BJP Key Announcement Over Muslim Reservations, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, పవన్‌కు పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ కీలక ప్రకటన!

May 1 2024 9:44 AM | Updated on May 1 2024 12:35 PM

BJP Key Announcement Over Muslim Reservations

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో ఎ​న్నికల వేళ కూటమిలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. టీడీపీ, జనసేనకు బీజేపీ ఊహించని షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ కట్టుబడి ఉంటుందని.. తెలుగుదేశం, జససేన ని​ర్ణయాలకు అనుకూలంగా ఉండలేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది.

ఇక, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే డీప్‌ ఫేక్‌ వీడియోల వ్యవహారం సోషల్‌ మీడియా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పార్టీ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ మరోసారి పునర్ఘటించింది. ఈ క్రమంలో ముస్లిం రిజర్వేషన్ల రద్దుకే కట్టుబడి ఉన్నామని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో.. టీడీపీ, జనసేన నిర్ణయాలకు తాము అనుకూలంగా లేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది.

 


బాబును నమ్మని బీజేపీ 
ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడినప్పటికీ, ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు. చంద్రబాబు ఢిల్లీలోని తన ఏజెంట్లు, బీజేపీలో ఉన్న తన అనుంగులు, ఇతరత్రా పైరవీలు చేశారు. అయినా బీజేపీ పెద్దలు ఆయన్ని నమ్మలేదు. ఢిల్లీలో రాత్రింబవళ్లు పడిగాపులు గాసి, కాళ్లా వేళ్లా పడి చిట్టచివరకు పొత్తు పెట్టుకోగలిగారు. బీజేపీ పొత్తయితే పెట్టుకొంది కానీ, చంద్రబాబును ఆ పార్టీ పెద్దలు నమ్మడంలేదన్న విషయం ప్రతి సందర్భంలోనూ బయటపడుతోంది. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపే అసాధ్యమైతే, మేనిఫెస్టో విషయంలోనూ మరోసారి అభాసుపాలు కాకూడదని బీజేపీ అధిష్ఠానం భావించింది. దీంతో ఈసారి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఓ పరిశీలకుడిని మాత్రమే పంపి మమ అనిపించింది. కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరుకాలేదు.

అంతేకాదు.. మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫొటోగానీ, కమలం గుర్తు గానీ ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే, చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ, ఇతర నాయకుల ఫొటోలు లేకుండా, కమలం గుర్తును మాత్రం వేయించారు. బీజేపీ దీనికీ అంగీకరించలేదు. దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌సింగ్‌ పట్టుబట్టారు. దీంతో మేనిఫెస్టో ముఖచిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement