vishveshwar reddy
-
పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ పోరుబాటపై అక్రమ కేసులు
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి పాలనలో అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపుతో వారిపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనల్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.అనంతపురం జిల్లాలో కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కూటమి నేతల మెప్పు కోసం వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడంతో తగ్గించాలని వైఎస్సార్సీపీ పోరుబాట కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ఘన విజయాన్ని అందుకుంది. పోరుబాటలో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఇక, అనంతపురంలో ఉరవకొండ మాజీ విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతల ఫిర్యాదుతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి సహా 16 మంది పోలీసులు కేసులు పెట్టారు. రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.అయితే, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించారని పచ్చ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఇదే సమయంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా కేసులు పెట్టారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై పోలీసుల కేసులు పెట్టడంపై సర్వత్రా విమర్శలు ఎదరవుతున్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ఒత్తిడితోనే పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక, అంతకుముందు.. వైఎస్సార్సీపీ పోరుబాటకు వెళ్లొద్దని మూడు రోజులుగా పోలీసుల వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
సమస్యల పరిష్కారానికి సీఎంను కలుస్తా: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని లోక్‌సభలో బీజేపీ విప్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. లక్ష కోట్లతో మూసీ ప్రాజెక్టు కట్టడం కంటే ముందు ఎస్టీపీల నిర్మాణం, నిర్వహణ చేపట్టాలని సూచించారు. జంట జలాశయాలకు సంబంధించి ఇప్పుడు 111 జీవో అమలులో ఉందా? లేక 69 జీవో అమలు చేస్తున్నారో తెలియడం లేదన్నారు.శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎంను కలిసిన సందర్భంగా 111 జీవోపై నివేదిక ఇస్తానని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరు ప్రస్తావించలేదన్న విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇచ్చామంటున్న విపక్షాలు, తెలంగాణకు గత ఆరు నెలల్లో రూ. 40 వేల కోట్లు ఇప్పటికే ఇచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రస్తావించారన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు ముస్లింలకు వ్యతిరేమంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, వచ్చే పార్లమెంటు సమావేశంలో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందుతుందని, దీని వల్ల ముస్లింలకు లాభం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 9,400 కోట్ల సర్వశిక్షా అభియాన్ నిధులు మురిగిపోయాయన్నారు. -
‘ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్సీపీదే’
సాక్షి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. రీకౌంటింగ్ చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. కౌంటింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ ఓట్లు టీడీపీ ఖాతాలో వేశారని నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘాలనికి వైఎస్సార్సీపీ లేఖ రాసింది. ఈ సందర్బంగా వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్సీపీదే. కౌంటింగ్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తాం. ఓట్ల తారుమారుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. తొలి రెండు రౌండ్లు నాకు మోజారిటీ వచ్చింది. ఇండిపెండెంట్ అభ్యర్థి తరఫున టీడీపీ సీనియర్ నేతలు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండటం అనైతికం. వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ ఓట్లు టీడీపీ ఖాతాలో వేశారు. ఈ సందర్బంగా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పందన రాలేదు. 10 రౌండ్లలో మాకు మెజార్టీ వచ్చిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ.. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయి. వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ ఓట్లు టీడీపీ ఖాతాలో వేశారని పదేపదే ఫిర్యాదు చేసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. కౌంటింగ్ కేంద్రంలో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు. వైఎస్సార్సీపీ ఓట్లను టీడీపీ ఖాతాలో జమ చేసినా అధికారులు పట్టించుకోలేదు. వెంటనే రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. -
‘హత్యా రాజకీయాలకు కేరాఫ్ పయ్యావుల’
సాక్షి, అనంతపురం : ప్రజాస్వామ్యం గురించి పయ్యావుల కేశవ్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ పయ్యావుల కుటుంబం అని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడి చేసిన అవినీతి పరుడు పయ్యావుల అని ధ్వజమెత్తారు. అలాగే అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుమారుల పేరుమీద అమరావతిలో, కియా కార్ల కంపెనీ వద్ద వందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. -
‘వైఎస్ పథకాలు దేశానికే స్ఫూర్తిదాయకం’
సాక్షి, అనంతపురం : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప దార్శనికుడని, ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే స్ఫూర్తిదాయకమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. నేడు వైఎస్ జయంతి సందర్భంగా మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్సార్‌దేనని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితే మళ్లీ రాజన్నయుగం వస్తుందని చెప్పారు. వైఎస్సార్ ఆశయాలు సాధించేందుకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
'ప్రత్యేక హోదాపై డ్రామాలా?'
అనంతపురం: ప్రత్యేక హోదా పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఒకటేనని మభ్యపెడుతున్నారని తెలిపారు. అనంతపురం జిల్లాలో రైతులు బతికే పరిస్థితిలో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో కరువు పరిస్థితుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.