కంగుతిన్న కమలనాథులు
- బీజేపీకి ఘోర పరాజయం
- ఫలించని మోడీ మంత్రం
- పనిచేయని పవనిజం
- బాబు హామీలు నమ్మని జనం
మదనపల్లె, న్యూస్‌లైన్: జిల్లాలో ఓటర్లు ఇచ్చిన తీర్పును చూసి బీజేపీ నాయకులు కంగుతిన్నా రు. టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా రాజంపేట, తిరుపతి లోక్‌సభ స్థానాల ను, మదనపల్లె అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కి కేటాయించారు. అయితే మోడీ గాలి, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పన్నాగాలు జిల్లాలో ఫలించలేదు. మూడు స్థానాల్లో నూ బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, వైఎస్సార్ సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చేతిలో 1.74 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చెందా రు.
ఇక తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున జయరాం పోటీ చేశారు. ఈయన కూడా వైఎస్సార్ సీపీ అభ్యర్థి వరప్రసాద్ చేతిలో ఓటమి చెందారు. మదనపల్లె అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లపల్లె నరసింహారెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థి దేశాయ్ తిప్పారెడ్డి చేతిలో 17,039 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. బీజే పీ అభ్యర్థుల గెలుపు కోసం నరేంద్రమోడీ తిరుపతి, మదనపల్లెలో బహిరం గ సభలు, ప్రచారం నిర్వహించారు.
అయితే దేశవ్యాప్తంగా మోడీ గాలి వీచి నా చంద్రబాబు సొంత జిల్లాలో ఏమాత్రం పని చేయలేదు. మోడీ ప్రభంజనా న్ని, చంద్రబాబు ప్రకటించిన పథకాల ను ఓటర్లు నమ్మలేదు. మూడు స్థానాల్లో నూ బీజేపీ ఓటమి చెందడంతో ఆ పార్టీ నాయకుల్లో కలవరం రేగింది. టీడీపీ నుంచి పూర్తిస్థాయిలో సహకారం లేక పోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్న విమర్శలు బీజేపీ నాయకుల నుంచి విని పిస్తున్నాయి. పురందేశ్వరి, చల్లపల్లె నరసింహారెడ్డి ఓటమిని పార్టీ నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఎన్నిక ల్లో ఎన్నో ఆశలు, అంచనాలతో ఉన్న బీజేపీ నాయకులు జిల్లాలో వచ్చిన ఫలి తాలను చూసి కంగుతిన్నారు.