
పవన్ వల్ల టీడీపీకి ఓట్లు పెరగలేదు: కేశవ్
సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వల్లగానీ, మరేఇతర పార్టీల వల్ల తెలుగుదేశం పార్టీకి ఓట్ల శాతం పెరగలేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు.
పవన్ కాళ్లు, మోదీ గడ్డం పట్టుకొనే అధికారంలోకి వచ్చారు: రామచంద్రయ్య
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వల్లగానీ, మరేఇతర పార్టీల వల్ల తెలుగుదేశం పార్టీకి ఓట్ల శాతం పెరగలేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం శాసనమండలిలో కరువుపై చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రతిపక్షనేత సి. రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో భయంకరమైన కరువు ఛాయలు నెలకొన్నా ప్రభుత్వంలో ఎలాంటి స్పందనా లేదని ఆరోపించారు.
దీన్ని అధికార పార్టీ సభ్యులు అడ్డుకోవడంతో ఆగ్రహం చెందిన రామచంద్రయ్య సినీనటుడు పవన్ కల్యాణ్ కాళ్లు, నరేంద్రమోదీ గడ్డం పట్టుకొని అధికారంలోకి వచ్చిన మీకు (టీడీపీ) ప్రజల ఇబ్బందులు తెలుసుకొనే ఆసక్తి లేకపోవడం శోచనీయమన్నారు. అందుకు టీడీపీ సభ్యుడు కేశవ్ కలుగజేసుకొని పై వ్యాఖ్యలు చేశారు.