
ఎన్నికలు వచ్చేశాయి.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నిలబడగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ, జనసేనలతో జతకట్టి ప్రజల్లోకి వెళ్తోంది. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి రకరకాలవాళ్ళను ప్రచారానికి దించుతోంది.
బాలయ్య బాబు వంటి సినిమా స్టార్లు ఒకవైపు ప్రచారం చేస్తుండగా ఏకంగా పవన్ కళ్యాణ్ సైతం అటు పిఠాపురంలో పోటీ చేస్తూనే వేరే నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తరఫున జబర్దస్త్ టీమ్ మొత్తం కొన్నాళ్లపాటు ప్రచారం చేయగా ఇక మెగా కాంపౌండ్‌లోని హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ వంటివాళ్ళు సైతం ప్రజల్లోకి వెళ్లి కూటమికి ఓటేయాలని అడుగుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడు పవన్‌ను పిఠాపురంలో గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. ఇలా కూటమి వైపు మొత్తం పెద్దపెద్ద సినిమా స్టార్లు ప్రచారం చేస్తున్నారు.
లబ్ధిదారులే జగన్ స్టార్ క్యాంపెయినర్లు
అటు ప్రచారం అలా ఉండగా ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్‌సీపీ మాత్రం ప్రజలే ప్రచార సారధులుగా ముందుకు సాగుతోంది. ఓ వైపు అంతా తానై సీఎం జగన్ ప్రచారం చేస్తుండగా మరోవైపు ఆయన ప్రభుత్వంలో లబ్దిపొందినవాళ్లు ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు.
తెలుగుదేశం హయాంలో పెన్షన్ కోసం ఇబ్బంది పడిన ఓ తాత.. అమ్మ ఒడి అందుకున్న ఓ అక్క.. జగనన్న విద్యాకానుక అందుకున్న ఒక కుర్రాడి తల్లి.. ఆసరా అనుకున్న ఓ అక్క.. ఇలా పేదలే సీఎం జగన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ మంచి జరగాలి అంటే మళ్ళీ జగన్ గెలవాలి అని ఇంటింటికి వెళ్లి చెబుతున్నారు. ఆ గట్టున సినిమా క్యాంపెయినర్లుగా ఉండగా ఈ గట్టున పేదలే స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చేందుకు పని చేస్తున్నారు.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment