Free training classes
-
నేడు ఓయూసెట్ ఫలితాలు
హైదరాబాద్: ఓయూసెట్–2018 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. క్యాంపస్‌లోని గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం 12గంటలకు వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం ఫలితాలను విడుదల చేయనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఉస్మానియా వెబ్‌సైట్‌తో పాటు, ఇతర సైట్లలో కూడా ఫలితాలను చూడవచ్చన్నారు. గతనెల 4 నుంచి 13 వరకు జరిగిన ఓయూసెట్‌కు 71 వేల మంది అభ్యర్థులు హాజరైన విషయం విదితమే. సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నిర్వహించే ఈ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 9 నెలల శిక్షణలో భాగంగా హాస్టల్ వసతి కల్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ వి.సర్వేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. http://studycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 040–27540104 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ
సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ స్టడీ సర్కిల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఎస్ఐ శారీరక దారుఢ్య పరీక్షల్లో ఆర్హత పొంది, రాత పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు తెలిపారు. నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులచే శిక్షణ ఇస్తారన్నారు. బీసీ సంక్షేమ శాఖ అదేశానుసారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా శిక్షన ఇస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగష్టు 3 వరకు ఆన్ లైన్లో tsbcstudycarcle. gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం. సెల్ నం. 9985434941లో సంప్రదించాలన్నారు. -
నిరుద్యోగ యువతకు వరం
నేటి నుంచి గ్రూప్2లో శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపు సిద్దిపేట జోన్: నిరుద్యోగ యువతి, యువకులకు ఆర్థిక భారం తగ్గించి ఉద్యోగ అవకాశాలను ముంగిట్లోకి తెచ్చేందుకు తాను స్వంతంగా నియోజకవర్గంలో గ్రూప్ 2 ఉచిత శిక్షణను నిర్వహించనున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం రాత్రి ఆయన ఫోన్ ద్వారా స్థానిక విలేకరులకు వివరాలు వెల్లడించారు. గత నెలలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు గ్రూప్2 శిక్షణ కోసం అర్హత పరీక్షను నిర్వహించామన్నారు. పరీక్షకు 750 మంది హాజరుకాగా ఉచిత శిక్షణకు 350 మంది అర్హత సాధించారని చెప్పారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఏర్పాటు చేసిన తరహాలోనే గ్రూప్ 2 పోటీ పరీక్షలకు 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక పత్తిమార్కెట్లో ప్రారంభించనున్నామన్నారు. అర్హత సాధించిన 350 మంది అభ్యర్థులు మధ్యాహ్నం రెండు గంటలకు పత్తి మార్కెట్ యార్డుకు హాజరు కావాలన్నారు.అర్హత సాధించిన వారంతా శిక్షణకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
ఉచిత మానసిక ఆరోగ్య శిక్షణ
ప్రపంచ ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో శనివారం నుంచి ఈ నెల 10 వరకు జరగనున్నాయి. తొలిరోజు ప్రారంభ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ కమిషనర్ పి.విజయబాబు అధ్యక్షత వహించనుండగా, ముషీరాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నాయుకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ప్రతిరోజూ సాయుంత్రం 5.30 నుంచి రాత్రి 9.00 గంటల వరకు జరగనున్న కార్యక్రమాల వివరాలు... 4వ తేదీన‘మానసిక ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం’పై డాక్టర్ కె.నిరంజన్ రెడ్డి, 5న ‘మంచి తల్లిదండ్రులుగా పిల్లలను తీర్చిదిద్దుకోవడం ఎలా’ అనే అంశంపై వి.వేణుభగవాన్, 6న ‘మీ చుట్టూ ఉన్నవారితో విజయవంతంగా ఉండటం ఎలా?’ అనే అంశంపై బి.ఉమామహేశ్వరరావు, 7న ‘జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం ఎలా?’ అనే అంశంపై డాక్టర్ బి.సాయికిరణ్, 8న ‘మానసిక ఒత్తిడిని జయించడం ఎలా?’ అనే అంశంపై శ్రుతికీర్తి రవికాంత్, 9న ‘చిత్రాలతో జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎలా?’ అనే అంశంపై వై.సురేష్‌బాబు శిక్షణ ఇవ్వనున్నారు. వారోత్సవాల ముగింపు సందర్భంగా 10న హిప్నో కమలాకర్, హిప్నో పద్మాకమలాకర్ ‘స్టేజ్ హిప్నాటిజం’ ప్రదర్శన ఇవ్వనున్నారు. -
జూలై 1 నుంచి నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఆంధ్రాబ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువకులకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ డెరైక్టర్ ఎస్.జగన్నాథరాజు ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణ తరగతుల్లో మోటార్ రీవైండింగ్ - ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, హౌస్ వైరింగ్, కంప్యూటర్ బేసిక్స్ (ఎంఎస్ ఆఫీస్), ఎల్సీడీ టీవీ మెకానిజం కోర్సుల్లో శిక్షణ తరగతులంటాయని తెలిపారు. అభ్యర్థులు 10వ తరగతి ఆ పైన విద్యార్హత కలిగి ఉండాలన్నారు. అన్ని కోర్సులకు 30 రోజుల కాలపరిమితి ఉంటుందని వివరించారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు శిక్షణ తరగతులుంటాయన్నారు. ఆయా కోర్సుల్లో చేరేందుకు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన పురుష అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. శిక్షణ సమయంలో ఎంపికైన దూరప్రాంత అభ్యర్థులకు యోగా శిక్షణ, హాస్టల్, భోజన వసతి కల్పిస్తామని, స్థానిక అభ్యర్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం ఉంటుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందిస్తామని, యూనిట్ల స్థాపనకు బ్యాంకు రుణాలు పొందటానికి తగు సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. ఉచిత శిక్షణ పొందగోరు అభ్యర్థులు ఆంధ్రాబ్యాంక్ గ్రామీణాభివృద్ధి సంస్థ, డోర్ నెంబర్ 24ఎ- 7-1, అమలోద్భవి కాన్వెంట్ వీధి, అశోక్ నగర్, ఏలూరు చిరునామాకు దరఖాస్తులు పంపాలన్నారు. ఇతర వివరాలకు 08812- 253975, 94417 54604, 95027 23561, 94909 98882 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.