new courses
-
దక్షిణాదికి మరిన్ని ఇంజనీరింగ్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలకు ఇంజనీరింగ్ సీట్లు పెరగనున్నాయి. అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి వస్తున్న డిమాండ్‌ను ఏఐసీటీఈ పరిగణనలోకి తీసుకున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌పై విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో అక్కడ మేనేజ్మెంట్ కోర్సుల పెంపునకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణవ్యాప్తంగా 10 వేల ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతాయని రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు. కంప్యూటర్ కోర్సుల్లోనే సీట్లు పెంచాలని ఇంజనీరింగ్ కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లలో సీట్లకు కోత పడొచ్చు.గత ఏడాది 7 వేల సీట్లు ఈ బ్రాంచ్‌లలో తగ్గాయి. వీటి స్థానంలో కంప్యూటర్ కోర్సుల్లో పెంచారు. దీంతోపాటు మరో 7 వేల వరకూ కంప్యూటర్ బ్రాంచ్‌ల్లో సీట్లు పెరిగాయి. మారుతున్న ట్రెండ్ కొన్నేళ్లుగా దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య కోర్సుల ఎంపికలో తేడా కనిపిస్తోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసీటీఈ గుర్తించాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), ఎంబీఏ, ఎంసీఏల్లో ఎక్కువగా చేరుతున్నారు. కానీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ తర్వాత ఎంఎస్‌కు విదేశాలకు వెళ్లేందుకు, లేదా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని విద్యార్థులు డిగ్రీ తర్వాత సివిల్స్, ఇతర పోటీ పరీక్షల వైపు దృష్టి పెడుతున్నారు. ఈ డిమాండ్‌ను బట్టే ఎక్కువ ఇంజనీరింగ్ సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. ► దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటే, వీటిల్లో 6,74,697 (54 శాతం) సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ►ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ►ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు 3,39,405 దేశవ్యాప్తంగా ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. ►రానురాను బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్షిణాదిలోనే పెరగడానికి ఇదే కారణమని ఏఐసీటీఈ భావిస్తోంది. ►2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్లలో అవి 5.3 శాతం పెరిగాయి. ఇప్పుడిది 7 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నారు. నైపుణ్యంపై దృష్టి ఇంజనీరింగ్ విద్యలో కొత్త కోర్సులు వస్తున్నా, విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్‌లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే ప్రాక్టికల్‌గా అవసరమైన నైపుణ్యం పొందేలా ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. తరగతిగది కన్నా, నైపుణ్యం పొందే పారిశ్రామిక సంస్థల్లో పనిచేసేలా చేయాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. టెక్నాలజీలో దక్షిణాది ముందంజ దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ చదవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్ రానురాను పెరుగుతోంది. తక్షణ ఉపాధితో పాటు, నైపుణ్యం పెంచే విధంగా ఇంజనీరింగ్‌లో వస్తున్న మార్పులూ ఇందుకు కారణమే. అందుకే తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్ల పెంపు అనివార్యమవుతోంది. గణితం నేపథ్యం విద్యార్థులూ ఉత్తరాది కన్నా, దక్షిణాదిలో ఎక్కువగా ఉంటున్నారు. ఇది కూడా బీటెక్ సీట్ల డిమాండ్‌కు కారణమవుతోంది. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్య మండలి చైర్మన్ -
ఏఎన్‌యూలో కొత్త కోర్సులు ప్రారంభం
ఏఎన్‌యూ: విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కొత్త కోర్సులను వీసీ ఆచార్య పి.రాజశేఖర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన కోర్సుల్లో ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఎంబీఏ మీడియా మేనేజ్మెంట్, ఎంఎస్సీ డేటా సైన్స్, ఎంఎస్సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎంఏ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్ కోర్సులు ఉన్నాయని చెప్పారు. మారుతున్న పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు నూతన కోర్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన కోర్సులలో ఫ్యాకల్టీ నియామకం, మౌలిక సదుపాయాలు కల్పనకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. డిగ్రీ ఫలితాలు విడుదల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ కోర్సుల నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం వీసీ ఆచార్య రాజశేఖర్ విడుదల చేశారు. యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.డిగ్రీ నాల్గవ సెమిస్టర్ ఫలితాల్లో 61శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఏసీఈ ఆర్.ప్రకాష్‌రావు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24 ఆఖరు తేదీగా నిర్ణయించామన్నారు. ఫీజు ఒక్కో పేపర్‌కు రూ.1,240 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. -
ప్రొఫెసర్లకు పునశ్చరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల అధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లకు ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ పునశ్చరణ బాధ్యతలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఉన్నత విద్య పాలక మండలి సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు స్పష్టం చేశారు. ఈ వివరాలను లింబాద్రి మంగళవారం మీడియాకు వివరించారు. అధ్యాపకుల ఆలోచనా ధోరణిని విస్తృతపర్చేందుకు.. దేశవ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సు ల్లో అనేక మార్పులు చోటు చేసు కుంటున్నాయి. అంతర్జాతీయ విద్యా ప్రమాణాల వైపు వెళ్ళాలనే ఆకాంక్ష బలపడుతోంది. ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు కూడా ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. డిజిటల్ యూనివర్సిటీ ప్రాధ్యానత అన్ని స్థాయిలను ఆకర్షిస్తోంది. వివిధ సబ్జెక్టుల మేళవింపుతో, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ విద్యా విధానం విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తోంది. మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. స్వదేశీ యూనివర్సిటీలు వీటి పోటీని తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఉన్న అధ్యాపకుల ఆలోచనాధోరణిని మరింత విస్తృతపర్చేందుకు ప్రత్యేక ఓరియంటేషన్ చేపడుతున్నట్టు లింబాద్రి తెలిపారు. శిక్షణ ఇలా... విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రధాన విభాగాల ముఖ్య అధికారులను వర్సిటీల వీసీలతో కలిసి ఉన్నత విద్యా మండలి ఎంపిక చేస్తుంది. ఇలా అన్ని యూనివర్శిటీల నుంచి తొలి దశలో వంద మందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. సీనియర్ అధ్యాపకుడు భవిష్యత్‌లో ఉన్నత విద్యలో కీలకపాత్ర పోషిస్తాడు. ఈ కారణంగా బోధనపై నవీన మెళకువలే కాకుండా, నాయకత్వ లక్షణాలు అవసరం. గ్లోబల్ లీడర్‌గా ఉన్నత విద్యను అర్థం చేసుకునే స్థాయి కల్పిస్తారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ దిశగా ప్రత్యేక ఓరియంటేషన్ మెళకువలను నిష్ణాతులు రూపొందిస్తారు. వీటిని అనుభజ్ఞులైన అధికారులు పరిశీలిస్తా రు. అర్థమయ్యేలా వివరించే అధికారులతో ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తారు. అధ్యాపకులతో మొదలయ్యే ఈ పునశ్చరణ తరగతులు తర్వాత దశలో వీసీల వరకూ విస్తరించాలని భావిస్తున్నారు. -
ఇష్టం వచ్చినట్లు కోర్సుల్లో సీట్ల పెంపు కుదరదు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా.. అభ్యంతరం లేదంటూ(ఎన్ఓసీ) సర్టిఫికెట్ జారీ చేయకుండా ఇంజనీరింగ్ కళాశాలల్లో కొత్త కోర్సులు, సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు గత ఉత్తర్వులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని స్పష్టం చేసింది. పిటిషన్లలో ఎలాంటి మెరిట్ లేని కారణంగా పిటిషనర్లకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేమని పేర్కొంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు చెప్పింది. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా యూనివర్సిటీలు అఫిలియేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడం అవసరమని తెలిపింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీఎస్ఈ డేటా సైన్స్స్, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ, సీఎస్ఈ ఏఐఎంల్, ఐటీ తదితర కొత్త కోర్సులకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదంటూ చెరబుద్ది ఎడ్యుకేషనల్ సొసైటీ సహా పలు కాలేజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సామాజిక కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదని.. దీంతో కొత్త కోర్సుల ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ఈ క్రమంలో ఆయా కోర్సులను అనుమతి ఇవ్వాలని కోరారు. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దాదాపు 4000 సీట్లపై ప్రభావం చూపుతుందని, ఇది సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనం ఇవ్వడం.. ఇవ్వకపోవడం ప్రభుత్వ ఇష్టమని.. అయితే కోర్సులకు మాత్రం అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని జేఎన్టీయూ తరఫు న్యాయవాది మయూర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీపీ, ఏఐసీటీఈ తరఫున ముద్దు విజయ్, టీఎస్ ఎంసెట్ కన్వీనర్ తరఫున సీ.వాణి రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ అనుమతి లేనిదే సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెబుతూ ఉత్తర్వులు వెలువరించింది. -
ఐఐటీల్లో మరో 500 సీట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి సీట్లు పెరిగే అవకాశముంది. గతేడాది (2021–22)లో 16,232 సీట్లు ఉండగా, ఈసారి మరో 500 సీట్లు పెరగవచ్చని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడే నాటికి వీటిని జాబితాలో చేరుస్తారని చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఐఐటీలు కొత్త కోర్సుల వైపు అడుగులేస్తున్నాయి. పాఠ్యప్రణాళికలోనూ మార్పులు తెస్తున్నాయి. డిమాండ్ ఉన్న, పారిశ్రామిక అవసరాలు తీర్చగలిగే కోర్సులను విద్యార్థుల ముందుకు తెస్తున్నాయి. ఈ క్రమంలో ఐఐటీలు కొన్ని కొత్త కోర్సులను డిజైన్ చేశాయి. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ కోర్సులను గతేడాది కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది కూడా మరికొన్ని పరిశోధనాత్మక ప్రాధాన్యం ఉన్న కోర్సుల వైపు అడుగులు వేస్తున్నారు. స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్, మెడికల్ అనుబంధ సాంకేతిక కోర్సుల వైపు ఐఐటీలు మొగ్గు చూపుతున్నాయి. త్వరలో వీటికి అనుమతి వస్తుందని భావిస్తున్నాయి. మరోవైపు ఇతర ప్రాంతాల్లోని ఐఐటీలు కూడా కొత్త కోర్సులను ముందుకు తెస్తున్నాయి. ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక సంస్థలు కూడా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్ కోర్సులకు రూపకల్పన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఐటీల్లోనే ఈసారి 500 సీట్లు పెరిగే అవకాశం ఉంది. -
పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడేలా పాలిటెక్నిక్, ఐటీఐ విద్యా సంస్థల్లో పలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. మాన్యుఫ్యాక్చరింగ్‌తో పాటు హాస్పిటాలిటీ, నర్సింగ్ తదితర కొత్త కోర్సులను ప్రవేశపెట్టి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు. హోటల్ ఇండస్ట్రీలో అనేక మంది ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి చేరుతున్నారని, అలాగే నర్సింగ్ వంటి సేవలకు జాతీయంగా, అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉందని చెప్పారు. పాలిటెక్నిక్, ఐటీఐలలో, స్కిల్ డెవలప్మెంట్ సంస్థల్లో ఈ కొత్త కోర్సులు ప్రవేశపెడతామన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ –2022 ఫలితాలను ఆయన శనివారం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త కోర్సులు, కరిక్యులమ్‌లో మార్పులు చేసి మరింత నాణ్యమైన విద్యను అందిస్తామని వివరించారు. మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులతో సమానంగా ఈ డిప్లొమా కోర్సులను కూడా తీర్చిదిద్దుతామని అన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో పాటు పలువురు ప్రముఖులు డిప్లొమా కోర్సుల్లో చేరి పైకి వచ్చిన వారేనని వివరించారు. 2021 విద్యా సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3డీ, యానిమేషన్, మల్టీ మీడియా కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. రానున్న బ్యాచుల వారికి క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్‌డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషీన్ లెర్నింగ్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్ కోర్సులు ప్రవేశ పెడుతున్నట్లు మంత్రి చెప్పారు. విద్యార్థులు బాగా రాణించాలంటే తల్లుల పాత్ర కీలకమన్నారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌గౌర్, కమిషనర్ పోలా భాస్కర్, స్టేట్ టెక్నికల్ బోర్డ్ ఆఫ్ ట్రైనింగ్ సెక్రటరీ విజయభాస్కర్, జేడీ ఎ.నిర్మల్‌కుమార్ ప్రియ తదితరులు పాల్గొన్నారు. బాలికల ముందంజ పాలిటెక్నిక్ ఫలితాల్లో బాలురకన్నా బాలికలు ఉత్తీర్ణత శాతంలో ఆధిక్యంలో నిలిచారు. మొత్తం 1,31,608 మంది పరీక్షలు రాయగా వారిలో 1,20,866 (91.84 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 74,510 మంది (90.56 శాతం), బాలికలు 46,356 మంది (93.96 శాతం) ఉత్తీర్ణులయ్యారు. చల్లా సత్య హర్షిత మొదటి ర్యాంకు సాధించింది. టాప్ 10 ర్యాంకుల్లో తూర్పు గోదావరి జిల్లా ఎక్కువ దక్కించుకుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఓసీలు 91.39 శాతం ఉత్తీర్ణులయ్యారు. -
కొత్త కోర్సులకు ఎన్వోసీ అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నూతన కోర్సుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకోవాలన్న జేఎన్టీయూ నిబంధనను హైకోర్టు తప్పుబట్టింది. ఇంజనీరింగ్ కళాశాలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) మార్గదర్శకాల మేరకు కోర్సుల నిర్వహణ ఉంటుందని, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు జేఎన్టీయూ అఫిలియేషన్ నిబంధనల మేరకు కొత్త కోర్సుల ప్రారంభానికి, తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్వోసీ తప్పనిసరి అంటూ జారీచేసిన మార్గదర్శకాలను నిలిపివేసింది. హైకోర్టును ఆశ్రయించిన 11 ఇంజనీరింగ్ కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలని జేఎన్టీయూను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. శ్రీనిధి, కేశవ్ మెమోరియల్, సీఎంఆర్, వీఎన్ఆర్, వర్ధమాన్‌తోపాటు మరో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఏఐసీటీఈ మార్గదర్శకాల మేరకు దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు నడుచుకుంటాయని, కొత్త కోర్సుల ప్రారం భానికి సంబంధించి నిబంధనల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి, జేఎన్టీయూకు ఎటువంటి అధికారం లేదని ఇంజనీరింగ్ కళాశాలల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్వోసీ తప్పనిసరన్న నిబంధన సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపారు. తెలంగాణ విద్యా హక్కు చట్టం ప్రకారం ఎన్వోసీ ఉండాలన్న నిబంధనను పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న జేఎన్టీయూ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. -
సంప్రదాయ డిగ్రీలతోనూ.. సాఫ్ట్వేర్ జాబ్!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్లకే అన్నది ఇప్పటివరకు ఉన్నమాట. ఇకముందు బీఏ, బీకాం, బీఎస్సీ.. వంటి సంప్రదాయ కోర్సులు చేసినా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడానికి అవకాశం రానుంది. ఇందుకోసం సంప్రదాయ డిగ్రీల్లోనే ప్రత్యేకమైన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బహుళ జాతి కంపెనీలు డిగ్రీ కాలేజీల్లోనూ క్యాంపస్ నియామకాలు చేపట్టబోతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు వేగవంతం చేశామని, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలను సమాయత్తం చేస్తున్నామని రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి తెలిపారు. మరోవైపు ఉస్మానియా సహా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వరూపాన్ని మార్చడంపై దృష్టి సారించాయి. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. రాష్ట్రంలో ఏటా 4.5 లక్షల మంది సంప్రదాయ డిగ్రీ కోర్సులు (బీఏ, బీఎస్సీ, బీకాం) పూర్తిచేస్తున్నారు. వీరిలో 20 శాతం మంది కూడా తగిన జీతాలతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఏటా రెండు లక్షల మంది వరకు వివిధ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేస్తున్నారు. బహుళజాతి కంపెనీలు (ఎంఎన్సీ), ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా 20 నుంచి 30 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఉద్యోగాలు ఉన్నా.. మారుతున్న అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులు లేక ఎంపిక చేయడం లేదని కంపెనీలు చెప్తున్నాయి. అందువల్ల డిగ్రీ ఏదైనా, కోర్సు ఏదైనా సరే.. కంపెనీలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు ఉంటే ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉందని ఒక కంపెనీ ప్లేస్మెంట్ నిర్వాహకుడు తెలిపారు. ఇందుకోసం కొత్త కోర్సులు అందుబాటులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు. డిగ్రీలో ఏం చేయబోతున్నారు? సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. పలు యూనివర్సిటీలు దీనిపై అధ్యయనం చేస్తున్నాయని ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఉదాహరణకు బీకాంలో బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీలో డేటా సైన్స్ కోర్సులను ఇప్పటికే ప్రవేశపెట్టారు. సిలబస్ రూపకల్పన నుంచే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ భాగస్వామ్యం తీసుకున్నారు. దాదాపు 120 కాలేజీల్లో ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు టీసీఎస్ శిక్షణ ఇస్తోంది. కోర్సులు పూర్తయ్యాక వారికి ప్రత్యేకంగా పరీక్ష కూడా నిర్వహించి, వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు అర్హత పొందేలా చేయనుంది. ఇదే తరహాలో బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీల్లో ఉపాధి అవకాశాలున్న కొత్త కోర్సులను తీసుకురానున్నారు. ఇందులో ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సుల విద్యా ప్రణాళిక రూపకల్పనకు సంబంధించి బ్రిటిష్ కౌన్సిల్‌తో ఎంవోయూ చేసుకున్నారు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి పలురకాల కోర్సులనూ జత చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి పొందేలా డిగ్రీ కోర్సులు సంప్రదాయ డిగ్రీ కోర్సుల నాణ్యత పెంచాలన్నదే మా తపన. ఈ దిశగా కొత్త కోర్సులపై కసరత్తు జరుగుతోంది. మరో ఏడాదిలో వాటి స్వరూపం మారబోతోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతోనూ ఈ దిశగా సంప్రదింపులు జరుపుతున్నాం. ఇప్పటికే టీసీఎస్ భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నాం. –ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ మంచి ప్రయత్నం సంప్రదాయ డిగ్రీ కోర్సులను మార్కెట్‌కు అనుగుణంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం అభినందనీయం. ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నాం. దీనిపై ఇప్పటికే అధ్యయనం జరుగుతోందని తెలిసింది. దీనివల్ల డిగ్రీ కోర్సులకు పూర్వ వైభవం వస్తుంది. – గౌరీ సతీశ్, కేజీ టు పీజీ జేఏసీ కన్వీనర్ -
ఐఐటీ రూర్కిలో ఏడు కొత్త కోర్సులు
న్యూఢిల్లీ: మారుతున్న కాలానికి అనుగుణంగా ఐఐటీ రూర్కి 7 కొత్త కోర్సులను తయారు చేసింది. ఇవి రానున్న విద్యా సంవత్సరం (2021-22) నుంచే అందుబాటులో ఉంటాయని సోమవారం తెలిపింది. ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్, ఎకానమిక్స్–మేనేజ్మెంట్, డేటాసైన్స్ –ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఈ కోర్సులను డిజైన్ చేసినట్లు తెలిపింది. కొత్త కోర్సులివే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎం.టెక్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎంటెక్ (డేటా సైన్స్); డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్ విభాగంలో డేటా సైన్స్(సీఏఐడీఎస్), ఎం.డెస్ (ఇండస్ట్రియల్ డిజైన్), ఎంఐఎం (మాస్టర్స్ ఇన్ ఇన్నొవేషన్ మేనేజ్మెంట్); ఎలక్ట్రాన్సిక్స్ విభాగంలో ఎం.టెక్ (మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ); హ్యుమానిటీస్, సోషల్ జస్టిస్ విభాగంలో ఎంఎస్ ఎకానమిక్స్ (5 ఏళ్ల కోర్సు), హైడ్రాలజీ విభాగంలో ఎం.టెక్ (డ్యామ్ సేఫ్టీ అండ్ రిహాబిలిటేషన్). -
ఎంటెక్: పాత కోర్సులకు కత్తెర.. 7 కొత్త కోర్సులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్తగా పలు ఎంటెక్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు జేఎన్టీయూ చర్యలు చేపట్టింది. గతేడాది కొత్త కోర్సుల్లో ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నిం గ్, డేటా సైన్స్ వంటి ప్రధాన సబ్జెక్టులతోనే కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వగా, ఈసారి వాటి సంఖ్య పెంచి 7 రకాల కొత్తకోర్సులు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. ఈ జాబితాలో.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సైబర్ సె క్యూరిటీ.. సివిల్ ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్.. ఈసీఈలో ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ వీఎల్ఎస్ఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మైక్రో ఎల్రక్టానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ డిజైన్.. మెకా నికల్లో మెకట్రానిక్స్ పీజీ కోర్సులు ఉన్నాయి. కొన్ని కాంబినేషన్లకు కత్తెర! గతేడాది బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో (సీఎస్ఈ) సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సీఎస్ఈ నెట్వర్క్స్ కోర్సులకు జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు జారీ చేసింది. అయితే ఈసారి (2021–22లో) బీటెక్ సీఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెరి్నంగ్, మెకానికల్‌లో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌కు అనుబంధ గుర్తిం పు ఇస్తామని ప్రకటించింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌ను ప్రత్యేక కోర్సులుగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ కోర్సులకు కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవచ్చని జేఎనీ్టయూ వెల్లడించింది. అయితే గతేడాది బీటెక్‌లో ఇచి్చన సీఎస్ఈ నెట్వర్క్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇస్తారా, లేదా? అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. పాత వివరాలతోనే.. రాష్ట్రంలోని వృత్తి, సాంకేతిక విద్యా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు నిర్వహించే ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ)’తనిఖీలు ఈసారి నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. గత ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో తనిఖీలు చేయలేదు. ప్రస్తుతం కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రెండేళ్ల కిందటి తనిఖీలు, గతేడాది కాలేజీలు అందజేసిన డాక్యుమెంట్ల పరిశీలన, తాజాగా అందజేసే అఫిడవిట్ల ఆధారంగానే అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. మే మొదటి లేదా రెండో వారంలో ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)’నుంచి కాలేజీలకు, కోర్సులకు అనుమతులు లభించనున్నాయి. ఆ వెంటనే రాష్ట్ర యూనివర్సిటీలు ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ కోసం దరఖాస్తులు స్వీకరించనున్నాయి. మరోవైపు ఈసారి ఇంకో 12 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. చదవండి: ఆ రెండు సబ్జెక్టులు రాకుంటే.. ఇంజనీరింగ్‌లో సాధ్యమేనా?! -
ఇంజనీరింగ్ కొత్త కోర్సుల్లో 19,240 సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతిచ్చిన 19,240 కొత్త సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని వంద వరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కోర్సులను నిర్వహించేందుకు ఓకే చెప్పింది. ఇందు లో ఎలాంటి ఆర్థిక భారం లేకుండా, పాత సీట్లను రద్దు చేసుకొని, కొత్త కోర్సుల్లో సీట్లకు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న 13,820 సీట్లతో పాటు ఆర్థిక భారం కలిగిన మరో 5,350 అదనపు సీట్లకు ఆమోదం తెలిపింది. వాటికి అనుబంధ గుర్తింపు ఇచ్చేందు కు జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలకు అనుమతిస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్టీయూ పరిధిలోని 90 వరకు కాలేజీల్లో 18,210 సీట్లతో బీటెక్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్–మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ (నెట్ వర్క్స్)వంటి కొత్త కోర్సులను నిర్వహించేందుకు ఆమోదం తెలుపుతూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ జీవో జారీ చేశారు. ఈ కోర్సుల కోసం ఏటా అదనంగా రూ.33.85 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని వెల్లడించా రు. నిబంధనల ప్రకారం ఈ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని జేఎన్టీయూను ఆదేశించినట్లు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం నేతలు గౌతంరావు, కృష్ణారావు వెల్లడించారు. ఏఐసీటీఈ ఇచ్చిన కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. వీటితోపాటు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వెయ్యి కి పైగా సీట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వుల జారీ కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం వరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు వివరించారు. కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చినందున విద్యార్థులు వెబ్ ఆప్షన్లు జాగ్రత్తగా ఇచ్చుకోవాలని సూచించారు. నేటి రాత్రి నుంచే వెబ్ ఆప్షన్లు! రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త సీట్లకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అనుబంధ గుర్తింపు జారీపై యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ ప్రారంభించనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు అనుబంధ గుర్తింపు వస్తే అదేరోజు రాత్రి నుంచి విద్యా ర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపడతామని ప్రవేశాల క్యాంపు అధికారులు చెబుతున్నారు. అనుబంధ గుర్తింపు జారీలో ఆలస్యమైతే 19 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇక ఏఐసీటీఈ ఈ సారి రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,10,873 సీట్లకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే అందులో యూనివర్సిటీలు ఎన్నింటికి అనుబంధ గుర్తింపు జారీ చేస్తాయన్నది నేడు తేలనుంది. -
బీఎస్సీ డేటా సైన్స్.. బీకాం అనలిటిక్స్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సులు రాబోతున్నాయి. బీఎస్సీ డేటా సైన్స్, బీకాం అనలిటిక్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభిం చింది. ఇందులో భాగంగా విధి విధానాలను ఖరారు చేసేందుకు అధికారులు, పారిశ్రామిక వర్గాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల ను పెంపునకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని ఏకాభిప్రాయానికి వచ్చా రు. వచ్చే వారం రోజుల్లో మళ్లీ సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. 2020–21 విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులను అమల్లోకి తేనున్నారు. డిగ్రీలో ఇకపై మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌తోపాటు డేటా సైన్స్‌ను చదువుకోవచ్చు. బీకాంలో బిజినెస్ అనలిటిక్స్‌ను చదువుకునే వీలు కల్పించనుంది. వీటిల్లోనే ఆనర్స్ డిగ్రీలను కూడా ప్రవేశపెట్టాలని భావిస్తోంది. రెగ్యులర్ డిగ్రీల కంటే ఆనర్స్ డిగ్రీల్లో 20 నుంచి 30 క్రెడిట్స్ ఎక్కువగా ఇచ్చి అమలు చేయాలని యోచిస్తోంది. ఇవి కాకుండా కాలేజీలు ముందుకొస్తే బీఎస్సీ మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ కోర్సులను ముందుగా సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, అటానమస్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఆ సబ్జెక్టులను బోధించే ఫ్యాకల్టీకిచ్చే శిక్షణలో పారి శ్రామిక వర్గాలను భాగస్వాములను చేయనుంది. భేటీలో కమిటీ సభ్యులు, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, ఓయూ మాజీ వీసీ రామచంద్రం, ప్రొఫెసర్లు ఫాతిమా బేగం, జయశ్రీ, ఓయూ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
కొత్త కోర్సులు వస్తున్నాయ్
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. అవసరమైన సదుపాయాలు, ఫ్యాకల్టీ ఉంటే 2020–21 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులు ప్రారంభించేందుకు కాలేజీలకు గుర్తింపి వ్వాలని జేఎన్టీయూ నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో 5 కాలేజీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సును ప్రవేశపెట్టగా, 2020–21 విద్యా సంవత్సరంలో సదుపాయాలు ఉన్న అన్ని కాలేజీలు ఆ కోర్సును ప్రారంభించేందుకు అనుమతులను ఇవ్వనుంది. ఏఐతో పాటు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సీఎస్‌ఐటీ), కంప్యూటర్ సైన్స్ అండ్ బిజి నెస్ సిస్టమ్స్ (సీఎస్బీఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ (ఐటీ ఈ) కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుబంధ గుర్తింపివ్వాలని నిర్ణయిం చింది. 2020–21 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ కాలేజీలతో పాటు దాని అనుబంధ కాలేజీల్లో ఆయా కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తు తం జేఎన్టీయూ పరిధిలో 170 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వాటిలో లక్షకుపైగా సీట్లు ఉన్నాయి. అయితే ఏటా జేఎన్టీయూ 85 వేల వరకు సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇస్తోంది. ప్రస్తుతం కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో ఈసారి అదనంగా మరో 10 వేల సీట్లలో ప్రవేశాలకు అనుమతించే అవకాశం ఉంది. మరోవైపు 100 ఫార్మసీ కాలేజీలు, 10 పీజీ కాలేజీ లున్నాయి. వాటిలో 50 వేల వరకు సీట్లు ఉన్నాయి. వాటిలోనూ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండి, ఆయా కోర్సులను ప్రారంభించాలనుకునే యాజమాన్యాల నుంచి జేఎన్టీయూ దరఖాస్తులు స్వీకరించి అనుబంధ గుర్తింపు ఇవ్వనుంది. ఇదే విషయాన్ని డ్రాఫ్ట్ అఫీలియేషన్ రెగ్యులేషన్స్‌లో పొందుపరిచింది. ఎం.ఫార్మసీలో నాలుగు కొత్త కోర్సులు.. ఎం.ఫార్మసీలోనూ 4 కొత్త కోర్సులకు అనుమతివ్వనుంది. మార్కెట్ అవసరాల మేరకు కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇతర సబ్జెక్టులతో కాంబినేషన్‌గా ఉన్న సబ్జెక్టులను ప్రత్యేక సబ్జెక్టులు గా ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాసూటికల్ అనాలిసిస్, ఫార్మాసూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మాసూటికల్ క్వాలిటీ అషూరెన్స్ కోర్సులను నిర్వహించేందుకు కాలేజీ లకు అనుబంధ గుర్తింపు ఇవ్వనుంది. డిమాండ్ లేని హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ, ఫార్మాసూ్యటికల్ అనాలిసిస్, క్వాలిటీ అషూరెన్స్, ఫార్మాసూ్యటికల్ మేనేజ్మెంట్, రెగ్యులేటరీ అఫైర్స్, క్వాలిటీ అషూరెన్స్ కోర్సులు తొలగించింది. కొత్త కోర్సులతోపాటు కొత్త కాలేజీలు.. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులతో పాటు అదనపు సీట్లకు ఓకే చెప్పనుంది. మరోవైపు కొత్త కాలేజీలకూ అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఆ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుంటేనే వాటికి ఓకే చెప్పాలని, ఎన్వోసీ అందజేయాలని నిర్ణయించింది. కొత్త కాలేజీలు ఏర్పాటు చేయాలన్నా, అనుమతి ఇవ్వాలన్నా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత వర్సిటీ ఎన్వోసీ ఇవ్వాలి. అది ఉంటేనే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కాలేజీల ఏర్పాటుకు, ఇంటేక్ పెంపునకు అనుమతి ఇవ్వనుంది. 2020–21 విద్యాసంవత్సరంలో కాలేజీల అనుమతులకు ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్ ను ఇంకా విడుదల కాలేదు. అది విడుదలయ్యాక ఏఐసీటీఈ అందులో విధాన నిర్ణయానిన్న ప్రకటిం చనుంది. కొత్త కోర్సులకు అనుమతించాలని కిందటేడాదే ఏఐసీటీఈ విధానపర నిర్ణయం తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్, డాటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి కోర్సులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇపుడు ఏఐసీటీఈ వ్యతిరేకించేది ఉండదు కాబట్టి జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది. -
డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులను ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. యాజమాన్యాల నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించేందుకు చర్యలు చేపట్టింది. అలాగే అదనపు సీట్లు, సెక్షన్లు కూడా మంజూరు చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అలాగే పీజీ కాలేజీల్లోనూ కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు మంజూరు చేసేందుకు కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్సుల విత్‌డ్రా, మీడియం మార్పు కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. అయితే గత విద్యా సంవత్సరంలో 60 శాతం ప్రవేశాలున్న కాలేజీల్లోనే కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా నాణ్యతా ప్రమాణాలు పాటించే కాలేజీల్లోనే సీట్లను పెంచనున్నట్లు మండలి వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది 50 నుంచి 60 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీలు 110 వరకు ఉండగా, 60 నుంచి 70 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీలు 90 వరకు ఉన్నాయి. 70 నుంచి 80 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీలు 67 ఉండగా, 80 శాతానికి పైగా సీట్లు భర్తీ అయిన కాలేజీలు 50 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో కాలేజీలో సగటున 100 సీట్లు పెరిగే అవకాశం ఉంటుందని, దాంతో డిగ్రీ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరంలో 20 వేల వరకు సీట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే కోర్సులను ఉపసంహరించుకునేవి పరిగణనలోకి తీసుకుంటే 5 వేల వరకు సీట్లు తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడించాయి. మరోవైపు మండల పరిధిలో డిగ్రీ కాలేజీలను షిఫ్ట్ చేసుకునేందుకు 40 వరకు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. -
ఇంజనీరింగ్‌లో ఆ కోర్సులకు సెలవు
ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండే కొత్త సంప్రదాయక ఇంజినీరింగ్ కోర్సులకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వబోదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ లోక్‌సభకు తెలిపారు. కొత్తగా భారీ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సాంకేతికతలైన కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్‌చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్సెస్, సైబర్ భద్రత, 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్ తదితర కోర్సులను మాత్రమే ఇంజినీరింగ్ విద్యలో అనుమతిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలకు, ఇంజినీరింగ్ కళాశాలల్లో బోధిస్తున్న పాఠ్యాంశాలకు మధ్య చాలా తేడా ఉందనీ, ఈ వ్యత్యాసాలను పూడ్చితే యువతకు ఉపాధి కోసం పకోడీలు అమ్ముకోమని సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. -
ఉపాధికి ఊతమిచ్చేలా కోర్సుల రీడిజైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా వివిధ కోర్సుల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, దీని లో భాగంగా తాము కోర్సులను రీడిజైన్ చేస్తున్నామని ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లా డారు. వివిధ సర్వేల ప్రకారం దేశంలో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 20% మందికి, నాన్ ఇంజనీరింగ్ విద్యా ర్థుల్లో 10% మందికే ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని, యూజీ, పీజీ, పీహెచ్డీ చేసిన వారికీ ఉపాధి లభించట్లేదని చెప్పారు. మార్కెట్ అవసరాల మేరకు వివిధ కోర్సుల్లో సిలబస్ మార్పులు చేస్తున్నామని, దీని కనుగుణంగా వర్సిటీ కోర్సుల్లో సంస్కరణలు తెస్తున్నా మన్నారు. వర్సిటీ పాలన విషయంలో పలు మార్పుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇంజనీరింగ్ కోర్సుల సిలబస్‌లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) మార్పు లు చేసిందని, తమ పరిధిలోని కాలేజీల్లో వాటి అమలుకు చర్యలు చేపట్టామన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో కొత్త కరిక్యులమ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇంజనీరింగ్‌లో ఎంటెక్ మైనింగ్, పీజీ డిప్లొమా ఇన్ జెనెటిక్స్ను ఈ విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. విదేశీ విద్యార్థుల ఆకర్షణలో రెండో స్థానం విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో పూణే వర్సిటీ మొదటి స్థానంలో ఉంటే... ఓయూ రెండో స్థానంలో ఉందని రామచంద్రం తెలిపారు. ప్రస్తుతం ఓయూలో 3,630 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారని, వారి కోసం ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని, అందుకు నిధులు అవసరమని అన్నారు. -
కంపెనీ సెక్రటరీస్..కొత్త కోర్సులు
పస్తుత పోటీ ప్రపంచంలో ఎంచుకున్న రంగంలో శరవేగంగా దూసుకెళ్లాలంటే మనలోని నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ ఉండాలి. ఈ మేరకు కొత్త కోర్సులను అభ్యసించాలి. ఇదే ఉద్దేశంతో కామర్స్‌లో అదనపు నైపుణ్యాలను సొంతం చేసే సరికొత్త సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా’ (ఐసీఎస్ఐ) ప్రవేశపెట్టింది. కలల కొలువులకు మార్గం వేసే కంపెనీ సెక్రటరీ కోర్సుకు ఐసీఎస్ఐ పెట్టింది పేరు. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కరిక్యులంలో నిరంతరం మార్పులు చేర్పులు చేస్తూ విద్యార్థులకు నిత్య నూతన నైపుణ్యాలను నేర్పిస్తున్న ఐసీఎస్ఐ.. తాజాగా నాలుగు షార్ట్ టర్మ్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్’ (ఎన్ఐఎఫ్ఎం) భాగస్వామ్యంతో రూపొందించిన ఈ కోర్సుల క్లాసులు సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. సీఏ, సీఎస్ చదువుతున్న విద్యార్థులతోపాటు ఈ రంగంలో పనిచేస్తున్న నిపుణుల కెరీర్ అభివృద్ధికి దోహదపడే నయా కోర్సుల గురించి మరిన్ని వివరాలు.. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ వ్యాల్యుయేషన్ ‘యాడ్ వ్యాల్యూ టు స్కిల్స్’గా పేర్కొనే ఈ కోర్సును ప్రధానంగా కంపెనీ సెక్రటరీ విద్యార్థులను, ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. వివిధ సంస్థల విలువల మదింపులో కంపెనీ సెక్రటరీలదే కీలక పాత్ర. దీంతో వ్యాల్యుయేషన్‌లో వస్తున్న ఆధునిక పద్ధతులపై సదరు విద్యార్థులకు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు, ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీలకు తర్ఫీదునిచ్చేలా ఈ కోర్సుకు రూపకల్పన చేశారు. మూడు నెలల వ్యవధి గల ఈ కోర్సులో అభ్యర్థులకు ప్రతి వారాంతంలో వెబినార్స్ ద్వారా ఆన్లైన్ లెక్చర్స్ అందిస్తారు. కోర్సులో భాగంగా 90 గంటల సమయాన్ని సెల్ఫ్ స్టడీకి, మరో 90 గంటల సమయాన్ని వెబ్ బేస్డ్ ట్రైనింగ్‌కు కేటాయించారు. వ్యాల్యుయేషన్ అనాలిసిస్లో ప్రాథమిక సిద్ధాంతాలైన అనుకరణ, స్ట్రాటజీ అనాలసిస్, ప్రాస్పెక్టివ్ అనాలసిస్, డీసీఎఫ్ మోడలింగ్, ట్రేడింగ్ కంపారబుల్స్, ట్రాన్సాక్షన్ కంపారబుల్స్లో శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తై అభ్యర్థులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైతే సర్టిఫికెట్ అందిస్తారు. కోర్సులో ఒకసారి చేరిన తర్వాత దాన్ని పూర్తి చేసేందుకు గరిష్టంగా మూడు అవకాశాలు ఇస్తారు. ఈలోపు ఉత్తీర్ణత సాధించాలి. లేకపోతే రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. మళ్లీ చేరాలంటే మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ కోర్సుకు సీఎస్ ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు. డిప్లొమా ఇన్ ఇంటర్నల్ ఆడిట్ కార్పొరేట్ రంగం సెల్ఫ్ గవర్నెన్స్, సెల్ఫ్ సఫీషియన్సీ దిశగా అడుగులేస్తుండటంతో సంస్థల ఆర్థిక వ్యవహారాలు, సంబంధిత అంశాలకు సంబంధించి ఇంటర్నల్ ఆడిట్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త కోర్సుకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ఇంటర్నల్ ఆడిట్‌లోని అంశాలు, అమలవుతున్న విధానాలపై శిక్షణ ఇస్తారు. మూడు నెలల వ్యవధి గల ఈ కోర్సులో మొత్తం 50 గంటల సమయాన్ని సెల్ఫ్ స్టడీకి, మరో 50 గంటల సమయాన్ని ఆన్లైన్ లెక్చర్స్‌కు కేటాయించారు. కోర్సు పూర్తిచేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ అందిస్తారు. ఈ కోర్సుకు కూడా సీఎస్ ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు. కోర్సు కరిక్యులంలోని ప్రధానాంశాలు.. ‘లా అండ్ రెగ్యులేషన్స్ ఆన్ ఇంటర్నల్ ఆడిటింగ్-నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కార్పొరేట్/ఆర్గనైజేషనల్ గవర్నెన్స్ ప్రిన్స్‌పుల్స్, ఆడిట్ ప్రాక్టీసెస్ ఇన్ రిలేషన్ టు ది అకౌంటింగ్ సిస్టమ్ ప్లానింగ్ అండ్ మేనేజింగ్ ఇంటర్నల్ ఆడిట్ అండ్ ఇంటర్నల్ ఆడిట్ ప్రోగ్రామ్. ఫ్రాడ్ రిస్క్ అండ్ కంట్రోల్స్ ఇంటర్నల్ ఆడిట్ ఆఫ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్, రిస్క్ అవేర్నెస్ ఇంటర్నల్ ఆడిట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్స్ ఇ-లెర్నింగ్ మాడ్యూల్ ఆన్ బ్యాంకింగ్ టెక్నాలజీస్ బ్యాంకింగ్‌లో టెక్నాలజీ ఆధారిత సేవలు, కార్యకలాపాలు పెరుగుతుండటంతో ఈ రంగంలో కొలువుల వేటలో ముందంజలో ఉండాలనుకునేవారికి, అలాగే ఈ రంగంలో ఇప్పటికే విధులను నిర్వర్తిస్తున్నవారికి సరికొత్త నైపుణ్యాలను అందించేలా ఈ కోర్సును రూపొందించారు. ముఖ్యంగా కామర్స్, సీఎస్, సీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణులకు బ్యాంకింగ్ రంగంలోని టెక్నికల్ అంశాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కోర్సుకు రూపకల్పన చేశారు. బ్యాంకింగ్ రంగంలో టెక్నికల్ టెర్మినాలజీ, టెక్నికల్ ఎనేబుల్డ్ ఆపరేషన్స్‌పై నైపుణ్యాలను అందించేలా కరిక్యులాన్ని తీర్చిదిద్దారు. ఈ కోర్సులో బోధనంతా స్వీయ అభ్యసన విధానంలో కొనసాగుతుంది. అభ్యర్థులకు నిర్ణీత అంశాలపై అవగాహన కలిగేలా మెటీరియల్ అందిస్తారు. మొత్తం 17 సెషన్లలో 8 గంటల వ్యవధిలో ఆన్లైన్ లెక్చర్స్/సెల్ఫ్ స్టడీ ఉంటుంది. ఈ కోర్సుకు దరఖాస్తు చేసేందుకు గడువు విధించలేదు. ఏడాది పొడవునా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కోర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ట్యాక్సేషన్ ప్రస్తుతం మన దేశంలో పలు బహుళ జాతి సంస్థలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. దీంతోపాటు మన దేశంలోని వివిధ సంస్థలతో సంయుక్త వ్యాపార వ్యవహారాలను జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్ ప్రొఫెషనల్స్‌కు అంతర్జాతీయ పన్ను విధానాలు, ఎఫ్‌డీఐలు, డబ్ల్యుటీఓ విధానాలు తదితర అంశాలపై తర్ఫీదునిచ్చే ఉద్దేశంతో ఈ కొత్త కోర్సును రూపొందించారు. దీన్ని పూర్తిచేసిన అభ్యర్థులు ఎంఎన్సీల ట్యాక్స్ ప్రిన్స్‌పుల్స్, ఇతర అంశాలపై పూర్తిస్థాయి నైపుణ్యం సాధిస్తారు. కోర్సు క్లాసులు మొత్తం 15 రోజుల వ్యవధిలో ఆన్లైన్ విధానంలో ఉంటాయి. ఈ కోర్సుకు కూడా రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఎలాంటి కాలపరిమితి లేదు. ఏడాది పొడవునా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ఔత్సాహిక అభ్యర్థులు ఐసీఎస్ఐ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి. హోం పేజ్‌లో ఆయా కోర్సులకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ వ్యాల్యుయేషన్, డిప్లొమా ఇన్ ఇంటర్నల్ ఆడిట్ కోర్సులకు ఒక్కో బ్యాచ్‌కు ఎంత మందిని ఎంపిక చేస్తారనే విషయాన్ని పేర్కొనలేదు. అయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ప్రాధాన్యత ఉంటుందని మాత్రం స్పష్టం చేశారు. వెబ్సైట్: వివరాలకు ఠీఠీఠీ.జీఛిటజీ.్ఛఛీఠ చూడొచ్చు. వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్‌కు అదనపు ప్రయోజనం ఐసీఎస్ఐ రూపొందించిన నాలుగు షార్ట్‌టర్మ్ కోర్సులు వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌లకు కెరీర్‌పరంగా అదనపు నైపుణ్యాలు పొందడానికి ఉపకరిస్తాయి. ఈ కోర్సులన్నింటినీ సెల్ఫ్ స్టడీ విధానంలో అభ్యసించే వీలుంది. అందువల్ల సమాయాభావం అనే సమస్య తలెత్తదు. అన్ని రంగాల మాదిరిగానే కార్పొరేట్ రంగంలో కూడా రోజురోజుకీ కొత్త విధానాలు ఆవిష్కృతమవుతున్నాయి. వాటిని అందిపుచ్చుకుంటేనే కెరీర్‌పరంగా ఉన్నతి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఐసీఎస్ఐ.. ఎన్ఐఎఫ్ఎం భాగస్వామ్యంతో వీటికి రూపకల్పన చేసింది. - ఆర్. రామకృష్ణ గుప్తా సెక్రటరీ, ఐసీఎస్ఐ-ఎస్‌ఐఆర్‌వో. -
విశ్వ విద్యాలయంలో నూతన కోర్సులు
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో 2017–18 విద్యాసంవత్సరంలో నాలుగు నూతన కోర్సులు ప్రారంభిస్తున్నట్లు పాలకమండలి సభ్యులు ఎస్. గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైవీయూలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, రెక్టార్, మరో పాలకమండలి సభ్యుడు ఏజీ దాముతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప ప్రాంతంలో ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. వీరికి ఉపయోగపడేలా వైవీయూలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉర్దూ విభాగంతో పాటు ఫిషరీస్, రూరల్ డెవలప్మెంట్ తదితర ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రొద్దుటూరు,రాజంపేట ప్రాంతాల్లో పీజీ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థులు ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే విశ్వవిద్యాలయం నుంచి పంపివేయడమే గాక కఠినమైన చర్యలకు గురికావాల్సి వస్తుందని తెలిపారు. ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కళాశాలలో ర్యాగింగ్ నిరోధించేందుకు అధ్యాపకులు తరగతి గదుల్లో కౌన్సిలింగ్ ఇస్తున్నారన్నారు. కళాశాల ఆవరణంలో పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటుచేసి ప్రతిరోజూ అధ్యాపకులతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య గులాంతారీఖ్ మాట్లాడుతూ గతంలో డీఎస్పీ స్థాయి అధికారితో ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహించామన్నారు. త్వరలోనే మళ్లీ ఓసారి యాంటీర్యాగింగ్‌పై సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. పాలకమండలి సభ్యుడు, సీడీసీ డీన్ ఏజీ దాము మాట్లాడుతూ ర్యాగింగ్ అంశం దష్టికి రాగానే వసతిగహాల్లో ప్రతిబ్లాక్‌కు సెక్యూరిటీని ఏర్పాటుచేశామన్నారు. కొంతమంది విద్యార్థినులు ఒకబ్లాక్ నుంచి మరొక బ్లాక్ వెళ్లిన సమయంలో కొందరు అపార్థం చేసుకుని ర్యాగింగ్ కోసం వెళ్ళారని భావించారన్నారు. ఏదిఏమైనా ర్యాగింగ్‌కు ఎవరైనా పాల్పడితే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్అహ్మద్ పాల్గొన్నారు. -
ఏయూలో రెండు కొత్త కోర్సులు
ఏయూక్యాంపస్: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏయూ వాణిజ్య నిర్వహణ విభాగం రెండు నూతన కోర్సులను ప్రారంభించనుందని ఏయూ ఉప కులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు చెప్పారు. మంగళవారం హైదరాబాదులో జరిగిన ఫిన్‌టెక్ సమావేశంలో చర్చించిన ఆంశాలను బుధవారం ఆయన వెల్లడించారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్, కార్డ్స్, పేమెంట్స్ రంగాల అవసరాలను తీర్చే దిశగా విద్యార్థులను తయారు చేయడానికి సమావేశంలో చర్చించామన్నారు. దీనిలో భాగంగా ఏయూ డీసీఎంఎస్ విభాగంలో రెండు సంవత్సరాల పీజీ కోర్సు, ఏడాది కాలవ్యవధి కలిగిన పీజీ డిప్లమో కోర్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. పీజీ కోర్సులో ఎనిమిది నెలలు వర్సిటీలో బోధన, మరో ఎనిమిది నెలలు పారిశ్రామిక నిపుణుల సహకారంతో బోధన, చివరి ఎనిమిది నెలలు పూర్తిగా పరిశ్రమలో ప్రత్యక్ష శిక్షణ అందిస్తామన్నారు. ఏడాది కోర్సులో ఆరు నెలలు వర్సిటీలో బోధన, మిగిలిన ఆరు నెలలు పరిశ్రమలో బోధన జరుగుతుందన్నారు. సమావేశానికి ప్రముఖ విత్త నిర్వహణ సంస్థలు బ్రాడ్రిడ్జ్, సైకుల్, థామస్ రాయిటర్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్ఎస్బీసీ, క్యాపిటల్ ఐక్యూ, భారతీ ఏక్సా, వెల్స్ ఫార్గో వంటి సంస్థల ఉన్నతాధికారులు పాల్గొని వారి సమస్యలను వివరించారన్నారు. ప్రధానంగా సాంకేతిక ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్ధిక రంగాన్ని వద్ధి చేయడం లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందన్నారు. -
ఐటీఐల బలోపేతంపై దృష్టి
♦ కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని కార్మికశాఖ నిర్ణయం ♦ సింగపూర్ తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లను మరింత బలోపేతం చేసే దిశగా కార్మికశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా మానవ వనరులను తయారు చేసి, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను పెంపొందించడం కోసం పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ద్వారా విదేశాలలో ఉద్యోగ అవకాశాల కల్పనకు మంచి స్పందన లభించడంతో ఐటీఐ కాలేజీలను బలోపేతం చేయాలని కార్మికశాఖ నిర్ణయించింది. కార్మిక, హోంశాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో దుబాయ్‌లో జరిపిన పర్యటన ద్వారా టామ్‌కామ్ దాదాపు 1150 మందికి ఉద్యోగ అవకాశాల కోసం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. త్వరలో పదివేల మందికి ఉద్యోగ అవకాశాల కల్పనకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీఐలను నైపుణ్య కేంద్రాలుగా మార్చాలని కార్మికశాఖ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా శిక్షణ విధానంలో మార్పులు తీసుకురావడంతోపాటు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇప్పుడు అందిస్తున్న కోర్సులకు అదనంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇంటీరియర్ డిజైన్, బ్యూటీషియన్ వంటి కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అలాగే కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తూ, నూతన యంత్ర సామాగ్రి కొనుగోలు చేయాలని కార్మికశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సింగపూర్‌లో కొనసాగుతున్న పారిశ్రామిక శిక్షణ సంస్థల తరహాలో రాష్ట్రంలోని ఐటీఐలను తీర్చిదిద్దాలని యోచిస్తోంది. అందుకోసం ఈ ఏడాది మొదటి ప్రయత్నంలో భాగంగా రూ.350 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
మూడు కొత్త కోర్సులకు ప్రతిపాదనలు
కర్నూలు : పీజీలో మూడు కొత్తకోర్సుల ఏర్పాటుకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాల వైస్‌ఛాన్సలర్ ఎ.పద్మరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తిరుపతి విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజి, బాపట్లలోని విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ సీడ్ టెక్నాలజి, వాటర్ టెక్నాలజి కోర్సులను ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నారు. ఈ విషయమై మహానందిలోని వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన మీటింగ్‌కు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలలో పనిచేసే లెక్చరర్లు హాజరయ్యారు. -
నవతరానికి కొత్తబాట
న్యూఢిల్లీ: పది మంది నడిచిన దారి కాకుండా, మీకంటూ కొత్త మార్గం ఏర్పరుచుకొని కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలని ఉందా ? అయితే ఢిల్లీలోని వివిధ యూనివర్సిటీలు ప్రవేశపెడుతున్న నూతన కోర్సులను తప్పకుండా పరిశీలించాలి. విద్యార్థులను సామాజిక వ్యాపార, వైద్యం, విపత్తుల నిభాయింపు రంగంలో నిపుణులుగా మార్చేందుకు ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మాస్టర్స్స్థాయిలో సోషల్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్, విపత్తుల నిభాయింపులో ఎంబీఏ, ఎర్లీ చైల్డ్‌కేర్, బ్యాచులర్‌స్థాయిలో రిహాబిలిటేషన్ థెరపీ, ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, విదేశీ భాషలు తదితర కోర్సులను ప్రవేశపెట్టారు. ‘ఉదాహరణకు చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కోర్సును తీసుకుంటే దీనికి ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. శిశుసంరక్షణ కోసం గత ఏడాది ప్రభుత్వం జాతీయ విధానాన్ని ప్రకటించింది. దీని అమలు చేసేందుకు ఈ కోర్సు చేసిన నిపుణులు చాలా మంది అవసరం’ అని ఢిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీ (ఏయూడీ) డీఎన్ వెనితా కాల్ అన్నారు. ఈ విధానం అమలు చేయడానికి ప్రభుత్వం జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఉద్యోగులను నియమిస్తారని తెలిపారు. ‘శిశుసంరక్షణ, విద్యావిభాగం కోర్సు నిపుణుల కోసం ప్రపంచబ్యాంకు, యూనిసెఫ్, ప్లాన్ ఇండియా వంటి పేరొందిన సంస్థలూ వెతుకుతున్నాయి. స్కూళ్లకు కూడా వీరి సేవలు ఎంతో అవసరం’ అని కాల్ అన్నారు. సోషల్ ఎంటర్ ప్రిన్యూర్‌షిప్ ఎం.ఎ., ఎం.ఫిల్ కోర్సులు కూడా ఏయూడీలో ఉన్నాయి. ‘సామాజిక రంగంలో వ్యాపార నిపుణులను తయారు చేసేందుకు ఈ కోర్సును ప్రవేశపెట్టారు. వీళ్లు విద్యార్థులకు ప్రాథమిక వ్యాపార నైపుణ్యాలను బోధిస్తారు’ అని ఏయూడీ అధికారి ఒకరు అన్నారు. శిశుసంరక్షణలో ఎం.ఫిల్ చేసే విద్యార్థులైతే ఎనిమిది నెలలపాటు వెనుకబడ్డ రాష్ట్రాల్లోని గ్రామాల్లో పనిచేయాల్సి ఉంటుంది. రెండేళ్లపాటు ఈ కోర్సును అధ్యయనం చేయాలి. ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన 25 మందికి సీట్లు కేటాయిస్తారు. ఏయూడీతోపాటు గురు గోబింద్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ (జీజీఐయూ) కూడా బ్యాచులర్‌స్థాయిలో రిహాబిలిటేషన్ థెరపీ, ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, విపత్తుల నిభాయింపు (ఎంబీయే) వంటి నవతరం కోర్సులను అందజేస్తోంది. మనదేశంలో స్పీచ్ థెరపిస్టుల కొరత చాలా ఉందని ఈ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. జీజీఐయూతోపాటు ఎయిమ్స్‌లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. రిహాబిలిటేషన్ థెరపీ కోర్సుకు డిమాండ్ పెరుగుతోందని ఒక అధకారి అన్నారు. జిల్లాస్థాయి ఆస్పత్రుల్లో రిహాబిలిటేషన్ థెరపీ నిపుణుల అవసరం ఎంతగానో ఉంద ని తెలిపారు. గ్రామస్థాయిల్లో పనిచేసే సామాజిక సేవకులకు వీళ్లు శిక్షణ ఇస్తారు. వినికిడి, దృష్టి లోపం, మానసిక వైకల్యం గ ల వారికి చికిత్స చేసే నైపుణ్యాలను కూడా ఈ కోర్సు అభ్యర్థులకు నేర్పిస్తారు. విపత్తుల నిభాయింపు (ఎంబీయే) కోర్సు తరగతులను వారానికోసారి నిర్వహిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు, వాటి నిభాయింపు, సహాయక చర్యల గురించి విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కలిగిస్తారు. కేంద్ర, రాష్ట్రస్థాయిల్లోనూ విపత్తుల నిభాయింపు ప్రాధికారసంస్థల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అత్యవసర ప్రణాళిక, నష్టం మదింపు, సామాజిక అభివృద్ధి, సామర్థ్యం పెంపు తదితర రంగాల్లో విస్తరించిన కంపెనీలకు కూడా ఈ కోర్సు అభ్యర్థుల అవసరం అధికంగా ఉంది. దక్షిణ మధ్య ఆసియాలోని పలు దేశాల్లో మాట్లాడే పష్తో భాష అధ్యయనంపై జామియా మిలియా యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టారు. ఏ యూనివర్సిటీలో ఏ కోర్సు ? అంబేద్కర్ యూనివర్సిటీ (ఏయూడీ) : మాస్టర్స్స్థాయిలో సోషల్ ఎంటర్ ప్రిన్యూర్‌షిప్, చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ గురు గోబింద్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ (జీజీఐయూ): బ్యాచులర్‌స్థాయిలో రిహాబిలిటేషన్ థెరపీ, ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, విపత్తుల నిభాయింపు (ఎంబీయే) జామియా మిలియా యూనివర్సిటీ : పష్తో భాష అధ్యయనంపై అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు -
ఏయూలో కొత్త కోర్సులు
అకడమిక్ సెనేట్ సమావేశంలో నిర్ణయం రూ.367 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : రానున్న విద్యా సంవత్సరం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా పలు కోర్సులు ప్రారంభించాలని గురువారం జరిగిన అకడమిక్ సెనేట్ సమావేశంలో నిర్ణయించారు. తొలుత వీసీ గత మూడు నెలలుగా వర్సిటీలో జరిగిన ప్రగతి కార్యక్రమాలను వివరించారు. అనంతరం 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.118 కోట్ల లోటుతో రూ.367 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సెనేట్ ముందుంచి ఆమోదం పొందారు. పాట్నా వర్సిటీ ఉపకులపతిగా నియమితులైన ఏయూ మాజీ వీసీ వై.సి సింహాద్రిని ఈ సందర్భంగా వీసీ రాజు సత్కరించారు. అకడమిక్ సెనేట్ శాశ్వత సభ్యుడు అక్కినేని నాగేశ్వరరావు మృతికి సభ్యులు మౌనం పాటించి సంతాపం తెలిపారు. వర్సిటీ మాజీ వీసీ కె.వి.రమణ, రెక్టార్ ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, ప్రిన్సిపాళ్లు, డీన్లు, ఫ్యాకల్టీ చైర్మన్లు, సెనేట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం సెనేట్ సమావేశం వివరాలను వీసీ విలేకరులకు వివరించారు. ఇవీ కొత్త కోర్సులు జర్నలిజం విభాగం ద్వారా రెండేళ్ల కాల వ్యవధితో ఎంఎస్ కమ్యూనికేషన్ మీడియా స్టడీస్(సెల్ఫ్ ఫైనాన్స్), కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల నుంచి ఐదేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులు, ఎం.ఫార్మసీ నుంచి ఫార్మస్యూటికల్ మేనేజ్మెంట్, రెగ్యులారిటీ ఎఫైర్స్, చిత్రకళా విభాగం నుంచి ఎంఎఫ్ఏ, పీహెచ్డీ, మహిళా అధ్యయన కేంద్రం ద్వారా మూడు నెలల కాల వ్యవధి కలిగిన ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సర్వైవల్ స్కిల్స్ కోర్సులు ప్రారంభించనున్నారు. గతంలో నిలిపివేసిన ఎంఎస్ జియాలజీ కోర్సును పునః ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మెరైన్ జియాలజీ, ఇంజినీరింగ్ కళాశాల ద్వారా అందిస్తున్న ఐదేళ్ల సమీకృత అనువర్తిత రసాయన శాస్త్రం కోర్సుల్లో ప్రవేశాలను నిలిపివేశారు. వర్సిటీ ఐఏఎస్ఈ, విజయనగరం పీజీ కేంద్రం ద్వారా అందిస్తున్న ఎంఈడీ కోర్సుకు ఎన్సీటీఈ గుర్తింపు లభించిందని వీసీ తెలిపారు. వీటితో పాటు పలు కోర్సులలో సిలబస్ మార్పులు, పరీక్షల విధానం, మూల్యాంకనం తదితర అంశాలను సభ్యులు ఆమోదం తెలిపారు. యోగా విభాగం ద్వారా అందిస్తున్న ఎంఏ యోగా కోర్సు సిలబస్ మార్పులకు ఆమోదించారు.