Curriculum
-
కేంద్రం చేతి కీలుబొమ్మ యూజీసీ!
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఆచార్యుల నియామకాలు, పదోన్నతి కోసం కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల పరిరక్షణ పేరిట యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జనవరి 6న ముసాయిదా డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. దీనిపై ఫిబ్రవరి 5 లోగా ప్రజాభిప్రాయం సేకరించి, నూతన మార్గదర్శకాలు (guildelines) వెల్లడించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ముసాయిదా (Draft) పూర్తిగా యూనివర్సిటీలను కేంద్రీకరించడానికి, ప్రయివేటీకరణకు మరో ప్రయత్నంగా మాత్రమే కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనలు విద్యలో రాష్ట్రాల హక్కులను, నిర్ణయాధికారాన్ని బలహీనపరుస్తాయి. ఇవి మొత్తంగా ఫెడరల్ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ మూల సూత్రాలను బలహీన పరుస్తు న్నాయి.ఇప్పటి వరకూ వైస్ ఛాన్సలర్ (వీసీ)ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ (Search Committee) వేస్తూ వస్తోంది. కమిటీలో ముగ్గురు సభ్యులు – యూజీసీ ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదించిన సభ్యుడు, యూని వర్సిటీ కౌన్సిల్ ప్రతినిధి ఉంటు న్నారు. ఈ సెర్చ్ కమిటీ సీనియారిటీ, అర్హతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ముగ్గురు పేర్లను సూచిస్తుంది. ఆ ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని గవర్నర్ ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడు సవరించిన నియమాలు వైస్–ఛాన్సలర్ల ఎంపికలో రాష్ట్ర గవర్నర్లకు ఎక్కువ అధికారాన్ని ఇస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కేరళ (Kerala) వంటి అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలు వీసీల నియామకంపై గవర్నర్లతో విభేదిస్తున్నాయి. పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే వరుసలో ఉన్నాయి.మొదటిసారిగా వీసీల నియామకాల్లో నాన్ అకడమిక్ వ్యక్తులను నియమించాలని తాజా ముసాయిదా సిఫార్సులు చేసింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమితులు కావాలంటే ప్రొఫెసర్‌గా లేదా కీలకమైన పరిశోధనలో లేదా అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కనీసం పది సంవత్సరాల పాటు పనిచేసి ఉండాలి. అయితే తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పరిశ్రమలలో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో, ప్రభుత్వ లేదా కనీసం ప్రభుత్వరంగ సంస్థలో కనీసం పది సంవత్సరాల సీనియర్ స్థాయి అనుభవం గడించి ఉంటే సరిపోతుంది.ముసాయిదాలో రిజర్వేషన్లను మరిచారు. ఇది ఉన్నత విద్యలో పూర్తిస్థాయి కార్పొరేట్ సంస్కృతిని చొప్పిస్తుంది. అలాగే ఉపాధ్యాయులకు నిర్దిష్ట బోధన సమయం ప్రస్తావించలేదు. ‘నెట్’ అవసరం లేకుండా ‘మాస్టర్స్ డిగ్రీ’ ఉంటే చాలు అనే విషయమైతే జీర్ణించుకోవటానికే కష్టంగా ఉంటుంది. 55 శాతం మార్కులతో మాస్టర్స్ సాధించిన వారిని యూజీసీ–నెట్లో అర్హత సాధించకపోయినా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నేరుగా నియమించుకోవచ్చని పేర్కొన్నారు. యూజీసీ (UGC) చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ. ఇది ఉన్నత విద్యా ప్రమాణాలు, సమన్వయం, నిర్ణయం, నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయాలకు డిగ్రీ కళాశాలలో బోధించే అధ్యా పకుల అర్హతలు ఏమి ఉండాలో నిర్ణయిస్తుంది. ఇంత స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన యూజీసీని కేంద్రం తన సొంత ఎజెండా అమలుపరిచేందుకు కీలు బొమ్మలా ఆడిస్తోంది.చదవండి: బౌద్ధ సంస్కృతితోనే వికాసం, ప్రకాశంకరిక్యులమ్, బోధనపరమైన అంశాలలో రాష్ట్రాల నియంత్రణ చాలా ముఖ్యమైనది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల నేపథ్యానికి అనుగుణంగా విద్యావిధానాన్ని రూపొందించు కోవాలి. కానీ ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రం ఒకొక్కటిగా తన అధీనంలోకి తీసుకుంటూ రాష్ట్రాలపై తన విధానాలను బలవంతంగా రుద్దుతోంది. వాటిని కాదని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేరళ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. మన దగ్గర కూడా మేధావులు, విద్యావేత్తలు యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నడుం బిగించాలి. రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్ష ప్రభుత్వాలు దీనిపై నోరు మెదపాలి. – కె. ప్రసన్న కుమార్,ఆంధ్రప్రదేశ్ ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర అధ్యక్షులు -
నో క్లాసులు...నో పాఠాలు..దాని పేరే అగోరా స్కూల్!
స్కూల్ అనగానే క్లాస్‌రూమ్‌లు, బల్లలు, బ్లాక్‌బోర్డులు, పాఠాలు చెప్పే టీచర్లు గుర్తుకొస్తారు. కానీ యూరప్‌లోని నెదర్ల్యాండ్స్ దేశంలో ఉన్న ‘అగోరా స్కూల్’లో మాత్రం అవేమీ ఉండవు. అక్కడున్న పిల్లలంతా తమకు నచ్చిన ఆటలు ఆడుకోవచ్చు, నచ్చినట్లు ఉండొచ్చు. అక్కడ గదుల్లో బల్లలు, కుర్చీలుంటాయి. కానీ అవేవీ మనకు మామూలు స్కూళ్లలో కనిపించేలా ఉండవు. అక్కడ పిల్లలు చూసేందుకు టీవీ, వాడేందుకు కంప్యూటర్లు ఉంటాయి. అక్కడ తరగతులకు బదులుగా గ్రూప్‌లు మాత్రమే ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో 17 మంది దాకా ఉంటారు. రకరకాల వయసున్నవారు ఒకచోట చేరతారు. స్కూల్‌కి రాగానే ఆ రోజు వారు చేయాల్సిన పనులను, పూర్తి చేయాల్సిన లక్ష్యాలను రాసుకుంటారు. ఇవి కూడా అందరికీ ఒకేలా ఉండవు. ఎవరికి తగ్గట్టు వారికి వేరుగా ఉంటాయి. ఒకరు సంగీతం నేర్చుకోవాలనుకుంటే మరొకరు పుస్తకం చదవాలన్నది పనిగా పెట్టుకుంటారు. మరొకరు ఆ రోజుకు ఒక బొమ్మ గీయడాన్ని లక్ష్యంగా మార్చుకుంటారు. టీచర్లు వారు చేయాలనుకున్న పనిలో సాయం చేస్తారు... కొట్టడం, కోప్పడటం లాంటివి చేయరు. ఆటల మీదే కాకుండా ఇతర అంశాల మీద దృష్టి పెట్టేవారు కూడా ఉంటారు. అలాంటి వారి కోసం అక్కడ రకరకాల విభాగాలున్నాయి. వంట నేర్చుకోవడం, శిల్పాలు చేయడం, చెక్కతో కళాకృతులు తయారు చేయడం, చిత్రలేఖనం, రోబోలు తయారు చేయడం.. ఇలా ఎవరికి నచ్చిన పని వారు నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. కేవలం చదువుకోవాలనుకునేవారి కోసం ‘సైలెంట్ రూమ్స్’ ఉంటాయి. అందులోకి వెళ్లి, కూర్చుని నచ్చిన పుస్తకాలు చదువుకోవచ్చు. రొటీన్ స్కూళ్లకు భిన్నంగా పిల్లలకు సృజనాత్మక విద్య నేర్పించాలనుకునే వారి కోసం 2014లో ఈ స్కూల్‌ని స్థాపించారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా పిల్లలు ఈ స్కూల్లో ఉంటారు. మొత్తం మూడు దేశాల్లో ఈ స్కూళ్లను మొదలుపెట్టారు. ప్రస్తుతం 1800 మందికిపైగా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. -
ఏపీలో విద్యా విధానం భేష్
మధురవాడ (భీమిలి): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక (కరికులమ్)బాగున్నాయని ఐబీ సిలబస్ అంతరాత్జీయ ప్రతినిధులు యూఎస్ఏకి చెందిన సీనియర్ కరికులమ్ డిజైన్ మేనేజర్ ఆర్డర్, యూకేకి చెందిన అసోసియేట్ మేనేజర్ మైఖేల్ ప్రశంసలు కురిపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఐబీ సిలబస్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో నార్త్ డివిజన్లో 10 రోజుల పర్యటనలో భాగంగా విశాఖ మహానగరంలోని చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్‌ను బుధవారం సందర్శించారు. ఇక్కడ కరికులమ్, కంప్యూటర్ విద్య, వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు, విద్యార్థులు పాఠాలను ఎలా అర్థం చేసుకుంటున్నారనే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఐఎఫ్‌పీ ప్యానల్స్, ట్యాబ్స్ ఉపయోగం, పిల్లల టాలెంట్స్‌ను పరిశీలించారు. బైలింగ్యువల్ టెక్ట్స్‌బుక్స్ పిల్లలకు ఎలా ఉపయోగపడుతున్నాయనే విషయాలతోపాటు బోధన తీరును కూడా పరిశీలించారు. సైన్స్‌డేని పురస్కరించుకుని విద్యార్థులు తయారు చేసిన మోడల్స్, వాటి గురించి వివరిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఈఆర్టీ ఆచార్యులు శ్రీనివాసరావు, డీఈఓ ఎల్.చంద్రకళ మాట్లాడుతూ.. ఐబీ సిలబస్ ప్రతినిధులు ఇక్కడి విద్యావిధానం బాగుందని చెప్పారన్నారు. రాష్ట్రంలో విద్యా విధానాన్ని పరిశీలించి ఆకళింపు చేసుకున్న ఐబీ ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినట్టు చెప్పారు. ఇందులో భాగంగా వేర్వేరు పాఠశాలలు, తరగతులను పరిశీలిస్తున్నారన్నారు. -
10, 12 బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు
న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు పరీక్షలు రాయాలా, లేదా ఒక్క పరీక్షకే హాజరు కావాలా అన్నది విద్యార్థుల ఇష్టమని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్ ఐచ్ఛికమే తప్ప, నిర్బంధం కాదని వివరించింది. విద్యార్థుల్లో పరీక్షంటే భయం దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్) సాధాసాధ్యాలపై మంత్రి ప్రధాన్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈకి మాదిరిగానే విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసేందుకు వీలు దొరుకుతుంది. బెస్ట్ స్కోర్ సాధించొచ్చు. ఈ ఆప్షన్ పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేశాం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు. ఏడాదిలో ఒకేసారి పరీక్ష ఉండటం, ఈ చాన్స్ మిస్సయితే ఒక సంవత్సరం కోల్పోతామనే భయం, ఒత్తిడి ఎక్కువమంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. దీంతో, వారు పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశమిస్తే ఇలాంటి భయాలు వారిలో ఉండవు. పూర్తిస్థాయిలో ప్రిపేరయి పరీక్ష రాస్తే సంతృప్తికరమైన స్కోర్ సాధించగలుగుతారు. ఒకసారి మంచి స్కోర్ తెచ్చుకున్న విద్యార్థి మరో విడత పరీక్ష రాయాలా వద్దా అనేది ఐచ్చికం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు’అని వివరించారు. 2024 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. డమ్మీ స్కూల్స్ పనిపడతాం రాజస్తాన్‌లోని కోటాలో పరీక్షలకు శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులు ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో బలవన్మరణాలకు పాల్పడటంపై మంత్రి ప్రధాన్ స్పందిస్తూ.. ‘ఇది చాలా సున్నితమైన అంశం. విస్మరించరానిది’అన్నారు. అదేవిధంగా, తమ సొంత రాష్ట్రంలోని స్కూల్లో అడ్మిట్ అయిన విద్యార్థులు అక్కడ చదవకుండా, పరీక్షల శిక్షణ కోసం కోటా వంటి చోట్లకు వెళ్తుండటంపై మంత్రి.. ఇటువంటి డమ్మీ స్కూళ్లపై చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం వచ్చిందన్నారు. పాఠశాలకు హాజరు కాకపోవడం విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని, వారు ఒంటరితనంతో బాధపడుతూ, ఒత్తిడులకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యా సంబంధ విధాన నిర్ణయాలపై ప్రభుత్వానికి సలహాలిచ్చే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ)ని ఆధునీకరిస్తామని మంత్రి ప్రధాన చెప్పారు. -
స్కూలు సిలబస్‌లో ‘పోక్సో’ చట్టం
తిరునంతపురం: పోక్సో చట్టాన్ని పాఠ్యాంశంగా తీసుకువచ్చేందుకు తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర హైకోర్టు ప్రశంసించింది. పాఠశాల స్థాయి విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించడంలో ఇప్పటికే 12 ఏళ్లు ఆలస్యమైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతోనే స్కూలు విద్యార్థులు, టీనేజర్లపై లైంగిక దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఇటీవల ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బెచు కరియన్ థామస్ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నారులు, ముఖ్యంగా టీనేజర్లపై లైంగిక నేరాలు ఇటీవల పెరిగి పోయాయని ఆయన అన్నారు. పోక్సో చట్టంలోని తీవ్రమైన శిక్షల గురించి తెలియకనే చాలా మంది విద్యార్థులు పరస్పరం లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారన్నారు. పోక్సో చట్టంపై వారికి ఎలాంటి అవగాహన లేదన్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం.. లైంగిక నేరాలు, వాటి పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను పాఠశాల సిలబస్‌లో పోక్సో చట్టం చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ), కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ కలిసి బడికి వెళ్లే బాలల్లో లైంగిక నేరాలపై అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను హైకోర్టు ప్రశంసించింది. -
డిగ్రీలో కొత్త పాఠ్యప్రణాళిక
-
టీచర్లు చెప్పలేకపోతున్నారు.. ఎందుకంటే?
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ టీచర్లలో సబ్జెక్టులపై మంచి పట్టు, ఆయా అంశాల్లో లోతైన పరిజ్ఞానం ఉన్నాయి. టీచింగ్ మెథడాలజీపై అవగాహన కూడా ఉంది. కానీ విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు..’ ప్రభుత్వ టీచర్ల పరిస్థితిపై నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చి అండ్ ట్రయినింగ్ (జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి–ఎన్సీఈఆర్టీ) విశ్లేషణ ఇది. దీనికి అనేక కారణాలున్నా అంతిమంగా పాఠ్యబోధన ద్వారా విద్యార్థుల్లో నెలకొనాల్సిన సామర్థ్యాలు, నైపుణ్యాలు నిర్దేశిత లక్ష్యాల మేరకు ఒనగూరడం లేదని తేల్చింది. దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి పాఠ్యప్రణాళికలు, సిలబస్ తీరుతెన్నులు, టీచర్ల నైపుణ్యాలు, విద్యార్థుల్లో సామర్థ్యాలు తదితర అనేక అంశాలపై ఎన్సీఈఆర్టీ విశ్లేషించింది. బోధన కంటెంట్ సమన్వయంలో సమస్యలు ఎన్సీఈఆర్టీ పరిధిలోని డిపార్టుమెంట్ ఆఫ్ కరిక్యులమ్ స్టడీస్ విభాగం టీచింగ్‌లో నాణ్యతను పరిశోధించడంలో భాగంగా సైన్సు టీచింగ్‌లో నాలెడ్జి, బోధనాపరమైన కంటెంట్‌ను సమన్వయం చేసుకోవడంలో టీచర్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై తరగతి గది బోధనను పరిశీలించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లోని 30 మంది టీచర్లను ఎంపిక చేసుకుంది. అందులో వచ్చిన ఫలితాలను విశ్లేషించింది. ఆ విశ్లేషణ మేరకు.. ► టీచర్లలో ఎక్కువమందికి టీచింగ్ మెథడ్స్‌పై మంచి అవగాహన ఉంది. బోధన విధానం, సబ్జెక్టుఅంశాల్లో లోతైన పరిజ్ఞానం ఉన్నాయి. కానీ వాటిని సమన్వయం పరచుకుని బోధించడంలో వారు విఫలమవుతున్నారు. ► పాఠ్యప్రణాళికలను రూపొందించడం, వాటిని కార్యరూపంలోకి తేవడం మధ్య చాలా అంతరం ఉంది. ► టీచర్లు బోధించాలనుకున్న అంశాలకు, బోధించిన అంశాలకు మధ్య చాలా తేడా ఉంటోంది. చాలామంది టీచర్లు తాము బోధించిన అంశాలను విద్యార్థులు నేర్చుకున్నారని భావించి అంతటితో సరిపెడుతున్నారు. (అమ్మాయిల ఐఐఠీవి.. ఐఐటీల్లో ఏడేళ్లలో ప్రవేశాలు రెట్టింపు) ► బోధన సమయంలో విద్యార్థులు బోధన కాన్సెప్టులను ఏమి నేర్చుకుంటున్నారు? ఎందుకు నేర్చుకుంటున్నారన్న అంశాలను టీచర్లు పట్టించుకోవడం లేదు. ► తరగతి గదుల్లో టీచర్లు ఉపన్యాస ధోరణిలో పాఠాలు చెప్పుకొంటూ పోతున్నారు. యాక్టివిటీ ఆధారిత విద్యావిధానం అమలవుతున్నప్పటికీ ఆ కాన్సెప్టును టీచర్లు సరిగా అర్థం చేసుకోలేదు. తాము అనుసరించే మార్గం కూడా అలాంటిదే అన్న భావనతో మూసపద్ధతిలో వెళుతున్నారు. విద్యార్థులకు సరిపోయే విధంగానే తాము బోధిస్తున్నామని భావిస్తున్నారు తప్ప వారికి ఏమేరకు అవగాహన అవుతోందో గమనించడం లేదు. ► అన్ని స్కూళ్లలోను ఆంగ్లమాధ్యమ బోధనతో భాషా సమస్య ఏర్పడి విద్యార్థులు, టీచర్లకు మధ్య ఇంటరాక్షన్ (పరస్పర సందేహ నివృత్తి)లో అంతరం బాగా పెరిగింది. ► టీచర్లు చాలా నైపుణ్యం కలవారే అయినా క్షేత్రస్థాయిలో ఒకింత గందరగోళం వల్ల విద్యార్థులకు, వారికి మధ్య అనుసంధానం ఏర్పడక వారు చెప్పదల్చుకున్న అంశాలను విద్యార్థులకు అందించలేకపోతున్నారు. ► దీనిపై సవాళ్లను ఎదుర్కొంటున్న టీచర్లు.. విద్యార్థుల్లో అనాసక్తి, వనరులలేమి, తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్య, ఫలితాలకోసం అధికారుల నుంచి ఒత్తిడి వంటి కారణాలను చెబుతున్నారు. (APPSC: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు..) ఏపీలో సమర్థంగా డీఈడీ అమలు ఆంధ్రప్రదేశ్‌లో డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ/డీఈఎల్ఈడీ)ని సమర్థంగా అమలు చేస్తున్నారని ఎన్సీఈఆర్టీ తన నివేదికలో పేర్కొంది. డీఈడీ ఫస్టియర్, సెకండియర్‌లో వేర్వేరుగా వివిధ కోర్సులను ఎన్సీటీఈ ప్రవేశపెట్టగా ఏపీ దాన్ని మరింత పటిష్టం చేసి అమలు చేయిస్తోంది. పాఠ్యప్రణాళిక, సిలబస్‌లో మార్పులుచేసి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)ని జోడించింది. స్కూల్ కల్చర్, లీడర్షిప్ వంటి అంశాలను పొందుపరిచింది. ఎలిమెంటరీ స్థాయిలో కూడా బోధన విధానాలను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. మాతృభాష బోధన, చైల్డ్‌హుడ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ పేపర్లను ప్రవేశపెట్టారని ఎన్సీఈఆర్టీ వివరించింది. -
అమెరికా స్కూల్లో ‘భారత ఫారెస్ట్ మ్యాన్’ పాఠం
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాంకు చెందిన జాదవ్ పాయెంగ్ ‘ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా చాలా మందికి సుపరిచితమే. నాలుగు దశాబ్ధాల పాటు ఒంటి చేత్తో కొన్ని వేల మొక్కలను నాటి ఏకంగా 550 ఎకరాల అడవిని సృష్టించాడు. గ్రామస్తులు చెట్లను నరకబోతుంటే ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడాడు. దీనిని గుర్తించిన భారతప్రభుత్వం అతనిని పద్మశ్రీతో సత్కరించింది. ఇక ఇప్పుడు జాదవ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని బిస్టల్ గ్రీన్ హిల్స్ స్కూల్లో ఆరవ తరగతి విద్యార్ధులకు బోధించే పాఠ్యాంశాలలో జాదవ్ గురించి తెలియజేస్తున్నారు. దీని గురించి టీచర్ నవామీ శర్మ మాట్లాడుతూ, ఎకాలజీ పాఠాలలో భాగంగా జాదవ్ చేసిన పనులను వివరిస్తున్నారు. ఒక వ్యక్తి ఏవిధంగా సమాజం మీద పాజిటివ్ ప్రభావాన్ని చూపగలడో భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో జాదవ్ గురించి పాఠ్యాంశాలలో చెబుతున్నామని నవామీ అన్నారు. అస్సాంకు చెందిన జాదవ్ పాయెంగ్ మజులి అనే నదిముఖ ద్వీపంలోని బీడు భూమిలో 40 సంవత్సారాల నుంచి ఒక్కొక్క మొక్క నాటడం మొదలుపెట్టాడు. అలా ఆయన ఏకంగా 550ఎకరాలతో ఒక అడవినే తయారు చేశారు. ఆ అడవిలో ఏనుగులు, పులులు, జింకలు ఇంకా ఎన్నో జంతువులు ఉన్నాయి. ఒక్కడిగా జాదవ్ మొదలు పెట్టిన పనివలన ప్రస్తుతం ఉంటున్న వారితో పాటు వచ్చే తరాల వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అందుకే జాదవ్ గురించి అమెరికా పాఠ్య పుస్తకాలలో కూడా వివరిస్తున్నారు. చదవండి: 'టైగర్' డాగ్.. వేటగాళ్ల గుండెల్లో గుబులు -
వ్యవసాయం ఇక పాఠ్యాంశం
న్యూఢిల్లీ: పాఠశాల స్థాయిలోనే వ్యవసాయాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా జాతీయ విద్యా విధానం 2020లో సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భవనా లను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన ప్రధాని అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి, వంట నూనె దిగుమతులు తగ్గించి ఫుడ్ ప్రాసెసింగ్‌ను పెంచడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ‘‘వ్యవసాయ రంగానికి సంబంధించిన విజ్ఞానం ప్రతీ విద్యార్థికి ఉండాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రామాల్లో మాధ్యమిక స్థాయిలో వ్యవసాయాన్ని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెడతాం’’అని ప్రధాని స్పష్టం చేశారు. అలా చేయడం వల్ల దేశంలో వ్యవసాయ రంగంలో పారిశ్రామిక ప్రగతి సాధ్యపడుతుందని వ్యవసాయం, దాని మార్కెటింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటివి చిన్నప్పట్నుంచి ప్రతీ ఒక్కరూ నేర్చుకుంటే వ్యవసాయదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. వ్యవసాయం, పరిశోధనల అనుసంధానం వచ్చే ఆరేళ్లలో వ్యవసాయాన్ని, పరిశోధనల్ని అనుసంధానం చేయడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. గ్రామాల స్థాయిలో చిన్న, సన్నకారు రైతులకి కూడా వ్యవసాయ రంగం పరిశోధనలు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. ఈ అంశంలో యూనివర్సిటీ విద్యార్థులు విస్తృత పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మాధ్యమిక విద్య స్థాయిలోనే వ్యవసాయాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెడితే ఆచరణలో ఎవరైనా బాగా రాణించడానికి ఉపయోగపడుతుందన్నారు. సాగులో సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. 30 ఏళ్ల తర్వాత భారత్‌పై దాడి చేసిన మిడతల దండుని తరిమి కొట్టడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించామన్నారు. వివిధ నగరాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, డ్రోన్లు తదితర ఆధునిక పరిజ్ఞానం సాయంతో మిడతలపై మందులు పిచికారీ చేయడంతో పంటలకు నష్టం జరగలేదన్నారు. -
ఎంబీబీఎస్ విద్యార్థులకు కొత్త కరిక్యులం
సాక్షి, అమరావతి: వైద్య పద్ధతులు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఎంబీబీఎస్ విద్యార్థులకు కొత్త కరిక్యులం రూపొందించారు. ఎర్లీ క్లినికల్ ఎక్స్పోజర్ పేరుతో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (భారతీయ వైద్య మండలి రద్దు అనంతరం ఏర్పాటు అయిన బోర్డు) కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. సాధారణంగా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు కేవలం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులు మాత్రమే చదువుతారు. రెండో ఏడాది నుంచి రోగుల వార్డులోకి పంపిస్తారు. ఇకపై అలా కాకుండా మొదటి ఏడాది నుంచే రోగుల పర్యవేక్షణకు పంపించాలని నిర్ణయించారు. రోగులకు నిర్వహించే పరీక్షలు, ఆపరేషన్లు, ఈసీజీ ఇలా ప్రతి వైద్య ప్రక్రియలోనూ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని కొత్త కరిక్యులంలో రూపొందించారు. చాలామంది ఎంబీబీఎస్ పూర్తయ్యే నాటికి కూడా రోగులతో ఎలా వ్యవహరించాలి? చికిత్స అందించడంలో వారికి ఎలాంటి నమ్మకం కలిగించాలి? చికిత్స పద్ధతులు వంటివి తెలుసుకోలేక పోతున్నారని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ పేర్కొన్నారు. విద్యార్థులకు ఆయా కళాశాలల అధ్యాపకులు రోగులకు క్లిష్టతరమైన వైద్య పద్ధతులను సైతం సులభతరంగా ఎలా అందించాలి? జబ్బులను ఎలా పసిగట్టాలి? వంటి వాటిని నేర్పించాలన్నారు. కొత్త కరికులంలో భాగంగా మొదటి సంవత్సరంలో చదివే సబ్జెక్టులతో పాటు విద్యార్థులు ఆపరేషన్ థియేటర్లకు కూడా వెళ్లే విధంగా కరిక్యులం రూపొందించినట్టు తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలకు ఆదేశాలు జారీచేశారు. -
ఉపాధికి ఊతమిచ్చేలా కోర్సుల రీడిజైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా వివిధ కోర్సుల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, దీని లో భాగంగా తాము కోర్సులను రీడిజైన్ చేస్తున్నామని ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లా డారు. వివిధ సర్వేల ప్రకారం దేశంలో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 20% మందికి, నాన్ ఇంజనీరింగ్ విద్యా ర్థుల్లో 10% మందికే ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని, యూజీ, పీజీ, పీహెచ్డీ చేసిన వారికీ ఉపాధి లభించట్లేదని చెప్పారు. మార్కెట్ అవసరాల మేరకు వివిధ కోర్సుల్లో సిలబస్ మార్పులు చేస్తున్నామని, దీని కనుగుణంగా వర్సిటీ కోర్సుల్లో సంస్కరణలు తెస్తున్నా మన్నారు. వర్సిటీ పాలన విషయంలో పలు మార్పుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇంజనీరింగ్ కోర్సుల సిలబస్‌లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) మార్పు లు చేసిందని, తమ పరిధిలోని కాలేజీల్లో వాటి అమలుకు చర్యలు చేపట్టామన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో కొత్త కరిక్యులమ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇంజనీరింగ్‌లో ఎంటెక్ మైనింగ్, పీజీ డిప్లొమా ఇన్ జెనెటిక్స్ను ఈ విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. విదేశీ విద్యార్థుల ఆకర్షణలో రెండో స్థానం విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో పూణే వర్సిటీ మొదటి స్థానంలో ఉంటే... ఓయూ రెండో స్థానంలో ఉందని రామచంద్రం తెలిపారు. ప్రస్తుతం ఓయూలో 3,630 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారని, వారి కోసం ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని, అందుకు నిధులు అవసరమని అన్నారు. -
రాజస్ధాన్ పోటీ పరీకల్లో భగవద్గీత ప్రశ్నలు
సాక్షి, జైపూర్ : రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 2018 (ఆర్ఏఎస్) పరీక్షకు సంబంధించి జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ పేపర్లో భగవద్గీత సారాంశానికి సంబంధించిన పాఠాలను సిలబస్ లో చేర్చారు. రాజస్ధాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్పీఎస్సీ) నిర్వహించే ఈ పరీక్షలకు చెందిన జనరల్ స్టడీస్ చేసిన మార్పుల్లో భాగంగా ఈ అంశాలను సిలబస్‌లో చేర్చింది. నీతి శాస్త్ర పేరుతో గీత బోధనలను ప్రత్యేకంగా చేర్చారు. భగవద్గీతతో పాటు మహాత్మ గాంధీ జీవితానికి సంబంధించిన పాఠాలు, దేశ ప్రముఖులు, సాంఘిక సంస్కర్తలు, కార్యనిర్వాహక అధికారుల చరిత్రలనూ పాఠ్యాంశాలుగా చేర్చారు. నిర్వహణ, పాలనా విభాగాల్లో భగవద్గీత పాత్ర పేరిట సబ్-యూనిట్‌ను జోడిస్తూ ఆర్ఏఎస్ 2018 పరీక్ష సిలబస్‌ను సవరించారు. దీంతో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన 18 అధ్యాయాల నుంచి పలు ప్రశ్నలు ఆర్ఏఎస్ 2018 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎదురవనున్నాయి. బీజేపీ ప్రభుత్వం విద్యా రంగాన్ని కాషాయీకరిస్తోందని విపక్షాలు భగ్గుమంటున్న నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. -
పాఠాలు లేటేనా...!
⇒ఇంకా 10 శాతం కూడా జిల్లాకు రాని పాఠ్యపుస్తకాలు ⇒ సకాలంలో పంపిణీపై సందిగ్ధత ⇒ఆలస్యంతో ఏటా తిప్పలే.. ప్రతి సంవత్సరం లాగానే.. ఈ ఏడాదీ ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉచిత పాఠ్యపుస్తకాలు ఈసారి కూడా సకాలంలో జిల్లాకు వచ్చే అవకాశాలు కనిపించపోవడమే. విద్యాశాఖ అంచనాల మేరకు ఈ సంవత్సరంలో 15 లక్షల పైచిలుకు పుస్తకాలు జిల్లాకు అవసరం కాగా.. కేవలం 80 వేలు మాత్రమే ఇప్పటి వరకు అందాయి. గతేడాది పుస్తకాలు ఆలస్యం కావడం వల్ల పాఠ్యాంశాలు డిసెంబర్ నాటికి పూర్తి కాలేదు. ఈసారైనా పుస్తకాలు సమయానికి వస్తాయో..? రావో..? అన్న సందిగ్ధం నెలకొంది. తిరుపతి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈఏడాది కూడా ఉచిత పాఠ్యపుస్తకాలు సకాలంలో అందే సూచనలు కనిపించడం లేదు. తరగతులు, మీడియంల వారీగా జిల్లాకు ఈ ఏడాది 15 లక్షలకు పైగా పుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ నివేదిక పంపింది. అయితే ఇప్పటి వరకు దాదాపు 80 వేల బుక్స్ మాత్రమే అందాయి. ఇంకా 14 లక్షలకుపైబడి పాఠ్యపుస్తకాలు అందాల్సి ఉండడంతో ఎదురుచూపులు తప్పలేదు. సరఫరా ఇలా.. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తుంది. దీనికోసం వేసవి సెలవులకు ముందస్తుగానే తరగతి, మీడియంల వారీగా ఎన్ని పుస్తకాలు అవసరమవుతాయో అన్న అంచనాలతో జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తుంది. పాఠ్యపుస్తకాల అచ్చుకు ప్రభుత్వం టెండర్‌ను పిలిచి ప్రింటింగ్ ప్రెస్‌కు కేటాయిస్తుంది. ప్రింటింగ్ అయిన పాఠ్యపుస్తకాలను జిల్లాలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయ కార్యాలయానికి విడతల వారీగా సరఫరా చేస్తుంది. వీటిని జిల్లాలోని 66మండలాల్లో ఉన్న మండల వనరుల కేంద్రాలకు తరలించి, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేస్తారు. ఇవన్నీ పాఠశాలలు పునఃప్రారంభం(జూన్ 13వ తేదీ)లోపు పూర్తి స్థాయిలో సరఫరా చేయాలి. ఇది ఏటా జరిగే ప్రక్రియ. విద్యాశాఖ నివేదిక ఇలా.. జిల్లాలో తెలుగు, ఇంగ్లీష్, తమిళం, ఉర్దు మీడియం పాఠశాలలున్నాయి. దీనికితోడు సంస్కృత మీడియం పాఠశాలలు ఒకట్రెండు ఉన్నట్టు సమాచారం. అన్ని తరగతులు, మీడియాలకు సంబంధించి జిల్లాకు మొత్తం 18,55,583 పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ అంచనా వేసింది. గత ఏడాది పుస్తక విక్రయ కేంద్రంలో 3,25,571పాఠ్యపుస్తకాలు మిగులులో ఉన్నాయి. ఇవి పోను 15,30,012పాఠ్యపుస్తకాలు సరఫరా చేయాలని విద్యాశాఖ నివేదిక పంపింది. అయితే ఇప్పటి వరకు 9వ తరగతి తెలుగు మీడియానికి సంబంధించిన బయాలజి, ఫిజిక్స్, 8వ తరగతికి సంబంధించి తెలుగు రీడర్, 10వ తరగతి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి మ్యాథ్స్ బుక్స్ సహా మొత్తం 79,627 పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 14,50,385 పాఠ్యపుస్తకాలు ఇంకా రావాల్సి ఉంది. అనుకున్న తేదీలోపు దశల వారీగా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతాయనిని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీంతో సకాలంలో పంపిణీపై సందిగ్ధత నెలకొంది. ప్రతియేటా ఇబ్బందులే.. పాఠశాలల పునఃప్రారంభంలోపే పుస్తకాలను చేరవేస్తామని ప్రభుత్వం ఏటా ఇస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా గత ఏడాది నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానంలో విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యాబోధన అందించాలంటే తప్పనిసరిగా ప్రతి విద్యార్థికీ పాఠ్యపుస్తకాలు ఉండి తీరాలి. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే విద్యాబోధన జరిగితేనే డిసెంబరు ఆఖరుకల్లా పాఠ్యాంశాలను పూర్తి చేసి రివైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా జరగాలంటే పాఠశాలల పునఃప్రారంభం నాటికే ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలను అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
క్లాస్‌లో ‘ట్రాఫిక్’ సిలబస్
► ఒకటో తరగతి నుంచే పాఠ్యాంశంగా అమలు ► పరీక్షల్లోనూ సంబంధిత ప్రశ్నలకు మార్కులు ► ఈ ఏడాదికి బుక్లెట్స్ రూపంలో.. ► వచ్చే ఏడాది నుంచి టెక్ట్స్ బుక్స్‌లో.. సాక్షి, సిటీబ్యూరో: చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదం ఉదంతంతో అధికార యంత్రాంగం కదిలింది. ఏటా వేల మందిని పొట్టనపెట్టుకుంటూ, అంతకు రెట్టింపు క్షతగాత్రులుగా మారుస్తున్న రోడ్డు ప్రమాదాలను నిరోధించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం వివిధ చర్యలు ప్రారంభించడంతో సరిపెట్టకుండా, వాటి అమలు తీరునూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చనున్నాం. బడి ఈడు నుంచే బాధ్యతలను పెంచితే సత్ఫలితాలు ఉంటాయి. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
‘మీలో ఎవరు చరిత్ర ఎక్స్పర్ట్’..
‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ మాదిరిగా వినూత్నకార్యక్రమం సాక్షి, ముంబై : బోరివలిలోని వాజే-కేల్కర్ కళాశాలకు చెందిన ఓ ప్రొఫెసర్ విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి కలిగించేందుకు ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చరిత్ర విభాగం బోధించే ప్రొఫెసర్ రవి కుమార్ చందుపట్ల తనకున్న పరిజ్ఞానంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కళాశాల విద్యార్థుల కోసం ’కౌన్ బనేగా కరోడ్ పతి’ మాదిరిగానే కాలేజీ ఆడిటోరియంలో ‘మీలో ఎవ్వరు చరిత్ర ఎక్స్పర్ట్’ అనే పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాలేజీ ప్రధానాచార్యులు డాక్టర్ బిబి శర్మ ప్రారంభించారు. కాలేజీ ప్రిన్స్‌పల్ విద్యాధర్ జోషి పర్యవేక్షించారు. 12వ తరగతి చరిత్ర పాఠ్యాంశంలోని ప్రశ్నలను ఆధారంగా నిర్వహించారు. ఓ చిత్రాన్ని చూపించి నాలుగు జవాబులు (ఆప్షన్స్) ఇచ్చారు. జవాబు చెప్పేందుకు 45 సెకన్ల సమయం ఇచ్చారు. విజేతలకు బహుమతులు ఇచ్చారు. విద్యార్థుల మంచి స్పందన లభించింది. ఇక మీదట 11వ తరగతి పుస్తకాలను కేబీసీ మాదిరిగా తయారు చేయాలన్నదే తన ఉద్దేశమని ప్రొఫెసర్ రవికుమార్ చందుపట్ల పేర్కొన్నారు. ఈ పోటీలను పలు కాలేజీలు, పాఠశాలలో ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులల్లో చదువ పట్ల ఆసక్తి పెరుగుతోందని అన్నారు. -
కంగుతిన్న కమలనాథులు
బీజేపీకి ఘోర పరాజయం ఫలించని మోడీ మంత్రం పనిచేయని పవనిజం బాబు హామీలు నమ్మని జనం మదనపల్లె, న్యూస్‌లైన్: జిల్లాలో ఓటర్లు ఇచ్చిన తీర్పును చూసి బీజేపీ నాయకులు కంగుతిన్నా రు. టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా రాజంపేట, తిరుపతి లోక్‌సభ స్థానాల ను, మదనపల్లె అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కి కేటాయించారు. అయితే మోడీ గాలి, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పన్నాగాలు జిల్లాలో ఫలించలేదు. మూడు స్థానాల్లో నూ బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, వైఎస్సార్ సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చేతిలో 1.74 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చెందా రు. ఇక తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున జయరాం పోటీ చేశారు. ఈయన కూడా వైఎస్సార్ సీపీ అభ్యర్థి వరప్రసాద్ చేతిలో ఓటమి చెందారు. మదనపల్లె అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లపల్లె నరసింహారెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థి దేశాయ్ తిప్పారెడ్డి చేతిలో 17,039 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. బీజే పీ అభ్యర్థుల గెలుపు కోసం నరేంద్రమోడీ తిరుపతి, మదనపల్లెలో బహిరం గ సభలు, ప్రచారం నిర్వహించారు. అయితే దేశవ్యాప్తంగా మోడీ గాలి వీచి నా చంద్రబాబు సొంత జిల్లాలో ఏమాత్రం పని చేయలేదు. మోడీ ప్రభంజనా న్ని, చంద్రబాబు ప్రకటించిన పథకాల ను ఓటర్లు నమ్మలేదు. మూడు స్థానాల్లో నూ బీజేపీ ఓటమి చెందడంతో ఆ పార్టీ నాయకుల్లో కలవరం రేగింది. టీడీపీ నుంచి పూర్తిస్థాయిలో సహకారం లేక పోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్న విమర్శలు బీజేపీ నాయకుల నుంచి విని పిస్తున్నాయి. పురందేశ్వరి, చల్లపల్లె నరసింహారెడ్డి ఓటమిని పార్టీ నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఎన్నిక ల్లో ఎన్నో ఆశలు, అంచనాలతో ఉన్న బీజేపీ నాయకులు జిల్లాలో వచ్చిన ఫలి తాలను చూసి కంగుతిన్నారు.