
ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండే కొత్త సంప్రదాయక ఇంజినీరింగ్ కోర్సులకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వబోదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ లోక్‌సభకు తెలిపారు. కొత్తగా భారీ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సాంకేతికతలైన కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్‌చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్సెస్, సైబర్ భద్రత, 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్ తదితర కోర్సులను మాత్రమే ఇంజినీరింగ్ విద్యలో అనుమతిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలకు, ఇంజినీరింగ్ కళాశాలల్లో బోధిస్తున్న పాఠ్యాంశాలకు మధ్య చాలా తేడా ఉందనీ, ఈ వ్యత్యాసాలను పూడ్చితే యువతకు ఉపాధి కోసం పకోడీలు అమ్ముకోమని సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment