సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. అవసరమైన సదుపాయాలు, ఫ్యాకల్టీ ఉంటే 2020–21 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులు ప్రారంభించేందుకు కాలేజీలకు గుర్తింపి వ్వాలని జేఎన్టీయూ నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో 5 కాలేజీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సును ప్రవేశపెట్టగా, 2020–21 విద్యా సంవత్సరంలో సదుపాయాలు ఉన్న అన్ని కాలేజీలు ఆ కోర్సును ప్రారంభించేందుకు అనుమతులను ఇవ్వనుంది. ఏఐతో పాటు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సీఎస్‌ఐటీ), కంప్యూటర్ సైన్స్ అండ్ బిజి నెస్ సిస్టమ్స్ (సీఎస్‌బీఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ (ఐటీ ఈ) కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుబంధ గుర్తింపివ్వాలని నిర్ణయిం చింది. 2020–21 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ కాలేజీలతో పాటు దాని అనుబంధ కాలేజీల్లో ఆయా కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తు తం జేఎన్టీయూ పరిధిలో 170 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి.
వాటిలో లక్షకుపైగా సీట్లు ఉన్నాయి. అయితే ఏటా జేఎన్టీయూ 85 వేల వరకు సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇస్తోంది. ప్రస్తుతం కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో ఈసారి అదనంగా మరో 10 వేల సీట్లలో ప్రవేశాలకు అనుమతించే అవకాశం ఉంది. మరోవైపు 100 ఫార్మసీ కాలేజీలు, 10 పీజీ కాలేజీ లున్నాయి. వాటిలో 50 వేల వరకు సీట్లు ఉన్నాయి. వాటిలోనూ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండి, ఆయా కోర్సులను ప్రారంభించాలనుకునే యాజమాన్యాల నుంచి జేఎన్టీయూ దరఖాస్తులు స్వీకరించి అనుబంధ గుర్తింపు ఇవ్వనుంది. ఇదే విషయాన్ని డ్రాఫ్ట్ అఫీలియేషన్ రెగ్యులేషన్స్‌లో పొందుపరిచింది.
ఎం.ఫార్మసీలో నాలుగు కొత్త కోర్సులు..
ఎం.ఫార్మసీలోనూ 4 కొత్త కోర్సులకు అనుమతివ్వనుంది. మార్కెట్ అవసరాల మేరకు కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇతర సబ్జెక్టులతో కాంబినేషన్‌గా ఉన్న సబ్జెక్టులను ప్రత్యేక సబ్జెక్టులు గా ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాసూటికల్ అనాలిసిస్, ఫార్మాసూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మాసూటికల్ క్వాలిటీ అషూరెన్స్ కోర్సులను నిర్వహించేందుకు కాలేజీ లకు అనుబంధ గుర్తింపు ఇవ్వనుంది. డిమాండ్ లేని హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ, ఫార్మాసూ్యటికల్ అనాలిసిస్, క్వాలిటీ అషూరెన్స్, ఫార్మాసూ్యటికల్ మేనేజ్‌మెంట్, రెగ్యులేటరీ అఫైర్స్, క్వాలిటీ అషూరెన్స్ కోర్సులు తొలగించింది.
కొత్త కోర్సులతోపాటు కొత్త కాలేజీలు..
వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులతో పాటు అదనపు సీట్లకు ఓకే చెప్పనుంది. మరోవైపు కొత్త కాలేజీలకూ అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఆ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుంటేనే వాటికి ఓకే చెప్పాలని, ఎన్వోసీ అందజేయాలని నిర్ణయించింది. కొత్త కాలేజీలు ఏర్పాటు చేయాలన్నా, అనుమతి ఇవ్వాలన్నా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత వర్సిటీ ఎన్‌వోసీ ఇవ్వాలి. అది ఉంటేనే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కాలేజీల ఏర్పాటుకు, ఇంటేక్ పెంపునకు అనుమతి ఇవ్వనుంది. 2020–21 విద్యాసంవత్సరంలో కాలేజీల అనుమతులకు ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్ ను ఇంకా విడుదల కాలేదు. అది విడుదలయ్యాక ఏఐసీటీఈ అందులో విధాన నిర్ణయానిన్న ప్రకటిం చనుంది. కొత్త కోర్సులకు అనుమతించాలని కిందటేడాదే ఏఐసీటీఈ విధానపర నిర్ణయం తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్, డాటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి కోర్సులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇపుడు ఏఐసీటీఈ వ్యతిరేకించేది ఉండదు కాబట్టి జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment