ఐఐటీ రూర్కిలో ఏడు కొత్త కోర్సులు | IIT Roorkee Introduces Seven New Academic Programmes | Sakshi
Sakshi News home page

IIT Roorkee: ఏడు కొత్త కోర్సులు

Published Tue, Aug 3 2021 7:54 AM | Last Updated on Tue, Aug 3 2021 7:54 AM

IIT Roorkee Introduces Seven New Academic Programmes - Sakshi

న్యూఢిల్లీ: మారుతున్న కాలానికి అనుగుణంగా ఐఐటీ రూర్కి 7 కొత్త కోర్సులను తయారు చేసింది. ఇవి రానున్న విద్యా సంవత్సరం (2021-22) నుంచే అందుబాటులో ఉంటాయని  సోమవారం తెలిపింది. ఇంజనీరింగ్‌ ఆర్కిటెక్చర్, ఎకానమిక్స్‌–మేనేజ్‌మెంట్, డేటాసైన్స్‌ –ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో ఈ కోర్సులను డిజైన్‌ చేసినట్లు తెలిపింది.

కొత్త కోర్సులివే
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఎం.టెక్‌ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఎంటెక్‌ (డేటా సైన్స్‌); డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిజైన్‌ విభాగంలో డేటా సైన్స్‌(సీఏఐడీఎస్‌), ఎం.డెస్‌ (ఇండస్ట్రియల్‌ డిజైన్‌), ఎంఐఎం (మాస్టర్స్‌ ఇన్‌ ఇన్నొవేషన్‌ మేనేజ్‌మెంట్‌); ఎలక్ట్రాన్సిక్స్‌ విభాగంలో ఎం.టెక్‌ (మైక్రో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ); హ్యుమానిటీస్, సోషల్‌ జస్టిస్‌ విభాగంలో ఎంఎస్‌ ఎకానమిక్స్‌ (5 ఏళ్ల కోర్సు), హైడ్రాలజీ విభాగంలో ఎం.టెక్‌ (డ్యామ్‌ సేఫ్టీ అండ్‌ రిహాబిలిటేషన్‌). 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement