సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. కూటమిలో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకోగా.. తాజాగా బీజేపీ సంచలన ప్రకటన చేసింది. బీజేపీ ప్రకటనతో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త టెన్షన్ మొదలైంది.
కాగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురువారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై దాదాపు గంటకు పైగా చర్చించారు. ఈ క్రమంలోనే ముస్లిం రిజర్వేషన్లపై కూడా వారిద్దరూ చర్చించారు. దీంతో, రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ స్పష్టం చేసింది.
ఇక, వీరి సమావేశం అనంతరం విలేకరులు సమావేశంలో పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. తాము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని గోయల్ తేల్చి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు మాత్రమే తాము అనుకూలమని గోయల్ స్పష్టం చేశారు. ముస్లింలకు మాత్రం రిజర్వేషన్లు ఇచ్చేదేలేదని ప్రకటన చేశారు.
అయితే, బీజేపీ ప్రకటన కారణంగా చంద్రబాబుకు కొత్త టెన్షన్ క్రియేట్ అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ప్రకటనతో ఏపీలో కూటమికి ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక, ఏపీలో వైఎస్సార్‌సీపీ మైనార్టీల విషయంలో సామాజిక న్యాయం పాటిస్తోంది. తాజాగా కూటమి నేతల ప్రకటనతో వైఎస్సార్‌సీపీ గెలుపునకు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment