ou vc ramachandram
-
నేడు ఓయూసెట్ ఫలితాలు
హైదరాబాద్: ఓయూసెట్–2018 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. క్యాంపస్‌లోని గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం 12గంటలకు వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం ఫలితాలను విడుదల చేయనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఉస్మానియా వెబ్‌సైట్‌తో పాటు, ఇతర సైట్లలో కూడా ఫలితాలను చూడవచ్చన్నారు. గతనెల 4 నుంచి 13 వరకు జరిగిన ఓయూసెట్‌కు 71 వేల మంది అభ్యర్థులు హాజరైన విషయం విదితమే. సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నిర్వహించే ఈ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 9 నెలల శిక్షణలో భాగంగా హాస్టల్ వసతి కల్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ వి.సర్వేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. http://studycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 040–27540104 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఉపాధికి ఊతమిచ్చేలా కోర్సుల రీడిజైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా వివిధ కోర్సుల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, దీని లో భాగంగా తాము కోర్సులను రీడిజైన్ చేస్తున్నామని ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లా డారు. వివిధ సర్వేల ప్రకారం దేశంలో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 20% మందికి, నాన్ ఇంజనీరింగ్ విద్యా ర్థుల్లో 10% మందికే ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని, యూజీ, పీజీ, పీహెచ్డీ చేసిన వారికీ ఉపాధి లభించట్లేదని చెప్పారు. మార్కెట్ అవసరాల మేరకు వివిధ కోర్సుల్లో సిలబస్ మార్పులు చేస్తున్నామని, దీని కనుగుణంగా వర్సిటీ కోర్సుల్లో సంస్కరణలు తెస్తున్నా మన్నారు. వర్సిటీ పాలన విషయంలో పలు మార్పుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇంజనీరింగ్ కోర్సుల సిలబస్‌లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) మార్పు లు చేసిందని, తమ పరిధిలోని కాలేజీల్లో వాటి అమలుకు చర్యలు చేపట్టామన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో కొత్త కరిక్యులమ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇంజనీరింగ్‌లో ఎంటెక్ మైనింగ్, పీజీ డిప్లొమా ఇన్ జెనెటిక్స్ను ఈ విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. విదేశీ విద్యార్థుల ఆకర్షణలో రెండో స్థానం విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో పూణే వర్సిటీ మొదటి స్థానంలో ఉంటే... ఓయూ రెండో స్థానంలో ఉందని రామచంద్రం తెలిపారు. ప్రస్తుతం ఓయూలో 3,630 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారని, వారి కోసం ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని, అందుకు నిధులు అవసరమని అన్నారు. -
వర్సిటీలకు అధిక నిధులివ్వాలి
వైస్ చాన్స్లర్ల సదస్సులో ఓయూ వీసీ రామచంద్రం సాక్షి, హైదరాబాద్: ‘‘యూనివర్సి టీలకు అత్యంత కీలకమైన అంశం ఆర్థిక వనరులు. నిధులు సమృద్ధిగా లేకుంటే వర్సిటీ ప్రతిష్టతోపాటు విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుం ది. నిధుల లోటు ఏర్పడితే ముందుగా ప్రభావం చూపేది ఉద్యోగుల వేతనాలపైనే. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలి’’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ఎస్.రామచంద్రం శుక్రవారం సూచించారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో జరుగుతున్న రెండ్రోజుల వీసీల జాతీయ సదస్సు ముగింపు వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శతాబ్ది ఉత్సవాల అంశంపై వీసీల సమావేశం నిర్వహించాలనుకున్న ప్పటికీ వర్సిటీల పరిస్థితుల దృష్ట్యా 3ఎఫ్ (ఫండింగ్, ఫ్యాకల్టీ, ఫ్రీడం) అంశాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. సదస్సుకు రెండ్రోజులపాటు హాజరైనందుకు వీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఎస్.మల్లేష్ మాట్లాడుతూ వర్సిటీల్లో సమస్యలున్నా వాటిని పరిష్కరిస్తూ ముందుకెళ్లాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలితోపాటు భారత విశ్వవిద్యాలయాల సమాఖ్య సమన్వయంతో జాతీయ వైస్ చాన్స్‌లర్స్ సదస్సును ఓయూ నిర్వహించింది. దేశంలో ఉన్నత విద్య పరిస్థితి, బోధకులు, నిధుల కేటాయింపు, అధికారాలు అనే అంశంపై జరిగిన ఈ సదస్సుకు దేశంలోని 177 మంది వీసీలు, వర్సిటీల రిజిస్ట్రార్లు, మాజీ వీసీలు పాల్గొన్నారు. సెంట్రల్ వర్సిటీలకే ఎక్కువ నిధులా? పూర్తిస్థాయి బోధకులు, బలమైన పోటీ లేనందున వర్సిటీల పరపతి పడిపోతోందని ఆచార్య వినోబాభావే విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు పేర్కొన్నారు. రాష్ట్ర యూనివర్సిటీల్లోనే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, అనుబంధ కాలేజీలు సైతం ఉండటంతో వీటికి నిధుల ఆవశ్యకత ఎక్కువ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సెంట్రల్ యూనివర్సిటీలకే ఎక్కువగా నిధులిస్తూ రాష్ట్ర వర్సిటీలను పెద్దగా పట్టించుకోవట్లేదని పలువురు అభిప్రాయ పడ్డారు. విద్యార్థి సంఘాల సంఖ్య లెక్కకు మించి ఉండటం వల్ల కూడా వర్సిటీల్లో వాతావరణం ఇబ్బందికరంగా మారుతోందని, తరుచూ గొడవలు జరుగుతున్నాయని డిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్లు ప్రస్తావించిన అంశాలను సదస్సు నిర్వాహకులు నమోదు చేసుకున్నారు. వాటిని త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. -
చదువు ఉద్యోగాల కోసమే కాదు: మంత్రి ఈటల
హైదరాబాద్: విద్యార్థులు తాము చదివేది ఉద్యోగాల కోసమే అనే కోణంలో ఆలోచిస్తున్నారని, శాస్త్రీయ విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సమాజాభివృద్దికి దోహదపడాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. బుధవారం సికింద్రాబాద్ పీజీ కళాశాల వార్షిక వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడారు. ఓయూ వైస్ ఛాన్స్లర్ ఎస్.రామచంద్రంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ఈ వేడుకలను ప్రారంభించారు. సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదని మంత్రి అన్నారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దానిని సాధించేందుకు శ్రమించాలని విద్యార్థులకు మంత్రి ఈటల పిలుపునిచ్చారు.