Telugu Desam MLC
-
టీడీపీ ఎమ్మెల్సీ బూతు పురాణం
-
గతంలో జేపీ.. ఇప్పుడు లక్ష్మీనారాయణ!
సాక్షి, అమరావతి: ఐపీఎస్, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విమరణకు దరఖాస్తు చేసి సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్ర అదనపు డీజీగా ఆయన కొనసాగుతున్నారు. అనంతరం లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రానున్నారన్నని ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎస్ రాజకీయ అరంగేట్రంపై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ స్పందించారు. లక్ష్మీ నారాయణ ఏ పార్టీలో చేరినా, లేక సొంతంగా పార్టీ పెట్టినా ప్రతిపక్షాల ఓట్లు చీల్చుకోవడానికే పరిమితం అవుతారంటూ జోస్యం చెప్పారు. ఆ అధికారి రాజకీయాల్లోకి వస్తే టీడీపీకే లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో జేపీ వల్ల ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీకి నష్టం జరిగిందని, ఇప్పుడు లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చినా ప్రతిపక్షాలకే నష్టం కలుగుతుందన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని పయ్యావుల కేశవ్ అన్నారు. -
టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై పోసాని బహిరంగ సవాల్
-
పాదచారిని ఢీకొట్టిన టీడీపీ ఎమ్మెల్సీ అనుచరులు
ప్రకాశం బ్యారేజీ (తాడేపల్లి రూరల్): విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ 45వ ఖానా వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక పాదచారికి తీవ్ర గాయాలయ్యాయి. 100 కి.మీ.పైగా వేగంతో వెళ్తున్న కారు పాదచారిని ఢీకొని ఆపకుండా వెళ్లిపోవడంతో బ్యారేజీపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు కారు నంబర్‌తో పాటు, కారుపై ఉన్న పేర్లను, ఎన్టీఆర్ బొమ్మను గుర్తించి గుంటూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉండవల్లి సెంటర్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ బాలకృష్ణ కారు ఆపేందుకు ప్రయత్నించగా దారి మళ్లించి తాడేపల్లి రోడ్డులోకి కారు పోనిచ్చారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కారుకు అడ్డంగా నిల్చుని ఆపేశాడు. దీంతో కారు దిగిన యువకులు ఎందుకు ఆపారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఒక వ్యక్తి తమ కారు అద్దం తగిలి కిందపడ్డాడని, తమకు ఏం తెలియదంటూ సమాధానం ఇచ్చారు. కాగా, ప్రమాదం జరిగిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ ఎస్ఐ బాలకృష్ణ పట్టుకొన్న కారును తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. నిందితులు తాము టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అనుచరులమని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ విషయమై పోలీసులను వివరణ కోరడానికి ప్రయత్నించగా చెప్పడానికి నిరాకరించడం గమనార్హం. -
దీపక్ రెడ్డి నుంచి కీలక వివరాల సేకరణ
- జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన సీసీఎస్ - తాను కేవలం పెట్టుబడులు మాత్రమే పెట్టానంటూ వెల్లడి - ఆయనకు అన్ని విషయాలూ తెలుసన్న న్యాయవాది శైలేష్ సాక్షి, సిటీబ్యూరో : భూకబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డితో పాటు సహ నిందితులైన న్యాయవాది శైలేష్ సక్సేన, శ్రీనివాస్‌ల పోలీసు కస్టడీ గవుడు గురువారంతో ముగిసింది. దీంతో వీరికి వైద్య పరీక్షలు చేయించిన సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. సీసీఎస్ అధికారులు దీపక్‌రెడ్డితో పాటు ఇతర నిందితుల్ని మూడు రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకుని విచారించారు. ఎమ్మెల్సీ అయినా దీపక్‌రెడ్డిని పోలీసులు ఇతర నిందితుల మారిదిగానే ట్రీట్ చేశారు. సీసీఎస్ కార్యాలయం లోపలి వైపు 10 అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పుతో ఉన్న లాకప్ గదిలోనే ఉంచారు. విచారణ చేస్తున్న సమయంలోనే అక్కడ నుంచి ఏసీపీ కార్యాలయానికి తరలించారు. రాత్రి వేళల్లో సైతం దీపక్‌రెడ్డి ఇతర నిందితులతో కలిసి పత్రికలు పరుచుకుని నేల పైనే పడుకున్నారు. భూ కబ్జాలు, బోగస్ డాక్యుమెంట్లు, యజమానుల సృష్టిపై ప్రధానంగా ఇతడిని పోలీసులు ప్రశ్నించారు. అయితే తాను కేవలం పెట్టుబడులు మాత్రమే పెట్టానని, స్థలాలు ఖరీదు చేస్తున్నామంటూ శైలేష్ సక్సేన చెప్పడంతో అలా చేశానని సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఆ వివాదాస్పద భూములకు సంబంధించిన వివరాలను ఎన్నికల ఆఫిడవిట్లో ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించగా.. ప్రస్తుతం కోర్టు కేసుల్లో ఉన్నా ఎప్పటికైన తన సొంతం అవుతాయనే అలా చేశానని చెప్పినట్లు తెలిసింది. మరోపక్క న్యాయవాది శైలేష్ సక్సేన విచారణలో కేసులకు సంబంధించిన కీలక సమాచారం పోలీసులు సేకరించారు. బోగస్ డాక్యుమెంట్లు ఎక్కడ నుంచి సంగ్రహించారు? స్టాంపులు ఏ విధంగా తయారు చేశారు? తదితర వివరాలు రాబట్టారు. విచారణ నేపథ్యంలో దీపక్‌రెడ్డికి అన్ని విషయాలు తెలుసంటూ శైలేష్ సక్సేన చెప్పినట్లు తెలుస్తోంది. జీపీఏలు చేసుకునే సమయంలో ఆయనే స్వయంగా సంతకాలు చేశారని, కొన్ని స్థలాలకు సంబంధించి న్యాయస్థానం ఉత్తర్వులు వచ్చినప్పుడు ఆధీనంలోకి తీసుకోవడానికి దీపక్‌రెడ్డి సైతం వచ్చినట్లు వెల్లడించాడు. మరో నిందితుడైన శ్రీనివాస్ విచారణలో అత్యంత కీలక ఆధారాలు సీసీఎస్ పోలీసులకు లభించాయి. ఈ కేసులో నిందితుల్ని మరో ఐదు రోజుల పోలీసుకస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. -
దీపక్‌పై వేటు పడేనా?
– సీబీఐ దాడుల నేపథ్యంలో ఎమ్మెల్సీ వాకాటిపై టీడీపీ సస్పెన్షన్ వేటు – అరెస్టయిన దీపక్‌రెడ్డిపై కూడా చంద్రబాబు వేటు వేస్తారా అని సర్వత్రా చర్చ – దీపక్‌రెడ్డి చరిత్ర ఆది నుంచీ నేరపూరితమే – జేసీ బ్రదర్స్ అండతో కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) దీపక్‌రెడ్డి ఐదేళ్ల కిందట వరకూ ‘అనంత’కు పరిచయం లేని పేరు. 2012 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రాయదుర్గం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఒక్కసారిగా అందరి నోళ్లలో నానారు. గెలిచి కాదు..ఆయన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల చిట్టాతోనే! రాష్ట్రంలో.. బహుశా దేశంలోనే ఏ అసెంబ్లీ అభ్యర్థీ చూపించిన విధంగా తనకు రూ.6,781కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొని ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జిల్లా నుంచి కనుమరుగయ్యారు. తాజాగా తిరిగి వార్తల్లోకి వచ్చారు. భూకబ్జా కేసుల్లో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో ఆయనపై ‘అనంత’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సీబీఐ దాడుల నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై ఇటీవల సస్పెన్షన్ వేటు వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు భూకబ్జా లాంటి భారీ అక్రమాలతో ఏకంగా అరెస్టయిన ఎమ్మెల్సీ దీపక్రెడ్డిపైన సస్పెన్షన్ వేటు వేస్తారా? వేయరా? అనే చర్చ విపక్షంతో పాటు అధికార పక్షంలోనూ నడుస్తోంది. దీపక్‌రెడ్డి చరిత్ర నేరపూరితమే! దీపక్‌రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయాన అల్లుడు. ఈయన నెల్లూరు జిల్లాకు చెందినవారు. అయితే.. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. 2012 ఉప ఎన్నికలకు ముందు డీ.హీరేహాళ్‌లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ ఉప ఎన్నికల్లో రాయదుర్గం నుంచి పోటీ చేశారు. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను పేర్కొంటూ వార్షిక ఆదాయం రూ.3.27లక్షలుగా, తన భార్య ఆదాయం రూ.1.98 లక్షలుగా పేర్కొన్నారు. తన పేరుతో రూ.4.59 కోట్ల చరాస్తులు, రూ.5.86 కోట్ల స్థిరాస్తులు , భార్య పేరుతో రూ.1.76 కోట్ల చరాస్తులు, రూ.16.86 కోట్ల స్థిరాస్తులు, ఇతర వాటాలు ఉన్నట్లు చూపారు. ఇవి కాకుండా మరో రూ.6,781.05కోట్ల ఆస్తులను చూపించారు. ఇవి వివాదాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఏడాదికి రూ.3.27లక్షల వార్షికాదాయం ఉండే వ్యక్తి రూ.6,781 కోట్ల ఆస్తులను ఎలా సంపాదించారు? ఇది సాధ్యమేనా అని అప్పట్లోనే సర్వత్రా చర్చ నడిచింది. దీపక్‌రెడ్డి ఇంత భారీస్థాయిలో ఆస్తులు సంపాదించేందుకు కారణం భూకబ్జాలు, సెటిల్మెంట్లే అని అప్పట్లోనే అంతా భావించారు. ఆదాయ పన్ను శాఖకు దీపక్‌రెడ్డి రూ.5 లక్షలు మాత్రమే రిటర్న్స్ చూపించడంతో ఈ ఆస్తులు మొత్తం అవినీతి సంపాదనగా వచ్చి ఉండొచ్చని, ఈయన చరిత్ర కూడా నేరపూరితమేనని భావించారు. హైదరాబాద్‌లోనే రూ.15 వేల కోట్ల ఆస్తులు? దీపక్‌రెడ్డికి హైదరాబాద్‌లోనే రూ.15 వేల కోట్లకుపైగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. నకిలీ పత్రాలు సృష్టించి చాలాచోట్ల ప్రభుత్వ భూములను కాజేసినట్లు ఆరోపణలున్నాయి. శంషాబాద్ మండలం కొత్వాల్గూడెంలో ఖరీదైన మూడెకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో దీపక్‌రెడ్డి పేరుతో అత్యంత విలువైన 8,084, అతని భార్య పేరుతో 13,224 చదరపు అడుగుల స్థలాలు ఉన్నట్లు సమాచారం. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో దీపక్‌రెడ్డికి 840 గజాల స్థలం, బెంగళూరులో అతని భార్యకు అత్యంత విలువైన 2,400గజాల స్థలం ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోనూ భార్య పేరుతో రూ. 7 కోట్లకుపైగా విలువ చేసే 16వేల చదరపు అడుగుల వాణిజ్యస్థలం ఉన్నట్లు తెలుస్తోంది. పలు కేసుల నమోదు దీపక్‌రెడ్డిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ సెక్షన్ 506 కింద రెండు కేసులు, ఆక్రమణలకు పాల్పడ్డారంటూ సెక్షన్447 కింద కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కొందరిపై దాడి చేశారని సెక్షన్ 341 కింద ఓ కేసు, మారణాయుధాలు కలిగి ఉన్నాడని సెక్షన్ 148 కింద మరో కేసు నమోదైనట్లు సమాచారం. ఇవి కాకుండా భూకబ్జాలకు సంబంధించి హైదరాబాద్‌లో 6 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మంగళవారం దీపక్‌ను అరెస్టు చేశారు. గతంలోనూ మాదాపూర్ పోలీసుస్టేషన్లో బెదిరింపుల కేసు, సైఫాబాద్ పోలీసుస్టేషన్లో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌ను బెదిరించిన కేసులు నమోదయ్యాయి. జేసీ బ్రదర్స్ అండతోనే దందాలు! దీపక్‌రెడ్డి చేసిన దందాల వెనుక జేసీ బ్రదర్స్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 2004–2009 మధ్య కాలంలో జేసీ దివాకర్‌రెడ్డి మంత్రిగా ఉండటం, జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటంతో హైదరాబాద్‌లో సెటిల్మెంట్లు, కబ్జాల అంశాల్లో జేసీ బ్రదర్స్ జోక్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడేవారని తెలుస్తోంది. వీరి అండతోనే దీపక్ భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు వినికడి. హైదరాబాద్‌లోని సెటిల్మెంట్లలో జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి కూడా దీపక్‌రెడ్డికి సహకారం అందినట్లు తెలుస్తోంది. బాబు..వేటు వేస్తారా? వాకాటి నారాయణరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడంతో ఇప్పుడు టీడీపీతో పాటు విపక్షాల దృష్టి దీపక్‌రెడ్డిపై పడింది. చంద్రబాబు నిజంగా అవినీతికి తావు ఇవ్వని వ్యక్తిగా చెప్పుకునేందుకే వాకాటిపై వేటు వేసి ఉంటే, ఇప్పుడు ఏకంగా అరెస్టయిన దీపక్‌రెడ్డిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విపక్ష సభ్యులతో పాటు కొందరు స్వపక్షసభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. జేసీ బ్రదర్స్ బ్లాక్మెయిల్ రాజకీయాల వలలో చంద్రబాబు చిక్కుకుని ఉన్నారని, దీపక్‌రెడ్డిపై వేటు వేసే ధైర్యం చేయలేరని కూడా పలువురు చర్చించుకుంటున్నారు. దీపక్‌రెడ్డి గత చరిత్ర మొత్తం నేరపూరితమని తెలిసికూడా చంద్రబాబు ఆయన్ను ఎమ్మెల్సీగా ప్రకటించినప్పుడే సీఎం వైఖరి స్పష్టమైందని విపక్షాలు అంటున్నారు. ఈక్రమంలో చంద్రబాబు ఎలాంటి చర్యకు ఉపక్రమిస్తారో వేచిచూడాలి! -
జేసీ బ్రదర్స్ అండతోనే..
అనంతపురం: జేసీ బ్రదర్స్ అండతోనే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని తాడిపత్రి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. సీబీఐ దాడులు అనంతరం ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని టీడీపీ నుంచి సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారని.. దీపక్‌రెడ్డి అరెస్టైనా చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. వాకాటికో న్యాయం, దీపక్‌రెడ్డికి మరో న్యాయమా అని అడిగారు. పెద్దారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ... దీపక్‌రెడ్డిపై తెలంగాణ ప్రభుత్వం ‘సిట్’తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నడిబొడ్డుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వందల కోట్ల విలువైన స్థలాలను కబ్జా చేయడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలతో దీపక్‌రెడ్డిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. వాకాటి నారాయణరెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు జరిపిన మరుసటి రోజే ఆయనను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. దీపక్‌రెడ్డిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం చంద్రబాబు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విపక్షాలు పేర్కొంటున్నాయి. -
ఏడాదిలోనే డిగ్రీ పాస్.. భారీగా భూదందా!
హైదరాబాద్: సీసీఎస్ అధికారులు అరెస్టు చేసిన టీడీపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై గతంలో ఎన్నో భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దీపక్‌రెడ్డికి 15 వేల కోట్ల విలువైన స్థలాలు ఉన్నట్లు తెలుస్తోంది. దొంగ పత్రాలు సృష్టించి ఎన్నో ప్రభుత్వ భూములను కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకే చోట దీపక్‌రెడ్డికి 3 వేల 128 ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం. 2012 ఉప ఎన్నికలో రాయదుర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన దీపక్‌రెడ్డి...2017లో స్థానిక సంస్థల కోటాలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. అయితే 2012 ఎన్నికల్లో నామినేషన్ పత్రాల్లో 6 వేల 781 కోట్లు మాత్రమే ఆస్తులున్నట్లు అఫిడవిట్ సమర్పించాడు. దాంతోపాటు కేవలం ఏడాది కాలంలోనే డిగ్రీ పాసైనట్లు దీపక్‌రెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నాడు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆస్తులు చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. శంషాబాద్ మండలం కొత్వాల్ గూడెలో అతనికి విలువైన మూడు ఎకరాలకు పైగా భూములు వున్నాయి. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో అత్యంత ఖరీదైన 8084 చదరపు అడుగుల స్థలం, అదే రోడ్లో అతని భార్యకు 13,224 చదరపు అడుగుల స్థలం వున్నాయి. అలాగే శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో దీపక్ రెడ్డికి 840 గజాల స్థలం, బెంగళూరులో అతని భార్యకు అత్యంత విలువైన 2400 గజాల స్థలం వున్నాయి. జూబ్లీహిల్స్‌లోనూ అతని భార్య పేరుతో 7 కోట్లకు పైగా విలువచేసే 16,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం వుంది. దీపక్ రెడ్డిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, దౌర్జన్యానికి పాల్పడ్డాడంటూ IPC 506 కింద అతనిపై రెండు కేసులు, అక్రమణలకు పాల్పడ్డాడంటూ IPC 447 సెక్షన్ కింద మరొక కేసు నమోదయ్యాయి. కేసుల పరంపర అంతటితోనే ఆగలేదు. అడ్డుకోవడంతోపాటు దాడి చేశాడంటూ IPC 341 కింద కేసు, అల్లర్లకు పాల్పడ్డాడంటూ 147 సెక్షన్ కింద కేసు, మారణాయుధాలు కలిగి వున్నాడంటూ 148 సెక్షన్ కింద మరొక కేసు నమోదయ్యాయి. భోజగుట్టలో పేదల భూమిని కొల్లగొట్టేందుకే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డితో పాటు మరికొందరు ప్రయత్నించారని....విచారణలో అది నిజమని తేలడంతో అరెస్ట్ చేశామని సీసీఎస్ అడిషనల్ డీసీపీ జోగయ్య తెలిపారు. దొంగ పత్రాలు సృష్టించి భూములు కొల్లగొట్టేందుకు యత్నించారని చెప్పారు. వందల ఎకరాల కబ్జా చేసినట్టు పలు స్టేషన్ల నుంచి ఫిర్యాదులు రావడంతోనే....కేసును విచారణకు స్వీకరించి అరెస్ట్ చేశామన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్ట్‌తో ఆయన బాధితుల సంబరాలు అంబరాన్నంటాయి. బోజగుట్టలో బాధితులు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా తమను దీపక్‌రెడ్డి బెదిరిస్తూ ఎన్నో భూములను కబ్జా చేశాడని...ఎట్టకేలకు దీపక్‌రెడ్డి అరెస్ట్‌తో తమ బాధలకు విముక్తి లభించిదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రిమాండ్‌లో ఉన్నా ఫోన్ లో రాయబారాలు సాధారణంగా రిమాండ్‌లో వున్న వ్యక్తి ఫోన్ ఉపయోగించడం రూల్స్ ఒప్పుకోవు. అయితే దీపక్ రెడ్డి ముందు రూల్స్ బలాదూర్ అన్నట్లుగా వుంది. ఆయనను 15 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ దీపక్ రెడ్డి పోలీసుల రిమాండ్‌లో ఉండగానే నింపాదిగా ఫోన్లో రాయబారాలు జరపడం సాక్షి కెమెరాకు చిక్కింది. -
దెబ్బకు దెయ్యం దిగాల్సిందే
►దుమారం రేపిన ‘దెయ్యాల కొంప’ వ్యాఖ్యలు ►టీడీపీ ఎమ్మెల్సీ మూర్తిపై సర్వత్రా ఆగ్రహం ►ఏయూ మెయిన్ గేట్ వద్ద ధర్నా, దిష్టిబొమ్మ దహనం ►సొంత వర్సిటీ ‘గీతం’ను ప్రమోట్ చేసుకునేందుకే ఈ కుత్సితమని విమర్శలు ►24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ ‘చదువుల తల్లి కొలువైన దేవాలయం.. దెయ్యాల కొంపగా కనిపించిందంటే.. ఆ వ్యక్తికే దెయ్యం పట్టిందనుకోవాలి.. ఆ దెయ్యం దిగిపోవాలి.. 24 గంటల్లో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని.. బేషరతుగా క్షమాపణ చెప్పాలి’.. విశ్వవిఖ్యాత ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ను దెయ్యాల కొంపతో పోల్చిన టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తిపై ఆగ్రహంతో రగిలిపోతూ విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులు, అధ్యాపకేతరులు, చివరికి సొంత పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు.. డిమాండ్లు ఇవి.. ఎందరో మహామహులను దేశానికి అందించిన.. చివరికి డాక్టరేట్‌తో తనను కూడా గౌరవించిన విషయాన్ని విస్మరించి.. తన యాజమాన్యంలోని గీతం వర్సిటీని ప్రమోట్ చేసుకోవాలన్న స్వార్థ వ్యాపార లక్ష్యంతో దైవం లాంటి ఏయూను దెయ్యం చేసేశారని అన్ని వర్గాలు దుమ్మెత్తిపోశాయి. మూర్తి వ్యాఖ్యలపై నిరసనలతో ఏయూ భగ్గుమంది.. విద్యార్థి సంఘాలు, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు.. వారి ఆగ్రహాగ్నిలో మూర్తి దిష్టిబొమ్మ దహనమైంది. మరోవైపు ఏయూ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సంఘాలు సమావేశమై ఎమ్మెల్సీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేకపోవతే ఎమ్మెల్సీ మూర్తిని విశాఖలో తిరగనివ్వబోమని హెచ్చరించాయి. -
దీపక్‌రెడ్డి కబ్జాల్లో ఎన్నో కథలు..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి కబ్జా దందాల్లో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. కబ్జాలపై నమోదైన మొత్తం ఆరు కేసుల్ని దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు కీలక నిందితుడు ఒకర్ని అరెస్టు చేయడంతో.. న్యాయవాది శైలేష్ సక్సేనాతో కలసి దీపక్‌రెడ్డి చేసిన దందాలు బయటకు వస్తున్నాయి. ఎంజే మార్కెట్లోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వివిధ రకాల పత్రాలు విక్రయించే శివభూషణంతో శైలేష్ సక్సేనా, దీపక్‌రెడ్డి బోగస్ సంతకాలు చేయించేవారని వెల్లడైంది. దీనికి ప్రతిఫలంగా శివభూషణం కుమార్తె, కుమారుడి వివాహం జరిపిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. 2004లో భోజగుట్టలో ఉన్న రూ. 300 కోట్లకు పైగా ఖరీదైన 78 ఎకరాల స్థలానికి సంబంధించి న్యాయ వివాదాలు సృష్టించారు. ఆ స్థలం యజమాని ఇక్బాల్ ఇస్లాం ఖాన్‌లాగా న్యాయస్థానంలో శివభూషణంతో సంతకాలు చేయించారు. వాయిదాలు ఉన్నప్పుడల్లా శివభూషణాన్నే.. ఇక్బాల్ ఇస్లాం ఖాన్‌గా కోర్టుకు తీసుకెళ్లేవారు. 2006 మార్చ్‌లో మరోసారి శివభూషణాన్ని శైలేష్ సక్సేనా, దీపక్‌రెడ్డి బోగస్ సంతకాలకు వాడుకున్నారు. గుడిమల్కాపూర్‌లో ఉన్న 78 ఎకరాలు 22 గుంటలు, మాదాపూర్‌లోని ఎకరం స్థలాన్ని శివభూషణంతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు ఎన్‌హెచ్ శైలజ, బి.ప్రకాష్ చంద్ సక్సేనా, జి.దీపక్‌రెడ్డిలకు విక్రయించినట్లు బోగస్ పత్రాలు సృష్టించారు. వివిధ సందర్భాల్లో వినియోగించడానికి శివభూషణానికి రాధాకృషన్ ఠాకూర్ పేరుతో బోగస్ ఓటర్ ఐడీ సృష్టించారు. ఆ బోగస్ ఓటర్ ఐడీని బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.12లో ఉన్న రూ.100 కోట్ల విలువైన స్థలం ‘క్రయ విక్రయాల్లో’ వాడారు. ఇదే తరహాలో జరిగిన మరిన్ని దందాలు సీసీఎస్ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసులో ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి పొందిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. దీపక్‌రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి అల్లుడనే విషయం తెలిసిందే. -
టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలు
-
వాకాటి నారాయణరెడ్డి వాకింట్లో సీబీఐ దాడులు
-
టీడీపీ ఎమ్మెల్సీ ఇంటిపై సీబీఐ దాడులు
శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి 9 గంటలదాకా కొనసాగిన సోదాలు.. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నివాసంపై సీబీఐ అధికారుల బృందం దాడులు జరిపింది. శుక్రవారం తెల్లవారు జామున నెల్లూరు వేదాయపాలెంలోని వాకాటి ఇంటికి చేరుకున్న ఈ బృందం అప్పటినుంచి రాత్రి 9 గంటల వరకు సోదాలు నిర్వహించింది. బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబం ధించి సీబీఐ ఈ దాడులు జరిపింది. ఈ సందర్భంగా పలు పత్రాలను స్వాధీనం చేసు కుంది. 99 అగ్రిమెంట్ దస్తావేజులు ఇందులో ఉన్నట్టు సమాచారం. సోదాల నేపథ్యంలో సీబీఐ అధికారుల బృందం వాకాటిని ప్రశ్నిం చింది.మరోవైపు వాకాటికి చెందిన హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ ఇన్ఫ్రా కార్యాలయంలోనూ సీబీఐ అధికారుల బృందం సోదాలు జరిపింది. నెల్లూరులోని వాకాటి నివాసంలో రాత్రి 9 గంటలకు సోదాలు ముగిశాయి. ఈ దాడులపై వివరణ కోరేందుకు మీడియా ప్రయత్నించగా.. వివరాలు చెప్పేందుకు సీబీఐ అధికారులు నిరాకరించారు. వ్యాపారాల్లో సహజమే..:వాకాటి సీబీఐ దాడుల అనంతరం వాకాటి విలేకరుల తో మాట్లాడుతూ.. వ్యాపార లావాదేవీలు, బ్యాంకు అగ్రిమెంట్లకు సంబంధించిన విచార ణ నిమిత్తం సీబీఐ అధికారులు వచ్చారని తెలిపారు. అనేక అంశాలపై తన నుంచి వివరణ తీసుకున్నారని చెప్పారు. వ్యాపారాల్లో ఇదంతా సహజమేనని, దానిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన ముక్తాయించారు. పూర్వాపరాలివీ..: వీఎన్ఆర్ ఇన్ఫ్రా, పవర్‌టెక్ లాజిస్టిక్స్ సంస్థల పేరుతో నారా యణరెడ్డి నిర్మాణ రంగం, ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. 2014లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీ న్ బ్యాంకుల నుంచి ఆయన రూ.443.27 కోట్ల మేర రుణాలు తీసుకు న్నారు. బకాయి పడిన మొత్తం వడ్డీతో సహా చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని ఇటీవల బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి.దీంతో వాకాటిపైన చీటింగ్‌తో పాటు పలు కేసులు నమోదయ్యా యి. మరో వైపు నకిలీ డాక్యుమెంట్లతో వాకాటి తమ నుంచి రూ.190 కోట్ల రుణం తీసుకు న్నారని ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. -
టీడీపీ ఎమ్మెల్సీ ఇళ్లలో సీబీఐ సోదాలు
-
టీడీపీ ఎమ్మెల్సీ ఇళ్లలో సీబీఐ సోదాలు
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరులలో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. ఇటీవలే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గత ఏడాది వాకాటి నారాయణరెడ్డిపై చీటింగ్ కేసు సహా మరికొన్ని కేసులు నమోదయ్యాయి. వీఎన్ఆర్ ఇన్ఫ్రా తదితర కంపెనీల పేరుతో ఆయన సుమారు రూ. 450 కోట్ల వరకు రుణాలు తీసుకుని, డీఫాల్టర్‌గా మారడంతో బ్యాంకులు నోటీసులు పంపాయి. అవి తిరిగి రావడంతో మారిన చిరునామాకు కూడా నోటీసులు పంపాయి. ఆస్తులు వేలం వేయనున్నట్లు పత్రికల్లో భారీగా ప్రకటనలు ఇచ్చాయి. తాజాగా బ్యాంకులు ఫిర్యాదు చేయడంతోనే సీబీఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఆదాయపన్ను శాఖ అధికారులు మే 3వ తేదీన వాకాటి ఇళ్లపై దాడులు చేసి, ఆయన విల్‌ఫుల్ డీఫాల్టర్‌గా ఉన్నారా లేక మరేమైనా ఉందా అనే విషయాన్ని దర్యాప్తు చేశారు. అప్పట్లో నెల్లూరు, తడ, సూళ్లూరుపేటలలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజామునే నెల్లూరు చేరుకుని వేదాయపాళెంలో ఉన్న ఇంట్లో సోదాలు చేసి, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి నెల్లూరులో ఉన్నది కేవలం అతిథిగృహం మాత్రమే. అందులో పది బెడ్రూంలు ఉన్నాయి. సీబీఐ అధికారులు అన్ని గదుల్లోకీ వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే అక్కడ ఏం గమనించామన్న విషయాన్ని మాత్రం వాళ్లు వెల్లడించడం లేదు. వాకాటి స్వగ్రామానికి కూడా సీబీఐ మరో బృందం చేరుకున్నట్లు తెలిసింది. స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐఓబీ తదితర బ్యాంకులకు వాకాటి భారీగా బకాయిలు ఉన్నట్లు సమాచారం. -
'అందుకే లోకేశ్‌ను పప్పు అంటున్నారేమో'
-
'అందుకే లోకేశ్‌ను పప్పు అంటున్నారేమో'
విజయవాడ: మంత్రి నారా లోకేశ్ మంచివాడని, అందుకే ఆయనను పప్పు అంటున్నారేమోనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. పప్పు అనేది బూతు కాదని ఆయన అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందని, ఖజానా నిండగానే నిరుద్యోగభృతి చెల్లిస్తామని చెప్పారు. కృష్ణా నది కబ్జా విషయాన్ని టీవీలో చూశానని.. కబ్జాకు పాల్పడిన వారిలో తమ పార్టీ నేతలు ఎవరున్నా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. నిరుగుద్యోగులకు వెంటనే భృతి చెల్లించాలని సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ శనివారం బహిరంగ లేఖ రాశారు. ఇంటికో ఉద్యోగమిస్తామని, నెలనెలా రూ. 2వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నేటికీ వాటిని నెరవేర్చలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత లేఖతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. త్వరలో యూత్ పాలసీని ప్రకటిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎంప్లాయిమెంట్ బోర్డు ద్వారా నిరుద్యోగుల జాబితా ప్రకటిస్తామన్నారు. నిరుద్యోగ భృతికి రూ. 500 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. -
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి ముందస్తు బెయిల్
ఫోర్జరీ కేసులో కొన్నాళ్లుగా తప్పించుకుతిరుగుతున్న దీపక్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ పత్రాలతో భూకబ్జాకు యత్నించిన కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత, ఏపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాలని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన దీపక్‌రెడ్డి.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాక ర్‌రెడ్డికి అల్లుడు. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని రోడ్ నం.2లో ఉన్న సర్వే నం.129/71లోని 3.37 ఎకరాల స్థలంపై దీపక్‌రెడ్డితో పాటు పలువురి కన్నుపడింది. ఈ స్థలాన్ని కొన్ని దశాబ్దాల క్రితం నగరంలో నివాసమున్న శరణార్థి అయూబ్ కమల్‌కు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. దీన్ని ఆయన నుంచి 1960లో ఎంవీఎస్ చౌదరితో పాటు ఆయన సోదరులు ఉమ్మడిగా ఖరీదు చేశారు. అయితే అయూబ్ కమల్ ఈ స్థలాన్ని అన్సారీ బ్రదర్స్‌కు విక్రయించినట్లు, వారి నుంచి దీన్ని తాము ఖరీదు చేసి నట్లు జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థకు చెందిన బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాశ్‌చంద్ర సక్సేనాలతో పాటు జి.దీపక్‌రెడ్డి బోగస్ డాక్యుమెంట్లు రూపొందించి కబ్జాకు యత్నించారు. దీంతో వారిపై ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు దీపక్‌రెడ్డికి నోటీసులు జారీ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో దీపక్‌రెడ్డి తాజాగా నాంపల్లి న్యాయ స్థానం ద్వారా ముందస్తు బెయిల్ పొందారు. మరోవైపు పరారీలో ఉన్న ఇతర నిందితులు బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాశ్ చంద్ర సక్సేనాల కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. -
ఫోర్జరీ కేసులో టీడీపీ ఎమ్మెల్సీకి ముందస్తు బెయిల్
► దీపక్‌రెడ్డికి మంజూరు చేసిన నాంపల్లి న్యాయస్థానం ►రద్దు కోరుతూ హైకోర్టును ఆశ్రయించనున్న సీసీఎస్ సాక్షి, అనంతపురం: ఫోర్జరీ పత్రాలతో భూకబ్జాకు యత్నించిన కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈయనతో పాటు మరికొందరిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు ఫోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం విదితమే. ఈ బెయిల్ రద్దు చేయాల్సిందిగా కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలని సీసీఎస్ పోలీసుల నిర్ణయించారు. రాయదుర్గంకు చెందిన దీపక్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయాన అల్లుడు. ఫోర్జరీ కేసులో సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేయడానికి ప్రయత్నించినా దొరక్కుండా దీపక్‌రెడ్డి తప్పించుకు తిరిగారు. అనారోగ్య కారణాల నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా... పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం మంజూరు చేసింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.2లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న సర్వే నెం.129/71లోని 3.37 ఎకరాల స్థలంపై దీపక్‌రెడ్డి సహా ఇతర నిందితులు కన్నేశారు. ఈ స్థలాన్ని కొన్ని దశాబ్దాల క్రితం నగరంలో నివాసం ఉన్న శరణార్థి అయూబ్ కమల్‌కు ప్రభుత్వం కేటాయించింది. దీన్ని ఆయన నుంచి 1960లో ఎంవీఎస్ చౌదరితో పాటు ఆయన సోదరులు ఉమ్మడిగా ఖరీదు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి ఆధీనంలోనే ఉంది. అయితే అయూబ్ కమల్ ఈ స్థలాన్ని అన్సారీ బ్రదర్స్‌కు విక్రయించినట్లు, వారి నుంచి దీన్ని తాము ఖరీదు చేసినట్లు జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థకు చెందిన బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాష్ చంద్ర సక్సేనాలతో పాటు జి.దీపక్‌రెడ్డి బోగస్ డాక్యుమెంట్లు రూపొందించారు. వీటి ఆధారంగా సివిల్ సూట్ దాఖలు చేయడం ద్వారా తదుపరి చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఎంవీఎస్ చౌదరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన షేక్‌పేట్ మండల రెవెన్యూ అధికారులు ఆ ఖరీదైన స్థలానికి ఎంవీఎస్ యజమానిగా తేల్చారు. దీంతో చౌదరి తరఫున ఆయన ప్రతినిధి మాదాపూర్‌కు చెందిన ఎం.రాధాకృష్ణ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వివరణ కోరుతూ దీపక్‌రెడ్డికి నోటీసులు జారీ చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఆయనకు హైదరాబాద్‌లో ఉన్న రెండు ఇళ్లల్లో వాకబు చేయగా..ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడిలో అనంతపురంలో ఉన్నట్లు అక్కడి వారు చెప్పారు. దీంతో ఓ ప్రత్యేక బృందం అనంతపురం వెళ్లి ప్రయత్నించినా దీపక్‌రెడ్డి ఆచూకీ లభించలేదు. దీంతో ఏపీ రాజధాని అమరావతిలోనూ కొన్ని రోజులు దీపక్‌రెడ్డి కోసం అధికారులు ప్రయత్నించారు. అక్కడ కూడా నోటీసులు తీసుకోవడానికి పోలీసులకు అందుబాటులోకి రాని దీపక్‌రెడ్డి న్యాయస్థానం ద్వారా ముందస్తు బెయిల్ పొందారు. దీన్ని రద్దు చేయించడానికి హైకోర్టును ఆశ్రయించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మిగిలిన నిందితులు బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాష్ చంద్ర సక్సేనాల కోసం కూడా సీసీఎస్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
సర్పంచ్‌గా పనిచేయాలన్నా చేస్తా: లోకేష్
-
రెబల్స్‌కి తలొగ్గిన బాబు
అమరావతి: స్థానిక సంస్థల కోటా, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాల భర్తీలో టీడీపీ రెబల్స్‌కే సీట్లు కేటాయించారు సీఎం చంద్రబాబు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో, రెబల్స్‌కే అధిక ఎమ్మెల్సీలు ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి శత్రుచర్ల, కర్నూలు నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, ప్రకాశం నుంచి కరుణం బలరాం, పోతుల సునీత మాకు టికెట్లు ఇవ్వకపోతే రెబల్స్‌గా నామినేషన్ వేస్తామన్నారు. చిత్తూరులో దొరబాబు, అనంతలో దీపక్‌రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గిన బాబు వారికి ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించారని గుసగుసలు వినిపిస్తున్నారు. -
డిక్లరేషన్ అందుకున్న దీపక్
అనంతపురం అర్బన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుణపాటి దీపక్‌రెడ్డి శనివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం నుంచి డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ యామినీబాల, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, గోనుగుంట్ల సూర్యనారాయణ, ఎమ్మెల్సీ కేశవ్ తదితరులు ఉన్నారు. -
ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై భూకబ్జా కేసు
-
జీ హుజూర్
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వత్తాసు – ఎన్జీవోలంతా టీడీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవాలని ప్రకటన – సెక్షన్ 129 ప్రకారం అశోక్‌బాబు మాటలు కోడ్ ఉల్లంఘన అంటున్న విశ్లేషకులు – అశోక్ తీరును తప్పుబడుతున్న కొందరు ఎన్జీవోలు – అధికార పార్టీ మినహా తక్కిన ఫ్లెక్సీలు తొలగించి వివక్ష చూపుతున్న అధికారులు – ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం... మూడోరోజు నాలుగు నామినేషన్ల దాఖలు (సాక్షిప్రతినిధి, అనంతపురం) ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డికి ఏపీ ఎన్జీవోల సంఘం మద్దతు ఇస్తోంది. ‘అనంత’లోని ఏపీ ఎన్జీవోలు కూడా ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి.’– ఇవీ ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు బుధవారం ‘అనంత’లో చేసిన వ్యాఖ్యలు. ఆయన మాటలు చూస్తే టీడీపీకి పూర్తిగా వత్తాసు పలుకుతున్నారని స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకీ ప్రచారం చేయకూడదు. ఎన్నికల, పోలింగ్ ఏజెంట్‌గా ఉండకూడదు. ఓటేయండని బహిరంగంగా ప్రకటనలు చేయరాదు. ఇలా చేస్తే సెక్షన్ 129 ఆర్పీ యాక్టు ప్రకారం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. అయినప్పటికీ అశోక్‌బాబు బుధవారం అనంతపురంలోని ఎన్జీవో సంఘం కార్యాలయంలో ఏకంగా విలేకరుల సమావేశం నిర్వహించి, కేజేరెడ్డిని సభాపూర్వకంగా అందరికీ పరిచయం చేశారు. ఆయనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అశోక్‌బాబు పూర్తిగా అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న క్రమంలో ఈ ఘటన అందుకు బలం చేకూర్చుతోంది. గతంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులుగా పనిచేసిన వారిలో ఎవరూ ఎన్నికల్లో పలానా వ్యక్తికి ఓటేసి గెలిపించండంటూ బహిరంగ ప్రకటనలు చేయలేదు. వ్యక్తిగత ప్రాధాన్యతలుంటే అంతర్గతంగా మద్దతు ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. కానీ తొలిసారిగా అశోక్‌బాబు బాహిరంగంగా టీడీపీ అభ్యర్థికి ఓటేయండని చెప్పడాన్ని చాలామంది ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాధారణంగా ఉపాధ్యాయ సంఘాలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉంటాయి. కానీ ఎన్జీవోల సంఘం రాజకీయ పార్టీలకు అతీతమైంది. ఉద్యోగులంతా యూనియన్లలో ఉన్నప్పటికీ రాజకీయంగా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ పలానా వ్యక్తికి ఓటేయండని చెప్పడాన్ని కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. విలేకరుల సమావేశానికి కంటే ముందు కొందరు ఉద్యోగులతో అశోక్‌బాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేజేరెడ్డి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఉద్యోగి మాట్లాడుతూ బాహాటంగా మద్దతు ఇవ్వడం సరికాదేమో అని అశోక్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘ప్రభుత్వం మనకు జీతాలు ఇస్తోంది. కాబట్టి ప్రభుత్వం ప్రకటించిన అభ్యర్థికి మనం ఓటేయాలి’ అని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో పలువురు ఎన్జీవోలు అశోక్‌బాబు మాటలపై బుధవారం తీవ్ర చర్చ సాగించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు .. అశోక్‌బాబుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఫ్లెక్సీల తొలగింపులో అధికారుల వివక్ష ఎన్నికలకోడ్ అమలులోకి వచ్చిన తర్వాత జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులకు సంబంధించిన ఫ్లెక్సీలను కార్పొరేషన్, మునిసిపాలిటీలతో పాటు పంచాయతీల్లో అధికారులు తొలగించారు. టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను మాత్రం ముట్టుకోలేదు. అనంతపురంలోని టవర్‌క్లాక్, ఫ్లైఓవర్, పాతూరుతో పాటు ధర్మవరం, గుంతకల్లు, హిందూపురం, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో ఆయన ఫ్లెక్సీలు ఉన్నాయి. ఈ విషయంలో అధికారుల తీరుపై తక్కిన అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. ఊపందుకున్న ఎన్నికల ప్రచారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఉపందుకుంది. ప్రచారపర్వానికి 18రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు శక్తియుక్తులు ఒడ్డుతున్నారు. పట్టభద్రుల కోటా నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూసగోపాల్‌రెడ్డి, మహాజన రాజ్యం పార్టీ అభ్యర్థి అవ్వారు మల్లికార్జున, మరో అభ్యర్థి శేషుయాదవ్ బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థి కేవీసుబ్బారెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మి నామినేషన్లు వేశారు. గురువారం కూడా పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బరిలోని అభ్యర్థులు రాజకీయపార్టీల నేతలను వ్యక్తిగతంగా కలిసి మద్దతివ్వాలని అభ్యర్థిస్తున్నారు. గోపాల్‌రెడ్డి గెలుపు కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కేజేరెడ్డి అధికార పార్టీ తరఫున బరిలో ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలు పూర్తిస్థాయిలో అండగా నిలవలేకపోతున్నారు. ఆయన వచ్చినప్పుడు చేద్దామని చెప్పి పార్టీ నిర్ణయంతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అనువుగా వెళుతున్నారు. దీన్ని గ్రహించిన కేజేరెడ్డి ఖర్చులో కూడా ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారపార్టీ నేతలు పూర్తిస్థాయిలో సహకరించడం లేదని, వీరిని నమ్ముకుని బరిలోకి దిగి పొరపాటు చేశామని తన సన్నిహితులతో వాపోయినట్లు తెలుస్తోంది. అలాగే సీపీఎం మద్దతుతో బరిలో నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ గేయానంద్ వామపక్షాలపై భారం వేసి ముందడుగు వేస్తున్నారు. అయితే.. వామపక్ష పార్టీల బలం, అనంత, కడప, కర్నూలులోని తాజా రాజకీయపరిస్థితులు ఆయనకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థులంతా ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. ప్రత్యేకహోదా, నిరుద్యోగ సమస్య, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతిపై ప్రభుత్వం మాట తప్పడం, దీర్ఘకాలికంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలు ఎన్నికల్లో గెలుపోటములను నిర్దేశించనున్నాయి. -
ఇది దుర్యోధన.. దుశ్శాసన రాజ్యం
ప్రశ్నిస్తే చితకబాదుడే.. తాలిబన్ల పాలనను మరిపిస్తున్న బాబు సర్కారు కూడేరు (ఉరవకొండ)/ సాక్షి, అమరావతి : అసలే కంటి చూపు సరిగా లేని మహిళ.. పుట్టెడు కష్టాలతో ఒంటరిగా జీవిస్తోంది.. తన ఇంటి ఎదురుగా నీటి తొట్టె నిర్మాణం వద్దని చెప్పడమే పాపమైపోయింది.. ఆ మాత్రం దానికే ఊగిపోతూ.. కింద పడేసి, చెప్పు కాళ్లతో ఎగిరి తంతుంటే విడిపించడానికి ఎవరూ సాహసించలేదు. జుట్టు పట్టి ఈడుస్తుంటే సినిమా చూస్తున్నట్టు చూశారే తప్పించి వారి గూండాగిరీని ఎవరూ ఎదిరించలేక పోయారు. ‘కాపాడండయ్యా.. నేనేం తప్పు చేశాను.. ఏమిటీ అన్యాయం’ అని ఆ మహిళ నిస్సహాయంగా విలపించడం అరణ్య రోదనే అయ్యింది. ‘మరో 50 ఏళ్లు ఈ రాష్ట్రంలో మనమే అధికారంలో ఉండాలి.. ఎప్పుడూ మనమే అధికారంలో ఉంటేనే బావుంటుంది.. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు.. ఈ దిశగా ప్రతి టీడీపీ నేత, కార్యకర్త కృషి చేయాలి.. అధికారులు కూడా మన మాటే వింటారు.. అలా ఎవరైనా వినకపోతే నే చూసుకుంటా’ అని సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొద్ది రోజుల క్రితం పదే పదే నొక్కి చెప్పడంతో రాష్ట్రం రావణకాష్టంగా మారుతోంది. ప్రశ్నించిన వారి నోరు నొక్కేస్తూ.. కాదు కూడదన్న వారిపై బహిరంగ దాడులకు తెగిస్తూ తాలిబన్ల పాలనను తలపిస్తున్నారు. ఇసుక మొదలు భూముల వరకు వారి కన్ను పడిందంటే చాలు వశమయ్యేందుకు ఎంతకైనా బరితెగిస్తున్నారు. మొన్న అధికారిణి వనజాక్షిపై దాడి.. నిన్న జీతం పెంచండన్న అంగన్వాడీలపై జులుం.. నేడు ఉరవకొండ నియోజకవర్గంలో అరాచకం.. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజక వర్గం కూడేరు మండలంలో టీడీపీ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ వర్గీయులు ఓ మహిళపై దాడి చేసిన తీరు కలకలం రేపింది. ఒంటరి మహిళను నడిరోడ్డుపై చెప్పుకాళ్లతో ఎగిరెగిరి తంతుంటే నిస్సహాయతతో విలవిల్లాడిపోయింది. జాతీయ రహదారి పక్కన, మిట్ట మధ్యాహ్నం.. అందరూ చూస్తుండగానే ‘మేం చెప్పినా వినవా.. లం.. ముం...’ అంటూ పత్రికల్లో రాయలేని పదజాలంతో దూషిస్తూ దాడి చేసిన దృశ్యాలు బుధవారం టీవీ చానళ్లలో వీక్షించిన వారు ‘అయ్యో.. ఏమిటీ దారుణం.. ఎంత అధికారంలో ఉంటే మాత్రం మరీ ఇంత బరి తెగింపా.. అడ్డుకునే వారే కరువయ్యారే.. ఈ అరాచకానికి అడ్డుపడేదెప్పుడు’ అంటూ తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఇంత జరిగితే.. ‘అయ్యా.. న్యాయం చేయండ’ని బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే నిందితులను పిలిపించి బెయిల్ ఇచ్చి పంపించే శారు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. కూడేరు మండలం జల్లిపల్లికి చెందిన సుధమ్మకు కంటి చూపు సరిగా లేదు. నాలుగేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. సంతానం లేదు. తల్లి ద్రాక్షాయణమ్మ నాలుగు నెలల క్రితం మృతి చెందింది. సోదరుడు రాంభూపాల్రెడ్డికి మానసిక స్థితి సరిగా లేదు. తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆదివారం అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన పంచాయతీ తరఫున పశువులకు తాగునీటి తొట్టె నిర్మించేందుకు తెలుగుదేశం పార్టీ నేత, సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర సిద్ధమయ్యారు. తన ఇంటి ముందు కాకుండా కొంచెం పక్కన తొట్టె నిర్మించుకోవాలని సుధమ్మ కోరింది. అంతే.. మాకే అడ్డు చెబుతావా.. అంటూ ఆగ్రహించిన వారిద్దరూ ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా అందరి ముందు దుర్భాషలాడారు. తలోచేయి పట్టుకుని కింద పడేశారు. అంతటితో ఆగకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. సర్పంచ్ నాగరాజు చెప్పుకాళ్లతో ఎగిరి తన్నగా.. చంద్ర చేతితో కొట్టాడు. అధికారానికి ‘ఖాకీ’ దాసోహం ఓ మహిళపై ఇంతగా దౌర్జన్యం చేసి దాడికి పాల్పడితే బాధితుల పక్షాన ఉండాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలికారు. దాడి జరిగిన రోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేందుకు భయపడిన సుధమ్మ.. ఆ మరుసటి రోజు కూడేరు పోలీసులను ఆశ్రయించింది. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసింది. నిందితులపై సెక్షన్ 323, 354, 355 కింద నామమాత్రంగా కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన కాసేపటికే పోలీస్‌స్టేషన్ నుంచి గ్రామానికి చేరుకుని వారు మీసం మెలేశారు. కనీసం గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేయలేదు. కౌన్సెలింగ్ నిర్వహించిన దాఖలాలూ లేవు. ‘ఏ నిమిషంలో ఏం జరుగుతుందో భయంగా ఉంది. వారిద్దరి నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఉన్నతాధికారులు నాకు రక్షణ కల్పించాలి. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేద’ని బాధితురాలు సుధమ్మ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వాట్సప్‌లో దాడి దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై జల్లిపల్లికి చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం అండతో జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర ఆగడాలకు అడ్డే లేకుండా పోతోందని, ప్రతి చిన్న విషయానికి గొడవలకు దిగుతుంటాడని తెలిపారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై దాడి జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు చేశామని ఆత్మకూరు సీఐ శివనారాయణస్వామి చెప్పారు. నిందితులపై చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం చూసీ చూడనట్టు వ్యవహరించబట్టే.. ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసినప్పుడు సీఎం చంద్రబాబే ఆయన్ను కాపాడారు. దీంతో గ్రామ స్థాయిలోనూ అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు ఎక్కువ య్యాయి. సీఎంకు చిత్తశుద్ది ఉంటే జల్లిపల్లిలో మహిళపై దాడి చేసిన సర్పంచ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మానవ హక్కుల సంఘం, జిల్లా జడ్జీలు సుమోటోగా కేసు నమోదు చేయాలి. – బీశెట్టి బాబ్జీ, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు దౌర్జన్యాలు మితిమీరాయి తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. మహిళను నడిరోడ్డుపైనే కొట్టారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాధితురాలికి రక్షణ కల్పించాలి. నిందితులను కఠినంగా శిక్షించకపోతే ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తాం. – సుశీలమ్మ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, అనంతపురం బెయిలబుల్ కేసు ఎలా పెడతారు? అధికార పార్టీ దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. జల్లిపల్లిలో మహిళపై దాడి ఘటనలో నిందితులపై బెయిలబుల్ కేసులు ఎలా పెడతారు? నిందితులకు అంత తొందరగా స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అధికార పార్టీ నాయకులకు పోలీసులే భయపడుతున్నారు.పోలీసులపై తిరగబడాల్సిన రోజు రాకుండా చూసుకోవాలి. – హరినాథరెడ్డి, న్యాయవాది, ఏపీసీఎల్సీ జిల్లా అధ్యక్షుడు, అనంతపురం -
'అనంత'లో టీడీపీ నేతల దాష్టీకం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నిత్యం ఏదో ఓ ప్రాంతంలో సామాన్య ప్రజలను, తమకు ఎదురొస్తే పార్టీలోని చిన్న నేతలపై, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులపై సైతం దాడులకు వెనుకాడటం లేదు. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులు వీరంగం సృష్టించారు. సమస్యలపై ప్రశ్నించినందుకు సుధ అనే మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కూడేరు మండలం జల్లిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర మహిళపై దాడిచేస్తూ కాళ్లతో తన్ని హింసించారు. వీరంతా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అనుచరులని సమాచారం. సమస్యపై ప్రశ్నించినందుకే సుధ అనే మహిళను అందరూ చూస్తుండగానే దాడి చేసిన వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదు. దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపివేశారు. దీంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. -
'అనంత'లో టీడీపీ నేతల దాష్టీకం
-
బీచ్‌లో నిర్మాత బర్త్‌డే, టీడీపీ ఎమ్మెల్సీ వీరంగం
-
బీచ్‌లో టీడీపీ ఎమ్మెల్సీ సతీశ్ వీరంగం
-
బీచ్‌లో టీడీపీ ఎమ్మెల్సీ సతీశ్ వీరంగం
గుంటూరు : అధికారంలో ఉన్నామనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. మొన్న కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు రివాల్వర్‌లో కాల్పులు జరిపి హల్చల్ చేయగా, తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ బాపట్ల బీచ్‌లో వీరంగం సృష్టించారు. బాపట్ల సూర్యలంక బీచ్‌లో హరిత రిసార్ట్స్ డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస్‌పై దాడి చేశారు. గదిలోకి లాక్కెళ్లి మరీ అతడిని చితకాబాదారు. శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురు సిబ్బందిపైనా ఎమ్మెల్సీ దాడి చేశారు. వివరాల్లోకి వెళితే... హరిత రిసార్ట్స్‌లో నిర్మాత కొరటాల సందీప్ పుట్టినరోజు వేడుకకు వచ్చిన అతిథులకు సరైన ఏర్పాటు చేయలేదని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు. బీచ్‌లో క్యాంప్ ఫైర్ వేసి స్నేహితులతో కలిసి ఎమ్మెల్సీ సతీశ్ చిందులు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు బాగోలేదంటూ ఎమ్మెల్సీ అక్కడి సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. అయితే దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన హరిత రిసార్ట్స్ ఉద్యోగులకు చుక్కెదురు అయింది. తెల్లవారేవరకూ పీఎస్‌లోనే ఉంచిన పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. కాగా ఈ వార్త రాస్తే మీ సంగతి చూస్తానంటూ విలేకర్లపై ఎమ్మెల్సీ సతీశ్ బెదిరింపులకు దిగారు. కాగా ఎమ్మెల్సీ గతంలో కూడా విలేకర్లతో దురుసుగా ప్రవర్తించారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసి, వేషాలు వేస్తే తాటతీస్తానంటూ బెదిరించారు కూడా. ఇక నిర్మాత కొరటాల సందీప్ గతంలో బాపట్లలోని ఓ లాడ్జిలో పేకాడుతూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. -
'బాబు ఛరిష్మాను దెబ్బ తీస్తున్న బీజేపీ'
విజయవాడ : భారతదేశంలో ఏ నాయకుడికీ లేని ఛరిష్మా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఆదివారం విజయవాడలో బుద్ధా వెంకన్న విలేకర్లతో మాట్లాడుతూ... అలాంటి నేత ఛరిష్మాకు దెబ్బతగిలేలా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి లాంటి అవినీతిపరులను బీజేపీ చేర్చుకుందని విమర్శించారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవాలని బుద్ధా వెంకన్న ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
'పొమ్మనకుండా పొగ పెడుతున్నారు'
తిరుపతి : కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడుపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు నిప్పులు చెరిగారు. శనివారం తిరుపతిలో గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ.. పొమ్మనకుండా పొగ పెడుతున్నారంటూ బీజేపీ నేతలపై గాలి మండిపడ్డారు. ఎన్డీయే నుంచి వెళ్లిపొమ్మంటే పోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక నిధులు ఏమీ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం మాత్రం రూ. 350 కోట్లు ఇచ్చారన్నారు. ఇలా అయితే రాజధాని నిర్మాణం ఎన్నో సంవత్సరాలు పడుతోందని గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కొట్టుకున్నారు... తిట్టుకున్నారు
పుత్తూరు టీడీపీలో వర్గపోరు బహిర్గతం ఇద్దరూ ముద్దుకృష్ణమ అనుచరులే పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ పుత్తూరు : పుత్తూరు మండల టీడీపీలో కొంతకాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న వర్గ పోరు బహిర్గతమైంది. ఆ పార్టీ మండల బాధ్యుడు, మం డల పరిషత్ కో-ఆప్షన్ సభ్యురాలి భర్త బాహాబాహీకి దిగారు. ఈ సంఘటనకు తహశీల్దార్ కార్యాలయ ఆవరణ వేదికైంది. స్ధానికుల కథనం మేరకు సోమవారం సాయంత్రం వర్షం కురుస్తున్నప్పుడు ఆ ఇద్దరూ కలబడి కిందపడి కొట్టుకున్నారు. బూతు లు మాట్లాకున్నారు. ఒకరి గురించి ఒకరు లోపాల ను ఎత్తి చూపారు. బహిరంగంగానే బిగ్గరగా కేక లు వేసుకుంటూ అంతు చూస్తామంటూ సవాళ్లు విసిరారు. స్థానికులు కలుగుజేసుకుని వారికి సర్దిచెప్పా రు. ఈ ఇద్దరూ ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు అనుచరులే. వారిలో ఒకరు ఎంపీపీ వర్గం, మరొకరు మండల ఉపాధ్యక్షుని వర్గానికి చెందినవారు. పార్టీ మండల బాధ్యుడు తహశీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ విభాగంలోకి రాత్రి సమయాల్లో వెళ్లి ఆపరేటర్ ద్వారా వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలు సేకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యురాలి భర్త సోమవారం సాయంత్రం తహశీల్దార్‌ను సంప్రదిం చి ప్రశ్నించారు. ఆ సమాచారం తెలుసుకున్న పార్టీ మండల బాధ్యుడు ఆగ్రహంతో తహశీల్దార్ కార్యాలయ ఆవరణానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న అతనిపై తీవ్ర పదజాలంతో దాడికి దిగారు. పరస్పరం కొట్టుకున్నారు. దీనిపై మంగళవారం పోలీస్ష్టేషన్లో పంచాయితీ పెట్టారు. అందరూ చూస్తుండగానే బాహాబాహీకి తలపడిన వారిపై కేసులు నమోదు కాలేదు. పై పెచ్చు విచారణ పేరు తో పంచాయితీ నిర్వహించిన అంశం చర్చనీయాం శంగా మారింది. ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.. టీడీపీ నేతలిద్దరూ కొట్టుకున్నారనే విషయంపై తమకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదులు అందలేదని ఎస్ఐ హనుమంతప్ప తెలిపారు. పంచాయితీ చేస్తున్నారనే విషయంపై అడిగితే అలాంటిదేమీ లేదని ఆయన తెలిపారు. -
ఇక్కడా... కండకావరమే
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజకీయాలు ఎన్నికల వరకే ... అధికారం చేపట్టాక అభివృద్ధి మంత్రం వైపు అడుగులేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పలికిన ప్రవచనాలు అటకెక్కుతున్నాయి. రాజకీయ ఉగ్రవాదం పై నుంచి కిందిస్థారుు వరకు అహంకారం తలకెక్కి తెగ రెచ్చిపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడి అండతో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు గూండాల మాదిరిగా ఆదివారం వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ శాంతకుమారిపై దాడి చేసినట్టుగా తూర్పు గోదావరి జిల్లాలో కూడా పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. సర్పంచి, ఎంపీటీసీల స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరి హక్కులనైనా తెలుగు తమ్ముళ్లు కాలరాచేస్తున్నారు. అధికారులు కూడా అధికార పార్టీ వందిమాగదులకు భయపడి తలాడించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. రంపచోడవరం నుంచి తొలిసారి ఎమ్మెల్యే గా ఎంపికైన వంతల రాజేశ్వరిని టీడీపీ నేతలు అడుగడుగునా అవమానిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేకు ఉన్న అధికారాలను, హక్కులను సైతం అడ్డగోలుగా అడ్డుకుంటున్నారు. అధికారదర్పంతో తెలుగు తమ్ముళ్లు నియోజకవర్గఅభివృద్ధి కార్యక్రమాల్లో సైతం ఎమ్మెల్యే విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. గడచిన రెండున్నరేళ్లుగా ఇదే తీరుతో ఎమ్మెల్యే విధులకు అడ్డుతగులుతున్నారు.కంటతడపెట్టి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. గతేడాది జనవరి 14న బోగీ పండుగ రోజున అడ్డతీగల మండలం పాపంపేట చౌకధరల దుకాణం వద్ద ఎమ్మెల్యేను అవమానించారు. చౌకధరల దుకాణం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే కళ్లెదుటే టీడీపీ జెడ్పీటీసీ అడారి కృష్ణవేణి, కుమారుడు, మండల టీడీపీ అధ్యక్షుడు అడారి నాగబాబు సంక్రాంతి కానుకులను పంపిణీ చేసేశారు. తనను పిలిచి పంపిణీ చేయడమేమిటని ప్రశ్నించినందుకు పరుష పదజాలంతో దూషించి దౌర్జన్యానికి దిగారు. కంటతడిపెట్టిన ఎమ్మెల్యే అడ్డతీగల పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. తనకు జరిగిన అవమానానికి చేసిన ఫిర్యాదు మాటేమోకాని తిరిగి ఆమెపై అధికారమదంతో తిరిగి తప్పుడు ఫిర్యాదుతో ఎమ్మెల్యే కేసును నీరుగార్చేశారు. రంపచోడవరంలో ఇటీవల యూత్ ట్రైనింగ్ సెంటర్లో సోలార్ లాంతర్ల పంపిణీ సందర్భంగా సమస్యలను ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకువెళ్తుండగా జన్మభూమి కమిటీ సభ్యులు అన్యాయంగా ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. తాజాగా రంజాన్తోఫాలో పీవోకు ఎమ్మెల్యే అడ్డతీగల అంశాన్ని వివరిస్తుండగా టీడీపీ ఇన్చార్జి శీతంశెట్టి వెంకటేశ్వరరావు అడ్డగోలుగా అడ్డుపడ్డాడు. పార్టీ పేరెత్తవొద్దంటూ విరుచుకుపడ్డారు. తునిలోనూ కుతకుతలే... తునిలో కూడా దాదాపు ఇదే పరిస్థితులున్నాయి. ప్రజా వ్యతిరేకతతో ఓటమి పాలైనా అధికార దందా తగ్గడం లేదు. దొడ్డిదారిన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో తొండంగి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో విశిష్ట అతిధిగా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు టీడీపీ, వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు హాజరయ్యారు. అధికారపార్టీ ఎంపీటీసీలను ఆ పార్టీ నేతలు హాజరుకానీయకుండా అడ్డుకుని సమావేశాన్ని వాయిదా వేయించేశారు. ఎమ్మెల్యే సమక్షంలో సమావేశం జరగకూడదనే దుర్బుద్ధిని ప్రదర్శించారు. తుని నియోజకవర్గంలో అధికారికంగా జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యే రాజాకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం, ఒక వేళ ఆహ్వానం పంపినా ఆఖరి నిమిషంలోనే అందించడం...ఇలా మంత్రి యనమల అండదండలతో చెలరేగిపోతున్నారు. గదుల కేటాయింపుల్లోనూ గదమాయింపులే.. తుని రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీపీ పల్లేటి నీరజకు ఆనుకుని జెడ్పీటీసీకి మరో గది కేటాయించడంలోనూ తమ కుత్సిత మనస్తత్వాన్ని చాటుకున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి జెడ్పీటీసీకి అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీపీ అన్న ఏకైక కారణంతో జిల్లాలో ఎక్కడా లేని విధంగా టీడీపీ జడ్పీటీసీకి సీటు కేటాయించడంపై వైసీపీ ఎంపీటీసీ సభ్యులతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తపేట, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావులున్న రామచంద్రపురం, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాల్లోనూ ఇవే పరిస్థితులున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పరిస్థితి ఇలా ఉంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లు పెత్తనం చెలాయిస్తూ చెలరేగిపోతున్నారు. ఫలితంగా జిల్లాలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. -
'ప్రత్యేక హోదా చంద్రబాబు అడగలేదు'
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందే సమయంలో ప్రత్యేక హోదా కావాలని అడిగింది వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీనేనని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. గురువారం చిత్తూరు జిల్లా పుత్తూరు పంచాయితీరాజ్ అతిథి గృహంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ గానీ, చంద్రబాబు నాయుడు గానీ విభజన బిల్లు ఆమోదం పొందే సమయంలో ప్రత్యేక హోదాను కోరలేదని ఆయన స్పష్టం చేశారు. హోదా ఇస్తామన్నది కాంగ్రెస్ అయితే, అడిగింది బీజేపీయేనని ఆయన గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు ఏరోజూ చెప్పలేదన్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా మారిందని, హామీని అమలు చేయకుండా బీజేపీ కాకమ్మ కబుర్లు చెబుతూ కాలం వెళ్లదీస్తోందని గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు మండిపడ్డారు. రాష్ట్రానికి రూ. లక్షా నలభై వేల కోట్లు సాయమందించామంటున్న బీజేపీ పెద్దలు ఏ పద్దుకింద... ఏ శాఖకు ఎంత నిధులిచ్చారో స్పష్టం చేయాలని గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. ఆర్థిక లోటు భర్తీకి రూ. 14 వేల కోట్లని తేల్చితే కేంద్రం మాత్రం ఇచ్చింది రూ. 2500 కోట్లేనని గాలి ముద్దుకృష్ణమ విమర్శించారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పయ్యావుల ఫైర్
వాళ్లు పొద్దు తిరుగుడు పువ్వులు లాంటివాళ్లు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే చేరుతారు కళ్యాణదుర్గం (అనంతపురం): అధికారం కోసం కొందరు పొద్దుతిరుగుడు పువ్వుల్లాంటి రాజకీయ నాయకులు వస్తుంటారని, వారి పట్ల పార్టీ పెద్దలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సూచించారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి చేరే వారున్నారని పరోక్షంగా టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాంటి నాయకులతో టీడీపీకి ఇబ్బందులు రావొచ్చని హెచ్చరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్‌యార్డులో సోమవారం నిర్వహించిన టీడీపీ జిల్లా మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. జాతీయ పార్టీ బీజేపీ కన్నా టీడీపీనే కేంద్రాన్ని శాసించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ... ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని, లేనిపక్షంలో కేంద్రంలోని బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ రాష్ట్ర పరిశీలకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా.. మినీ మహానాడు నుంచి మధ్యలోనే నిష్ర్కమించారు. దీంతో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, కందికుంట వెంకట ప్రసాద్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. -
'కాంగ్రెస్‌కి పట్టిన గతే బీజేపీకి పడుతుంది'
హైదరాబాద్ : బీజేపీపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కాంగ్రెస్‌కు పట్టినగతే బీజేపీకి పడుతుందన్నారు. ఏపీకి బీజేపీ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం రూ. లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
టీడీపీ ఎమ్మెల్సీ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య
విజయవాడ : టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ వేధింపుల వల్లే వై.వెంకటరమణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి బంధువులు ఆరోపించారు. శనివారం కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలంటూ వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సంబంధం లేని విషయంలో రాజేంద్రప్రసాద్ గత మూడు రోజులుగా వెంకటరమణను వేధింపులకు గురి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి... వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నస్తున్నారు. -
'మేం సైలెంట్‌గా ఉన్నామని అనుకోవద్దు'
తిరుపతి: బీజేపీపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు గురువారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీని బీజేపీ వేధిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారని వారిపై గాలి ముద్దు కృష్ణమ నాయుడు మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ ఇప్పుడు ఏమైందని బీజేపీని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు. మిత్రపక్షమే కదా అని టీడీపీ సైలెంట్‌గా ఉందని అనుకోవద్దని బీజేపీ నాయకులను గాలి హెచ్చరించారు. హోదా ఇవ్వని పక్షంలో వెంకయ్య, జైట్లీ పదవుల నుంచి దిగిపోవాలని గాలి డిమాండ్ చేశారు. అయితే.. బీజేపీ మంత్రుల గురించి మాట్లాడిన ముద్దు కృష్ణమ.. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మంత్రుల గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కొసమెరుపు. -
'పేరు చెడగొట్టుకుంటున్న పురందేశ్వరి'
విజయవాడ: బీజేపీ నాయకులు దగ్గుబాటి పురందేశ్వరి, కావురి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆదివారం విజయవాడలో నిప్పులు చెరిగారు. ఆ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ కోవర్టులు అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుకు వ్యతిరేకంగా వీరంతా ఓ కూటమిగా ఏర్పాడ్డారని విమర్శించారు. వీరికి బీజేపీ పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫునే పోటీ చేస్తామని వీరంతా ప్రమాణం చేస్తారా ? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుమార్తెగా దగ్గుబాటి పురందేశ్వరికి పేరుందని... ఉన్న పేరును ఆమె చెడగొట్టుకుంటున్నారని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు సోనియాగాంధీని పొగిడిన నోటీతోనే నేడు ప్రధాని మోదీని ప్రశంసిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఆంధ్రప్రదేశ్‌కి నిధులు ఇస్తోందన్నారు. ఏపీకి ఏమైనా అధికంగా నిధులు ఇస్తున్నారా ? అని వారిని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. -
లోకేశ్‌కు మంత్రి పదవి ఇవ్వాలి: బుద్ధా వెంకన్న
గుణదల, వన్‌టౌన్ (విజయవాడ): ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కోరారు. ఇందుకోసం తన పదవిని సైతం త్యాగం చేస్తానని, బుధవారం ముఖ్యమంత్రిని కలసి తన నిర్ణయాన్ని తెలియజేస్తానని చెప్పారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో చురుగ్గా ఉండే లోకేశ్‌కు మంత్రి పదవి ఇవ్వడం వల్ల అటు పార్టీ, ఇటు ప్రభుత్వం మరింత బలోపేతం అవుతుందన్నారు. చంద్రబాబు పాలన చూసే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని, లోకేశ్‌కు మంత్రి పదవి ఇస్తే మరింతమంది రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. నా సీటు ఇస్తా : బోడె ప్రసాద్ లోకేశ్ కోసం అవసరమైతే తన సీటు ఖాళీ చేసి ఇస్తానని పెనమలూరు శాసనసభ్యు డు బోడె ప్రసాద్ అన్నారు. లోకేశ్ పెనమలూరు నుంచి పోటీ చేస్తారని వస్తున్న ఊహగానాలపై ఒక టీవీ చానల్‌తో ఆయన మాట్లాడారు. లోకేశ్ కోసం పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. లోకేశ్ పోటీ చేస్తానని చెప్పగానే తాను రాజీనామా చేస్తానని, అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. -
సోమిరెడ్డి, రామచంద్రయ్య మధ్య వాగ్వాదం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఇసుక మాఫియాపై మంగళవారం వాడివేడిగా చర్చ జరిగింది.ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి... కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోచుకున్నారంటూ ఇరువురు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు సంధించుకున్నారు. దీంతో ఇరువురు సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మండలి ఛైర్మన్ చక్రపాటి జోక్యం చేసుకున్నారు. ఇరువురికి సర్థిచెప్పి.. చర్చను ముగించినట్లు చక్రపాటి ప్రకటించారు. -
'ఆయనను విమర్శించే నైతికత పయ్యావులకు లేదు'
అనంతపురం: వైఎస్ జగన్‌ను విమర్శించే నైతికత టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు లేదని అనంతపురం జడ్పీ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన పయ్యావుల జడ్పీ సమావేశాలకు ఎందుకు హాజరుకాలేదో చెప్పాలని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని రవీంద్రారెడ్డి విమర్శించారు. -
‘చక్రం’కు బ్రేకులు
చిన్నబాబు సీరియస్ మంత్రి పదవికి ప్యాకేజీ ఇచ్చాననే ప్రచారంపై మండిపాటు శ్రీశైలం నీటి విషయంలోనూ నోటి దురుసు తగ్గించుకోవాలని హితవు వ్యతిరేక వర్గంలో సంబరం కర్నూలు: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా.. ఒకేసారి ఎమ్మెల్సీతో పాటు తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్న శిల్పా చక్రపాణి రెడ్డి దూకుడుకు కళ్లెం పడిందా? తనకు ఎదురులేదని.. త్వరలో మంత్రి పదవి కూడా దక్కనుందని ఆయన చేసుకున్న ప్రచారంపై చిన్నబాబు లోకేష్ సీరియస్‌గా ఉన్నారా? శ్రీశైలం నీటి విషయంలోనూ నోటి దురుసు తగ్గించుకోవాలంటూ హైదరాబాద్‌కు పిలిచి మరీ క్లాస్ పీకారా? అనే వరుస ప్రశ్నలకు అధికార పార్టీకే చెందిన పలువురు నేతలు అవుననే సమాధానమిస్తున్నారు. ఇందుకు ఆయన నోటి దురుసుతో పాటు పదవుల కోసం ప్యాకేజీ ఇచ్చానంటూ ఆయన పార్టీలోని పలువురి వద్ద చేసిన వ్యాఖ్యలే పరిస్థితి ఇంత దూరం వచ్చేందుకు కారణమయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద అధికార పార్టీలో శిల్పా చక్రపాణి రెడ్డి వ్యవహారంతో.. ఆ పార్టీలోని ఆయన వ్యతిరేకులు కాస్తా సంబరం చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. నాకేమైనా ఊరికే ఇచ్చారా! వాస్తవానికి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తిరిగి సోమిశెట్టికే పగ్గాలు అప్పగించాలని పార్టీ మొత్తం ఏకగ్రీవ తీర్మానం చేసింది. తనకే అధ్యక్ష పదవి వరించిందని సోమిశెట్టి కూడా తన ఫామ్‌హౌస్‌లో అందరినీ పిలిచి పార్టీ కూడా ఇచ్చారు. అయితే, ఇక్కడే శిల్పా చక్రం తిప్పారు. ఎమ్మెల్సీ పదవికి పోటీ చేయాలంటే.. జిల్లా పార్టీ మొత్తం సహకరించాలంటే తనకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే ప్రతిపాదనను అధిష్టానం ముందుంచారు. శిల్పా వాదనతో ఏకీభవించిన అధిష్టానం పార్టీ పగ్గాలు కూడా అప్పగించింది. అయితే, ఇంతటితో ఆగకుండా తనకు త్వరలో మంత్రి పదవి కూడా రాబోతోందని ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తన అనుచరుల వద్ద ఆయన బల్లగుద్ది మరీ చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం తాను అధిష్టానానికి ప్యాకేజీ కూడా ఇచ్చానని ఆయన చెప్పుకున్నట్టు సమాచారం. తనకేమీ పగ్గాలు, పదవి ఊరికే ఇచ్చారా అని శిల్పా వ్యాఖ్యానించినట్టు అధిష్టానానికి నివేదిక చేరింది. ఈ వ్యవహారంపై చిన్నబాబు చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన దూకుడుకు బ్రేకులు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చర్చ జరుగుతోంది. నోరు పారేసుకోవద్దు శ్రీశైలం నీటిని కిందకు తీసుకెళ్లి నాగార్జున సాగర్ ద్వారా కృష్ణా డెల్టాకు ఇవ్వాలనేది అధికార పార్టీ నిర్ణయం. అయితే, నీటి తరలింపుపై ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాల వల్ల తనకు ఎక్కడ మైలేజ్ తగ్గుతుందోననే భానవతో.. చుక్క శ్రీశైలం నీటిని కూడా కిందకు వదలబోమని శిల్పా వ్యాఖ్యానించారు. ఈ పరిణామం అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆయన వ్యాఖ్యల పట్ల చిన్నబాబు లోకేష్ పూర్తిస్థాయిలో సీరియస్ అవడంతో పాటు పిలిచి మరీ మందలించినట్టు సమాచారం. మొత్తం మీద అధికార పార్టీలో తాజా ఎపిసోడ్ కాస్తా అధ్యక్ష వ్యతిరేకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతోంది. -
పయ్యావులపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఫైర్
-
పయ్యావులపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఫైర్
అనంతపురం : టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌పై వైఎస్ఆర్ సీపీ నేతలు విశ్వేశ్వర్‌రెడ్డి, శంకర్ నారాయణ, గుర్నాథ్రెడ్డి ఆదివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. ఉరవకొండలో పయ్యావుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని వారు ఆరోపించారు. 2009లో జరిగిన సూరయ్య హత్య కేసు నుంచి బయట పడేందుకు పయ్యావుల కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. సూరయ్య భార్య ఓబులమ్మకు చెందిన భూములను మరొకరి పేరుతో ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. పయ్యావుల ఆగడాలకు నిరసనగా ఈ నెల 16న బెలుగుప్పలో మహాధర్నా నిర్వహిస్తామని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి, నేతలు శంకర్ నారాయణ్, గుర్నాథ్రెడ్డిలు వెల్లడించారు. -
'మంచి రాజధానికి 35వేల ఎకరాలు కావాల్సిందే'
తిరుమల: మంచి రాజధాని నిర్మించాలంటే మొత్తం 35 వేల ఎకరాల భూమి కావాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 33 వేల ఎకరాల భూమి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని, మిగిలిన భూమిని కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంచి రాజధాని నిర్మించే శక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇవ్వాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకహోదాతో పాటు ప్యాకేజీ, రైల్వే జోన్ ఇవ్వాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. -
మోదీకంటే చంద్రబాబే గొప్ప వ్యక్తి
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీకన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే గొప్ప వ్యక్తి అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు ప్రతిష్ఠకు భంగం కలిగే ఏపని బీజేపీ చేసినా ఒక్క టీడీపీ కార్యకర్త కూడా సహించడని హెచ్చరించారు. బీజేపీ వల్ల తమ ముఖ్యమంత్రి ప్రతిష్ఠ మొత్తం దెబ్బతింటోందని ఆరోపించారు. వైజాగ్, నరసాపురంలో బీజేపీ గెలవడానికి చంద్రబాబు చరిష్మానే కారణం అని చెప్పారు. హీరో శివాజీని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేత రఘువీరా, సీపీఐ రామకృష్ణ ప్రత్యేక హోదాపై డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాన మోదీని కలుస్తున్నారని, ప్రత్యేక హోదాపై చర్చిస్తారని తెలియజేశారు. -
ఏసీబీ ఆఫీసుకు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వ్యక్తిగత పనిమీదే ఏసీబీ కార్యాలయానికి వచ్చానని చెప్పారు. తెలంగాణ ఏసీబీతో తనకేం పని? ఆంధ్ర ఏసీబీ అధికారులను కలవడానికి వచ్చానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలంగాణ ఏసీబీ అధికారులు ఓటుకు కోట్లు కేసును విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో టీడీపీ నాయకులు, వారి సహాయకులను ప్రశ్నించారు. -
వెంకయ్య సమక్షంలో 'ఆ ఇద్దరు' వాగ్వివాదం
నెల్లూరు: ప్రొటోకాల్ విషయమై కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు సమక్షంలో టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి... వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ల మధ్య వివాదం చోటు చేసుకుంది. దాంతో సదరు ఇద్దరు నేతలు వాగ్వివాదానికి దిగి... ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో మంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని... వారిని సముదాయించారు. దాంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా చిత్తమూరు మండలం గుణపాటిపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)ను ఎం వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపైకి వెంకయ్యనాయుడు, సోమిరెడ్డితో పాటు ఉన్నతాధికారులు చేరుకున్నారు. వెంకయ్యనాయుడు ప్రసగించేందుకు ఉపక్రమిస్తుండగా.... వేదికపైకి వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధుల పిలకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఇంతలో సోమిరెడ్డి జోక్యం చేసుకుని పాశం సునీల్ కుమార్‌తో వాగ్వివాదానికి దిగారు. -
'రాజకీయాల్లో పతివ్రతలు ఎవరున్నారు?'
-
రాజకీయాల్లో పతివ్రతలు ఎవరున్నారు ?
విజయవాడ: ఓటుకు నోటు వ్యవహారంపై టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకరరావు ఆదివారం విజయవాడలో విలేకర్లతో మాట్లాడుతూ... పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయాల్లో పతివ్రతలు ఎవరున్నారని అడిగారు. డబ్బు ఇవ్వకుండా ఎవరైనా ఎన్నికల్లో గెలిచారా ? అంటూ జూపూడి వితండవాదం చేశారు. అయితే ఎన్నికల్లో ఓటర్లును డబ్బుతో ప్రలోభపెట్టడాన్ని సమర్థిస్తారా ? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జూపూడి నీళ్లునమిలారు. -
'జగన్, కేసీఆర్ కలిసినట్టు మా వద్ద ఆధారాల్లేవు'
చిత్తూరు: రేవంత్ రెడ్డి వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసి మాట్లాడుకున్నట్టు తాము చెప్పలేదని.. వాటికి సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా లేవని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కొన్ని టీవీలు, వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయని అందుకే తాము మాట్లాడామని సమర్థించుకున్నారు. అంతే తప్ప.. జగన్, కేసీఆర్ కలిసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని గాలి అన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో 140 మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని.. దీనిపై ఓ నివేదికను కేంద్రానికి పంపించామని తెలిపారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలోని 150 సంస్థలపై రెండు రాష్ట్రాలకూ హక్కు ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు హక్కు లేదని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ చెప్పడం దారుణం అని గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు. -
ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఐదుగురు టీడీపీ నేతలు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి వారితో ప్రమాణం చేయించారు. వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్న (కృష్ణా), అన్నం సతీష్ ప్రభాకర్ (గుంటూరు), రెడ్డి సుబ్రమణ్యం (తూర్పు గోదావరి), ద్వారపురెడ్డి జగదీష్ (విజయనగరం) ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. తమ సేవలను గుర్తించి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిన చంద్రబాబు, కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మండలిలో ప్రజా సమస్యలను ప్రస్తావించటంతో పాటు వాటి పరిష్కారానికి, టీడీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. లోకేష్ అడుగుజాడల్లో.. ఆయన సైన్యంలో పనిచేస్తామని వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్సీలుగా టీడీపీ నేతల ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి గవర్నర్ కోటలో ఎంపికైన నలుగురు టీడీపీ నేతలు గురువారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ నేతలు టిడి జనార్దన్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, జి.శ్రీనివాసులు చేత శాసనమండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించారు.అంతకుముందు వీరంతా దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. అనంతరం ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత శాసనమండలికి చేరుకున్నారు. కృష్ణా జిల్లా నుంచి టిడి జనార్దన్, నెల్లూరు జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్తోపాటు జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర యాదవ్, చిత్తూరు జిల్లాలోని సీనియర్ నేత జి.శ్రీనివాసులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. -
'కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదు'
-
'కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదు'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అనుసరిస్తున్న వైఖరిపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పట్ల నరసింహన్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ ఏడాది పాలనలో తీసుకున్న పది నిర్ణయాలపై కోర్టు అక్షంతలు వేసిందని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ నిర్ణయాలు కోర్టులకు తెలుస్తున్న నరసింహన్‌కు మాత్రం తెలియడం లేదన్నారు. ప్రజలకు న్యాయం చేయలేని గవర్నర్, రాజ్‌భవన్ ఎందుకు అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ఉత్సవ విగ్రహాం కాదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భాష అసహ్యించుకునేలా ఉందన్నారు. ప్రతి అంశాన్ని కేసీఆర్ సర్కార్ వివాదం చేస్తోందని తెలిపారు. కోర్టులు అక్షంతులు వేసిన కేసీఆర్ తీరు మాత్రం మారడం లేదని సోమిరెడ్డి చెప్పారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులు వీరే....
గుంటూరులో ఖరారు కాని అభ్యర్థులు మిగతా జిల్లాలు ఓకే కృష్ణా జిల్లాలో అర్జునుడు స్థానంలో బుద్ధా వెంకన్నకు అవకాశం? సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేయగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏపీలో స్థానిక సంస్థల కోటా కింద 11 సాధారణ, ఒక ఉప ఎన్నిక కు ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. ఈ స్థానాల్లో పయ్యావుల కేశవ్ (అనంతపురం), వైవీబీ రాజేంద్రప్రసాద్ (కృష్ణా), రెడ్డి సుబ్రహ్మణ్యం (తూర్పు గోదావరి), నెల్లిమర్ల సత్యం (విజయనగరం), పప్పల చలపతిరావు (విశాఖపట్నం), గాలి ముద్దుకృష్ణమనాయుడు (చిత్తూరు), మాగుంట శ్రీనివాసులురెడ్డి (ప్రకాశం)లను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. ఉప ఎన్నిక జరిగే కర్నూలు స్థానం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ చేయనున్నారు. కృష్ణా జిల్లాలో రెండో స్థానం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు యాదవ్ పేరు ఖ రారు చేసినట్లు పార్టీవర్గాలు మీడియాకు గతంలో సమాచారం అందించాయి. అయితే ఇపుడు ఆయన స్థానంలో విజయవాడ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బుద్ధా వెంకన్నను అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. -
'ఆ నలుగురు' పేర్లు ఖరారు
-
'ఆ నలుగురు' పేర్లు ఖరారు చేసిన చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను టీడీపీ అధిష్టానం శనివారం ప్రకటించింది. కృష్ణా జిల్లాకు చెందిన టీడీ జనార్ధన్, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు విజయవాడ మాజీ మేయర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని అధిష్టానం భావించింది. కానీ ఆఖరి నిముషంలో నలుగురి పేర్లలో అనురాధ పేరును తొలగించి.. బీద రవిచంద్ర పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడంలో బీద రవిచంద్రయాదవ్ చివరినిమిషంలో కృతార్థులయ్యారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఈ నలుగురు ఆరెళ్ల పాటు ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారు. -
టీడీపీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి
అరికెల, అరవింద్‌కుమార్ గౌడ్ అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. గురువారం మధ్యాహ్నం 3గంటల వరకే నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు కాగా, పార్టీ నేతలు, బీజేపీ నేతలతో చర్చల అనంతరం ఒంటి గంటకు నరేందర్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. 2.30 గంటలకు శాసనసభా కార్యదర్శి, ఎన్నికల అధికారి రాజా సదారాంకు మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని ఖరారు చేయడంతో టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. పార్టీని నమ్ముకొని ఉన్న తనకు అన్యాయం జరిగిందని సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అరవింద్‌కుమార్ గౌడ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా పార్టీకి గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. మేమే గెలుస్తం: ‘టీడీపీ, బీజేపీకి ఉన్న సీట్లు 20. మావోళ్లు నలుగురు టీఆర్ఎస్లో చేరినా 16 సీట్లు మాయే. ఎమ్మెల్సీ గెలవాలంటే ఇంకో ఇద్దరే కావాలి. అవసరమైతే వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం సభ్యుల మద్దతు కోరతాం. అదే టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే కనీసం 8 మంది కావాలి. అవకాశాలు మాకే ఎక్కువ’ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. -
ఎవరీ సత్యం ?
విజయనగరం క్రైం:దేశం పార్టీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక గందరగోళానికి తెరతీసింది. జిల్లా నాయకత్వానికే పెద్దగా తెలియని వ్యక్తి పేరు ప్రకటించడంతో ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది. సీనియర్ నాయకులను సైతం పక్కన పెట్టేసి, పెద్దగా ఎవరికీ పరిచయంలేని వ్యక్తిని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో జిల్లా నుంచి అధిష్టానం ఖరారు చేసిందని, ఇది అన్యాయమని ఆ పార్టీ నేతలు మథనపడుతున్నారు. లాబీయింగ్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏ డాది కాలంగా ఎమ్మెల్సీ పదవికి కోసం పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి.రాజు, బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ తెంటులక్ష్మునాయుడు, చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ కె.త్రిమూర్తులరాజు, సాలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆర్.పి భంజదేవ్లు ఎదురుచూస్తున్నారు. వీరంతా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గవర్నర్, స్థానిక సంస్థల కోటాలో వస్తుందని ఆశపడ్డారు. బుధవారం చంద్రబాబు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సత్యం పేరును ప్రకటించడంతో వారంతా ఖంగుతిన్నారు. జోరుగా చర్చ: జిల్లా నుంచి స్థానికసంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ సత్యం అనే పేరును ప్రకటించడం తో జిల్లాలో టీడీపీ నేతలు గందరగోళానికి గురయ్యారు. ఈ పేరు గల వ్యక్తి ఎవరికీ పెద్దగా తెలియకపోవడంతో ఎవరీ సత్యమంటూ ఆరా తీశారు. భో గాపురం మండల పార్టీ అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ పేరును సత్యంగా ప్రకటించిరా..? లేదా మంత్రి నారాయణకు సన్నిహితుడైన సత్యం అనే వ్య క్తి విశాఖపట్నంలో ఉంటున్నారని, ఆయన పేరును ఇలా ప్రకటించారా అని కొందరు తెలుగుదేశం నేతలు చర్చించుకుంటున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు అనుంగ శిష్యుడు పూసపాటిరేగ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు పేరును అలా ప్రకటించి ఉంటారని మరి కొందరు చెబుతున్నారు. -
అలిగిన అరికెల నర్సారెడ్డి
హైదరాబాద్: టి.టీడీపీ ఎమ్మెల్సీ సీటు వేం నరేందర్ రెడ్డికి ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అలిగారు. అందుబాటులో ఉన్న తన అనుచరులతో సమావేశమయ్యారు. ఆయన టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీలందరూ పార్టీని వీడినా తాను టీఆర్ఎస్ పై ఒంటరి పోరాటం చేశానని ఆయన గుర్తు చేస్తున్నారు. తన పోరాటాన్ని అధినేత చంద్రబాబు గుర్తించకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. అరికెల అలక కారణంగా ఈనెల 25న నిర్వహించ తలపెట్టిన నిజామాబాద్ జిల్లా మినీ మహానాడు రద్దయ్యే అవకాశముంది. -
ఆ ఐదుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, మహ్మద్ సలీం, పి.నరేందర్‌రెడ్డి, వి.గంగాధర్‌గౌడ్, బి.లక్ష్మీనారాయణలకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఉత్తర్వులు జారీ చేశారు. తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో విలీనమైనట్లు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన తమ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలంటూ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసినా కూడా, ఇప్పటివరకు వాటిపై నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. తమ పార్టీ సభ్యుల విలీనంపై గత నెల 9న మండలి కార్యదర్శి ద్వారా చైర్మన్ విడుదల చేసిన ప్రకటన చట్ట విరుద్ధమని, విలీన ప్రక్రియను చేపట్టే అధికారం చైర్మన్‌కు లేదని వారు వివరించారు. -
టీడీపీ ఎమ్మెల్సీల సరికొత్త ప్లాన్!
-
లాటరీలో గెలిచిన ఎమ్మెల్సీ నర్సారెడ్డి
-
లాటరీలో గెలిచిన ఎమ్మెల్సీ నర్సారెడ్డి
న్యూఢిల్లీ : టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డికి ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కేసులో ఆయన ఎన్నిక సక్రమమేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. కోర్టులోనే న్యాయమూర్తులు లాటరీ తీయటంతో నర్సారెడ్డి గెలుపొందగా, వెంకటరామిరెడ్డి ఓడిపోయారు. నిజామాబాద్ ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన నర్సారెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై 2009లో గెలుపొందినట్టు ప్రకటించారు. అయితే ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో మూడు ఓట్లు వివాదాస్పదంగా మారాయని, మూడు ఓట్లు కూడా వెంకట్రామిరెడ్డికి అనుకూలంగా పడ్డవేనని కేసును విచారించిన న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పును ఎమ్మెల్సీ నర్సారెడ్డి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓట్ల లెక్కింపులో ముందుగా వివాదాస్పదంగా మారిన మూడు ఓట్లను లెక్కించి, మిగిలిన ఓట్లను తర్వాత లెక్కించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ సమక్షంలో ఓట్లను లెక్కించగా వెంకట్రామిరెడ్డికి తొమ్మిది ఓట్ల మెజారిటీ వచ్చింది. కేసులో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం టిడిపి అభ్యర్థి నర్సారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్టు తీర్పు నిచ్చింది. అయితే దానిపై కూడా నర్సారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో లాటరీ ద్వారా ఎంపిక చేసింది.