ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పయ్యావుల ఫైర్ | payyavula keshav takes on defectioned MLAs | Sakshi
Sakshi News home page

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పయ్యావుల ఫైర్

Published Tue, May 24 2016 9:33 AM | Last Updated on Fri, Aug 10 2018 7:13 PM

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పయ్యావుల ఫైర్ - Sakshi

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పయ్యావుల ఫైర్

వాళ్లు పొద్దు తిరుగుడు పువ్వులు లాంటివాళ్లు
ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే చేరుతారు


కళ్యాణదుర్గం (అనంతపురం): అధికారం కోసం కొందరు పొద్దుతిరుగుడు పువ్వుల్లాంటి రాజకీయ నాయకులు వస్తుంటారని, వారి పట్ల పార్టీ పెద్దలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సూచించారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి చేరే వారున్నారని పరోక్షంగా టీడీపీలో చేరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాంటి నాయకులతో టీడీపీకి ఇబ్బందులు రావొచ్చని హెచ్చరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్‌యార్డులో సోమవారం నిర్వహించిన టీడీపీ జిల్లా మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. జాతీయ పార్టీ బీజేపీ కన్నా టీడీపీనే కేంద్రాన్ని శాసించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు.

కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ... ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని, లేనిపక్షంలో కేంద్రంలోని బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ రాష్ట్ర పరిశీలకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీలో చేరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా.. మినీ మహానాడు నుంచి మధ్యలోనే నిష్ర్కమించారు. దీంతో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, కందికుంట వెంకట ప్రసాద్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement