
సాక్షి, అనంతపురం : ప్రజాస్వామ్యం గురించి పయ్యావుల కేశవ్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ పయ్యావుల కుటుంబం అని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడి చేసిన అవినీతి పరుడు పయ్యావుల అని ధ్వజమెత్తారు. అలాగే అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుమారుల పేరుమీద అమరావతిలో, కియా కార్ల కంపెనీ వద్ద వందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment