హైదరాబాద్: ఓయూసెట్–2018 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. క్యాంపస్‌లోని గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం 12గంటలకు వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం ఫలితాలను విడుదల చేయనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఉస్మానియా వెబ్‌సైట్‌తో పాటు, ఇతర సైట్లలో కూడా ఫలితాలను చూడవచ్చన్నారు. గతనెల 4 నుంచి 13 వరకు జరిగిన ఓయూసెట్‌కు 71 వేల మంది అభ్యర్థులు హాజరైన విషయం విదితమే.
సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో నిర్వహించే ఈ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 9 నెలల శిక్షణలో భాగంగా హాస్టల్ వసతి కల్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ వి.సర్వేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. http://studycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 040–27540104 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
నేడు ఓయూసెట్ ఫలితాలు
Published Thu, Jul 5 2018 4:13 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment