ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా వివిధ కోర్సుల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, దీని లో భాగంగా తాము కోర్సులను రీడిజైన్ చేస్తున్నామని ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లా డారు. వివిధ సర్వేల ప్రకారం దేశంలో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 20% మందికి, నాన్ ఇంజనీరింగ్ విద్యా ర్థుల్లో 10% మందికే ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని, యూజీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన వారికీ ఉపాధి లభించట్లేదని చెప్పారు.
మార్కెట్ అవసరాల మేరకు వివిధ కోర్సుల్లో సిలబస్ మార్పులు చేస్తున్నామని, దీని కనుగుణంగా వర్సిటీ కోర్సుల్లో సంస్కరణలు తెస్తున్నా మన్నారు. వర్సిటీ పాలన విషయంలో పలు మార్పుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇంజనీరింగ్ కోర్సుల సిలబస్‌లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) మార్పు లు చేసిందని, తమ పరిధిలోని కాలేజీల్లో వాటి అమలుకు చర్యలు చేపట్టామన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో కొత్త కరిక్యులమ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇంజనీరింగ్‌లో ఎంటెక్ మైనింగ్, పీజీ డిప్లొమా ఇన్ జెనెటిక్స్‌ను ఈ విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
విదేశీ విద్యార్థుల ఆకర్షణలో రెండో స్థానం
విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో పూణే వర్సిటీ మొదటి స్థానంలో ఉంటే... ఓయూ రెండో స్థానంలో ఉందని రామచంద్రం తెలిపారు. ప్రస్తుతం ఓయూలో 3,630 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారని, వారి కోసం ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని, అందుకు నిధులు అవసరమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment