కనిపెట్టిన వాటిపైన, అసలు తొలుత ఈ స్కామ్‌ను గుర్తించిన జీఎస్టీ అధికారుల సందేహాలపైన కేశవ్ సమాధానాలు చెప్పి ఉంటే టీడీపీకి ఈ కేసుతో అంత సంబందం లేదేమోలే అనుకునే పరిస్థితి ఏర్పడేది. కాని కేశవ్ వాటి జోలికి వెళ్లకుండా , ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పై రాజకీయ విమర్శలు చేశారు. అదే టైమ్ లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావించి ఆయన జోలికి సీఐడీ ఎందుకు వెళ్లడం లేదని అడుగుతున్నారు. మళ్లీ ఆ వెంటనే కేశవే ఆ అధికారి చేసిన తప్పేమీ లేదని సర్టిపై చేస్తున్నారు.ఈ స్కామ్ లో ఒకరిద్దరు కేశవ్‌కు బాగా తెలిసినవారు ఉంటే ఉండవచ్చు. ఆయన వారి పాత్ర గురించి ప్రస్తావించినట్లు కదనాలలో రాలేదు. దానికి కారణం తెలియదు. నైపుణ్యాభివృద్ది సంస్థ ( స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ) నిధులు సుమారు 335 కోట్లు పక్కదారి పట్టాయన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. స్కిల్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెబుతున్న సీమెన్స్ సంస్థ 3300 కోట్ల వ్యయం చేయాల్సిఉన్నా, ఆ కంపెనీ నిదులు విడుదల చేయడానికి ముందే మొత్తం 370 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంలోని మతలబుపై సీఐడీ విచారణ జరుపుతోంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం 370 కోట్ల రూపాయలు. అయితే దానిని అమాంతంగా 3300కి ఎలా మార్చేశారన్నది ఒక ప్రశ్నగా ఉంది. ఈ స్కామ్ లో సీమెన్ కంపెనీ వారు తమకు తెలియకుండానే షెల్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వ నిధులు తరలివెళ్లాయని కనిపెట్టారని సమాచారం వచ్చింది. జీఎస్టీ అదికారులు తమ విధులలో భాగంగా పరిశీలిస్తున్నప్పుడు ఈ షెల్ కంపెనీల విషయం బయటపడిందని అదికారవర్గాలు చెబుతున్నాయి. ఈ షెల్ సంస్థల ద్వారానే నిధులను సింగపూర్‌కు మళ్లించారన్న ఆరోపణ వచ్చింది. ఈ ఆరోపణలపై కేశవ్ ఒక్క మాట కూడా చెప్పలేదు. టీడీపీకి ఏమి సంబంధం అంటున్నారే కాని, ప్రభుత్వంలో జరిగిన గోల్ మాల్ పై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. జీఎస్టీ వారు ఈ కేసును వెలుగులోకి తీసింది వాస్తవమా?కాదా? సీమెన్స్ కంపెనీ ఈ లావాదేవీలను డిజ్ ఓన్ చేసుకున్నది నిజమా?అబద్దమా? ఇప్పటికే పలువురు ఈ కేసులో అరెస్టు అయ్యారు. అయితే కేశవ్ అడిగిన ప్రశ్న ఒకదానికి సీఐడీ సమాధానం చెప్పగలగాలి. స్కిల్‌గా కాజేశారంటున్న ఈ డబ్బు టీడీపీ పెద్దల ఖాతాలలోకి ఎలా వెళ్లిందన్నది తెలియచేయవలసిన బాధ్యత వారిపై ఉంటుంది. ఇంత కుంభకోణం జరిగితే మరో అధికారి అర్జా శ్రీకాంత్ అసలేమీ జరగలేదని నివేదిక ఇవ్వడంలోని ఆంతర్యాన్ని సీఐడీ ప్రశ్నించిన మాట నిజమే. దానికి ఆయన ఆన్సర్ ఇవ్వవలసి ఉంటుంది కదా! అందులో తప్పేముంటుంది. దానిపై కేశవ్ చేసిన ఆరోపణ అంత సమంజసంగా లేదని చెప్పాలి. బలవంతంగా శ్రీకాంత్‌తో మాట్లాడిస్తారని ఆయన అనుమానిస్తున్నారు. ఈ మాత్రానికే శ్రీకాంత్ సీఐడీ చెప్పే దానితో ఏకీభవిస్తారా? తదుపరి కోర్టులో భిన్నంగా మాట్లాడరా? శ్రీకాంత్ టీడీపీ అదినేత చంద్రబాబు ప్రభావానికి గురై తప్పుడు నివేదిక ఇచ్చారని ఎందుకు అనుకోరాదో కేశవ్ చెప్పాలి. మరో సంగతి చెప్పాలి. తాను బీజేపీ అద్యక్షుడుగా ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ ప్రభుత్వంపై , ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిత్యం అవినీతి ఆరో్పణలు చేస్తూ వంద రోజులుపైగా ప్రశ్నల పరంపర కొనసాగించారు. అలాంటి ఆయన ఇప్పుడు చంద్రబాబుకు పక్కన నిలబడి టీడీపీలో చేరారు. ఆయనతోనే అర్జా శ్రీకాంత్ కు అనుకూలంగా మాట్లాడించడంలో వ్యూహం అర్దం చేసుకోలేనిది కాదు కదా! గుజరాత్‌తో సహా ఆరు రాష్ట్రాలలో సీమెన్స్ ఒప్పందం చేసుకుంటే,ఆ రాష్ట్రాలలో ఎందుకు ఆరోపణలు రాలేదు? ఇక్కడే ఎందుకు వచ్చాయి?అన్నదానిని కేశవ్ ఆలోచించకుండా ఉంటారా? నిజంగానే వైసీపీ ప్రభుత్వం కావాలని కేసులు పెడుతోందన్నది రొటీన్ డైలాగ్ తప్ప మరొకటి కాదు. టీడీపీవారికి ఆయా వ్యవస్థలలో ఉన్న పట్టు ద్వారా ఈ స్కామ్ నుంచి తప్పించుకోగలుగుతారేమో అన్న డౌట్ కూడా లేకపోలేదు. సీఐడీ ఇంత పక్కాగా బోలెడంత వర్క్ చేసి ఆధారాలు బయటపెట్టే యత్నం చేస్తోంది. అయినా కేసు నిలబడకపోతే అది వ్యవస్థలోని తప్పు అవుతుందా? లేక నిజంగానే సీఐడీ దర్యాప్తు లోపమా? అన్నది ఆలోచించవలసి ఉంటుంది. ఇప్పటికైతే స్కిల్ స్కామ్ కేసు చాలా బలంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ కేసు టీడీపీలోని అత్యంత పెద్దలకు తాకినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఏది ఏమైనా స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ కొందరి స్కామ్ కు బలికావడం బాధాకరమే. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ -
పయ్యావుల భద్రత పునరుద్ధరణకు ఆదేశాలిస్తాం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు భద్రత పునరుద్ధరణకు తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు లేదా ఆరుగురు పోలీసు భద్రతా సిబ్బంది పేర్లను తమకు ఇవ్వాలని, అందులో నుంచి ఇద్దరిని భద్రతా సిబ్బందిగా నియమిస్తామని పేర్కొంది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తనకు గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కేశవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేశవ్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. పోలీసు భద్రతను పునరుద్ధరించాలని కోరినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టుకొచ్చామన్నారు. గతంలో పిటిషనర్ వద్దే పనిచేసిన భద్రత సిబ్బందిని కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. భద్రతను మేం తొలగించలేదు.. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. భద్రతను తొలగించామన్న పిటిషనర్ వాదన అవాస్తవమని చెప్పారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను మార్చామన్న కారణంతో ఇతర భద్రత సిబ్బందిని కూడా పిటిషనరే వెనక్కి పంపారని తెలిపారు. భద్రత కల్పన విషయంలో ప్రభుత్వం జీవో ప్రకారం రొటేషన్ విధానాన్ని అనుసరిస్తోందన్నారు. పిటిషనర్ కోరిన వారినే భద్రతా సిబ్బందిగా ఇవ్వలేమని చెప్పారు. అలా ఇస్తే రేపు ప్రతి ఒక్కరు ఫలానావారే తమకు కావాలని కోరతారని పేర్కొన్నారు. 2+2గా ఉన్న భద్రతను 1+1కి కుదించడంపై కౌంటర్ దాఖలు చేశామన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ఆ ప్రాంతంలో ఉండే ప్రత్యేక పరిస్థితులపై తనకు అవగాహన ఉందని చెప్పారు. పిటిషనర్‌కు భద్రతను పునరుద్ధరించేందుకు తగిన ఆదేశాలిస్తామని, ఐదారుగురు సిబ్బంది పేర్లు ఇస్తే అందులో ఇద్దరిని భద్రతా సిబ్బందిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేస్తానని తెలిపారు. -
చంద్రబాబు పిలిచి పదవులిస్తామంటే వద్దని ఎందుకంటున్నారు?
తెలుగుదేశంలో పార్టీ పదవులను బరువుగా ఎందుకు భావిస్తున్నారు? చంద్రబాబు పిలిచి పదవులిచ్చినా వద్దని ఎందుకంటున్నారు? అసలు పదవులిస్తామంటే నాయకులు ఎందుకు పారిపోతున్నారు? టీడీపీ సోషల్ మీడియా సలహాదారు పదవిని తిరస్కరించిన ఆ సీనియర్ నేత ఎవరు? పదవి తీసుకోవడానికి ఎందుకు విముఖత చూపిస్తున్నారు? తెలుగుదేశం పార్టీలో పిలిచి పదవులు ఇస్తుంటే..నాయకులు మాత్రం మాకు వద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారు. పార్టీ అనుబంధ విభాగాల పదవులు తీసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాని దుస్తితి తెలుగుదేశంలో ఏర్పడింది. తాజాగా టీడీపీ సోషల్ మీడియా సలహాదారు పదవిని సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే తనకు ఆ పదవి వద్దని కేశవ్ నిర్మొహమాటంగా అధినేతకు చెప్పేసినట్లు సమాచారం. చంద్రబాబు ఆయన అవసరం కోసమే తమకు పదవులు ఇస్తున్నారే గాని..తమ మీద ప్రేమతో కాదని టిడిపి సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా సలహాదారు పదవి కూడా ఆ కేటగిరీలోనే కేశవ్‌కు ప్రకటించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా తరఫున ఐటీడీపీ కన్వీనర్ గా చింతకాయల విజయ్ పని చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో విజయ్‌కు అదనంగా కేశవ్, జీవి రెడ్డికి అధిష్టానం అదనపు బాధ్యతలు అప్పగించింది. పయ్యావుల కేశవ్ మాత్రం ఈ పదవిని తీసుకునేందుకు సుముఖత చూపడం లేదు. పార్టీ నాయకత్వం ఇచ్చిన పదవిని బాధ్యతగా కాకుండా అదనపు బరువుగా భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నియోజకవర్గాన్ని కూడా చూసుకోవలసిన బాధ్యత తనపై ఉందని కేశవ్ అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తనకు సోషల్ మీడియా సలహాదారు పదవి ఎందుకంటూ పెదవి విరుస్తున్నారు. తన అసంతృప్తిని బహిరంగంగానే కేశవ్ వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే పార్టీ నేతలు గుర్తుకు వస్తారని...2004 నుంచి పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీకి అనేక సేవలు చేసిన తనకు ఏమాత్రం గుర్తింపు లభించలేదంటున్నారు పయ్యావుల కేశవ్. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసినా...చంద్రబాబు మర్చిపోయారని వాపోతున్నారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చినపుడు మంత్రి పదవి ఆశించిన తనకు భంగపాటే ఎదురైందని అంటున్నారు. కేవలం ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టారని గుర్తు చేసుకుంటున్నారు. పరిటాల సునీతకి మంత్రి పదవి ఇచ్చి తనను అవమానించారని పేర్కొంటున్నారు. ఎన్నికల సమీపిస్తున్నాయి కాబట్టే తనకు సోషల్ మీడియా సలహాదారు పదవి ఇచ్చారని, ఇదే పదవి ముందుగా ఎందుకు ఇవ్వలేదని పయ్యావుల ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న చింతకాయల విజయ్ వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ ఎన్నికల్లో పనిచేసుకునేందుకు వెసులుబాటు కల్పించడం కోసమే తనకు ఈ పదవిని కట్టబెట్టారని కేశవ్ అభిప్రాయపడుతున్నారు. విజయ్ కు ఎన్నికల కోసం వెసులుబాటు కల్పిస్తే మరి తన నియోజకవర్గ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తనకి కూడా ఒక నియోజకవర్గం ఉందని..అక్కడ తిరగాల్సిన బాధ్యత తనకు లేదా అని అంటున్నారు. టిడిపిలో పయ్యావుల ఒక్కరే కాదు ఎంతోమంది సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఇచ్చే పదవులను, బాధ్యతలను తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి సేవలను ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చాక పక్కకు పెట్టే చంద్రబాబు విధానాలు నచ్చకే దూరంగా ఉంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు. -
చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌కు చంద్రబాబు షాక్ ఇచ్చారు. విజయ్ స్థాయిని తగ్గించి ఆయనపై మరో ఇద్దరు నేతలు పయ్యావుల కేశవ్, జీవీ రెడ్డిని సోషల్ మీడియా సలహాదారులుగా నియమించారు. పార్టీలో సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావులకు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించడం ద్వారా విజయ్‌కు చెక్ పెట్టినట్లేనని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. పయ్యావుల నేతృత్వంలో జీవీ రెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ ఇకపై కేవలం ఐటీడీపీ బాధ్యతలు మాత్రమే చూస్తూ పయ్యావుల, జీవీ రెడ్డి కింద పనిచేయాల్సి ఉంటుందని టీడీపీ నేతలు చెప్పారు. టీడీపీ సోషల్ మీడియా సమర్థంగా పనిచేయడం లేదని చంద్రబాబు భావించడం వల్లే ఈ మార్పులు జరిగినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చదవండి: (చంద్రబాబుపై బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్) -
నోరు జారి నిజాలు ఒప్పుకున్నారా?
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వ్యతిరేక పార్టీగా ముద్ర వేసుకోవడానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పెద్దగా ఫీల్ కావడం లేదు. రాష్ట్రంలో ప్రాజెక్టులు రావడం లేదని, పరారవుతున్నాయని, వేధిస్తున్నారని నోటికి వచ్చిన ఆరోపణలు చేసిన టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు పరిశ్రమలు వస్తుంటే వాటిపై కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో ఒక్కోసారి నోరు జారి నిజాలు వచ్చేస్తుంటాయని అనుకోవాలి. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన ఒక ప్రకటన చూస్తే ఆ అభిప్రాయం కలుగుతుంది. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడే మాటే చెప్పారు. లక్ష కోట్ల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం అదానికి, వైసీపీ ముఖ్యనేతల బంధువులకు కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. వింటుంటే ఇదేమైనా తప్పేమో అనిపించవచ్చు కాని, జాగ్రత్తగా ఆలకిస్తే, రాష్ట్రానికి లక్ష కోట్ల ప్రాజెక్టులు వస్తున్న విషయాన్ని ఆయన నిర్దారణ చేసినట్లయింది. నాడు అలా.. నేడు ఇలా.. గతంలో కూడా తాము అధికారంలో లేనప్పుడు టీడీపీ నేతలు పరిశ్రమలకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు. ఉదాహరణకు చీరాల రేపల్లె ప్రాంతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. వాన్ పిక్ పేరుతో ఏర్పాటైన సంస్థకు సుమారు 13 వేల ఎకరాలను సేకరించి, ఓడరేవుతో పాటు, విద్యుత్ ప్రాజెక్టులు, తదితర సంస్థల ఏర్పాటుకు రంగం సిద్దం చేశారు. అంతలో దురదృష్టవశాత్తు వైఎస్ మరణించారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. వైఎస్ కుమారుడు జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారన్న కక్షతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కై సీబిఐ కేసులు పెట్టించారు. ఇలా ఒకటి కాదు.. చేయని అరాచకం అంటూ లేదు. చంద్రబాబు 2014లో గెలిచిన తర్వాత పరిశ్రమలు రావడానికి చేసిన ప్రయత్నం కన్నా ప్రచారా ఆర్భాటానికి విశేష ప్రాధాన్యత ఇచ్చారు. విశాఖలో సదస్సుల పేరుతో ఉత్తిత్తి అగ్రిమెంట్లు చేయించి, 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఊదర కొట్టారు. అప్పుడు ఇదే కేశవ్ కాని, మరే టీడీపీ నేత కాని ఈ ప్రాజెక్టులకు టెండర్లు కావాలని అనలేదు. ఇప్పుడు మాత్రం పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు టెండర్లు కావాలని అంటున్నారు. ఇందులో ఏదో జరిగిందని విమర్శిస్తున్నారు. పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ ప్రభుత్వం ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేసి, అక్కడ వచ్చిన ప్రతిపాదనలను స్వీకరించింది. ఆ ప్రకారం టీడీపీ నేతలు ప్రతిపాదనలు చేసి ఉండవచ్చు కదా? కాని అలా చేయరు. వీలైనంత బురద చల్లుతారు. దానిని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ పత్రికలు సాధ్యమైనంత ఎక్కువ తాము పూసుకుని, ప్రభుత్వానికి పూస్తుంటాయి. చంద్రబాబు టైమ్‌లో నిజంగా లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు వచ్చి ఉంటే అబ్బో .. ఆయన కాబట్టి వచ్చాయని ఈ పత్రికలు ఊదరగొట్టేవి. అదే వైఎస్ జగన్ హయాంలో పలు పరిశ్రమలు వస్తున్నా, అసలేవి రావడం లేదని టీడీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియా అబద్దాలు చెబుతుంటాయి. కళ్లు తెరిచి పరిశ్రమలను గుర్తించండి కొప్పర్తిలో పారిశ్రామికవాడ, బద్వేలులో ప్లైవుడ్ ప్లాంట్, కర్నూలులో గ్రీన్ ఎనర్జీ , పులివెందులలో ఆదిత్య బిర్లా యూనిట్, జగ్గంపేట, పిఠాపురంలలో కొత్త పరిశ్రమలు, అనకాపల్లి వద్ద టైర్ల యూనిట్, శ్రీ సిటీలో ఎసి యూనిట్లు, కాకినాడ వద్ద పార్మా హబ్ వంటి పలు ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆదాని సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఆయా ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి జగన్ పరిశ్రమలకు ఎలా సహకరిస్తున్నది బహిరంగంగానే వివరించి ప్రశసించారు. మరో వైపు పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ముందుకు వెళుతుంటే టీడీపీ దిక్కుమాలిన ఆరోపణలు చేస్తోంది. అదాని సంస్థకు, వైసీపీ నేతల బంధువులకు వాటిని కట్టబెడుతున్నారని విమర్శించింది. ఎట్టకేలకు నిజం కనిపించిందా? ఆదాని దేశంలోనే అత్యంత ధనికుడు. ఆయన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే కూడా వీరు రోదిస్తున్నారు. అరబిందో కంపెనీ ఫార్మా తదితర రంగాలలో ఎంత ప్రముఖ సంస్థో చెప్పనవసరం లేదు. అలాగే షిర్డి సాయి కంపెనీ అనుభవం కలిగిన సంస్థే. అలాంటివి వస్తుంటే లక్ష కోట్ల ప్రాజెక్టులు వారికి కట్టబెడతారా అని కేశవ్ ప్రశ్నిస్తున్నారు. ఆయన చెప్పిన మాటను జాగ్రత్తగా గమనిస్తే లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయని అంగీకరించినట్లయింది. తద్వారా చంద్రబాబు ఆరోపణలను పూర్వపక్షం చేసినట్లయింది. వైసీపీ వారిపై ఆరోపణలు చేసే బదులు టీడీపీ పారిశ్రామికవేత్తలు ఎవరైనా లేదా రామోజీరావు వంటివారు ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావచ్చుకదా! అలా చేయకపోగా వచ్చే వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చదవండి: రామోజీ.. అస్మదీయ తకథిమి రామోజీ కెందుకు అంత నొప్పి? మరో వైపు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంటే కూడా ఈనాడు తెగ బాధపడుతోంది. మొదట అనుకున్న అంచనా పెట్టుబడి పెట్టడం లేదంటూ దిక్కుమాలిన వార్తలు రాస్తోంది. 8800 కోట్ల పెట్టుబడి తక్కువట. 6500 మందికి ఉపాధి కలిగిస్తే సరిపోదట. ఇదే పత్రిక తెలంగాణలో 570 కోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయని మంత్రి కేటిఆర్ చెబితే మొదటి పేజీలో ఎక్కడా విమర్శ లేకుండా రాశారు. అది తప్పుకాదు. కాని అదే సమయంలో ఏపీలో మాత్రం లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను అడ్డుకునే రీతిలో కథనాలు ఇచ్చారు. ఏది ఏమైనా పయ్యావుల కేశవ్ కాని, ఈనాడు కానీ లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయని పరోక్షంగా అయినా అంగీకరించినందుకు వైసీపీ నేతలు ఆయనకు థాంక్స్ చెప్పాలి. హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పట్టుబడ్డ పయ్యావుల!
సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో జరిగిన అక్రమాలు, టీడీపీ నాయకుల రియల్ ఎస్టేట్ దందాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయి. రాజధాని ఎక్కడనే విషయాన్ని అధికారికంగా ప్రకటించకముందే ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడం ద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్‌కు టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ పాల్పడినట్లు తేటతెల్లమైంది. పయ్యావుల కుటుంబ సభ్యుల పేరుతో ఎక్కడెక్కడ భూములు కొన్నారో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చిట్టా బయటపెట్టారు. తప్పేముంది.. స్వాధీనం చేసుకోండి! అసెంబ్లీలో గురువారం అమరావతి భూముల కొనుగోళ్లపై చర్చ సందర్భంగా తాను రాజధాని ప్రాంతంలో అక్రమంగా భూములు కొనుగోలు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పయ్యావుల తొలుత ఖండించారు. ‘రాజధానిని ప్రకటించాక భూములు కొన్నాం.. తప్పేముంది?’ అంటూ ప్రశ్నించారు. చట్ట విరుద్ధంగా భూములను కొనుగోలు చేస్తే కేంద్రం తెచ్చిన బినామీ ఆస్తుల స్వాధీనం చట్టం ప్రకారం తన భూములు తీసేసుకోవాలంటూ సవాల్ విసిరారు. దీంతో ఆర్థిక మంత్రి బుగ్గన స్పందిస్తూ గత ప్రభుత్వం రాజధాని ప్రకటన ఎప్పుడు చేసిందో చెప్పాలని సూచించగా.. 4–9–2014న ప్రకటించారని, నెల తర్వాత నవంబర్‌లో భూములు కొన్నట్లు పయ్యావుల పేర్కొన్నారు. ముందే భూములు కొన్న పయ్యావుల ‘రాజధానిపై టీడీపీ పెద్దలు తొలుత నాగార్జున వర్సిటీ ప్రాంతమని, తర్వాత నూజివీడు అని ప్రచారం చేయడంతో ఆయా చోట్ల చాలామంది సామాన్యులు భూములు కొన్నారు. టీడీపీ నేతలు మాత్రం తుళ్లూరు ప్రాంతంలో పనులు చక్క బెట్టుకున్నారు. వాస్తవానికి రాజధానికి నోటిఫికేషన్ ఇచ్చింది 2014, డిసెంబర్ 30న. పయ్యావుల కేశవ్ తన కుమార్తె హారిక పేరిట 2014 ఫిబ్రవరి 28న, కుమారుడు పయ్యావుల విక్రమ్‌సింహ పేరిట 13–10–2014న రెండెక రాలు, 03–11–2014న మరో రెండున్నర ఎకరా లు తుళ్లూరు ప్రాంతంలో కొనుగోలు చేశారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ చివరిలో అక్కడ రాజధాని వస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటిం చింది’ అని బుగ్గన డాక్యుమెంట్ల నంబర్లతో సహా వెల్లడించడంతో పయ్యావుల కంగుతిన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ పేరుతోనూ కొనుగోలు రాజధాని ప్రకటన వెలువడటానికి (2014 డిసెంబర్ 30న) ముందే చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్టు బుగ్గన రాజేంద్రనాథ్ నిరూపించారు. ‘ఈ సంస్థ పేరిట 07–07–2014న పెదకాకాని, కంతేరు, తాడికొండలో సర్వే నంబర్ 56లో ఎకరా 15 సెంట్లు (డాక్యుమెంట్ నం.5869), ఇదే తేదీన (డాక్యుమెంట్ నం.5866) మరో ఎకరా 11 సెంట్లు, తాడికొండలోని సర్వే నం.63/1లో 45 సెంట్లు (డాక్యుమెంట్ నం.5867), 8 సెప్టెంబర్ 2014న తాడికొండ సర్వే నం.56లో ఎకరా 11 సెంట్లు (డాక్యుమెంట్ నం.8024), ఇదే తేదీన సర్వే నం. 63/2బిలో ఎకరా 35 సెంట్లు (డాక్యుమెంట్ నం.8025), ఇక్కడే మరో ఎకరా 35 సెంట్లు (డాక్యుమెంట్ నం.8026), సర్వే నం.57లో 2.20 సెంట్లు (డాక్యుమెంట్ నం.8027).. ఇలా భారీగా భూములు హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో కొనుగోలు చేశారు’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ముందుగానే ఒప్పందం.. ‘రాజధాని ప్రకటన తేదీకి రెండు నెలలు ముందు, రెండు నెలల వెనుక భారీగా భూములు కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటన చేసింది 30 డిసెంబర్ 2014 (జీఓ ఎంఎస్ నం.254) కాగా, టీడీపీ నాయకులు మాత్రం అంతకుముందే స్థానిక రైతులతో ఒప్పదం చేసుకుని వేలాది ఎకరాలు కొన్నారు. ఇదంతా వారికి ముందే తెలిసి ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారమే, ఇన్నివేల ఎకరాలు రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్లు అయిపోవు. ఇదంతా ముందే ఒప్పందం చేసుకుని జరిగిన వ్యాపారం’ అని బుగ్గన తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో పేకాట
ఉరవకొండ: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్లలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. పలువురు టీడీపీ నేతలతో సహా 56 మందిని అరెస్ట్ చేశారు. రూ.10.51 లక్షల నగదు, ఐదు కార్లు, 14 బైక్‌లు, 54 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉరవకొండలో గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప, సీఐ శేఖర్లు మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక భాగంలోని ఖాళీ ప్రదేశంలో భారీ ఎత్తున పేకాట సాగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం సీఐ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. వై.రాంపురం గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయుడు, రౌడీషీటర్ ఎర్రిస్వామి, కౌకుంట్ల టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు శీనా సహా 56 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా బెళుగుప్ప, కౌకుంట్ల, వై.రాంపురం తదితర గ్రామాలకు చెందిన వారు. టీడీపీ ముఖ్య నేత బోయ మారెప్ప ఆధ్వర్యంలో పేకాట స్థావరం కొనసాగుతున్నట్టు గుర్తించారు. చదవండి: (ఈ పాపం బాబుది కాదా?) -
అవినీతికి ‘సీమెన్స్’ ముసుగు
సాక్షి, అమరావతి : యువతకు ఉపాధి శిక్షణ ముసుగులో గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ)లో నిధులు కొల్లగొట్టిన వైనం అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ సంస్థలను కూడా విభ్రాంతికి గురి చేసింది. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సంస్థల పేర్లను కూడా వాడుకుని టీడీపీ ప్రభుత్వ పెద్దలు ప్రజాధనాన్ని దోచుకున్నారని వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వ పెద్దలు వారి స్వార్థం కోసం తమ సంస్థ పేరును దుర్వినియోగం చేసిందని ప్రముఖ కంపెనీ సీమెన్స్ అంతర్గత విచారణలో నిగ్గు తేల్చడం గమనార్హం. చదవండి: దోపిడీలో స్కిల్.. బాబు గ్యాంగ్ హల్'షెల్' ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో సీఐడీ అధికారుల దర్యాప్తులో తాజాగా ఈ విషయం వెలుగు చూసింది. యువతకు ఉపాధి శిక్షణ కోసం జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని చంద్రబాబు ప్రభుత్వం ఆనాడు ఘనంగా చెప్పుకుంది. కానీ వాస్తవం ఏమిటంటే.. భారతదేశంలో సీమెన్స్ సంస్థకు అప్పట్లో ఎండీగా ఉన్న సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీ పెద్దలు కుట్రకు తెరతీశారు. దాంతో పేరుకు సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో కలిసి ఏపీఎస్ఎస్డీసీ రూ.3,556 కోట్లకు త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నట్టు చూపించారు. కానీ సౌమ్యాద్రి శేఖర్ బోస్‌తో కలిసి అందుకోసం పీవీఎస్పీ ఐటీ స్కిల్స్, స్కిల్లర్ అనే షెల్ కంపెనీలను సృష్టించారు. ఏపీఎస్ఎస్డీసీ కాంట్రాక్టును ఆ సంస్థలకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు కథ నడిపించారు. అనంతరం సీమెన్స్, డిజైన్ టెక్ సమకూర్చాల్సిన 90 శాతం నిధులను సమకూర్చకుండానే.. ప్రభుత్వం తమ వాటా 10 శాతం పన్నులతో సహా రూ.371 కోట్లు చెల్లించేసింది. దాంతో ఏసీఐ అనే మరో కంపెనీ నకిలీ ఇన్వాయిస్లతో రూ.241 కోట్లను దొడ్డి దారిలో డిజైన్ టెక్ సంస్థకు చేరవేసింది. ఈ మొత్తం వ్యవహారంలో సీమెన్స్ సంస్థ అధికారిక ప్రమేయం లేదు. కానీ సీమెన్స్ తరఫున కథ నడిపినట్టుగా ఆ సంస్థ ఎండీ సౌమ్యాద్రిబోస్ తతంగం నడిపారు. ఈ విధంగా ఇటు ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే కాకుండా అటు తమ సీమెన్స్ సంస్థనూ మోసం చేశారు. సంతకంలోనూ మతలబే ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే కాంట్రాక్టు కుదుర్చుకున్న టీడీపీ ప్రభుత్వ పెద్దలు, సౌమ్యాద్రి శేఖర్ బోస్ అందుకు పక్కాగా పన్నాగం పన్నారు. ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందంలో సౌమ్యాద్రి బోస్ తన పేరును రాహుల్ బోస్‌గా సంతకం చేశారు. అలియాస్‌గా పేరు ఏదైనా ఉండొచ్చు. అధికారిక పత్రాలపై తన అసలు పేరుతోనే సంతకం చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా ఆయన రాహుల్ బోస్ పేరుతో సంతకం చేయడం గమనార్హం. అయితే గుజరాత్ ప్రభుత్వంతో సీమెన్స్ సంస్థ ఒప్పందం చేసుకున్న పత్రాలపై మాత్రం తన అధికారిక పేరు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అనే సంతకం చేశారు. కానీ ఏపీలో కేవలం నిధులు కొల్లగొట్టడానికే అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల చేతుల్లో పావుగా మారి తన అధికారిక పేరు కాకుండా అలియాస్ పేరుతో సంతకం చేశారు. అవినీతి బాగోతంపై సీమెన్స్ దర్యాప్తు 2018లో కేంద్ర జీఎస్టీ అధికారుల తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్ వ్యవహారం బయటపడింది. దాంతో ఆ విషయాన్ని సీమెన్స్ సంస్థ యాజమాన్యానికి జీఎస్టీ అధికారులు తెలిపారు. దాంతో సీమెన్స్ కంపెనీ యాజమాన్యం ఈ వ్యవహారంపై అంతర్గతంగా దర్యాప్తు నిర్వహించింది. సౌమ్యాద్రి శేఖర్ బోస్ ఈ విషయం తెలుసుకుని ఏపీఎస్ఎస్డీసీతో సాగించిన లావాదేవీలకు సంబంధించిన ఈ మెయిల్స్, ఇతర రికార్డులను తమ కంప్యూటర్లలో డిలీట్ చేశారు. కానీ జర్మనీలోని సీమెన్స్ కంపెనీ యాజమాన్యం అత్యున్నత సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిలీట్ చేసిన ఈ మెయిల్స్, ఇతర ఫైళ్లను వెలికి తీసింది. దాంతో ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం పేరుతో అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టిన విషయం నిర్ధారణ అయ్యింది. తమ తప్పు రుజువు కావడంతో సౌమ్యాద్రి శేఖర్ బోస్‌తోపాటు ఆయన సన్నిహితులు సీమెన్స్ కంపెనీకి రాజీనామా చేశారు. ఆ విషయాన్ని సీమెన్స్ కంపెనీ యాజమాన్యం అప్పటి టీడీపీ ప్రభుత్వానికి తెలిపినప్పటికీ ఏ మాత్రం స్పందించ లేదు. -
దోపిడీలో స్కిల్.. బాబు గ్యాంగ్ హల్'షెల్'
అధికారం అండగా గత ప్రభుత్వ పెద్దలు సాగించిన దోపిడీ పర్వంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ‘స్కిల్ డెవలప్మెంట్’ అంటూ ‘షెల్ కంపెనీ’లతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. తూతూ మంత్రంగా ఒప్పందం చేసుకుని పనులు చేయకుండానే బిల్లులు చెల్లించేశారు. ఆ విధంగా రూ.241 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఈ కుంభకోణంపై 2018లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారం ఇచ్చినా, అప్పటి టీడీపీ ప్రభుత్వం స్పందించక పోగా, సంబంధిత ఫైళ్లను మాయం చేసింది. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)ను అడ్డుపెట్టుకుని గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా దోపిడీకి పాల్పడ్డారు. తాజాగా సీఐడీ అధికారుల దర్యాప్తులో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసులో అప్పటి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎస్‌డీఈఐ కార్యదర్శికి ఓఎస్డీగా ఉన్న నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు, సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్, ఏఐసీ తదితర కంపెనీలకు చెందిన అప్పటి ఎండీలు, ఇతర ప్రతినిధులతో సహా మొత్తం 26 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్న రాష్ట్ర సీఐడీ అధికారులను ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అడ్డుకోడానికి ప్రయత్నించడం విస్మయ పరిచింది. అవినీతికి పాల్పడ్డ వారి ఇళ్లల్లో అధికారులు దర్యాప్తు చేస్తుండగా వీరు అడ్డుకోవడానికి యత్నించడం చూస్తుంటే ఈ కుంభకోణంలో టీడీపీ పెద్దలు కీలకంగా వ్యవహరించారన్నది స్పష్టమైంది. సీఐడీ విస్తృత తనిఖీలు, నోటీసులు ‘ఏపీఎస్ఎస్డీసీ’లో అక్రమాలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన పలువురు అధికారులతోపాటు పలు కంపెనీలపై రాష్ట్ర సీఐడీ అధికారులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, పూణే, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ నివాసాల్లో తనిఖీలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లతో పాటు వారు డైరెక్టర్లుగా ఉన్న ఇతర సంస్థలకు సంబంధించిన ఆడిటింగ్ ఫైళ్లు, ఇతర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. విజయవాడలో ఈ నెల 13న సీఐడీ ముందు విచారణకు హాజరు కావాలని గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏపీఎస్ఎస్డీసీ నిధులు కొల్లగొట్టడంలో కీలక పాత్ర పోషించిన ఢిల్లీ, ముంబాయి, పూణే తదితర నగరాల్లోని కంపెనీలు, షెల్ కంపెనీలలో కూడా తనిఖీలు నిర్వహించారు. సీఐడీ సోదాల సమయంలో లోబీపీతో పడిపోయిన లక్ష్మీనారాయణ. హడావుడి జీవో.. అందుకు విరుద్ధంగా ఒప్పందం 2014–19లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలు కలిపి మొత్తం 40 చోట్ల ‘స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందుకోసం రూ.3,611.05 కోట్లతో సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలి. ఈ మేరకు 2017 జూన్ 30న జీవో 4ను టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది. కానీ జీవో 4కు విరుద్ధంగా ఒప్పందం చేసుకునేలా ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా ఉన్న గంటా సుబ్బారావు మొత్తం కథ నడిపించారు. కేవలం రూ.100 స్టాంప్ పేపర్‌పై ఒప్పందం చేసుకున్నారు. అందులో తేదీ కూడా వేయలేదు. రూ.3,611.05 కోట్ల విలువ మేరకు కాంట్రాక్టును ఎలా నిర్ధారించారన్నదీ లేదు. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు సమకూర్చాల్సిన 90 శాతం నిధులను ఏ విధంగా లెక్కించారన్నదీ చెప్పనే లేదు. సంబంధిత మొత్తం వేయాల్సిన చోట ఖాళీగా వదిలేశారు. వైద్యం కోసం వస్తున్న డాక్టర్లు పనులు చేయకుండానే బిల్లుల చెల్లింపు జీవో ప్రకారం 90 శాతం నిధులు వెచ్చించాలన్న విషయాన్ని సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు పట్టించుకోలేదు. అయినా సరే ప్రభుత్వం మాత్రం తన వాటాగా చెల్లించాల్సిన 10 శాతం నిధులను జీఎస్టీతో సహా మొత్తం రూ.371 కోట్లు చెల్లించేసింది. అసలు పనులు చేయకుండానే నిధులు ఎలా చెల్లిస్తారని అప్పటి ఆడిట్ అకౌంటెంట్ జనరల్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించు కోలేదు. షెల్ కంపెనీల ద్వారా బాబు అస్మదీయులకు రూ.371 కోట్లను అడ్డగోలుగా కొల్లగొట్టడానికి అప్పటి సీఎం చంద్రబాబు సన్నిహితులు ‘షెల్ కంపెనీల’ను ముందే సృష్టించారు. ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అందుకోసం ఢిల్లీ కేంద్రంగా ‘స్కిల్లర్’ అనే షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీకి సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సరఫరా కోసం రూ.241 కోట్లకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు చూపించారు. ఆ ‘స్కిల్లర్’ కంపెనీ ముంబయిలోని ‘అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఏఐసీ) అనే మరో షెల్ కంపెనీకి వర్క్ ఆర్డర్ ఇచ్చినట్టుగా కనికట్టు చేశారు. ఆ మేరకు ఏపీఎస్ఎస్డీసీకి సాఫ్ట్వేర్, హార్ట్‌వేర్ సరఫరా చేసినట్టుగా ఏసీఐ కంపెనీ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించింది. ఢిల్లీకి చెందిన పాట్రిక్స్ ఇన్ఫో సర్వీసెస్, ఇన్‌వెబ్ ఇన్ఫో సర్వీసెస్, అరిహంట్ ట్రేడర్స్, జీఏ సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే షెల్ కంపెనీలు తెరపైకి వచ్చాయి. ఒక్కో ఇన్వాయిస్కు 5 శాతం కమిషన్ చొప్పున దాదాపు 50 నకిలీ ఇన్వాయిస్లను సమర్పించింది. ఆ నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా రూ.241 కోట్లు ఏసీఐకి చెల్లించారు. దాన్నుంచి ఏసీఐ కంపెనీ తన 5 శాతం కమిషన్‌ను తగ్గించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఢిల్లీలోని డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించింది. అంటే పనులు చేయకుండానే ప్రభుత్వం చెల్లించిన మొత్తం రెండు షెల్ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబు సన్నిహితులకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి వచ్చి చేరింది. ఆ విధంగా ఏపీఎస్ఎస్డీసీ నిధులను పక్కా పన్నాగంతో కొల్లగొట్టారు. ఇలా గుట్టు రట్టు.. నోట్ ఫైళ్లు మాయం 2018లో పూణేలో పన్ను ఎగవేతకు పాల్పడుతున్న పలు కంపెనీలపై కేంద్ర జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించి దాదాపు 220 షెల్ కంపెనీల గుట్టు రట్టు చేశారు. వాటిలో ఏపీఎస్ఎస్డీసీ పనులను సబ్ కాంట్రాక్టుకు తీసుకున్నట్టు చూపించిన స్కిల్లర్, ఏఐసీ తదితర కంపెనీలు కూడా ఉండటం గమనార్హం. ఆ కంపెనీల ప్రతినిధులను జీఎస్టీ అధికారులు విచారించగా.. తాము ఏపీఎస్ఎస్డీసీకి ఎలాంటి సాఫ్ట్‌వేర్‌గానీ హార్డ్‌వేర్‌గానీ సరఫరా చేయలేదని తెలిపారు. డిజైన్ టెక్ కంపెనీకి తాము షెల్ కంపెనీగా వ్యవహరించామని అంగీకరించారు. జీఎస్టీ అధికారులు ఈ విషయాన్ని తెలిపినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా పట్టించుకోలేదు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీలో పాత్రధారులు జాగ్రత్తపడ్డారు. సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో కాంట్రాక్టుకు సమ్మతించిన జీవో 4కు సంబంధించిన నోట్ ఫైళ్లను సచివాలయంలో మాయం చేశారు. ఏపీఎస్ఎస్డీసీలో కూడా సంబంధిత ఫైళ్లు గల్లంతు కావడం గమనార్హం. అక్కడా, ఇక్కడా ఆయనే.. అప్పటి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ ఏపీఎస్ఎస్డీసీ నిధులు కొల్లగొట్టడంలో అన్నీ తామై వ్యవహరించారు. ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవోగా ఉన్న గంటా సుబ్బారావు అదే సమయంలో ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి, అప్పటి సీఎం చంద్రబాబుకు ఎక్స్అఫీషియో కార్యదర్శిగా వ్యవహరించారు. అంటే ఆయనే ప్రతిపాదిస్తారు.. ఆయనే ఆమోదిస్తారు.. సీఎంవోను కూడా ఆయనే పర్యవేక్షిస్తారు. దీనికి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మీ నారాయణ అన్ని విధాల సహకరిస్తారు. తదనంతరం వచ్చిన ఏపీఎస్ఎస్డీసీ ఎండీలు కూడా ఈ అడ్డగోలు వ్యవహారం గురించి తెలిసినప్పటికీ మౌనంగా ఉండటం విస్మయపరుస్తోంది. అరెస్టులకు రంగం సిద్ధం ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసులో కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ అవినీతి బాగోతంలో కీలకంగా వ్యవహరించిన షెల్ కంపెనీల ప్రతినిధులు కొందరిని ఇతర రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడి న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకుని వారిని రాష్ట్రానికి తీసుకురానున్నారు. వారి నుంచి మరిన్ని వాస్తవాలను రాబట్టి ఈ కేసులో సూత్రధారుల అవినీతి బండారాన్ని నిరూపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి 2014–19 మధ్య కాలంలో ఏపీఎస్ఎస్డీసీలో నిధులు దారి మళ్లినట్టు మేము గుర్తించాం. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించగా నిధులు దారిమళ్లిన విషయం నిర్ధారణ అయ్యింది. దాంతో మేము ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ కేసు సీఐడీకి అప్పగించింది. పూర్తి స్థాయిలో విచారించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – అజయ్ రెడ్డి, చైర్మన్, ఏపీఎస్ఎస్డీసీ హల్చల్ చేసిన రాధాకృష్ణ, పయ్యావుల – సీఐడీ అధికారుల తనఖీలను అడ్డుకునేందుకు యత్నం – దీటుగా బదులిచ్చిన సీఐడీ అధికారులు సాక్షి, హైదరాబాద్ : ఏపీఎస్‌ఎస్‌సీడీ నిధుల గోల్మాల్ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో పలువురు నిందితుల ఇళ్లల్లో ఏపీ సీఐడీ అధికారుల తనిఖీల సందర్భంగా ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హల్ చల్ చేశారు. ఏకంగా సీఐడీ అధికారులను అడ్డుకునేందుకు వారు యత్నించడం విస్మయ పరిచింది. తమ విధులు నిర్వహించకుండా రాధాకృష్ణ అడ్డుకోవడంపై సీఐడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ అధికారులు నిందితుడు లక్ష్మీ నారాయణ నివాసంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రాధాకృష్ణ అక్కడే ఉండటం గమనార్హం. విధి నిర్వహణలో ఉన్న సీఐడీ అధికారులను అడ్డుకోవడంతోపాటు ఏబీఎన్ చానల్ కెమెరామెన్లతో తనిఖీలను వీడియో తీయించడం వివాదాస్పదంగా మారింది. దర్యాప్తు అధికారులను బెదిరింపులకు గురిచేసేలా ప్రవర్తించిన రాధాకృష్ణ వ్యవహారంపై సీఐడీ ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. రాధాకృష్ణతో పాటు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా లక్ష్మీనారాయణ నివాసానికి కార్యకర్తలతో వచ్చి హడావుడి చేశారు. తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తనిఖీలు ఎలా చేస్తారని రాధాకృష్ణ, పయ్యావుల కేశవ్ ప్రశ్నించగా సీఐడీ అధికారులు దీటుగా బదులిచ్చారు. ఎఫ్ఐఆర్తో పాటు సోదాలకు సంబంధించిన ప్రోసీడింగ్ కాపీని జూబ్లీ హిల్స్ పోలీసులకు ఒక రోజు ముందే అందించామన్నారు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు స్పందించి తనిఖీల సమయంలో తమకు సహకరిస్తున్న విషయాన్ని తెలిపారు. దాంతో వేమూరి రాధాకృష్ణ, పయ్యావుల కేశవ్ మౌనంగా ఉండిపోయారు. సోదాలు నిర్వహించే సమయంలో స్వల్ప అస్వస్థత ఉందని లక్ష్మీనారాయణ చెప్పడంతో పోలీసులు ఆయన్ను బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గంటా సుబ్బారావు ఇంట్లో సీఐడీ సోదాలు షాబాద్: ఏపీఎస్‌ఎస్‌సీడీ నిధుల గోల్మాల్ కేసుకు సంబంధించి నిందితుడైన గంటా సుబ్బారావు ఇంట్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆయన 34 ఎకరాల భూమిని కొనుగోలు చేసి.. వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకొని ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈయన ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. -
చట్టం చేశాక.. గుట్టు ఏముంటుంది!
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ తీర్మానం, చట్టం చేసిన అంశాల్లో గుట్టు ఏముంటుందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వంపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలపై ఘాటైన సమాధానాలిచ్చారు. గురువారం ఢిల్లీలో మీడియాతో బుగ్గన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ) చేసిన అప్పును చాలా గుట్టుగా ఉంచినట్టు, గ్యారెంటీలు, ఏ విధంగా తిరిగి కడుతున్నారనే విషయాలపై పయ్యావుల చేసిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ‘ఇందులో గుట్టుగా చేయాల్సింది ఏముంటుంది. రుణం ఎందుకు తీసుకున్నామనే దానిపై అసెంబ్లీలోనే తీర్మానం చేసి, చట్టం చేయడం జరిగింది. అమ్మ ఒడి, మహిళలకు ఆసరా, చేయూత వంటి నాలుగు పథకాలకు తీసుకోవడం జరిగింది. అదే నాలుగు కార్యక్రమాలకు ఆ డబ్బు వాడటం జరిగింది, దాంట్లో సీక్రెసీ ఏముంది. వివిధ జీవోలు విడుదల చేశాం. ఇంక దాంట్లో గుట్టు ఏముం ది’ అని ప్రశ్నించారు. గ్యారెంటీ ఇవ్వలేదని అంటున్నారు. అగ్రిమెంట్ చదివారా, అగ్రిమెంట్లో పాయింట్ నంబర్ 2.1 చూడండి. ఏదైనా గ్యారెంటీ రూపంలో అమలు కావాలంటే ఎప్పుడు అమలవుతుందనేది తెలుసుకోండి’ అని పయ్యావులకు హితవు పలికారు. ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం సివిల్ సప్లయిస్ విభాగం ద్వారా రూ.5 వేల కోట్లు తీసుకుని పసుపు కుంకుమ పథకం కింద పంచిందని, ఆ మొత్తాన్ని ఈ ప్రభుత్వం చెల్లించడం లేదా అని మంత్రి బుగ్గన ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వచ్చేది రాజకీయాలు చేయడానికి, కేంద్ర మంత్రుల్ని కలవడానికి మాత్రమే కాదని.. విద్యావంతులు, ఆర్థిక వేత్తలతో సమావేశం అవుతా రని పేర్కొన్నారు. ఎవరి అనుమతి తీసుకొని ఢిల్లీకి రావాలని ప్రశ్నించారు. ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపిస్తున్నారు..వారి సొ మ్ములతో చక్కర్లు కొడుతున్నామా..హోటల్లో బస చేస్తున్నట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. బాధ్యతగా ఆరోపణలు చేయాలని హితవు పలికారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ సభ్యుడు అవినాశ్ మిశ్ర, నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు యోగేష్ సూరి, నీతి ఆయోగ్ సలహాదారు సీహెచ్‌పీ సారథిరెడ్డిలతో మంత్రి బుగ్గన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. -
ఢిల్లీ పర్యటనలపై తప్పుడు ప్రచారం చేయొద్దు: బుగ్గన
సాక్షి, ఢిల్లీ: ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసిన అప్పు గుట్టుగా చేయలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను మభ్యపెట్టేందుకే పీఏసీ ఛైర్మన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అమ్మ ఒడి, ఆసరా, చేయూత పథకాల కోసమే అప్పు తీసుకున్నామని, జీవోల ప్రకారమే లోన్ తీసుకున్నామని.. గుట్టుగా ఏమీ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో వేల కోట్ల అప్పులు చేశారు.. అనుమతులు తీసుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘టీడీపీ హయాంలో 96 వేల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల అప్పులు చేశారు. ప్రభుత్వం మారింది.. మేం అప్పులు కడుతున్నామని’’ బుగ్గన వివరించారు. ఏపీకి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు, కార్యదర్శులతో చర్చిస్తున్నామని, ఢిల్లీ పర్యటనలపై తప్పుడు ప్రచారం చేయొద్దని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. -
‘ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించాలని టీడీపీ కుట్ర’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా టీడీపీ ఆరోపణలు చేస్తోందని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య మండిపడ్డారు. ఆయన బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించాలని టీడీపీ కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. టీడీపీ నాయకుల వైఖరిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. 41వేల కోట్ల పద్దుల గురించి ఆర్థిక మంత్రి వివరణ ఇచ్చారని, మళ్లీ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మొదటికి వచ్చారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు వారి నాయకుడు చంద్రబాబుకు నిజాలు మాట్లాడే అలవాటే లేదన్నారు. టీడీపీ వాళ్లు చెప్పిన పద్దుల్లో ఏజీ ఆఫీస్‌కి వివరణ ఇచ్చామని తెలిపారు. ఇదంతా చంద్రబాబు పెట్టిన సీఎఫ్ఎంఎస్ వల్లే సమస్య వచ్చిందన్నారు. చంద్రబాబు ఇలాంటి టెక్నాలజీ పేరుతో అనేక అక్రమాలు చేశారని మండిపడ్డారు. అవి ఫైబర్‌నెట్, స్కిల్ డెవలప్మెంట్లో బయట పడుతున్నాయని చెప్పారు. అసలు సీఎఫ్ఎంఎస్ను ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పజెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. -
లెక్కలు లేకుంటే వ్యవస్థలు ఊరుకుంటాయా?
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.41 వేల కోట్లకు లెక్కలు లేవంటూ పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌తోపాటు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ స్పష్టం చేశారు. ఆడిట్ సంస్థ అడిగితే దానిని పట్టుకొని కనీస పరిజ్ఞానం లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆడిట్ సంస్థలు ప్రశ్నలు వేయడం సహజమని, వాటి ఆధారంగా ఆరోపణలు చేయడమేమిటని ప్రశ్నించారు. బ్యాంకుల్లో ఒకరి ఖాతాకు బదులు మరొకరి ఖాతాలో రూ.410 జమ అయినా వెంటనే సరి చేస్తారని అలాంటిది రూ.41 వేల కోట్లకు లెక్కలు లేకుంటే వ్యవస్థలు చూస్తూ ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు. బుగ్గన మంగళవారం ఆర్ అండ్ బి భవన్లో విలేకరులతో మాట్లాడారు. ట్రెజరీ ద్వారా బిల్లులు చెల్లించకపోవడంపై ఆడిట్ సంస్థ వివరణ కోరితే ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమగ్ర ఆర్ధిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ప్రోగ్రామ్‌లో లోపాల కారణంగానే ఇలా జరిగిందన్నారు. అంతే కానీ లెక్కలు లేకపోవడం, అవతకవకలకు ఆస్కారమే లేదన్నారు. తెలంగాణ వాటాపై ఏపీ అప్పులు తెస్తోందంటూ ఆరోపించడం అవివేకమన్నారు. ‘తెలంగాణ రాష్ట్రంపై మనకు అప్పు ఎలా ఇస్తారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న అప్పును రెండు రాష్ట్రాలు చెల్లిస్తున్నాయి. జీతాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓ పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలని టీడీపీ కుట్రలు చేస్తోంది’ అని బుగ్గన పేర్కొన్నారు. అప్పుల్లో కోత పేరుతో కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) వస్తున్న వార్తలు, టీడీపీ నేతల ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. రెండేళ్లలో పేదలకు లక్ష కోట్ల సాయం.. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవడానికి అప్పులు చేశామని, రెండేళ్లలో నవరత్నాల పథకాల ద్వారా లక్ష కోట్ల రూపాయలు పేదలకు సాయంగా అందించామని బుగ్గన వివరించారు. అప్పులు కూడా విచక్షణతోనే చేశామన్నారు. తాము రైతులు, విద్యార్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం అప్పులు చేశామని, చంద్రబాబు హయాంలో ఆర్భాటాలు, సదస్సులు, ఎంవోయూల కోసం అప్పులు చేశారని గుర్తు చేశారు. క్యాన్సర్ ఫౌండేషన్‌తో ఎంవోయూలు చేసుకుని లక్షన్నర ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెప్పారన్నారు. ఉద్యోగాలు వస్తాయా.. రోగులు వస్తారా? అని తాను అసెంబ్లీలో ప్రశ్నించానని బుగ్గన పేర్కొన్నారు. దున్నపోతు ఈనిదంటే.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న తరహాలో ఆడిట్ సంస్థ అడిగిన వివరణ ఆధారంగా పీఏసీ చైర్మన్ ఆరోపణలు చేయడం తగదన్నారు. ఏవైనా అనుమానాలు, సందేహాలుంటే బాధ్యత గల పీఏసీ చైర్మన్‌గా సమావేశం నిర్వహించి అధికారులను అడిగి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ప్రైవేట్ వ్యక్తికి సీఎఫ్ఎంఎస్.. 2018లో చంద్రబాబు హయాంలో ప్రైవేట్ సంస్థకు రూ.300 కోట్లను ధారపోసి తెచ్చిన సీఎఫ్ఎంఎస్ పోగ్రామ్‌లో లోపాలను సరి చేస్తున్నామని బుగ్గన తెలిపారు. ప్రభుత్వానికి వెన్నెముక లాంటి చెల్లింపులకు సంబంధించిన సీఎఫ్ఎంఎస్ను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తి చేతికి అప్పగించారన్నారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారనడం అవాస్తవమన్నారు. పరిమితికి మించిన అప్పులు బాబు హయాంలోనే పీడీ ఖాతాల్లో ఉన్న రూ.10,895 కోట్లు మార్చి నెలాఖరు నాటికి వ్యయం కాకపోవడంతో ప్రభుత్వ కన్సాలిడేటెడ్ నిధికి జమ అయ్యాయన్నారు. ఇది సర్వసాధారణమన్నారు. టీడీపీ హయాంలో 2018–19లో రూ.19,530 కోట్లు, 2019–20లో 20,998 కోట్లు ఇలాగే జరిగాయని గుర్తు చేశారు. సీఎఫ్ఎంఎస్ పోగ్రామ్‌లో లోపాల వల్లే ట్రెజరీకి మ్యాచ్ కాలేదని మంత్రి పేర్కొన్నారు. అప్పుల్లో రూ.17 వేల కోట్లు తగ్గించినట్లు పేర్కొన్నారని, ఇందులో రూ.16,419 కోట్లు గత ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి చేసిన అప్పుల వల్లే తగ్గించారని బుగ్గన పేర్కొన్నారు. సామాన్యులకు భరోసా కల్పించాం కరోనా వల్ల రాబడి గణనీయంగా తగ్గినా సామాన్యులను ఆదుకుని భరోసా కల్పించామని, కోవిడ్ నిర్వహణలో ఏపీ మెరుగ్గా వ్యవహరించిందని పలు సంస్ధలు పేర్కొన్నాయని మంత్రి బుగ్గన గుర్తు చేశారు. చంద్రబాబు మాదిరిగా వ్యవసాయం దండగని, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలారేసుకోవాలని, యూజర్ చార్జీలు విధించాలని, ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వరాదని, సబ్సిడీలు వద్దని ఈ ప్రభుత్వం చెప్పలేదన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు సర్కారు బకాయి పెట్టిన ధాన్యం, విత్తనాలు, విద్యుత్ సబ్సిడీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులను ఈ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. కరోనా కష్టాల్లో ఆదాయం పడిపోవడంతో అన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పులు చేస్తున్నాయని, అదే తరహాలో ప్రజలను ఆదుకోవడానికి అప్పులు చేస్తున్నామని, అదీ కూడా పరిమితికి లోబడే చేస్తున్నామని బుగ్గన పేర్కొన్నారు. జీతాల చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. -
పయ్యావుల ఆరోపణలు అర్ధరహితం: బుగ్గన
సాక్షి, అమరావతి: పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపణలు అర్ధరహితమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర అనుమనాలు రేకెత్తిస్తున్నారన్నారు. ఆడిట్ చేసినప్పుడు పలురకాల ప్రశ్నలు వేస్తారని.. ఆడిట్ సంస్థ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సందేహాలు ఉంటే మీటింగ్ పెట్టి పరిష్కరించుకోవచ్చని.. లేఖలు రాయటం వల్ల ప్రయోజనం ఏంటో అర్థం కావట్లేదన్నారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవమని మంత్రి తెలిపారు. రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయని.. ప్రతిపక్షం నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి బుగ్గన హితవు పలికారు. ‘‘సీఎఫ్ఎంఎస్ వచ్చాక ట్రెజరీ ద్వారా వ్యవస్థ నడవడం లేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే సీఎఫ్ఎంఎస్ను ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టారు. 10895 కోట్ల బిల్లులు సీఎఫ్ఎంఎస్ లోపం వల్ల పీడీ అకౌంట్స్ నుంచి వెనక్కి వచ్చాయి. సీఎఫ్ఎంఎస్ ప్రోగ్రామింగ్‌లో లోపాలు ఉన్నాయి. తెలంగాణ వాటాపై ఏపీ అప్పు తెస్తుందంటూ ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంపై మనకు అప్పు ఎలా ఇస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న అప్పును రెండు రాష్ట్రాలు కడుతున్నాయి. ప్రజలకు సబ్సిడీలు ఏమీ ఇవ్వకూడదని చంద్రబాబు అన్నారు. కోవిడ్ సమయంలోనూ 1.31 కోట్ల మందికి సంక్షేమం అందించాం. జీతాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేయాలని కుట్రలు చేస్తున్నారని’’ మంత్రి బుగ్గన ధ్వజమెత్తారు. -
పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు..
సాక్షి, అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వర్గీయులు ఆగడాలు మితిమీరిపోయాయి. టీడీపీ మద్దతుదారులకు ఓట్లు వేస్తేనే సాగు, తాగునీరు ఇస్తామని బెదిరింపులకు దిగారు. టీడీపీ ఓడిపోతే తమ భూముల నుంచి హంద్రీనీవా నీరు వదలమని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పేరు చెరువుకు నీరు కావాలంటే టీడీపీకి ఓట్లు వేయాలని హుకుం జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్లను పయ్యావుల వర్గీయులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల్లో తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు ప్రత్యర్థి అభ్యర్థులను కడతేరుస్తామని పయ్యావుల కేశవ్ అనుచరులు.. బెదిరింపులకు దిగడంతో ఈ నెల 10న బాధితులు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చదవండి: అచ్చెన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో.. విజయవాడ టీడీపీలో తారస్థాయికి విభేదాలు.. -
పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు..
ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరుల ఆగడాలు మితిమీరిపోయాయి. పంచాయతీ ఎన్నికల్లో తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు ప్రత్యర్థి అభ్యర్థులను కడతేరుస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. మేజర్ పంచాయతీలో ఆధిపత్య పోరు.. పెద్ద కౌకుంట్ల మేజర్ పంచాయతీలో దశాబ్దాలుగా టీడీపీ ఆధిపత్య పోరు సాగిస్తోంది. 14 వార్డులున్న పెద్ద కౌకుంట్ల పంచాయతీలో చిన్న కౌకుంట్ల, వై.రాంపురం, మైలారంపల్లి, రాచేపల్లి గ్రామాలు మజారా గ్రామాలుగా ఉన్నాయి. ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినా.. ఏకపక్షంగా టీడీపీ వారే అన్ని స్థానాలు దక్కించుకునే వారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాల పట్ల పలువురు ఆకర్షితులై.. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావించారు. ఇందులో భాగంగా 14 వార్డులకు గాను 10 వార్డుల్లో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. మిగిలిన నాలుగు వార్డుల్లో ప్రత్యర్థి అభ్యర్థులు నామినేషన్ వేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. చివరి నిమిషంలో టీడీపీ నాయకుల కుట్రలు భగ్నం చేస్తూ ఈ నాలుగు వార్డుల్లోనూ పోటీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. విత్‌డ్రాలకు నేటితో ఆఖరు.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేందుకు గురువారంతో గడువు ముగియనుంది. ఈ నెల 17న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే తమ ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు కుట్ర రాజకీయాలకు టీడీపీ తెరలేపింది. ప్రత్యర్థి అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని విత్‌డ్రా చేసుకోవాలని, లేకుంటే కిడ్నాప్ చేసి, అంతు చూస్తామంటూ ప్రత్యక్ష బెదిరింపులకు దిగారు. మాట వినకపోతే... పెద్ద కౌకుంట్ల పంచాయతీ 11వ వార్డు అభ్యర్థిగా రాచేపల్లి గ్రామానికి చెందిన పెన్నోబులేసు నామినేషన్ వేశాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శంకరయ్య, వేలూరి నారాయణస్వామి (పయ్యావుల అనుచరులు) బుధవారం ఉదయం పెన్నోబులేసు ఇంటికి వెళ్లి నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని హెచ్చరించారు. దీనిపై అభ్యర్థి కుటుంబసభ్యులు నిరాకరించడంతో రెచ్చిపోయిన వారు.. ‘మా మాట వినకపోతే నీ కొడుకును కిడ్నాప్ చేసి అంతు చూస్తాం’ అంటూ పెన్నోబిలేసు తల్లిదండ్రులను బెదిరించారు. ఘటనతో భయభ్రాంతులకు గురైన పెన్నోబిలేసు కుటుంబసభ్యులు.. తమకు శంకరయ్య, నారాయణస్వామి నుంచి ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. (చదవండి: జగన్ ప్రభంజనాన్ని ఆపలేరు) గెలవలేక టీడీపీ నేతల అరాచకాలు -
అంతు చూస్తాం: పయ్యావుల అనుచరులు
‘పంచాయతీ విభజన కావాలంటూ గ్రామ సభలో ఎవరైనా ఒప్పుకుంటే అంతుచూస్తాం... షావుకారికి వ్యతిరేకంగా మాట్లాడినా మీ ప్రాణాలు గాల్లో కలుస్తాయ్’ అంటూ రెండు రోజులుగా ఉరవకొండ నియోజకవర్గంలోని పెద్ద కౌకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలను ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, అనుచరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పంచాయతీ విభజనను అడ్డుకుంటూ ప్రజలు నోరు మెదపకుండా పయ్యావుల అనుచరులు ఇంటింటికీ వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 70 సంవత్సరాలు పైబడినా.. ఇంకా ఈ ప్రాంతాలు భూస్వాముల కబంధహస్తాల్లోనే చిక్కుకున్నాయనేందుకు ఇంతకన్న నిదర్శనం ఏం కావాలి. ఇక్కడ వారు చెప్పిందే వేదం. వారి మాటను బేఖాతరు చేస్తే ఎంతటికైనా తెగిస్తారు. పయ్యావుల సోదరులు సాగిస్తున్న అరాచకాలతో కౌకుంట్ల పంచాయతీ ప్రజలు స్వేచ్ఛగా జీవించలేకపోతున్నారు. సాక్షి, ఉరవకొండ(అనంతపురం) : ఉరవకొండ నియోజకవర్గంలోని పెద్ద కౌకుంట్ల గ్రామానికి రక్త చరిత్రే ఉంది. ఇక్కడ భూస్వాములదే రాజ్యం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై అభిమానంతో పెద్ద కౌకుంట్ల పంచాయతీలోని వై.రాంపురం గ్రామంలో సూరయ్య అనే వ్యక్తి తన ఇంటిపై కాంగ్రెస్ జెండా కట్టాడు. ఈ విషయాన్ని పయ్యావుల సోదరులు అప్పట్లో జీర్ణించుకోలేకపోయారు. వారి కనుసన్నల్లోనే సూరయ్యను అత్యంత దారుణంగా పెట్రోలు పోసి సజీవ దహనం చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతోపాటు వైఎస్సార్ సీపీకి ఓటు వేశారన్న నెపంతో కౌకుంట్ల గ్రామంలోని దళితులపై విచక్షణారహితంగా పయ్యావుల అనుచరులు దాడులకు తెగబడ్డారు. దీని వెనుక కూడా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హస్తమున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి తరుణంలోనే వారి కబంధ హస్తాల నుంచి విముక్తి కోరుకుంటూ పెద్ద కౌకుంట్ల పంచాయతీ విభజనకు ప్రజలు పట్టుబట్టారు. అడుగడుగునా అడ్డంకులు పెద్ద కౌకుంట్ల పంచాయతీ పరిధిలో కౌకుంట్ల, వై.రాంపురం, మైలారంపల్లి, రాచపల్లి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో మొత్తంగా 7,118 జనాభా ఉంది. 5,500 మంది ఓటర్లు ఉన్నారు. భూస్వాముల అరాచకాలను భరించలేక పెద్ద కౌకుంట్ల పంచాయతీని విభజన చేయాలంటూ గత ఏడాది ప్రభుత్వాన్ని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. ఈ మేరకు అప్పట్లో గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రాతపూర్వకంగా అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై 2019, సెప్టెంబర్ 30న ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామ సభను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎమ్మెల్యే కేశవ్ ప్రమేయంతో అనచరులు గందరగోళాన్ని సృష్టించి అభిప్రాయాలను వెల్లడించకుండా ప్రజలను అడ్డుకున్నారు. పంచాయతీ విభజనకు అనుకూలంగా ఎవరూ చేతులెత్తకుండా పయ్యావుల గుండాలు పహారా కాశారు. అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగి, నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. దీనిపై విచారణ అనంతరం ఈ నెల 30న మరోసారి అభిప్రాయ సేకరణకు గ్రామసభ ఏర్పాటు చేయాలంటూ అధికారులను కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. పంచాయతీ విభజన జరిగితే తమ ఓటు బ్యాంక్‌కు దెబ్బపడడంతో పాటు, ఆయా గ్రామాల్లో తమ ఆధిపత్యానికి గండి పడుతుందని భావించిన పయ్యావుల వర్గం మరోమారు గ్రామసభను అడ్డుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రెండు రోజులుగా పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి చీరలు, మద్యం బాటిళ్లను బలవంతంగా అంటగట్టి విభజనకు అనుకూలంగా చేతులెత్తితే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. చాలామంది ఊళ్లు వదులుతున్నారు పంచాయతీ విభజన జరగకుండా పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు అడ్డుపడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి విభజనకు వ్యతిరేకంగా చేతులెత్తాలని భయపెడుతున్నారు. దీంతో చాలా మంది ఊళ్లు వదిలి వెళుతున్నారు. – సిద్దారెడ్డి, కౌకుంట్ల పంచాయతీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు గ్రామంలో ప్రజలను పయ్యావుల కేశవ్ అనుచరులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. డబ్బు, మందు బాటిళ్లు, చీరలు బలవంతంగా ప్రజలకు అంటగట్టి, పంచాయతీ విభజనకు వ్యతిరేకంగా చేతులు ఎత్తాలని చెబుతున్నారు. – వసంతమ్మ, కౌకుంట్ల ధైర్యంగా ముందుకు రండి కౌకుంట్ల భూస్వాముల అరాచక పాలనకు స్వస్తి పలకడానికి పంచాయతీ ప్రజలు ధైర్యంగా ముందుకు రావాలి. పంచాయతీ విభజనకు సంబంధించి వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్త పరచాలి. చీరలు, డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు గురికావద్దు. – అశోక్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, రాకెట్ల -
‘అవును.. అమరావతిలో భూములు కొన్నా’
సాక్షి, అమరావతి : రాజధాని ఏర్పడుతుందనే అమరావతిలో భూములు కొన్నానని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అంగీకరించారు. రాజధానిలో భూములు ఉండాలనే తన కొడుకు పేరుపై భూములు కొన్నానని అసెంబ్లీ సాక్షిగా నిజం ఒప్పుకున్నారు. రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ.. అమరావతిలో రాజధానిఏర్పడబోతుందని తెలిసే భూములు కొన్నానని స్పష్టం చేశారు. రాజధానిలో భూములు కొంటే తప్పేంటని ప్రశ్నించారు. (చదవండి : రాజధానులు ఎంతెంత దూరం) భూముల కొంటే తప్పులేదని.. 2014 జూన్ నుంచి డిసెంబర్‌లోగా టీడీపీ నేతలు అంతా ఒకే చోటభూములు ఎలా కొన్నారని బుగ్గన నిలదీశారు. రాజధాని అక్కడ..ఇక్కడ అని అమయాక ప్రజలను గందరగోళాని గురిచేసి.. టీడీపీ నేతలు మాత్రం అమరావతిలో భూములు కొన్నారని బుగ్గన ఆరోపించారు. గుంటూరు,కృష్టా జిల్లాల్లో రాజధాని అని ఉద్దేశపూర్వకంగా లీకులు ఇచ్చి.. అందరిని మభ్యపెట్టి టీడీపీ నేతలు మాత్రం అమరావతిలో భూములు కొన్నారన్నారు. కచ్చితంగా ఇది ఇన్సైడర్ ట్రేడింగే అని బుగ్గన అన్నారు. దీనిపైప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. (చదవండి : చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని) ప్రజలను మభ్యపెట్టేలా పయ్యావుల మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇల్లు కట్టుకునేందుకు 4 ఎకరాల భూముటు కొంటారాఅని పయ్యావులను ప్రశ్నించారు. రాజధాని ఏర్పడే విషయం టీడీపీ నేతలకు ముందుగానే అందిందని.. అందుకే అమరావతిలో వేల ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై తమ ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని పేర్కొనానరు. (చదవండి : ‘షో బ్యాగ్.. సీ బ్యాగ్ అనేది చంద్రబాబు పాలసీ’) -
‘కాంగ్రెస్‌తో పొత్తు వల్లే ఓడిపోయాం’
సాక్షి కృష్ణగిరి(కర్నూలు) : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఘోరంగా ఓడిపోయామని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. మండల పరిధిలోని కంబాలపాడు గ్రామంలో బుధవారం మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జన్మదిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, బీటీ నాయుడు, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, నాయకులు తిక్కారెడ్డి, మీనాక్షినాయుడు, కేఈ ప్రతాప్, కేఈ జయన్న, కేఈ శ్యాంబాబు, మల్లెల రాజశేఖర్, మల్లికార్జునరెడ్డి, నాగేశ్వరయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
హత్యా రాజకీయాలకు కేరాఫ్.. పయ్యావుల కేశవ్
సాక్షి, ఉరవకొండ(అనంతపురం) : ఉరవకొండ నియోజకవర్గంలో దౌర్జన్యాలకు, హత్యా రాజకీయాలకు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని, ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలంటూ ఆయన నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వళ్లించినట్లుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఉరవకొండ మండలం రాకెట్లలో సోమవారం సుంకలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన కౌకుంట్ల గ్రామ ప్రజలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పయ్యావుల కేశవ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం పరిపాలన సౌలభ్యం కోసం పెద్ద కౌకుంట్ల పంచాయతీని విభజించేందుకు పెట్టిన గ్రామసభలో కేశవ్ వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేయకుండా ప్రజలను భయపెట్టారన్నారు. దాదాపు 8500 మంది జనాభా ఉన్న పంచాయతీలో కనీసం 1500 మంది కూడా పాల్గొనకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యేగా కేశవ్ ఎన్నికే అప్రజాస్వామ్యం అని, కోట్లు ఖర్చుచేసి ప్రలోభాలకు గురిచేసి రిగ్గింగ్‌తో గెలుపొందిన ఆయన ఇప్పుడు ప్రజాస్వామ్యం, అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో గత ఐదు దశాబ్ధాలుగా ఎవరు ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారో, ఎవరు ఎవరు ఎవర్ని హత్యలు చేయించారో ప్రజలందరికీ తెలుసున్నారు. కేశవ్ గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అటు అమరావతిలో, ఇటు కియా కార్ల కంపెనీ వద్ద దాదాపు వందల ఎకరాల భూమిని కొనుగోలు చేసిన విషయం వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులలో వందల కోట్లు రూపాయలు దోపిడీ చేసిన అతి పెద్ద దోపిడీ దొంగ కేశవ్ అని మండిపడ్డారు. సోమవారం కౌకుంట్లలో ప్రజాస్వామ్యం కచ్చితంగా అపహాస్యం అయిందన్నారు. -
‘హత్యా రాజకీయాలకు కేరాఫ్ పయ్యావుల’
సాక్షి, అనంతపురం : ప్రజాస్వామ్యం గురించి పయ్యావుల కేశవ్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ పయ్యావుల కుటుంబం అని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడి చేసిన అవినీతి పరుడు పయ్యావుల అని ధ్వజమెత్తారు. అలాగే అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుమారుల పేరుమీద అమరావతిలో, కియా కార్ల కంపెనీ వద్ద వందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. -
పయ్యావుల ఊరిలో జరిపించి తీరుతాం!
సాక్షి, అనంతపురం : పయ్యావుల కేశవ్ సొంత పంచాయతీ కౌకుంట్లలో నలభై ఏళ్లుగా దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నారని ఉరవకొండ మాజీ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆదివారం మండిపడ్డారు. కౌకుంట్ల పంచాయతీ విభజన కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా అధికారులను, ప్రజలను బెదిరిస్తున్నారనీ, ఈ ఆగడాలు ఇక సహించేదిలేదన్నారు. సోమవారం కౌకుంట్లలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
పయ్యావుల కేశవ్ అత్యుత్సాహం
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రదర్శించిన అత్యుత్సాహం వివాదానికి దారితీసింది. గురువారం రాత్రి హంద్రీనీవా నుంచి ఇప్పేరు చెరువుకు నీటి సరఫరాను టీడీపీ నేతలు నిలిపివేయించారు. ఇప్పేరు చెరువుకు స్వయంగా నీరు విడుదల చేసేందుకే ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇలా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పయ్యావుల వైఖరికి నిరసనగా కూడేరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కూడేరుకు రాకుండానే టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెనుదిరిగారు. -
పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) (ఛైర్మన్ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌తో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను, అలాగే ఎస్టిమేట్స్ కమిటీకి చైర్మన్‌గా రాజన్న దొర, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను నియమించారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీకి చైర్మన్‌గా చిర్ల జగ్గిరెడ్డితో పాటు సభ్యులుగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం గురువారం నియమించారు. పబ్లిక్ అకౌంట్ కమిటి సభ్యులుగా: 1. పయ్యావుల కేశవ్(చైర్మన్), 2. సంజీవయ్య కిలిబెటి, 3. కోలగట్ల వీరభద్ర స్వామి, 4. మేరుగు నాగార్జున, 5. భూమన కరుణాకర్‌రెడ్డి 6. కరణం ధర్మశ్రీ 7. జోగి రమేష్, 8. కెవి. ఉషశ్రీ చరణ్, 9.కాటసాని రాంభూపాల్ రెడ్డి, 10. బీద రవీచంద్ర, 11. డి. జగదీశ్వరరావు, 12. బాలసుబ్రమణ్యం, ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా: 1. రాజన్న దొర పీడిక(చైర్మన్), 2. అమర్నాథ్ గుడివాడ, 3. రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి, 4. కిరణ్ కుమార్ గొర్లె, 5. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, 6. అనిల్ కుమార్ కైలే, 7. మదిశెట్టి వేణుగోపాల్, 8. మండలి గిరిధర రావు, 9. ఆదిరెడ్డి భవాని, 10. దువ్వారపు రామారావు, 11. పరుచూరి అశోక్‌బాబు, 12. వెన్నపూస గోపాల్‌రెడ్డి పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా: 1. చిర్ల జగ్గిరెడ్డి(చైర్మన్) 2. గ్రంధి శ్రీనివాస్, 3. కిలారి వెంకటరోశయ్య, 4. జొన్నలగడ్డ పద్మావతి, 5. అన్నా రాంబాబు, 6. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, 7. రవీంద్రనాథ్‌రెడ్డి, 8. చంద్రశేఖర్‌రెడ్డి, 9. వాసుపల్లి గణేష్ కుమార్10. వెంకట సత్యనారాయణ రాజు, 11. గుంజపాటి దీపక్‌రెడ్డి, 12. సోము వీర్రాజు -
పయ్యావుల వర్గీయుల రౌడీయిజం..
సాక్షి, అనంతపురం : ఓటుతో ప్రజలు టీడీపీ నాయకులకు గట్టి గుణపాఠం చెప్పినా.. వారి తీరు మారడం లేదు. ఓటమిని జీర్ణించుకోలేని పచ్చ పార్టీ నేతలు రౌడీయిజం చేస్తున్నారు. తమ పార్టీకి కాకుండా వైఎస్సార్సీపీకి ఓట్లేశారని పేర్కొంటూ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వర్గీయులు రెచ్చిపోయారు. నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన పయ్యావుల స్వగ్రామమైన కౌకుంట్లలో మంగళవారం జరిగింది. కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో వెంకటేష్, గంగమ్మ, గంగాధర్, ఎర్రిస్వామికి గాయాలయ్యాయి. బాధితులు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘మీరంతా ఎవరికి ఓటు వేశారో ఈవీఎంలలో తెలిసిపోయింది’అని బెదిరిస్తూ పయ్యావుల వర్గీయులు దాడి చేయడం గమనార్హం. ఇక శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండలం ఏ.కొండాపురంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. టీడీపీ నేతలు దాడిచేయడంతో వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు గాయపడ్డారు. వారిని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. -
వైఎస్ఆర్సీపీ పై పయ్యావుల వర్గీయుల దాడి
-
కేశవా.. ఈ పాపం నీది కాదా!
కరువు సీమపై టీడీపీ పగబట్టింది. పారే నీటిని ఒడిసిపట్టే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కాలువల్లో అవినీతి పరవళ్లు తొక్కుతోంది. కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు ఆ పార్టీ నేతలకు భారీగా ముడుపులు ముట్టజెప్పడంతో.. నాలుగు రాళ్లు వెనకేసుకోవడంలో భాగంగా పనులు నాసిరకంగా చేయడం మొదటికే మోసాన్ని తీసుకొచ్చింది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్, రిత్విక్.. ఇతరత్రా టీడీపీ దత్తత కాంట్రాక్టర్లు జిల్లాలో చేపట్టిన ఏ పని కూడా సక్రమంగా లేకపోవడంతో ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. తుంగభద్ర, హంద్రీనీవాల నుంచి భారీగా నీరు వస్తున్నా.. కాలువల పనుల్లో నాణ్యత లోపించి ఎక్కడికక్కడ గండ్లు పడి నీరు వృథా అవుతోంది. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు పయ్యావుల కేశవ్ తమ పార్టీ బినామీ కాంట్రాక్టు సంస్థలతో హడావుడిగా చేయించిన పనుల్లో నాణ్యత లోపానికి ఈ చిత్రమే నిదర్శనం. హంద్రీనీవా 34వ ప్యాకేజీలో భాగంగా చేపట్టిన డిస్ట్రిబ్యూటరీ కాలువకు శనివారం కురిసిన ఒక్క వర్షానికే మూడు చోట్ల గండి పడింది. ఈ నీరంతా పక్కనే ఉన్న పొలాలను ముంచెత్తింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నీళ్లిస్తున్నట్లు ఫొటోలకు ఫోజులిచ్చిన ‘పయ్యావుల’ పాపమే ఇప్పుడు గండ్ల రూపంలో రైతులకు శాపంగా మారింది. ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలన్న దురాశ.. అస్మదీయుడైన కాంట్రాక్టర్‌కు అడ్డంగా దోచిపెట్టాలన్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేరాశ.. వెరసి రైతులకు కష్టాల పాలు చేసింది. ఏమాత్రం నాణ్యత లేని పనులతో కాలువలు తెగి వర్షపునీరు పొలాల్లో ప్రవహించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎమ్మెల్యే నిర్వాకం తమ జీవితాలను అగమ్యగోచరంగా మార్చిందని వాపోతున్నారు. ఉరవకొండ: కరువు సీమ కడగండ్లు తీర్చే హంద్రీ– నీవా సుజల స్రవంతి పథకం పనుల్లో గత టీడీపీ ప్రభుత్వం భారీగా అక్రమాలకు పాల్పడింది. హంద్రీ–నీవా పనుల్లో అంచనాలు పెంచి రూ.కోట్లు దోచుకున్న టీడీపీ నేతలు కనీసం పనుల్లో నాణ్యతను పట్టించుకోలేదు. వివరాల్లోకెళితే.. హంద్రీ– నీవా 34వ ప్యాకేజీలో భాగంగా 12,500 ఎకరాల్లో డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టారు. పనులను బెంగళూరుకు చెందిన రెడ్డి వీరన్న కన్స్ట్రక్షన్స్ వారు చేపట్టారు. ఇందులో భాగంగా ఉరవకొండ మండలం వ్యాసాపురం వద్ద నిర్మించిన డీ2 డిస్ట్రిబ్యూటరీ నుంచి 500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ఈ డిస్ట్రిబ్యూటరీ పనులు సంబంధిత కాంట్రాక్టర్ పూర్తి నాసిరకంగా చేపట్టారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పయ్యావుల కేశవ్ హుటాహుటిన డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు తీసుకొచ్చారు. కాలువ వద్ద ఫొటోలకు ఫోజులు ఇచ్చి రైతులను మభ్యపెట్టాలని ప్రయత్నించారు. నాసిరకం పనులతోనే కాలువకు గండ్లు డీ2 డిస్ట్రిబ్యూటరీ కాలువ పనులు పూర్తి నాసిరకంగా ఉండటంతో శనివారం కురిసిన భారీ వర్షానికి వద్ద మూడు చోట్ల కాలువకు గండి పడటంతో భారీగా నీరు పొలాలను ముంచెత్తింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మూడు చోట్ల గండి పడింది. దీంతో నీరు పక్కనే ఉన్న పొలాలను ముంచెత్తింది. వ్యాసాపురం గ్రామానికి చెందిన కొంకరామప్ప, అశోక్, సీతారాములు, ఉలిగప్ప తదితర పొలాల్లోకి వరద నీరు భారీ చేరి పొలాలు నిండిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు గండిపడిన విషయాన్ని హంద్రీ–నీవా అధికారులకు రైతులు సమాచారం అందించారు. -
పయ్యావులకి ఆపదవి ఇవ్వాల్సింది: వైఎస్సార్సీపీ నేత
సాక్షి, ఉరవకొండ : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెదటి సారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని ఆ పార్టీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దాదాపు 80 నుంచి 90 శాతం దాకా అమలుపరుస్తూ, అనేక బిల్లులను ఆమోదించారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎన్నికల్లో ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో ఆలోచించడం మాని ఇంకా తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ఇక ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పెద్ద అవినీతి తిమింగళమని హంద్రీనీవా, డ్రిప్ పథకాలు తదితర వాటిలో అవినీతికి పాల్పడి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. చంద్రబాబు పయ్యావులకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చే బదులు లూటీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్ చేసి ఉంటే సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. -
కేశవ్‌కు పదవి; టీడీపీలో అసంతృప్తి!
సాక్షి, అమరావతి: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించడంపై సీనియర్లు అసంతృప్తిగా ఉన్నట్టు వెల్లడవుతోంది. చంద్రబాబు నిర్ణయంపై అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. శాసనసభలో తమను వాడుకుని కీలక పదవిని మాత్రం కేశవ్‌కు కట్టబెట్టడంపై వీరంతా సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. చంద్రబాబు నిర్ణయంతో వెంటనే కేశవ్ బుధవారం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కేశవ్, గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్, గణబాబు తదితరులు ఈ పదవి ఆశించినా చంద్రబాబు కేశవ్‌వైపే మొగ్గు చూపారు. కేశవ్‌తో పాటు గంటా శ్రీనివాసరావు పేరును పరిశీలించారు. కానీ గంటా పార్టీ మారతారనే ప్రచారం నేపథ్యంలో కేశవ్‌ను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. కేశవ్ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో బీసీ లేదా కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఉంటుందని తొలుత ప్రచారం సాగింది. కానీ చివరకు చంద్రబాబు కేశవ్ పేరునే ఈ పదవికి ఖరారు చేశారు. -
‘నేనెవరో తెలుసా.. పయ్యావుల కేశవ్ మనిషిని’
సాక్షి, ఉరవకొండ: మహిళా ఉద్యోగులపై టీడీపీ నేతల దౌర్జన్యం ఇప్పటికీ కొనసాగుతోంది. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరుడు ఓ మహిళా ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఉరవకొండ ఎస్ఐ రాజోల్ రాజేశ్వరి శనివారం రాత్రి అనంతపురం–బళ్లారి జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. రేణుమాకుపల్లి రహదారిలో ఓ వాహనం రోడ్డుకు అడ్డంగా ఉండటంతో తనిఖీ చేయగా పయ్యావుల కేశవ్ ప్రధాన అనుచరుడు పార్యం కేశవానంద తన అనుచరులతో మద్యం తాగుతూ కనిపించాడు. ఇలా చేయడం తప్పని ఎస్ఐ చెప్పడంతో కేశవానంద ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ‘నేను ఎవరో తెలుసా. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మనిషిని. నన్నే ప్రశ్నిస్తావా. మేము చేసేది ఇంతే. నీకు ఇష్టమున్న చోట చెప్పుకో’ అంటూ మద్యం మత్తులో నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఎస్ఐ తన సిబ్బందితో కలిసి పార్యం కేశవానందను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కేశవానందపై 506, 509, 353 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎమ్మెల్సీ పదవికి పయ్యావుల రాజీనామా
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేశవ్ ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. పయ్యావుల రాజీనామాను ఆమోదించిన శాసన మండలి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన పయ్యావుల.. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. -
దొడ్డిదారిన గెలిచేందుకు పయ్యావుల కుట్ర
అనంతపురం: అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ప్రజాశాంతి పార్టీతో కలిసి కుట్రలకు తెరలేపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డిని ఎలాగైనా దెబ్బతీసి తాను లబ్ధి పొందేందుకు కుయుక్తులు పన్నారు. ఇందులో భాగంగా కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీకి లక్షల రూపాయలు ఇచ్చి వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరునే కలిగి ఉన్న మరో వ్యక్తికి బీృఫారం తెప్పించి నామినేషన్ వేయించేందుకు ప్రయత్నించారు. ఈ రెండు పార్టీల గుర్తులు దగ్గరదగ్గరగా పోలి ఉండడంతోపాటు అభ్యర్థుల పేర్లూ ఒకేలా ఉంటే ఓటర్లను తికమక పెట్టి లబ్ధి పొందవచ్చని కేశవ్ దురాలోచన చేశారు. ఇందులో భాగంగా విశ్వేశ్వరరెడ్డి పేరుగల వ్యక్తుల కోసం గాలించారు. ఈ క్రమంలో సీఆర్ విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తితో పయ్యావుల కేశవ్ అనుచరుడు పరమేశ్వర్‌రెడ్డి చేసిన బేరసారాల ఆడియోలు లీకయ్యాయి. విశ్వేశ్వరరెడ్డి అనే పేరుగల వ్యక్తి ఎందుకు అవసరం.. ప్రజాశాంతి పార్టీ తరఫునే ఎందుకు నామినేషన్ వేయాలి.. అందుకు ప్రతిఫలంగా ఏమిస్తారు.. నామినేషన్ వేసి పొరబాటున విత్‌డ్రా చేసుకుంటే కలిగే ఇబ్బందులు తదితర అంశాలపై పయ్యావుల కేశవ్ అనుచరుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే.. సీఆర్ విశ్వేశ్వరరెడ్డి పోటీకి అంగీకరించకపోవడంతో చివరికి కే విశ్వనాథరెడ్డి అనే వ్యక్తిని బరిలోకి దింపారు. కాగా, నామినేషన్ గడువుకు ముందురోజు సీఆర్ విశ్వేశ్వరరెడ్డితో పయ్యావుల ప్రతినిధి రెండు దఫాలుగా జరిపిన సంభాషణ ఇదిగో ఇలా ఉంది.. ఇది ఓటర్లను తికమక పెట్టేందుకే.. అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటే ప్రజలే ఎదురొచ్చి ఓట్లు వేస్తారు. ఏమీ చేయకుండా కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకుని ఈ రోజు దొడ్దిదారిన గెలవాలని పయ్యావుల కేశవ్ చూస్తున్నారు. ప్రత్యర్థి పేరున్న మరో వ్యక్తితో నామినేషన్ వేయించి ఓటర్లను తికమక పెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నాకు ఫోన్ చేశారు. రెండువేల ఓట్లయినా చీల్చాలనే కుట్ర పన్నారు. - సీఆర్ విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ యువమోర్చా రాష్ట్ర నాయకుడు మొదటి ఆడియో పయ్యావుల ప్రతినిధి : అన్నా.. నేను పరమేశ్వరరెడ్డి అని రవీ వాళ్ల ఫ్రెండ్ సీఆర్ విశ్వేశ్వరరెడ్డి : చెప్పండి ప.ప్ర: నామినేషన్ వేయడానికి చూడమనింటే రవి మీ ఫోన్ నంబరు ఇచ్చాడు సీఆర్: ఎక్కడనా.. ఇంతకుముందు ఏదో మాట్లాడారు ఉరవకొండ నుంచి నామినేషన్ వేయాలని. ప.ప్ర: ఆ.. సీఆర్: ఎవరి తరఫున అన్నా అది ప.ప్ర: అది కేఏ పాల్ సీఆర్: కేఏ పాలా.. ఆయనేదో జోకర్ కదా ఆయన ప.ప్ర: అంటే ఆయన మనకు ముఖ్యం కాదు. పయ్యావుల కేశవన్న ఉన్నాడు కదా వాళ్ల తరఫున సీఆర్: ఓకే. దానివల్ల వీళ్లకేమి ఉపయోగం ఉంటుంది అన్నా ప.ప్ర: ఏమి ఉపయోగమో అనేది కాదు. వాళ్ల ఐడియాలు ఎట్లున్నాయో మనకు తెలియదు కదా? ఆ పేరు మీద ఉన్నోళ్లలో మీ వాళ్లెవరైనా ఉంటే చూడండి అని చెప్పారు. అందుకోసమని రవికి చెప్పింటిని మాట్లాడు అని. రవి ఫోన్ నంబర్ ఇచ్చాడు. బాగుంటుందన్నా భవిష్యత్తులో కూడా ఏదైనా టౌన్లో మంచీచెడ్డ ఉన్నాగాని వాళ్లే చూసిపెడతారు మనకి. దానికోసమని చెబుతున్నా. సీఆర్: దానివల్ల విశ్వనాథరెడ్డి అని పేరుండే వాళ్లకు ఏమి ఉపయోగం? ప.ప్ర: ఈయన (కేశవ్) అపోజిట్ కేండెట్ విశ్వేశ్వరరెడ్డి కదా. సీఆర్: ఎస్.. ఆయన వైఎస్సార్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. ప.ప్ర: అవును వాళ్లది ఫ్యాన్ గుర్తుకదా. హెలిక్యాప్టర్‌కు కూడా ఫ్యాన్ ఉంటుంది అని ఒక సజేషన్ ఇచ్చారు వాళ్లకు. సీఆర్: ఓటర్స్ మొత్తం కన్ఫ్యూజ్ అయి.. చీలిపోతాయనా ప.ప్ర: ఆ.. ఆ.. కనీసం వెయ్యి రెండువేలు ఓట్లు చేంజ్ అయినాగాని మనకు బెనిఫిట్ అవుతుందనే ఆలోచన అంతే. సీఆర్: సరే ఇక్కడ కంటెస్ట్ చేసే వాళ్లకు ఏమి ఉపయోగం ఉంటుంది అన్నా. విశ్వేశ్వరరెడ్డి పేరుతో కేఏ పాల్ గుర్తుపైన కంటెస్ట్ చేస్తారంటున్నారు కదా.. వారికేమి ఉపయోగం. ప.ప్ర: బెనిఫిట్స్ ఉంటాయి. అంతో ఇంతో డబ్బులైనా ఇవ్వొచ్చు. రేప్పొద్దున వాళ్లను ఉపయోగించుకోవచ్చు మనం. సీఆర్: అంటే ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఏం కతా.. çప.ప్ర: ఏమో వాళ్లతో మాట్లాడితే కదా. మనకు వాళ్లేమీ ముందుగా చెప్పలేదు. సీఆర్: అంటే పయ్యావుల వాళ్లు పాల్‌తో కాంటాక్ట్‌లో ఉన్నారా? ప.ప్ర: కాంటాక్ట్ ఏమీలేదు. వాడు డబ్బుకు ఇస్తారు బీృఫారం అంతే. డబ్బుకు ఆశ పడుతున్నాడంట. డబ్బు ఏం మాట్లాడుకున్నారో వాళ్లు ఏం మాట్లాడతారో తెలీదు. బీృఫారం తెచ్చుకోవడానికి వాళ్లతో మాట్లాడతారు అంతే. సీఆర్: అంటే ఓట్లు చీల్చడానికి ఇది వేస్తున్నారు అంతే ప.ప్ర: అంతే కన్ఫ్యూజన్కు సీఆర్ : అవును లెండి ఫ్యాన్‌కే వేసేదిపోయి హెలిక్యాప్టర్ ఫ్యాన్‌కు వేస్తారు. మీరు టీడీపీలో మెంబరా ఏంటి అన్నా ప.ప్ర: మాది రాగులుపాడు అని, పరమేశ్వర్‌రెడ్డి నా పేరు. మామూలు బూత్ కమిటీ మెంబరు. సీఆర్: పోవాలంటే ఎవరు డీల్ చేస్తారు ప.ప్ర: మన బయోడేటా తీసుకుని కేశవ్ వాళ్ల దగ్గరికి పోతే. అంతా వాళ్లే చూసుకుంటారు అంతే. సీఆర్: సరే అన్నా.. ప.ప్ర: ఏమీలేదు మనం ఓకే అంటే రేపే (25వ తేదీ) లాస్ట్ డేట్ కదా. ఈరోజు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలి. రేపు 3 గంటల దాకా టైం ఉంది. సీఆర్: సరేలే అన్నా.. నేను వన్ అవర్‌లో కన్ఫామ్ చేస్తా ప.ప్ర: కన్ఫామ్ చేయండి. చెప్పేస్తే మేము వస్తాము. అక్కడికి పోయి నువ్వేమైనా మాట్లాడాలి అనుకున్నా కూడా నేను వాళ్లతో డైరెక్ట్‌గా కూడా మాట్లాడిస్తా. సీఆర్: సరే అన్నా..ఒకే రెండో ఆడియో ప.ప్ర: నామినేషన్ వేసి విత్‌డ్రా చేయకూడదు. సీఆర్: నామినేషన్ వేసినాక ఎందుకు విత్‌డ్రా చేస్తారు ప.ప్ర: వాళ్లు ఎప్పటికైనా ఏ రకంగానైనా హెల్ప్ చేస్తారు. తొక్కాలనుకుంటే తొక్కుతారు రెండూ ఉండాయి వాళ్ల దగ్గర. సీఆర్: అవునులెండి ఉంటాయి మామూలే ప.ప్ర: డబ్బులు ఎంత ఇస్తారనేది కనుక్కుని కన్ఫాం చేస్తాను. సీఆర్: సరేనా.. ఒకే. -
నామినేషన్ల మహాకుట్ర బట్టబయలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకునేందుకు టీడీపీ పాల్పడుతున్న కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు ఇప్పటికే డేటా చోరీకి పాల్పడ్డ టీడీపీ అడ్డంగా బుక్కయిన సంగతి తెలిసిందే. తాజాగా నామినేషన్ల పేరిట టీడీపీ పాల్పడ్డ మహాకుట్ర బట్టబయలైంది. డబ్బును ఎరగా చూపి ప్రజాశాంతి పార్టీ బీ ఫామ్‌లు కొనుగోలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని టీడీపీ నేతలు భావించారు. అందుకోసం ప్రజాశాంతి పేరిట తమకు అనుకూలంగా ఉండే డమ్మీ అభ్యర్థుల చేత నామినేషన్లు వేయించారు. ఏపీలో జరుగుగుతున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల పేర్లను, ఇంటి పేర్లను పోలి ఉన్న వారు పదుల సంఖ్యలో ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరి చేత టీడీపీ నాయకులే నామినేషన్లు దాఖలు చేయించారనడానికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిని సంస్థాగతంగా ఎదుర్కొలేక పోతున్న టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆయన్ని గెలవకుండా చేయడానికి చేసిన కుట్రకు ఆధారాలు లభించాయి. ప్రజాశాంతి తరఫున బీ పామ్ కొనుగోలు చేసి దానిని కె విశ్వనాథ్ అనే వ్యక్తి చేతికి అందజేశారు. ఇందుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గడువుకు ఒక్క రోజు ముందు పయ్యావుల అనుచరుడు పరమేశ్వరరెడ్డి జరిపిన ఫోన్ సంభాషణ వెలుగు చూసింది. విశ్వేశ్వరరెడ్డిని పేరును పోలిన కె విశ్వనాథరెడ్డి అనే వ్యక్తితో పరమేశ్వరరెడ్డి బేరాసారాలకు దిగారు. ఈ ఆడియో టేపుల్లో పరమేశ్వర రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాఫ్టర్ అని, వైఎస్సార్ సీపీ గుర్తు ఫ్యాన్ అని గుర్తులతో పాటు, అభ్యర్థుల పేర్లు కూడా ఒకే మాదిరిగా ఉంటే ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని ఆయన కె విశ్వానాథరెడ్డికి వివరించారు. కేఏ పాల్ నుంచి బీ ఫామ్ డబ్బులకు ఎలా కొనుగోలు చేస్తున్నది కూడా చెప్పారు. పేర్ల పేరిట, గుర్తు పేరిట వైఎస్సార్ సీపీ ఓటర్లను చీల్చడానికి పనిన్న కుట్రను స్పష్టంగా పేర్కొన్నారు. నామినేషన్ వేసిన తర్వాత విత్‌డ్రా చేయకూడదని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా పయ్యావుల ఎదో రకంగా సాయం చేస్తారని ఆశచూపారు. లేదంటే తోక్కెస్తారు అని హెచ్చరించారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కుట్రలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల పోలిన పేర్లతో ప్రజాశాంతి తరఫున నామినేషన్ దాఖలు కావడంపై స్పందించిన కేఏ పాల్ ఏమో కుట్ర జరిగిందేమోనని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సాక్షి ప్రతినిధి దీనిపై ప్రశ్నించగా ఆయన దాటవేసే ప్రయత్నం చేశారు. తన పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల పేర్లు కూడా కేఏ పాల్‌కు తెలువకపోవడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాఫ్టర్, తమ పార్టీ గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉండటం వల్ల ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని వైఎస్సార్ సీపీ నాయకులు ఇదివరకే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తుకు భారీగా ఓట్లు పోలైన సంగతి తెలిసిందే. అయితే ఓటర్లను తికమక పెట్టి ఇతర పార్టీల గెలుపును అడ్డుకోవడానికి కుట్రలు పన్నడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కేశవ్..ఐదేళ్లలో ప్రజల వద్దకు ఎన్నిసార్లు వెళ్లావ్ ?
సాక్షి, కూడేరు: పయ్యావుల కేశవ్..ఈ ఐదేళ్ల పాలనలో ఉరవకొండ నియోజక వర్గంలో ఎన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉన్నావని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. బుధవారం కూడేరు మండల పరిధిలోని అరవకూరు, కమ్మూరు గ్రామాల్లో పయ్యావుల కేశవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండడు. ఏమి అభివృద్ధి చేశాడని చేసిన వ్యాఖ్యలపై గురువారం కూడేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు నిప్పులు చెరిగారు. జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ. ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మాదన్న, జిల్లా కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్‌లు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నీవు ప్రజలకు అందుబాటులో లేవని ఓటుతో ఓడించారన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక రెండేళ్ల పాటు కనిపించకుండా పోయావు. ఎమ్మెల్సీగా ఎంపికయ్యాక కొద్గి రోజులకు నియోజక వర్గ కేంద్రానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నావు. కాని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం, అధికారులతో పోరాటాలు చేశాడని అన్నారు8. ఈ విషయం నియోజకవర్గ ప్రజలందరికి తెలుసన్నారు. నీ మాదిరి ఎమ్మెల్యే గిమ్మిక్కు రాజకీయాలు చేయడన్నారు. కూడేరు మండలంలో ముద్దలాపురం, ఇప్పేరు చెరువులకు నీటి విడుదల కోసం ఎమ్మెల్యే ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసింది తేదీలతో సహా చూపిస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అడ్డంకిగా మారిన నీకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు తోపుదుర్తి రామాంజనేయులు, క్రిష్టప్ప, సంగప్పతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ప్రలోభాల పర్వం..
సాక్షి, ఉరవకొండ: ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. తాయిలాలతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ పథకం వేశారు. ఆదరణ పథకం కింద గతంలోనే మంజూరైన పనిముట్లను, మిషన్లను ఇంతకాలం పంపిణీ చేయకుండా అలానే ఉంచుకున్నారు. వాటిని ఎన్నికల తాయిలాలుగా అందించి ఓట్లు రాబట్టుకోవాలని టీడీపీ నేతలు భావించారు. ఇందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి ఉరవకొండలోని వీరశైవ కల్యాణ మంటపం సమీపంలో గల ప్రభుత్వ గోడౌన్‌కు ఒక లారీ వచ్చింది. అందులోంచి కుట్టుమిషన్లు, చేనేత జాకార్డ్ యంత్రాలు, వాషింగ్ మెషిన్లు, ఐరన్‌బాక్సులు, మోటార్లు వంటివి దించుతుండగా వైఎస్సార్సీపీ నాయకులు బసవరాజు, నిరంజన్‌గౌడ్, వెంకటేష్, లెనిన్, శంకర్, ప్రభాకర్ లు అడ్డుకున్నారు. పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వస్తువులన్నింటిపైనా చంద్రబాబు స్టిక్కర్లు కుడా వేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా వీటిని గోడౌన్లో దింపడం ఏంటని ఎంపీడీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ హనుమంతును ప్రశ్నించారు. తాను ఎంపీడీఓ ఆదేశాల మేరకు వీటిని దింపుతున్నట్లు తెలిపాడు. దీనిపై వెంటనే వైఎస్సార్సీపీ నేతలు కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి, ఉరవకొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. గోడౌన్ సీజ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందిన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. అక్రమంగా దింపుతున్న చేనేత జాకార్డ్ యంత్రాలు 46, కుట్టుమిషన్లు 200, ఇస్త్రీ పెట్టెలు 100, వాషింగ్మెషిన్లు 200, మోటార్లు 400, ఇతర వస్తువులను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, ఎస్ఐ సుధాకర్‌యాదవ్ అధ్వర్యంలో సీజ్ చేశారు. లారీలో ఉన్న చేనేత యంత్రాలను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చేనేత కార్మికులను మభ్యపెట్టడానికి యంత్రాల పంపిణీ జిల్లాలో ధర్మవరం తరువాత ఉరవకొండలో అత్యధిక మంది చేనేతపై ఆధార పడి జీవిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేనేత రుణమాఫీ చేయలేక వైఫల్యం చెందడంతో కార్మికులు టీడీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు. వ్యతిరేకత నుంచి బయటపడేందుకు టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ చేనేత కార్మికులకు జాకార్డ్ యంత్రాలు ఇచ్చి తద్వారా ఓట్లు వేయించుకునేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పాటు పట్టణంలోని కొంతమందికి కుట్టుమిషన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. కోడ్ ఉల్లంఘనే బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఆదరణ పనిముట్లను అర్ధరాత్రి పూట దిగుమతి చేసుకోవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుంది. దీంతో ఫిర్యాదు రాగానే గోడౌన్ సీజ్ చేయించి లారీని పోలీసుస్టేషన్‌కు తరలించాం. దీనిపై ఎంపీడీఓ ఫజుల్ రహిమాన్ వివరణ తీసుకుని తదిపరి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. –శోభా స్వరూపారాణి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి -
‘ఆ ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది’
సాక్షి, అనంతపురం: తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నారని, నాలుగున్నరేళ్లు నిద్రపోయి ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో హడావుడి చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఉరవకొండలో పేదల కాలనీకి పయ్యావుల కేశవ్ పేరు పెట్టడంపై శుక్రవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారాయన. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉరవకొండలో పేదల కోసం 88 ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఒక్క ఎకరా భూమి కూడా అదనంగా కేటాయించలేదని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పేదలకు ఏ పని చేయకపోయినా కాలనీకి తన పేరు పెట్టించుకోవటం.. పయ్యావుల కేశవ్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమంటూ మండిపడ్డారు. ఉరవకొండ రెవెన్యూ కార్యాలయాలను టీడీపీ ఆఫీసుగా మార్చేయటం దురదృష్టకరమన్నారు. -
కేశవ్.. నీటి రాజకీయాలు మానుకో...
అనంతపురం, ఉరవకొండ రూరల్: ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ నీటి రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్సీ చీఫ్‌విప్, వైఎస్సార్సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వై.శివరాంరెడ్డి హితవు పలికారు. కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి చెరువులకు, కుంటలకు నీళ్లిచ్చి రైతులను మభ్యపెట్టడం కాకుండా చేతనైతే జీబీసీ, హెచ్ఎల్సీ ఆయకట్టు రైతులకు సాగునీరు ఇప్పించాలన్నారు. మండల పరిధిలోని జీరోబైజీరో హెడ్ వద్ద జీబీసీ కెనాల్‌ను శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ప్రణయ్కుమార్రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. కెనాల్లో నీటిప్రవాహం తగ్గడం వల్ల వ్యవసాయానికి వచ్చే 300 క్యూసెక్కుల నీటివాటాను సక్రమంగా ఇవ్వకపోవడంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు అందలేదన్నారు. మిరప, పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చేసి జీబీసీ షట్టర్లను ఎత్తి ఎక్కువ నీరు విడుదల చేయడం జరిగిందన్నారు. అనంతరం వారు విడపనకల్, ఉరవకొండకు సంబంధించిన ఆయకట్టు రైతుల సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. శివరాంరెడ్డి మాట్లాడుతూ ముందే ఉరవకొండ, విడపనకల్ మండలాలకు సంబంధించిన చివరి ఆయకట్టు భూములకు నీటిని తప్పనిసరిగా విడుదల చేయాలన్నారు. డిసెంబర్ 15వ తేదీ తర్వాత నీటి విడుదలను నిలిపేస్తే పంటలు ఎండిపోయే పరిస్తితి ఉన్నందున ఆ తర్వాత కూడా కనీసం 20 రోజులు అదనంగా నీరు విడుదల చేసేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు. నాలుగేళ్ల నుంచి చెరువులకు నీరివ్వని పాలకులు నాలుగైదు నెలల్లో ఎన్నికలున్నందున దొంగ ఆర్భాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేశవ్ దొంగ ప్రచారాలు మాని ప్రజలకు పనికి వచ్చే పనులు చేయాలన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉరవకొండలో పేదల ఇళ్లపట్టాల కోసం 88 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తే వాటిని ఇంతవరకు పేదలకు పంచకుండా రాజకీయంగా అడ్డుపడుగున్నారని విమర్శించారు. ఆ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు ఒక్కొక్కరు 5 సెంట్ల చొప్పున ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అధికారపార్టీ నాయకులు రాజకీయాలు మాని ప్రజలకు సేవచేయాలని, లేదంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎర్రిస్వామిరెడ్డి, గోపాల్‌రెడ్డి, దాదు, బసవరాజు, నిరంజన్, ఓబన్న, గోవిందు, వెంకటేశులు, అనుమప్ప, హఫీజ్, ఈడిగప్రసాద్, సత్యన్న, ఓబుళేసు, ఎర్రిస్వామి, రఘు, యువజన విభాగం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సురేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
స్థలం ఉన్నా...పట్టాలిచ్చే నాథుడే లేడు
-
ఆశ..దోశ..అప్పడం..వడ
రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాళ్, రాయదుర్గం, గుమ్మగట్ట, డి.హీరేహాళ్ మండలాల్లో 46 వేల ఎకరాలకు నీరిచ్చే విషయంలో మంత్రి కాలవ శ్రీనివాసులు పూటకోమాట మాట్లాడుతున్నారు. 50 రోజుల్లో మీ పొలాల్లో నీళ్లు పారిస్తామని ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ ఆడంబరంగా ప్రకటించారు. ఆ ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో నీళ్లు వస్తాయని రైతులు ఎంతో ఆశగా క్యాలెండర్ తిరగేయడం మొదలెట్టారు. అయితే మార్చి 3వ తేదీ ఓ బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ 50 రోజుల్లో కచ్చితంగా నీళ్లు పారిస్తామన్నారు. మొదట చెప్పిన 50 రోజులా, ఇప్పటినుంచి 50 రోజులా అనేది రైతులకు అర్థం కాలేదు. ఏప్రిల్ మొదటివారంలో నీళ్లు రాకపోయేసరికి మార్చి 3వ తేదీ నుంచి 50 రోజులు అయి ఉంటుందనుకున్నారు. ఆ ప్రకారం ఏప్రిల్ నాలుగో వారంలో నీళ్లు వస్తాయని మళ్లీ క్యాలెండర్ చూడ్డం మొదలెట్టారు. నీళ్లు రాలేదుగానీ తాజాగా మంత్రి నుంచి శుక్రవారం మరో ప్రకటన వచ్చింది. అదేంటంటే ఆగస్టులో నీరు పారిస్తారంట. దీంతో రైతులు తీవ్ర నిరాశానిస్పృహలు వ్యక్తం చేస్తూ మంత్రి వైఖరి ‘ఆశ.. దోశ.. అప్పడం.. వడ’ అన్నట్లుగా ఉందని ఆవేదన చెందుతున్నారు. కణేకల్లు:రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గంలో సభలు పెట్టిన ప్రతిసారీ ‘అదిగదిగో కృష్ణ జలా లు.. ఇక చూసుకోండి.. మీ పొలాలకు నీరి స్తాం... మీ కష్టాలు తీరుస్తాం’ అంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారేగానీ ఆ దిశగా కనీ సం పనులను కూడా ప్రారంభించలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూపుదిద్దుకున్న హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాళ్, రాయదుర్గం, గుమ్మగట్ట, డి.హీరేహాళ్ మండలాల్లో 46వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. ఆ దిశగా 36వ ప్యాకేజీలో మాల్యం బ్రాంచ్‌కెనాల్ పనులు చేపట్టేం దుకు టీడీపీ ప్రభుత్వం గత ఏడాది రూ.247 కోట్లు మంజూరు చేసింది. ఇం దులో ఉరవకొండ నియోజకవర్గ పరిధి లో పనులకు రూ.110 కోట్లు, రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో పనులకు రూ.137 కోట్లు కేటాయించారు. ఫిబ్రవరి 14వ తేదీ బెలుగుప్ప మండలం దుద్దేకుంట వద్ద మంత్రి కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్సీ చీఫ్‌విప్ పయ్యావుల శ్రీనివాసులుతో కలిసి 36వ ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అదేరోజు హెచ్ఎన్ఎస్ఎస్ ఇంజినీర్లతో కలిసి సొల్లాపురం వద్ద భూములను పరిశీలించారు. మంత్రి కాలవ మాల్యం బ్రాంచ్‌కెనాల్ స్కెచ్లను పాత్రికేయులకు చూపించి 50 రోజుల్లో కృష్ణాజలాలు పారిస్తామని చెప్పారు. తర్వాత మార్చి నెలలో మార్చి 3వ తేదీ సొల్లాపురంలో ఇంటిపట్టాల పంపిణీ సమయంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కచ్చితంగా 50రోజుల్లో కృష్ణాజలాలు అందిస్తామన్నారు. అయితే తాజాగా శుక్రవారం ఆయన జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డితో కలిసి సొల్లాపురం – పెనకలపాడు మధ్య మాల్యం బ్రాంచ్‌కెనాల్ పనులకు మళ్లీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయకట్టుకు ఆగస్టులో నీరిస్తామని చెప్పారు. 50 రోజుల్లో నీళ్లిస్తామన్న మంత్రి 72 రోజుల తర్వాత మళ్లీ అదేపనులకు భూమిపూజ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయకట్టుకు నీరివ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో నియోజకవర్గ ప్రజ లు, రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకే మంత్రి కాలవ ఇలా చేస్తూ వారిని మభ్యపెడుతున్నారని ఇతర పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. -
గతంలో జేపీ.. ఇప్పుడు లక్ష్మీనారాయణ!
సాక్షి, అమరావతి: ఐపీఎస్, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విమరణకు దరఖాస్తు చేసి సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్ర అదనపు డీజీగా ఆయన కొనసాగుతున్నారు. అనంతరం లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రానున్నారన్నని ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎస్ రాజకీయ అరంగేట్రంపై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ స్పందించారు. లక్ష్మీ నారాయణ ఏ పార్టీలో చేరినా, లేక సొంతంగా పార్టీ పెట్టినా ప్రతిపక్షాల ఓట్లు చీల్చుకోవడానికే పరిమితం అవుతారంటూ జోస్యం చెప్పారు. ఆ అధికారి రాజకీయాల్లోకి వస్తే టీడీపీకే లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో జేపీ వల్ల ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీకి నష్టం జరిగిందని, ఇప్పుడు లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చినా ప్రతిపక్షాలకే నష్టం కలుగుతుందన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని పయ్యావుల కేశవ్ అన్నారు. -
పయ్యావుల కేశవ్ చేతగాని దద్దమ్మ
అనంతపురం : ‘చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కారణమైన అనంత జిల్లాను పూర్తిగా విస్మరించారు. నీళ్లివ్వమంటే మోసపూరిత మాటలు చెప్తున్నారు.. మహానేత వైఎస్ పట్టుదలతో శ్రీశైలం నుంచి జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లొచ్చాయి.. టీడీపీ వాళ్లు ఒక అడుగు కూడా నీరు ఇవ్వలేకపోయారు ఉరవకొండ నియోజవర్గానికి నీళ్లు ఎలా ఇవ్వరో చూస్తాం’ అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఆయకట్టుకు హంద్రీ–నీవా నీరివ్వాలనే డిమాండ్‌తో తొమ్మిది రోజులు తలపెట్టిన ‘జల సంకల్పయాత్ర’ గురువారం బెళుగుప్ప మండలం గుండ్లపల్లి నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. అనంతరం బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. చంద్రబాబు మోసపు మాటలు ఏవిధంగా ఉన్నాయో తెలియజేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. నీరివ్వకుంటే వేలాది మంది రైతులతో పాదయాత్ర చేసి చంద్రబాబు బండారం బయట పెడతాం. వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు లేకుండా చేస్తాం. 2004లో సీఎం అయిన ఏడాదికే వైఎస్ ఉరవకొండకు వచ్చి హంద్రీ–నీవా పథకానికి శంకుస్థాపన చేసి జీడిపల్లి వరకు రూ. 2,300 కోట్లు ఖర్చు చేశారు. రెండోదశ కూడా దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు వచ్చే నాటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. నాలుగేళ్లలోనే వైఎస్ అంత గొప్ప పనులు చేస్తే చంద్రబాబు మాత్రం జీడిపల్లి నుంచి గుండ్లపల్లికి నీరు తీసుకురాలేకపోయారు. రాష్ట్రం విడిపోయిన నాటికి రూ. 90 వేల కోట్లు అప్పులుంటే ఈ మహానుభావుడు వచ్చిన నాలుగేళ్లలోనే రూ.2.20 లక్షల కోట్లకు అప్పులు పెంచేశారు. -
ఆ డబ్బు ఏంచేశారు పవన్..?
సాక్షి, విజయవాడ: దక్షిణాదిలో బిజెపి ఎదుగుదలను కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని, దీనిలో మిత్రపక్షంగా వున్న టీడీపీ భాగస్వామ్యం కావడం బాధాకరమని బీజేవైఎం జాతీయ కార్యవర్గసభ్యుడు ఎన్. రమేష్ నాయుడు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కియా మోటార్స్ ఏర్పాటైన ప్రాంతంలో రైతుల భూములను టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు రాయలసీమ ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు. ‘కర్ణాటక, ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారు అధికంగా వున్న చోట్ల తమ పార్టీ నష్టపరిచేందుకు కుట్ర జరుగుతోంది. కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీలో జేఎఫ్‌సీలో అవుట్‌డేటెడ్ నేతలు, స్వయం ప్రకటిత మేథావులు వున్నారు. జేఎఫ్సీ నివేదిక కోసం నిర్వహించిన సమావేశం ఫార్స్. గతంలో పవన్ కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే వేదిక ఏర్పాటు చేసి, కోటి రూపాయలు కేటాయించినట్టు ప్రకటించారు. ఈ ఫోర్స్ ఏమయ్యింది? ఆ డబ్బు ఏం చేశారు? రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై పవన్ వైఖరి ఏమిటి? సీమ గోడు పవన్‌కు పట్టదా? పరిశ్రమలు పెట్టే ప్రాంతాల్లో రైతుల నుంచి టీడీపీ నేతలు భారీ కొనుగోళ్లు చేస్తున్నారు. కియా మోటార్స్ ప్రాంతంలో పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్ భూములు కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంలోని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. సుమారు రెండు వందల కోట్ల విలువైన భూములు ఈ రకంగా తీసుకున్నారు. దీనిపై అన్ని ఆధారాలు మా వద్ద వున్నాయి. రైతులను భయపెట్టి 275 ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి, భూములను రైతులకు ఇప్పించాల’ని రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. -
కేశవ్.. రైతులపై కక్ష సాధింపా?
ఉరవకొండ: ‘‘ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట.. పదిరోజుల్లో ఇంటికి చేరేది.. ఆ లోపే బూదగవి చెరువు కోసమంటూ నీళ్లొదిలారు. చెరువు నిండడం ఏమోగానీ.. ఆ నీరంతా పొలాల్లో చేరడంతో రైతులు నిండా మునిగారు. లక్షలాది రూపాయల నష్టం జరిగింది.. ఓ ఎమ్మెల్సీకి ఆమాత్రం తెలియదా..? రైతుల కడుపుకొట్టడమే పయ్యావుల కేశవ్ నైజం’’ అంటూ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. బుధవారం బూదగవి వద్ద చెరువుకు సమీపంలో నీటమునిగిన పప్పుశనగ పంటలను ఆయన పరిశీలించారు. వందల ఎకరాల్లో సాగుచేసిన పంట హంద్రీనీవా నీటితో మునిగిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయిందని రైతులు ఎమ్మెల్యే ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓ దార్చిన ఎమ్మెల్యే అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్ల తర్వాత పంట బాగా పడిందని రైతులంతా సంతోషించారనీ, ఎకరాకు కనీసంగా రూ.50 వేల వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో హంద్రీనీవా నీళ్లు వదలాలని ఎమ్మెల్సీ కేశవ్ ఆదేశించడం దుర్మార్గమన్నారు. తమ మాట వినడం లేదనే రైతులపై కక్షట్టి పయ్యావుల కేశవ్ చేతికొచ్చిన పంటలను నీటిపాలు చేశారన్నారు. నీరువదులుతున్నట్లు తెలిసి తాను వారం క్రితమే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రోజులు నీటి సరఫరా నిలపాలని కోరానన్నారు. కానీ కేశవ్ అధికారులు, పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేసి రైతులను దెబ్బతీయాలన్న కుట్రతో చెరువుకు నీళ్లు వదిలించారన్నారు. అధికారులు ఇప్పటికైనా నీటి సరఫరా ఆపితే కనీసం 50 ఎకరాల్లోని పంట అయినా రైతులకు దక్కే అవకాశం ఉందన్నారు. లేని పక్షంలో రైతులతో కలిసి అధికారులపై హైకోర్టులో కేసు వేస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ సభ్యుడు తిప్పయ్య, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ తేజోనాథ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, ప్రధాన కార్యదర్శి ఈడిగ ప్రసాద్, కిసాన్ సెల్ నాయకుడు కాకర్ల నాగేశ్వరావు, మాన్యం ప్రకాష్, దుద్దేకుంట రామాంజినేయులు, మూలగిరిపల్లి ఓబన్న, గోవిందు, ఆంజినేయులు, రాయంపల్లి ఎర్రిస్వామిరెడ్డి, విడపనకల్లు మండల కన్వీనర్ బసన్న, గడేకల్లు పంపాపతి పాల్గొన్నారు. -
టీడీపీలో అసంతృప్తి జ్వాలలు
సాక్షి, అమరావతి: శాసనసభ, శాసన మండలిలో చీఫ్ విప్‌లు, విప్ల నియామకంపై తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేవలం రెండు, మూడు జిల్లాలకే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా తమను పట్టించుకోవడంలేదని ఈ పదవులను ఆశించి భంగపడ్డ నేతలు వాపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎన్నడూలేని విధంగా విప్ పదవులు ఎక్కువ ఇచ్చినా కొన్ని జిల్లాలకే అవన్నీ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగే కేసీఆర్‌తో మంతనాలు జరిపిన పయ్యావుల కేశవ్ తీరు బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకే మండలి చీఫ్ విప్ పదవి ఇవ్వడం, తెరవెనుక రాజకీయాలను తేటతెల్లం చేస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీలో ఇప్పటికే నలుగురు విప్లుండగా మరో ఇద్దరిని నియమించనున్నారు. ఈ రెండు పదవులు విశాఖ జిల్లాకే చెందిన గణబాబు (విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే), కిడారి సర్వేశ్వరరావు (అరకు ఎమ్మెల్యే)లకు ఇస్తుండడంపై టీడీపీలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే జిల్లాకు చెందిన వారికి రెండు పదవులు ఎలా ఇస్తారని అసంతృప్త నేతలు ప్రశ్నిస్తున్నారు. అందులోనూ ఎప్పటినుంచో పార్టీలో ఉన్న తమను కాదని వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన కిడారి సర్వేశ్వరరావుకు విప్ పదవి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బయట పార్టీ నుంచి వచ్చిన వారిని అందలమెక్కిస్తూ తమను పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఒకే జిల్లాకు రెండు చీఫ్ విప్లా? అసెంబ్లీ, మండలి చీఫ్ విప్ పదవులు రెండూ అనంతపురం జిల్లాకు చెందిన పల్లె రఘునాథ్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌లకు ఇస్తుండడంపై సొంత పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక జిల్లాకు చెందిన వారికే రెండు ముఖ్యమైన పదవులు గతంలో ఎప్పుడూ ఇవ్వలేదని వాపోతున్నారు. అసెంబ్లీ చీఫ్‌విప్‌గా గతంలో అదే జిల్లాకు చెందిన కాల్వ శ్రీనివాసులు ఇచ్చారని, ఈసారి వేరే జిల్లా వారికి అవకాశం ఇవ్వకుండా మళ్లీ అదే జిల్లా ఎమ్మెల్యేకు ఆ పదవి ఇవ్వడం ఏమిటని భంగపడ్డ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు చీఫ్‌విప్ పదవులతో పాటు అసెంబ్లీలో మరో విప్ యామినీ బాల కూడా అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కావడం గమనార్హం. నిరాశలో నేతలు... అసెంబ్లీ చీఫ్ విప్ పదవి వస్తుందని ఆశించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిరాశకు లోనయ్యారు. మంత్రివర్గ విస్తరణలోనే తనకు అవకాశం వస్తుందని ఎదురు చూసినా చంద్రబాబు మొండిచేయి చూపడంతో అప్పట్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసి కాపుల గొంతు కోశారని వ్యాఖ్యానించారు. ఈసారి చీఫ్ విప్ పదవైనా వస్తుందని ఆశించినా అదీ రాకపోవడంతో లోలోన రగిలిపోతున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన కాగిత వెంకట్రావు కూడా ఈ పదవిని ఆశించి భంగపడ్డారు. మండలి చీఫ్ విప్ పదవిపై వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆశలు పెట్టుకున్నా ఆయనకు షాక్ ఇచ్చి పయ్యావులను నియమించాలని నిర్ణయించడం సరికాదనే వాదన టీడీపీలో వినిపిస్తోంది. పరిటాల సునీత కుమారుడి వివాహానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రాసుకుపూసుకు తిరిగారని కేశవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఆయనకే చీఫ్ విప్ పదవి కట్టబెట్టడం ఏమిటని పార్టీలోని సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. -
చీఫ్ విప్‌లుగా పల్లె, పయ్యావుల..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి నియమితులయ్యారు. శాసన సభలో ఇప్పటికే నలుగురు ఉన్న విప్‌లకు అదనంగా మరో ఇద్దరికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే అసెంబ్లీ విప్‌లుగా గణబాబు, సర్వేశ్వరరావు, ఇక శాసనమండలి చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, విప్‌లుగా బుద్దా వెంకన్న,డొక్కా మాణిక్య వరప్రసాద్, రామసుబ్బారెడ్డి, షరీఫ్‌ల నియామకం జరిగింది. నియామకానికి సంబంధించిన బుధవారం జీవో విడుదల అయింది. కాగా పల్లె రఘునాథరెడ్డి తొలిసారి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో ఓడిపోయారు. ఆ తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 2009, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో సమాచార, పౌరసంబంధాలు, మైనార్టీ, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ ఏడాదిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి కోల్పోయారు. ఇప్పుడు తిరిగి చీఫ్ విప్‌గా ఎంపికయ్యారు. మరోవైపు పయ్యావుల కేశవ్ తొలిసారి 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో ఓటమిపాలయ్యారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2014లో ఓటమి చవిచూశారు. 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఆశపడ్డారు. అప్పుడు కూడా చంద్రబాబు మొండిచేయి చూపారు. దీంతో కేశవ్ తీవ్ర నిరాశ చెందినా.. చివరకు మండలి చీఫ్‌విప్ పదవిని కట్టబెట్టారు. -
‘రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నన్ను బాధించాయి’
-
‘రేవంత్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి’
సాక్షి, అనంతపురం : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. రెండురోజుల క్రితం పయ్యావుల కేశవ్‌పై రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పయ్యావుల సోమవారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...‘ రేవంత్ వ్యాఖ్యలపై స్పందించాలా? లేదా? అనే సంగిద్ధంలో పడ్డా. స్పందించపోతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే మాట్లాడుతున్నా. 25 ఏళ్లుగా పార్టీ ఎజెండానే నా ఎజెండాగా పనిచేశా. పార్టీకి నష్టం చేకూర్చే పని నేనెప్పుడు చేయలేదు. రేవంత్ ఆరు నెలలుగా చేస్తున్న ఢిల్లీ పర్యటన వివరాలు నా దగ్గర ఉన్నాయి. అయినా నేను స్పందించలేదు. కాంగ్రెస్‌లో చేరిక ఊహాగానాలపై నాకు తెలుసు....కానీ ఇప్పుడు మాట్లాడను. రేవంత్‌కు చంద్రబాబు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. వ్యక్తిగత ఎజెండా కోసమే పనిచేసే వ్యక్తి రేవంత్. అలాంటి రేవంత్ నాకో, యనమల రామకృష్ణుడికో సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఫస్ట్ మాట్లాడింది నేనే. ప్రభుత్వం నుంచి ఇబ్బందులుంటాయని ఆయన బెయిల్ కోసం తిరిగాం. కేసీఆర్‌కు, నాకు సంబంధాలు అంటగట్టడం దుర్మార్గం. పరిటాల కుటుంబానికి, నాకు తెలంగాణలో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. నేను తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి కాంట్రాక్ట్‌లు పొందలేదు. మర్యాదపూర్వకంగా కేసీఆర్‌ను కలిస్తే తప్పా?. కావాలనే ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు చేసిన కుట్ర’ అని వ్యాఖ్యానించారు. బార్‌కు, బీర్ కంపెనీకి తేడా తెలియదా? తన మేనల్లుడు, నలుగురు స్నేహితులు కలిసి ప్రారంభించిన చిన్న వ్యాపారాన్ని రేవంత్ రెడ్డి రాజకీయంగా వాడుకోవడం సరికాదని పయ్యావుల మండిపడ్డారు. వాళ్లలో పరిటాల బంధువులు ఎవరో తనకు తెలియదన్నారు. రేవంత్...బార్‌కు, బీర్ కంపెనీకి తేడా తెలియని వ్యక్తి కాదంటూ... తనకు హైదరాబాద్‌లో బార్ మాత్రమే ఉందని, అదికూడా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే వచ్చిందే అని అన్నారు. తన వ్యాపారాల కంటే ఆయన వ్యాపారాల గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు. కేసీఆర్ కూతురు కవితో కలిసి రేవంత్ వ్యాపారం చేసింది నిజం కాదా అని నిలదీశారు. సన్నిహితుల ఒత్తిడితో వ్యాపారం నుంచి బయటకు వచ్చింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఒక పెళ్లిలో జరిగిన యాదృశ్చిక ఘటనను సొంత ప్రయోజనాల కోసం రేవంత్ వాడుకోవడం సరికాదన్నారు. కేసీఆర్‌ను కలిస్తే ఇంత యాగీ చేస్తారా?. నా గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదు. మొదట బీజేపీ, తర్వాత టీఆర్ఎస్, ఇప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ ...రేపు ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు అని పయ్యావుల ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఏపీ టీడీపీపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
-
ఏపీ టీడీపీపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
ఏపీ టీడీపీపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : దీపావళికి ఒకరోజు ముందే తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి థౌజండ్ వాలా పేల్చారు. ఏపీ టీడీపీ నేతలే టార్గెంట్‌గా మాటల రాకెట్లు పేల్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇక్కడి టీడీపీ నేతలను జైల్లళ్లో పెడుతుంటే.. ఏపీ టీడీపీ నేతలు మాత్రం ఆయనకు వంగివంగి దండాలు పెట్టడం ఎంతవరకు సమయంజసమని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును టీ నేతలు పట్టించుకున్నారా? : ‘‘కేసీఆర్ ఏపీ మంత్రి పరిటాల ఇంట్లో పెళ్లికి వెళ్లినప్పుడు ఆయనకు ఏపీ టీడీపీ నేతలు వంగివంగి దండాలు పెట్టారు. అదే, చంద్రబాబు.. సీతక్క ఇంట్లో పెళ్లికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ మంత్రులుగానీ, నాయకులుగానీ ఏపీ సీఎంను పట్టించుకున్నారా? ఇది టీడీపీ నేతల అత్యుత్సహప్రదర్శనకాదా! ఏపీలో పయ్యావుల కేశవ్‌ను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. ఆయన గురించి నేను మాట్లాడేది ఏముంటుంది?’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. యనమలకు కేసీఆర్ రూ.2వేల కోట్లు : ఏపీ టీడీపీ సీనియర్ నేత, మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మధ్య ఆర్థిక సంబంధాలున్నాయని రేవంత్ వ్యాఖ్యానించారు. ‘‘యనమలకు కేసీఆర్ రూ.2000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. అందుకే కేసీఆర్‌పై ఈగవాలనీయకుండా యనమల చూసుకుంటారు. ఏపీ టీడీపీ నేతలు.. అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టేవారిలా తయారయ్యారు.’’ అని రేవంత్ అన్నారు. తెలంగాణలో పార్టీలు లేవు : ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పార్టీలంటూ లేవని, సీఎం కేసీఆర్, ఆయనపై వ్యతిరేకులు మాత్రమే ఉన్నారని రేవంత్ అన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణకు తాను నాయకత్వం వహిసస్తానని చెప్పుకొచ్చారు. పలు ఉద్యమాల నుంచి మొన్నటి సింగరేణి ఎన్నికల దాకా కాంగ్రెస్ పార్టీతో కలిసి తాము పనిచేశామని గుర్తుచేశారు. చంద్రబాబు మాకు స్వేచ్ఛ ఇవ్వాలి : ‘‘స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకునే స్వేచ్ఛను చంద్రబాబు మాకు ఇవ్వాలి. ఒకవేళే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు కాంగ్రస్‌తో కలిస్తే తప్పేంటి? విదేశీ పర్యటన నుంచి చంద్రబాబు తిరిగొచ్చిన వెంటనే ఆయనను కలుస్తా. టీఆర్ఎస్లో టీటీడీపీ విలీనం లేదా పొత్తు వ్యవహారంపై బాబు చెప్పే మాటను బట్టి నేను నిర్ణయం తీసుకుంటా’’ అని రేవంత్ వెల్లడించారు. అందుకే దత్తాత్రేయ మంత్రి పదవి తొలిగించారు : తెలంగాణలో బీజేపీ లేదు కనుకనే బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలిగించారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఏపీలో కూడా పొత్తు ఉండబోదని బీజేపీ తేల్చిచెప్పింది. మరలాంటప్పుడు తెలంగాణలో పార్టీని ఎలా కాపాడుకోవాలనేదానిపై టీడీపీకి స్పష్టత ఉండాలికదా అని వ్యాఖ్యానించారు. -
టీడీపీలో తీవ్ర చర్చనీయాంశం
అనంతపురం: మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ వివాహ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. ఏకాంతంగా 15 నిమిషాల సేపు వారిద్దరూ మాట్లాడుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆదివారం వివాహ వేడుకలో దాదాపు 30 నిమిషాల పాటు గడిపిన కేసీఆర్.. ఆపై 15 నిమిషాలు కేశవ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడారు. అనంతరం కల్యాణ మండపం నుంచి హెలిప్యాడ్‌కు తిరిగి వెళ్తుండగా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఎదురు పడ్డారు. కేసీఆర్‌కు కేశవ్ నమస్కారం చేయగా.. కేసీఆర్ ప్రతి నమస్కారం చేసి ముందుకు సాగారు. ఆ వెంటనే కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి కేశవ్ వద్దకు వచ్చి సీఎం గారు పిలుస్తున్నారని చెప్పారు. దీంతో కేశవ్.. కేసీఆర్ ఉన్న చోటుకు వెళ్లారు. దాదాపు 15 నిమిషాల పాటు ఇద్దరూ ప్రత్యేకంగా మాట్లాడారు. సీఎం వ్యక్తిగత సిబ్బంది వారి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా కేసీఆర్ వారించినట్లు తెలుస్తోంది. అనంతపురం ఇన్చార్జి మంత్రిగా కేసీఆర్ మూడేళ్లపాటు గతంలో కొనసాగారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పయ్యావుల కేశవ్ ఉండేవారు. ఈ సాన్నిహిత్యంతో ఇద్దరూ ఏకాంతంగా చర్చలు సాగించినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల నేపథ్యంలో తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాలపై ఇద్దరూ ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. చివరగా ‘హైదరాబాద్‌లో కలుద్దాం’ అని కేసీఆర్ వెళ్లిపోయినట్లు తెలిసింది. వివాహ వేడుకకు హాజరైన పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలతో కేసీఆర్‌కు మంచి పరిచయాలు ఉన్నాయి. అయితే వారెవ్వరితో కాకుండా పయ్యావులతో మాత్రమే ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. వారేం మాట్లాడారో అని టీడీపీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. -
ఇది దుర్యోధన.. దుశ్శాసన రాజ్యం
ప్రశ్నిస్తే చితకబాదుడే.. తాలిబన్ల పాలనను మరిపిస్తున్న బాబు సర్కారు కూడేరు (ఉరవకొండ)/ సాక్షి, అమరావతి : అసలే కంటి చూపు సరిగా లేని మహిళ.. పుట్టెడు కష్టాలతో ఒంటరిగా జీవిస్తోంది.. తన ఇంటి ఎదురుగా నీటి తొట్టె నిర్మాణం వద్దని చెప్పడమే పాపమైపోయింది.. ఆ మాత్రం దానికే ఊగిపోతూ.. కింద పడేసి, చెప్పు కాళ్లతో ఎగిరి తంతుంటే విడిపించడానికి ఎవరూ సాహసించలేదు. జుట్టు పట్టి ఈడుస్తుంటే సినిమా చూస్తున్నట్టు చూశారే తప్పించి వారి గూండాగిరీని ఎవరూ ఎదిరించలేక పోయారు. ‘కాపాడండయ్యా.. నేనేం తప్పు చేశాను.. ఏమిటీ అన్యాయం’ అని ఆ మహిళ నిస్సహాయంగా విలపించడం అరణ్య రోదనే అయ్యింది. ‘మరో 50 ఏళ్లు ఈ రాష్ట్రంలో మనమే అధికారంలో ఉండాలి.. ఎప్పుడూ మనమే అధికారంలో ఉంటేనే బావుంటుంది.. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు.. ఈ దిశగా ప్రతి టీడీపీ నేత, కార్యకర్త కృషి చేయాలి.. అధికారులు కూడా మన మాటే వింటారు.. అలా ఎవరైనా వినకపోతే నే చూసుకుంటా’ అని సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొద్ది రోజుల క్రితం పదే పదే నొక్కి చెప్పడంతో రాష్ట్రం రావణకాష్టంగా మారుతోంది. ప్రశ్నించిన వారి నోరు నొక్కేస్తూ.. కాదు కూడదన్న వారిపై బహిరంగ దాడులకు తెగిస్తూ తాలిబన్ల పాలనను తలపిస్తున్నారు. ఇసుక మొదలు భూముల వరకు వారి కన్ను పడిందంటే చాలు వశమయ్యేందుకు ఎంతకైనా బరితెగిస్తున్నారు. మొన్న అధికారిణి వనజాక్షిపై దాడి.. నిన్న జీతం పెంచండన్న అంగన్వాడీలపై జులుం.. నేడు ఉరవకొండ నియోజకవర్గంలో అరాచకం.. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజక వర్గం కూడేరు మండలంలో టీడీపీ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ వర్గీయులు ఓ మహిళపై దాడి చేసిన తీరు కలకలం రేపింది. ఒంటరి మహిళను నడిరోడ్డుపై చెప్పుకాళ్లతో ఎగిరెగిరి తంతుంటే నిస్సహాయతతో విలవిల్లాడిపోయింది. జాతీయ రహదారి పక్కన, మిట్ట మధ్యాహ్నం.. అందరూ చూస్తుండగానే ‘మేం చెప్పినా వినవా.. లం.. ముం...’ అంటూ పత్రికల్లో రాయలేని పదజాలంతో దూషిస్తూ దాడి చేసిన దృశ్యాలు బుధవారం టీవీ చానళ్లలో వీక్షించిన వారు ‘అయ్యో.. ఏమిటీ దారుణం.. ఎంత అధికారంలో ఉంటే మాత్రం మరీ ఇంత బరి తెగింపా.. అడ్డుకునే వారే కరువయ్యారే.. ఈ అరాచకానికి అడ్డుపడేదెప్పుడు’ అంటూ తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఇంత జరిగితే.. ‘అయ్యా.. న్యాయం చేయండ’ని బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే నిందితులను పిలిపించి బెయిల్ ఇచ్చి పంపించే శారు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. కూడేరు మండలం జల్లిపల్లికి చెందిన సుధమ్మకు కంటి చూపు సరిగా లేదు. నాలుగేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. సంతానం లేదు. తల్లి ద్రాక్షాయణమ్మ నాలుగు నెలల క్రితం మృతి చెందింది. సోదరుడు రాంభూపాల్రెడ్డికి మానసిక స్థితి సరిగా లేదు. తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆదివారం అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన పంచాయతీ తరఫున పశువులకు తాగునీటి తొట్టె నిర్మించేందుకు తెలుగుదేశం పార్టీ నేత, సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర సిద్ధమయ్యారు. తన ఇంటి ముందు కాకుండా కొంచెం పక్కన తొట్టె నిర్మించుకోవాలని సుధమ్మ కోరింది. అంతే.. మాకే అడ్డు చెబుతావా.. అంటూ ఆగ్రహించిన వారిద్దరూ ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా అందరి ముందు దుర్భాషలాడారు. తలోచేయి పట్టుకుని కింద పడేశారు. అంతటితో ఆగకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. సర్పంచ్ నాగరాజు చెప్పుకాళ్లతో ఎగిరి తన్నగా.. చంద్ర చేతితో కొట్టాడు. అధికారానికి ‘ఖాకీ’ దాసోహం ఓ మహిళపై ఇంతగా దౌర్జన్యం చేసి దాడికి పాల్పడితే బాధితుల పక్షాన ఉండాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలికారు. దాడి జరిగిన రోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేందుకు భయపడిన సుధమ్మ.. ఆ మరుసటి రోజు కూడేరు పోలీసులను ఆశ్రయించింది. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసింది. నిందితులపై సెక్షన్ 323, 354, 355 కింద నామమాత్రంగా కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన కాసేపటికే పోలీస్‌స్టేషన్ నుంచి గ్రామానికి చేరుకుని వారు మీసం మెలేశారు. కనీసం గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేయలేదు. కౌన్సెలింగ్ నిర్వహించిన దాఖలాలూ లేవు. ‘ఏ నిమిషంలో ఏం జరుగుతుందో భయంగా ఉంది. వారిద్దరి నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఉన్నతాధికారులు నాకు రక్షణ కల్పించాలి. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేద’ని బాధితురాలు సుధమ్మ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వాట్సప్‌లో దాడి దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై జల్లిపల్లికి చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం అండతో జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర ఆగడాలకు అడ్డే లేకుండా పోతోందని, ప్రతి చిన్న విషయానికి గొడవలకు దిగుతుంటాడని తెలిపారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై దాడి జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు చేశామని ఆత్మకూరు సీఐ శివనారాయణస్వామి చెప్పారు. నిందితులపై చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం చూసీ చూడనట్టు వ్యవహరించబట్టే.. ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసినప్పుడు సీఎం చంద్రబాబే ఆయన్ను కాపాడారు. దీంతో గ్రామ స్థాయిలోనూ అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు ఎక్కువ య్యాయి. సీఎంకు చిత్తశుద్ది ఉంటే జల్లిపల్లిలో మహిళపై దాడి చేసిన సర్పంచ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మానవ హక్కుల సంఘం, జిల్లా జడ్జీలు సుమోటోగా కేసు నమోదు చేయాలి. – బీశెట్టి బాబ్జీ, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు దౌర్జన్యాలు మితిమీరాయి తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. మహిళను నడిరోడ్డుపైనే కొట్టారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాధితురాలికి రక్షణ కల్పించాలి. నిందితులను కఠినంగా శిక్షించకపోతే ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తాం. – సుశీలమ్మ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, అనంతపురం బెయిలబుల్ కేసు ఎలా పెడతారు? అధికార పార్టీ దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. జల్లిపల్లిలో మహిళపై దాడి ఘటనలో నిందితులపై బెయిలబుల్ కేసులు ఎలా పెడతారు? నిందితులకు అంత తొందరగా స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అధికార పార్టీ నాయకులకు పోలీసులే భయపడుతున్నారు.పోలీసులపై తిరగబడాల్సిన రోజు రాకుండా చూసుకోవాలి. – హరినాథరెడ్డి, న్యాయవాది, ఏపీసీఎల్సీ జిల్లా అధ్యక్షుడు, అనంతపురం -
'అనంత'లో టీడీపీ నేతల దాష్టీకం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నిత్యం ఏదో ఓ ప్రాంతంలో సామాన్య ప్రజలను, తమకు ఎదురొస్తే పార్టీలోని చిన్న నేతలపై, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులపై సైతం దాడులకు వెనుకాడటం లేదు. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులు వీరంగం సృష్టించారు. సమస్యలపై ప్రశ్నించినందుకు సుధ అనే మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కూడేరు మండలం జల్లిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర మహిళపై దాడిచేస్తూ కాళ్లతో తన్ని హింసించారు. వీరంతా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అనుచరులని సమాచారం. సమస్యపై ప్రశ్నించినందుకే సుధ అనే మహిళను అందరూ చూస్తుండగానే దాడి చేసిన వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదు. దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపివేశారు. దీంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. -
'అనంత'లో టీడీపీ నేతల దాష్టీకం
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పయ్యావుల ఫైర్
వాళ్లు పొద్దు తిరుగుడు పువ్వులు లాంటివాళ్లు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే చేరుతారు కళ్యాణదుర్గం (అనంతపురం): అధికారం కోసం కొందరు పొద్దుతిరుగుడు పువ్వుల్లాంటి రాజకీయ నాయకులు వస్తుంటారని, వారి పట్ల పార్టీ పెద్దలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సూచించారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి చేరే వారున్నారని పరోక్షంగా టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాంటి నాయకులతో టీడీపీకి ఇబ్బందులు రావొచ్చని హెచ్చరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్‌యార్డులో సోమవారం నిర్వహించిన టీడీపీ జిల్లా మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. జాతీయ పార్టీ బీజేపీ కన్నా టీడీపీనే కేంద్రాన్ని శాసించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ... ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని, లేనిపక్షంలో కేంద్రంలోని బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ రాష్ట్ర పరిశీలకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా.. మినీ మహానాడు నుంచి మధ్యలోనే నిష్ర్కమించారు. దీంతో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, కందికుంట వెంకట ప్రసాద్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. -
కొత్త అంశాలు తెరపైకి..
► ముస్కు మహేందర్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌పై గతంలోనే చీటింగ్ కేసులు ► కాంతం స్వప్న ఎవరో నాకు తెలియదన్న ఏఎస్సై మోహన్‌రెడ్డి ► ఆధారాలపై ఇంటెలిజెన్స్ ఆరా! కరీంనగర్ క్రైం : ఏఎస్సై మోహన్‌రెడ్డి ఉదంతంలో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. నాలుగు నెలల అనంతరం మోహన్‌రెడ్డి గురువారం మీడియా ముందుకు రావడం... ఇన్నాళ్లూ బాధితులుగా పేర్కొంటున్నవారు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని పోలీసులు దృష్టి సారించాలని మోహన్‌రెడ్డి పలు ఆధారాలు చూపడం సంచలనం సృష్టించింది. తనపై నమోదైన పలు కేసుల్లో బాధితులు, ఫిర్యాదు చేసినవారు ఎవరో కూడా తనకు తెలియదని ఆయన పేర్కొనడం గమనార్హం. అన్ని విషయాలపై ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచ్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ► మోహన్‌రెడ్డి వెల్లడించిన అంశాల్లో బాధితుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న ముస్కు మహేందర్‌రెడ్డి తన కుటుంబానికి చెందిన భూమికి నాటి మార్కెట్ ధర కన్నా ఎక్కువగా రూ.43 లక్షలు అప్పుగా తీసుకుని రెండేళ్లపాటు చెల్లించకపోతే వారి కుటుంబసభ్యులు వచ్చి భూమిని అమ్మిపెట్టమని అడిగారని, అప్పటి మార్కెట్ ధర చెల్లించి తన తండ్రి ఆదిరెడ్డి కొనుగోలు చేశారని తెలిపారు. మహేందర్‌రెడ్డి మాత్రం తాను రూ.5 లక్షలు మాత్రమే అప్పు తీసుకున్నానని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని మోహన్‌రెడ్డి ఆరోపించారు. దీంతోపాటు మహేందర్‌రెడ్డిపై హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఆగస్టు 27న ఫోర్జరీ కేసు, క్రైం నంబర్ 212/2015 నమోదైందని తెలిపారు. అక్రమంగా భూమిని దున్నినందుకు కోహెడ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ► కరీంనగర్‌వాసి పయ్యాల పెద్దిరెడ్డి ఇంతకు ముందు చైతన్యపురికాలనీకి చెందిన భీమనాథుని అనురాధ అనే మహిళకు మొదట భూమి విక్రయించాడని, తర్వాత ధర పెరగగానే తప్పుడు పత్రాలు సృష్టించి ఇబ్బందులు పెడుతున్నాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో 2012 ఆగస్టు 21న కరీంనగర్ టూటౌన్లో కేసు నమోదైందని, లోక్‌సత్తా నాయకుడినని చెప్పుకుంటూ తన నుంచి డబ్బులు వసూలు చేయడానికే ఈ ధర్నాలు చేస్తున్నాడని మోహన్‌రెడ్డి ఆరోపించడం చర్చనీయాంశమైంది. ► బోగ లక్ష్మి సైతం తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందని, మొదట భూమి వేరేవారికి విక్రయంచి, రెండు నెలలు గడవకుండానే తన తండ్రికి విక్రయించిందని, దీంతో మొదట కొన్న వ్యక్తి ఆమెతోపాటు తన తండ్రిపైనా కేసు వేశాడని, జగిత్యాలలో ఇంకా నడుస్తోందని మోహన్‌రెడ్డి ఆధారాలు చూపించారు. లక్ష్మి గతంలో సీఎం, డీజీపీ, సీఐడీ అధికారులకు సైతం ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారించి నిబంధనల ప్రకారమే కొనుగోలు చేశారని క్లీన్చిట్ ఇచ్చినట్లు అతడు వెల్లడించగా, నిజానిజాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ► తనపై ఫిర్యాదు చేసిన కాంత స్వప్న ఎవరో కూడా తనకు తెలియదని, ఆమె 2015 ఆగస్టు 31న పలువురిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిందని, తాను అరెస్టు కాగానే అందులోంచి ఒకరిని తన బినామీగా పేర్కొంటూ మళ్లీ కొత్తగా ఫిర్యాదు చేసిందని, ఆమె ఎవరో కూడా తనకు తెలియదని మోహన్‌రెడ్డి పలుమార్లు పేర్కొనడంతో పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారని సమాచారం. ఎస్బీ ఆరా! తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని మోహన్‌రెడ్డి మీడియా ముఖంగా పేర్కొనడంతో ఈ ఉదంతంపై ఎస్బీ, ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. మీడియా సమావేశంలో ఆయన పలు డాక్యుమెంట్లతో ఆధారాలు చూపించగా, వాటిపైనా విచారణ చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. మొత్తానికి బాధితులుగా చెప్పుకుంటున్న పలువురిపై మీడియా ముఖంగా మోహన్‌రెడ్డి ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించగా, విచారణలో ఏం వెలుగుచూస్తుందోనని ఉత్కంఠగా మారింది. స్వాగతించిన లోక్‌సత్తా కరీంనగర్ క్రైం : న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఏఎస్సై మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనను లోక్‌సత్తా ఉద్యమ సంస్థ స్వాగతించింది. నిజానిజాలు తేల్చేందుకు రెండు మూడు తేదీలను తెలియజేస్తే బాధితులను కూడా సమావేశ పరుస్తామని లోక్‌సత్తా బాధ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. -
హత్యకేసులో టీడీపీ నేతపై కేసు
అనంతపురం: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో వెంకటేశ్ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్యచేసిన ఘటనలో టీడీపీ నేత పై కేసు నమోదు చేశారు. పాత కక్షల నేపథ్యంలో వెంకటేశ్ ను శుక్రవారం వేటకొడవళ్లతో నరికి అతి కిరాతకంగా చంపేశారు. ఈ హత్యపై అనుమానం ఉన్న స్థానిక టీడపీ నేత ప్రతాప్ నాయుడు సహా మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మరో వైపు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సోదరుడు శీనప్ప ఈ హత్య చేయించారని మృతుడి సోదరుడు ఆరోపిస్తున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వేటకొడవళ్లతో నరికి చంపేశారు!
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. ఉరవకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో వెంకటేశ్ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్యచేశారు. వెంకటేశ్ ను వేటకొడవళ్లతో నరికి అతి కిరాతకంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానం ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సోదరుడు శీనప్ప ఈ హత్య చేయించారని మృతుడి సోదరుడు ఆరోపిస్తున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'ఆయనను విమర్శించే నైతికత పయ్యావులకు లేదు'
అనంతపురం: వైఎస్ జగన్‌ను విమర్శించే నైతికత టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు లేదని అనంతపురం జడ్పీ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన పయ్యావుల జడ్పీ సమావేశాలకు ఎందుకు హాజరుకాలేదో చెప్పాలని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని రవీంద్రారెడ్డి విమర్శించారు. -
'పయ్యావుల సోదరులవి హత్యా రాజకీయాలు'
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కు లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ వ్యాఖ్యానించారు. హత్యారాజకీయాలకు కేంద్ర బిందువులు పయ్యావుల సోదరులు అని ఆయన ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో రైతులను బెదిరించి, మభ్యపెట్టి వారి నుంచి అధికార పార్టీ నేతలు, ఏపీ మంత్రులు వేల ఎకరాలను హస్తగతం చేసుకున్నారని తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. రైతులను బెదిరించి నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో పయ్యావుల భూములను కూడబెట్టారని పేర్కొన్నారు. అక్రమాలు జరిగినందునే రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ ను ప్రభుత్వం బ్లాక్ చేసిందని ఆయన మండిపడ్డారు. రాజధాని అమరావతి భూకంభకోణంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్ సీపీ నేత శంకర్ నారాయణ విజ్ఞప్తి చేశారు. -
ఇదేంటి కేశవా..?!
♦ రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలును ఒప్పుకున్న ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ♦ కొంటే తప్పేంటంటూ అడ్డగోలు వాదన ♦‘ల్యాండ్ పూలింగ్’లో పోకుండా ఎత్తులు ♦ సన్నకారు రైతుల భూములను మాత్రం యథేచ్ఛగా లాక్కున్న ప్రభుత్వం (సాక్షిప్రతినిధి, అనంతపురం) : పయ్యావుల కేశవ్.. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ. ఎప్పుడూ రాష్ట్ర స్థాయి వేదికలపై ‘న్యాయ-అన్యాయాల’ గురించి ప్రసంగాలు ఊదరగొడుతుంటారు. ఇలాంటి నేత కూడా రాజధాని భూముల మాయాజాలానికి పాల్పడిన ‘పచ్చదండు’లో భాగమయ్యారు. గుంటూరు జిల్లాలో కోర్‌క్యాపిటల్ ప్రాంతమైన తుళ్లూరు మండలం అయనవోలు గ్రామంలో రెండు సర్వే నంబర్లలో 4.09 ఎకరాలు కొనుగోలు చేశారు. సర్వే నంబర్ 48/3లో 2.13 ఎకరాలు, 49/3లో 1.96 ఎకరాలు తన పెద్ద కుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాజధాని ప్రాంతంగా గుంటూరు జిల్లాలోని ప్రాంతాన్నే ఎంపిక చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లుంది. అందుకే ఎన్నికలకు ముందే పయ్యావుల కేశవ్ 4.09 ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 అక్టోబర్, సెప్టెంబరులో రెండు దఫాలు రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగానే కేశవ్ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి గగ్గోలు పెట్టారు. రాజధాని ప్రాంతంలో భూములు కొంటే తప్పేంటని, తాను బినామీల పేర్లతో కొనుగోలు చేయలేదని, కుమారుని పేరుతో రిజిస్ట్రేషన్ చేయించానని చెప్పుకొచ్చారు. ఇది తప్పు కాదా? రాజధాని ప్రాంతంలో కాదు..ప్రపంచంలో ఎవరు ఎక్కడైనా భూములు, స్థలాలు కొనుగోలు చేయవచ్చు. ఇది తప్పు కాదు. అయితే.. ప్రభుత్వం రాజధాని పేరిట తుళ్లూరు ప్రాంతంలో ఏడాదికి మూడు పంటలు పండే భూములను ‘ల్యాండ్‌పూలింగ్’ విధానంలో రైతుల నుంచి బలవంతంగా లాక్కుంది. ఎకరా, అరెకరా ఉన్న రైతులను కూడా వదల్లేదు. అందరి భూములను తీసుకుని వారిని వీధిన పడేసింది. కొన్ని గ్రామాల్లో ఇళ్లను కూడా సేకరించింది. ఊళ్లను ఖాళీ చేయించింది. మంత్రులు రోజూ రాజధాని ప్రాంతంలో తిరగడం, భూములు ఇవ్వకుంటే ప్రభుత్వం బలవంతంగా సేకరిస్తుందని.. అప్పుడు పరిహారం కూడా అందదని భయపెట్టారు. దీంతో భయపడి కొందరు, తోటివారిని చూసి ఇంకొందరు ఇలా అందరూ గందరగోళంలో పడి ఇష్టం లేకపోయినా ల్యాండ్ పూలింగ్‌లో భూములను త్యాగం చేశారు. అయనవోలులో కూడా రైతులందరి భూములు ల్యాండ్ పూలింగ్‌లో వెళ్లాయి. ఇదే క్రమంలో పయ్యావుల కేశవ్ కొన్న 4.09 ఎకరాలు ఎందుకు పోలేదనేదానికి ఆయన సమాధానం చెప్పాల్సివుంది. కేశవ్ భూములను కమర్షియల్ జోన్లో ఉన్నట్లు గుర్తించి వదిలేశారు. అంటే పక్కా ప్రణాళిక ప్రకారమే రైతుల నోళ్లు కొట్టి, నాయకులు పాగా వేశారు. ఇలా చేయడం తప్పని ‘సాక్షి’లో రాస్తే...ల్యాండ్‌పూలింగ్ గురించి మాట్లాడకుండా తాను భూములను కొనుగోలు చేయడం తప్పేంటని కేశవ్ అడ్డగోలుగా వాదిస్తున్నారు. కేశవ్ వ్యాఖ్యలపై జిల్లాలో కూడా తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ప్రజా కోర్టులో నిలవక తప్పదు - వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి టీడీపీ నేతలు భూ కుంభకోణంపై బుకాయింపులు మాని నిజాలు అంగీకరించాలి. కోర్ క్యాపిటల్ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో పేదలకు చెందిన భూములను బలవంతంగా లాక్కున్నారు. మరి అదే ప్రాంతంలో జిల్లా ప్రజాప్రతినిధికి చెందిన నాలుగు ఎకరాల భూమిని ఎందుకు తీసుకోలేదు? కోర్ క్యాపిటల్‌కు భూములను తీసుకునే విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మినహాయింపు ఏమైనా ఉందా? పేద రైతుల నుంచి కారు చౌకగా కొన్న భూములను వారికి తిరిగిచ్చేయాలి. లేదంటే ప్రజా కోర్టులో నిలవక తప్పదు. టీడీపీ భూ కుంభకోణం - డి.జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి రాజధాని భూముల విషయంలో జరిగింది ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీ భూ కుంభకోణమే. ఆ పార్టీ నేతలు స్వలాభం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కోర్ క్యాపిటల్ పరిధిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల పొట్టకొట్టారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత భూమిని మాత్రం తీసుకోలేదు. ఇలా ప్రతి విషయంలో అధికార దుర్వినియోగం జరిగింది. ఇందుకు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలి. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు సీఎంగా అనర్హుడు. ఈ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. బాధ్యులైన వారిని శిక్షించాలి. బినామీల పేరున ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. -
ఇదేంటి కేశవా..?!
► రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలును ఒప్పుకున్న ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ► కొంటే తప్పేంటంటూ అడ్డగోలు వాదన ‘ల్యాండ్ పూలింగ్’లో పోకుండా ఎత్తులు ► సన్నకారు రైతుల భూములను మాత్రం యథేచ్ఛగా లాక్కున్న ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, (అనంతపురం) : పయ్యావుల కేశవ్.. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ. ఎప్పుడూ రాష్ట్ర స్థాయి వేదికలపై ‘న్యాయ-అన్యాయాల’ గురించి ప్రసంగాలు ఊదరగొడుతుంటారు. ఇలాంటి నేత కూడా రాజధాని భూముల మాయాజాలానికి పాల్పడిన ‘పచ్చదండు’లో భాగమయ్యారు. గుంటూరు జిల్లాలో కోర్‌క్యాపిటల్ ప్రాంతమైన తుళ్లూరు మండలం అయనవోలు గ్రామంలో రెండు సర్వే నంబర్లలో 4.09 ఎకరాలు కొనుగోలు చేశారు. సర్వే నంబర్ 48/3లో 2.13 ఎకరాలు, 49/3లో 1.96 ఎకరాలు తన పెద్ద కుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాజధాని ప్రాంతంగా గుంటూరు జిల్లాలోని ప్రాంతాన్నే ఎంపిక చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లుంది. అందుకే ఎన్నికలకు ముందే పయ్యావుల కేశవ్ 4.09 ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 అక్టోబర్, సెప్టెంబరులో రెండు దఫాలు రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగానే కేశవ్ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి గగ్గోలు పెట్టారు. రాజధాని ప్రాంతంలో భూములు కొంటే తప్పేంటని, తాను బినామీల పేర్లతో కొనుగోలు చేయలేదని, కుమారుని పేరుతో రిజిస్ట్రేషన్ చేయించానని చెప్పుకొచ్చారు. ఇది తప్పు కాదా? రాజధాని ప్రాంతంలో కాదు..ప్రపంచంలో ఎవరు ఎక్కడైనా భూములు, స్థలాలు కొనుగోలు చేయవచ్చు. ఇది తప్పు కాదు. అయితే.. ప్రభుత్వం రాజధాని పేరిట తుళ్లూరు ప్రాంతంలో ఏడాదికి మూడు పంటలు పండే భూములను ‘ల్యాండ్‌పూలింగ్’ విధానంలో రైతుల నుంచి బలవంతంగా లాక్కుంది. ఎకరా, అరెకరా ఉన్న రైతులను కూడా వదల్లేదు. అందరి భూములను తీసుకుని వారిని వీధిన పడేసింది. కొన్ని గ్రామాల్లో ఇళ్లను కూడా సేకరించింది. ఊళ్లను ఖాళీ చేయించింది. మంత్రులు రోజూ రాజధాని ప్రాంతంలో తిరగడం, భూములు ఇవ్వకుంటే ప్రభుత్వం బలవంతంగా సేకరిస్తుందని.. అప్పుడు పరిహారం కూడా అందదని భయపెట్టారు. దీంతో భయపడి కొందరు, తోటివారిని చూసి ఇంకొందరు ఇలా అందరూ గందరగోళంలో పడి ఇష్టం లేకపోయినా ల్యాండ్ పూలింగ్‌లో భూములను త్యాగం చేశారు. అయనవోలులో కూడా రైతులందరి భూములు ల్యాండ్ పూలింగ్‌లో వెళ్లాయి. ఇదే క్రమంలో పయ్యావుల కేశవ్ కొన్న 4.09 ఎకరాలు ఎందుకు పోలేదనేదానికి ఆయన సమాధానం చెప్పాల్సివుంది. కేశవ్ భూములను కమర్షియల్ జోన్లో ఉన్నట్లు గుర్తించి వదిలేశారు. అంటే పక్కా ప్రణాళిక ప్రకారమే రైతుల నోళ్లు కొట్టి, నాయకులు పాగా వేశారు. ఇలా చేయడం తప్పని ‘సాక్షి’లో రాస్తే...ల్యాండ్‌పూలింగ్ గురించి మాట్లాడకుండా తాను భూములను కొనుగోలు చేయడం తప్పేంటని కేశవ్ అడ్డగోలుగా వాదిస్తున్నారు. కేశవ్ వ్యాఖ్యలపై జిల్లాలో కూడా తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ప్రజా కోర్టులో నిలవక తప్పదు - వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి టీడీపీ నేతలు భూ కుంభకోణంపై బుకాయింపులు మాని నిజాలు అంగీకరించాలి. కోర్ క్యాపిటల్ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో పేదలకు చెందిన భూములను బలవంతంగా లాక్కున్నారు. మరి అదే ప్రాంతంలో జిల్లా ప్రజాప్రతినిధికి చెందిన నాలుగు ఎకరాల భూమిని ఎందుకు తీసుకోలేదు? కోర్ క్యాపిటల్‌కు భూములను తీసుకునే విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మినహాయింపు ఏమైనా ఉందా? పేద రైతుల నుంచి కారు చౌకగా కొన్న భూములను వారికి తిరిగిచ్చేయాలి. లేదంటే ప్రజా కోర్టులో నిలవక తప్పదు. టీడీపీ భూ కుంభకోణం - డి.జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి రాజధాని భూముల విషయంలో జరిగింది ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీ భూ కుంభకోణమే. ఆ పార్టీ నేతలు స్వలాభం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కోర్ క్యాపిటల్ పరిధిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల పొట్టకొట్టారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత భూమిని మాత్రం తీసుకోలేదు. ఇలా ప్రతి విషయంలో అధికార దుర్వినియోగం జరిగింది. ఇందుకు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలి. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు సీఎంగా అనర్హుడు. ఈ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. బాధ్యులైన వారిని శిక్షించాలి. బినామీల పేరున ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. -
'ఇది ప్రజాస్వామ్య ఖూనీ'
బెలుగుప్ప: అనంతపురం జిల్లాలోని బెలుగుప్పలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ వేధింపులకు నిరసనగా నేడు బెలుగుప్పలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మహా ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ధర్నాను భగ్నం చేయాలని టీడీపీ, పోలీసులు ఎత్తుగడ వేశారు. పయ్యావుల ఆదేశాలతో టీడీపీ వర్గీయులు పోటీ ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ, టీడీపీ ధర్నాలకు అనుమతి లేదని కల్యాణ దుర్గం డీఎస్పీ అనిల్ చెప్పారు. బెలుగుప్పలో 144 సెక్షన్ విధించారు. వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పోలీసుల తీరుపై విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. -
పయ్యావులపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఫైర్
-
పయ్యావులపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఫైర్
అనంతపురం : టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌పై వైఎస్ఆర్ సీపీ నేతలు విశ్వేశ్వర్‌రెడ్డి, శంకర్ నారాయణ, గుర్నాథ్రెడ్డి ఆదివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. ఉరవకొండలో పయ్యావుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని వారు ఆరోపించారు. 2009లో జరిగిన సూరయ్య హత్య కేసు నుంచి బయట పడేందుకు పయ్యావుల కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. సూరయ్య భార్య ఓబులమ్మకు చెందిన భూములను మరొకరి పేరుతో ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. పయ్యావుల ఆగడాలకు నిరసనగా ఈ నెల 16న బెలుగుప్పలో మహాధర్నా నిర్వహిస్తామని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి, నేతలు శంకర్ నారాయణ్, గుర్నాథ్రెడ్డిలు వెల్లడించారు. -
పవన్ వల్ల టీడీపీకి ఓట్లు పెరగలేదు: కేశవ్
పవన్ కాళ్లు, మోదీ గడ్డం పట్టుకొనే అధికారంలోకి వచ్చారు: రామచంద్రయ్య సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వల్లగానీ, మరేఇతర పార్టీల వల్ల తెలుగుదేశం పార్టీకి ఓట్ల శాతం పెరగలేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం శాసనమండలిలో కరువుపై చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రతిపక్షనేత సి. రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో భయంకరమైన కరువు ఛాయలు నెలకొన్నా ప్రభుత్వంలో ఎలాంటి స్పందనా లేదని ఆరోపించారు. దీన్ని అధికార పార్టీ సభ్యులు అడ్డుకోవడంతో ఆగ్రహం చెందిన రామచంద్రయ్య సినీనటుడు పవన్ కల్యాణ్ కాళ్లు, నరేంద్రమోదీ గడ్డం పట్టుకొని అధికారంలోకి వచ్చిన మీకు (టీడీపీ) ప్రజల ఇబ్బందులు తెలుసుకొనే ఆసక్తి లేకపోవడం శోచనీయమన్నారు. అందుకు టీడీపీ సభ్యుడు కేశవ్ కలుగజేసుకొని పై వ్యాఖ్యలు చేశారు. -
పార్టీకి నష్టమే
టీడీపీ సమావేశంలో ముఖ్యుల ఆందోళన సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి పరిశ్రమలతో పాటు ఇతర అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామని ఎన్నికలప్పుడు చెప్పామని, ఇప్పుడు హోదా రాకపోతే పార్టీకి నష్టం తప్పదని పలువురు టీడీపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రమంత్రి ప్రకటించడం, వామపక్షాలు ఆందోళనలకు శ్రీకారం చుట్డడం, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తానని ప్రకటించడం.. తెలుగుదేశం నేతల్లో గుబులుకు కారణమయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో ఘర్షణకు దిగే అవకాశం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో శనివారం టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. సమావేశం హాల్లో, హాలు బయట ప్రత్యేక హోదా అంశమే హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ మన పుట్టి ముంచేలా ఉంది..! ఎంపీలు కొనకళ్ల నారాయణరావు, జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్, పయ్యావుల కేశవ్‌ల మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ఏ ఇద్దరు నాయకులు కలిసినా బీజేపీ తమ పుట్టి ముంచే వ్యూహం అమలు చేస్తున్నట్లుగా ఉందనే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. అంతక ముందు జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ దేశానికే విజిటింగ్ పీఎంగా వస్తున్నారని, సమస్యలు చెప్పుకునే అవకాశమే ఇవ్వడం లేదని మరో ఎంపీ రాయపాటి సాంబశివరావు హోదా ఇవ్వకపోతే తమకంటే బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. మొత్తానికి ఈ సీనియర్ నేతల వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్నే రేపాయి. -
రేవంత్‌ను కలసిన పయ్యావుల
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర మంగళవారం కలిశారని జైలు అధికారులు తెలిపారు. దాదాపు గంటసేపు రేవంత్‌తో వారు మాట్లాడి వెళ్లినట్లు తెలిసింది. -
జిల్లా రుణం తీర్చుకుంటా
♦ రైతుల కన్నీళ్లు తుడవడమే ధ్యేయం ♦ హంద్రీ-నీవా పూర్తికి కృషి ♦ ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు ♦ ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా పయ్యావుల కేశవ్ అనంతపురం అర్బన్ : ‘అనంత ప్రజల మనిషిగా జిల్లా రుణం తీర్చుకుంటా. రైతుల కన్నీళ్లు తుడవడమే ధ్యేయం. రాయలసీమకు ప్రాణాధారమైన హంద్రీ-నీవా పథకాన్ని పూర్తి చేయించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తా’నని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన పయ్యావుల కేశవ్ అన్నారు. తన ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం నుంచి డిక్లరేషన్ ఫారాన్ని స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీలో సైనికునిలా పనిచేసిన తనకు సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు. ఇప్పుడు జిల్లా ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత రెట్టింపు అయ్యిందన్నారు. ముఖ్యమంత్రి పట్టిసీమకు ఎంత ప్రాధాన్యతిస్తున్నారో.. హంద్రీ-నీవాకూ అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తానన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ప్రతిక్షణం పాటుపడతానని పునరుద్ఘాటించారు. కార్యకర్తల సంబరాలు : ఎమ్మెల్సీగా కేశవ్ డిక్లరేషన్ అందుకున్న సందర్భంగా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. కేశవ్‌కు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి అభినందలు తెలిపారు. -
ఎమ్మెల్సీగా కేశవ్ ఏకగ్రీవం!
♦ అధికార ప్రకటనే తరువాయి ♦ ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అనంతపురం అర్బన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పయ్యావుల కేశవ్ ఎన్నిక ఏగ్రీవమయింది. అధికార ప్రకటనే వెలువడాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పయ్యావుల కేశవ్, పయ్యావుల శ్రీనివాసులు, యాటా వెంకటసుబ్బన్న నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లను అధికారి బి.లక్ష్మికాంతం, డీఆర్ఓ హేమసాగర్ పరిశీలించారు. మూడు నామినేషన్లలో యాటా వెంకటసుబ్బన్న నామినేషన్‌ని తిరస్కరించారు. పయ్యావుల శ్రీనివాసులు నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారు. బరిలో పయ్యావుల కేశవ్ ఒక్కరే నిలిచారు. పోటీ ఎవరూ లేనందున కేశవ్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి లాంచనంగా ప్రకటించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగినంత బలం లేని కారణంగా వైఎసాఆర్ కాంగ్రె స్ పార్టీ దూరంగా ఉంది. ఇది ఒక రకంగా కేశవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కలిసి వచ్చింది. -
'సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోకుండా ట్యాపింగ్'
-
అట్టహాసంగా పయ్యావుల కేశవ్ నామినేషన్
అనంతపురం క్రైం : స్థానిక శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి పయ్యావుల కేశవ్ నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా కొనసాగింది. శనివారం కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ బి. లక్ష్మీకాంతం చాంబర్లో పయ్యావుల కేశవ్ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత, జెడ్పీ చైర్మన్ చమన్. ప్రభుత్వ ఛీప్ విప్ కాలువ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ యామినీ బాల, ఎమ్మెల్సీలు శమంతకమణి, గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యేలు బీకే పార్థసారధి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, గోనుగుంట్ల సూర్యనారాయణ, ప్రభాకర్‌చౌదరి, హనుమంతరాయ చౌదరి, జితేంద్ర గౌడ్, తదితరులు పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పయ్యావుల కేశవ్ 3 సెట్లు నామినేషన్ దాఖలు చేయగా, కేశవ్‌కు మద్దతుగా వై. వెంకటసుబ్బన్న మరో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు కేశవ్ కృతజ్ఞతలు తెలిపారు. పల్లె వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు నామినేషన్ సందర్భంగా విచ్చేసిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి వాహనాన్ని కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి పరిటాల సునీత వాహనాన్ని మాత్రం అనుమతించారు. నామినేషన్ సందర్భంగా మూడు వాహనాలను మాత్రమే అనుమతించాల్సిన నిబంధనలను ఎన్నికలు అధికారులు తుంగలో తొక్కారు. -
విధేయతకు పెద్దపీట
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేశవ్ జూన్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) : స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూన్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో ‘అనంత’లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. తెలుగుదేశంపార్టీ తరఫున ఎన్నికల బరిలోకి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దిగనున్నారు. బుధవారం రాత్రి టీడీపీ అధిష్టానం ఈ విషయాన్ని ప్రకటించింది. పయ్యావుల కేశవ్‌తో పాటు ఎమ్మెల్సీ టిక్కెట్టును ఆశించిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీకి నిరాశే ఎదురైంది. బాలకృష్ణ కోసం సీటు త్యాగం చేయడం, దీనికి తోడు మైనార్టీ కావడంతో టిక్కెట్టు దక్కుతుందని ఆశపడ్డారు. అయితే.. పయ్యావుల కేశవ్‌ను ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు మొదట్నుంచీ భావిస్తున్నారు. దీంతో ఘనీని పక్కనపెట్టారు. కేశవ్ ఎంపికతో ఇద్దరి మంత్రుల్లో ఒకరికి గుబులు జూన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయితే, ఆ తర్వాత సెప్టెంబరులో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేశవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. దీంతో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. రెడ్డి సామాజికవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పల్లె రఘునాథరెడ్డిని తప్పించి, నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని కేబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పల్లె రఘునాథరెడ్డి పనితీరుపైనా సీఎం అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు ఉద్వాసన ఉంటుందని ఓ కీలక నేత చెబుతున్నారు. మరో మంత్రి పరిటాల సునీతపైనా చంద్రబాబు అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. సునీత తనయుడు శ్రీరాంతో పాటు అనుచరులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సునీత వ్యతిరేకీయులు చంద్రబాబుకు పలుసార్లు ఫిర్యాదులు చేశారు. వీటిని కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబుపై జిల్లా నేతల నుంచి ఒత్తిడి ఉంది. ఈ క్రమంలో ఇద్దరు మంత్రులకూ ఉద్వాసన పలికి కొత్త ముఖాలకు కేబినెట్లో చోటు కల్పించే అవకాశమూ లేకపోలేదని ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’తో అన్నారు. -
18 నుంచి 23 వరకు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావే శాలు డిసెంబర్ 18వతేదీ నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. మంగళవారం సీఎం చంద్రబాబునాయుడుతో చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు వెంకట సురేష్ సమావేశమై అసెంబ్లీ నిర్వహణ తేదీలపై చర్చించారు. 18వ తేదీన సమావేశాలు ప్రారంభమవుతాయి. 23వ తేదీ వరకు అంటే ఐదు రోజుల పాటు సభ జరపాలని నిర్ణయించారు. -
బరితెగించిన పయ్యావుల: విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం: టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ బరితెగించి వ్యవహరిస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. బోయ సూరయ్య హత్య కేసు నుంచి తన సోదరుడిని కాపాడుతున్నారని ఆరోపించారు. కేసు ఉపసంహరించుకోనందుకు సూరయ్య కుటుంబీకులపై అక్రమ కేసు బనాచించారని అన్నారు. సూరయ్య హత్యతో పయ్యావుల శీనప్పకు సంబంధం ఉందని సీఐడీ తేల్చిందని చెప్పారు. పయ్యావుల కేశవ్ అధికార దుర్వినియోగంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు బోయ సూరయ్య... ఉరవకొండ మండలం వై.రాంపురంలో 2009 ఆగస్టు 24న దారుణ హత్యకు గురయ్యారు. నిందితుల్లో ఒకరైన పయ్యావుల శీనప్ప తన పేరును చార్జిషీటు నుంచి తొలగింపజేసేందుకు శతవిధాలా ప్రయత్ని విఫలమయ్యాడు. సూరయ్య కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో కక్ష సాధింపునకు దిగాడు. -
పయ్యావుల కేశవ్ కు చేదు అనుభవం
అనంతపురం:జిల్లాలోని ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇక్కడకు విచ్చేసిన పయ్యావులను స్థానిక సమస్యలపై మహిళలు నిలదీశారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్ల సమయంలో ప్రజల ముందుకు రావడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఒక మహిళ పయ్యావులను ఎదురుగా వచ్చి నిలదీయడంతో టీడీపీ శ్రేణులు షాక్ కు గురైయ్యాయి. రెండేళ్ల కిందట తన కుమారుని మృతికి ఇప్పిస్తానన్న నష్ట పరిహారం ఇప్పటి వరకూ ఎందుకు ఇప్పించలేదని పద్మావతి అనే మహిళ ప్రశ్నించింది. దీంతో కంగుతిన్న పయ్యావుల సమాధానం చెప్పలేక అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. -
'పయ్యావులపై చర్యలు తీసుకోండి'
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఓటర్లకు పంచేందుకు టీడీపీ నేతలు తీసుకువెళ్తున్న రూ.30 లక్షల విలువైన మద్యాన్ని వైఎస్ఆర్ సీపీ నేతలు పట్టుకుని... పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన మద్యం టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కు చెందినవని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పయ్యావులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులను డిమాండ్ చేశారు. అలాగే తాడిపత్రిలో ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నాయకులు తీసుకువెళ్లున్న రూ.2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం టీడీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. -
ప్రజాపంపిణీలో అక్రమాలపై కొరడా
రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు మండల స్టాక్ పాయింట్లు, రేషన్ దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ గోదాముల్లో రూ. 20.80 కోట్ల అక్రమ నిల్వలు గుర్తింపు మొత్తంగా పదిహేను రోజుల్లో రూ. 145 కోట్ల విలువైన సరుకులు స్వాధీనం.. 55 కేసులు నమోదు మరిన్ని దాడులు చేస్తామని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడి రేషన్ దుకాణాల్లో పేదలకు అందజేయాల్సిన సరుకులను నల్లబజారుకు తరలిస్తున్న అక్రమార్కులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కొరడా ఝుళిపించింది. గత కొద్ది రోజులుగా 20 జిల్లాల్లోని మండల స్థాయి స్టాక్ కేంద్రాలతో పాటు రేషన్‌షాపులు, గోదాములపై దాడులు జరిపింది. మొత్తంగా దాదాపు రూ. 145 కోట్ల విలువైన సరుకులను స్వాధీనం చేసుకుని... 55 కేసులు నమోదు చేసింది. ఇందులో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చెందిన గోదాముల్లో అక్రమంగా నిల్వ చేసిన దాదాపు రూ. 20 కోట్ల విలువైన ధాన్యం కూడా ఉండడం గమనార్హం. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ బుధవారం ఈ దాడులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కొంతకాలంగా రాష్ట్రంలోని వివిధ రేషన్ షాపులలో నిత్యావసర సరుకులు సక్రమంగా అందడం లేదని.. వాటిని కాంట్రాక్టర్లు, రేషన్ డీలర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వాటిని ఆధారంగా చేసుకుని మూడో తేదీ నుంచి విజిలెన్స్ అధికారులు దాడులు ప్రారంభించారు. చిత్తూరు, మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, నల్లగొండ, హైదరాబాద్, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ కడప, గుంటూరు, కరీంనగర్, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, మెదక్ జిల్లాల్లోని మండల స్థాయి స్టాక్ కేంద్రాలు, రేషన్ దుకాణాలతో పాటు వివిధ గోదాముల్లో తనిఖీలు నిర్వహించారు. బుధవారం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణ శివారులోని జమ్మలమడుగు, గుంజలపాడు రహదారుల్లోని పది గోదాముల్లో సుమారు రూ. 50 కోట్ల విలువ చేసే 1.78 లక్షల బస్తాల శనగపప్పును సీజ్ చేశారు. మొత్తంగా మూడో తేదీ నుంచి బుధవారం వరకు 138 గోదాములు, రేషన్ దుకాణాలపై దాడులను నిర్వహించగా... కాంట్రాక్టర్ల అక్రమాలు భారీ ఎత్తున వెలుగు చూశాయి. ముఖ్యంగా స్టాక్ కేంద్రాల నుంచి రేషన్ షాపులకు సరుకులు రవాణా చేసే దశలోనే వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు వెల్లడైంది. అధికారులు ఈ దాడుల్లో 8,655.1 క్వింటాళ్ల ఎర్రపప్పు, 4,37,854 క్వింటాళ్ల శనగపప్పు, 1,60,680 క్వింటాళ్ల పెసరపప్పు, వేరుశనగ తదితర ధాన్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ. 145 కోట్లకు పైగా ఉంటుందని ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా అక్రమార్కులపై నిత్యావసర వస్తువుల చట్టంలోని 6(ఎ) కింద 55 కేసులు నమోదు చేశామని, ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని ఆయన చెప్పారు. పేద రైతుల కడుపుకొడుతున్నారు.. ఎమ్మెల్యే పయ్యూవుల కేశవ్ సోదరులు అక్రవుంగా దాచి పెట్టిన ధాన్యం నిల్వలపై ఉన్నతాధికారులు సవుగ్ర విచారణ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తేజోనాథ్, కిసాన్ సెల్ కో-ఆర్డినేటర్ అశోక్ డివూండ్ చేశారు. గోదాములపై దాడుల అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సోదరులు ఎంతో వుంది రైతులను బెదిరించి వారి పాసు పుస్తకాలు లాక్కొని ధాన్యం నిల్వలపై బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారని.. పేద రైతుల కడుపు కొడుతున్నారని వారు మండిపడ్డారు. -
'పయ్యావుల కేశవ్ ను అరెస్ట్ చేయండి'
అనంతపురం: దళితులపై దాడి చేసిన పయ్యావులను అరెస్ట్ చేయాలని దళిత సంఘం డిమాండ్ చేసింది. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిసి దళిత సంఘం నేతలు పయ్యావులపై ఫిర్యాదు చేశారు. ఉరవకొండ ప్రాంతంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని వారన్నారు. పయ్యావుల నుంచి దళితులకు రక్షణ కల్పించాలని ఎస్పీకి విజ్క్షప్తి చేశారు. అంతేకాకుండా నాగన్న కుటుంబంపై దాడి చేసిన కేసునమోదు చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే ఉరవకొండలో పయ్యావులు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని దళిత సంఘం నేతలు ఆరోపించారు. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిసిన దళిత సంఘం నేతల్లో శ్రీనివాస్, పెన్నోబులేసు ఉన్నారు. మంచి నీటి సమస్య ఎందుకు తీర్చలేదంటూ ప్రశ్నించిన పాపానికి గ్రామస్థులపై మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు దళితులపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. -
దళితులపై ఎమ్మెల్యే పయ్యావుల అనుచరుల దాడి
-
దళితులపై పయ్యావుల అనుచరుల దాడి
-
దళితులపై ఎమ్మెల్యే పయ్యావుల అనుచరుల దాడి
అనంతపురం: మంచి నీటి సమస్య ఎందుకు తీర్చలేదంటూ గ్రామస్థులు ప్రశ్నించిన పాపానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు దళితులపై దాడికి పాల్పడ్డారు. మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గం శూలసముద్రం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. శూలసముద్రం గ్రామానికి కేశవ్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. ఆ సమయంలో మంచి నీటి సమస్య గురించి ప్రశ్నించడంతో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. కేశవ్ సమక్షంలోనే దళితులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
తెలుగుదేశం.. గడ్డుకాలం
ఉరవకొండ ఉరవకొండ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్సీపీకి జనాదరణ పెరుగుతోంది. ఆ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల పట్ల కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజా సమస్యలను విస్మరించి.. సమైక్యాంధ్ర పరిరక్షణలో విఫలమైన తెలుగుదేశం పార్టీకి ఇక్కడ గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. పయ్యావుల కేశవ్‌ను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేనేత కార్మికుల సవుస్యలను గాలికి వదిలేయడంతో పట్టణంలోనే 300 పైగా వుగ్గాలు వుూత పడ్డారుు. పట్టణంలోని 1, 2, 3, 4 వార్డుల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ఆయా వార్డుల్లోని ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు అనుకులంగా లేఖ ఇచ్చి, రాష్ర్ట విభజనకు పూర్తి సహకారం అందించినా దీన్ని అడ్డుకోవడంలో సీవూంధ్ర ప్రజాప్రతినిధులు, వుుఖ్యంగా ఎమ్మెల్యే కేశవ్ నోరు మెదపక పోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ తన ఇమేజ్ను పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతోంది. ఇందు కోసం ప్రత్యర్థి పార్టీ నాయకులను టీడీపీలో చేర్చుకునేందుకు డబ్బు ఎర చూపుతోంది. డబ్బుకు మాట వినని వారిని నేతలు బెదిరించి తమవైపు తిప్పుకుంటున్నారు. -
హోంశాఖ కార్యాలయం వద్ద టీడీపీ హడావుడి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) భేటీకి ముందు పయ్యావుల కేశవ్ నేతృత్వంలో సీమాంధ్ర టీడీపీ నేతలు హోంశాఖ కార్యాలయం ముందు కొద్దిసేపు హడావుడి చేశారు. జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్‌ను ఘెరావ్ చేశారు. ఓ కార్యకర్త జైరాం రమేశ్ కాళ్లపై పడ్డారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మంత్రి నారాయణస్వామిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పయ్యావుల ఏకంగా మంత్రి కారు ఎర్రబుగ్గను తీసి నేలకు కొట్టారు. హోంశాఖ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది, ఢిల్లీ పోలీసులు వీరందరినీ బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం లేకుండా పార్లమెంటులో విభజన బిల్లును ప్రవేశపెట్టడం చట్ట విరుద్ధమని పయ్యావుల కేశవ్ అన్నారు. పార్లమెంటుకు ఈ అధికారంలేదని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు రెండూ సమానమైనవేనని అన్నారు. -
అసెంబ్లీ మీడియా పాయింట్
‘‘ సీఎం, స్పీకర్లు చేసింది పనికిమాలిన చర్య. సొంతపార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దోపిడీ దొంగల్లా వ్యవహరించారు. స్పీకర్‌కు తెలంగాణవాదులు బుద్ధి చెప్తారు. ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ ఏర్పడుతుంది’’ - కేటీఆర్ (టీఆర్ ఎస్) ‘‘మూడు ప్రాంతాలకు న్యాయం చేసే నిర్ణయాన్ని వెలువరించేలా కాంగ్రెస్, బీజేపీలు కృషి చేయాలి. తెలంగాణ ఏర్పాటుకు సమగ్ర పరిష్కారాన్ని మా పార్టీ చూపింది. సవరణలతో కూడిన బిల్లుతో సీమాంధ్రకు న్యాయం చేయాలి.’’ - జ యప్రకాశ్ నారాయణ్ (లోక్‌సత్తా) ‘‘తెలంగాణ బిల్లును ఓడించి పంపించాం. నేటి పరిణామాలు చరిత్రలో నిలిచిపోతాయి’’ - పయ్యావుల కేశవ్ (టీడీపీ) ‘‘తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం ఖాయం. సీఎం కిరణ్ పిరికిపందలా సభలో లేకుండా పారిపోయారు.’’ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరేపల్లి మోహన్ ‘‘తెలంగాణ ప్రజల కల నెరవేరబోతోంది. బిల్లు రాష్ట్రపతికి వెళ్లడం సంతోషం. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో పార్లమెంటులో ఆమోదం పొందుతుంది. సభలో స్పీకర్ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించారు.’’ - ఈటెల రాజేందర్ (టీఆర్ఎస్) ‘‘స్పీకర్ నాదెండ్ల మనోహర్ తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నారు. చరిత్రహీనుడిగా మిగిలిపోయారు. ఆంధ్ర నాయకులంతా ప్రజాస్వామ్య ద్రోహులుగా మిగిలారు. నైతిక విజయం మాదే.’’ - ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సీతక్క (టీడీపీ) ‘‘సీమాంధ్ర నాయకుల సంబరాలు చూస్తుంటే వారికి పిచ్చి ముదిరిందని స్పష్టంగా అర్థమవుతుంది. స్పీకర్, సీఎం కిరణ్ ఇద్దరూ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించారు. బిల్లు పార్లమెంటులో నెగ్గడం ఖాయం.’’ - గుండా మల్లేష్, కూనంనేని సాంబశివరావు (సీపీఐ) ‘‘సభలో స్పీకర్ తీరు రాజ్యాంగ విరుద్ధం. బిల్లును తిరస్కరించే హక్కు సభకు లేదు. ఓటింగ్, తీర్మానాలు చేసే అధికారంలేదు. పార్లమెంటులో బిల్లును బీజేపీ నెగ్గిస్తుంది.’’ - నాగం జనార్దన్‌రెడ్డి, యెండెల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి (బీజేపీ) ‘‘బిల్లు విషయంలో అసెంబ్లీ వెల్లడించేది అభిప్రాయాలు మాత్రమే. అంతిమ నిర్ణయం పార్లమెంట్‌దే’’ - జూలకంటి రంగారెడ్డి (సీపీఎం) ‘‘ఆఖరి బంతికి 5 రన్స్ చేయాల్సి ఉండగా.. సీఎం కిరణ్ సిక్స్ కొట్టారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజారంజకం’’ - ఆనం వివేకానందరెడ్డి (కాంగ్రెస్) -
మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా విభజన: కేశవ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లును చూస్తుంటే తమ సమాధులకు తమనే రాళ్లను పేర్చుకొమ్మని చెప్పినట్టుగా ఉం దని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆవేదన వెలిబుచ్చారు. గతంలో రాష్ట్రాల విభజన సమయంలో అనుసరించిన పద్ధతులకు, సంప్రదాయాలకు విరుద్ధంగా, రాష్ట్రంలో మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నందున బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బిల్లుపై సోమవారం ఆయన శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘తెలంగాణలో జరిగిన ఉద్యమాలు పెత్తందార్లకు, భూస్వాములకు, నాటి పాలకులకు వ్యతిరేకంగా జరిగినవే. అవి తెలంగాణ ఉద్యమం కాదు. తెలంగాణ పోరాట యోధులు ప్రజల కోసం సొంత ఆస్తులు ధార పోస్తే, ఇప్పుడు ఉద్యమం పేర కొందరు ఆస్తులు కూడగట్టుకుంటున్నారు’’ అన్నారు. పయ్యావులవన్నీ అబద్ధాలే: ఎర్రబెల్లి పయ్యావుల అసెంబ్లీలో చెప్పినవన్నీ అబద్ధాలని ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ‘ఇన్నేళ్లుగా దోచుకున్నది సరిపోదా? మీ పెత్తనం, రాజ్యాధికారం వద్దు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడొద్దు’ అని సోమవారం సభలో కేశవ్ మాట్లాడిన అనంతరం ఎర్రబెల్లి స్పందించారు. అంతగా అభివృద్ధి చేయాలనుకుంటే కర్నూలు రాజధానిగా చేసుకుని అభివృద్ధి చేసుకోండని సలహా ఇచ్చారు. ఎందుకీ రెండు నాల్కల ధోరణి: హరీశ్ పదవుల కోసం తెలంగాణ కోరడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన పలు గ్రామాల వారు తమను తెలంగాణలో చేర్చాలంటూ లేఖలిచ్చారన్నారు. తెలంగాణతో ఉండడానికి అభ్యంతరం లేదని, విభజన వద్దనడం 2 నాల్కల ధోరణి కాదా అని పయ్యావులను ప్రశ్నించారు. సాయుధ పోరుతో సంబంధం లేదు తెలంగాణ సాయుధ పోరాటానికి, ప్రస్తుత తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదని వామపక్ష పార్టీల సభ్యులు జూలకంటి రంగారెడ్డి, కే. సాంబశివరావు అన్నారు. సాయుధపోరాటం చేసిన వారి స్మృతి చిహ్నం ఒక్కటీ లేదన్న పయ్యావుల వ్యాఖ్యను తప్పుబట్టారు. కొత్త సంప్రదాయం వద్దు: గండ్ర సభలో పయ్యావుల కేశవ్ మాట్లాడిన తరువాత.. టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా స్పీకర్‌కు అఫిడవిట్లు ఇవ్వడానికి వరుస కట్టారు. అయితే, వాటిని స్పీకర్ సూచన మేరకు కార్యదర్శికి అప్పగించారు. ‘‘శాసనసభలో అఫిడవిట్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. వాటిని వెంటనే వెనక్కి ఇచ్చేయండి. ఈ అసెంబ్లీలో కొత్త సంప్రదాయాలు తీసుకుని రావద్దు’’ అని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్.. ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. వారిని బర్తరఫ్ చేయాలి: దామోదర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి పంపించిన బిల్లును రాజ్యాంగ వ్యతిరేకం అంటూ శాసనసభలో మాట్లాడిన మంత్రులు శైలజానాథ్, వసంతకుమార్‌లను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం వారిద్దరిని బర్తరఫ్ చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. వారింకా మంత్రులుగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. అది సభ్యుల అభిప్రాయమే: రఘువీరా బిల్లుపై మాట్లాడిన మంత్రులు సభలో సభ్యులుగా మాట్లాడారే తప్ప.. ప్రభుత్వం తరఫునకానీ, మంత్రులుగాకానీ మాట్లాడలేదని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి వివరణ ఇచ్చారు. రాష్ట్రపతిని అగౌరవపరిచే ఉద్దేశం ఎవరికీ లేదన్నారు. -
తెలంగాణ విషయంలో చరిత్రను వక్రీకరిస్తున్నారు:పయ్యావుల
-
శతాబ్దంలోనే అతి పెద్ద జోక్
పయ్యావుల విమర్శపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ధ్వజం విభజన విషయం లో చంద్రబాబు నాయుడు వైఖరితో రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి తెగిన గాలిపటంలా తయారైందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి అన్నారు. అలాంటి పార్టీ ఆలోచనలను వైఎస్సార్ సీపీ కాపీ కొడుతోందంటూ పయ్యావుల కేశవ్ విమర్శించడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్‌గా వారు శని వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అభివర్ణించారు. టీడీపీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో, అందుకు పూర్తి విరుద్ధంగా ఆ పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని వారన్నారు. తెలంగాణ ప్రకటన తరువాత సీమాంధ్రకు ప్యాకేజీ కోరిన బాబు, వైఎస్సార్ సీపీ సమైక్యవాదాన్ని చూసి ఇపుడు సమన్యాయం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. టీడీపీ ఓవైపు తెలంగాణ వాదం, మరోవైపు సమైక్యవాదంతో రెండు కాపురాలు చేస్తోందని, దీనిని సీత, సావిత్రి కాపురం అనాలో, లేక చింతామణి కాపురం అనాలో పయ్యావుల వివరించాలన్నారు. బాబును మించిన రాజకీయ చింతామణి ఎవరు?ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఎన్టీఆర్ పంచన చేరి, గుంట నక్కలా కాచుకుని అదను చూసి ఆయనను దెబ్బకొట్టి పార్టీనే లాగేసుకున్న వైనాన్ని ఎవరు మర్చిపోగలరు? అని ప్రశ్నించారు. బాబు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు భరించలేక ఒక దశలో వైఎస్సార్సీపీలో చేరాలని రాయబారాలు నడపడం అబద్ధమా? ఈ విషయం బయటకు పొక్కేసరికి, మీడియా ముందు వలవలా ఏడ్చేసిన పయ్యావుల ఇపుడు తమ నాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారని చెప్పారు. -
'విభజనపై ముందుకు వెళ్లే సత్తా కాంగ్రెస్‌కు లేదు'
తెలంగాణ బిల్లు సభకు వచ్చినంత మాత్రాన చర్చకు వచ్చినట్లు కాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ... విభజన చర్చపై కచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు విరామం అవసరమని ఆయన పేర్కొన్నారు. విభజన ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం అవసరమన్నారు. విభజన ప్రక్రియను ముందుకు నడిపే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన తెలిపారు. -
రాష్ర్ట రైతులకు మరణ శాసనమే
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్ రైతులకు మరణ శాసనం రాసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నాటక ప్రభుత్వ వాదనలే జడ్జిమెంట్ రూపంలో వచ్చాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టాన్ని చేసిన అత్యంత భయంకర తీర్పుగా చరిత్రలో మిగిలిపోతుందని చెప్పారు. నీటి పారుదల రంగంపై కనీస అవగాహనలేని న్యాయవాదులు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించడం వల్లే రాష్ట్ర రైతులకు ఈ పరిస్థితులు దాపురించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాపరివాహక ప్రాంత రైతులు, విశ్రాంత అధికారులు, న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ సూచనల ప్రకారం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం పూటకోమాట మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాట్లాడుతూ సమర్థవంతమైన న్యాయవాదులను పెట్టి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు నిమ్మకాయల రాజ నారాయణ, తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విమర్శలు.. దూషణలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి అనుగుణంగా మాట్లాడాలన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూచించిన నేపథ్యంలో ఆ పార్టీ రెండు ప్రాంతాల నే తలు పరస్పర విమర్శలు, వాగ్వివాదాల స్థాయిని దాటి దూషణల పర్వంలోకి దిగుతున్నారు. కొద్దిరోజుల కిందట సీమాంధ్రకు చెందిన పయ్యావుల కేశవ్, తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒకరినొకరు వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఇదేతీరులో కోడెల శివప్రసాదరావు, మోత్కుపల్లి నర్సింహులు మధ్య ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే వాగ్వాదం జరిగింది. తాజాగా శుక్రవారం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, తెలంగాణ టీడీపీ ఫోరం నేత ఎర్రబెల్లి మధ్య మాటల యుద్ధం సాగింది. విభజనపై రమేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడాన్ని నిజామాబాద్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎర్రబెల్లి తప్పుబట్టారు. దానిపై స్పందించిన రమేష్ తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చినప్పటికీ ఆ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయలేని ఎర్రబెల్లి తనపై మాట్లాడటమేంటని ఎద్దేవా చేశారు. వార్డు సభ్యుడిగా గెలవలేని వ్యక్తి రాజ్యసభ సభ్యుడు కావొచ్చన్న కనీస పరిజ్ఞానం కూడా లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. వరంగల్‌లో ఉన్న ఎర్రబెల్లి శుక్రవారం రమేష్ వ్యాఖ్యలపై స్పందించారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తిని రాజ్యసభకు పంపిస్తే ఇలాగే ఉంటుందని, రమేష్‌లాంటి దళారులు, మోసగాళ్లు, వ్యాపారవేత్తలకు చంద్రబాబు రాజ్యసభ టికె ట్లిచ్చారని దుమ్మెత్తిపోశారు. అంతటితో ఆగకుండా పార్టీలో ఇలాంటి వారుండాలో తాముండాలో చంద్రబాబు తేల్చుకోవాలని కూడా సవాలు చేశారు. అయితే నేతలు తమ సొంత ఇమేజీ కోసం ఇలా మాట్లాడుతున్నారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. అంతకుముందు వీరి మధ్య వాగ్వాద అంశం చంద్రబాబు దృష్టికి తెచ్చినప్పుడు ఆయన నవ్వి ఊరుకున్నట్టు చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకుంటే కిరణ్ ప్రభుత్వం కూలిపోతుందని, తద్వారా తెలంగాణ బిల్లును అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవచ్చని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ .. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తే ఆయన బలం నిరూపించుకోవాల్సిందిగా సీఎంను కోరతారని అప్పుడు ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. పొలిట్‌బ్యూరోలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీఎం రమేష్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా చంద్రబాబును కోరతామని ఎర్రబెల్లి చెప్పారు. హన్మకొండలో విలేకరులతో మాట్లాడుతూ రమేష్ తెలంగాణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లడం సరికాదన్నారు. -
టీడీపీలో విభజన చిచ్చు
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీలో విభజన చిచ్చు రాజుకుంది. కొంతకాలంగా సీమాంధ్ర, తెలంగాణ నాయకులు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తెలంగాణ టీడీపీ ఫోరం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పయ్యావుల కేశవ్ మధ్య నడుస్తున్న వివాదం పార్టీలో చిచ్చు పెట్టింది. రాష్ట్ర విభజనపై పయ్యావుల సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో టీడీపీలో ముసలం మొదలయింది. తెలంగాణ నాయకులు పయ్యావుల చర్యను తీవ్రంగా వ్యతిరేకించగా, సీమాంధ్ర నేతలు ఆయనను వెనకేసుకొచ్చారు. అప్పటినుంచి ఇరుప్రాంతాల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా పయ్యావుల కేశవ్‌పై ఎర్రబెల్లి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశం పెట్టి ఏకిపారేశారు. పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాదరావు పార్టీలో చీడ పురుగులంటూ దుయ్యబట్టారు. చీడపురుగులను ఏరివేస్తేనే పార్టీ బాగుపడుతుందని సలహాయిచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తప్పుడు మాటలు తప్పుడు కూస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. పొలిట్ బ్యూరో నిర్ణయాన్ని ధిక్కరించే దమ్ము పయ్యావులకు ఉందా అని ప్రశ్నించారు. పయ్యావుల కోన్ కిస్కా అంటూ ధ్వజమెత్తారు. ప్రధానికి రాసిన లేఖలో సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు కోరారని తెలిపారు. తెలంగాణ ప్రక్రియను నిలిపివేయాలని కోరలేదని స్పష్టం చేశారు. ఏమరేమన్నా టీడీపీ తెలంగాణ కట్టుబడి ఉంటుందని ఎర్రబెల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు చొక్కాపట్టుకుని నిలదీయాలి: రోజా
హైదరాబాద్: టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడంకాదు, చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకుని నిలదీయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా సలహా ఇచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రుల బృందానికి లేఖలు ఎందుకు ఇవ్వడంలేదని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు, కిరణ్‌లకు వారి సొంత జిల్లా ప్రజల కష్టాలు కూడా తెలియడంలేదా? ఆమె ప్రశ్నించారు. వీరిద్దరూ గాంధీగారి మూడు కోతుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలుగు వారికి వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు అన్న అయితే కిరణ్ తమ్ముడిలా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఆడమన్నట్లు ఆడుతున్నారన్నారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సోనియా గాంధీ ఆదేశాల కోసం ఎదురు చూస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీ సమైక్య నినాదంతో ప్రజల ముందుకు రావాలని రోజా పిలుపు ఇచ్చారు. కలిసి ఉంటేనే కలదు సుఖం అని గుర్తించి, విడిపోయిన దేశాలు సైతం కలిసిపోతున్నాయన్నారు. విడిపోయి అన్ని రకాలుగా నష్టపోవడం కన్నా కలిసుండి అభివృద్ధి చెందడమే మేలని ప్రపంచ దేశాలు గుర్తించాయని తెలిపారు. విడిపోయిన దేశాలే కలిసిపోతున్నప్పుడు కలిసున్న రాష్ట్రాన్ని విభజించడం న్యాయమా? అని కాంగ్రెస్, టీడీపీ నేతలను రోజా ప్రశ్నించారు. అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య తీర్మానం చేసే అవకాశమున్నా సీఎం కిరణ్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మెజార్టీ ఎమ్మెల్యేలు సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నా కిరణ్‌కుమార్‌రెడ్డికి కనిపించట్లేదా? అని నిలదీశారు. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపిచాలని ఎందుకు కోరడం లేదని అడిగారు. సీఎం కిరణ్, చంద్రబాబు ఇద్దరూ వేర్పాటువాదులేనని దీన్నిబట్టే స్పష్టమవుతోందని రోజా అన్నారు. -
పయ్యావుల కేశవ్ ను సస్పెండ్ చేయాలి: ఎర్రబెల్లి
టీడీపీని ఇరుకున పెట్టేందుకే మళ్లీ అఖిల పక్షం నిర్వహిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు వచ్చే వారంలో రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఉంటుందన్న వార్తలపై టీడీపీ సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు కోసం టీడీపీని ఒప్పించాం అని అన్నారు. అఖిలపక్షానికి టీడీపీ వెళ్లాల్సిన అవసరం లేదు అని అన్నారు. అఖిల పక్షానికి ఇరు పార్టీల జేఏసీలు వెళితే సరిపోతుంది ఆయన సూచించారు. త్వరలోనే తెలంగాణ టీడీపీ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. అఖిల పక్షం భేటి, తాజా రాజకీయాలపై చర్చ చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిని ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన పయ్యావుల కేశవ్ ను సస్పెండ్ చేయాలి అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా... వ్యక్తిగతంగానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను అని పయ్యావుల కేశవ్ తెలిపిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) నవంబర్ 7వ తేదీన మలివిడత సమావేశం కానున్న నేపథ్యంలో.. జీఓఎం భేటీకి ముందే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించే అవకాశముందని బుధవారం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. -
కేంద్రం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది: పయ్యావుల కేశవ్
రాజ్యాంగ విభజన బిల్లును ఆమోదించవద్దు రాష్ట్రపతికి పయ్యావుల లేఖ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన విషయంలో కేంద్రం ఏకపక్ష ధోరణితో వ్యవహరించటం దుర్మార్గమని, విభజన బిల్లును ఆమోదించవద్దని రాష్ర్టపతి ప్రణబ్‌కుమార్ ముఖర్జీని టీడీపీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ కోరారు.రాష్ట్రపతికి రాసిన లేఖను కేశవ్ బుధవారం టీడీఎల్పీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. శాసనసభ కోరితేనే రాష్ర్ట విభజన ప్రక్రియ ప్రారంభం కావాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా పేర్కొన్నా అందుకు పూర్తి విరుద్ధంగా కేంద్రం ప్రవర్తించటం సరికాదని లేఖలో పేర్కొన్నారు. ప్రధాని లేదా గవర్నర్ల ద్వారా బిల్లును రాష్ట్రపతి అసెంబ్లీకి పంపి అభిప్రాయాన్ని తీసుకుంటారని అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన సర్కారియా కమిషన్ కూడా నూతన రాష్ట్రాల ఏర్పాటు తొలి ఎస్ఆర్సీ ఆధారంగా లేదా శాసనసభ కోరితే లేదంటే విభజన కోసం ఏర్పాటు చేసిన కమిటీ లేదా కమిషన్ ద్వారా జరగాలని స్పష్టంగా పేర్కొందని తెలిపారు. 2010లో జస్టిస్ పూంఛీ కమిషన్ తన నివేదికలో ఒక మెజారిటీ గ్రూప్ లేదా ప్రాంతం విభజన కోరితే ఆ రాష్ర్ట ఆమోదం మేర కే అది జరగాలని పేర్కొందని తెలిపారు. 2000వ సంవత్సరంలో అప్పటి ఉప ప్రధాని ఎల్కే అద్వానీ పార్లమెంటులో రాష్ట్రాల విభజనపై మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనేది శాసనసభ కోరిక మేరకు జరగాలని, కేంద్ర ప్రభుత్వ విధానం కూడా ఇదేనని స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని 2009లో అప్పటి హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన చేసిన సమయంలో కూడా శాసనసభ తీర్మానం కోరతామని చెప్పారని గుర్తు చేశారు. కేంద్రం ఒక విధానాన్ని పాటించకుండా తప్పుల తడకగా రాష్ట్ర విభజన అంశాన్ని మంత్రివర్గంలో టేబుల్ అంశంగా పెట్టి ఆమోదించిన నేపథ్యంలో విభజన బిల్లును రాష్ర్టపతి ఆమోదించటం రాజ్యాంగ విరుద్ధమౌతుందని చెప్పారు. రాజ్యాంగ సంరక్షులైన మీరు ఏడు కోట్ల మంది ప్రజలను అవమాన పరిచే, అవహేళనగురిచేసే విధంగా వ్యవహరించ రని విశ్వసిస్తున్నట్లు లేఖలో కేశవ్ పేర్కొన్నారు. -
జగన్‌పై కేసుల విషయంలోనే చంద్రబాబు ఢిల్లీ యానం: కేశవ్
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై కేసుల వ్యవహారం కూడా ఎజెండాగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ స్పష్టంచేశారు. ఆయన శనివారం ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. జగన్ కేసుల్లో దర్యాప్తు ఇంకా పూర్తి కాక ముందే తుది చార్జిషీటు ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. ఇదే అంశంపై దర్యాప్తు సంస్థలను కలుస్తామన్నారు. సీబీఐ, ఈడీల దర్యాప్తు వేగం తగ్గిందన్నారు. దర్యాప్తుపైన తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సీబీఐ చెప్పినట్టు సమానమైన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేయలేదన్నారు. ఈ విషయాలన్నింటినీ ఆయా దర్యాప్తు సంస్థల పెద్దలను, ప్రభుత్వంలోని ముఖ్యులను కలిసి వివరిస్తామన్నారు. జగన్ కేసును పర్యవేక్షించే సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను తొలుత బదిలీ చేశారని, ఆయన బదిలీ వ్యవహారంపై కొందరు కోర్టును ఆశ్రయిస్తే తాము పర్యవేక్షణాధికారిని బదిలీ చేశాం తప్ప దర్యాప్తు అధికారిని కాదని అపుడు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని, తాజాగా దర్యాప్తు అధికారి వెంకటేష్‌ను కూడా బదిలీ చేసి మరో అధికారిని నియమించారని కేశవ్ పేర్కొన్నారు. ఈ ప్రశ్నలకు బదులివ్వగలరా? ఈ విలేకరుల సమావేశానికి ‘సాక్షి’ని అనుమతించలేదు. వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్తను ఇస్తున్నాం. ఒకవేళ అనుమతించి ఉంటే ‘సాక్షి’ ఈ కింది ప్రశ్నలు వేసి సమాధానాలు కోరేది... - జగన్మోహన్రెడ్డిపై కేసులో నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయమని స్వయంగా సుప్రీంకోర్టే చెప్పింది? ఆ గడువు సెప్టెంబర్ 9 తో ముగిసింది. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయినా సరే జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవద్దన్నది మీ పార్టీ ఉద్దేశమా? ఇప్పటికే దాదాపు 16 నెలలుగా జైలులో పెట్టారు. ఇంకెంతకాలం పెట్టాలని మీ ఉద్దేశం? రాజ్యాంగం ప్రకారం జగన్‌కు ఎలాంటి హక్కు ఉండకూడదని మీరు చెప్తున్నారా? - జగన్ అంటేనే మీరెందుకు భయపడుతున్నారు? ఆయన ను ప్రజలు అభిమానిస్తున్నారు కనుక ఆయన జైలు బయటకు రాకుండా ఉండాలని మీ పార్టీ కోరుకుంటోందా? - జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నప్పుడల్లా మీరు ఢిల్లీ వెళ్లి తెరవెనుక తతంగాలు ఎందుకు జరుపుతున్నట్లు? మీ నాయకుడు చంద్రబాబు చీకటి భేటీలకు సంబంధించి కేంద్రమంత్రి చిదంబరం స్వయంగా లోక్‌సభలో చెప్పిన విషయం మరిచారా? - జగన్‌పై 2010 ఆగస్టులో సీబీఐ కేసులు నమోదు చేసి గడిచిన మూడేళ్లకు పైగా దర్యాప్తు సాగిస్తోంది. అయినా దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని మీరెలా చెప్తారు? దర్యాప్తు పూర్తి కాలేదని సీబీఐ మీ పార్టీ నేతలకు చెప్పిందా? లేదా సీబీఐ లోపల మీ మనుషులెవరైనా ఉన్నారా? - గతంలో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలోనే మీ పార్టీ ఎంపీలు వెళ్లి కేంద్రమంత్రి చిదంబరంను కలవటం.. వెంటనే ‘సాక్షి’ ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలివ్వటం వెనుక మతలబు ఏమిటి? - సీమాంధ్రలో ప్రజలు పెద్దఎత్తున ఉద్యమిస్తుంటే.. తెలుగు ఆత్మగౌరవ యాత్ర అంటూ బయలుదేరిన చంద్రబాబు అకస్మాత్తుగా ఆ యాత్రకు బ్రేక్ వేసి ఢిల్లీ వెళ్లటానికి ప్రణాళికలు రూపొందించటమంటే.. ప్రజల సమస్యలకన్నా మీ దృష్టి జగన్‌పైనే ఉందన్న విషయం అర్థంకావటం లేదా? - సాధారణంగా సీబీఐలో ఎవరైనా అధికారి మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పైన పనిచేస్తారు. అయినా జేడీ లక్ష్మీనారాయణను అసాధారణంగా ఏడేళ్ల పాటు కొనసాగించిన విషయం మీకు తెలియదా? అంతకుమించి కొనసాగించటానికి కూడా సీబీఐ నిబంధనలు అంగీకరించవని తెలియదా? అలాగే దర్యాప్తు అధికారి వెంకటేష్ డిప్యుటేషన్ కూడా గడిచిన జూలైలోనే పూర్తయిందన్న విషయం తెలియదా? - జగన్‌పై కేసుల విషయంలో మీరు చెప్పిన అధికారులే దర్యాప్తు చేయాలని కోరుతున్నారా? మీరు చెప్పినట్టు నడుచుకునే అధికారులే ఉండాలని ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కోరతారా? -
శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఎందుకు తొక్కిపెట్టినట్లు?
హైదరాబాద్ : తాంబులాలు ఇచ్చాం ...తన్నుకు చావండి అన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకుండా.... విభజన ప్రక్రియను వేగవంతం చేస్తామనటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. సోనియా అనారోగ్యం, నరేంద్రమోడీకి పెరుగుతున్న కీర్తి, కుంభకోణాలతో తగ్గిపోతున్న కాంగ్రెస్ ప్రాభవం నేపథ్యంలో అనైతికంగా అయినా అధికారాన్ని చేజారకుండా రాష్ట్ర విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చిందని పయ్యావుల విమర్శించారు. రూ. 30 కోట్లు ఖర్చుపెట్టి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తయారు చేసిన నివేదికను పార్లమెంట్లో పట్టుమని గంట కూడా చర్చించలేదని పయ్యావుల వ్యాఖ్యానించారు. శ్రీకృష్ణ కమిటీని ఎందుకు కాంగ్రెస్ తొక్కిపెట్టిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ముందుకు.... వెనక్కి వెళ్లలేకుండా ఉందన్నారు. రాష్ట్ర విభజన అంశం అత్యంత జఠిలమైన అంశమని పయ్యావుల అన్నారు. -
జలసౌధ, విద్యుత్ సౌధ ఉద్యోగుల మధ్య విభజన చిచ్చు
విభజన ప్రకటన నేపథ్యంలో రాజధానిలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మొన్నటికి మొన్న అబిడ్స్‌లోని బీమా భవన్లో ఇరు ప్రాంతాల ఉద్యోగుల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, మంగళవారం జలసౌధ, విద్యుత్సౌధలతో అదే దృశ్యం పునరావృతమైంది. ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయం జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో మారుమ్రోగిపోయింది. టీఎన్జీఓ ఉద్యోగులకు, ఏపీఎన్జీవో ఉద్యోగులకు మధ్య తోపులాట తీవ్ర వాగ్వాదానికి చోటుచేసుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను జరుపుకునేందుకు టీఎన్జీఓలు భోజన విరామ సమయంలో సన్నద్ధమయ్యారు. మరోవైపు అదేసమయంలో ఏపీఎన్జీవోలు సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనైన టీఎన్జీవోలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టివేసుకునేవరకు పరిస్థితి రావడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయించేందుకు యత్నించారు. వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ, అడీషనల్ డీసీపీ నాగరాజు, ఏసీపీలు వెంకటనర్సయ్య, వినోద్‌కుమార్, ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, ప్రభాకర్ తదితరులు వచ్చి పరిస్థితిని చక్కబెట్టారు. ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులను అక్కడి నుంచి పంపించేశారు. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ సిటీ ప్రెసిడెంట్ పీవీవీ సత్యనారాయణను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ నగర అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మరో పది సంవత్సరాలు తమతో కలిసి ఉండాల్సిన ఉద్యోగులు ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులను అక్కడకు పిలిపించుకొని కవ్వింపు చర్యలకు పాల్పడడం తగదని విమర్శించారు. 42రోజులు సకలజనుల సమ్మె సమయంలో కూడా ఏ ఉద్యోగికి ఎటువంటి ఇబ్బందులు కల్గించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి జరిగే సమ్మె గురించి చర్చించుకునేందుకు తాము సమావేశమైతే ‘సీమాంధ్ర గోబ్యాక్’ అంటూ టీఎన్జీవో నాయకులు రెచ్చగొట్టారని ఏపీఎన్జీవో నగర అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పయ్యావుల రాకతో విద్యుత్‌సౌధలో ఉద్రిక్తత విద్యుత్ ప్రధాన కార్యాలయం విద్యుత్‌సౌధలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం మధ్యాహ్నం టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విద్యుత్‌సౌధకు వచ్చి ఇక్కడి సీమాంధ్ర ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఇంతలో అక్కడకు చేరుకున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సీమాంధ్ర ఉద్యోగులను, పయ్యావుల కేశవ్‌ను చుట్టుముట్టారు. ఎంతోకాలంగా కలిసిమెలిసి ఉంటున్న ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టేందుకే వచ్చావా? మా కార్యాలయంలో నీకేం పని? అంటూ కేశవ్‌ను నిలదీశారు. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. పోలీసులు ఇరువర్గాల వారిని సముదాయించి కేశవ్‌ను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఉద్యోగులు కూడా ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు. -
రాజకీయ కోణంలోనే విభజన: పయ్యావుల
అనంతపురం : కాంగ్రెస్ పార్టీపై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన పద్ధతి ప్రకారం జరగలేదని, రాజకీయ కోణంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని ఆయన సోమవారమిక్కడ మండిపడ్డారు. సీమాంధ్రుల కష్టాలను పార్లమెంట్ దృష్టికి తీసుకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా పార్లమెంట్ ను స్తంభింప చేయాలని ఆయన అన్నారు. సీమాంధ్ర ఎంపీల వైఫల్యం వల్లే రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిందని పయ్యావులు విమర్శించారు. ఎంపీలు హైకమాండ్ తొత్తులుగా మారారని ఆయన ధ్వజమెత్తారు. సీమాంధ్రుల్లో చీలిక తెచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారని పయ్యావుల వ్యాఖ్యానించారు. కావూరి సాంబశివరావు, చిరంజీవి, లగడపాటి రాజగోపాల్‌లకు వ్యాపారాలే ముఖ్యమని పయ్యావుల విమర్శలు చేశారు. లగడపాటి టీవీలకే పరిమితం కాకుండా సీమాంధ్రులకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాలన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరని ఆయన అన్నారు. ఉండవల్లివి ఊసరవెల్లి ప్రసంగాలని ఆయన మండిపడ్డారు.