ఎమ్మెల్సీ పదవికి పయ్యావుల రాజీనామా | Payyavula Keshav Resigns His MLC Seat | Sakshi

ఎమ్మెల్సీ పదవికి పయ్యావుల రాజీనామా

Published Tue, Jun 4 2019 6:23 PM | Last Updated on Tue, Jun 4 2019 6:27 PM

Payyavula Keshav Resigns His MLC Seat - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేశవ్‌ ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. పయ్యావుల రాజీనామాను ఆమోదించిన శాసన మండలి ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన పయ్యావుల.. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement